అదృశ్యమైన యువకుని మృతదేహం లభ్యం | A young man's body found | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన యువకుని మృతదేహం లభ్యం

Published Sun, Oct 4 2015 5:45 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

A young man's body  found

వారం రోజుల క్రితం అదృశ్యమైన యువకుని మృతదేహం ఆదివారం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రవెల్లి మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన జయరామ్(30) వారం రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. రెండు రోజులు గాలించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదివారం సాయంత్రం వరంగల్ రోడ్డు పక్కనున్నవాగు వద్ద పూడ్చిపెట్టిన శవం మట్టి కొట్టుకుపోయి పైకి కనిపించడంతో పశువుల కాపరులు గమనించారు. విషయాన్ని కన్నాపూర్ గ్రామస్తులకు తెలియజేయడంతో జయరామ్ కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహంపై ఉన్న దుస్తులను గుర్తించారు. పోలీసులకు సమాచారం తెలపడంతో.. వారు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement