
దేశ వైద్య పరికరాల రంగం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన వృద్ధిని సాధించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం వంటివి ఇందుకు దోహదం చేశాయని మెరిల్ లైఫ్ సైన్సెస్‌లో కార్పొరేట్ స్ట్రాటజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ అభిప్రాయపడ్డారు. ఈ ఊపును కొనసాగించడానికి రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నట్లు తెలిపారు.
“ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. రోగులకు మెరుగైన ఫలితాలు, అవకాశాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధునిక ఆరోగ్య సంరక్షణకు మూలస్తంభంగా మారింది. భారతదేశంలో 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లు ఎంతో పరివర్తన చెందాయి. దేశాన్ని అధిక-నాణ్యత, సరసమైన వైద్య సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా నిలిపాయి.
ఈ పురోగతికి భారత ప్రభుత్వ ముందుచూపు కార్యక్రమాలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై బలమైన దృష్టి గణనీయంగా మద్దతు ఇచ్చాయి. ఈ చర్యలు మెడ్‌టెక్ తయారీలో ఆవిష్కరణ, పెట్టుబడులు, స్వావలంబనను ప్రోత్సహించాయి. కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఈ ఊపును కొనసాగించడానికి ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నాం.
ప్రజల జీవితాలను మార్చే ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశ మెడ్‌టెక్ అభివృద్ధికి మెరిల్ దోహదపడుతుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో అగ్రగామిగా భారతదేశం స్థానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం” అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment