Nithyananda
-
ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి
న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులు అయితే జైలుకు లేదా నరకానికి వెళతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో అన్నారు. మోదీ సర్కారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోదన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇటీవలి ఉగ్ర అలజడికి త్వరలో ముగింపు పలుకుతామని, ఉగ్రవాదులు తమ లక్ష్యాలను అందుకోలేరన్నారు. గత కొద్దిరోజుల్లో కశీ్మర్లో 28 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. -
నిత్యానంద కైలాసతో ఒప్పందాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బ్యూనస్ ఎయిర్: నిత్యానంద ప్రకటించుకున్న 'యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస' ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తనను మోసం చేసినట్లు ఆ పరాగ్వే అధికారి చెప్పారు. ఆర్నాల్డ్ చమోర్రో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తన వద్దకు వచ్చారు. కైలాసతో దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. అంతేకాకుండా కైలాసకు ఐక్యారాజ్య సమితి గుర్తింపు తెప్పించడానికి సంబంధించిన పత్రాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనేజ్ను కూడా కలిశారు. నిత్యానంద దేశంతో ఒప్పందం వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పరాగ్వేలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న నిత్యానందతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇక చేసేదేమి లేక ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యవసాయ శాఖ అధికారి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
కైలాస దేశ ప్రధానిగా నిత్యానంద ప్రియ శిష్యురాలు, నటి!
భారత్‌లోని ప్రజలకు నమ్మకాలు ఎక్కువ. ఈ నమ్మకాలనే పెట్టుబడి పెట్టుకుని కొందరు స్వామిజీలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ భారీగా సంపాదించారు. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగట్టారు. అందులో ఒకరే స్వామి నిత్యానంద. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజితతో ఆయన ఏకాంతంగా కలిసున్న దృశ్యాలు టీవీ, సోషల్ మీడియాల్లో మార్మోగిపోయాయి. 2019లో దేశం విడిచి పరార్ అడ్డంగా దొరికిపోయినప్పటికీ అదంతా అబద్ధమని బుకాయించారు. అప్పటి నుంచి నిత్యానందను వివాదాలు చుట్టుముడుతూనే వచ్చాయి. ఆ తర్వాత అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు. కానీ ఇంతవరకు ఈ కైలాస దేశం ఎక్కడుందనే స్పష్టత లేదు. తాజాగా ఈ దేశానికి తన ప్రియ శిష్యురాలు, మాజీ నటి రంజితను ప్రధానిని చేసినట్లు కోలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రియ శిష్యురాలు ప్రధానిగా ఈ విషయాన్ని నిత్యానంద వెబ్సైట్లో పేర్కొన్నారని ఓ తమిళ పత్రిక రాసుకొచ్చింది. కానీ సదరు వెబ్సైట్లో మాత్రం అటువంటి వివరాలేమీ కనిపించలేదు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరపున మహిళా రాయబారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరీ రంజిత? కన్నడ సినిమాల్లో నటించిన రంజిత అప్పటితరానికి సుపరిచితమే! తమిళనాడుకు చెందిన ఆమె 1975, జూన్ 4న జన్మించింది. సీనియర్ నటుడు అశోక్ కుమార్ కూతురే రంజిత. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్’ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది. కొంతకాలానికే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. అక్కాచెల్లెళ్లు విడాకులిచ్చి నిత్యానంద చెంతకు సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేశ్ మీనన్‌తో ఆమె వివాహమైంది. మొదట్లో వీరిద్దరూ బాగానే ఉన్నారు. కానీ తర్వాత నిత్యానంద మాయలో పడటంతో 2017లో భర్తకు విడాకులిచ్చింది. నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్ చేసిన ఆమె 2013 చివర్లో ఆనందమయిగా పేరు మార్చుకుంది. రంజితతో పాటు ఆమె సోదరి కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతోపాటు దేశం వదిలి వెళ్లిపోయింది. చదవండి: లవ్ టుడే హీరోయిన్ ఇంత తీవ్ర విషాదం.. -
నిత్యానంద కైలాసకు బిగ్ షాక్
వాషింగ్టన్: కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో వార్తల్లోకెక్కిన వివాదాస్పద వ్యక్తి నిత్యానందకు పెద్ద షాకే తగిలింది. కైలాసానికి అంతర్జాతీయ ఉనికి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్ కో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపే కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ఒకటి ప్రకటించింది. అమెరికన్ సిటీ నెవార్క్.. కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మేం మోసపోయాం. జరిగినదానికి చింతిస్తున్నాం. కైలాస పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం’’ అని నగర అధికార ప్రతినిధి సుసాన్ గారోఫాలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కైలాస ప్రభుత్వ వెబ్సైట్ మాత్రం అమెరికా నగరం, తమ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను(USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత పత్రాలను పోస్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించుకుంటోంది. జనవరి 12వ తేదీన నెవార్క్ సిటీ హాల్లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్ ప్రతినిధులు ఇప్పుడు చెప్తున్నారు. అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద స్వామి. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి జనాల్ని బిత్తరపోయేలా చేశాడు. పైగా ఆ దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఐరాస మానవహక్కుల కమిషన్‌లో నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని, స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ఆ దేశ ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్ కొట్టిపారేయడం గురించి తెలిసిందే. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరమహంస నిత్యానంద ఫాలోవర్స్ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్ చేస్తుంటారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. -
Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా'
వివాదాస్పద స్వామిజీ నిత్యానందకు భక్తులే కాదు, అభిమానులు, ప్రేమికులు ఎక్కువే. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నిత్యానంద దేశం విడిచి పారిపోయి, కైలాస అనే దీవిలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నటి ప్రియా ఆనంద్ తాను నిత్యానందను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. అమెరికాలో పెరిగిన ఈ బ్యూటీ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. కోలీవుడ్‌లో వామనన్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్, ఆర్జే బాలాజీకి జంటగా నటించింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన భేటీలో తన పెళ్లి ప్రస్థావన తీసుకురాగా నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆయన గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న వ్యక్తి నిత్యానందస్వామి అని, ఆయన్ని పెళ్లి చేసుకుంటే తనకు పేరు మార్చుకోవలసిన అవసరం కూడా ఉందంటూ సరదాగా బదులిచ్చింది. చదవండి: (సీఎంను డైరెక్ట్ చేసిన విఘ్నేశ్ శివన్) -
స్టీల్ ప్లాంట్‌పై పునఃపరిశీలించాలని ఏపీ కోరింది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పలు హామీలను నెరవేర్చామని, మిగిలిన కొన్ని హామీల అమలు వివిధ దశల్లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభకు తెలిపారు. కొన్ని నిర్మాణ ప్రాజెక్టులు, విద్యాసంస్థల విభజన సంబంధిత అంశాల పరిష్కారానికి పదేళ్ల పాటు గడువు ఉందని చెప్పారు. వీటిపై సంబంధిత శాఖలు, విభాగాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో హోంశాఖ ఇప్పటివరకు 25 సమీక్ష సమావేశాలు నిర్వహించిందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో(ఆర్ఐఎన్ఎల్) వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) నిర్ణయం తీసుకున్న తరువాత దీన్ని పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలుదఫాలు విజ్ఞప్తి చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్లాంట్‌కు సంబంధించి అధికంగా ఉన్న భూమి, ఇతర నాన్–కోర్ ఆస్తులను లావాదేవీల నుంచి వేరు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరాడ్ పేర్కొన్నారు. ఢిల్లీలో గత మూడు నెలల్లో పెట్రోల్ ధర రూ.10.98, డీజిల్ రూ.9 పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జూలై 16న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.54, డీజిల్ రూ.89.87 ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. ‘ఆదర్శ్ స్మారక్’లో నాగార్జునకొండ, శాలిహుండం ఆదర్శ్ స్మారక్ పథకం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునకొండ, శాలిహుండం బౌద్ధ నిర్మాణాలు, వీరభద్ర దేవాలయాన్ని గుర్తించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదర్శ్ స్మారక్ పథకంలో భాగంగా ఈ ప్రదేశాల్లో వైఫై, కేఫ్టేరియా, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, బ్రెయిలీ గుర్తులు, విద్యుద్దీప కా>ంతులు లాంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాజ్యసభకు తెలిపారు. అడాప్ట్–ఏ–హెరిటేజ్ కింద గండికోటను చేర్చామని, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 135 నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వ పరిరక్షణలో ఉన్నాయని చెప్పారు. -
‘నేను భారత్‌లో అడుగుపెడితేనే కరోనా అంతం’
దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపంలో నివసిస్తున్న నిత్యానంద స్వామి భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభించడంపై ఆయన స్పందిస్తూ భారత భూభాగంలో తాను అడుగుపెడితే ఆ వైరస్ ఇక అంతమవుతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తన శిష్యులతో మాట్లాడినట్లు తెలిసింది. కరోనా పోవాలంటే తాను భారత్‌లో అడుగుపెట్టాలని శిష్యులకు చెప్పాడు. ‘కైలాస’ అని తనకు తాను ఓ దేశాన్ని రూపొందించుకుని అక్కడే ఉంటున్న నిత్యానంద తరచూ భారతదేశానికి సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నాడు. తాజాగా భారత్‌లో కరోనా విజృంభణపై స్పందించాడు. భారత్‌ను కరోనా ఎప్పుడు విడిచిపోతుందని ఓ శిష్యుడు అడిగిన ప్రశ్నకు ‘నేను భారత భూభాగంపై ఎప్పుడు అడుగు పెడతానో అప్పుడే కరోనా అంతం అవుతుంది’ అని నిత్యానంద తెలిపారు. నిత్యానంద స్వామి లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నాడు. అనంతరం 2019లో గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయాడు. అనంతరం ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస’ అని పేరు పెట్టుకున్నాడు. రాజకీయాలు లేకుండా హిందూ దేశంగా రూపొందించినట్లు నిత్యానంద తెలిపారు. ఆ దేశానికి ప్రత్యేక జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం రూపొందించుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పాటుచేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల రాకపోకలపై నిషేధం విధించాడు. తన దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాశాడు. -
నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా!
సాక్షి, చెన్నై: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్ పేర్కొన్నారు. నటి మీరామిథున్ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటుచేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ అని మీరా మిథున్ పేర్కొంది. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!) -
నా బ్యాంక్.. నా ఇష్టం
-
సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచారు. తన దేశం ‘కైలాస’లో రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా.. ఈ కరెన్సీ చెల్లుబాటయ్యేలా ఇందుకు సంబంధించి వివిధ దేశాలతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ఆగష్టు 22న హిందూ రిజర్వ్ బ్యాంకును స్థాపించడం సహా అదే రోజు నుంచి కరెన్సీని చెలామణిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు అన్నీ పూర్తి చేశామని, పాలసీ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, చట్టబద్ధంగానే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. (ఆ అక్కాచెల్లెళ్లు నిత్యానంద ‘కైలాస’లో..) ఈ మేరకు పలు దేశాలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నామని... ప్రపంచ దేశాల నుంచి విరాళాల రూపంలో వస్తున్న డబ్బును ఆర్గనైజ్ చేసి(వ్యవస్థీకృతం) లావాదేవీలు కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నిత్యానంద ఫొటోలతో ముద్రితమైనట్లుగా ఉన్న కరెన్సీ నోట్ల ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కర్ణాటక, గుజరాత్‌లలో ఆశ్రమాలు స్థాపించి ఆధ్మాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు తన వెబ్సైట్ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. దీంతో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఫిబ్రవరిలో బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇక ఇప్పుడు సొంతంగా బ్యాంకును కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. -
నిత్యానందపై అరెస్ట్ వారంట్
యశవంతపుర (బెంగళూరు): అత్యాచారం, మహిళ కిడ్నాప్ కేసుల్లో నిందితుడైన వివాదాస్పద స్వామి నిత్యానందకు రామనగర కోర్టు అరెస్ట్ వారంట్ జారీచేసింది. నిత్యానంద ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అతని లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రామనగర కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. నిత్యానందను అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రామనగర పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. నిత్యానంద ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నిత్యానంద అహ్మదాబాద్‌లోని ఆశ్రమం నుంచి విదేశాలకు పరారైనట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. కొన్నినెలలుగా నిత్యానంద బెంగళూరు శివార్లలోని బిడది ఆశ్రమానికి ముఖం చాటేశాడు. అతడు బెంగళూరులో ఉండి ప్రవచనాలు చేస్తున్నట్లు ఆయన శిష్యులు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. బెంగళూరులో లేని వ్యక్తి ఎలా ప్రవచనాలు చేస్తాడని పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి: నిత్యానందకు నోటీసులపై వింత జవాబు) -
నిత్యానందకు నోటీసులపై వింత జవాబు
బెంగళూరు: దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి కర్ణాటక పోలీసులు హైకోర్టుకు వింత సమాధానం ఇచ్చారు. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానానికి విన్నవించారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు. (నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్) ఇదిలా ఉండగా... బాలికలను అపహరించడం సహా వారిని లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో ‘కైలాస’ అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు ప్రకటనలు విడుదల చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. (ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద) ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు. కాగా నిత్యానంద తరఫున కోర్టుకు హాజరైన కుమారి అర్చానంద.. నిత్యానంద ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని.. ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు తనను ఇక్కడి తీసుకువచ్చారంటూ న్యాయస్థానం ఎదుట వాపోయింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కేసుల్లో నిందితుడైన నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక టూర్లో ఉన్నారని పోలీసులు చెప్పడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ నిత్యానంద కథేంటి? -
నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్లో కొంతమంది పిల్లలను అక్రమంగా నిర్బంధించారని కూడా నిత్యానందపై ఆరోపణలు ఉండటం తెలిసిందే. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఇంటర్‌పోల్ సభ్య దేశాలు ఆ వ్యక్తి ఆచూకీ, జరిగిన నేరానికి నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై అదనపు సమాచారం సేకరిస్తాయి. నిత్యానంద ఆనుపానులు తెలుసుకోవాలన్న గుజరాత్ పోలీసుల అభ్యర్థనకు స్పందించిన సీబీఐ ఆ మేరకు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిని పంపిందని అహ్మదాబాద్ డీఎస్పీ కె.టి.కమారియా తెలిపారు. నిత్యానందను అరెస్ట్ చేసేందుకు అవసరమైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయించేందుకు ప్రయత్ని స్తున్నట్లు ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని నిత్యా నంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఓ వైపు వెదుకుతుండగానే.. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు డిసెంబర్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
నిత్యానందకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆచూకీ కనుక్కోవాలని ఇంటర్‌పోల్ ప్రపంచ దేశాలను కోరింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్మాతికవేత్త నిత్యానంద గత ఏడాది విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ ఉంటే తెలపాలని భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బుధవారం ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలుచోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. లైంగిక, అత్యాచార ఆరోపణల్లో ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. (నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి) గుజరాత్, కర్ణాటక పోలీసుల వాంటెడ్ లిస్టులో నిత్యానంద ఉన్నారు. చిన్న పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమంలో బంధించి.. లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైన కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్‌లో కైలాసాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ఓ వీడియోలో నిత్యానంద బహిరంగ ప్రకటన విడుదల చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఆయనను ఈక్వెడార్‌లో లేరని, హైతీకి పారిపోయినట్లు ఈక్వెడార్ ఎంబసీ స్పష్టం చేసింది. ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద పేరుపెట్టినట్టు కూడా వార్తలు బలంగా వినిపించాయి. (నిత్యానంద మరో అకృత్యం) -
నిత్యానందకు రాణిగా తమిళనటి?
సాక్షి, చెన్నై: నిత్యానంద దేశానికి తమిళనటి ప్రధానమంత్రి కానుంది అనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న పేరు నిత్యానంద. ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే ఈ పేరు వివాదాల్లో ఉంది. అయితే మధ్యలో కాస్త మరుగున పడింది. తాజాగా పిల్లల కిడ్నాప్ కేసులో పోలీసులకు వాంటెడ్ వ్యక్తిగా మారాడు. ఆధ్యాత్మక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలు చోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. అయితే అంతేలా లైంగిక, అత్యాచార ఆరోపణల్లోనూ వాసికెక్కాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. కాగా ఈయనకు ప్రధాన శిష్యురాలుగా ఒక తమిళ నటి చేరి చాలా కాలమైంది. నిజానికి ఆమె తెలుగు అమ్మాయినే, తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది, నిత్యానందతో ఈమె సంబంధాల గురించి ఆ మధ్య చాలా రచ్చ జరిగింది. అయితే ఈ మూడక్షరాల నటి నిత్యానంద సేవలోనే తరుస్తూ వస్తోంది. అందుకు ఫలం ఇప్పుడు లభించనుందనే ప్రచారం జోరందుకుంది. ఆ నటికి ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి యోగం పట్టుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆధ్యాత్మికస్వామిగా తనను తాను ప్రచారం చేసుకున్న నిత్యానంద తాజాగా పిల్లల కిడ్నాప్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంకెళ్లు వేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే నిత్యానంద అంత సులభంగా పట్టుపడతాడా? అలాగైతే తను నిత్యానంద ఎలా అవుతాడు? గుట్టు చప్పుడు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అయితే తను దేశం విడిచి పారిపోయాడనే ప్రచారం జోరందుకుంది. అంతే కాదు చాలా సంచలన విషయాలు ఆయన గురించి ప్రచారం అవుతున్నాయి. నిత్యానంద దక్షిణ అమెరికా దేశం సమీపంలో ఉన్న ఒక దీవిని సొంతంగా కొనేశాడని, తను 30 మంది శిష్యగణంలో అక్కడే నివశిస్తున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఆ దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించుకుని,దానికి కైలాసదేశం అనే పేరును కూడా పెట్టుకున్నట్లు ప్రచారంలో ఉంది. అక్కడికి నిత్యానంద టన్నుల కొద్దీ బంగారాన్ని తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు తన దేశం కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించకున్నాడట. కైలాస దేశాని కంటూ ప్రత్యేకంగా జెండాను, సెపరేట్‌గా పాస్‌పోర్టు, వీసా వంటి వాటిని ఏర్పాటు చేసుకోనున్నారని ప్రచారంలో ఉంది. అంతే కాకుండా తన దేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితికి విన్పపం పెట్టుకోనున్నట్లు ఆయన వెబ్సైట్లో పేర్కొన్నాడు. అదే విధంగా తన దేశానికి హిందూ అనే అర్హత చాలని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఆ కైలాసదేశానికి అధిపతిగా రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్నట్లు, ఇప్పుడు ఆ దేశానికి తనకు అత్యంత సన్నిహితురాలైన తమిళ నటిని ప్రధానమంత్రిని చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా ఆ నటి త్వరలో కైలాసదేశానికి ప్రధానమంత్రి కాబోతోంది లాంటి ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం నిత్యానంద విదేశాలకు పారిపోలేదని, ఇండియాలోనే ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని అంటున్నారు. ఏది నిజమో, ఏది వదంతో ?తెలియదు గానీ, నిత్యానంద గొడవ మాత్రం మరో సారి మీడియాలో రోజుకో కథనంతో ప్రధాన శీర్శికల్లో హల్చల్ చేస్తోంది. -
నిత్యానంద దేశం.. అశ్విన్ ఆసక్తి!
హైదరాబాద్: అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద కొత్తగా సృష్టించిన కైలాస దేశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపింది. ‘కైలాసానికి వెళ్లేందుకు వీసా ఎలా పొందాలి? లేదంటే అక్కడికి వెళ్లాక వీసా ఇస్తారా?’ అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. కైలాస దేశం చూడటానికి వెళతావా? లేదంటే అక్కడే స్థిరపడతావా? అంటూ నెటిజన్లే ప్రశ్నిస్తున్నారు. ఇక నిత్యానంద దేశంపై అశ్విన్‌కు ఎందుకంత ఆసక్తి అంటూ మరొకరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. అసలు ఈ కొత్త దేశం ముచ్చటేంటంటే! వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్సైట్ పేర్కొంది. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు. మెరూన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి. -
రాయని డైరీ: నిత్యానంద (స్వామీజీ)
నిత్యం ఈ మనుషులు పెట్టే పరుగులు చూస్తుంటే, పరుగులు పెట్టేందుకే వీరు జన్మించి, జీవిస్తున్నారా అనే సందేహం నాకు ఏమాత్రం కలగకూడనిది. కానీ ఈవేళ కలుగుతోంది! ఐన్‌స్టీన్ కనిపెట్టిన ఈ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాను వట్టి ఫేక్ అని తేల్చేసిన నిత్యానందకు, ‘నా పని పూర్తయ్యే వరకు బయటికి రాకు’ అని సూర్య భగవానుడినే ఆజ్ఞాపించి నలభై నాలుగు నిమిషాల పాటు ఆయన్ని ఆకాశం వెనకే ఉంచేసిన నిత్యానందకు, ఆవులను.. ఎద్దులను.. సింహాలను.. పులులను, వానరాలను సంస్కృతంలో, తమిళంలో మాట్లాడించిన నిత్యానందకు.. కలగకూడని సందేహాలు కలుగుతున్నాయంటే భూగోళానికివి తిమిరాంధకార యుగారంభ ఘడియలనే!! అర్థం, పరమార్థం, అంతరార్థం లేని పరుగులతో మనుషులు అద్వైత భావనకు విఘాతం కలిగిస్తున్నారు. ‘నేను’ అనే భావన వీడితేనే పరుగు ఆగుతుంది. ఆశ్రమానికి వచ్చిన కొత్తలో ఒక యువతిని అడిగాను.. నిత్యానంద మీద నీ అమూల్యమైన అభిప్రాయం ఏమిటని. ‘ఆయన ఎక్కడ ఉంటారు?’ అని తన అమాయకమైన కనురెప్పల్ని టపటపలాడిస్తూ అడిగింది ఆ యువతి. ‘నేనే కదా నిత్యానందను. తెలియకనే అడిగావా?’ అన్నాను. ‘అలాంటప్పుడు మీరు నిత్యానంద మీద నీ అభిప్రాయం ఏంటని కాకుండా.. నా మీద నీ అభిప్రాయం ఏంటని అడిగి ఉండాల్సింది కదా!’ అంది. ఆ సాయంత్రం అద్వైతం గురించి చెప్పాక.. జ్ఞానం కోసం ఆశ్రమానికి వచ్చిన ఆ యువతికి ఇక పరుగులు తీసే అవసరమే లేకపోయింది. నేను దేశం దాటి వచ్చే సమయానికి నా కోసం రెండు రాష్ట్రాల పోలీసులు పరుగులు తీస్తూ ఉన్నారు. అవి వారిని చట్టం తీయిస్తున్న పరుగులే తప్ప వారి చేత నిత్యానంద తీయిస్తున్నవి కావని గ్రహించగలిగి ఉంటే వారికింత ప్రయాసే ఉండేది కాదు. ‘‘గురూజీ.. భోజనం వేళయింది’’ అనే మాట వినిపించింది! ఆ మాటలో నాకు ఏ రుచీ పచీ కనిపించడం లేదు. ఏ ఘుమఘుమలూ నన్ను నిండైన ఆ విస్తరి వైపు ఆకర్షించడం లేదు. ఈ రాత్రి మరో సందేహ వైపరీత్యం కూడా నన్ను ఎటూ కదలనివ్వకుండా చేస్తోంది. ‘‘జగమెరిగిన నిత్యానందుడు అంటే జగాన్ని ఎరిగిన నిత్యానందుడా? నిత్యానందను ఎరిగిన జగమా? ఎలా అర్థమౌతోంది నీకు?’’ అని భోజనం సిద్ధం చేసి వచ్చిన పరిచారకుడిని అడిగాను. ‘‘నాకంత నాలెడ్జి లేదు గురూజీ’’ అన్నాడు! ‘‘నిత్యానందుడి సేవలో ఎన్నాళ్లుగా తరిస్తున్నావ్?’’ అని అడిగాను. ‘‘ఇవాళే కొత్తగా వచ్చాను గురూజీ. మీరూ ఇవాళే కొత్తగా వచ్చారు. మీకిది పరాయి దేశం. మాకు మీరు పరాయి జ్ఞానం’’ అన్నాడు! నిత్యానంద ఒక పామరుడికి వ్యక్తిగా కాక ఒక జ్ఞానరూపంగా సాక్షాత్కరిస్తున్నాడంటే నిత్యానందుడు జగం ఎరిగినవాడే కాదు, జగం ఎరిగిన నిత్యానందుడు కూడా! ‘‘ఇంత జ్ఞానం నీకెలా వచ్చింది’’ అని అడిగాను. ‘‘ఎంత జ్ఞానం?’’ అన్నాడు. ‘‘నిత్యానందను జ్ఞానరూపంగా చూసే జ్ఞానం!’’ అన్నాను. ‘‘నేనే కాదు, మరికొందరు జ్ఞానులు కూడా బయట మీ కోసం వేచి ఉన్నారు. మిమ్మల్ని వెదుక్కుంటూ మీ దేశం నుంచి వచ్చారు. స్వామివారికిది భోజనం వేళ అని వారిని ఆపి ఉంచాను’’ అన్నాడు. జీవికి పరుగు తప్పదా అనే సందేహం మళ్లీ మొదలైంది నాలో. -మాధవ్ శింగరాజు -
పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని బిడది ధ్యాన పీఠాధిపతి వివదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. నిత్యానంద కోసం ధ్యానపీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్తర భారత పర్యటనలో ఉన్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌లోనూ నిత్యానందకు మఠం ఉండడంతో అక్కడకి వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. కాగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్భంధించిన తన ఇరువురు కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఇరువురిని విముక్తి కల్పించిన పోలీసులు నిత్యానందతో పాటు అహ్మదాబాద్‌కు చెందిన ఇరువురు ఆశ్రమ ముఖ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాదాలు తారాస్థాయికి చేరడంతో నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గురువారం బిడిదిలోని ధ్యానపీఠంకు పోలీసులు వెళ్ళగా సమగ్ర సమాచారం ఇవ్వలేదు. నిత్యానంద బిడిది ధ్యానపీఠంకు వచ్చి కొన్ని నెలలు అయ్యిందని అహ్మదాబాద్ ఆశ్రమంలో ఉండవచ్చునని తెలిపినట్లు సమాచారం. అయితే అతను విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగానే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్ద చేశారు. -
నిత్యానంద కోసం పోలీసుల గాలింపు
యశవంతపుర : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గంజాయి తీసుకోవాలని ప్రేరేపించే విధంగా వ్యాఖ్యల చేసిన నిత్యానందకు ఇటీవల సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన స్పందించపోవడంతో గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన బిడిది వీడి తమిళనాడులో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంజాయిపై ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఒక ప్రత్యేక బృందం నిత్యానంద కోసం గాలింపు చేపట్టారు. -
నిత్యానందకు ఊరట
మధురై: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందకు స్వల్ప ఊరట లభించింది. ‘మధురై ఆధీనం’లోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పీఠాధిపతిగా కాకుండా కేవలం సాధారణ భక్తుడిగానే నిత్యానందకు మఠంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుత పీఠాధిపతి నిత్యానందను మధురై ఆధీనంకు 293వ గురు మహా సన్నిధానంగా గతంలో నియమించారు. అయితే ఆ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు భక్తులు న్యాయస్థానంలో కేసు వేశారు. అది పెండింగ్‌లో ఉండగా.. తనను మఠంలోకి అనుమతించాలంటూ మద్రాస్ హైకోర్టును నిత్యానంద ఆశ్రయించారు. ఇప్పుడు పిటిషన్‌పై విచారణ పూర్తి కావటంతో మఠంలోకి అనుమతిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే కింది కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున పిటిషనర్‌ను కేవలం సాధారణ పౌరుడిగా మాత్రమే అనుమతిస్తామని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. మఠానికి వెళ్లే ముందు నిర్వాహకులకు, పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని నిత్యానందకు కోర్టు సూచించింది. అదే సమయంలో నిత్యానందకు రక్షణ కల్పించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. (నా భార్యను బంధించారు.. విడిపించండి) -
నిత్యానంద నుంచి నా భార్యను విడిపించండి
టీ.నగర్: నిత్యానంద ఆశ్రమం నుంచి తన భార్యను విడిపించాలని భర్త కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. రాశిపురం తాలూకా పట్టణం మునియప్పపాళయం ప్రాంతానికి చెందిన రైతు రామస్వామి. ఇతని భార్య అత్తాయి (50). రామస్వామి తన భార్య నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారని, ఆమెను విడిపించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఒక పిటిషన్ అందజేశారు. అందులో.. తన భార్య అత్తాయి, కుమారుడు పళనిస్వామి కొన్ని నెలల కిందట బెంగళూరులోని నిత్యానంద మఠానికి ధ్యానం చేసేందుకు వెళ్లారని, తర్వాత వారు తిరిగి రాలేదని తెలిపారు. దీనిపై నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు బెంగళూరుకు వెళ్లి తన కుమారుడు పళనిస్వామిని విడిపించి తనకు అప్పగించినట్లు తెలిపారు. అయితే అత్తాయి రాలేదని, ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. తన భార్య పేరిట వడుకం ఇండియన్ బ్యాంకులో రూ.5లక్షలు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.5లక్షలు, నగల రుణం రూ.30 వేలు, బయటి వ్యక్తుల రుణాలు రూ.11 లక్షల వరకు ఉన్నాయని, ఈ నగదును ధ్యాన తరగతులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి నగదు చెల్లించాలని కోరుతున్నారని, ఎనిమిది నెలలుగా మానసిక క్షభకు గురవుతున్నట్లు తెలిపారు. తనకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని, తన భార్యను నిత్యానంద ఆశ్రమం నుంచి విడిపించాలని కోరారు. -
నిత్యానందకు సుప్రీంలో చుక్కెదురు..
న్యూఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2010లో నిత్యానందపై అత్యాచార కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలనే ఆయన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. ఆయనతో పాటు అత్యాచార కేసులో భాగస్వాములుగా ఉన్న మరో ఐదుగురి పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. తనపై గల నేరాఆరోపణలపై పునర్విచారణ చేపట్టాల్సిందిగా, ఈ కేసు నుంచి విముక్తి కల్పించాల్సిందిగా నిత్యానంద కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. కాగా కర్ణాటక హైకోర్టు ఆయన పిటిషన్‌ను మే 16న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సోమవారం సుప్రీంను ఆశ్రయించారు. తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదుతో 2010లో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో 2010 ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన నిత్యానందకు, బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. -
నిత్యానంద ఆశ్రమంలో ఆ ఇద్దరిని విడిపించండి!
తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తన కుమారుడు, మనవరాలిని విడిపించాలని కోరుతూ దంపతులు ఆశ్రమం ముందు ధర్నా నిర్వహించారు. వివరాలు.. తేని జిల్లా పెరియకులం వడకరై సుబ్రమణ్య వీధికి చెందిన కార్తి రైతు, ఇతని భార్య ఈశ్వరి. దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె వనిత ఉన్నారు. మనోజ్‌కుమార్ మేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం మదురైలోని నిత్యానంద ధ్యాన మండపానికి వెళ్లిన మనోజ్ తిరిగి రాలేదు. ఈ స్థితిలో మనోజ్‌కుమార్ తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులోని నిత్యానంద ఆశ్రమంలో ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తల్లిదండ్రులు ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని ఆశ్రమ సిబ్బంది లోనికి అనుమతించలేదు. మనోజ్‌కుమార్ బెంగళూరులోని ఆశ్రమంలో ఉన్నాడని, ధ్యానంలో ఉన్నందున చూసేందుకు వీలుకాదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. మనోజ్‌కుమార్‌తో పాటు తమ మనవరాలు నివేద(17) (వనిత కుమార్తె)ను ఆశ్రమంలో నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించడంతో వారిని సిబ్బంది అక్కడినుంచి వెల్ల్లగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమం వద్దకు చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో ఆశ్రమ సిబ్బంది తాము ఎవ్వరినీ బలవంతంగా నిర్బంధించలేదని, భక్తులు స్వయంగా వచ్చి ధ్యానంలో పాల్గొంటున్నారని ఆధారాలతో తెలిపారు. ఇలాఉండగా మనోజ్ తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడు, మనవరాలిని ఆశ్రమంలో నిర్బంధించారని వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారనే విషయం కూడా తమకు తెలియరాలేదన్నారు. వనిత మాట్లాడుతూ మదురైలో జరిగిన నిత్యానంద ధ్యాన శిక్షణలో తాను కుమార్తె సహా పాల్గొన్నట్టు తెలిపారు. ఒక నెల ప్రత్యేక ధ్యానం అని చెప్పి తమను తిరువణ్ణామలై ఆశ్రమానికి తీసుకొచ్చారన్నారు. ఆ సమయంలో తన తండ్రికి అనారోగ్యం అని తెలియడంతో ఆశ్రమంలో రూ.3లక్షలు చెల్లించి కుమార్తెను ఇక్కడే వదిలి ఇంటికి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం తన కుమార్తెను చూసేందుకు కూడా ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం లేదన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
‘కంచి’ కలకలం, నిత్యానంద శిష్యులకు వార్నింగ్!
►రూ.2వేల కోట్ల ఆస్తుల కోసమేనని అనుమానం ►నిత్యానంద శిష్యులకు పోలీస్ హెచ్చరిక ►క్షేమంగా ఉన్నానని మఠాధిపతి ఫోన్ చెన్నై: కోట్లాది రూపాయల ఆస్తులు ఎవరికి చేదు అన్నట్లుగా కాంచీపురం మఠం కలకలం రేపింది. మఠాధిపతి కిడ్నాప్ అంటూ పోలీసుల కేసు, బెంగళూరులో క్షేమంగా ఉన్నానంటూ మఠాధిపతి పోలీసులకు ఫోను, ఆస్తికోసం మొదలియార్ల నాటకమని ఆరోపణలు. కథలన్నీ కంచి చేరుతాయనే జాతీయంలా ఆది, సోమవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలకు కొత్త కథను పరిచయం చేశాయి. కంచిలోని ఓ మఠానికి సంబంధించిన వ్యవహారం తమిళనాడులో రెండు రోజుల పాటు పెద్ద కలకలాన్ని రేపింది. సోమవారం సాయంత్రానికి కొత్త మలుపుతిరిగింది. కాంచీపురం పరమశివన్ వీధిలో తొండమండల మొదలియార్ సామాజికవర్గానికి చెందిన పురాతనమైన జ్ఞానప్రకాశ మఠం ఉంది. వంశపారంపర్యం నిర్వహణలోని ఈ మఠం 232 వ మఠాధిపతిగా 2008 నుంచి జ్ఞానప్రకాశ దేశిక పరమాచార్య స్వామి వ్యవహరిస్తున్నారు. ఈ మఠానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. బెంగళూరుకు చెందిన నిత్యానంద శిష్యులు (ఒక పురుషుడు, ఒక స్త్రీ) రెండునెలల క్రితం మఠానికి చేరుకుని సేవలతో తరిస్తామంటూ స్వామి పంచనచేరారు. మఠంలోని మరకత శివలింగానికి సహజంగా ఆచరించే పారంపర్యపూజ విధానాన్ని నిత్యానంద శిష్యులు మార్చివేశారు. అంతేగాక మఠానికి వచ్చే భక్తులను ఆశీర్వదించడం తదితర నిర్వాకానికి పాల్పడుతూ మఠంపై పథకం ఆధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయాన్ని మండల మొదలియార్ల సంఘం నిర్వాహకులు మఠాధిపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాల గురించి చర్చించేందుకు రావాల్సిందిగా మఠాధిపతి సంఘం నేతలకు కబురు పంపారు. ఈ క్రమంలో మొదలియార్ల సంఘంతో మఠాధిపతి సోమవారం చర్చలు జరపాల్సి ఉంది. మఠాధిపతి అదృశ్యం ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం మొదలియార్ సంఘం నేతలు వెళ్లి చూడగా మఠం తలుపులు మూసిఉన్నాయి. మఠాధిపతి కనిపించలేదు. మఠా«ధిపతి నిత్యం వినియోగించే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కీడు శంకించిన సంఘం నేతలు కాంచీపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదుచేశారు. మఠాధిపతిని నిత్యానంద శిష్యులు కిడ్నాప్‌చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మఠంలో చోటుచేసుకున్న పరిణామాలను ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం, ఆదివారం ఉదయం మఠం తలుపులకు బయటివైపు నుంచి తాళం వేసి ఉంది. సోమవారం ఉదయం లోపలివైపు గడియపెట్టి ఉంది. మఠం లోపల పదిమందికి పైగా నిత్యానంద శిష్యులు ఉన్నట్లు ఇరుగుపొరుగు వారు మిద్దెల పైనుంచి చూసి నిర్ధారించారు. ఈ శిష్యగణమంతా కలిసి మఠంలో సోమవారం ఉదయం పూజలు కూడా నిర్వహించాని చెప్పారు. మఠానికి చేరుకున్న పోలీసులు అక్కడి నిత్యానంద శిష్యులను విచారించారు. మూడు రోజుల్లోగా మఠాన్ని, మఠాధిపతిని అప్పగించాలని లేని పక్షంలో అరెస్టులు తప్పవని హెచ్చరించారు. నేనే వెళ్లా.. మఠాధిపతి కనపడటం లేదని కొందరు, కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదులతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చించుకోవడం ప్రారంభించారు. సోమవారం నాటి తమిళ సాయంకాల దినపత్రికల్లో ప్రముఖంగా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. కాంచీపురంలోని కలకలం బెంగళూరులో ఉన్న మఠాధిపతి చెవినపడింది. ఆయన వెంటనే కాంచీపురం పోలీసులకు ఫోన్‌చేసి క్షేమ సమాచారం ఇచ్చారు. నిత్యానంద శిష్యులను వెంటబెట్టుకుని తన ఇష్టపూర్వకంగానే బయలుదేరానని, ప్రత్యేక పూజల నిమిత్తం బెంగళూరులో ఉన్నానని పోలీసులకు తెలిపారు. మఠానికి చెందిన ఆస్తులను కాజేసేందుకు మొదలియార్ల సంఘం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ కిడ్నాప్ ఉదంతమని మఠాధిపతి పోలీసులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సంఘటనపై మొదలియార్ సంఘం నేతలు మాట్లాడుతూ, పారంపర్యానికి చెందిన ఈ మఠానికి సుమారు రూ.2వేల కోట్ల ఆస్తులను అపçహరించేందుకు నిత్యానంద శిష్యులు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. మఠం ఏ ఒక్కరి వ్యక్తి సొత్తు కాదని, మఠాన్ని తమ సంఘానికి లేదా ప్రభుత్వానికి గానీ అప్పగించాలని మఠాధిపతిని డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. -
ఆయన పురుషుడే!
కోర్టుకు చేరిన నిత్యానంద పురుషత్వ పరీక్షల నివేదిక 31 పేజీల నివేదికను అందజేసిన సీఐడీ కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సంబంధించిన పురుషత్వ పరీక్షల నివేదిక రామనగర సెషన్స్ కోర్టుకు బుధవారం చేరింది. తాను ఆరేళ్ల బాలుడులాంటి వాడినని అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిత్యానంద గతంలో కోర్టుకు విన్నవించిన విషయం తెల్సిందే. అయితే పురుషత్వ పరీక్షల్లో ఆయన ‘ పురుషుడే’ అని నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో నిపుణుల సమక్షంలో పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన 31పేజీల నివేదికను కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం డీఎస్పీ లోకేష్ బుధవారం రామనగర్‌లోని సెషన్స్ కోర్టుకు అందించారు. ఇదే కేసుకు సంబంధించి ఆయనకు నిర్వహించిన ధ్వని సంబంధ పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. విచారణ సందర్భంగా నిత్యానందతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఆయన శిష్యులు కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు నిపుణుల నిర్వహించిన పరీక్షల్లో నిత్యానంద తన వయసు తగ్గట్టు శారీరక, మానసిక పరిపక్వత చెందారని... అందువల్ల ఆయన పురుషత్వ పరీక్షల్లో ‘పాస్’ అయినట్లు తేలిందని విశ్వసనీయ సమాచారం.