
సాక్షి, విజయవాడ: కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్షకు పవన్ హాజరుకాకపోవడం చర్చాంశనీయంగా మారింది. అన్ని శాఖల మంత్రులు హాజరైనా పవన్ మాత్రం గైర్హాజరయ్యారు. సీఎం పక్కన పవన్‌కి కుర్చీ కూడా వేయని అధికారులు.. ఆయన స్థానంలో నారా లోకేష్‌కి కుర్చీ వేశారు. ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరుకాలేదు.
ప్రతీ శాఖ మంత్రి, కార్యదర్శులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. చంద్రబాబు, లోకేష్‌లతో విభేదాలు కారణంగానే పవన్ కల్యాణ్ గైర్హాజరైనట్లు సమాచారం. 15 రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్‌తో డిప్యూటీ సీఎం పదవి విషయంలో చిచ్చు రగులుతోంది. నారా లోకేష్ సోషల్ మీడియా.. పవన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు.
నారా లోకేష్‌ను ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరో వైపు పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గిస్తూ వ్యూహం అమలు చేస్తున్నారు. రేపటి నుండి దక్షిణ భారత దేశ పుణ్యక్షేత్రాల యాత్రకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. ఇవాళ షెడ్యూల్ ఖాళీగా ఉన్నా కానీ.. కీలక సమీక్షకి కూడా హాజరు కాలేదు.

Comments
Please login to add a commentAdd a comment