కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేయడం ద్వారా ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో ఇటీవల వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, పలువురు ముష్కరులతోపాటు భద్రతా సిబ్బంది సైతం మరణించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆదివారం భద్రతా దళాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
తాజా పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలని ఆదేశించారు. కశీ్మర్ లోయలో చేపట్టిన జీరో–టెర్రర్ ప్రణాళికలతో మంచి ఫలితాలు వచ్చాయని, జమ్మూ డివిజన్‌లో సైతం అమలు చేయాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.
ఈ యాత్రకు పటిష్టమైన భద్రత కలి్పంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అమిత్ షా ఆదేశించారు. యాత్ర విషయంలో అధికారుల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశీ్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, సీఆర్‌పీఎఫ్ డీజీ అనీ‹Ùదయాళ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఇకపై ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment