
వివాదాస్పద స్వామిజీ నిత్యానందకు భక్తులే కాదు, అభిమానులు, ప్రేమికులు ఎక్కువే. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నిత్యానంద దేశం విడిచి పారిపోయి, కైలాస అనే దీవిలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నటి ప్రియా ఆనంద్ తాను నిత్యానందను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. అమెరికాలో పెరిగిన ఈ బ్యూటీ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది.
కోలీవుడ్‌లో వామనన్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్, ఆర్‌జే బాలాజీకి జంటగా నటించింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన భేటీలో తన పెళ్లి ప్రస్థావన తీసుకురాగా నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆయన గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న వ్యక్తి నిత్యానందస్వామి అని, ఆయన్ని పెళ్లి చేసుకుంటే తనకు పేరు మార్చుకోవలసిన అవసరం కూడా ఉందంటూ సరదాగా బదులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment