absent
-
ఉద్యోగులకు ఊరికే జీతాలు.. బాబు గారి కొత్త స్కీమ్
-
Delhi Liquor Policy Case: ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నూతన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ కార్యాలయానికి పిలవగా గరువారం ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు మరో తేదీతో సమన్లు జారీచేసే అవకాశముంది. విచారణకు పిలిచి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న ఆప్ ఆరోపణల నడుమ గురువారం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ ఎదుట పెద్దసంఖ్యలో ఆప్ కార్యకర్తలు గుమిగూడారు. ఉద్రిక్త పరిస్థితుల నివారణ కోసం ముందస్తుగా కేంద్రం పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను ఈడీ ఆఫీస్, బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మోహరించింది. ఈ కేసును వచ్చే 6–8 నెలల్లోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్ వారికి సూచించిన నేపథ్యంలో ఈడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశముంది. చట్టవ్యతిరేకం, కక్షపూరితం ఈడీ ఆఫీస్‌కు గైర్హాజరైన సందర్బంగా దర్యాప్తు సంస్థకు కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. ‘ నాకు పంపిన ఈ సమన్లు పూర్తిగా చట్టవిరుద్ధం. కక్షపూరితం. రాజకీయ ప్రేరేపితం. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించింది. వీటిని ఉపసంహరించుకోండి. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇçప్పుడీ సమన్లు పంపారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం ఉందని సమన్లు పంపారు? సాక్షిగానా లేక నిందితుడిగానా అనేది అందులో లేదు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు పంపారా? లేదంటే ఆప్ కన్వీనర్ అయినందుకు పంపారా?’ అని లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘కేజ్రీవాల్‌కు సమన్లు పంపి అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు అక్టోబర్ 30న అన్నారు. అదేరోజు సాయంత్రం యాధృచ్ఛికంగా ఈడీ సమన్లు ఇచ్చింది’ అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఈడీ ఆఫీస్‌కు రాకుండా కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి సింగ్రౌలీ నియోజకవర్గంలో ఎన్నికల రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ‘నన్ను అరెస్ట్‌చేస్తారని ఢిల్లీ కోడైకూస్తోంది. ఈడీ అధికారులు నన్ను అరెస్ట్ చేయగలరుగానీ నా ఆలోచనలను అరెస్ట్ చేయలేరుకదా. నా సిద్ధాంతాలతో ఏకీభవించే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది, కోట్లాది అభిమాన కేజ్రీవాల్‌లను అరెస్ట్ చేయలేరు’ అని ర్యాలీలో కేజ్రీవాల్ అన్నారు. ‘ఇండియా’ కూటమిని దెబ్బతీసేందుకు యత్నం: ఆప్ ‘ఇండియా’ కూటమిని దెబ్బ కొట్టాలంటే ఢిల్లీలో కొరకరాని కొయ్యలా ఉన్న కేజ్రీవాల్‌ను ముందు అరెస్ట్చేయాలనేది బీజేపీ ప్రణాళిక. అలా అయితేనే ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ బలహీననమై సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతుందని బీజేపీ కుట్ర పన్నుతోంది’ అని ఆప్ ఆరోపించింది. నిజాన్ని ఎదుర్కోలేక పారిపోయారు: బీజేపీ కేజ్రీవాల్ గైర్హాజరుపై బీజేపీ ఎద్దేవాచేసింది. ‘ ఎక్సైయిజ్ పాలసీ విధానంలో నిజాలను వెల్లడించే ధైర్యం లేకనే కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్‌కు రాకుండా పారిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కింగ్ ఆయనే’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ‘ సాక్ష్యాలు, ఆధారాలుంటేనే ఈడీ సమన్లు జారీచేసి విచారణకు పిలుస్తుంది. మద్యం విధానం గురించి బాగా కేజ్రీవాల్‌కు బాగా తెలుసు. నిజాలు కప్పిపుచ్చే సమర్థత లేకనే, భయంతోనే ఆయన ఈడీ ఆఫీస్‌కు వెళ్లలేదు’ అని ఆయన ఆరోపించారు. -
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
బండి సంజయ్‌కు రూ.50 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీరుపై హైకోర్టు అసహనం వ్య క్తం చేసింది. కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో అడ్వొకేట్ కమిషనర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.50 వేల జరిమానా విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు కోరిన తర్వాత కూడా మళ్లీ గడువు కోరడాన్ని తప్పుబట్టింది. ఎన్నికల పిటిషన్లో విచారణను ముగిస్తామని హెచ్చరించింది. ఈ నెల 12న హాజరవుతారని ఆయన న్యాయవాది తెలపడంతో.. జరిమానాతో సరిపెట్టింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ సమీప ప్రత్యర్థి బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎ న్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ చిల్లకూర్ సుమలత మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల సాక్ష్యాలను నమోదు చేయడంకోసం న్యాయమూర్తి జూన్ లో అడ్వొకేట్ కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి శైలజను నియమించారు. అయితే పార్లమెంట్ సమా వేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినే షన్‌కు నాలుగుసార్లు గైర్హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి 6 నెలల జైలు కోర్టు ధిక్కరణ కేసులో విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రత్నారెడ్డి, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ పి.సత్యబాబులకు హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసిన రత్నారెడ్డి, అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసి వదిలేసినందుకు కమిషనర్ సత్యబాబుకు శిక్ష విధిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021, అక్టోబర్ 27 నాటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసినా చర్యలు లేవంటూ వీరిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఇటీవల తీర్పు వెలువరించారు. మంచిరేవుల గ్రామంలోని రెండు ఎకరాలను విశ్వభారతి లీజుకు తీసుకుని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. నిర్దిష్ట గడువులోగా అనుమతులు రాకపోవడంతో చట్ట ప్రకారం వచ్చినట్లుగా భావించి నిర్మాణాలు చేపట్టింది. మున్సిపాలిటీ నోటీసులు జారీ చేయడంతో రత్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అనుమతులు ఇవ్వనందున నిర్మాణాలు చేపట్టినట్లుగా పిటిషనర్ సమాచారం ఇవ్వలేదని తప్పుపట్టింది. హెచ్ఎండీఏ నోటీసుల్ని పిటిషనర్ సవాల్ చేయకుండా నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదు కాగా, ఇటీవల పైవిధంగా తీర్పు చెప్పింది. ఇదీ చదవండి: ఓవైపు పోలీసుల సమీక్ష.. మరోవైపు దొంగల చేతివాటం! -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు లక్షన్నర మంది డుమ్మా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు ఏకంగా దాదాపు 1.47 లక్షల మంది గైర్హాజరయ్యారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,09,323 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని... కానీ వారిలోనూ 2,33,248 మంది అభ్యర్థులే (61.37 శాతం మందే) హాజరైనట్లు టీఎస్పీఎస్సీ ప్రాథమికంగా వెల్లడించింది. గతేడాది నిర్వహించి పేపర్ లీకేజీ వల్ల రద్దు చేసిన ప్రిలిమ్స్‌కు 2.86 లక్షల మంది (79.15శాతం) హాజరవగా ఈసారి వారి సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగానికి పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాది మంది సది్వనియోగం చేసుకోలేకపోవడం గమనార్హం. కరెంట్ అఫైర్స్, ఎకానమీ నుంచి లోతైన ప్రశ్నలు.. ప్రశ్నపత్రం కాస్త కఠినంగానే ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రంతో పోలిస్తే కాస్త సులభంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని చెప్పారు. యూపీఎస్సీ ప్రమాణాలకు మించి ప్రశ్నలను ఇచ్చినట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరెంట్ ఆఫైర్స్, ఎకానమికీ సంబంధించి అడిగిన ప్రశ్నలు చాలా లోతుగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు సాధారణంగా రెండున్నర గంటల్లో 150 ప్రశ్నలకు జవాబిచ్చేలా... సగటున ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం చొప్పున సమయం కేటాయించేలా ప్రశ్నలు ఉండాల్సి ఉండగా ఈసారి ప్రశ్నపత్రంలో ఒక్కో ప్రశ్నను చదివి అవగాహన చేసుకునేందుకే కనీసం రెండు నిమిషాలు పట్టిందని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో ప్రశ్నలు చదివి జవాబులు ఇవ్వడం కష్టమైందని పలువురు అభ్యర్థులు అభిప్రాపడ్డారు. చాలా ప్రశ్నలకు మల్టి పుల్ జవాబులు ఉండటం అయోమయానికి గురిచేసిందని చెప్పారు. ఈసారి కటాఫ్ 70 నుంచి 75 మార్కుల మధ్యలో ఉండొచ్చని ప్రముఖ నిపుణురాలు బాలలత సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన వీడియోలో అభిప్రాయపడ్డారు. అయితే జోన్లవారీగా, కేటగిరీల వారీగా ఎంపిక ప్రక్రియ ఉండటంతో కటాఫ్ తగ్గుతుందన్నారు. కమిషన్ విడుదల చేసే ప్రాథమిక కీ అనంతరం కటాఫ్‌పై అంచనాలు వేసుకోవచ్చని, ప్రస్తుతానికి 75 మార్కులకు పైబడి వచ్చిన వారు మెయిన్ పరీక్షలకు సిద్ధం కావచ్చని చెప్పారు. ముందే బయటకు వచ్చిన అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి ఓఎంఆర్ షీట్లో తన హాల్‌టికెట్ నంబర్‌ను తప్పుగా బబ్లింగ్ చేసినందుకు హాలు నుంచి సమయం కంటే ముందే బయటకు వచ్చేశాడు. దీంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాలు తక్కువగా రాగా వాటిని అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు 14 నిమిషాల సమయం ఆలస్యమైంది. ఆ మేరకు ఆయా అభ్యర్థులకు సమయాన్ని సర్దుబాటు చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ కేంద్రంలో అరగంటకన్నా ముందే పేపర్లు తీసుకున్నారంటూ కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణ నిజం కాదని జిల్లా కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. -
మోదీ కార్యక్రమానికి యడ్డి డుమ్మా
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి (హుబ్లీ) నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం హుబ్లీ రైల్వే మైదానంలో జాతీయ యువ జనోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. పలువురు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నప్పటికీ బీఎస్ యడియూరప్ప మాత్రం కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన కొన్ని నెలలుగా పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తోందని, ప్రజల్లో వ్యక్తిగతంగా బలమున్న తనను రాజకీయంగా ఎవరూ అంతం చేయలేరని పలు సందర్భాల్లో అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తన రాజకీయ జీవితానికి ఎవరూ ఫుల్స్టాప్ పెట్టలేరని యడియూరప్ప ఒకసారి బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, యూడియూరప్ప మధ్య విభేదాలు ముదురుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించారని యడియూరప్ప రగిలిపోతున్నారు. తన అనుచరుడైన బొమ్మైని సీఎం కుర్చీలో కూర్బోబెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో పదవి లేకపోవడం వల్లే.. యడియూరప్ప అసంతృప్తిని గుర్తించిన బీజేపీ అధిష్టానం గత ఏడాది పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే, రాష్ట్ర బీజేపీలో ఆశించిన గౌరవం దక్కకపోవడంతో జనసంకల్ప యాత్రలో ఆయన పాల్గొనలేదు. పార్టీ పెద్దలు దిగివచ్చి బుజ్జగించాల్సి వచ్చింది. ఇటీవలే మాండ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు యడియూరప్ప డుమ్మా కొట్టారు. తాజాగా ప్రధాని మోదీ హుబ్లీ పర్యటనకు సైతం దూరంగా ఉండిపోయారు. రాష్ట్ర బీజేపీ వాదన మరోలా ఉంది. జాతీయ యువజనోత్సవానికి మాజీ సీఎంకు ఆహ్వానం అందించలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో ఆహ్వానించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంలో యడియూరప్పకు ప్రస్తుతం ఎలాంటి పదవి లేదని, అందుకే ఆహ్వానం పంపలేదని కర్ణాటక బీజేపీ వెల్లడించింది. -
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరు
-
పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు!. ఆయనతో పాటు పలువురు సీనియర్లు సైతం సమావేశాలకు గైర్హాజరు కాబోతున్నారని సమాచారం. రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యాత్రంలో పలువురు నేతలు కూడా రాహుల్ వెంట ఉన్నారు. ఈ క్రమంలో.. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండానే యాత్రను కొనసాగించాలని రాహుల్, ఆ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ బుధవారం(డిసెంబర్ 7వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎవరు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం ప్రతిపక్ష నేత ఎంపిక విషయంపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. ఎంపిక చేయబడిన ఏఐసీసీ కీలక సభ్యులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఇది వరకు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఉండేవారు. అయితే.. ఆయన అధ్యక్ష పదవి చేపట్టడంతో ఇప్పటికీ ఆయన స్థానంలో మరొకరి నియామకం జరగలేదు. దీంతో ఆయన్నే కొనసాగించాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: కవితకు నోటీసులిస్తే రాష్ట్రం ఉద్యమించాలా? -
భేటీకి కేంద్ర మంత్రుల గైర్హాజరు
న్యూఢిల్లీ/చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతుల ఆందోళనను తీర్చడానికి కేంద్ర వ్యవసాయ శాఖ దేశ రాజధాని ఢిల్లీలోని కృషి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అన్నదాతలు బహిష్కరించారు. ఈ భేటీకి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో పాటు, సహాయ మంత్రులు గైర్హాజరు కావడంతో 29 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు సమావేశాన్ని వాకౌట్ చేసి, వ్యవసాయ చట్టం ప్రతుల్ని చించేశారు. సమావేశానికి పిలిచి అవమానిస్తారా..? వ్యవసాయ చట్టాలపై తమకున్న ఆందోళనల్ని తొలగిస్తామని ఢిల్లీ పిలిచి మరీ తమని పట్టించుకోలేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర మంత్రులెవరూ ఈ సమావేశానికి హాజరు కానప్పుడు, భేటీని ఎందుకు ఏర్పాటు చేశారు ? కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది’’ అని రైతు సంఘాల సమన్వయ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ చెప్పారు. తమ ప్రశ్నలకు సరైన సమా« ధానాలు ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశా మన్నారు. దీనిపై వివాదం రేగడంతో ప్రభుత్వం వివరణ ఇస్తూ, షెడ్యూల్ ప్రకారం ఇది కార్యదర్శుల స్థాయి సమావేవమని పేర్కొంది. రైతులతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. -
డ్యూటీకి ఎగనామం.. ఆపై వీవీతో విధులు
తూప్రాన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు విధులకు గైర్హాజరవడమే కాకుండా విద్యావలంటీర్‌ను ఏర్పాటుచేసుకున్న ఘటన తూప్రాన్ మండలం వట్టూర్‌లో వెలుగుచూసింది. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. వట్టూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ శాంతి కవిత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజవుతోంది. ఈక్రమంలో గ్రామానికి చెందిన సంధ్యను విద్యావలంటరీగా నియమించి.. తన పనులు చేసుకుంటోంది. ఈక్రమంలో ఆమె రూ.8 వేలు చెల్లింస్తోంది. కవిత విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని కలెక్టర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు విద్యాశాఖ ఏడీ భాస్కర్‌రావు, నోడల్ ఆఫీసర్ మధుమోహన్ వట్టూర్ పాఠశాలలో విచారణ చేపట్టారు. పాఠశాల విద్యార్థులతో, గ్రామస్తులతో మాట్లాడారు. అయితే, విచారణ సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడం గమనార్హం. తేదీ లేకుండా కేవలం లీవ్ లెటర్‌ను ఉంచినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టి పూర్తి సమాచారంతో నివేదిక అందించాలని ఎంఈఓ నర్సింలుకు అధికారులు సూచించారు. -
అరెరె.. మతితప్పినె!
గ్రేటర్ సిటీజనుల్లో మతిమరుపు పెరుగుతోంది. ప్రతిరోజు తమకు ఎంతో అవసరమైన వస్తువులను కూడా అనుకోకుండా మరిచిపోతున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితం.. పని ఒత్తిడి.. నిద్రలేమి వంటి కారణాల వల్ల సిటీవాసుల్లో ఈ సమస్య పెరుగుతోందట. ఈ విషయంలో హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో నాలుగోస్థానంలో నిలిచినట్లు ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబర్ లాస్ట్‌అండ్ ఫౌండ్’ తాజా సర్వే తెలిపింది. సాక్షి,సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా గతేడాది తమ ఉబర్ క్యాబ్ సర్వీసుల్లో రాకపోకలు సాగించిన ప్రయాణికులు.. తర్వాత తమ వస్తువుల కోసం ఆ సంస్థలు ఆశ్రయించినవారి సంఖ్య ఆధారంగా ఈ లెక్కలు వేసింది. ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను విశ్లేషించి ఉబర్ లాస్ట్‌అండ్ ఫౌండ్ తాజా సర్వే ఈ వివరాలను తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో గ్రీన్‌సిటీగా పిలిచే బెంగళూరు నగరం తొలిస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. రెండోస్థానంలో దేశ రాజధాని ఢిల్లీ, మూడోస్థానంలో ముంబై మహానగరం, ఐదోస్థానంలో కోల్‌కతా, ఆరో స్థానంలో చెన్నై నిలిచాయి. ఇక ఆ తరవాతి స్థానాలు పూణే, జైపూర్, చండీగఢ్,అహ్మదాబాద్ నగరాలు నిలిచాయి. మధ్యాహ్నం తర్వాతే అధికం.. భోజనం తరవాత భుక్తాయాసం, ప్రయాణంలో కునుకుపాట్ల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో.. అదీ ప్రయాణం చేస్తున్న సమయంలోనే తమ వ్యక్తిగత వస్తువులను సిటీజన్లు పోగొట్టుకుంటున్నట్లు ఈ సర్వే తెలిపింది. అత్యధిక మంది ప్రయాణికులు సెల్ఫోన్లు, బ్యాగ్‌లు, ఇల్లు, ఆఫీసు తాళాలు పోగొట్టుకుంటున్నారట. మరికొందరు ఐడీ కార్డులు, కళ్లజోళ్లు, గొడుగుల వంటి వ్యక్తిగత వినియోగ వస్తువులను మరిచిపోతున్నట్లు తెలిపింది. మరికొందరైతే ఏకంగా బంగారు ఆభరణాలు, ఎల్సీడీ టీవీలు, పిల్లల ఆట వస్తువుల వంటివి పోగొట్టుకుంటున్నట్లు తెలిపారని ఈ సర్వే ప్రకటించడం విశేషం రాజధాని గ్రేటర్లో పరిస్థితి ఇదీ... ♦ ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ఎక్కువ మరచిపోయే సిటీజన్లున్న నగరాల్లో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచిందట. మన దేశంలో అయితే హైదరాబాద్ ర్యాంక్ .4 కావడం గమనార్హం. ♦ పని ఒత్తిడి, సకాలంలో ఆఫీసు లేదా ఇంటికి చేరుకోవాలన్న టెన్షన్లో చాలామంది తమ వ్యక్తిగత విలువైన వస్తువులు పోగొట్టుకుంటున్నారట. ప్రధానంగా బుధ, శనివారాల్లో అత్యధికులు తమ వస్తువులను మరిచిపోతున్నారట. ♦ గతేడాది (2017)లో ఆగస్టు 19, 24, 26, నవంబరు 23, 25 తేదీల్లో అత్యధిక మంది ప్రయాణికులు తమ వస్తువులను మరచిపోవడం గమనార్హం. ♦ సిటీజన్లు మరిచిపోయిన అరుదైన వస్తువుల్లో వెడ్ డింగ్ డ్రెస్‌తో పాటు విలువైన బహుమతులు కూడా ఉంటున్నాయట. అత్యధికంగా వస్తువులు పోగొట్టుకుంటున్న రోజులు ♦ శని, ఆది, సోమ, శుక్రవారాలు ♦ ఏ సమయంలో అధికంగా వస్తువులు మరిచిపోతున్నారంటే.. ♦ ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంట మధ్య. ♦ తక్కువగా వస్తువులను పొగొట్టుకుంటున్న సమయాలు: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉబర్ క్యాబ్‌లో వస్తువులు పొగొట్టుకుంటే.. ప్రయాణికులు తమ క్యాబ్‌లలో పోగొట్టుకున్న ♦ వస్తువులను తిరిగి పొందే అవకాశాన్ని ‘ఉబర్ క్యాబ్ బుకింగ్ యాప్’లోనే కల్పించినట్లు ఉబర్ ఇండియా మార్కెటింగ్ విభాగాధిపతి సంజయ్‌గుప్త తెలిపారు. ♦ ఉబర్ ‘క్విక్గైడ్’ కోసం మెను ఐకాన్‌పై ట్యాప్ చేయండి. ♦ యువర్ ట్రిప్స్‌పై ట్యాప్ చేసి వస్తువులను మరచిపోయిన ట్రిప్‌ను ఎంపికచేయండి. ♦ రిపోర్ట్ ఆన్ ఇష్యూ విత్ దిస్ ట్రిప్‌ను ట్యాప్ చేయాలి. ♦ ఐ లాస్ట్ యాన్ ఐటమ్‌ను ట్యాప్ చేయాలి. ♦ కాంటాక్ట్ మై డ్రైవర్ ఎబౌట్ ఎ లాస్ట్ ఐటెమ్‌ను ట్యాప్ చేయాలి. ♦ కిందకు స్క్రోల్ చేసి మిమ్మల్ని సంప్రదించేందుకు అనువైన ఫోన్ నెంబరు నమోదు చేసి ఎంటర్ చేయాలి. ♦ ఒక వేళ క్యాబ్‌లో మీ ఫోన్ మరచిపోతే దానికి బదులుగా మీ స్నేహితుని ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇలా చేస్తే మీరు పొగొట్టుకున్న వస్తువులను సదరు క్యాబ్ డ్రైవర్లు మీకు సురక్షితంగా అప్పగిస్తారు. దేశంలో అత్యంత మతిమరుపు నగరాలివీ.. నగరం స్థానం బెంగళూరు 1 న్యూఢిల్లీ 2 ముంబై 3 హైదరాబాద్ 4 కోల్కత్తా 5 చెన్నై 6 పూణే 7 జైపూర్ 8 చండీగఢ్ 9 అహ్మదాబాద్ 10 ఉబర్క్యాబ్లలో తరచూ పోగొట్టుకునే ‘టాప్ టెన్’ వస్తువులివే.. 1.ఫోన్ 2.బ్యాగ్ 3.వాలెట్ 4.తాళాలు/కీకార్డులు 5.దుస్తులు 6.ఐడీ/లైసెన్స్/పాస్‌పోర్ట్ 7.కంటి అద్దాలు 8.బాటిల్ 9.గొడుగు 10.ఆభరణాలు -
250 మంది విద్యార్థుల గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదోతరగతి పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సైన్స్ పేపర్–1 పరీక్షకు జిల్లాలో 250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 49,137 మంది విద్యార్థులకు గాను 48,887 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, స్క్వాడ్ బృందాలు 90 కేంద్రాలను తనిఖీ చేశాయి. -
ఇంటర్ పరీక్షలకు 1,529 మంది గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం, బాటనీ, సివిక్స్, ఒకేషనల్ పరీక్షల్లో 1,529 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 39,398 మందికిగనూ 37,869 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 36,445 మంది ఉండగా 35,119 మందే హాజరయ్యారు. 1,326 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 2,953 మంది విద్యార్థులకుగాను 2,750 మంది హాజరయ్యారు. 203 మంది గైర్హాజరయ్యారు. -
ఎంపీడీవోలు.. విధులకు డుమ్మా!
* జెడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి * మొన్న ముప్పాళ్ల.. తాజాగా బెల్లంకొండ ఎంపీడీవోలకు చార్జి మెమోలు గుంటూరు వెస్ట్: మండల స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)ది కీలక పాత్ర. అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్ర బిందువుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడంలో వీరిపైనే ప్రధాన బాధ్యత ఉంటుంది. జిల్లాలోని పలువురు ఎంపీడీవోల పనితీరుపై ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కార్యాలయాలకు గైర్హాజరు కావడం, జిల్లాస్థాయిలో సమావేశాలకు హాజరవుతున్నామని చెబుతూ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం వంటి విషయాలు ఇటీవల కాలంలో అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ముప్పాళ్ల ఎంపీడీవోపై చర్యలకు సీఈవో సిఫార్సు... ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశానికి గైర్హాజరైన ముప్పాళ్ల ఎంపీడీవో టి.ఉషారాణిపై విచారణ జరిపాలనిSకలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. విచారణ జరిపిన సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య ఆమె కార్యాలయ విధులకు తరచుగా గైర్హాజరవుతున్నట్లు ధృవీకరించుకున్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు ఫైల్ పెట్టారు. ఈ ఘటన ఎంపీడీవోల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సీఈవో వెంకటసుబ్బయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నెల తొమ్మిదిన బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయాన్ని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి ఎంపీడీవో కేహెచ్ భ్రమరాంబ విధులకు గైర్హాజరైనట్లు తేలింది. దీంతో ఆమెకు చార్జిమెమో అందజేశారు. చార్జిమెమో నుంచి తప్పించుకునే చర్యల్లో భాగంగా భ్రమరాంబ శుక్రవారం సాయంత్రం తనకు 10 రోజులపాటు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా పరిషత్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సగానికిపైగా ఎంపీడీవోలది ఇదే తీరు... జిల్లాలోని సగానికిపైగా ఎంపీడీవోలు గుంటూరులో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. వారంలో ఒకటి రెండు రోజులు విధులకు హాజరై, మిగిలిన రోజుల్లో సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారనే విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నామంటూ విధులకు గైర్హాజరవుతుండటం గమనార్హం. పల్నాడు ప్రాంత మండలాల్లో విధులు నిర్వహించే ఎంపీడీవోలు ఈ తరహా సాకులు చెబుతూ విధులకు డుమ్మా కొడుతున్నారు. బొల్లాపల్లి ఎంపీడీవో ఎం.అశోక్‌బాబు విధులకు సక్రమంగా హాజరుకారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు కె.సంతోషమ్మ అనేకమార్లు సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావించడం గమనార్హం. కొంతమంది ఎంపీడీవోలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు చూసుకుని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో చేపడుతున్న ఆకస్మిత తనిఖీలతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. -
ఇలాగైతే సమన్వయం ఎలా?
* టీడీపీ సమీక్షా సమావేశానికి జిల్లా మంత్రులు, పరిశీలకుడు డుమ్మా * ముగ్గురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు * నామినేటెడ్ పదవులపై నిర్ణయం తీసుకోని ఇన్చార్జి మంత్రి * మొక్కుబడిగా సమావేశంపై కార్యకర్తల అసంతృప్తి గుంటూరు (అరండల్‌పేట): ఇలాగైతే నేతల మధ్య సమన్వయం ఎప్పటికి సాధ్యమవుతుంది... పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు కనీసం పార్టీ సమావేశం అంటే అంత చులకనైతే ఎలా అంటూ టీడీపీ కార్యకర్తలు పార్టీ నాయకులను నిలదీశారు. జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం అరండల్‌పేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో సహా పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి గైర్హాజరయ్యారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయింది. ఇలాగైతే పార్టీకోసం ఎవరు పనిచేస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదంటూ కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రధానంగా పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లాలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. గత నెలలో జరిగిన సమావేశంలో మిర్చి యార్డుకు సంబంధించిన డైరెక్టర్ల పేర్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలను బుచ్చయ్యచౌదరి ఆదేశించినా ఇప్పటివరకు పేర్లు ఇవ్వలేదు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న యార్డు చైర్మన్ పదవులకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటివరకు పేర్లు ఇవ్వలేదు. దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ సమావేశంలో తూతూ మంత్రంగా నాలుగు తీర్మానాలు చేసి పార్టీకి పంపడం తప్ప ఈ సమావేశంతో ఒరిగిందేమీ లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులతో పాటు ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం హాజరుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీరంతా కార్యకర్తల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే రాలేదని విమర్శిస్తున్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఒక్కసారి కూడా ఎంపీలు హాజరుకాకపోవడం, పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మరికొందరు నాయకులు చెబుతున్నారు. -
మతి స్థిమితం లేని యువకుడి అదృశ్యం
లింగగిరి(చెన్నారావుపేట) : మతి స్థిమితం లేని ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మండలంలోని లింగగిరి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన అశోక్(22) 12 రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. రోజూ ఊరంతా తిరిగి ఇంటికొచ్చే కుమారుడు, ఎంతకూ రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి కొమ్మాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు. -
అధికారులు తప్పిపోయారా..?
కౌటాల : నిత్యం రద్దీగా ఉండే కౌటాల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులు కనిపించలేదు. వివిధ పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన భాధితులకు చుక్కెదురైంది. అధికారుల రాక కోసం గంటల తరబడి వేచి చూసినా ఫలితం దక్కలేదు. తెలంగాణ రాష్ట్రంలోనైనా అధికారులు మంచి పాలన అందిస్తారనే ప్రజల నమ్మకాన్ని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది వమ్ము చేస్తున్నారు. ఖాళీగా కుర్చీలు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు అటెండర్లు, కంప్యూటర్ అపరేటర్ విధులు నిర్వహిస్తారు. కానీ బుధవారం కార్యాలయంలో ఒక్క అటెండర్ తప్ప ఎవరూ కూడా విధులకు హాజరు కాలేదు. అలాగే మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సైతం కనిపించలేదు. కార్యాలయంలో కనీసం ఒక్క ఉద్యోగి అయినా అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారి మాట మండల ఉద్యోగులకు పట్టడం లేదు. సిబ్బంది లేకపోవడంపై ఆరా తీయగా ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నా ఓ ఉద్యోగి ఇంట్లో బుధవారం గహా ప్రవేశ కార్యక్రమం ఉండడంతో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కొందరు శుభకార్యానికి, కొంత మంది వారి పనుల నిమిత్తం వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఎంపీడీవో రాజేశ్వర్‌ను సాక్షి సంప్రదించగా తాను విధుల్లో భాగంగా జిల్లా కేంద్రానికి వెళ్లినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆఫీసు సిబ్బంది విషయమై ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదన్నారు. -
ఆస్పత్రికి పశువైద్యుడి డుమ్మా
చికిత్స అందక గొర్రె మతి వైద్యసేవలు అందండంలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం శుక్రవారం ఉదయం మండలంలోని నందవరంలో ఉన్న పశువైద్యశాలకు గ్రామానికి చెందిన యర్రమళ్ల లక్ష్మీరెడ్డి తన గొర్రెపిల్లకు ఆరోగ్యం బాగోలేదని తీసుకొచ్చాడు. అయితే ఆ సమయంలో అక్కడ వైద్యుడులేడు. కేవలం కాంపౌండర్ మాత్రమే ఉన్నాడు. లక్ష్మీరెడ్డి గొర్రెపిల్లకు తీవ్ర అనారోగ్యంగా ఉందని నయం చేయాలని కాంపౌడర్‌ను అడిగాడు. అతను డాక్టర్‌ను తాను కాదని నిర్లక్ష్యంగా సమాధామమిచ్చాడు. కొంత సమయం గడిచిన తర్వాత వైద్యం అందక గొర్రెపిల్ల మతిచెందింది. మర్రిపాడు : నందవరం పశువైద్యశాలలో వైద్యం సక్రమంగా అందడంలేదని చెప్పేందుకు పై సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.. గతంలోనూ మూగజీవాలకు సరిగ్గా వైద్యం అందక మతిచెందిన సంఘటనలున్నాయి. ఈ ఆస్పత్రి నుంచే అన్ని ప్రాంతాలకు వైద్యసేవలు అందాల్సి ఉంది. అయితే ఏనాడు కూడా పశువులకు సక్రమంగా వైద్యం అందకపోవడంతో పలుమార్లు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మండలం మారుమూల ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం చనిపోయిన గొర్రెపిల్లను పశువైద్యశాలలోనే ఉంచి కొంతమంది నిరసన తెలిపారు. జీవాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, అలాంటి జీవాలు మతిచెందింతే ఏం తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మూగజీవాలకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. -
ఒలింపిక్స్‌కు పుతిన్ వెళ్లడం లేదు
మాస్కో: అట్టహాసంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ప్రపంచ క్రీడా సంరంభం రియో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హాజరుకావడం లేదంట. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో అసలు రష్యా తరుపున ఈ క్రీడా ప్రారంభోత్సవ వేదికకు ఎవరు వెళతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. 'రియో ఒలింపిక్స్ వెళ్లే ప్రణాళిక ఏది మా అధ్యక్షుడు పుతిన్ షెడ్యూల్ లో లేదు. ప్రభుత్వం తరుపున ఎవరు వెళతారనే విషయంపై కూడా నా వద్ద సమాచారం లేదు' అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. -
గైర్హాజరైన ఎంఈఓలను సస్పెండ్ చేయాలి
ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ కేయూ క్యాంపస్ : జిల్లాలో టీచర్ల వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియపై బుధవారం జరిగిన సమావేశానికి గైర్హాజరైన 11 మంది ఎంఈఓలను సస్పెండ్ చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ డీఈఓ రాజీవ్‌ను ఆదేశించారు. టీచర్ల వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం డీఈఓ కార్యాలయంలో సమావేశం ఉంటుందని సమాచారం ఇవ్వగా.. జిల్లాలోని 51 మంది ఎంఈఓలలో 40 మంది మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ.. ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. అనంతరం అందరు కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అయితే కలెక్టర్‌తో జరిగిన సమావేశం కొంత ఆలస్యం కావడంతో 20 మంది ఎంఈఓలు తమ తమ మండలాలకు వెళ్లిపోయారు. తర్వాత రాత్రి 7 గంటలకు కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో సమా వేశం నిర్వహించారు. అయితే సమావేశానికి 20 మందే ఎంఈఓలు మాత్రమే హాజరుకావడంపై డీఈఓను కలెక్టర్ ప్రశ్నించారు. డీఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎంతమంది వచ్చారని.. ఇక్కడికి తక్కువ మంది ఎలా వచ్చారని అడిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి గైర్హాజరైన వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్.. డీఈఓను ఆదేశించారు. అనంతరం హాజరైన ఎంఈఓలతో పాఠశాలలో టీచర్ల వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని సూచించారు. -
కాలేజీకి రాలేదని గుంజీళ్లు: ఆస్పత్రిపాలైన విద్యార్థి
పలమనేరు (చిత్తూరు జిల్లా) : రెండు రోజులు కళాశాలకు రాలేదని ఆగ్రహించిన అధ్యాపకుడు విద్యార్థితో 150 గుంజీళ్లు తీయించాడు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన రెడ్డెప్ప కుమారుడు భానుప్రసాద్ గంగవరంలోని సాయి చైతన్య కళాశాలలో ఇంటర్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ కళాశాలకు హాజరు కాలేదు. కళాశాల యాజమాన్యం విద్యార్థి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. కాగా గత శనివారం విద్యార్థి కళాశాలకు వచ్చాడు. దీంతో అధ్యాపకుడు విద్యార్థిని 150 గుంజీళ్లు తీయాలని ఆదేశించాడు. బాలుడు 75 గుంజీళ్లు తీసి కిందపడిపోయాడు. అనంతరం తల్లిదండ్రులు అతన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతని నడుము పనిచేయక నడవలేకపోతున్నాడు. తిరిగి మూడు రోజుల క్రితం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కళాశాల యాజమాన్యం మాత్రం తమకు జ్వరం విషయం తెలియదని, పిల్లలు బాధ్యతగా ఉండాలనే గుంజీళ్లు తీయించమని చెప్పి ఉంటారని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెబుతోంది. -
ఏసీబీ విచారణకు లోకేశ్ డ్రైవర్ డుమ్మా
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి ఏసీబీ విచారణకు గైర్హాజరయ్యారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ ఎదుట హాజరు కావాలన్న ఏసీబీ ఆదేశాలను బేఖాతరు చేశారు. అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం గురువారం ఉదయం 10.30 గంటల కల్లా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలి, కానీ రాలేదు. కొండల్‌రెడ్డి కోసం గురువారం రోజంతా ఎదురు చూసిన ఏసీబీ అధికారులు... తదుపరి కార్యాచరణపై దృష్టిసారించారు. ప్రస్తుతం సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం జారీచేసిన నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో... నేరుగా సెక్షన్ 41ఏ (నిందితుడిగా అనుమానిస్తూ) నోటీసులు జారీచేసేందుకు ఏసీబీ కసరత్తు చేస్తోంది. అసలు ఈ కేసులో కీలకమైన వ్యక్తులంతా విచారణకు డుమ్మా కొడుతుండడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది. లోకేశ్ డ్రైవర్ సహా ఇలా డుమ్మా కొడుతున్న వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు నోటీసులు అందుకున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు. తాజాగా లోకేశ్ డ్రైవర్ కూడా డుమ్మా కొట్టారు. ‘పెద్ద’ల పాత్రను దాచేందుకే...? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.50 లక్షలిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏసీబీ చిత్రీకరించిన వీడియోలో రేవంత్ పదే పదే తమ ‘బాస్’ ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ఈ వీడియో, ఆడియో టేపులు వాస్తవమైనవంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలను ఛేదించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఒక్కొక్కరికీ నోటీసులిస్తూ ‘పెద్ద’ల పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. అందులో భాగంగా చంద్రబాబు తనయుడు లోకేశ్ పాత్రపై ఏసీబీకి కొంత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు లోకేశ్ సారథ్యంలోనే రూపకల్పన జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతోపాటు ఆర్థిక అంశాలపైనా బలమైన ఆధారాలను సేకరించేందుకు ఏసీబీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వీటి నుంచి తప్పించుకోవడానికే... లోకేశ్ తన డ్రైవర్‌ను అజ్ఞాతంలోకి పంపినట్లు అధికారులు భావిస్తున్నారు. -
సభ్యుల గైర్హాజరుపై స్పీకర్ గరం
బెంగళూరు: విధానసభలో మంత్రులు, ఎమ్మెల్యేల గైర్హాజరుపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా స్పందించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం విధానసభ కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో ఐటీ శాఖమంత్రి ఎస్.ఆర్ పాటిల్ ఒక్కరే చట్టసభలో కన్పించారు. ఇక అధికార పార్టీకు చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో సభలో ప్రభుత్వ ప్రతినిధులు తక్కువగా ఉన్న విషయాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప విపక్షసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. ‘వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అసలు శాసనసభ అంటే ఏంటో మంత్రులతో పాటు అధికార పార్టీకు చెందిన శాసనసభ్యులకు అర్థమయినట్లు లేదు.’ అని అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత విశ్వేశ్వర హెగ్డే కాగేరి కలుగ జేసుకుని ‘మంత్రి అంబరీష్ ఒక్కరే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారన్న వార్తలు వస్తున్నాయి. అయితే సభలో పరిస్థితి చూస్తుంటే మంత్రులందరూ అధికార కాంగ్రెస్‌కు టా...టా చెప్పినట్లు ఉంది.’ అని వ్యంగ్యాస్త్రం వదిలారు. అంతేకాక అంబరీష్ మంత్రి పదవికి రాజీనామా చేసుంటే ఆ పత్రాన్ని మీకేమైనా అందించారా అని స్పీకర్ కాగోడు తిమ్మప్పను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ సమయంలో ఎస్.ఆర్ పాటిల్ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా విశ్వేశ్వర హెగ్డే కాగేరి వినిపించుకోకుండా....‘బాబురావ్ చించన్ సూర్ పై చెక్ బౌన్స్ కేసు., చిన్న నీటిపారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడి పై హత్యారోపణలు, రైతుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్న ఉద్యాన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప ఇలా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రులే శాసనసభకు గైర్హాజరైతే ఏ విషయాలపై చర్చించాలి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శాసనసభలో జేడీఎస్ పార్టీ ఉపనాయకుడు వై.వి.ఎస్ దత్తా కలుగజేసుకుని ‘అభివృద్ధిలో వెనకబడిన ఉత్తర కర్ణాటక విషయమై చర్చించేందుకే స్పీకర్ రెండు రోజుల సమయాన్ని కేటాయించారు. అయితే ఈ విషయమై అధికార పార్టీకు ఎటువంటి ఆసక్తి లేదు. ఇక ప్రభుత్వ ప్రతినిధుల్లో 85 శాతం మంది ఇలా నిర్లక్ష్యవైఖరితో ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అయిన శాసనసభకు గైర్హాజరు కావడం సరికాదు. కనీసం ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు లేకపోతే ఎలా.’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని అధికార పార్టీ నాయకులతో తాను మాట్లాడి హాజరు శాతం పెంచడానికి ప్రయత్నిస్తానని చెప్పి పరిస్థితిని యథాస్థితికి తేవడంతో శాసనసభలో సభా కార్యక్రమాలు యథావిధిగా జరగడం ప్రారంభించాయి. -
సల్మాన్ కేసులో కీలక సాక్షి గైర్హాజరు
జోధ్‌పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై నమోదైన కృష్ణజింకల వేట కేసులో కీలక సాక్షి చోగారామ్(65) కోర్టుకు గైర్హాజరయ్యాడు. అతడు సోమవారం ఇక్కడి కోర్టుకు హాజరై వాంగ్మూలమివ్వాల్సి ఉంది. చోగారామ్ మానసిక స్థితి వాంగ్మూలమిచ్చేందుకు అనువుగా లేదని అతని కుమారుడు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చాడు. తన తండ్రి పేరును సాక్షుల జాబితా నుంచి తీసేయాలన్నాడు. దీనికి సంబంధించి డాక్టర్లు ఇచ్చిన డాక్యుమెంట్లను సమర్పించాడు. చోగారామ్ కోర్టులో వాంగ్మూలమివ్వగలడో లేదో పూర్తిస్థాయి వైద్యనివేదికను అందించాలని జడ్జి ఆదేశించారు. సల్మాన్ జింకలను కాల్చి చంపాక చోగారామ్ అతని వాహనాన్ని అపడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఉంది. -
ఎలక్షన్ డ్యూటీకి రాలేదని టీచర్లపై వేటు
ముజఫర్‌నగర్: పంచాయతీ ఎన్నికల విధుల్లో హాజరుకాకుండా ఉన్న ఓ పాఠశాల ఉపాధ్యాయుడు, మరో టీచర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో చోటుచేసుకుంది. ఎస్ కే బాల్యాన్ ప్రధానోపాధ్యాయుడు మహబత్ అనే గ్రామంలో పనిచేస్తుండగా రోహిత్ కౌశిక్ అనే మరో ఉపాధ్యాయుడు వేరే పాఠశాలలో పనిచేస్తున్నారు. వీరిద్దరిని జిల్లా ఉన్నత కార్యాలయంలో ఓ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధులు అప్పగించారు. కానీ, వారు హాజరు కాకపోవడంతో వేటు వేశారు. కాగా, సస్పెండ్ వేటు పడిన ప్రధానోపాధ్యాయుడు ఆ జిల్లా ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి కూడా.