చంద్రబాబు పాలనంతా అవినీమయం | CPI Leader Ramakrishna fire on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనంతా అవినీమయం

Published Mon, Jun 25 2018 3:10 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదేమో కానీ, అప్పులమయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 94 వేల కోట్లు ఉన్న అప్పును రెండు లక్షలకు తీసుకెళ్లడం అభివృద్దా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక​ హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. ఉక్కు కర్మాగారం కోసం వామపక్షాలు పోరాడితే అరెస్టులు చేయించారని, కానీ ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఈ 29న కడప బంద్కు పిలుపునిచ్చామని.. అందరు సహకరించాలన్నారు. విశాఖలో భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు ఎప్పటివరకు చేస్తారన్నారు. ఈ కుంభకోణాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారనే బయపెట్టడం లేదా అని ప్రశ్నించారు. వారం రోజులు గడువిస్తున్నామని.. ఒకవేళ నివేదిక బయటపెట్టకపోతే ఉద్యమిస్తామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement