గాంధీనగర్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనాస్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మంగళవారం సాయంత్రం మోర్బీ పర్యటనకు వెళ్లిన ఆయన.. ప్రమాదం జరిగిన స్థలంలో కలియదిరిగారు. ఆ సమయంలో ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఈ సందర్భంగా.. అధికారులతో ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ప్రధాని.
అనంతరం మోర్బీ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. త్వరగా బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి చెందిన కుటుంబాలను ప్రధాని మోదీ కలిసి సంఘీభావం తెలపనున్నారు.
Prime Minister Narendra Modi, along with Gujarat CM Bhupendra Patel, visits the incident site in Morbi, Gujarat, while the search and rescue operation is underway in the Machchhu river.
— ANI (@ANI) November 1, 2022
Death toll in the incident stands at 135 so far. pic.twitter.com/JefTWaTiNL
#WATCH | PM Modi along with Gujarat CM Bhupendra Patel visits the cable bridge collapse site in Morbi, Gujarat
— ANI (@ANI) November 1, 2022
135 people lost their lives in the tragic incident pic.twitter.com/pXJhV7aqyi
Gujarat | Prime Minister Narendra Modi met the injured admitted to Morbi Civil Hospital.#MorbiBridgeCollapse led to the deaths of 135 people so far. pic.twitter.com/UaKF2XcbCP
— ANI (@ANI) November 1, 2022
#WATCH | PM Modi meets the injured in the #MorbiBridgeCollapse incident that happened on October 30
— ANI (@ANI) November 1, 2022
(Source: DD) pic.twitter.com/26tXlAvnmJ
అక్టోబర్ 30న సాయంత్రం సమయంలో గుజరాత్ మోర్బీలోని మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తెగిపోవడంతో.. వందల మంది నీళ్లలో పడిపోయారు. ఘటనలో 140 మంది దాకా మృతి చెందగా.. పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని సమాచారం. మచ్చు నదిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment