మతి స్థిమితం లేని యువకుడి అదృశ్యం
Published Tue, Aug 16 2016 12:32 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
లింగగిరి(చెన్నారావుపేట) : మతి స్థిమితం లేని ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మండలంలోని లింగగిరి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన అశోక్(22) 12 రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. రోజూ ఊరంతా తిరిగి ఇంటికొచ్చే కుమారుడు, ఎంతకూ రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి కొమ్మాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు.
Advertisement
Advertisement