సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ తెగనమ్మడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరండి’’ అంటూ రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం: గోపిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment