
విశాఖ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో నవ్వాలో జాలి పడాలో తెలియని పరిస్థితి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వైఎస్ జగన్ మరో 10 మెట్లు పైకి ఎక్కారన్నారు కురసాల. బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు లోకేష్ పొగడ్తలకే సరిపోయిందని, బడ్జెట్ ను మసి పూసి మారేడు కాయ చేశారన్నారు.బడ్జెట్ గురించి ఎల్లో మీడియాలో రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదని ధ్వజమెత్తారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారు. వైఎస్ జగన్ కరోనా సమయంలో అప్పు చేస్తే రాష్ట్రం దివాలా అని వార్తల రాశారు. చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’ అని మండిపడ్డారు. పోసాని అరెస్టు ద్వారా కొత్త సంస్కృతికి తెర తీశారు. ఆరోగ్యం బాగో లేకపోయినా జైల్లో పెట్టారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ పై, వైఎస్సార్ సీపీ నేతలపై దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే సాంస్కృతిని కొనసాగిస్తే వచ్చే ప్రభుత్వం ఈ సంస్కృతిని కొనసాగించదా? అని కురసాల కన్నబాబు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment