యశవంతపుర : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గంజాయి తీసుకోవాలని ప్రేరేపించే విధంగా వ్యాఖ్యల చేసిన నిత్యానందకు ఇటీవల సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన స్పందించపోవడంతో గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన బిడిది వీడి తమిళనాడులో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంజాయిపై ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఒక ప్రత్యేక బృందం నిత్యానంద కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment