గాంధీనగర్: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా ఆచూకీ గల్లంతైన క్రమంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మోర్బీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ వేదికగా ఈ రీవ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జి కూలిపోయినప్పటి నుంచి తీసుకుంటున్న సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లను ప్రధానికి వివరించారు అధికారులు. ఈ విషాదానికి కారణమైన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలోని బాధితులకు అన్ని విధాల సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: మోర్బీ ఘటన.. మరో వంద మందికిపైగా జలసమాధి!
Comments
Please login to add a commentAdd a comment