సాక్షి, న్యూఢిల్లీ: అధునాతన వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రూ.24,300 కోట్లతో అనేక ప్రోత్సాహక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాదానమిస్తూ.. 2020–21 నుంచి 2022–23 వరకు 22,274 డాలర్ల విలువైన వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోగా.. మన దేశం నుంచి కేవలం 8,846 డాలర్ల విలువైన వైద్య పరికరాలను మాత్రమే ఎగుమతి చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా అధునాతన వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన గిరిజన తెగలైన బోండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరంగి పెర్జా తెగల కలలు నెరవేరాయి. వారిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎస్సీ, ఎస్టీల జాబితాను సవరించే రెండు బిల్లుల్ని మంగళవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. అండమాన్ నుంచి ప్రధాన భూభాగం వరకూ 75 అత్యంత వెనకబడిన గిరిజన సమూహాలు విస్తరించి ఉన్నాయన్నారు.
వీటిలో 10 సమూహాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చకపోవడం వల్ల అన్యాయాలను ఎదుర్కొంటూ హక్కుల్ని కోల్పోయాయన్నారు. బలహీన గిరిజన సమూహాల సామాజిక, ఆరి్థక స్థితిగతుల్ని మార్చడానికి కేంద్రం పలు పథకాలు తీసుకొచ్చిందని, బిల్లులు సమర్థించినందుకు సభకు కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని గిరిజన సంఘాల్ని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని పలువురు సభ్యులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు.
గిరిజన పథకాలకు బడ్జెట్ పెంచాలి
గిరిజన పథకాలకు బడ్జెట్ మరింత పెరిగేలా చూడాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య నిమిత్తం నేషనల్ ఫెలోషిప్, స్కాలర్íÙప్‌కు బడ్జెట్ తగ్గించిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో షెడ్యూల్డు తెగల జాబితా సవరణ, ఒడిశాలోని షెడ్యూల్డు కులాలు, తెగల జాబితా సవరణ బిల్లులకు మద్దతుగా మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడిన గిరిజనులకు సంబంధించి ఖచ్చితమైన రికార్డు లేకపోవడం శోచనీయమని, ఖచ్చితమైన మూల్యాంకనం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పారిశ్రామిక నీటి కాలుష్యాన్ని తగ్గించాలి
దేశవ్యాప్తంగా పారిశ్రామిక నీటి కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభా‹Ùచంద్రబోస్ కోరారు. రాజ్యసభలో మంగళవారం నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) బిల్లుకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 6 శాతం కంటే ఎక్కువ పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలు పాటించడం లేదన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రసాయనాలు/ఎరువులు, సిమెంట్ పరిశ్రమలపై రూ.13.40 కోట్లకు పైగా పర్యావరణ పరిహారాన్ని విధించినప్పటికీ నీటి కలుíÙతం యధేచ్ఛగా కొనసాగుతోందన్నారు. ఈ బిల్లు ద్వారా పర్యావరణ పరిరక్షణ నిధికి జమ చేసిన మొత్తాన్ని నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి ఉపయోగించాలని సూచించారు.
నెలాఖరు నాటికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్టు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ప్రాజెక్టు విలువ రూ.288.8 కోట్లు కాగా.. ఇందులో కేంద్ర వాటా రూ.138.29 కోట్లు అని తెలిపారు.
రూ.12,79,331 కోట్ల రుణాలు
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల్లో సెప్టెంబర్ 2023 నాటికి అన్‌సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ రూ.12,79,331 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, బీద మస్తానరావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఆ ప్రతిపాదన ఏదీలేదు
ఆంధ్రప్రదేశ్‌లో మోడరనైజ్డ్, ఇంప్రూవ్ డిసీజ్ సరై్వలెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా పది టైర్–1, పది టైర్–2 సిటీల్లో ఈ యూనిట్లు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment