3 కేటగిరీల్లో వలంటీర్ల సేవకు పురస్కారాలు | YS Jagan decided to give awards for volunteer service in 3 categories | Sakshi
Sakshi News home page

3 కేటగిరీల్లో వలంటీర్ల సేవకు పురస్కారాలు

Published Sat, Feb 27 2021 3:21 AM | Last Updated on Sat, Feb 27 2021 11:42 AM

YS Jagan decided to give awards for volunteer service in 3 categories - Sakshi

పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో గ్రామ, వార్డు వలంటీర్లకు మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి, ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. 

సాక్షి, అమరావతి: తన ఆత్మీయులుగా భావిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్‌ చెల్లెమ్మలు, తమ్ముళ్ల సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి, ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు. పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు పురస్కార కార్యక్రమం వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మూడు కేటగిరీల్లో పురస్కారాల ఎంపికకు నిర్దేశించిన అర్హతల వివరాలను అధికారులు 
వెల్లడించారు.

ఎంపిక ఇలా..  
సచీ్ఛలత, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్‌ –19 సర్వే తదితర అంశాలు ఎంపికకు ప్రామాణికంగా 
తీసుకుంటారు. 
1వ కేటగిరి: ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, రూ.10 వేల నగదు బహుమతి. 
2వ కేటగిరి: ప్రతి మండలం, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక. వీరికి సేవా రత్న పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి. 
3వ కేటగిరి: ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్‌తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement