
నిత్యానందకు అరెస్టు వారంట్లు
బెంగళూరు: కోర్టులో విచారణకు గైర్హాజరు కావటంపై ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సోమవారం నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించిన విచారణ సోమవారం రామనగర కోర్టులో జరిగింది. తాను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు నిత్యానంద తరుఫు న్యాయవాది ద్వారా తెలిపారు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యానందను అరెస్టు చేసి ఆగస్టు 7న కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది.