high level review meeting
-
చంద్రబాబు, లోకేష్‌లతో విభేదాలు!.. కీలక సమీక్షకు పవన్ డుమ్మా
సాక్షి, విజయవాడ: కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్షకు పవన్ హాజరుకాకపోవడం చర్చాంశనీయంగా మారింది. అన్ని శాఖల మంత్రులు హాజరైనా పవన్ మాత్రం గైర్హాజరయ్యారు. సీఎం పక్కన పవన్‌కి కుర్చీ కూడా వేయని అధికారులు.. ఆయన స్థానంలో నారా లోకేష్‌కి కుర్చీ వేశారు. ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరుకాలేదు.ప్రతీ శాఖ మంత్రి, కార్యదర్శులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. చంద్రబాబు, లోకేష్‌లతో విభేదాలు కారణంగానే పవన్ కల్యాణ్ గైర్హాజరైనట్లు సమాచారం. 15 రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్‌తో డిప్యూటీ సీఎం పదవి విషయంలో చిచ్చు రగులుతోంది. నారా లోకేష్ సోషల్ మీడియా.. పవన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు.నారా లోకేష్‌ను ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరో వైపు పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గిస్తూ వ్యూహం అమలు చేస్తున్నారు. రేపటి నుండి దక్షిణ భారత దేశ పుణ్యక్షేత్రాల యాత్రకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. ఇవాళ షెడ్యూల్ ఖాళీగా ఉన్నా కానీ.. కీలక సమీక్షకి కూడా హాజరు కాలేదు. -
Amit Shah: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణచివేయండి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేయడం ద్వారా ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో ఇటీవల వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, పలువురు ముష్కరులతోపాటు భద్రతా సిబ్బంది సైతం మరణించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆదివారం భద్రతా దళాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలని ఆదేశించారు. కశీ్మర్ లోయలో చేపట్టిన జీరో–టెర్రర్ ప్రణాళికలతో మంచి ఫలితాలు వచ్చాయని, జమ్మూ డివిజన్లో సైతం అమలు చేయాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు పటిష్టమైన భద్రత కలి్పంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అమిత్ షా ఆదేశించారు. యాత్ర విషయంలో అధికారుల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశీ్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, సీఆర్పీఎఫ్ డీజీ అనీ‹Ùదయాళ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఇకపై ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
గనులు, ఖనిజాలశాఖ, ఏపీఎండీసీ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి: సీఎం జగన్
-
సమన్వయంతో ఆదాయార్జన
సాక్షి, అమరావతి: ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. క్రమం తప్పకుండా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే విధానాలపై దృష్టి సారించాలన్నారు. ఆర్థికశాఖ అధికారులు కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతమై ఎక్కడా చిల్లు పడకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఆదాయార్జన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 2023 – 24 తొలి త్రైమాసికంలో వివిధ విభాగాల పనితీరు, విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్లను సమీక్షించి పలు సూచనలు చేశారు. వాహన కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ.. రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టి సారించి ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించి అత్యుత్తమ పద్ధతులను అమలు చేయాలని సీఎం సూచించారు. వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని, అయితే అవి కొనుగోలు దారులను ప్రోత్సహించేలా ఉండాలని స్పష్టం చేశారు. నాటు సారా కుటుంబాలకు ప్రత్యామ్నాయం నాటుసారా తయారీలో నిమగ్నమైన కుటుంబాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను చూపాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద ఇప్పటికే రూ.16.17 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొనగా ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. నాటుసారా తయారీదారుల్లో చైతన్యం కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పారదర్శకతతో పెరిగిన గనుల ఆదాయం భూగర్భ గనులు – ఖనిజాల శాఖ, ఏపీఎండీసీ ఆదాయానికి సంబంధించి గతంతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ విభాగాల పరిధిలో ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. లీకేజీలను అరికట్టడంతోపాటు పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని చెప్పారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ గనులు–ఖనిజాల శాఖలో గత మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2018–19లో కేవలం రూ.1,950 కోట్లు ఆదాయం సమకూరగా 2022–23 నాటికి రూ.4,756 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. కార్యకలాపాలు నిలిచిపోయిన 2,724 మైనింగ్ లీజుల్లో 1,555 చోట్ల పునఃప్రారంభమైనట్లు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీఎండీసీ ఆర్థికంగా పరిపుష్టం ఏపీఎండీసీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడినట్లు అధికారులు తెలిపారు. 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం రూ.502 కోట్లు కాగా 2022–23లో రూ.1,806 కోట్లకు పెరిగింది. 2023 – 24లో ఏపీఎండీసీ ఆదాయం రూ.4 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గు గనుల నుంచి ఏపీఎండీసీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. సులియారీలో ఈ ఏడాది 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుదల గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జూలై 15 వరకూ రూ.2,291.97 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది అదే కాలానికి సంబంధించి రూ.2,793.7 కోట్లు ఆర్జించినట్లు చెప్పారు. భూముల రీ సర్వే పూర్తైన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు మొదలైనట్లు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో దాదాపు 5 వేల రిజిస్ట్రేషన్ సేవలు జరిగాయని, వీటి ద్వారా రూ.8.03 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సమీక్షలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, మైనింగ్ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్త, రోడ్డు రవాణా, భవనాలశాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కోటేశ్వరరావు, రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖ కమిషనర్ రామకృష్ణ, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ రయ్.. మద్యం డీలా! ► ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు రూ.7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 23.74 శాతం పెరుగుదల నమోదు. ► గత సర్కారు హయాంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన మద్యం విక్రయాలు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా 2022 – 23లో కేవలం 335.98 లక్షల కేసుల విక్రయాలు. ఇదే సమయానికి సంబంధించి గతంలో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు కాగా ఇప్పుడు 116.76 లక్షల కేసులు మాత్రమే విక్రయం. ► 2018–19 ఏప్రిల్, మే, జూన్‌తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో బీరు అమ్మకాలు మైనస్ 56.51 శాతం తక్కువగా, లిక్కర్ విక్రయాలు మైనస్ 5.28 శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం. -
అవినీతికి తావివ్వద్దు
పౌరులకు సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలి. అవినీతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ తరహాలో ప్రదర్శించాలి. మానవ ప్రమేయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి.. వాటిని అమల్లోకి తీసుకు రావడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అప్పుడే ప్రజలకు సత్వరం మంచి సేవలు అందుతాయి. ఉద్యోగుల్లో సమర్థత పెరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ శాఖ లోనూ అవినీతికి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా అన్ని చోట్ల కూడా అవినీతికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి నిరోధక శాఖను మరింత క్రియాశీలకంగా ఉంచాలని సూచించారు. ఆదాయార్జన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదాయాలనుఆర్జించే శాఖల యంత్రాంగంలో మెరుగైన విధానాలు అమలు చేయడం ద్వారా సమర్థత పెంచాలని ఆదేశించారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా చక్కటి సేవలు అందుతాయని, ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. వీటన్నింటిపై అధ్యయనం చేసి, వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు మరింతగా దృష్టి సారించాలని చెప్పారు. ఇందులో భాగంగా యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యా సంస్థల వద్ద కచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ ఉంచాలని, డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్ చేపట్టాలని ఆదేశించారు. రవాణా శాఖలో మెరుగైన విధానాలు తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర లక్ష్యాలు చేరుకున్నామనే విషయాన్ని, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను వివిధ శాఖలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధి ♦ గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనపరిచిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు. కర్ణాటకలో 27.51 శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25.29 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ♦ 2022–23లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.51,481 కోట్లుగా 93.24 శాతం లక్ష్యాన్ని చేరుకుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ♦ లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతల పట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పని తీరును మెరుగు పరుచుకుంటున్నామన్నారు. ♦ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధి చెందినట్టుగా ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏడాదికేడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తోందన్నారు. 2018–19లో ఈ శాఖ ఆదాయం రూ.4,725 కోట్లు కాగా, 202–223 నాటికి రూ.8071 కోట్లకు చేరిందని తెలిపారు. గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి ♦ గత ఏడాదితో పోల్చితే గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వివరించారు. గనులు ఖనిజాల శాఖలో 2022–23లో రూ.4,500 కోట్లు లక్ష్యం కాగా, రూ.4,756 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక ఏడాది రూ.6 వేల కోట్ల మేరకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తగ్గిన లిక్కర్, బీరు వినియోగం 2018–19తో పోలిస్తే 2022–23లో లిక్కర్, బీరు వినియోగం 12.61 శాతం తగ్గుముఖం. 2018–19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ వినియోగం. 2022–2౩లో 335.9 లక్షల కేసుల లిక్కర్ వినియోగం. 2018–19లో 277.1 లక్షల కేసుల బీరు వినియోగం. 2022–23లో 116.7 లక్షల కేసులు బీరు వినియోగం. 2018–19తో పోలిస్తే 2022–23లో 57.87 శాతం తక్కువగా బీరు వినియోగం. ♦ రవాణా శాఖలో 2022–23లో ఆదాయం రూ.4,294.12 కోట్లు వచ్చిందని, తద్వారా 95.42 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో రూ.3,224.98 కోట్ల ఆదాయం ఉండగా, 2023–24 లో రూ.6,999.42 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ♦ ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ సీఎస్‌లు నీరబ్‌కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్ వై.మధుసూదన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, సేల్స్ టాక్స్ స్పెషల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, అడిషనల్ డీజీలు ఎన్.సంజయ్, రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీలోనూ విదేశీ కోర్సులు.. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ రాష్ట్రంలోనూ అమలు
విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సుల ద్వారానే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సోలార్ పార్క్‌లు, సోలార్ మోటార్లు, ప్యానల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరతను అధిగమించేలా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు అందుబాటులో ఉండాలి. వీటిలో ఈ దిశగా కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్ నాటికి ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో యూనిఫామ్ పాలసీ ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు అక్కడి విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా కోర్సులు మన విద్యార్థులకు ఏమేరకు గరిష్ట ప్రయోజనం కల్పిస్తాయో పరిశీలించి, వాటిని ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా రాష్ట్ర విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచాలని, ఈ దిశగా వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో సమగ్రత తేవాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లోని కోర్సుల పాఠ్య ప్రణాళికను ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ ఓరియెంటెడ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్ కోర్సులను ఈ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని చెప్పారు. ప్రఖ్యాత కాలేజీలు అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలను కూడా పరిశీలించి, రాష్ట్రంలో కూడా అటువంటి పాఠ్య ప్రణాళికలను అమలు చేయాలన్నారు. స్వయం ఉపాధిని కల్పించే కోర్సుల కోసం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వంటి సంస్థలతో అనుసంధానం (టైఅప్) చేసుకోవాలని సూచించారు. రిస్క్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు స్వయం ఉపాధి అందుతుందని చెప్పారు. వచ్చే జూన్ కల్లా పాఠ్య ప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన నియామకాలు ► ఉన్నత విద్యా శాఖలో 2 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఈ ఖాళీలను త్వరగా భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే చేపట్టిన నోటిఫికేషన్లకు సంబంధించిన కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని, జూన్ కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. ► ఉన్నత విద్యా శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాలి. యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. సమర్థులైన బోధన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలి. తద్వారా విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాలను పెంచేందుకు అవకాశముంటుంది. ట్రిపుల్ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలి. కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా చేయూత ► రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ న్యాక్ తదితర సంస్థల అక్రిడిటేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతుల పరంగా నాణ్యత పెరగాలి. ఈ దిశగా ప్రతి విద్యా సంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలి. ► కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా మూడేళ్ల పాటు వారికి చేయూతనివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో అక్రిడిటేషన్‌కు వీలుగా ప్రమాణాలు పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యా సంస్థలు న్యాక్ అక్రిడిటేషన్ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ► కళాశాలల్లో కోర్సులన్నీ నేటి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిసి కరిక్యులమ్ రూపొందించాలి. హై ఎండ్ స్కిల్స్‌లో భాగంగా సాప్ట్వేర్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. సెంట్రల్ ఆంధ్రాలో అకడమిక్ స్టాఫ్ కాలేజ్ ► బోధనా సిబ్బంది సామర్థ్యం మెరుగు పరచడానికి తిరుపతి, విశాఖపట్నంలలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలి. వీటితో పాటు సెంట్రల్ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలి. ► కొన్ని ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని.. మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కాలేజీల్లోని బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలి. అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలి. డ్రాపవుట్లకు తావులేకుండా చర్యలు ► పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్ అవుట్ అన్న పరిస్థితే రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్లోకి అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమ చేస్తోంది. టెన్త్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది. ► మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రం ఏపీనే. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు. ఫలితంగా జీఈఆర్ (గరిష్ట చేరికల నిష్పత్తి) తప్పకుండా పెరుగుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యా శాఖ సలహాదారు ఏ.సాంబశివారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కేసి.రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మరిన్ని ‘జోషి మఠ్’లు!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో ఇళ్లు పగుళ్లివ్వడానికి విపరీతమైన వర్షాల వల్ల భూమి క్రమక్షయం, నేల లోపలి భాగం గుల్లబారడం వంటివి కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘వీటితో పాటు ఇష్టారాజ్యంగా తవ్వకాలు, ఇళ్లతో పాటు డ్యాముల వంటి భారీ నిర్మాణాలు కూడా సమస్యకు కారణమే. అయితే భూమి లోపలి పొరల్లోని (టెక్టానిక్) కదలికలే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఇది వేగం పుంజుకుంది. దీన్ని అడ్డుకోవడం మన చేతుల్లో లేదు ’’ అని వారంటున్నారు. రాష్ట్రంలోని నైనిటాల్, ఉత్తరకాశి, చంపావత్ తదితర పట్టణాలకూ ఇలాంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని సున్నితం, బలహీనమైన నేల, దాని లోపలి పొరలతో ఎప్పటికైనా ప్రమాదమేనని చెబుతున్నారు. మరోవైపు, జోషి మఠ్‌ను కొండచరియలు విరిగిపడే ముప్పున్న ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా 60కి పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. మరో 90 కుటుంబాలను కూడా తరలించనున్నారు. కలెక్టర్ సారథ్యంలో ప్రభావిత ఇళ్ల పరిశీలన కొనసాగుతోంది. పట్టణంలోని 4,500 పై చిలుకు ఇళ్లలో 610 ఇళ్లు పగుళ్లిచ్చి నివాసానికి పనికిరాకుండా పోయినట్టు గఢ్వాల్ కమిషనర్ సుశీల్‌కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం పుష్కర్‌సింగ్ ధామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. ప్రధాని కార్యాలయం కూడా ఆదివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపింది. ప్రజల క్షేమమే తొలి ప్రాధాన్యమని ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఐటీ రూర్కీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. జోషి మఠ్ పరిస్థితిపై హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా అధ్యయనం చేయనున్నాయి. -
లక్ష్యం.. వాస్తవ ప్రగతి
ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలి.. అందమైన అంకెల రూపంలో చూపడం కాదు. ప్రతి అంశంలోనూ సాధించాల్సిన ప్రగతిపై క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేపట్టాలి. వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో, లక్ష్య సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుంది. ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, తాగునీటిపై శ్రద్ధ చూపాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది పనితీరును మండలాల వారీగా ఆయా విభాగాలకు చెందిన అధికారులు పర్యవేక్షించేలా ఎస్‌వోపీలను రూపొందించాలని సూచించారు. మండల స్థాయిలో అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వాధికారులు నెలకు రెండుసార్లు ఆయా సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సిబ్బంది సమర్థత పెంచాలని నిర్దేశించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి ఎప్పటికప్పుడు నమోదు గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తెచ్చింది. అలాంటి సచివాలయాలపై నిరంతర పర్యవేక్షణ, ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా కీలకం. లేదంటే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. నిశిత దృష్టి, జవాబుదారీతనం.. ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటాను నిక్షిప్తం చేయడంతోపాటు వచ్చిన మార్పులు చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలుంటే సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. వారికి సరైన ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. తద్వారా ఆ సమస్య ఇక పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి. సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. వివిధ ప్రభుత్వ విభాగాల తరపున గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు సచివాలయాలను చోదక శక్తిలా వినియోగించుకునేలా సిబ్బందిని çపూర్తి స్ధాయిలో భాగస్వాములుగా చేయాలి. సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌వోపీలను మరోసారి పరిశీలించి అవసరమైతే మార్పుచేర్పులు చేయాలి. సమర్థత పెంచేలా సచివాలయాల సందర్శన.. మండల స్థాయిలో ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన అధిపతి ప్రతి నెలా రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సమర్థత పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సిబ్బంది ఎఫిషియన్సీ పెంపొందించేలా చూడాలి. ఆయా శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఎలా కృషి చేస్తున్నారో పరిశీలన చేయాలి. ప్రతి విభాగంలోనూ పర్యవేక్షణ ఉండాలి. ఏ విభాగంలోనైనా సంబంధిత అధికారి లేకుంటే ఆయా విభాగాలకు మండలాలవారీగా వెంటనే నియమించాలి. వీలైనంత త్వరగా దీన్ని చేపట్టాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందికి సరైన మార్గ దర్శకత్వం లభిస్తుంది. అవగాహన కలుగుతుంది. ఎప్పటికప్పుడు వివరాల నమోదు సమగ్రంగా జరుగుతుందో లేదో పర్యవేక్షణ ఉంటుంది. లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, జేసీలు పరిశీలన చేయాలి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతోంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు పరిశీలన చేయాలి. సచివాలయాలను తమవిగా భావించాలి. ప్రతి స్థాయిలోనూ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకు పడతాయి. దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుంది. ప్రతి నెలా వివరాలు నమోదు వ్యవసాయం, విద్య, మహిళ, శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాలపై మనం ఖర్చు చేస్తున్నట్లు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం లేదు. వీటిపై సమగ్ర పర్యవేక్షణ అవసరం. ప్రగతి లక్ష్యాల సాధనపై నెల రోజులకు ఒకసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. డ్రాపౌట్స్ ఉండకూడదు పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూడదు. డ్రాపౌట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వలంటీర్ల వారీగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాపౌట్ గురించి సమాచారం అందితే అధికారులు వెంటనే స్పందించాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరు పరిశీలించాలి. ఎవరైనా వరుసగా మూడు రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరా తీయాలి. పిల్లలు బడికి రాకపోతే తప్పనిసరిగా ఎస్ఎంఎస్ పంపాలి. ఇవన్నీ కచ్చితంగా జరిగాలి. కళ్యాణమస్తుతో.. కళ్యాణమస్తు పథకం ద్వారా లబ్ధి పొందేందుకు నిర్దేశించిన అర్హతలు బాల్య వివాహాల నివారణ, అక్షరాస్యత పెరిగేలా దోహదం చేస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించాం. పెళ్లి కుమార్తె కనీస వయసు 18 ఏళ్లు, పెళ్లి కుమారుడి కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్దేశించినందున ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలు విద్య సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయి. ఇంగ్లీషు మీడియం సహా పలు సంస్కరణల ద్వారా పరిస్థితులను సమూలంగా మార్చేసే మహా యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు ఉజ్వల భవిష్యత్తు కలిగిన తరాలుగా సమాజానికి అందుతాయి. చదువుల యజ్ఞం కొనసాగుతుంది.. ఇంగ్లీషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలే ఇంగ్లీషు మీడియంలో చదవాలి, పేద బిడ్డలు మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదవకూడదనే వైఖరిని పదేపదే చాటుకుంటున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందకూడదన్నదే వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. తద్వారా చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది. సమీక్షలో సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ జె.నివాస్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ.సిరి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. -
మోర్బీ విషాదంపై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
గాంధీనగర్: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా ఆచూకీ గల్లంతైన క్రమంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మోర్బీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ వేదికగా ఈ రీవ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జి కూలిపోయినప్పటి నుంచి తీసుకుంటున్న సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లను ప్రధానికి వివరించారు అధికారులు. ఈ విషాదానికి కారణమైన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలోని బాధితులకు అన్ని విధాల సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదీ చదవండి: మోర్బీ ఘటన.. మరో వంద మందికిపైగా జలసమాధి! -
జోరుగా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. వాస్తవానికి ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగింది. కొద్ది రోజులుగా వర్షాలకు తెరపివ్వడంతో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. నిర్మాణం మధ్యలో ఆపేసిన వారు తిరిగి పనులు మొదలు పెట్టారు. రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను అందజేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆ స్థలాల్లో వారికి రెండు దశల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇళ్లు కట్టించి ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో సరికొత్తగా కాలనీలు, ఊర్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఆయా లేఅవుట్లలో గృహాలను నిర్మించుకునేందుకు అవసరమైన మెటీరియల్‌ను అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. చాలా కాలనీలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. మరికొన్ని కాలనీల్లో ఈ పని ముమ్మరమైంది. అంతర్గత రోడ్లు నిర్మించి, నీటి వసతికి ఇబ్బంది లేకుండా బోర్లు వేశారు. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా గృహాలను నిర్మించుకోవడంలో బిజీ అయ్యారు. గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లులను అప్లోడ్ చేసిన కొద్ది రోజులకే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. దీంతో గృహ నిర్మాణాల్లో వేగం పెరుగుతోంది. ఆయా లే అవుట్లలో లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచింది. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.1.80 లక్షలకు తోడు లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. నిర్మాణాల్లో వేగం పెరగడానికి ఇది బాగా దోహదం చేస్తోంది. అందుబాటులో మెటీరియల్ గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్‌ను ఎప్పటికప్పుడు అవసరాల నిమిత్తం లబ్ధిదారులకు అందించేందుకు అన్ని జిల్లాల్లో అధికారులు సిద్ధంగా ఉంచారు. ఆయా ప్రాంతాల్లోని గోడౌన్లకు స్టీల్, సిమెంట్‌ను ఇప్పటికే చేరవేశారు. అన్ని జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఉచితంగానే చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన వెంటనే ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. వీధుల్లో స్తంభాలు, వైర్లు, ఇళ్లకు విద్యుత్ బోర్డులు, వైర్లు, మీటరు ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కో కనెక్షన్‌కు దాదాపు రూ.6 వేల వరకు వ్యయం అవుతుండగా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి కూడా ఉచితంగానే విద్యుత్ కనెక్షన్స్ ఇస్తున్నారు. దీంతో వేలాదిగా కొత్త ఊర్లు, కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. నిర్మాణాల్లో మరింత వేగం పెరగాలి నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గినందున నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. గృహ నిర్మాణం, టిడ్కో ఇళ్ల ప్రగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో ఇప్పటి దాకా చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 యూనిట్లను లబ్ధిదారులకు అప్పగించామని చెప్పారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, వచ్చే మార్చి నాటికి మరో 1,10,968 ఇళ్లు అప్పగించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గినందున నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుదీకరణ పనులు సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు సీఎంకు వివరిచారు. టిడ్కో ఇళ్లు ఫేజ్–1కు సంబంధించి దాదాపుగా రిజి్రస్టేషన్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చే 30 లక్షల ఇళ్ల ప్రగతి గురించి కూడా వారు సీఎంకు వివరించారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు.. పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు ఆయా ప్రాంతాల నివాసితులతో సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన కల్పించడంతో పాటు, మార్గదర్శకాలు సూచించాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని, వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికివాడలుగా మారే ప్రమాదం ఉంటుందని సీఎం హెచ్చరించారు. ఆయా నివాసాలను ఏ రకంగా నిర్వహించుకోవాలన్న దానిపై అసోసియేషన్లకు అధికారులు బాసటగా నిలవాలని సూచించారు. ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచడం, శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై అసోసియేషన్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఈ నెల 22న పంపిణీ చేసిన టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాల తీరుపై అధికారులు సీఎంకు ప్రత్యేకంగా వివరించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీశ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలి. ఆయా పట్టణాలు, నగరాల్లో చెత్తను, మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఇప్పటికే ఉన్న సౌకర్యాలు, వసతులు.. ఇంకా కల్పించాల్సిన సదుపాయాలపై నివేదిక తయారు చేయాలి. అవసరమైన వసతులు లేని చోట్ల వెంటనే కల్పించి సమర్థవంతంగా నిర్వహించాలి. మురుగునీటి శుద్ధి, వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రతి మున్సిపాలిటీ నూరు శాతం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ప్లెక్సీలను పూర్తిగా నిషేధించింది. నవంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. వ్యాపారులు ప్లాస్టిక్ నుంచి వస్త్రం వైపు మళ్లేందుకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు వారికి రుణాలు ఇప్పించి అండగా నిలవాలి. ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించే వారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదని, ఇలాంటి ప్రాంతాల్లో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. చెత్త నిర్వహణలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నామో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ తదితర అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే చేపట్టిన పనుల ప్రగతి, మెరుగైన ఫలితాలు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి మున్సిపాలిటీలోను వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలు తీరుపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. అన్ని యూఎల్బీల్లోనూ (అర్బన్ లోకల్ బాడీస్) ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఉందా? లేదా? అన్నదానిపై సంబంధిత అధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్ కృష్ణా వరద గోడకు సుందరీకరణ ► ఏటా వచ్చే వరదలకు కృష్ణా నది పొంగి విజయవాడ నగర పాలక సంస్థలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యేవి. ఈ ఇబ్బందులను తప్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ గోడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల నుంచి మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రిటైనింగ్ వాల్ బండ్‌ను చెట్లు, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దాలి. ► విజయవాడ నుంచి గన్నవరం విమనాశ్రయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా చేపట్టిన సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. అంబేడ్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను సైతం అందంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నం నగరంలో సైతం సుందరీకరణ పనులు చేపట్టాలి. ► వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయండి. మళ్లీ డ్రైవ్ చేపట్టి, మే 31 నాటికి అన్ని రోడ్లనూ బాగు చేయాలి. జగనన్న కాలనీల్లో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ► ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కాలనీల నిర్మాణం పూర్తయ్యేలోగా వాటిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలి. ప్రాధాన్యత క్రమంలో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి తర్వాత మురుగు నీటి శుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. ► రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లపై అధికారులు శ్రద్ధ పెట్టాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలి. ఈ పనుల ప్రగతిపై ఉన్నతాధికారులు జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో చేపట్టడంపై దృష్టి సారించాలి. ► వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో సాధికారిత కోసం కృషి చేయాలి. ఏటా 45 ఏళ్లు నిండిన మహిళల్లో అర్హత ఉన్న వారికి ఈ పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలి. ఈ డబ్బుతో వారు స్వయం ఉపాధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అర్హత సాధించిన తొలి ఏడాదిలోనే వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించడం ద్వారా వారిలో సంపూర్ణ సాధికారితకు కృషి చేయాలి. ► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీశా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: పన్ను చెల్లింపు సులభతరం
మద్యం అక్రమ తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకు రావాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అవసరమయ్యే సేవలు ఏమిటి? వాటివల్ల ఎలాంటి హక్కులు ఉంటాయి? దాని వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం? అనే విషయాలపై అవగాహన కల్పించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటూ నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి. సాక్షి, అమరావతి: పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పన్నుల్లో ఎక్కడా లీకేజీలు (ఎగవేతలు, ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం, తప్పుడు లెక్కలు) లేకుండా చూసుకోవాలని, వాటిని అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మద్యం అక్రమ తయారీ, విక్రయాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని చెప్పారు. గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతి రోజూ నివేదికలు తీసుకుంటూ, వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, అటవీ, రవాణా శాఖల కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చాలని ఆదేశించారు. రవాణా శాఖలో ఆదాయం పెంపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని, జీఎస్టీ వసూళ్లు బాగున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం ► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలి. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలి. ► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందిన వారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ఆపరేషన్‌లో లేని వాటిపై దృష్టి పెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి నెలా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. ► రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు రాష్ట్రంలో తగిన సానుకూల పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి డీలర్లు డబ్బు తీసుకుని, వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లక్ష్యం దిశగా ఆదాయం ► ‘గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబర్ వరకు రూ.1,174 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 19 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 43 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశాం’ అని అధికారులు సీఎంకు తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. 2022 సెప్టెంబర్ వరకు లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ.25,928 కోట్ల ఆదాయం వచ్చింది. 94.47% లక్ష్యం చేరుకున్నాం’ అని చెప్పారు. ► లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంను అభివృద్ధి పరిచామని, హెచ్ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసి.. సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. -
ఫుల్ స్పీడ్‌తో ఇళ్లు
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి అందచేసే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధులు సక్రమంగా విడుదల చేస్తున్నాం. పేదల గృహ నిర్మాణ పనులను వేగంగా కొనసాగించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాల్లో వేగం మరింత పెరగాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖలో ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇచ్చిన నేపథ్యంలో గృహ నిర్మాణాలను త్వరగా చేపట్టాలని నిర్దేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. అర్హులందరికీ ఇవ్వాల్సిందే.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇటీవలే విశాఖలో 1.24 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. ఈ ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ఇళ్ల నిర్మాణంతోపాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సమాంతరంగా కనీస సదుపాయాల కల్పన పనులపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీ, నీరు, విద్యుత్తు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. ప్రతి దశలోనూ నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. కాలనీల్లో ఇంకా ఎక్కడైనా ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులు మిగిలిపోతే వేగంగా పూర్తి చేయాలి. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు లేఅవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు, ఇతర ఏర్పాట్లు చేసుకున్నారో లేదో పర్యవేక్షించాలి. లబ్ధిదారుల సహాయార్థం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు కేటాయించిన స్థలాన్ని నిర్దిష్టంగా చూపించి పట్టా, సంబంధిత డాక్యుమెంట్లన్నీ అందచేయాలి. ఇళ్ల పట్టాల మంజూరులో ఎలాంటి జాప్యం జరగటానికి వీల్లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం మంజూరు కావాల్సిందే. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్వ సదుపాయాలతో టిడ్కో ఇళ్లు పట్టణ పేదల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పూర్తి సదుపాయాలతో లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారుల పేర్లతో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇప్పటికే 75 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మరో 73 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలి. మొత్తం 1.48 లక్షల ఇళ్లను లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిర్మాణాల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తాం. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలి. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. నిర్వహణ మెరుగ్గా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలి. వేగంగా ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అక్టోబరు చివరి నాటికి మొదలవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పనుల ప్రగతిపై సమీక్ష, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అక్కడ నుంచే కల్పించినట్లు తెలిపారు. 15 నుంచి 20 రోజుల్లోగా 1.4 లక్షల టిడ్కో ఇళ్లు అన్ని సదుపాయాలతో సిద్ధమవుతాయని వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం అందిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని అర్హులుగా నిర్ణయించి ఇప్పటికే లక్ష మందికి పట్టాలు అందచేసినట్లు వెల్లడించారు. మిగతా వారికీ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దొరబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్షి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్ గుప్తా, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ.బాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
CM YS Jagan: ప్రగతికి అద్దం పట్టాలి
వైద్యం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు. ఎంఎస్ఎంఈ రంగంలో మనం చేస్తున్న కృషి కూడా మరే రాష్ట్రంలోనూ లేదు. ఎస్డీజీకి సంబంధించి మనం చాలా బాగా పని చేస్తున్నాం. దేశంలో తొలి స్థానంలో నిలబడ్డాం. మరిన్ని ఫలితాలు రావాలంటే సమర్థవంతమైన మానిటరింగ్ (పర్యవేక్షణ), రిపోర్టింగ్ (నివేదన) అవసరం అన్నది చాలా ముఖ్యం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లను డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా జమ చేసిందని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో ఈ తరహా డీబీటీ విధానం ఎక్కడా లేదన్నారు. ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటమైన మార్క్ (ముద్ర) వేయగల పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని, ఇవన్నీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీల్లో) ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ – సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) సాధనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్డీజీకి సంబంధించి కచ్చితంగా ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ఉండాలని, వాటిని నిరంతరం పాటించాలని స్పష్టం చేశారు. ఎస్డీజీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అప్డేట్ చేయడంతో పాటు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా రిపోర్ట్ చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ఎస్డీజీల సాధనపై ఎన్ని రోజులకు సమావేశం కావాలన్న దానిపై నిర్ధిష్టమైన సమాచారం ఉండాలని, గతేడాది ఇది లోపించిందని.. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మూడు నెలల పాటు.. ప్రతి నెలా సీఎస్ ఆధ్వర్యంలో రెండు దఫాలుగా సమావేశం కావాలని ఆదేశించారు. ఎస్డీజీ సమావేశాల్లో కార్యదర్శులు పాల్గొనాలని, కలెక్టర్లతోనూ మాట్లాడాలని సూచించారు. ఎస్డీజీ రిపోర్టింగ్ మానిటరింగ్ అనేది సక్రమంగా జరగనప్పుడు ఎంత బాగా పని చేసినా లాభం ఉండదని చెప్పారు. ఎస్‌డీజీల్లో ప్రస్తుతం జాతీయ స్థాయిలో పోటీ పడటం ద్వారా.. దేశంలో తొలి స్థానంలో నిలబడటానికి అవకాశం వచ్చిందని, గతంలో ఈ పరిస్థితి లేదన్నారు. విశాఖపట్నంలో అత్యాధునిక వసతులతో ఐటీ హబ్‌ను నిర్మించాలని, ఇందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు ఎస్డీజీ రిపోర్టును పర్యవేక్షించాలి ► ఏ పథకం ఎప్పుడు వస్తుందనేది ముందుగానే క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. డీబీటీ ద్వారా బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు జమ అవుతున్నాయి. అవినీతి, వివక్షకు తావు లేకుండా శాచ్యురేషన్ మోడ్‌లో ఈ పథకాలు అందిస్తున్నాం. ► జిల్లాల్లో కలెక్టర్లు ప్రతి నెలా ఎస్డీజీ రిపోర్టును మానిటరింగ్ చేసే బాధ్యత తీసుకోవాలి. సచివాలయం నుంచి డేటా జిల్లా స్థాయికి చేరాలి. విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరం. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ► ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ ఇచ్చి బటన్ నొక్కి ఎంఎస్ఎంఈలకు టైం ప్రకారం ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా ఇలా జరగడం లేదు. గతంలో రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు. గత ప్రభుత్వ ఇన్సెంటివ్‌లకు సంబంధించిన బకాయిలు కూడా మనమే చెల్లించాం. ఎస్‌డీజీల్లో అన్నీ ప్రతిబింబించాలి.. ► జగనన్న అమ్మఒడి, టీఎంఎఫ్ (టాయ్‌లెట్ మెయింటెనెన్స్ ఫండ్), ఎస్ఎంఎఫ్ (స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్), సంపూర్ణ పోషణ, గోరుముద్దపై సరిగా రిపోర్ట్ చేయలేదు. విద్యా కానుక, విద్యా దీవెన, పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, రూ.20 వేలు వసతి దీవెన గతంలో ఎప్పుడూ జరగలేదు. వీటన్నింటిపై ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ చేయాలి. ► ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో దాదాపు 3 వేల చికిత్సా విధానాలు, 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు–నేడుతో మొత్తం ఆస్పత్రుల పునర్ వ్యవస్థీకరణ, ఆరోగ్య ఆసరా ఇవేవీ గతంలో లేవు. ► మహిళా సాధికారతలో చేయూత, ఆసరా, అమ్మఒడి, సున్నా వడ్డీ, మహిళల పేరుపై ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క బటన్ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసింది. దేశంలో ఈ తరహా డీబీటీ విధానం లేదు. ఇవన్నీ కచ్చితంగా ఎస్‌డీజీల్లో ప్రతిబింబించాలి. ► విద్యా శాఖలో నూటికి నూరు శాతం ఎస్డీజీ లక్ష్యాలను సాధించాలి. దాదాపు 7 నుంచి 8 రంగాలలో వైద్య ఆరోగ్య రంగం, విద్య, మహిళా సాధికారత, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీ రాజ్, సోషల్ జస్టిస్, మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎస్‌డీజీల్లో ప్రతిబింబించాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ► సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
సర్వ సేవాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూముల సర్వేలో భాగంగా అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూహక్కు– భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు సత్వరమే అందించాలని సూచించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. వాణిజ్య పన్నుల శాఖలో సమర్థత పెంచే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, అటవీ శాఖలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 14 వేల మందికి శిక్షణ ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ గ్రామాల సంఖ్య మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. 14 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 2న తొలివిడత కింద రిజిస్ట్రేషన్ సేవలు, భూహక్కు–భూరక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచేలా కృషి చేయాలని సీఎం సూచించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు (ఓటీఎస్) పథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు. అక్రమ మద్యంపై కఠిన చర్యలు అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సూచించారు. 2,700 క్వారీల్లో పనులు మొదలయ్యేలా.. మైనర్ మినరల్స్‌కి సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కిపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో కార్యకలాపాలు మొదలయ్యేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బొగ్గు మన అవసరాలకే ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. జెన్కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈ బొగ్గును మన అవసరాలకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. తదుపరి బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టి పెట్టాలని ఏపీఎండీసీకి సూచించారు. వాణిజ్య శాఖలో సమూల మార్పులు వాణిజ్య పన్నుల శాఖలో సమర్ధత పెంపొందించే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. డేటా అనలిటిక్స్‌తో పాటు లీగల్‌సెల్ విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు. పెండింగ్ బకాయిల వసూలుకు వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. జూన్ చివరికల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటును పూర్తి చేయనున్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్.ప్రతీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చి విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఎలాంటి సేవలు పొందవచ్చు అనే అంశాలపై సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషన్లే కాకుండా రిజిస్ట్రేషన్ పరంగా అందించే ఇతర సేవలపై కూడా పూర్తి సమాచారం, అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు లభిస్తాయి? ఎలాంటి భద్రత సమకూరుతుందో వివరంగా తెలియచేయాలన్నారు. -
హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుపై ప్రధాని శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో డేటాబేస్‌లన్నింటినీ, పాఠశాలల్లోని రికార్డులతో అనుసంధించాలని చెప్పారు. ఈ పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోనే పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించివచ్చునని ప్రధాని చెప్పినట్టుగా అధికారిక ప్రకటన వెల్లడించింది. డ్రాపవుట్ విద్యార్థుల్ని గుర్తించి బడి బాట పట్టించడానికి ఈ విధానం దృష్టి సారిస్తోందని ప్రధాని వివరించారు. -
మన పంతం అవినీతి అంతం
అవినీతిపై ఫిర్యాదులకు యాప్ ప్రజలు అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. దిశ మాదిరిగానే ఏసీబీకి నెల రోజుల్లో ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చి, కార్యాచరణ సిద్ధం చేయాలి. అవినీతిపై ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. తమ వద్దనున్న ఆడియో, వీడియో ఆధారాలతో సహా పత్రాలను నేరుగా అప్లోడ్ చేయొచ్చు. వాటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్ వ్యవస్థలు కూడా ఉండాలి. ఆ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఆధునిక నాగరికత పేరుతో వస్తున్న పెడధోరణులకు అడ్డుకట్ట వేయాలి. డ్రగ్స్, గంజాయిలను పూర్తిగా నిరోధించాలి. మన పిల్లలు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. విద్యా సంస్థలపై పూర్తిగా నిఘా ఉంచాలి. జూనియర్ కాలేజీ మొదలు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల వరకు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అవినీతి అన్నదే ఉండకూడదు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో లంచాలన్న మాటే వినిపించకూడదు. ఏసీబీ ప్రధాన విధి అదే. అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్లాలి’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదని, ఎక్కడా అవినీతి అన్నది కనిపించకూడదని చెప్పారు. ఏసీబీకి ఇది ప్రాథమిక విధి కావాలని, అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్న విభాగాలపై ఏసీబీ మరింతగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నందున, భవిష్యత్తులో కూడా ఈ వ్యవస్థలో అవినీతి కనిపించకూడదని.. అందుకోసం అవసరమైన ఎస్ఓపీలు తయారు చేయాలని ఆదేశించారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లోకి సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలు వస్తున్నాయి. సర్వేయర్లు వస్తున్నారు. భూముల పంపకాల వల్ల వచ్చే డివిజన్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ సచివాలయాల్లోనే జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు. అవినీతి చోటు చేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్లాలి’ అని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాల్లో అవినీతికి, లంచాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. మూడేళ్లు కాకముందే ప్రజలకు రూ.1.35 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పద్ధతిలో ఇచ్చామన్నారు. మధ్యవర్తులు లేకుండా ఎక్కడా పైసా అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేశామని, వచ్చే రెండేళ్లతో కలిపితే సుమారు రూ.2.5 లక్షల కోట్లు ప్రజలకు అందించనున్నామని తెలిపారు. దేవుడి దయవల్ల ఎలాంటి అవినీతికి చోటు లేకుండా ఇవన్నీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. హోం శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండల స్థాయి వరకూ ఏసీబీ వ్యవస్థ బలోపేతం ► అవినీతి నిరోధానికి 14400 టోల్‌ఫ్రీ నంబరు పెట్టాం. ఈ నంబరుకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఏసీబీ విధులేమిటి, ఎలా పని చేస్తుందన్నది విస్తృతంగా ప్రజలకు తెలియాలి. అవినీతి జరుగుతున్నట్టుగా ఆడియో రికార్డ్ పంపించినా సరే చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలి. ► మండల స్థాయి వరకూ ఏసీబీ వ్యవస్థను బలోపేతం చేయాలి. దిశ, ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), ఏసీబీలకు మండల స్థాయిల్లో స్టేషన్లు ఉండాలి. ఈ మూడింటినీ పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలి. ► అవినీతి నిరోధానికి ఒక యాప్‌ను పెట్టాలి. లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు పడాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి సమర్థవంతంగా అమలు చేయాలి. ఎలాంటి అవినీతి వ్యవహారంపైనైనా ఏసీబీ పర్యవేక్షణ చేపట్టాలి. ► ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టి పెట్టాలి. సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలి. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో బాగా కనిపించేలా హోర్డింగ్స్ పెట్టాలి. యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలనే సూచనలను ఆ హోర్డింగ్స్‌లో పొందుపరచాలి. మరింత సమర్థంగా ‘దిశ’ వ్యవస్థ ► మహిళా భద్రత కోసం దిశ వంటి కార్యక్రమాన్ని మునుపెన్నడూ ఎవరూ చేపట్ట లేదు. మనమే తొలిసారిగా దిశ వ్యవస్థను తీసుకువచ్చాం. హోంమంత్రి, డీజీపీ ప్రతిష్టాత్మకంగా ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసేట్టు చూడాలి. ► ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి బాలిక, మహిళ చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు భద్రతకు భరోసా లభించినట్లే. దిశ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, ఫోన్‌ను 5 సార్లు అటూ ఇటూ ఊపినా.. 10 – 15 నిమిషాల్లో పోలీసులు వస్తారు. పోలీసులు స్పందించే సమయం (రెస్పాన్స్ టైం)ను ఇంకా తగ్గించడంతో పాటు బాధిత మహిళలకు కచ్చితంగా సహాయం అందాలి. ► ఎంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకోగలిగితే అంత వేగంగా నేరాన్ని నివారించగలుగుతాం. దాంతో మహిళలు, బాధితులకు భద్రత కల్పించే విషయంలో గొప్ప మార్పు వస్తుంది. దిశను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మెరుగైన ప్రోటోకాల్స్ రూపొందించాలి. ► ఇప్పటి వరకు 1.24 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. మన లక్ష్యం నేరాన్ని నివారించడమే కాదు.. ఆ నేరానికి యత్నించిన వ్యక్తికి శిక్ష విధించడం. ఈ మొత్తం ప్రక్రియలో దిశ వ్యవస్థ అత్యంత సమర్థంగా పని చేయాలి. ఈ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఎటువంటి ప్రతిపాదనలనైనా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. నిఘా మరింత పటిష్టం కావాలి ► రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, రవాణాను ఉక్కుపాదంతో అణచి వేయాలి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)కు ప్రభుత్వం నిర్దేశించిన కార్యకలాపాలు అత్యంత కీలకం. ఎస్ఈబీ కోసం ఓ కాల్ సెంటర్ నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ► ఎక్కడ ఏం జరిగినా మనకు తక్షణం సమాచారం వచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, ఏ సమాచారం వచ్చినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపైనే కాదు.. మూలాల్లోకి వెళ్లి ఆ వ్యవస్థలను కూకూటి వేళ్లతో సహా పెకలించాలి. ► చీకటి సామ్రాజ్యాల్లో జరిగే కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టాలి. అందుకోసం నిఘాను పటిష్ట పరచాలి. టయర్ వన్ సిటీలలో డ్రగ్స్ ఘటనలు చూశాం. అలాంటివి మన దగ్గర కూడా జరుగుతున్నాయా అన్నదానిపై దృష్టి పెట్టాలి. మన పిల్లలు, మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాలి. మనం చేయకపోతే భవిష్యత్ తరం ఫెయిల్ అవుతుంది. ► మన పిల్లలకు మంచి భవిష్యత్ అందించే వాతావరణాన్ని అందించాల్సిన బాద్యత మనదే. కొందరి జీవితాలు, కొన్ని కుటుంబాలను నాశనం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు. అందుకోసం పోలీసులు అత్యంత సమర్థంగా పని చేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా నివేదికలు ఇవ్వాలి ► అవినీతి నిరోధం, దిశ వ్యవస్థ, ఎస్ఈబీ పనితీరుకు సంబంధించి మనం చర్చించుకున్న అంశాల్లో మన రాష్ట్రంలో పరిస్థితులను మదింపు చేయండి. ప్రతి నెల నేను నిర్వహించే సమీక్షా సమావేశం నాటికి ఏ స్థాయిలో మెరుగు పడ్డామో బేరీజు వేసి నివేదిక ఇవ్వండి. ► ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు కూడా దిశ, ఎస్ఈబీ, ఏసీబీ కార్యకలాపాలు, యాప్స్ వినియోగంపై అవగాహన కల్పించాలి. ► దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి సలహాలు, సూచనలను నోటిఫికేషన్స్ రూపంలో పంపించాలి. తద్వారా ఏదైనా ఆపద ఎదురవ్వగానే యాప్‌ను చురుగ్గా ఉపయోగించగలరు. నేర నిర్ధాణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అందుకు అవసరమైన వాటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఈ సమీక్షలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
AP: జాప్యం లేకుండా ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: న్యాయ వివాదాల కారణంగా పేదలకు ఇళ్ల పట్టాల మంజూరులో జాప్యం జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యమయ్యే చోట పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. గృహ నిర్మాణాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కోర్టు వివాదాలు తొలగిపోవడంతో ఏప్రిల్ 28వతేదీన విశాఖలో 1.43 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టాల పంపిణీ పూర్తి కాగానే ఇళ్ల నిర్మాణ పనులు జూన్ నాటికి ప్రారంభమవుతాయని వివరించారు. దాదాపు 63 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. భూమిని చదును చేయడంతో పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఐదువేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోట సామగ్రి భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు చెప్పారు. 66 గోడౌన్లకుగానూ 47 గోదాముల నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. గృహ నిర్మాణాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాణ్యతలో తేడా వస్తే కఠిన చర్యలు పేదల ఇళ్లకు ఇచ్చే విద్యుత్తు ఉపకరణాలు అత్యంత నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితరాలన్నీ నాణ్యమైనవే ఉండాలన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ► ప్రజా ప్రతినిధులకు సత్కారం పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. వారు చొరవ చూపిన చోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. మండలానికి ఒక సర్పంచ్, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జడ్పీటీసీకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇళ్లు పూర్తయ్యే నాటికి కనీస సదుపాయాలు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే నాటికి తాగునీరు, విద్యుత్తు లాంటి ప్రాథమిక అవసరాలను కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అనంతరం కాలనీలకు సామాజిక, మౌలిక సదుపాయాలను వేగంగా సమకూరుస్తూ ముందుకు సాగాలని నిర్దేశించారు. సమగ్ర ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో కాలనీల్లో పనులు చేపట్టి ముందుకు సాగాలన్నారు. ఆయా విభాగాలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా కొనసాగేలా మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి ఆధారంగా వారి పనితీరును మదింపు చేస్తామని స్పష్టంచేశారు. ఇకపై ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్లు కూడా పాల్గొనాలని సూచించారు. సంపూర్ణ గృహహక్కుపై.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ పథకాన్ని 10.2 లక్షల మంది వినియోగించుకున్నారని, 6.15 లక్షల మంది రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు అధికారులు వివరించారు. మిగిలినవారికి కూడా వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మంది ముందుకు వస్తారన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై మార్గదర్శకాలు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ఆదర్శంగా ఎంఐజీ లే అవుట్లు మధ్య తరగతికి ఎంఐజీ ప్లాట్ల పథకంపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పట్టణాలు, నగరాలున్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని, మిగిలిన చోట్ల కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు అందచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి లే అవుట్లలో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లే అవుట్లు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి రూ.13,105 కోట్లు ఇళ్ల పట్టాలు కాకుండా కేవలం గృహ నిర్మాణం కోసమే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,600 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం వ్యయం చేయనుంది. ఈ ఏడాది 35 లక్షల టన్నుల సిమెంటు, 3.46 లక్షల టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనుంది. తొలి దశలో భాగంగా దాదాపు 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
ఆదాయం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయం పెరగడానికి తగిన ఆలోచనలు చేయడంతో పాటు ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎస్ఓఆర్ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదాయ ఆర్జనకు సంబంధించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్ఓపీలను పాటించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టడంపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంతగా వేగవంతం చేయాలని సూచించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి.. తగిన మార్పులు, చేర్పులు చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించ కూడదని, ఆ మేరకు పటిష్టమైన ఎస్ఓపీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీగా లబ్ధి ► ఇదివరకెన్నడూ లేని విధంగా ఓటీఎస్ పథకం ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా పేదలకు ఇప్పటి వరకు రూ.400.55 కోట్లు, టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా మరో రూ.1,230 కోట్ల మేర (మొత్తంగా రూ.1630.55 కోట్లు) లబ్ధి చేకూరిందని అధికారులు వెల్లడించారు. ► గతంలో ఎన్నడూ ఇలా పేదల ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ మినహాయింపులు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం కార్పొరేట్ కంపెనీలకు కేటాయించే స్థలాలకు మాత్రమే స్టాంపు డ్యూటీ మినహాయింపులు ఇచ్చారు. ► ఇప్పటి వరకు 3.70 లక్షల ఓటీఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయింది. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. -
Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!
పండుగ సీజన్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఎంకే స్టాలిన్ అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ కట్టడి చర్యలు విస్తృతం చేయాలన్నారు. మరోవైపు నిబంధనలు కఠినం చేయాలని ముఖ్యమంత్రికి వైద్య బృందాలు సూచించాయి. ఇప్పట్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాల్సినంతర పరిస్థితులు రాష్ట్రంలో లేవని పేర్కొన్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం నాటికి 31 మంది చికిత్స పొందుతున్నారు. మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులతో సీఎం స్టాలిన్ సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, శేఖర్ బాబు, సీఎస్ ఇరై అన్భు, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, డీజీపీ శైలేంద్ర బాబు, చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్‌బేడీలు హాజరయ్యారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య బృందాలు తమ అభిప్రాయలు వ్యక్తం చేశాయి. అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశం నిబంధనలు కఠినం చేయండి నిబంధనలు, ఆంక్షలు కఠినం చేయాలని సీఎంకు వైద్య బృందాలు సూచించాయి. ప్రస్తుతం పండుగ సీజన్ ఆరంభమైందని, మరింత అప్రమత్తంగా ఉండడంతో పాటు ఒమిక్రాన్ కట్టడి చర్యలు విస్తృతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా కట్టడి సేవల నిమిత్తం నియమించిన కాంట్రాక్టు సిబ్బంది పదవీ కాలం ఈనెల 31తో ముగియనుండడంతో పొడిగింపు విషయంగా చర్చించినట్టు తెలిసింది. నైట్ కర్ఫ్యూకు ఎలాంటి అవకాశం లేదని, కొత్త వేడుకలు రద్దు చేయడం లేదా ఆంక్షలు కఠినం చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఇంటింటా వ్యాక్సిన్ కార్యక్రమం విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టారు. ముందుగా సచివాలయంలో సీఎం స్టాలిన్ పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. దేవదాయ శాఖ పరిధిలోని పాఠశాలల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గౌర వేతనం రూ. వెయ్యి నుంచి రూ. 3 వేలకు పెంచారు. అలాగే రూ. 15 కోట్లతో 64 వేల మంది రైతులకు వ్యవసాయ ఉపకరణల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక కమిటీ ఒమిక్రాన్ కట్టడికి నిపుణుల కమిటీని రంగంలోకి దించేందుకు నిర్ణయించినట్టు ఆరోగ్యమంత్రి ఎం సుబ్రమణియన్ పేర్కొన్నారు. తాంబరంలో కరోనా నుంచి కోలుకున్న రోగులకు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. ఒమిక్రాన్ కేసులు, చికిత్స, కట్టడి చర్యల గురించి వివరించారు. ►ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో రెండు డోసుల టీకా వేసుకున్న వారికే ఊటీ సందర్శనకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ►ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఒకటో తేదీ శనివారం, 2వ తేదీ ఆదివారం కావడంతో 3వ తేదీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. -
అప్రమత్తతే ఆయుధం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్ కాలంలో అనుసరించాల్సిన విధానాలు(కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ కల్లోల నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆయన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వసతుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్ లభ్యత, వెంటిలేటర్లు, ఆస్పత్రి బెడ్స్ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వల్ల తలెత్తుతున్న పరిస్థితులను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, అధిక కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలు, పాజిటివిటీ అధికంగా ఉన్న జిల్లాల సమాచారాన్ని ప్రధాని ముందుంచారు. నవంబర్ 25 నుంచి తీసుకున్న చర్యలను, అంతర్జాతీయ విమానప్రయాణికుల నూతన నిబంధనలు, రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల సారాన్ని ప్రధానికి వివరించారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు. పీఎం ఆదేశాలివే.. ► కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. ► జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. ► రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సదుపాయాలు, సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. ► టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలి. ► కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి. ► కాంటాక్ట్ ట్రాకింగ్ సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టే చర్యలపై శ్రద్ధవహించాలి. ► తక్కువ టీకా రేటు, ఎక్కువ కేసులున్న ప్రాంతాలకు బృందాలను పంపాలి. కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. – ప్రధాని మోదీ -
యూపీని వణికిస్తున్న విష జ్వరాలు.. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే
ఫిరోజాబాద్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో డెంగీతోపాటు విష జ్వరాలు చిన్నారుల ప్రాణాలను కబళిస్తున్నాయి. జ్వరాల కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 50కి చేరిందని, మృతుల్లో 40 మంది చిన్నారులు ఉన్నారని ప్రభుత్వ అధికారులు శుక్రవారం ప్రకటించారు. జ్వరాల కాటుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజధాని లక్నోలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆగ్రా, ఫిరోజాబాద్ జిల్లాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, జ్వర పీడితులకు వైద్య సాయం అందించాలని, మరణాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఐసోలేషన్ పడకలు కేటాయించాలన్నారు. కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను జ్వర పీడితుల వైద్యం కోసం వాడుకోవాలని చెప్పారు. ఫిరోజాబాద్‌లో జ్వరాల తీవ్రతపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు చెందిన నిపుణులను ఫిరోజాబాద్‌కు పంపించింది. మథుర, ఆగ్రా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయని యూపీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ కుమార్ ప్రేమీ చెప్పారు. ఫిరోజాబాద్ జిల్లాలో ప్రస్తుతం 3,719 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే.. ప్రమాదకరమైన హెమరాజిక్ డెంగీ కాటు వల్లే చిన్నారులు ఎక్కువగా బలవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం తెలియజేసిందని ఫిరోజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రవిజయ్ సింగ్ అన్నారు. ఈ రకం డెంగీ వల్ల బాలల్లో ప్లేట్లెట్ల సంఖ్య హఠాత్తుగా పడిపోతుందని, రక్తస్రావం అవుతుందని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ముగ్గురు వైద్యులను ఆయన సస్పెండ్ చేశారు. -
YS Jagan: 3 ప్రాంతాల్లో చిన్నారులకు.. అత్యుత్తమ ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం మూడు చోట్ల అత్యాధునిక సదుపాయాలతో కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతితోపాటు కృష్ణా–గుంటూరు ప్రాంతంలో మూడు అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్లను నెలకొల్పాలని సూచించారు. చిన్న పిల్లల కోసం ఏర్పాటయ్యే పీడియాట్రిక్ కేర్ సెంటర్లను ఒక్కొక్కటి రూ.180 కోట్లతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కోవిడ్ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చిన్నారులను భద్రంగా కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షలో సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. థర్డ్ వేవ్ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదన్నారు. చిన్నారులకు టీకాల కార్యక్రమం సక్రమంగా కొనసాగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. థర్డ్‌వేవ్‌పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, పిల్లలకు పౌష్టికాహార పంపిణీ సవ్యంగా కొనసాగేలా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించేందుకు ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఒకవేళ కోవిడ్ థర్డ్‌వేవ్ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది? తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పీడియాట్రిక్ సింప్టమ్స్ (పిల్లల్లో కోవిడ్ లక్షణాలు) గుర్తించేందుకు ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఈమేరకు ఇప్పటి నుంచే శిక్షణ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి. టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలి. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించేలా వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయాలి. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలి. అన్నీ సమకూర్చుకుని సిద్ధంగా ఉండాలి థర్డ్‌వేవ్ వస్తుందనే అనుకుని కావాల్సిన మందులను సిద్ధం చేసుకోండి. అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు. ముందుగానే కావాల్సిన నాణ్యమైన మందులను తెచ్చుకోవాలి. డాక్టర్లను గుర్తించడంతో పాటు అవసరమైతే రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. పౌష్టికాహారంపై పర్యవేక్షణ ప్రస్తుతం సంపూర్ణ పోషణ కింద డ్రై రేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? గోరుముద్ద కింద కూడా డ్రై రేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ సక్రమంగా చేసుకుంటూ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తే మనం ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటాం. పిల్లలకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రులను ముందుగానే ఎం ప్యానెల్ కోసం గుర్తించాలి. ప్రైవేట్ టీచింగ్ ఆస్పత్రులకు కూడా థర్డ్‌వేవ్‌పై సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి. ఆస్పత్రుల వారీగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు నివేదించాలి. – సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్పర్సన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పి) ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఆయుష్ కమిషనర్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. -
Land Survey: సమగ్ర 'భూ సర్వే' పరుగెత్తాలి
సమగ్ర భూ సర్వే ఆలస్యం కాకూడదు. మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. అక్కడ సిగ్నల్స్ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన వాటి కోసం ఆర్డర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్ నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా రాష్ట్రంలో మంద గమనంలో ఉన్న సమగ్ర భూ సర్వే పనులను ఇక నుంచి పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్ నాటికి రాష్ట్రం అంతటా సమగ్ర భూసర్వే పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వే చురుగ్గా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుకున్న సమయంలోగా లక్ష్యం చేరాల్సిందేనని, క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో, అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాల్లో కూడా సమగ్ర సర్వేను వేగవంతం చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి అయితే అన్నింటికీ క్లియర్ టైటిల్స్ వస్తాయని, దీంతో ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదని చెప్పారు. సచివాలయాల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో సహా ప్రజలకు అన్ని రకాల సర్టిఫికెట్లు సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సచివాలయాల్లో కూడా కొనసాగాలని, సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటల్ ఫార్మాట్లో పెట్టాలని ఆదేశించారు. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్లోడ్ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా దీనిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. యూజర్ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు, అన్ని రకాల శిక్షణ కార్యక్రమాల వివరాలు డిజిటల్ ఫార్మాట్ ద్వారా సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే ► రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో మరి కొన్ని గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైనన్ని డ్రోన్లను రంగంలోకి దించుతామని చెప్పారు. ► సర్వేలో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే అనంతరం, డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్ పూర్తి చేసి, ముసాయిదా ముద్రిస్తామని చెప్పారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరాలు, పట్టణాల్లో సర్వే ఇలా.. పట్టణాలు, నగరాల్లో కూడా సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే మొదలు పెట్టామని మున్సిపల్ అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పట్టణాలు, నగరాలకు సంబంధించి మూడు దశల్లో స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఫేజ్–1: 2021 జూన్‌లో ప్రారంభమై,2022 జనవరి నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి. ఫేజ్–2: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమై, 2022 అక్టోబర్ నాటికి 42 పట్టణాలు, నగరాల్లో పూర్తి. ఫేజ్–3: 2022 నవంబర్‌లో ప్రారంభమై, 2023 ఏప్రిల్ నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి. -
Narendra Modi: సత్వరం తరలించండి
న్యూఢిల్లీ: పెను తుపానుగా విధ్వంసం సృష్టించే అవకాశమున్న ‘యాస్’ను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సహాయ చర్యలు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలను, సంబంధిత కేంద్ర సంస్థలను ఆదేశించారు. విద్యుత్, టెలికం సేవలు నిలిచిపోతే, సాధ్యమైనంత త్వరగా వాటిని పునరుద్ధరించాలని సూచించారు. తుపాను కారణంగా కోవిడ్– 19 పేషెంట్ల చికిత్సకు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలగకుండా సమన్వయంతో, ప్రణాళకతో పనిచేయాలని కోరారు. మే 26 సాయంత్రానికి ఉత్తర ఒడిషా, పశ్చిమబెంగాల్ మధ్య యాస్ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితిని కేంద్ర హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోందని, అవసరమైన ప్రాంతాలకు సహాయ బృందాలను తరలించడానికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి 46 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని వెల్లడించింది. మరికొన్ని బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని తెలిపింది. గాలింపు, రక్షణ, సహాయ చర్యల కోసం నౌకాదళం, తీర రక్షకదళం నౌకలు, హెలికాప్టర్లతో సిద్ధంగా ఉందని పీఎంఓ తెలిపింది. అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సహాయ చర్యల కోసం 11 రవాణా విమానాలను, 25 చాపర్లను సిద్ధంగా ఉంచామని వైమానిక దళం తెలిపింది. ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు, విద్యుత్, టెలీకాం సేవల పునరుద్ధరణ, కోవిడ్ రోగుల చికిత్స, వ్యాక్సినేషన్.. వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరానని అనంతరం ప్రధాని ట్వీట్ చేశారు. అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. సిద్ధంగా ఉన్నాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ కోరారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు చర్యలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. తుపాను ప్రభావం తక్కువ ఉండే అవకాశమున్న ప్రాంతాల్లోనూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన దానికన్నా రెండింతలు సిద్ధంగా ఉండడం వల్ల నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. పశ్చిమబెంగాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కో బృందంలో 47 మంది సుశిక్షిత సిబ్బంది ఉంటారని తెలిపారు. రాష్ట్రాల్లో విపత్తు సహాయక బృందాల సామర్థ్యంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో వారికి సరైన శిక్షణ కూడా లేదన్నారు. ఈ విషయంలో ఒడిశా మాత్రం అద్భుతంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. -
ఏపీ: కోవిడ్ చికిత్సకు మరింత ఇద్దాం..
‘కోవిడ్ చికిత్సకు ఇప్పుడు ఇస్తున్న రేట్లు పెంచండి. ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్)లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులలో కోవిడ్ చికిత్సకు వెంటనే రేట్లు పెంచండి. అవే రేట్లను కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల (ఎంప్యానెల్)కు కూడా వర్తింపచేయండి. ఏ ఆస్పత్రి (ప్రభుత్వ ఎంప్యానెల్)లో కూడా కోవిడ్ చికిత్సకు నిరాకరించకుండా చూడండి. కోవిడ్ ఆస్పత్రులలో పని చేస్తున్న ఎఫ్ఎన్వో, ఎంఎన్వోలకు ప్రోత్సాహకంగా అదనంగా నాలుగు నెలల పాటు గౌరవ భృతి ఇవ్వాలి’ – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని సీఎం వైఎస్ జగన్ వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఎక్కడా బెడ్ల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)లో తప్పనిసరిగా 3 వేల బెడ్లు ఉండాలని, ఆక్సిజన్ బెడ్లు 1,000, నాన్ ఆక్సిజన్ బెడ్లు 2,000 తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. కోవిడ్ చికిత్సకు ఇస్తున్న రేట్లను పెంచాలని, అవసరమైన అన్ని చోట్ల సిబ్బందిని తక్షణం నియమించాలని సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు ఆస్పత్రుల వద్ద ఆక్సిజన్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏ ఆస్పత్రిలోనూ (ప్రభుత్వ ఎంప్యానెల్) కోవిడ్ చికిత్సకు నిరాకరించకుండా చూడాలని, కోవిడ్ ఆస్పత్రులలో పని చేస్తున్న ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల జీతాలు పెంచాలని, రోగులకు వైద్య సేవల్లో ఎక్కడా ఇబ్బంది రాకూడదని సీఎం స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ, నివారణ, చికిత్సలపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. 422 కోవిడ్ ఆస్పత్రులు.. రాష్ట్రంలో ప్రస్తుతం 422 కోవిడ్ ఆస్పత్రుల్లో(ప్రభుత్వ, ప్రైవేటు) 35,644 బెడ్లు ఉండగా 21,590 నిండినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. దాదాపు 79 వేల మంది హోం ఐసొలేషన్‌లో, మరో 6,348 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారని, 14,862 మంది ఆక్సిజన్ బెడ్లపై చికిత్స పొందుతున్నారని, గత 24 గంటల్లో 14 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్ పాల్గొన్నారు. వెంటనే సిబ్బంది నియామకం.. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆస్పత్రులలో అవసరమైన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని వెంటనే నియమించండి. సిబ్బంది లేకపోవడం వల్ల ఏ ఆస్పత్రిలో కూడా వైద్య సేవలకు అంతరాయం కలగొద్దు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా.. కోవిడ్ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ తగినంత ఉండేలా అవసరమైన చోట్ల 42 పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్సన్) ప్లాంట్లు ఏర్పాటు చేయండి. ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేసి టీచింగ్ ఆస్పత్రులతో పాటు ఇతర ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉంచండి. టీచింగ్ ఆస్పత్రుల వద్ద 10 కేఎల్ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఉండాలి. వీలైనంత త్వరగా ఇవన్నీ ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టండి. చదవండి: ఏపీ: 24 గంటల్లోనే కోవిడ్ టెస్టుల ఫలితాలు ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. -
కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం
-
కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగనున్నారు. మొన్న జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగనుంది. దేశవ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని కట్టడి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కేసులు పెరుగుదలతో ఉన్న వైద్య సేవలు చాలడం లేదు. దీంతో వైరస్ బాధితులు ఆస్పత్రుల్లో బెడ్లు చాలడం లేదు.. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉండడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ కొరత, వైద్య సదుపాయాల అరకొరగా ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఉన్న అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని శుక్రవారం కేవలం కరోనా సెకండ్ వేవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించనున్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యత కొరత ఉండడంతో పారిశ్రామికవేత్తలతో చర్చలు చేయనున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి పెంచడంతో పాటు సరఫరా చేసేందుకు వ్యాపారవేత్తలతో చర్చించనున్నారు. ఈ మేరకు వారికి ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు కరోనా ఉధృతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సంస్థలతో సమావేశం కానున్నారు. వీటి కోసం ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. కరోనా పరిస్థితిన సమీక్షించడానికి బెంగాల్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా తెలిపారు. Tomorrow, will be chairing high-level meetings to review the prevailing COVID-19 situation. Due to that, I would not be going to West Bengal. — Narendra Modi (@narendramodi) April 22, 2021 చదవండి: ఆకాశంలో యుద్ధం మొదలైందా? -
కరోనా: 12 రాష్ట్రాలతో కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, ఢిల్లీ: కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష జరిపింది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, బిహార్ రాష్ట్రాలపై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించింది. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలపై ఆరా తీసింది. 46 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. కరోనా కేసులు పెరిగే రాష్ట్రాల్లో టీకాలు, పరీక్షలు పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కఠిన చర్యలు, కంటైన్మెంట్ జోన్లతో కట్టడి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించింది. చదవండి: 60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు కరోనా ఉన్నా.. మీడియా టీంతో ఇమ్రాన్ భేటీ -
పరిశ్రమలకు సముద్ర జలాలు
సాక్షి, అమరావతి: మంచి నీటిని ఆదా చేయడంలో భాగంగా పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన సముద్ర జలాలను అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డిశాలినేషన్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి నీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధి చేసిన జలాల పంపిణీపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సైకిల్ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలని, తద్వారా రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేయొచ్చని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా ఆ నీటిని పరిశ్రమలకు అందించే ఆలోచన చేయాలన్నారు. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యతను ఏపీఐఐసీ చేపట్టాలని, ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఏపీఐఐసీదే బాధ్యత ► పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదే. పకడ్బందీగా డీశాలినేషన్ చేసి, పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అవసరమైన మేరకు నాణ్యమైన నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► సాగు కోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా, డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏరకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి.. ఎక్కడెక్కడిæ నుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు.. ఆ నీటికి బదులుగా డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా నీరు ఇవ్వగలుగుతాం? అన్న అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధం చేయాలి. ► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లకు అవార్డులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో ఉగాది రోజు నుంచి వారిని గౌరవించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. తన ఆత్మీయులుగా భావిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల చెల్లెమ్మలు, తమ్ముళ్ల సేవలకు గుర్తింపుగా ఇంకా ఏమి చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తిస్తూ వారిని సత్కరించే కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు ఇచ్చే ప్రసంశా పత్రం, మెడల్, బ్యాడ్జి, శాలువాలను ఆయన పరిశీలించారు. సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వలంటీర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం, సత్కార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. కాగా, వచ్చే నెల 13వ తేదీన ఉగాది పండుగ రోజున రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు సత్కార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్షి్మ, గ్రామ, వార్డు సచివాలయాలు, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లెవల్–1 2,18,115 మంది వలంటీర్లకు ‘సేవా మిత్ర’ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన 2,18,115 మంది గ్రామ, వార్డు వలంటీర్లను సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.10 వేలు నగదు, సర్టిఫికెట్ (ప్రసంశా పత్రం), శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు. లెవల్–2 4000 మంది వలంటీర్లకు ‘సేవా రత్న’ ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా మండలానికి ఐదుగురు చొప్పున 659 మండలాల్లో 3,295 మంది, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున 109 మున్సిపాలిటీల్లో 545 మంది, కార్పొరేషన్లలో పది మంది చొప్పున 16 కార్పొరేషన్లలో 160 మంది మొత్తంగా 4,000 మంది వలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. లెవల్–3 875 మంది వలంటీర్లకు ‘సేవా వజ్ర’ ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. -
ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా ‘75 ఏళ్ల ఉత్సవాలు’
న్యూఢిల్లీ: స్వాతం త్య్రం సిద్ధించి వచ్చే ఏడాదికి 75 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో అసాధ్యమనుకున్న కొన్ని లక్ష్యాలను సు సాధ్యం చేసేందుకు దేశం కొన్ని సాహ సోపేత నిర్ణయాలు తీసుకోనుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా 75 ఏళ్ల ఉత్సవాలు సాగాలని ఆయన నొక్కి చెప్పారు. ‘75 ఏళ్ల స్వతంత్ర భారతావని’ని పురస్కరించుకుని జరిపే ఉత్సవాలకోసం ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన 259 మంది సభ్యుల ఉన్నతస్థాయి జాతీయ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి దేశం సాధించిన ఘనతను ఈ ఉత్సవాలు ప్రతిబింబించాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులర్పించాలని కోరారు. ఈ కార్యక్రమాలను ‘స్వాతంత్య్ర పోరాటం, 75 ఏళ్ల ఆదర్శాలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల కార్యాచరణ, 75 ఏళ్ల సంకల్పం’అనే ఐదు ఉప శీర్షికల కింద విభజించాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ప్రజా భాగస్వామ్యంతో జరిపే ఏర్పాట్లు 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆలోచనలు, భావనలు, సూచనలు, కలలే కేంద్రంగా సాగాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి సూచనలు, సలహాలు ఇచ్చిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ నేత ఖర్గే, బీజేపీ చీఫ్ నడ్డా తదితరులున్నారు. ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో వారానికొక ప్రత్యేక కార్యక్రమం చొప్పున 75 కార్యక్రమాలను చేపడతారు. దేశ వ్యాప్తంగా ఉన్న 75 చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలను, నిర్మాణాలను ఎంపిక చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12న గుజరాత్ నుంచి ప్రధాని మోదీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించనున్నట్లు గుజరాత్ సీఎం రూపానీ వెల్లడించారు. నారీశక్తికి ఇవే నిదర్శనాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రధాని మోదీ వినూత్నంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మహిళల వ్యాపారదక్షత, సృజనాత్మకత, భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పలు ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ‘నారీశక్తి’ హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్లో ఆయా ఉత్పత్తుల విశిష్టతను వివరించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు మహిళలు ముందు వరుసలో నిలిచారని ట్విట్టర్లో కొనియాడారు. మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
3 కేటగిరీల్లో వలంటీర్ల సేవకు పురస్కారాలు
పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో గ్రామ, వార్డు వలంటీర్లకు మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి, ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. సాక్షి, అమరావతి: తన ఆత్మీయులుగా భావిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్ల సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి, ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు. పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు పురస్కార కార్యక్రమం వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మూడు కేటగిరీల్లో పురస్కారాల ఎంపికకు నిర్దేశించిన అర్హతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఎంపిక ఇలా.. సచీ్ఛలత, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్ –19 సర్వే తదితర అంశాలు ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారు. 1వ కేటగిరి: ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, రూ.10 వేల నగదు బహుమతి. 2వ కేటగిరి: ప్రతి మండలం, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక. వీరికి సేవా రత్న పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి. 3వ కేటగిరి: ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్‌తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారం. -
మరింత సమర్థవంతంగా సచివాలయాల పనితీరు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్థవంతంగా పని చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఫిర్యాదులతో పాటు సమస్యలను తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలన్నింటి వద్ద 1902 నంబరును కచ్చితంగా డిస్ప్లే చేయాలని చెప్పారు. ఇది సచివాలయాల సిబ్బంది పనితీరుపై ఫీడ్ బ్యాక్ కోసం కూడా ఉపయోగపడుతుందన్నారు. గ్రామ స్థాయి వ్యవసాయ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అగ్రికల్చర్ కమిటీలు ఉన్నందున వాటితో సమన్వయం చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం జగన్, అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ సిబ్బందికి శాఖాపరమైన పరీక్షలు – గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పూర్తయ్యాక శాఖా పరమైన పరీక్ష నిర్వహించాలి. ఇందులో క్వాలిపై అయితేనే వారికి ప్రొబేషనరీ పీరియడ్ పూర్తవుతుంది. ఇందు కోసం ప్రతి 3 నెలలకొకమారు పరీక్ష నిర్వహించేలా చూడాలి. – గ్రామ సచివాలయంలోనే సబ్ రిజిస్ట్రార్ విధులు కూడా నిర్వహించాల్సి ఉన్నందున అందుకు తగిన విధంగా సన్నాహాలు చేయాలి. దీనివల్ల ఆ గ్రామ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందుతాయి. – దేశ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రశంసలు వస్తున్నాయని, కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థ గురించి ఆరా తీశాయని.. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు భాధ్యతల గురించి అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 3.95 లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. – ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
14న సీఎం వైఎస్ జగన్ పోలవరం సందర్శన
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమయంలోగా పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 14వ తేదీన పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. పోలవరం డ్యామ్ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎంత మేర పనులు జరుగుతున్నాయనే విషయాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడ సమావేశ మందిరంలో పనులు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు పోలవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
మనం కట్టేవి 'ఊళ్లు'
సాక్షి, అమరావతి: మనం పేదల కోసం కట్టేవి ఇళ్లే కావు ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలని, వీధి దీపాల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటుచేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అలాగే ప్రతి లే అవుట్లో నమూనా ఇంటిని (మోడల్ హౌస్) నిర్మించాలని ఆదేశించారు. ఈ నెల 25వ తేదీన పట్టాలు ఇచ్చే ప్రాంతాల్లో తొలిదశ కింద అదే రోజు 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని, జనవరి 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని చెప్పారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే... నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులు ఎలా కోరుకుంటే అలా.. – లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే కట్టించి ఇస్తాం – లేదా మెటీరియల్ ఇచ్చి, లేబర్ కాంపొనెంట్‌కు సంబంధించిన డబ్బు ఇవ్వండి అంటే అలాగే చేస్తాం – లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇల్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. – ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి – ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. నాణ్యత చాలా ముఖ్యం –ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. –ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలి. –ఆ లే అవుట్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధంగా ఉంచుకోవాలి. –దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఇళ్ల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుంది – ఇటీవలి వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలి –అవసరమైన విధంగా డ్రెయిన్ల నిర్మాణం, తదితర చర్యలు తీసుకోవాలి –లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా, సమస్యలు లేకుండా చూడాలి. – సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. – మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు – 3,65,987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులు – ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ – రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ – 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభం –రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం –వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక – కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం. – టిడ్కో ఇళ్లకు సంబంధించి 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం – 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కేవలం రూ.1 కే ఇవ్వనున్న ప్రభుత్వం -
ఫుడ్ ప్రాసెసింగ్@రూ.10వేల కోట్లు
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమికంగా ఆహార ఉత్పత్తుల శుద్ధి, రెండో దశ ప్రాసెసింగ్ తదితరాల కోసం దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నందున యూనిట్లన్నీ అత్యంత నైపుణ్యంతో ప్రొఫెషనల్ విధానంలో పనిచేస్తూ రైతులకు అండగా నిలిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రాసెసింగ్ అనంతరం మార్కెటింగ్ కోసం ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లపై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అదనపు విలువ జోడించాలి... రైతులకు మంచి ధరలు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. నిర్దేశిత ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే రైతులకు తెలియచేస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించడం ముఖ్యం. ఇందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ విభాగం ప్రాసెసింగ్ యూనిట్లకు ముడి పదార్థాలు అందించేలా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ సంస్థలకు అప్పగించాలి. ఆధునిక విధానంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం? అందుకు అనుగుణంగా ఎక్కడెక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు కార్యాచరణ రూపొందించాలి. రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడే సామర్థ్యంతో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలి. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న అరటి, చీనీ తదితర ఉత్పత్తుల ప్రాసెసింగ్, వాల్యూ యాడ్‌తో ఉత్పత్తుల తయారీ అంశాలపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక విభాగం కృషి చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఒక మెగా ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి. 25 యూనిట్లకు రూ.2,900 కోట్లు... రాష్ట్రంలో 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కార్యాచరణపై సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి వీటి ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, అరటి, టమాటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడిపై వివరాలు తెలియచేస్తూ ప్రాసెసింగ్ యూనిట్లకు దాదాపు రూ.2,900 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. -
ఫిబ్రవరికి నాడు–నేడు తొలి దశ పనులు పూర్తి
మన పిల్లలను హాస్టల్లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అలా అన్ని హాస్టళ్లలో ఉండాలి. ముఖ్యంగా బాత్రూమ్లు చక్కగా ఉండాలి. వాటిని బాగా నిర్వహించాలి. ఇంకా చెప్పాలంటే మరమ్మతులు రాకుండా ఉండే మెటీరియల్ వాడాలి. అన్ని బాత్రూమ్లలో హ్యాంగర్స్ కూడా ఉండాలి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనుల ఫలితాలు దీర్ఘకాలం ఉండాలి. పెయింటింగ్ బావుండాలి. నిర్వహణలో ఎక్కడా అలక్ష్యం చూపొద్దు. పక్కాగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఏ స్కూల్లో, ఏ సమస్య వచ్చినా ఎంత వేగంగా స్పందించి, దాన్ని బాగు చేశామన్న దానిపై మన ప్రతిభ, పనితీరు ఆధారపడి ఉంటుంది. గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్రూమ్లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం నేను స్వయంగా చూశాను. అందువల్ల హాస్టళ్లలో బాత్రూమ్ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయండి. ఇప్పటికే హాస్టళ్లలో మెనూకు సంబంధించి యాప్ ఉంది. బాత్రూమ్లపై కూడా యాప్ డెవలప్ చేయాలి. సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు తొలి దశ పనులు కచ్చితంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి కావాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ ఆధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెండో దశ పనుల్లో హాస్టళ్లలో పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. మనబడి నాడు–నేడు తొలి దశ పనుల పురోగతి, జగనన్న గోరుముద్దపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మనబడి నాడు– నేడు పనుల పరిశీలన కోసం విద్యా శాఖలో ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం పది రకాల పనులకు సంబంధించి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. రెండో దశలో చేపడుతున్న పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకు బెడ్లతో సహా, అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలన్నారు. మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలన్నారు. హాస్టళ్లలో కూడా జగనన్న గోరుముద్ద తరహాలో పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో అంగన్వాడీలలో కూడా నాడు–నేడు కింద పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. విద్యా కానుక కిట్‌లో నాణ్యత ► జగనన్న విద్యా కానుక కిట్‌లో ప్రతి ఒక్కటి నాణ్యత కలిగి ఉండాలి. స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ బావుండాలి. ► వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 12న స్కూళ్లు ప్రారంభం అవుతాయనుకుంటే పిల్లలకు జూన్ 1న ఈ కిట్‌ను పంపిణీ చేయాలి. ఆ మేరకు స్కూళ్లలో కిట్లు మే 15 నాటికి సిద్ధంగా ఉండాలి. ► హాస్టల్ పిల్లలకు ప్రతి రోజు ఒక వెరైటీ ఫుడ్ ఉండేలా ప్లాన్ చేయండి. ఆ మేరకు మార్పు చేసిన మెనూ అందుతోందా.. లేదా అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ► రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని 159 మండలాల్లో వాటిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు భవనాల్లో 9,323 అంగన్వాడీలు ఉన్నాయి. పనుల పురోగతి ఇలా.. ► నాడు–నేడు తొలి దశ పనులు కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయి. కానీ అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయి. పేరెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు, సచివాలయాల ఇంజనీర్లు, టాటా ప్రాజెక్టŠస్ వంటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కంపెనీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు, సోషల్ ఆడిటింగ్ జరుగుతోంది. ► తొలి దశలో 15,715 స్కూళ్లలో మొత్తం రూ.1690.14 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 5,735 ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో రూ.5 లక్షలతో, 1,668 హైస్కూళ్లలో రూ.15 లక్షలతో కిచెన్ షెడ్లు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు రూ.537 కోట్లు ఖర్చవుతోంది. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఐటీ నైపుణ్యాల కోసం యూనివర్సిటీ
సాక్షి, అమరావతి: ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లో నిపుణులైన ఐటీ ప్రొఫెషనల్స్ కొరత సహజమని, దాన్ని తీర్చడానికి విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. టైర్–1 నగరాల్లో అయితే నిపుణుల కొరత అనే అంశం ఉత్పన్నం కాదు కాబట్టి సమస్యలుండవని, టైర్–2 నగరాల్లో వీరిని తయారు చెయ్యడానికి శిక్షణ అవసరమని ఆయన స్పష్టంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ వంటి అత్యాధునిక అంశాల్లో అక్కడ శిక్షణ ఇవ్వాలని చెప్పారాయన. ఐటీ విధానంపై ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఐటీ విభాగం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.3,000 కోట్ల విలువైన ఐటీ సేవలను వినియోగించుకుంటోంది. ఇదంతా ఐటీ విభాగం ద్వారానే జరుగుతోంది. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచడానికి వీలవుతుంది. ప్రభుత్వ ఐటీ విభాగం ఉండటం వల్ల విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ సమస్య ఉండదు. ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా అత్యుత్తమమైన మానవ వనరులను తయారు చేసుకునే అవకాశం వస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ యూనివర్సిటీ పనులు ప్రారంభించాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలి. – ఆయా కంపెనీలు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా, వారిలో నైపుణ్యాన్ని పెంచేలా చూడాలి. – తద్వారా ఐటీ కంపెనీలకు తగినట్టుగా మానవ వనరులు సిద్ధం కావాలి. – ఏటా కనీసం రెండు వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలి. – అక్కడ శిక్షణ పొందడం ప్రతిష్టాత్మకంగా భావించాలి. ఆ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. – ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు కూడా ప్రారంభించాలి. – సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకు నూతన ఇసుక విధానం
ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి.. ప్రజల సూచనలు, సలహాలు పొందాలి. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండరాదు. పూర్తి పారదర్శక విధానం ఉండాలి. ధర కూడా రీజనబుల్‌గా ఉండాలి. సరఫరాలో సమర్థతను పెంచాలి. నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలి. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి నిబంధనల మేరకు ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టర్ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల వారి ఇళ్లకు టోకెన్లు ఇచ్చి, సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలి. –సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన ఇసుక విధానం రూపొందించాలని సూచించారు. నూతన ఇసుక విధానంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందం, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఇసుక రీచ్‌లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుంది. రవాణా వ్యయం ఎక్కువగా ఉంది. అది రీజనబుల్‌గా ఉండాలి. నూతన ఇసుక విధానంపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు – చలాన కట్టి, ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలి. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారించాలి. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) రంగ ప్రవేశం చేస్తుంది. – స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూడా కూపన్లు ఇచ్చి.. సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలి. – ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీహెచ్సీల్లోనూ ఆక్సిజన్ బెడ్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మరణాలు తగ్గించడంలో భాగంగా సామాజిక ఆసుపత్రుల్లో కూడా (సీహెచ్‌సీ) ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జ్వరం, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారి కోసం సీహెచ్‌సీ స్థాయిలోనే 5–10 బెడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఒకస్థాయి కేసులకు సీహెచ్‌సీలోనే వైద్యం అందించాలని, పరిస్థితి విషమిస్తే కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆస్పత్రులు, కోవిడ్ సెంటర్లలో భోజనం, పారిశుధ్యంపై ఆరా ► వైద్యం, మందులు, పారిశుధ్యం, భోజనం.. తదితర అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ► డాక్టర్ వైఎస్సార్ టెలీమెడిసిన్ ద్వారా మందులు పొందిన వారికి ఫోన్‌చేసి సేవల గురించి అడిగి తెలుసుకోవాలి. ► వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయా? లేదా అనే దానిపై అధికారులు పర్యవేక్షించాలి. లోపాలను సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి. ► అధికారులు స్పందిస్తూ.. మెనూ కచ్చితంగా అమలుచేసేలా చూస్తున్నామని.. దీనివల్ల నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోందని వివరించారు. ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌పై కూడా శ్రద్ధపెట్టామని చెప్పారు. ► అలాగే, సీఎం ఆదేశాల మేరకు 110 కోవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు పెట్టామన్న అధికారులు, మిగిలిన చోట్ల కూడా త్వరలో ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు బాగా చేస్తున్నాం ► క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లో 85–90 శాతం పరీక్షలు కొనసాగుతున్నాయి. ► 104, 14410 తదితర కాల్ సెంటర్ల పనితీరు సమర్థవంతంగా ఉండాలి. ► ప్రజలు ఏ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసినా వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి. ► అధికారులు అప్పుడప్పుడూ ఈ కాల్ సెంటర్లకు ఫోన్‌చేసి అవి సమర్థవంతంగా ఉన్నాయా? లేదా అన్నది పరిశీలించాలి. ► కాల్ సెంటర్ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తంచేయాలి. కోవిడ్ చికిత్సపై విస్తృత ప్రచారం ► కోవిడ్ సోకిందని అనిపిస్తే ఏం చేయాలన్న దానిపై అన్ని ప్రభుత్వాస్పత్రుల వద్ద హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలి. ► కోవిడ్ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోండి. ► ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలి. ► ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలి. ► గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎంలు ఆరోగ్యమిత్రలుగా.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా ఉండాలి. దీంట్లో వలంటీర్ భాగస్వామ్యం కూడా ఉండాలి. ► స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు విద్యాకానుకతోపాటు మాస్కులు కూడా ఇవ్వాలి. ► ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5 వేలు ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరణాల రేటు తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ మరణాల రేటు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. దీనికి సంబంధించిన వైద్యం క్షేత్రస్థాయికి చేరాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ.. ► తీవ్ర లక్షణాలు ఉన్న వారిపై, మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ► జ్వరం వచ్చి, శ్వాసకోస సమస్యలతో బాధపడితే, ఆక్సిజన్ లెవల్ పడిపోతే.. వెంటనే ఆస్పత్రిలో చేర్పిస్తున్నాం. ► అలాంటి లక్షణాలు ఉన్న వారిపై వెంటనే స్థానికంగా ఉండే ఏఎన్ఎంకు, వైద్యులకు సమాచారం ఇవ్వమని ప్రచారం చేస్తున్నాం. -
బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు.. నెలాఖరుకు భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 52 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆయా బోర్డు డైరెక్టర్ల నియామకాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి కార్పొరేషన్లో 7–12 మంది డైరెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ఆయా వర్గాలకు అందుతున్నాయా? లేదా? అనే విషయంతో పాటు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సోమవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని కార్పొరేషన్లకు ఒకే భవనం నిర్మించాలని ఆదేశించారు. ఆయా వర్గాల వారికి ఆయా కార్పొరేషన్లు మార్గదర్శకంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకువస్తున్నాం. ► 18 నెలల్లోగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను తీసుకురావడానికి కార్యాచరణ చేపడుతున్నాం. ► వారి స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ► జర్మనీ లాంటి దేశాలకు చెందిన అనేక పెద్దపెద్ద సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ► కార్పొరేషన్ల కింద ఉన్న వివిధ వర్గాల వారికి ఈ ప్రయోజనాలు అందేలా చూడాలి. ► అందరికీ నైపుణ్యాభివృద్ధి అందేలా చూడాలి. ► ప్రతి కార్పొరేషన్‌లోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధి ఉండాలి. బీసీలకు ఎవరూ చేయనంతగా లబ్ధి ► రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు ఇప్పటివరకు ఎవరూ చేయనంతగా లబ్ధి చేకూర్చాం. ► రూపాయి లంచం తీసుకోకుండా.. వివక్ష చూపకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నాం. ► నేరుగా నగదు బదిలీ కింద ప్రయోజనం అందించాం. ► ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్లను వివిధ పథకాల కింద నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించాం. ► ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా ఎప్పుడూ ఎవరూ పనిచేయలేదు. ► 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూతను అమలుచేస్తున్నాం. ► ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది మహిళలు ఆ పథకంలో లబ్ధి పొందుతారు. ► అందులో సింహభాగం లబ్ధి బీసీ మహిళలకు జరుగుతుంది. ► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వారికి మేలు చేస్తున్నాం. ► సంచార జాతుల సమస్యలను వెంటనే కమిషన్ దృష్టికి పంపించాలి. గతంలో ఎన్నికలకు ముందు మొక్కుబడిగా చర్యలు ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నికలకు ముందు హడావుడిగా 13 కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తూ కంటితుడుపు చర్యలు తీసుకున్న విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. వాటిలో కూడా చాలావరకు ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. కానీ, ఇప్పుడేమో జనాభా, వారి స్థితిగతులను ప్రాతిపదికగా తీసుకుని ఈ కార్పొరేషన్లు ఏర్పాటుచేసినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారులు వివరించారు. చర్చకు వచ్చిన ఇతర అంశాలు.. ► కనీసం 30–35 వేల జనాభా ఉన్న కులానికి కార్పొరేషన్ ఏర్పాటు. ► ప్రతీ కులానికీ ఏదో ఒక కార్పొరేషన్లో చోటు. ► పది లక్షలకు పైబడి జనాభా ఉన్న కార్పొరేషన్లు 6, లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు 27, లక్ష లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు 19 ఏర్పాటు. ► లోతుగా అధ్యయనం చేసి మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడానికి నిర్ణయం. ► కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలే పరిగణలోకి తీసుకోగా, ఇప్పుడు మొత్తం 139 కులాలు ఆయా కార్పొరేషన్లలో చేరాయి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వేణుగోపాలకృష్ణ, పొన్నాడ సతీష్, విడదల రజని, జోగి రమేష్, పి.ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజు, బుర్రా మధుసూదన్ యాదవ్, గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-
ఉపాధి కల్పనే.. గీటురాయి
సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనే పరిశ్రమల లక్ష్యం కావాలని, ఆ దిశగా ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలకే ప్రోత్సాహకాలు అందేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంత మందికి ఉపాధి లభించిందనే అంశం ఆధారంగానే వాటికి రాయితీలు ఇవ్వాలన్నారు. స్థానికంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సూక్ష్మ, చిన్న పరిశ్రమలను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. వాటికి పునరుద్ధరణ, చేయూత ఇవ్వడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో 2020–23 పారిశ్రామిక విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 2020–23 పారిశ్రామిక విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా విశాఖపట్నంలో హైఎండ్ ఐటీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఐటీ రంగంలో ఈ యూనివర్సిటీ గొప్ప మలుపు అవుతుంది. ఈ యూని వర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, బోధన అంశాలపై ప్రఖ్యాత ఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎక్స్టెన్షన్ మోడల్స్‌పై దృష్టి పెట్టాలి. పరిశ్రమలు పెట్టే వారికి ఉద్యోగాల కల్పన ఆధారంగా రాయితీలు ఇచ్చేలా పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలి. స్థానికులను వాచ్మెన్, అటెండర్లుగా తీసుకుని.. వారికి శిక్షణ ఇచ్చి పై స్థాయికి తీసుకెళ్తే మరింత బోనస్ ఉండాలి. కాలుష్య నివారణ చాలా ముఖ్యం ►కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పరిశ్రమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి నుంచి కాలుష్య కారక పదార్థాలు వాతావరణంలోకి రాకుండా చూడడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం బలోపేతమైన విధానాలను పాటించాలి. ► ఉద్యోగాల కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధిని సాధించడంపై పారిశ్రామిక పాలసీ దృష్టి సారిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు మరింత మెరుగ్గా నడిచేలా చేయడంతో పాటు విదేశీ పెట్టుబడులపైనా దృష్టి పెడుతున్నామన్నారు. ► మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కీలక చర్యల ద్వారా పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిశ్రమల స్థాపన కాలాన్ని తగ్గించడంలో భాగంగా మౌలిక సదుపాయాల వృద్ధి, వెనుకబడిన వర్గాల సామాజికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు పారిశ్రామిక పాలసీలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. -
పర్యాటకానికి రాష్ట్రం పర్యాయ పదం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ పర్యాయ పదం కావాలని, ఇందుకు అనుగుణంగా వెంటనే కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ దిశలో టూరిజమ్ ట్రేడ్ రెగ్యులేషన్ ప్రక్రియ కొనసాగాలని, పర్యాటకానికి సంబంధించిన అన్నింటి రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్దేశించారు. విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలన్నారు. మన పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిపాదనలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని శిల్పారామాలను పునఃసమీక్షించాలని, వాటిని అందంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. కొత్త టూరిజమ్ పాలసీ ► ఈ ఏడాది మార్చి 31తో రాష్ట్రంలో పర్యాటక విధానం ముగిసినందున వెంటనే కొత్త విధానాన్ని రూపొందించాలి. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ పర్యాయ పదం అనే దిశలో కొత్త విధానం ఉండాలి. రెగ్యులేషన్ ఆఫ్ టూరిజమ్ ట్రేడ్ ► పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. అందువల్ల వెంటనే అన్నింటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలి. ► పర్యాటక రంగంలో ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజమ్ అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, ఆయా చోట్ల ఉన్న సదుపాయాలు వంటి అన్నింటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలి. శిల్పారామాల అభివృద్ధి ► రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న శిల్పారామాలను పునఃసమీక్షించాలి. వాటిని అందంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలి. వాటిలో పదే పదే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ దిశగా వాటి అభివృద్ధితో పాటు అవసరమైన మార్పులు చేయాలి. ► సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 7 స్టార్ సదుపాయాలు ఉండాలి ► విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే అన్ని చోట్ల 7 స్టార్ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేయాలి. ► రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇచ్చి, వారి ప్రతిపాదనలను కూడా తీసుకోవాలి. ఆ తర్వాతే దేన్నైనా ఖరారు చేయాలి. ► పెట్టుబడులకు ఆయా సంస్థలు ముందుకు వచ్చేలా విధి విధానాలు ఉండాలి. కనీసం 10–12 ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల పూర్తి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలి. ► రాజస్థాన్‌కు ఎక్కువ మంది టూరిస్టులు ఎందుకు వెళుతున్నారని పరిశీలిస్తే అక్కడ పెద్ద పెద్ద హోటళ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయి. అందువల్ల అదే స్థాయిలో రాష్ట్రంలో కూడా పర్యాటక ప్రాంతాల్లో మంచి వసతులతో హోటళ్లు ఏర్పాటు కావాలి. ► ప్రస్తుతం ఏయే జిల్లాలో ఎన్ని హోటళ్లు ఉన్నాయి..5 స్టార్ ఎన్ని? 4 స్టార్.. 3 స్టార్.. 2 స్టార్.. సింగిల్ స్టార్ హోటళ్లు ఎన్నున్నాయో గుర్తించి వాటిని మ్యాపింగ్ చేయాలి. వాటి వివరాలు టూరిస్టులకు అందుబాటులో ఉంచాలి. -
ఏపీ: అసెంబ్లీ నిర్వహణపై కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమీక్షలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసన మండలి చైర్మన్ షరీఫ్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్‌లు శ్రీనివాసులు, ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. (శాసనకర్తలూ.. ఇవి పాటించండి!) ప్రత్యేక జాగ్రత్తలు.. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అసెంబ్లీ,మండలిలోని ప్రతి సీటును శానిటేషన్ చేస్తున్నామన్నారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భద్రత ను కట్టు దిట్టం చేసి సభ్యులు మినహా ఎవ్వరిని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని వెల్లడించారు. శాసన సభ్యుల సిబ్బందికి బయట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భౌతిక దూరం పాటించి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్ వెల్లడించారు. (అసాధారణ రీతిలో అసెంబ్లీ సమావేశాలు) ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు:శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఇలా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రేపు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సభ ఎన్ని రోజులు జరగాలన్నది బీఏసీలో నిర్ణయిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
హద్దు మీరుతున్న డ్రాగన్
డ్రాగన్ బుసలు కొడుతోంది భారత్ సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది సైనిక బలగాల్ని పెంచి హెచ్చరికలు పంపిస్తోంది 2017 నాటి డోక్లామ్ తరహా వివాదాన్ని రాజేస్తోంది కరోనాతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న సమయంలో చైనా ఎందుకీ రంకెలు వేస్తోంది ? న్యూఢిల్లీ/బీజింగ్: తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ కొందరిని గాయాలపాలు చేసింది. లదాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా ఇటీవల 100 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది. సిక్కిం, టిబెట్లను కలిపే నుకులా పాస్ మార్గంలోనూ ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తోంది. కరోనా వైరస్‌ని అడ్డం పెట్టుకొని భారత్‌లోని చైనీయుల్ని వెనక్కి రప్పిస్తోంది. భారత్‌కు కేవలం 3 కి.మీ. ఆవల పాంగాంగ్ సరస్సు సమీపంలోని 1,200 నుంచి 1,300 సైనికుల్ని మోహరించింది. మొత్తంగా భారత సరిహద్దుల్లో 5 వేలమంది వరకు సైనికుల్ని మోహరించింది. చైనా చర్యలతో భారత్ కూడా అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ మీదుగా బలగాలను పటిష్టం చేసింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పరిస్థితుల్ని లోతుగా విశ్లేషించడానికి భారత ఆర్మీ టాప్ కమాండర్లు బుధవారం నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మోదీ ఉన్నతస్థాయి సమీక్ష భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరం కావడం, టిబెట్‌లో వైమానిక స్థావర విస్తరణ పనుల శాటిలైట్ చిత్రాలు బయటకి వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. దీంతోపాటు లదాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్, త్రివిధ దళాధిపతులతోపాటు విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లాతోనూ చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదు భారత్, చైనా సరిహద్దుల్లో 3,500 కిలో మీటర్ల ప్రాంతంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుల్ని ఆపేయాలంటూ చైనా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోబోమని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు కొద్ది రోజులుగా ఆరు దఫాలుగా జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో వరస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. లదాఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ సరిహద్దుల్లో నిర్మిస్తున్న కీలకమైన ప్రాజెక్టులేవీ ఆపాల్సిన పని లేదని రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో స్పష్టం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వైమానిక స్థావరం విస్తరణ లదాఖ్ సరిహద్దుల్లో చైనా ఒక వైమానిక స్థావరాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. మే 5న భారత్, చైనా మధ్య సైనికులు ఘర్షణ పడిన పాంగాంగ్ సరస్సు ప్రాంతానికి 200 కి.మీ. దూరంలో ఎయిర్ బేస్ నిర్మాణ పనులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 6న తీస్తే, రెండోది మే 21న తీశారు. హెలికాప్టర్లు దిగడానికి వీలుగా నిర్మించిన ట్రాక్ రెండో చిత్రంలో చూడొచ్చు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన జే–11 లేదంటే జే–16 యుద్ధ విమానాలు నాలుగు వరసగా ఉండడం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కలవరాన్ని పెంచుతున్నాయి. యుద్ధ సన్నద్ధతను పెంచుకోండి సైన్యానికి జిన్‌పింగ్ పిలుపు యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలని సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశమిచ్చారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), పీపుల్స్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ ప్లీనరీ సమావేశానికి హాజరైన సందర్భంగా జిన్‌పింగ్ ఈ పిలుపునిచ్చారు. ‘‘అత్యంత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శిక్షణ, సన్నద్ధతను పెంచుకోవాలి. సంక్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి’’ అని కోరినట్టు అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. చైనా–భారత్ మధ్య సరిహద్దుల్లో సున్నిత పరిస్థితుల నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ పిలుపునివ్వడం గమనార్హం. ఆ ఆక్రోశం వెనుక.. 1 దేశ సరిహద్లుల్లో మౌలిక సదుపాయలు పెంచుకుంటూ, సైనికులకు మెరుగైన వసతులు కల్పించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. భారత్ కూడా అదే వ్యూహంతో సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో సైనిక శిబరాలు ఏర్పాటు చేసి బలగాల్ని పెంచుతోంది. మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ సాంకేతికంగా కొత్త పరికరాలను సైన్యానికి అందుబాటులోకి తెచ్చి డ్రాగన్ దేశానికి సవాల్ విసురుతోంది. గాల్వన్ వ్యాలీలో దర్బాక్–షోయక్ నుంచి తూర్పు లదాఖ్‌లో దౌలత్ బేగ్‌ను కలుపుతూ రోడ్డు నిర్మించింది. ఇవన్నీ చైనాకి కంటగింపుగా మారాయి. 2 కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని పదే పదే ఆరోపిస్తున్న అమెరికా ప్రపంచంలో చైనాని ఏకాకిని చేయడానికి భారత్ వంటి దేశాల సహకారం తీసుకుంటోంది. వైరస్ పుట్టుక, ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం వంటి అంశాలపై విచారణ జరిపించే తీర్మానానికి భారత్, మరో 62 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చేతులు కలపొద్దని చెప్పడానికే లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని రాజేసి భారత్‌కు ఒక హెచ్చరికలా చైనా పంపుతోంది. 3 కరోనా వైరస్ వ్యాప్తి అంశంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిదంటూ ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న విమర్శలు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పేరుప్రతిష్టల్ని దెబ్బ తీశాయి. అందుకే ఆ విషయం నుంచి దృష్టిని మరల్చడానికి దక్షిణాసియాలో పట్టు బిగించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గత కొన్ని వారాల్లో భారత్‌తో తగాదాలకు దిగుతోంది. 4 కశ్మీర్ అంశంలో ఎప్పుడూ పాకిస్తాన్‌కు కొమ్ముకాసే చైనా ఇప్పుడు లదాఖ్ సరిహద్దుల్లో ఎన్నడూ అడుగు పెట్టని గ్వాలన్ లోయలోకి కూడా సైనికుల్ని పంపిస్తోంది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ భూభాగాలను నేపాల్ తన మ్యాపుల్లో చూపించడం వెనుక చైనా ప్రమేయం ఉంది. హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా కొత్త భద్రతా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇలా ఆసియాలో ఏదో విధంగా ఉద్రిక్తతల్ని రాజేసే చర్యల్ని చేపడుతోంది. భారత్, చైనా సరిహద్దులు ఇలా .. ► భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్ల కింద విభజిం చారు. వీటిలో పశ్చిమ సెక్టార్ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్ల కి కేంద్ర బిందువుగా ఉంటోంది. ► కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటారు. ► హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్ ఉంది. ► తూర్పు సెక్టార్లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ సెక్టార్ సరిహద్దు. -
ముమ్మరంగా.. ధాన్యం కొనుగోళ్లు
వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను సేకరించడంతో పాటు మార్కెట్ కల్పించేలా చూడాలి. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాన్‌ను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను ఉధృతం చేయాలని, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు. కోవిడ్–19 విపత్తు నేపథ్యంలో రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎంఫాన్ తుపాన్ సంసిద్ధత అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. సర్వసన్నద్ధంగా ఉండాలి ► తుపాను ఏపీ వైపు వస్తే ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉండాలి. తుపాను కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించాలి. విద్యుత్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్య శాఖ సన్నద్ధంగా ఉండాలి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి. ► వేట నిషేధ సమయమే అయినప్పటికీ.. బోట్లలో సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. తుపాన్‌ను ఎదుర్కోవడానికి, తగిన చర్యల కోసం కొంత మంది అధికారులను సిద్ధం చేసుకోవాలి. ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ► తుపాన్ దృష్ట్యా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. ధాన్యం సేకరణలో మరింత ఉధృతంగా ఉండాలి. కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకూ కొనుగోలు చేయాలి. వర్షాల వల్ల దెబ్బ తినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలి. ► ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిషబుల్ గూడ్స్ (త్వరగా పాడయ్యేవి)ను ఈ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. -
మరికొన్ని రోజులు సహకరించాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితరులు హాజరయ్యారు. (కరోనా@తెలంగాణ: 1001కి చేరిన కేసులు) మరికొన్ని రోజుల వరకు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు(సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు సరిగ్గా అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యలను ఆరా తీశారు. కంటైన్మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాల సరుకులు అందచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మరణాలు రేటు జాతీయ సగటు కన్నా తక్కువ వుండడం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగించడంతో పాటు.. ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని సీఎం అన్నారు. ‘‘సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశ వ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా రేపటి కాన్ఫరెన్స్ లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
అత్యవసర కేసుల్లో వెంటనే స్పందించాలి
-
కోవిడ్ పరీక్షల్లో.. మరింత దూకుడు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 పరీక్షలను వీలైనంత ఎక్కువగా క్రమంగా పెంచాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షలు చేసే విషయంలో ఎక్కడా వెనకడుగు వేయరాదని, రోజు రోజుకూ పరీక్షల సంఖ్య పెరుగుతూ పోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పరీక్షల సంఖ్యను బాగా పెంచినందుకు అధికారులను అభినందించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరు తెన్నులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు పేర్కొన్న అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. టెస్ట్‌లు బాగా జరుగుతున్నాయి.. ♦ కోవిడ్ లక్షణాలున్న వారికి త్వరతగతిన టెస్ట్‌లు జరిగేలా చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో చేసిన ర్యాండమ్ పరీక్షల్లో సుమారు 30కిపైగా కిట్లలో పాజిటివ్ వచ్చాయని, వాటి నిర్ధారణ కోసం పీసీఆర్ టెస్టులకు పంపామని చెప్పారు. ♦ టెలిమెడిసిన్ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సింగపూర్, చైనాల్లో మరోసారి వైరస్ వ్యాప్తి ప్రారంభమైందన్నారు. అత్యవసర కేసుల్లో వెంటనే స్పందించాలి ♦ తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలి. 104కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలి. డెలివరీ, ఇతరత్రా ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలి. ♦ ఎక్కడా వెనకడుగు వేయకుండా టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలి. ♦ నాడు–నేడు ద్వారా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు ఊపందుకునేలా చూడాలి. ప్రతిపాదిత కొత్త మెడికల్ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలి. ♦ ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్ చేయాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా పంటలు, ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లోని రైతులు ఏమైనా ఇబ్బందులుంటే అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. ♦ 100 రూపాయలకు వివిధ రకాల పండ్లు ఇవ్వటాన్ని కొనసాగించాలి. ఇది శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలి. తప్పుడు కథనాలపై చర్చ ♦ గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన బొల్లా వీరాంజనేయలు రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంటను పొలంలో వదిలేశారని.. కడప నుంచి తెప్పించిన అరటి విజయవాడలో రైతు బజార్లకు చేరక కుళ్లిపోతోందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథకాలపై చర్చ జరిగింది. ♦ఈ రెండు కథనాలూ.. తప్పుడు సమాచారం అని అధికారులు సీఎంకు నివేదించారు. కర్బూజా పంట పండించిన రైతు కుటుంబంతో మాట్లాడామని చెప్పారు. ఇప్పటికే రెండు కోతలు కోసి పంటను తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని చెప్పారన్నారు. మూడో కోతలో నాసిరకం కాయలుండటంతో వదిలేశామని, వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆ కుటుంబం తెలిపిందని అధికారులు వివరించారు. ♦ కడప నుంచి విజయవాడకు తెప్పించిన అరటి గెలలను స్థానిక మార్కెట్లకు పంపించామని చెప్పారు. ఎక్కడా అరటి గెలలను వదిలేయలేదని స్పష్టం చేశారు. ♦ అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా ఇష్టం వచ్చినట్టు కేసులు, మరణాల సంఖ్యను చూపిస్తున్నారనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అధికారులు వివరించారు. ♦ సమీక్షా సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కరోనా లక్షణాలున్న అందరికీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదలకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామని, వ్యాధి సోకినవారు కలసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్‌లో ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో, వ్యాధి సోకిన వారికి వైద్యం అందించే విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తోంది. (కరోనా: ఆ జిల్లాలు జాగ్రత్త!) వారి భద్రతలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరీక్షలకు, వైద్యానికి వస్తున్న వారికి సరిపడా టెస్ట్ కిట్స్, పీపీఈలు, మాస్కులు, మందులు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా మాస్కులు, పీపీఈలు సేకరిస్తాం’అని సీఎం ప్రకటించారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు వస్తున్న విరాళాలను కూడా వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పీపీఈలు, మందుల కొనుగోలుకు వాడాలని కోరారు. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బంది రావద్దు.. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘లాక్డౌన్ కారణంగా జనజీవనం స్తంభించింది. అయినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని, వారు ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మార్కెట్లలో రద్దీని నివారించడానికి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరి కోతలు, ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరగాలి. వరికోతలకు రైతులు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితిని గ్రామాల్లో కల్పించాలి. హార్వెస్ట్ పరికరాలను బిగించే మెకానిక్‌లకు ప్రత్యేక పాసులిచ్చి అనుమతించాలి. స్పేర్ పార్ట్స్ అమ్మే షాపులను తెరవడానికి అనుమతి ఇవ్వాలి. గ్రామస్తులు తమ గ్రామాల్లోకి హార్వెస్టర్లను రానివ్వాలి. ఆ తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే వాహనాలకు అనుమతివ్వాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఒకేసారి రాకుండా చూడాలి. వారికిచ్చిన కూపన్లలో పేర్కొన్న తేదీ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా రైతులను చైతన్యపరచాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కావల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. రైతుల దగ్గరి నుంచి చివరి గింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులెవరూ తొందరపడొద్దు’అని సీఎం కోరారు. గన్నీ బ్యాగుల కోసం ప్రధానికి ఫోన్ రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు తీవ్ర కొరత ఉంది. గన్నీ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు పశ్చిమబెంగాల్లో ఉన్నాయి. ఏటా అక్కడి నుంచే బ్యాగులు వస్తాయి. ఈసారి లాక్డౌన్ కారణంగా బెంగాల్లో పరిశ్రమలు మూతపడటంతో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమలను తెరిపించాలని, గన్నీ బ్యాగులు రాష్ట్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రాష్ట్రానికి గన్నీ బ్యాగులు చేర్చే విషయంలో సంబంధిత శాఖలతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. (ఒకే ఇంట్లో భర్త నుంచి భార్యకు పిల్లలకు..) -
ఈ సారికి పాత పథకమే..!
-
ఈ సారికి పాత పథకమే..!
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీ సర్కార్ నిర్ణయం - మార్చి ఆఖరులోగాఫీజుల చెల్లింపు - సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష - శుక్రవారం మరోసారి భేటీ కానున్న సబ్‌కమిటీ హైదరాబాద్: విద్యార్థుల ‘ఫీజు రీయింబర్స్మెంట్’కు ఈ ఏడాదికిగాను పాత మార్గదర్శకాలనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల చివరలోగా కాలేజీల రిజిస్ట్రేషన్‌ను, వచ్చేనెలలో విద్యార్థుల గుర్తింపు, వారి ఫీజుల చెల్లింపును పూర్తి చేయాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నాటికి మారిన పరిస్థితులకు అనుగుణంగా ‘ఫీజు’ మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయానికి వచ్చింది. ‘ఫాస్ట్’ పథకంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర సర్కారు... ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలకు పలు సవరణలు చేసి అమలుచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, టి.రాధా, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరుగనున్న మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఫీజుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించి, వాటి ఆధారంగా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని భేటీలో నిర్ణయించారు. అనంతరం మార్గదర్శకాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆమోదం తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారం రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు వెలువడవచ్చని సమాచారం. ఇక ముందు పకడ్బందీగా.. 2015-16 నుంచి బోగస్ కాలేజీలు, విద్యార్థులకు అడ్డుకునేందుకు పక్కా నిబంధనలను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ప్రతి కాలేజీ నుంచి నెలవారీగా విద్యార్థుల ప్రతిభ, హాజరు నివేదికలతో పాటు తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఈ-పాస్‌లో విద్యార్థుల అడ్మిషన్ సమయంలోనే ఆధార్ తీసుకుని... బోగస్ కాలేజీల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఏడాదిలో 12-13 లక్షల వరకు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని.. దీనికి రూ. 2,200 కోట్లు కావాలని అధికారుల అంచనా. వచ్చే ఏడాదే కొత్త నిబంధనలు: కడియం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కొత్త నిబంధనలను 2015-16 నుంచే అమలుచేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుత అడ్మిషన్ల విధానంలోనే మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. అధికారులతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల్లో కొందరు కాలేజీలకు వెళ్లడం లేదని, కొంత మంది పరీక్షలు కూడా రాయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. వారి పేర్లు కేవలం రోల్స్‌లో కొనసాగుతున్నాయని.. అలాంటి వారికి ‘ఫీజు’ ఇవ్వబోమని చెప్పారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో పది వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు ‘ఫీజు’ పథకం వర్తించేలా నిబంధన ఉండిందని.. తెలంగాణ ఏర్పాటుతో విద్యార్థుల సంఖ్య తగ్గే నేపథ్యంలో దానిపై ఏం చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిపొందే విద్యార్థులకు స్థానికతను 371-డీ ప్రకారం నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీహరి చెప్పారు. ప్రస్తుత చదువుతున్నదాని కంటే నాలుగేళ్లు వరుసగా ఇక్కడే చదవడం, గత ఏడేళ్లలో మెజారిటీ భాగం ఇక్కడే చదివి ఉండాలనే నిబంధనను పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు.