Priya Anand
-
శ్రీవారిని దర్శించుకున్న సినీనటి ప్రియా ఆనంద్ (ఫొటోలు)
-
తిరుమలలో హీరోయిన్ ప్రియా ఆనంద్
-
Priya Anand: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ప్రియా ఆనంద్ (ఫొటోలు)
-
లీడర్ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
హైదరాబాద్‌లో పుట్టి.. అమెరికాలో పెరిగి.. చెన్నైలో మోడలింగ్ చేసి హీరోయిన్గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. రానా మూవీ లీడర్ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించింది. ఆ చిత్రంలో జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాకముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేసింది. వామనన్ అనే తమిళ చిత్రంలో సినీరంగంలోకి ప్రవేశించింది. తమిళ బ్యూటీ ప్రియా ఆనంద్ లీడర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. సినిమా హిట్ అయినప్పటికీ ఆమె పెద్దగా అవకాశాలు రాలేదు. పలు కారణాలతో ఆమె ఛాన్సులు రాకుండా పోయాయి. కొన్ని సినిమాల్లో సెకండ్ ఛాయిస్‌గా ప్రియాను తీసుకున్నారు. వాటిలో రామ్ పోతినేని, సిద్దార్థ్, రానా, శర్వానంద్‌తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె చేస్తుందన్న దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ కనుమరుగై పోయినా.. కోలీవుడ్‌లో మాత్రం బీజీ అయిపోయింది. ఇటీవల తమిళ డబ్బింగ్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అవకాశాలు రావడంతో అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే ఓ తమిళ మూవీలో హీరోయిన్గా చేస్తుండగా.. మరో కన్నడ మూవీకి ఓకే చెప్పిందంట ప్రియా ఆనంద్. -
హీరోయిన్ ప్రియా ఆనంద్‌కు లక్కీ ఛాన్స్.. యమ ఖుషీలో నటి
అనుకున్నది జరగకపోవడం, ఊహించనిది జరగడమే జీవితం. అందుకే అంటారు పెద్దలు ఏం జరిగినా అంతా మన మంచికే అని. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు హాట్ టాక్‌గా వరిన విషయం విజయ్ 67 చిత్రం. బీస్ట్ చిత్రం నిరాశపరినా, వారీసు చిత్రంతో నటుడు విజయ్ మళ్లీ విజయబాట పట్టారు. ప్రస్తుతం తన 67వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి మాస్టర్, విక్రమ్ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను నిర్మాతలు వినత్న పద్ధతిలో గంటకో నటుడి చొప్పున పరిచయం చేశారు. ముందుగా నటుడు అర్జున్ పేరును, ఆ తరువాత దర్శకుడు గౌతమ్ మీనన్, మిష్కిన్, మ్యాత్యూ థామస్, మన్సూర్ అలీఖాన్, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, నృత్యదర్శకుడు శాండి, నటి ప్రియా ఆనంద్ తాజాగా బుధవారం త్రిష పేరును ప్రకటించారు. నటి త్రిష ఇంతకు ముందు విజయ్ సరసన మూడు చిత్రాల్లో నటించారు. సుమారు 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు నటిస్తున్నారు. ఇక నటి ప్రియాఅనంద్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఈ అమ్మడికి నటించే అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే ఇంత పెద్ద అవకాశం రావడం ఈమెకు ఇదే తొలిసారి అవుతుంది. వామనన్ చిత్రం ద్వారా 2009లో కథానాయకిగా పరిచయం అయిన నటి ప్రియా ఆనంద్. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్ద స్టార్స్‌తో ఇప్పటి వరకూ నటించలేదు. తాజాగా విజయ్‌తో జత కట్టే అవకాశం రావడంతో యమ ఖుషీ అయిపోతోందట. కారణం 11 ఏళ్ల క్రితం విజయ్ సరసన తుపాకీ చిత్రంలో ఈ బ్యూటీనే నటించాల్సి ఉందట. ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తొలి చాయిస్ కూడా ప్రియా ఆనంద్‌నే నట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్‌తో జత కట్టే అవకాశం రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందంటోంది. -
Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా'
వివాదాస్పద స్వామిజీ నిత్యానందకు భక్తులే కాదు, అభిమానులు, ప్రేమికులు ఎక్కువే. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నిత్యానంద దేశం విడిచి పారిపోయి, కైలాస అనే దీవిలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నటి ప్రియా ఆనంద్ తాను నిత్యానందను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. అమెరికాలో పెరిగిన ఈ బ్యూటీ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. కోలీవుడ్‌లో వామనన్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్, ఆర్జే బాలాజీకి జంటగా నటించింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన భేటీలో తన పెళ్లి ప్రస్థావన తీసుకురాగా నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆయన గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న వ్యక్తి నిత్యానందస్వామి అని, ఆయన్ని పెళ్లి చేసుకుంటే తనకు పేరు మార్చుకోవలసిన అవసరం కూడా ఉందంటూ సరదాగా బదులిచ్చింది. చదవండి: (సీఎంను డైరెక్ట్ చేసిన విఘ్నేశ్ శివన్) -
'కాసేదాన్ కడవులడా' రీమేక్‌లో ప్రియా ఆనంద్
చెన్నై: 1972లో విడుదలైన క్లాసిక్ కామెడీ చిత్రం కాసేదాన్ కడవులడా. ముత్తురామన్, లక్ష్మి నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ రీమేక్ అవుతోంది. ఇందులో నటుడు మిర్చి శివ, నటి ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణియం, ఛాయాగ్రహణం, కన్నన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు కన్నన్ వివరిస్తూ కాసేదాన్ కడవులడా చిత్ర రీమేక్ హక్కులను అధికార పూర్వకంగా పొంది దాని స్థాయికి తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. -
హీరోయిన్ ప్రియ ఆనంద్ గ్లామర్ ఫోటోలు
-
18 మెట్లు
నాలుగు దశాబ్దాల కెరీర్లో దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ఇప్పుడు 18 మెట్లు ఎక్కబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘పదునెట్టామ్ పడి’. అంటే.. 18 మెట్లు అని అర్థం. ఈ చిత్రంలో మమ్ముట్టి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాన్ అబ్రహాం పాలక్కల్ అనే ప్రొఫెసర్ పాత్ర చేస్తున్నారు. స్టైలిష్ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారాయన. శంకర్ రామకృష్ణన్ దర్శకుడు. ఈ చిత్రంలో మమ్ముట్టి లుక్‌కి మంచి స్పందన లభించింది. ఆయనది సినిమాకి కీలకంగా నిలిచే అతిథి పాత్ర అని సమాచారం. పృథ్వీరాజ్, ప్రియా ఆనంద్, ఆర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆరు నుంచి ఆరు
హీరో సూర్య, దర్శకుడు హరిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ ఆల్రెడీ ‘ఆరు, వేల్ (తెలుగులో ‘దేవా’) ‘సింగం’ సిరీస్‌లో మూడు సినిమాలు.. ఇప్పటివరకూ మొత్తంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ‘ఆరు’ సినిమాతో కలసిన ఈ కాంబినేషన్ ఆరో సినిమా కోసం చేతులు కలపబోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ నిర్మించనుందట. అయితే సూర్య, హరి చేయబోయే చిత్రం ‘సింగం’ సిరీస్ సీక్వెల్ కోసం కాదు. ‘వేల్’ సీక్వెల్ అని చెన్నై టాక్. మరోవైపు సీక్వెల్ కాదు.. ‘వేల్’ సినిమా తరహాలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందనే వార్త వినిపిస్తోంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియా ఆనంద్, సమీరా రెడ్డి యాక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ‘యన్‌జీకే’, కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు సూర్య. అలాగే ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఒప్పుకున్నారు సూర్య. దాంతో పాటుగా హరి చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారని ఊహించవచ్చు. -
రాబిన్‌హుడ్ టైప్
చేతిలో ఆయుధం ఉంది. గుండెల్లో తెగువ ఉంది. ఒంట్లో సత్తా ఉంది. ఇన్ని ఉంచుకుని కూడా ఒక హీరో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అందుకో కారణం ఉంటుంది. ఇక్కడ నివీన్ పౌలీకి కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే అతను దొంగ. మాములు దొంగ కాదు. రాబిన్ హుడ్ టైప్. అంటే ధనవంతులను దోచి పేదలకు పంచుతాడన్నమాట. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివీన్ పౌలీ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘కాయమ్‌కులమ్ కొచ్చిన్’. గోకులమ్ గోపాలన్ నిర్మించారు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఓనమ్ ఫెస్టివల్‌కు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటి ట్రవాంకూర్ ఏరియాలో దారిదోపిడి దొంగగా హడలెత్తించిన కాయమ్‌కులమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని మాలీవుడ్ టాక్. ప్రియాంకా త్రిమ్మేష్, సున్నీ వాణ్నే, బాబు ఆంటోనీ తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. -
లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్
దాదాపు 3,864 గంటలు.. అంటే 161 రోజులు దొంగగా ఉన్నారు మలయాళ నటుడు నివిన్ పౌలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదంతా.. ఆయన హీరోగా నటించిన ‘కాయమ్‌కులమ్ కొచ్చున్’ సినిమా గురించి. ‘నోట్‌బుక్’ ఫేమ్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 19వ శతాబ్దంలో దారి దోపిడీ దొంగగా సెంట్రల్ ట్రావెన్కోర్ ప్రాంతాన్ని గడగడలాడించిన కాయమ్‌కులమ్ కొచ్చున్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్‌లాల్ కీలక పాత్ర చేసిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయిక. గోపీసుందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ‘‘సెట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ పీపుల్స్‌తో 161 డేస్ వర్క్ చేశాను. ఈ ఒక్క సినిమాతో లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్ పొందిన అనుభూతి కలిగింది’’ అని పేర్కొన్నారు నివిన్ పౌలి. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. -
రేడియో జాకీతో ప్రియాఆనంద్ రొమాన్స్
తమిళసినిమా: రాజకీయాలకు, సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో ఏవరైనా నాయకుడు కావచ్చు. సినిమాల్లో ఎవరైనా కథానాయకుడు కావచ్చు. ఆ విధంగా కథానాయకుడిగా మారిన హాస్యనటుల పట్టికలో తాజాగా ఆర్జే.బాలాజీ చేరుతున్నాడు. చక్కని ఉచ్చరింపు, ఆకట్టుకునే అభినయం వంటి ప్లస్ పాయింట్స్‌తో అనతికాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయిన నటుడు ఆర్కే.బాలాజీ. ఇతనిప్పుడు ఎల్కేజీ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇది రాజకీయ సెట్టైరికల్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అట.వేల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ కే.గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్జే.బాలాజీకి జంటగా నటి ప్రియాఆనంద్ నటిస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, సాహితీవేత్త అయిన నాంజల్ సంపత్ ముఖ్య పాత్ర ద్వారా నటుడిగా పరిచయం అవుతుండడం విశేషం. ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆర్జే.బాలాజీ తెలుపుతూ ఈ తరం యువతకు రాజకీయాల గురించి తెలియనివి ఉండవనే చెప్పవచ్చునన్నారు. బ్రేకింగ్ న్యూస్ అనే కాలంలో జీవిస్తున్న యువతకు రాజకీయాల గురించి, రాజకీయనాయకుల మనస్తత్వాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అధికం అవుతోందన్నారు. అలాంటి వారి కోసమే ఈ ఎల్కేజీ చిత్రం అని చెప్పారు. ఇందులో తనకు తండ్రిగా నాంజల్ సంపత్ నటిస్తున్నారని తెలిపారు. నేటి యువతరంలో నాంజిల్ సంపత్‌కు మంచి పేరు ఉందన్నారు. అదేవిధంగా తనకు చిరకాల స్నేహితురాలైన ప్రియాఆనంద్ నటిగా కంటే కూడా అధిక అక్కర చూపిస్తూ ఈ చిత్రంలో నటించడం ప్రశంసనీయం అన్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని, మేయాద మాన్ చిత్ర ఫేమ్ విదు ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు. ఈ ఎల్కేజీ చిత్రం రాజకీయ సెట్టైరికల్తో పాటు అన్ని వర్గాలను రంజింపజేసే సన్నివేశాలతో కూడి ఉంటుందని ఆర్జే.బాలాజీ చెప్పారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
ఎల్కేజీ హీరో
‘ఎల్కేజీ’ జాయిన్ అయ్యారు ఆర్జే బాలాజీ. మూడు పదుల వయసు తర్వాత ఆయన ‘ఎల్కేజీ’లో జాయిన్ అవ్వడం ఏంటీ? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది సినిమా పేరు. రేడియో జాకీగా కెరీర్‌ను స్టార్ట్ చేసి టీవీ ప్రజెంటర్, హాస్య నటుడిగా ఎదిగిన బాలాజీ ఇప్పుడు హీరోగా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రభు దర్శకునిగా పరిచయం అవుతూ ఆర్జే బాలాజీ హీరోగా నటించనున్న చిత్రం ‘ఎల్కేజీ’. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించనున్నారు. శుక్రవారం ‘ఎల్కేజీ’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని కోలీవుడ్ టాక్. ఇందులో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆర్జే బాలాజీనే అందించనుండటం విశేషం. ఈ సినిమాకు లియాన్ జేమ్స్ బాణీలు సమకూర్చనున్నారు. మూవీ టైటిల్‌ను బట్టీ ‘ఎల్కేజీ’ అనేది సినిమాలో ఓ పొలిటికల్ పార్టీ కూడా అయ్యి ఉండవచ్చన్నది కొందరి ఊహ. -
దొంగను పట్టిస్తాడా?
...లేక దొంగకు సాయం చేస్తారా మోహన్‌లాల్. దొంగ ఎవరు? అయినా మోహన్‌లాల్ సాయం చేయడం ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయంలోకి వస్తే... రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, ప్రియా ఆనంద్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కాయాకులమ్ కొచ్చున్నీ’. హైవేపై రాబరీ చేసే దొంగ పాత్రను నివిన్ చేస్తున్నారు. ఓ కీలక పాత్రను మోహన్‌లాల్ చేస్తున్నారు. ఇటీవల ఈ షూటింగ్లో పాల్గొన్న మోహన్‌లాల్ తన లుక్‌ను రివీల్ చేశారు. మరి మోహన్‌లాల్‌కు, దొంగకు ఉన్న లింకేంటీ అనేది తెలియాలంటే థియేటర్స్‌లో బొమ్మ పడేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమా నైన్టీన్త్ సెంచరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. -
వారెవా.. ఏమి చాన్సు!
మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ నివీన్ పౌలీ ప్రస్తుతం ‘వారెవా ఏమి చాన్సు’ అని సంబరపడిపోతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే.. నివీన్ పౌలీ, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాయమ్ కులమ్ కొచ్చున్ని’. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మోహన్‌లాల్‌ను సంప్రదించడం, ఆయన ఒప్పుకోవటం జరిగిపోయింది. ఈ విషయాన్ని నివీన్ పౌలీ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసుకున్నారు. ‘‘కాయమ్ కులమ్ కొచ్చున్ని’ సినిమాలో మోహన్‌లాల్‌గారు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన నటించడానికి ఒప్పుకోవడంతో మా టీమ్ అందరం చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఇదొక పీరియడ్ ఫిల్మ్. 19వ శతాబ్దంలో ‘కాయమ్ కులమ్’ అనే వ్యక్తి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివీన్ పౌలీ కాయమ్ కులమ్గా కనిపించనుండగా మోహన్‌లాల్ ‘ఇత్తికర పక్కి’ అనే రోల్లో కనిపించనున్నారట. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గోకులం గోపాలం నిర్మిస్తున్నారు. -
అమల ఒకటి.. ప్రియ మూడు వదులుకున్నారు
మ్యాచ్ రిజల్ట్‌ని రెయిన్ చేంజ్ చేస్తుంది. ఆ మాటకొస్తే చాలా విషయాల్లో రెయిన్ ఇబ్బందులపాలు చేస్తుంది. ఇప్పుడు మాత్రం వరుణుడు హీరోయిన్ అమలా పాల్‌ను ఇరుకుల్లో పడేశాడు. ఎలాగంటే.. హెవీ రెయిన్స్ వల్ల అమలా పాల్ ఓ సినిమా చాన్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందట. నివీన్ పౌలీ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘కాయమ్‌కులమ్ కోచున్ని’. ఇందులో హీరోయిన్ జానకి పాత్రకు ముందుగా అమలా పాల్‌ను సెలక్ట్ చేశారు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ, సడన్‌గా అమలా పాల్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్‌లో ప్రియా ఆనంద్‌ను కథానాయికగా తీసుకున్నారు. తెలుగులో లీడర్, 180, కో అంటే కోటి వంటి చిత్రాల్లో ప్రియా ఆనంద్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘రీసెంట్గా పడిన వర్షాల వల్ల మా సినిమా షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. ఆ చేంజేస్ ఏఫెక్ట్ అమలా పాల్ డేట్స్‌పై పడింది. ఆమె బిజీ హీరోయిన్. మార్చిన తేదీలకు తగ్గట్టుగా అమలా పాల్ డేట్స్ ఇవ్వలేకపోయారు. అందుకే ప్రియా ఆనంద్‌ను హీరోయిన్గా తీసుకున్నాం’’ అన్నారు రోషన్. ‘‘ఈ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ గ్రేట్ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేసేందుకు నేను మూడు సినిమాలను వదులుకున్నాను’’ అన్నారు ప్రియ. అయితే మరోవైపు ఈ ‘కాయమ్‌కులమ్ కోచున్ని’ చిత్రంలో అమలా పాల్‌ను కావాలనే తప్పించారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ‘ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది రీ–ప్లేస్మెంట్ కాదు. డేట్స్ కుదరక నేనే తప్పుకున్నా. అండ్.. నేను మీకులా ఖాళీగా లేను ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడానికి’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అమలాపాల్. -
నివీన్బాలితో జోడీ కట్టని అమలాపాల్
తమిళసినిమా: నటి అమలాపాల్ మరోసారి హెడ్‌లైన్స్‌లోకెక్కింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుడు విజయ్ నుంచి ఏడాదిలోనే విడిపోయి, విడాకులు పొందిన ఈ కేరళ జాణ మళ్లీ హీరోయిన్గా బిజీ అయ్యింది. ఇటీవల తిరుట్టుప్పయలే–2 చిత్రంలో బాబీసింహాతో శ్రుతిమించిన రొమాన్స్ సన్నివేశాల్లో నటించి చర్చకు తావిచ్చిన అమలాపాల్ అరవిందస్వామికి జంటగా నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో ఈ అమ్మడు ఇద్దరు పిల్లలకు అమ్మగా నటించింది. మలయాళం, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటించడానికి అంగీకరించి తాజాగా ఆ చిత్రం నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు జ్యోతిక ప్రధాన పాత్రలో 36 వయదినిలే వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన మలయాళ దర్శకుడు రోషన్ఆండ్రూస్ తాజాగా కాయం కుళం కొచ్చుణ్ణి (మలయాళ వెర్షన్ టైటిల్) పేరుతో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మలయాళ యువ క్రేజీ నటుడు నివీన్‌బాలి కథానాయకుడిగా నటిస్తున్నా రు. ఆయనకు జంటగా అమలాపాల్‌ను ఎంపిక చేశా రు. ఇది 1980లో కేరళలో జీవించిన ఒక గజదొంగ యథార్థ ఇతివృత్తంతో రూపిందిస్తున్న చిత్రం. ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.ఈ చిత్ర హీరోయిన్ గెటప్ అవుట్ లైన్ చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇలాం టి పరిస్థితుల్లో ఏమయ్యిందో ఏమోగానీ అనూహ్యంగా చిత్రం నుంచి అమలాపాల్ వైదొలిగినట్లు ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.అంతే కాదు ఇప్పుడీ పాత్రలో నటి ప్రియాఆనంద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ అంశంపై అమలాపాల్ నోరు విప్పితే గానీ విషయం ఏమిటన్నది తెలుస్తుంది. -
నేనూ ఎంజాయ్ చేస్తున్నా
తమిళనాడులో పుట్టి అమెరికాలో పెరిగి, మోడలింగ్‌లో అడుగిడి, నటిగా రాణిస్తున్న నటి ప్రియాఆనంద్. వామనన్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత అరిమా తంబి, ఇరుంబు కుదిరై, వైరాజావై చిత్రాలతో వేగంగా ఎదుగుతూ వచ్చిన ప్రియాఆనంద్ అనూహ్యంగా వెనుక పడింది. చాలా గ్యాప్ తరువాత ముత్తురామలింగం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మతో చిన్న భేటీ.. ప్ర: మధ్యలో మిమ్మల్ని కోలీవుడ్ దూరం పెట్టినట్లుందే? జ:నేనలా భావించడం లేదు. నిజం చెప్పాలంటే హీరోయిన్ హీరోను ప్రేమిస్తూ తన చుట్టూ చెట్లు, గుట్టలు తిరుగుతూ పాటలు పాడే పాత్రలు చేసి బోర్ కొట్టింది. చెబితే నమ్మరు గానీ అలాంటి పలు అవకాశాలను నేను నిరాకరించాను. అయినా ఇప్పుడు నేను నటిగా బిజీగానే ఉన్నాను. ఎస్రా అనే చిత్రం ద్వారా తొలి సారిగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను.అందులో పృథ్వీరాజ్‌కు జంటగా నటిస్తున్నాను.అదే విధంగా రాజకుమారా అనే కన్నడ చిత్రంలో పునీత్‌రాజ్‌కుమార్ సరసన నటిస్తున్నాను.తమిళంలో ముత్తురామలింగం చిత్రం చేస్తున్నాను. నేను ఇంటి ముఖం చూసి 45 రోజులైంది. ప్ర: ముత్తురామలింగం చిత్రంలో మీ పాత్ర గురించి? జ: ఇందులో తొలిసారిగా గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. నన్ను అందరూ అమెరికా రిటర్న్ అమ్మాయిగానే చూస్తున్నారు. నిజానికి నాలో ఉన్నది గ్రామీణ యువతినే. ఇప్పటికీ సొంత ఊరికి వెళితే స్వర్గానికి వచ్చినట్లు ఫీల్ అవుతాను.నేను ఇష్టపడే పాత్ర ఇన్నాళ్లకు లభించింది. ప్ర:నటుడు గౌతమ్‌కార్తీక్ కోసమే ముత్తురామలింగం చిత్రాన్ని అంగీకరించారనే ప్రచారం గురించి మీ స్పందన? జ: నిజం అదికాదు. ఇంకా చెప్పాలంటే ఆయన తండ్రి కార్తీక్ కోసం ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను. ఇందులో ఆయన ఒక ముఖ్య పాత్రలో నటించాల్సిఉంది. నేను చిన్నతనం నుంచి నటుడు కార్తీక్, శ్రీదేవిల వీరాభిమానిని. శ్రీదేవితో కలిసి నటించాను. ఇక కార్తీక్‌తో నటిస్తే నా ఆశ నేరవేరుతుందని ముత్తురామలింగం చిత్రంలో నటించడానికి అంగీకరించాను.అయితే కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో కార్తీక్ నటించలేకపోయారు. ప్ర:సరే గౌతమ్‌కార్తీక్‌తో ప్రేమ అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ఏమంటారు? జ: మొదట్లో నాపై ప్రేమ వదంతులు ప్రసారం అయిన ప్పుడు చాలా బాధ కలిగేది. ఇలా రాస్తున్నారేమిటని చింతించేదాన్ని. సినిమాకు వచ్చి ఏడేళ్లు దాటింది. అందరిలా నేనూ అలాంటి వార్తలను ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాను. -
సెప్టెంబర్ 17 హ్యాపీ బర్త్ డే
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు రవిచంద్రన్ అశ్విన్ (క్రికెటర్), ప్రియా ఆనంద్ (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది మోక్షకారకుడు, ఆధ్యాత్మిక వేత్త అయిన కేతుగ్రహానికి సంబంధించి నది కావడం వల్ల ఈ సంవత్సరం వీరు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. అందువల్ల వీలయినంత వరకు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది. వీరు పుట్టిన తేదీ 17 శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఉత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: గణపతి ఆరాధన, శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. -
ఇద్దరు భామలతో విక్రమ్ రొమాన్స్
నటుడు విక్రమ్ ఇద్దరు హీరోయిన్లతో నటించి చాలా కాలమైంది. ఆ మద్య ధూళ్ చిత్రంతో జ్యోతిక, రిమాసేన్‌లతో రొమాన్స్ చేశారు. తాజాగా మరోసారి ఇద్దరు భామలతో యువళ గీతాలు పాడడానికి సిద్ధం అవుతున్నారు. విక్రమ్ ఐ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎండ్రదుక్కుల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి విక్రమ్, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తాజాగా విక్రమ్ యువ దర్శకులపై దృష్టి సారించారు. ఇద్దరు యువ దర్శకులకు పచ్చ జెండా ఊపారు. అందులో ఒకరు ఆనంద్‌శంకర్. ఈయన ఇంతకు ముందు విక్రమ్‌ప్రభు హీరోగా అరిమానంబి చిత్రన్ని తెరకెక్కించారన్నది గమనార్హ్హం. ఈయన ఇప్పుడు విక్రమ్‌ను డెరైక్ట్ చేయనున్నారు. ఇందులో ఇద్దరు బ్యూటీస్‌తో రొమాన్స్ చేయనున్నారు. అందులో ఒకరు కాజల్‌అగర్వాల్ కాగా మరొకరు ప్రియాఆనంద్. కాగా విక్రమ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో యువ దర్శకుడి పేరు అమిద్. ఈయన తొలి చిత్రం రాజతందిరం. ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకొచ్చిన ఈచిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అమిద్ కిప్పుడు విక్రమ్‌తో పని చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత బాణీలు కట్టనున్నట్టు తెలిసింది. అయితే విక్రమ్ ముందు ఆనంద్ శంకర్ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తరువాత అమిద్ చిత్రం చేస్తారని తెలిసింది. -
అతిథి పాత్రలో ప్రియా ఆనంద్
ప్రముఖతారలు ఇతర హీరోయిన్ల చిత్రాల్లో అతిథిగా మెరవడం కొత్తేమి కాదు. కొన్ని కీలక సన్నివేశాల్లోనూ లేక, ఓ ప్రత్యేక పాటలోనూ మెరుస్తూ ఉంటారు. అందుకు వారికి పారితోషికం కూడా ఘనంగానే ముట్టుతుంది. అలా నటి ప్రియా ఆనంద్ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతుంది. ప్రియా ఆనంద్‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. గౌతమ్ కార్తీక్‌తో నటించిన వై రాజా వై ఇటీవల విడుదలైంది. అయితే ఈ చిత్రం ఓకే అనిపించుకున్నా ప్రియా ఆనంద్‌కు మాత్రం పెద్దగా పేరు రాలేదు. దీంతో ప్రస్తుతం కొత్తగా అవకాశాల్లేవు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోకుండా వచ్చిన అతిథి పాత్రను ప్రియ ఒప్పేసుకుందట. ఈ చిత్రంలో జీవీకే జంటగా నటి ఆనంది నటిస్తుంది. దీని గురించి దర్శకుడు ఆధిక్ తెలుపుతూ త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో నటి ప్రియా ఆనంద్ నటించడం అన్నది నిజమేనన్నారు. అయితే ఈ పాత్రను గెస్ట్ పాత్ర అనలేమని అన్నారు. అలాగే ఆమెకీ చిత్రంలో పాట కూడా ఉండదని చెప్పారు. అయితే నటించేది కొన్ని సన్నివేశాలైనా అవి చిత్రాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయని అన్నారు. ఈ పాత్ర గురించి ప్రియకు వివరించగా వెంటనే నటించడానికి రెడీ అందని అన్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు
చెన్నై: నటి ప్రియాఆనంద్‌ను తాను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు గౌతం కార్తిక్ తెలిపారు. గౌతం కార్తిక్, ప్రియాఆనంద్ ప్రేమించుకుంటున్నట్లు కోలీవుడ్ సమాచారం. దీని గురించి గౌతం కార్తిక్ మాట్లాడుతూ ప్రియా ఆనంద్ తనకు స్నేహితురాలు మాత్రమే, అయితే తాము ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయన్నాడు. 'సిపాయి' చిత్రంలో తనతో నటిస్తున్న లక్ష్మీమీనన్‌తో లవ్ ఎఫైర్ ఉన్నట్లు వదంతులు వ్యాపించాయని, గతంలో 'కడల్' చిత్రంలో నటిస్తుండగా తులసిని ప్రేమిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయన్నాడు. అయితే ఆ గాలి వార్తలన్నిటినీ తాను స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నానని, తదుపరి రిలీజ్ కానున్న చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది తాను నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయని. అందువల్ల ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తున్నట్లు గౌతం కార్తిక్ తెలిపాడు. -
విక్రమ్‌తో తొలిసారి
విక్రమ్‌తో నటించడం సంతోషాన్ని కలిగిస్తోందని నటి కాజల్ అగర్వాల్ తెలిపారు. కాజల్ అగర్వాల్ ఇదివరకే విజయ్, సూర్య, కార్తి, ధనుష్‌తో నటించారు. ఇంతవరకు విక్రమ్‌తో నటించలేదు. ప్రస్తుతం తొలిసారిగా విక్రమ్‌కు జంటగా నటించేందుకు అంగీకరించారు. పలువురి హీరోయిన్ల పోటీ మధ్య ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. దీని గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ విక్రమ్‌తో నటించనుండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. విక్రమ్ అంటే చాలా ఇష్టమని, అతని నటన ఎంతో నచ్చుతుందన్నారు. విక్రమ్ ప్రతిభాశీలి, కష్టపడి పనేచేసే త త్వం కలవారన్నారు. ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కథ, తన పాత్ర అద్భుతంగా వుందన్నారు. ఈ చిత్రంలో మరో కథానాయకిగా ప్రియా ఆనంద్ నటిస్తున్నారని తెలిపారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా మారి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముగిసి రిలీజ్ కు సిద్ధమవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందే చిత్రంలోనూ విశాల్‌కు జంటగా నటిస్తున్నారు. రెండు హిందీ చిత్రాలు కైవశంలో వున్నాయి. -
ఇద్దరమ్మాయిలతో అపరిచితుడు
నారీనారీ నడుమ మురారి కానున్నారు నటుడు విక్రమ్. తన తాజా చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నారు. విక్రమ్‌కు ఇద్దరు నాయికలతో నటించడం కొత్తేమి కాదు. ధూల్, రాజబాట తదితర చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లతో నటించారు. అయితే తాజాగా ఇంతకుముందు జత కట్టని భామలతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఐ వంటి బ్రహ్మాండ చిత్రం తరువాత ప్రస్తుతం పత్తు ఎండ్రత్తుక్కలే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చెన్నై చిన్నది సమంత నాయకి. ఈ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. అరిమానంబి చిత్రంతో మెగాఫోన్ పట్టి హిట్ కొట్టిన వర్ధమాన దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి విక్రమ్ పచ్చజెండా ఊపారు. ఇందులో ఆయనకు జంటగా అందాల భామలు కాజల్ అగర్వాల్, ప్రియా ఆనంద్ నటించడానికి రెడీఅవుతున్నారు. దర్శకుడు ఆనంద్ శంకర్ తొలి చిత్రం నాయకి ప్రియా ఆనంద్ అన్నది తెలిసిన విషయమే. తన తదుపరి చిత్రంలోను దర్శకుడు ఆమెనే ఒక నాయకిగా ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఈ చిత్రంలో కథా నాయకుడి పాత్రకు విక్రమ్ మాత్రమే చేయగలరని దర్శకుడు అభిప్రాయం. అలాగే అరిమా నంబి చిత్రానికి ఇది పూర్తి విరుద్దంగా, వైవిధ్యంగా ఉంటుందంటున్నారు. చిత్రం జూన్‌లో సెట్‌పైకి వెళ్లనుందని తెలిపారు. -
నాటి బ్యూటీస్ నేటి ఆంటీస్‌గా...
పాత్రల ప్రాముఖ్యత, పరిధిల్లో ట్రేడ్ ఉండవచ్చునేమో గానీ సినిమాల్లో నాయికానాయకులు లేని చిత్రాలు అరుదే. కమర్షియల్ అంశాలకు హీరో ఎంత అవసరమో కనువిందు చేయడానికి హీరోయిన్ అంతే అవసరం. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అలా అందం, అభినయంతోను తమ సత్తా చాటి ప్రముఖ కథానాయికలుగా రాణించిన పలువురు తరువాత వివాహ బంధాలతో సంసార జీవితంలోకి వెళ్లిపోయూరు. కొంతకాలం పాటు మాతృత్వ మాధుర్యాన్ని చవిచూశారు. పిల్లా పాపలతో సుఖ సంతోషాలను అనుభవించి, మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఏదేమైనా నాడు బ్యూటీస్‌గా వెలుగొందిన భామలు నేడు ఆంటీస్‌గా రాణిస్తున్నారు. మరి కొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వీరిని ఒక్కసారి పరిశీలిస్తే అతిలోక సుందరి బిరుదు సొంతం చేసుకున్న శ్రీదేవితోపాటు నదియ, మనీషా కొయిరాలా, గౌతమి, మధుబాల, అమల, తులసి, జ్యోతిక, అభిరామి, కిరణ్రాథోడ్, ప్రియా ఆనంద్, లైలా తదితరులు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రల్లో అలరించడానికి రెడీ అయ్యారు. గౌతమి పునరాగమనం పదహారణాల తెలుగమ్మాయి గౌతమి తమిళంలో వర్ధమాన నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ కమలహాసన్ వరకు జోడి కట్టి ప్రముఖ హీరోయిన్గా రాణించారు. ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా వున్న గౌతమి తాజాగా తాను సహజీవనం చేస్తున్న నటుడు కమలహాసన్‌తోనే. పాపనాశం చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటిస్తున్నారు. ఇంకా తెలుగు బుల్లితెరపై కొన్ని నృత్య సంగీత కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అతిలోక సుందరి సీనియర్ నటి శ్రీదేవి విషయానికొస్తే ఇద్దరు పిల్లల తల్లి. ఆమె పెద్ద కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుదీర్ఘ విరామం తరువాత ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఆ చిత్రానికి ఆమె ప్రధానం అయినా ఆంటీ పాత్రనే పోషించి మెప్పించారు. ఆ తరువాత చిన్న గ్యాప్ తీసుకుని, తాజాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న గరుడ చిత్రంలో ముఖ్యపాత్ర చేస్తున్నారు. అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసిన నటి నదియ ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం ద్వారా ఆ చిత్ర హీరో జయం రవికి తల్లిగా నటించారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తరువాత వరుసగా అమ్మగా, అత్తగా, అక్కగా పలు చిత్రాల్లో నటి స్తున్నారు. బుల్లి తెరపై మెరుపులు అమలా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతోపాటు తెలుగులోను క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. నాగార్జునను వివాహమాడిన తరువాత నటనకు దూరంగా ఉన్నారు. ఈమె కొడుకు అఖిల్ ఒక పక్క హీరోగా పరిచయం అవుతుంటే అమల మళ్లీ నటిగా పునఃప్రవేశం చేయడం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించిన ఈమె తాజాగా తమిళంలో ఒక మెగా సీరియల్లో నటిస్తున్నారు. అదే విధంగా అజిత్ సరసన కాదల్‌మన్నన్ చిత్రంలో నటించిన మాను కొంతకాలం చిత్రాలకు దూరంగా సింగపూరులో నివసించారు. మళ్లీ ఇటీవల ఎన్న సత్తం ఇంద నేరం చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయ్యారు. మాళవిక, లైలా, ప్రియారామన్ తదితరులు బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. వీరంతా సినిమానే లోకంగా జీవిస్తున్న తారలు. వీరి పునః ప్రవేశానికి సంపాదన ఒక్కటే కారణం కాదు. దానిని మించి నటనపై మమకారం అని చెప్పవచ్చు. ఏడేళ్ల తరువాత... కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్గా వెలిగిన జ్యోతిక నటుడు సూర్యతో కలిసి ఏడు చిత్రాలు చేసి ఏడేళ్లు ఆయనతో ప్రేమబంధాన్ని పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల విరామం తరువాత జ్యోతిక నటిగా రీ ఎంట్రీ అయ్యారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్ర తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఇది వివాహానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు కథనాయికిగా విజయ విహారం చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం ఆంటీ పాత్రలతో అలరిస్తున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న దేవయాని ఆ తరువాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం నగరంలోనే ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తాజాగా సహాబ్దం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు కమలహాసన్ సరసన విరుమాండి చిత్రంతోపాటు ప్రభు తదితర ప్రముఖ హీరోలతో డ్యూయెట్లు పాడిన అభిరామి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు. -
అలా చేయడం ఆనందమే
మా ఆయన్ని డెరైక్ట్ చేసినప్పుడు చాలా ఆనందం కలిగిందంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్య. ఈమె తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘3’. ధనుష్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అంతగా విజయం సాధించకపోయినా ఆ చిత్రంలో సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కట్టిన వై దిస్ కొలెవైరి డీ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ఐశ్వర్య ధనుష్ మలి ప్రయత్నం వై రాజా వై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగాను ప్రియా ఆనంద్ హీరోయిన్‌గాను నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మార్కెట్లోకి విడుదలయ్యాయి. వినోద భరిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ మాట్లాడుతూ తాను తొలి చిత్రం దర్శకత్వం వహించినప్పుడు అధిక శ్రద్ధ చూపించలేదన్నారు. దీంతో తదుపరి చిత్రానికి కొత్త ప్రయోగం చేయాలని భావించానన్నారు. తాను, తన భర్త చిత్రాల పనిలో బిజీగా ఉండడంవలన ఇంటిలో మాట్లాడుకోవడానికి చాలా తక్కువ సమయమే ఉంటుందన్నారు. అయినా నా చిత్ర కథ ధనుష్‌కు తెలుసని తెలిపారు. ధనుష్ తన కంటే సీనియర్ అని అంతేకాకుండా తనకు మార్గదర్శకుడు కూడా అని అన్నారు. తనకాయన చాలా సాయం చేస్తారని వై రాజా వై చిత్రంలో కూడా అతిథి పాత్రలో నటించారని ఆయన్ని దర్శకత్వం వహించడం చాలా ఆనందం కలిగించిందని ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు. -
ఆరబోస్తే తప్పులేదు
పాత్ర డిమాండ్ మేరకు అందాలారబోయడంలో తప్పు లేదంటోంది నటి ప్రియా ఆనంద్. ఈ అమ్మడు తరచూ చర్చలకు తావిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఆ మధ్య అరిమానంబి చిత్రంలో హీరోకు దీటుగా మందు కొట్టి నటించింది. అదేమంటే మగవాళ్లు మద్యం సేవించగాలేంది ఆడవాళ్లు తాగితే తప్పేంటి? అంటూ ప్రశ్నించి విమర్శలకు గురైంది. తాజాగా ఒరుఊరుల రెండు రాజా చిత్రంలో హద్దులు మీరి అందాలు ప్రదర్శించినట్లు విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి విమర్శలను ప్రియా ఆనంద్ తిప్పి కొట్టింది. ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో తాను అందరూ విమర్శించేటంత గ్లామర్‌ను ప్రదర్శించలేదంటోంది. ఇంతకు ముందు చిత్రాల్లోనూ అలాంటి గ్లామరనే ప్రదర్శించానని పేర్కొంది. అయితే ఈ చిత్రంలో స్టిల్స్ చూసి మోతాదుకు మించిన అందాలు ఆరబోసినట్లు ప్రచారం జరుగుతోందని అంది. అయితే కథ డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా నటించడంలో తప్పు లేదన్నది తన అభిప్రాయంగా చెప్పింది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. తాను తమిళనాడులో పుట్టినా దుబాయ్, ముంబయిలలో పెరిగినట్లు వివరించింది. తనకు పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు, తమిళనాట ఆచార వ్యవహారాలు తెలుసని పేర్కొంది. ఈ రెండింటిని తాను వదులుకోలేనని స్పష్టం చేసింది. హిందీ చిత్రాల్లో నటించడం లేదేమిటని ప్రశ్నిస్తున్నారని తమిళ చిత్రాలతో బిజీగా ఉండటంవలనే హిందీలో నటించడం లేదని చెప్పుకొచ్చింది. -
భార్య దర్శకత్వంలో మరోసారి
నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో మరోసారి నటించనున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ పెద్దకుమార్తె, ధనుష్ భార్య అయిన ఐశ్వర్య తొలిసారిగా మెగాఫోన్ పట్టి తన భర్త హీరోగా ‘3’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటి శ్రుతిహాసన్ హీరోయిన్గా తొలి తమిళ చిత్రం ఇదే. అనిరుధ్ సంగీ తాన్ని అందించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించక పోయినా అందులోని వై దిస్ కొల్లవెరి డీ పాట ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కొంచెం గ్యాప్ తర్వాత ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వై రాజా వై’. యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. చిత్ర కథను మలుపు తిప్పే ముఖ్య భూమికను నటుడు ధనుష్ పోషించనున్నారన్నది తాజా వార్త. ఈ క్యామియో పాత్ర పోషించాలని ఐశ్వర్య తన భర్త ధనుష్‌ను కోరగా అందుకాయన ఓకే చెప్పారట. ఈ పాత్ర చిత్రీకరణ త్వరలో నిర్వహించనున్నట్లు తెలిసింది. -
మహిళలు మద్యం తాగే విషయం నాకు తెలియదు
పబ్‌లకు వెళ్లినా పండ్లరసమే సేవిస్తానంటున్నారు కాజల్ అగర్వాల్. ఏమిటి తాటి చెట్టు కింద చల్ల తాగుతున్నానన్న పాత సామెత గుర్తొస్తుందా? ఇంతకీ ఈ బ్యూటీ పబ్‌ల వ్యవహారం ఏమిటో చూద్దామా? ఆ మధ్య ప్రియా ఆనంద్ అరిమానంబి చిత్రంలో గ్లాసులు గ్లాసుల మద్యం తాగి రచ్చకెక్కింది. ఏమిటమ్మ ఆ నటన అంటే, ఏం మగాళ్లు మద్యం సేవించడం లేదా? వాళ్లకో న్యాయం ఆడళ్లకో న్యాయమా అంటూ ఎదురు ప్రశ్నలు గుప్పించి సంచలనం సృష్టించింది. ఆ సంఘటన మరుగున పడుతోందనుకుంటున్న సమయంలో కాజల్ అగర్వాల్ తెలుగు చిత్రం గోవిందుడు అందరి వాడే చిత్రంలో ఫారిన్ సరుకు గడగడా తాగేసి మరోసారి చర్చల్లో కెక్కారు. దీంతో కాజల్ అగర్వాల్ తరచూ పబ్‌లకు, బార్లకు వెళతారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇందుకు ఈ బ్యూటీ వివరణ భిన్నంగా ఉంది. గోవిందుడు అందరివాడే చిత్రకథ చెప్పినప్పుడే దర్శకుడు చిత్రంలో మద్యం తాగే సన్నివేశం ఉంటుందని చెప్పారన్నారు. అలాంటి సన్నివేశంలో నటించే విషయమై తాను సంకోచించగా ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తరచూ పబ్‌లకు వెళుతున్నారు. అక్కడ వారు మద్యం సేవించడం అనేది సర్వసాధారణం అని చెప్పారన్నారు. దర్శకుడలా క న్విన్స్ చేయడంతో తాను అలా నటించానని వివరించారు. నిజానికి మహిళలు మద్యం తాగే విషయం తనకు తెలియదన్నారు. తానెప్పుడూ మద్యం తాగలేదన్నారు. చిన్న వయసు నుంచే ఏది తప్పు ఏది ఒప్పు అనేది తనకు కుటుంబ సభట్యులు నేర్పించారని పేర్కొన్నారు. అయితే స్నేహితులతో పబ్‌లకు వెళుతానని అక్కడ పండ్లరసం మాత్రమే సేవిస్తానని తెలిపారు. ఇక మగవారైనా, ఆడవారైనా మద్యం సేవించడం చెడ్డ అలవాటన్నారు. దీని వలన చాలా కుటుం బాలు వేదనకు గురవుతున్నాయన్నారు. ఇకపోతే సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టేది జాలీ కోసమేనని స్పష్టం చేశారు. వాటిని నిజ జీవితంలో ఎవరూ అనుసరించరాదని కాజల్ హితవు పలికారు. -
విక్రమ్‌తో ప్రియా ఆనంద్
సియాన్ విక్రమ్ సరసన నటించే లక్కీ చాన్స్‌ను నటి ప్రియా ఆనంద్ కొట్టేసింది. ఈ చిత్రంలో విక్రమ్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధం అని కూడా ఈ అమ్మడు చెప్పిందట. తొలిరోజుల్లో ఐరన్‌లెగ్ హీరోయిన్గా ముద్రపడిన ఈ బ్యూటీ శ్రీదేవితో కలిసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత శివకార్తికేయన్‌తో జత కట్టిన ఎదిర్‌నీచ్చల్ చిత్రం కోలీవుడ్‌లో సక్సెస్ రుచి చూపించింది. ఆ తరువాత వణక్కం చెన్నై, అరిమానంబి వంటి చిత్రాలు ఈ ముద్దుగుమ్మ స్థాయిని పెంచుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం విమల్‌కు జంటగా ఒరు ఊర్ల రెండు రాజా చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా అరిమానంబి చిత్రంలో మద్యం తాగి హీరోతో పోటీ పడిన ప్రియా ఆనంద్ పలువురి విమర్శలకు గురైంది. అయినా వాటిని లెక్క చేయకుండా మద్యాన్ని మగవారు తాగితే ఒప్పు, ఆడవారు సేవిస్తే తప్పా? అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అయినా అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు రావడం విశేషం. నటుడు విక్రమ్ నటించనున్న నూతన చిత్రంలో నటించే అవకాశం ప్రియా ఆనంద్‌కు వరించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. అందాలారబోయడానికి ఏ మాత్రం వెనుకాడని ప్రియా ఆనంద్ అవసరం అయితే హీరో విక్రమ్‌తో లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి సిద్ధమేనని కథ వినిపించడానికి వచ్చిన దర్శకుడితో చెప్పిందట. పెద్ద హీరోతో నటించే అవకాశం ఎక్కడ జారిపోతుందోనన్న ముందుచూపుతోనే ప్రియా ఆనంద్ లిప్‌లాక్ ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. -
విమర్శల వలలో ప్రియ
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నది ఆర్యోక్తి. అయితే నటి ప్రియాఆనంద్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకు విజయం కోసం తహతహలాడిన ఈ బ్యూటీ ఇటీవల వరుసగా రెండు హిట్లు రావడంతో వాటిని తలకెక్కించుకున్నట్లు ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం నటుడు విమల్ సరసన ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం ముందుగా అనుకున్న దాని కంటే కోటిన్నర వరకు పెరిగి పోయిందట. ఇందుకు కారణం నటి ప్రియా ఆనందేనని అంటున్నారు. నిర్మాతల వద్ద ఆమె బాగా ఖర్చు పెట్టించిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ అలంకరణ సామగ్రి కోసం ప్రియా ఆనంద్ అధికంగా ఖర్చు చేయించినట్లు కోలీవుడ్ టాక్. మరో విషయం ఏమిటంటే ప్రియా ఆనంద్ తమిళ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నట్లు ఆమె అభిమానులే ఆగ్రహిస్తున్నారు. పియా ఆనంద్ ఇంతకు ముందు చేసిన అరిమా నంబి చిత్రంలో మద్యంలో మునిగి తేలేలా నటించడాన్ని ఆమె అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి ప్రియా ఆనంద్ ఘాటుగానే స్పందించారు. ఆడ - మగ సమానం అంటున్న ఈ రోజుల్లో మగవారు మద్యం సేవించగా లేనిది ఆడవారు సేవిస్తే తప్పా! మీకో న్యాయం మాకో న్యాయమా? అంటూ లా తీస్తుండడం ఆమె అభిమానులకే నచ్చడం లేదు. ప్రియా ఆనంద్ ప్రవర్తన మార్చుకోకపోతే సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టం అంటున్నారుు కోలీవుడ్ వర్గాలు. -
ప్రాధాన్యత లేదు
హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతోంది ప్రియా ఆనంద్. తమిళంలో హీరోల చుట్టూనే కథలల్లుతున్నారు. హీరోయిన్లను ప్రేమించడానికి డ్యూయెట్లు పాడటానికి మాత్రమే పరిమితం చేస్తున్నారంటూ అమ్మడు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ బ్యూటీ వేదనకు అర్థం లేకపోలేదు. తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్లకు బలమైన పాత్రలు లభిస్తున్నాయి. హిందీ చిత్రం ద డర్టీ పిక్చర్లో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇక తెలుగులో నటి అనుష్క అరుంధతి లాంటి పవర్ఫుల్ పాత్రలో నటించి నటిగా తన కెరీర్‌కు గట్టి పునాదిని ఏర్పరచుకుంది. ప్రస్తుతం రుద్రమదేవి, బాహుబలి లాంటి చారిత్మ్రాతక కథా చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం అలాంటి బలమైన పాత్రలు తమిళంలో హీరోయిన్లకు రావడం లేదు. అయితే తొలి రోజుల్లో హిట్స్ కోసం ముఖం వాచిన ప్రియా ఆనంద్ ఈ మధ్య రెండు మూడు విజయాలు రావడంతో తానేదో పెద్ద స్టార్ నయిపోయినట్టు హీరోయిన్లకు ప్రాధాన్యత నివ్వడం లేదని స్టేట్మెంట్స్ ఇవ్వడం హాస్యాస్పదం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
విభేదాల్లేవు
ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మీల మధ్య విభేదాలు వున్నట్లు పలువురు భావిస్తున్నారని అయితే అటువంటిదేమీ లేదని దర్శకుడు యువరాజ్ బోస్ తెలిపారు. అధర్వ, ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మి నటిస్తున్న చిత్రం ‘ఇరుంబు గుదిరై’. దీనిపై దర్శకుడు యువరాజ్ బోస్ మాట్లాడుతూ అధర్వ వద్ద ఈ చిత్ర కథ వినిపించినపుడు ఎగిరి గంతేశారని అన్నారు. సాధారణ బైక్ అరుులే శిక్షణ అవసరం లేదని, రేస్ బైక్ అయిన దీనికి 8 గేర్లుతో ఎంతో ప్రత్యేకత కలిగివుంటుందని చెప్పానన్నారు. అందుకు ఈ బైక్ రైడింగ్‌కు తప్పకుండా శిక్షణ తీసుకోవాలని తెలిపానన్నారు. దీంతో ఆయన శిక్షణ తీసుకున్నారని, ఈ బైక్ నడపడం ఎంతో థ్రిల్లింగ్ కలిగించినట్లు చెప్పారన్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆస్ట్రేలియాలో చిత్రీకరించామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఒక నిమిషంలో చేసే పొరపాటు హీరో జీవితంలో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఈ చిత్రం తెలియజేస్తుందన్నారు. అధర్వ బైక్ నడిపే అన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా హెల్మెట్ ధరించారని, ఇది యువతను దారి తప్పించే చిత్రంగా ఉండబోదన్నారు. రేస్ సన్నివేశాలు పూర్తిగా దానికి సంబంధించిన ట్రాక్‌లో జరిగినట్లు చిత్రీకరించామన్నారు. అగోరం సోదరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మి ఇద్దరూ నటిస్తున్నారని, వీరి మధ్య విభేదాలున్నట్లు వార్తలున్నాయని అయితే అటువంటిదేమీ లేదన్నారు. వీరిరువురూ స్నేహంగా మెలగడమే గాకుండా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. భారత మొదటి మహిళా బైక్ రేసర్ అలిషా అబ్దుల్లా ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. -
మగువ మందు కొడితే...
యువతపై సినిమా ప్రభావం చాలానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అందుకే సాధ్యమైనంత వరకు నవ తరాన్ని పెడదోవ పట్టించే మద్యపానం లాంటి సన్నివేశాలను చిత్రాల్లో లేకుండా చూడాలని, విజ్ఞులు, పలు సంక్షేమ సంఘాలు ఘోషిస్తున్నాయి. అలాంటిది నటి ప్రియా ఆనంద్ మగువ మద్యం తాగేలా నటిస్తే తప్పా? అంటూ ప్రశ్నిస్తోంది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఈ అమ్మడు నటిగా పలు పోరాటాలు చేసిన తరువాత హీరోయిన్గా విజయాల బాట పట్టింది. ఎదరి నీశ్చల్, వణక్కం చెన్నై చిత్రాల్లో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల విడుదలైన అదిమానం చిత్రంలో విక్రమ్ ప్రభుతో జతకట్టింది. చిత్రం విజయబాటలోనే పయనిస్తోంది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ జాణ చిత్రంలో మద్యాన్ని కాక్‌టైల్‌లో ఫుల్‌గా తాగి మబ్బులో తేలిపోయేలా నటించేసింది. దీంతో పలువురు అమ్మడిపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అలా మద్యం తాగే సన్నివేశంలో నటించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు ప్రియా ఆనంద్ బదులిస్తూ కథకు అలాంటి సన్నివేశం అవసరం అయ్యిందని చెప్పుకొచ్చింది. మద్యం తాగుతున్నట్లు నటిస్తేనే మనం చెప్పదలచుకున్న విషయం బలంగా చేరుతుందని దర్శకుడు అన్నారని చెప్పింది. అందువలనే తనలా నటించానని వివరించింది. అయితే ఒక అమ్మాయి మద్యం తాగేలా నటించవచ్ఛా? అని అడుగుతున్నారని ఒక మగువ అలా నడుచుకోవడం వలనే సంస్కృతి, సంప్రదాయాలు మంటకలుస్తాయనడాన్ని తాను అంగీకరించనని ప్రియా ఆనంద్ పేర్కొంది. ఇలా ఇప్పటికే చాలా సినిమాలు ఎంతో మంది హీరోరుున్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించారని గుర్తు చేసింది. -
అనిరుద్ లేటెస్ట్ లవర్
కోలీవుడ్‌లో యువ సంగీత దర్శకుడు అనిరుధ్పైనా, నటి ప్రియా ఆనంద్‌పైనా ఈ మధ్య వదంతుల జోరు పెరిగింది. అయితే ఈ అమ్మడు వీటిని ఎంజాయ్ చేస్తోంది. ఆ మధ్య ఎదిర్‌నీచ్చల్ చిత్రం సందర్భంగా ఆ చిత్ర హీరో శివకార్తికేయన్‌తో చెట్టాపట్టాలంటూ ప్రియా ఆనంద్‌పై వదంతుల మోత మోగింది. ఆ ప్రచారాన్ని అంతగా పట్టించికోని ఈ బ్యూటీపై తాజాగా మరో వదంతి తెరపై కొచ్చింది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ప్రేమాయణం అన్నది ఆ వదంతి. వీరిద్దరూ తరచూ కలుసుకుంటూ గంటల తరబడి ముచ్చటించుకుంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. ప్రియా ఆనంద్‌కు ఎదిర్ నీచ్చల్ సమయంలో అనిరుధ్‌తో పరిచయం, వణక్కం చిత్రం సమయంలో ప్రేమగా మారినట్లు కోలీవుడ్ గుస గుసలాడుతోంది. అనిరుధ్ అంటే ఈ తరం హీరోయిన్లకు యమ క్రేజ్. ఆ మధ్య నటి ఆండ్రియాతో రొమాన్స్ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేసి కలకలం రేపాయి. దీంతో అనిరుధ్‌తో ప్రేమ వ్యవహారం ఇంతకు ముందు గానీ ఇప్పుడు కానీ లేదని నటి ఆండ్రియ సుస్పష్టంగా వెల్లడించారు కూడా. తాజా వదంతులపై అనిరుధ్ స్పందిస్తూ ప్రియా ఆనంద్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని అన్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రియా ఆనంద్ మాత్రం నోరు మెదప లేదు. -
వదంతులకు భయపడే....
నిప్పు లేనిదే పొగ రాదన్నది సామెత. అయితే మన హీరోయిన్లు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెడుతున్నారని వాపోతుంటారు. వీరిలో రెండు రకాల హీరోయిన్లను చూస్తుంటాం. కొందరు వదంతులను ఎంజాయ్ చేస్తున్నాం అంటుంటారు. మరికొందరు ఆవేదన కలిగిస్తున్నాయంటుంటారు. మూడవ రకం కూడా ఉన్నారు. తమపై తామే వదంతులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ మూడు రకాల నాయికల్లో నటి ప్రియా ఆనంద్ ఏ రకానికి చెందుతారో గానీ వదంతులు వణికిస్తున్నాయంటున్నారు. పస్తుతం కోలీవుడ్‌లో ఈ బ్యూటీ పేరు బాగానే ప్రచారంలో ఉంది. చేతి నిండా చిత్రాలు కూడా ఉన్నాయి. ఎదిర్ నీచ్చల్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గాలి వీచేలా చేసింది. ఈ అమ్మడి గురించి పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అవన్నీ అసత్యాలంటున్న ప్రియా ఆనంద్ తన వెర్షన్‌ను చెప్పుకొస్తూ ఇలాంటి అనవసరపు పుకార్లు పుట్టుకొస్తాయనే స్నేహితుల పుట్టిన రోజు పార్టీలకు కూడా దూరంగా ఉంటున్నానన్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో తాను ఆశించిన స్థాయి లభించిందన్నారు. అరిమా నంబి, ఒరు ఊరుల రెండు రాజ, వై రాజా వై, ఇరుంబు కుదిరై చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్యభరిత పాత్రలను పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాయికలు నేపథ్య గాయనీమణులుగా మారుతున్న సీజన్ తనలోను గాయనికి కావలసిన అర్హతలున్నాయన్నారు. వాటిని సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నానని చెబుతూ పాటలు పాడాలనే తన ఆసక్తిని చెప్పకనే చెప్పారు. ఇకపోతే తన గురించి పుకార్లు పరుగులు తీస్తున్నాయని అలాంటి వాటిని జాలీగానే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే తానెవరితోను పోటీలకు వెళ్లనన్నారు. కారణం ఇలాంటి వదంతుల ప్రచారం అవుతాయనేనన్నారు. సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పార్టీలకు కూడా వెళ్లనని అయినా తనపై వదంతులు ప్రచారం అవడం వింతగా ఉందని ప్రియా ఆనంద్ చెప్పుకుంటున్నారు. -
అనిరుధ్‌తో లవ్వా?
యువ సంగీత దర్శకుడు అనిరుధ్, నటి ప్రియా ఆనంద్ మధ్య లవ్వాట జెట్ వేగంగా సాగుతుందనే ప్రచారం మొదలైంది. ప్రియా ఆనంద్ ఎదిర్ నీశ్చల్ చిత్రానికి ముందు కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలేవీ ఆమె ఖాతాలో పడలేదు. శ్రీదేవితో కలసి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో నటించినా ఆ చిత్ర సక్సెస్ శ్రీదేవికే పరిమితమై పోయింది. ఎదిర్‌నీశ్చల్ చిత్రం ప్రియా ఆనంద్‌కు తొలి విజయానందాన్ని అందించింది. విశేషం ఏమిటంటే ఆ చిత్ర హీరో శివకార్తికేయన్‌ను పక్కన పెట్టి చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ - ప్రియాఆనంద్ల గురించి వదంతులు ప్రచారం అవుతున్నాయి. అనిరుధ్‌పై అంతకుముందే నటి ఆండ్రియాతో రాసలీలలు అంటూ ఇంటర్నెట్లో ఫొటోలతో సహా ప్రచారం హల్చల్ చేసింది. తాజాగా ప్రియా ఆనంద్‌తో చెట్టాపట్టాల్ అంటూ కోలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. అయితే ఈ ప్రచారాన్ని నటి ప్రియా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అసత్య ప్రచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వదంతులన్నీ నిజం అయితే తనకిప్పటికే నలుగురైదుగురు లవర్స్ ఉండాలన్నారు. తాను నటించే ప్రతి చిత్రం సమయంలోనూ ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తున్నారన్నారు. అయినా ఇలాంటి వాటిని లైట్‌గా తీసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. నిజానికి తానెవరినీ ప్రేమించలేదని, ఒక వేళ ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని ప్రియా ఆనంద్ అంటున్నారు. -
అరిమానంబి అలా మొదలైంది
యువ నటుడు విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం అరిమానం బి. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు. అరిమా నంబి చిత్రం గురించి దర్శకుడితో కాసిన్ని ముచ్చట్లు. ప్ర: అరిమానంబి అవకాశం ఎలా వచ్చింది? జ: తుపాకి చిత్రం షూటింగ్ సమయంలో కలైపులి ఎస్.ధానుకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పాను. వెంటనే ఆయన బాగుందే అంటూ అభినందించారు. హీరోగా నటుడు విక్రమ్ ప్రభు నటించడానికి ఓకే అనడంతో అరిమా నంబికి శ్రీకారం చుట్టాం. ఎస్.ధాను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన భారీ చిత్రాలకు ఎలా ఖర్చు చేస్తారో అంతగా ఈ చిత్రానికి వ్యయం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. ప్ర: చిత్ర కథేంటి? జ: జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏ రోజు సమస్య లేదో ఆ రోజు నిజంగా ఆ వ్యక్తికి ప్రశాంతతనిచ్చే రోజు. ఇక చిత్ర హీరో సమస్య ఏమిటి? అలాగే ఆయన దేని కోసం అన్వేషిస్తున్నారన్నదే అరిమా నంబి. ప్ర: యాక్షన్ హీరో పాత్రకు విక్రమ్ ప్రభు ఓకేనా? జ: ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలుంటాయి. చిత్రం చూస్తే తెలుస్తుంది. విక్రమ్ ప్రభు ఆ పాత్రకు ఎంతగా న్యాయం చేశారో చిత్రంలో యాక్షన్‌తోపాటు ప్రేమకు ప్రాధాన్యత ఉంటుంది. విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్‌ల ప్రేమ సన్నివేశాలు అంత లవబుల్‌గా ఉంటాయి. ప్ర: హీరోయిన్ ప్రియా ఆనంద్ పాత్ర గురించి? జ: నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథే ఆమె చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుత చెన్నై మోడ్రన్ గర్ల్ ఎలా ఉంటుందో అలాంటి పాత్ర ప్రియా ఆనంద్ ది. ప్ర: ఇదయం అనే పాటలో లొకేషన్స్‌ను గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారా? జ : ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజానికిది గ్రాఫిక్స్ కాదు. ఆ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించాం. థాయ్‌లాండ్ అడవుల్లోని సుందర ప్రాంతం అది. బ్యాంకాక్ నుంచి నాలుగు గంటలు ప్రయాణం చేస్తే కాంచనాపురి అనే ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి అడవిలోకి వెళ్లాలి. ఇలా చెప్పడం సులభం అయినా అక్కడికి వెళ్లడం కష్టసాధ్యం. అయితే లొకేషన్ చూసిన తరువాత యూనిట్ వర్గం ఆశ్చర్యపోయింది. అంత అద్భుత ప్రాంతం అది. పలు భారతీయ చిత్రాల షూటింగ్‌లు విదేశాల్లో జరిగినా ఆ ప్రాంతం మాత్రం ఎవరికంటా పడలేదు. ప్ర: ఈ చిత్రం ద్వారా డ్రమ్స్ మణిని సంగీత దర్శకుడిగా పరిచయం చేయడానికి కారణం ? జ : డ్రమ్స్ మణిని తాము సంగీత దర్శకుడిగా పరిచయం చేయడం లేదు. ఎందుకంటే ఆయనకు ఎంతో సంగీతానుభవం ఉంది. ఈ చిత్రంలో పాటలన్నీ జనరంజకంగా వచ్చాయి. కొత్త స్వరాలను ప్రవేశపెట్టారు. నేపథ్య సంగీతాన్ని అద్భుతంగా రూపొందించారు. -
బిరియానితో హీరోయిన్లను వశీకరిస్తున్న హీరో
వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనేది మంచి పాట. బిరియానితో విందు దీని తస్సదీయ భలే పసందు. కొందరి వశీకరణకిది మంచి మందు అన్నది మాట. కొందరిని మంచి చేసుకోవాలన్నా. కొన్ని పనులు జరగాలన్నా ముందుగా అవుతోంది బిరియాని విందు. సినిమా రంగానికొస్తే కోలీవుడ్‌లో నటుడు ఆర్య బిరియాని విందుతో అందమైన హీరోయిన్లను వశపరచుకుంటారన్న పేరుంది. ఇదేదో బాగున్నట్లుందని నటి ప్రియా ఆనంద్ ఆర్య ననుసరించాలనుకుంటున్నారట. బిరియాని విందుతో హీరోలను కాకాపట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. ప్రియా ఆనంద్ ప్రస్తుతం కోలీవుడ్‌లోని బిజీ హీరోయిన్లలో ఒకరు. వైరాజావై, ఒరు ఊరుల రెండు రాజా తదితర చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్‌కు ఇప్పటి వరకు వంట చేయడం రాదట. నేర్చుకుందామంటే టైమ్ చాలడం లేదట. దీంతో ఇటీవల పది రోజుల విరామం లభించడంతో వంటలతో కుస్తీ పట్టారట. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ ఇండియన్ వంటకాలతోపాటు చైనీస్ కుకింగ్లోను తర్ఫీదు పొందారట. తన వంటకాల చాతుర్యాన్ని త్వరలోనే పరిక్షించదలచారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒరు ఊరుల రెండు రాజా చిత్ర యూనిట్ తన చేతి బిరియాని రుచిని చూపిస్తానని చెప్పారట. దీంతో ప్రియా ఆనంద్ బిరియాని విందు కోసం ఆ చిత్ర హీరో విమల్, హాస్యనటుడు సూరి, దర్శకుడు ఆర్.కన్నన్ తదితర యూనిట్ సభ్యులు ఎదురు చూస్తున్నారట. ఉండబట్టలేక బిరియాని విందు ఎప్పుడని ప్రియా ఆనంద్‌ను అడిగేశారట. దీనికా ముద్దుగుమ్మ చిత్ర షూటింగ్ ముగింపు రోజున బిరియాని విందునిస్తానని మాటిచ్చారట. ఇక ప్రియా ఆనంద్ నటించే ప్రతి చిత్ర షూటింగ్ చివరి రోజున ఆమె బిరియాని విందును రుచిచూడవచ్చన్న మాట. -
అప్పుడు నో... ఇప్పుడు ఓకే
ఆడ వారి మాటలకు అర్థాలే అనడానికి నిదర్శనం నటి లక్ష్మీరాయ్. హీరోయిన్ల కోపానికి కారణాలే వేరులే అనిపిస్తుంది. చిత్రంలో ఉన్నానా? లేదా? అంటూ దర్శక నిర్మాతలపై ఆగ్రహంతో చిత్రం నుంచి వైదొలగిన ఈ అమ్మడు తాజాగా మళ్లీ అదే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అసలు విషయంలో కెళితే అధర్వ, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం ఇరుంబు కుదిరై. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటి లక్ష్మీరాయ్‌ను ఎంపిక చేశారు. అయితే చిత్ర షూటింగ్ 60 శాతం పూర్తి అయినా ఈ బ్యూటీని షూటింగ్‌కు పిలవలేదు. దీంతో చిరైత్తడంతో ఈమె ఇరుంబుకుదిరై చిత్రంలో తానున్నానా, లేదా అంటూ ఆవేశంతో దర్శక నిర్మాతపై చిర్రుబుర్రులాడి చిత్రం నుంచి వైదొలగినట్లు వార్తలకెక్కేశారు. ఇరుంబు కుదిరై చిత్రంలో తానున్నానో లేదో తెలియదు. దీంతో ఇతర చిత్రాలకు కాల్షీట్స్ కేటాయించాలో లేదో తెలియదు. అందుకే చిత్రం నుంచి తప్పుకున్నానని ప్రకటించేశారు. ఇది ఇంతకు ముందు కథ. ఇప్పుడు మళ్లీ ఆ చిత్రంలో నటించడానికి లక్ష్మీరాయ్ సిద్ధం అవడం విశేషం. ఇటీవల ఆమెతో మాట్లాడిన దర్శక నిర్మాతలు లక్ష్మీరాయ్ తమ చిత్రంలో నటిస్తున్నారని ప్రకటించారు. ఇరుంబుకుదిరై చిత్రంలో లక్ష్మీరాయ్ ఇక నటించే అవకాశం లేదని భావించిన వారికి ఇది షాక్‌కు గురి చేసే అంశమే. అంతేకాదు. ఇరుంబుకుదిరై చిత్రంలో తాను నటించనున్నట్లు, ఇంతకు ముందెప్పుడూ పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నట్లు లక్ష్మీరాయ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి చిత్ర దర్శకుడు యువరాజ్‌ను అడగ్గా నిజమే లక్ష్మీరాయ్ తమ చిత్రంలో పరుగుల రాణిగా నటించనున్నారని వెల్లడించారు. అప్పుడు వైదొలగడానికి, మళ్లీ ఇప్పుడు నటించమనడానికి కారణం ఏమిటన్న ప్రశ్న కు మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు. -
ప్రేమలో గెలవాలంటే...
తొలి చూపులోనే ఆ యువతిపై మనసు పారేసుకుంటాడతను. ఓ శుభముహూర్తాన ‘ఐ లవ్ యు’ కూడా చెప్పేస్తాడు. కానీ, తన మనసు గెల్చుకోవాలంటే ఏదైనా ప్రయోజనాత్మక కార్యం చేయాలని ఆమె ఓ నిబంధన విధిస్తుంది.. మరి.. ఆమె కోరికని నెరవేర్చి, ప్రేమను పొందగలిగాడా? లేదా? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఎదిర్ నీచల్’. శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా తమిళ హీరో ధనుష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు తెలుగులోకి అనువదించారు. ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకుడు. ఈ నెల 29న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ -‘‘జీవితంలో ఆశావహ దృక్పథంతో ఉంటే అన్నీ సాధించగలుగుతామని చెప్పే చిత్రం ఇది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్లతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ధనుష్, నయనతార చేసిన ప్రత్యేక పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ అద్భుతంగా నటించారు. అనిరుథ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
అభిమానం హద్దు మీరితే..
దేనికైనా ఒక హద్దు అనేది ఉంటే ముచ్చటగానూ, మురిపెంగానూ ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల విషయంలో అభిమానుల ప్రేమాభిమానాలు హద్దులు మీరితే వాతావరణం రచ్చ రచ్చగా మారుతుంది. హీరోయిన్ల విషయంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. సరిగ్గా అలాంటి ఇబ్బందులతోనే నటి ప్రియా ఆనంద్ ఉక్కిరిబిక్కిరైన సంఘటన ఒరు ఊరుల రెండు రాజ చిత్ర షూటింగ్ జరిగింది. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు చిత్ర షూటింగ్ మయిలాడుదురైలో జరుపుకుంటోంది. ఇది రైలులో జరిగే కథా చిత్రం. అక్కడే రైల్వేస్టేషన్లో పాట చిత్రీకరణ జరుపుతుండగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా షూటింగ్ చూడటానికి వచ్చారు. ఒక తరుణంలో ఆ జనం అంతా విమల్, ప్రియాఆనంద్‌ను దర్గరగా చూడటానికి గుమిగూడారు. దీంతో చిత్ర యూనిట్ హీరో హీరోయిన్లను సురక్షితంగా కెరవాన్ వ్యాన్‌లోకి పంపే ప్రయత్నం చేసింది. ఈ లోపే కొందరు ఆకతాయి కుర్రాళ్లు తమ తుంటరి తనాన్ని ప్రదర్శించారు. నటి ప్రియా ఆనంద్‌ను తాకడం, గిల్లడం వంటి అల్లరి చేష్టలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అతి కష్టం మీద జనం మధ్య నుంచి నటి ప్రియూ ఆనంద్‌ను రక్షించారని చిత్ర దర్శకుడు కన్నన్ తెలిపారు. కానీ ప్రియా ఆనంద్ మాత్రం దీన్ని అంతగా పట్టించుకోకపోవడం విశేషం. -
ప్రేమకథ మొదలైంది!
‘లీడర్’ ఫేం ప్రియా ఆనంద్ తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్నారు. విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారామె. తమిళంలో ప్రియా నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘ఎదిర్ నీచల్’ ఒకటి. ఆర్.యస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ హీరో. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు విడుదల చేస్తున్నారు. ‘వై దిస్ కొలవెరి..’ పాట ఫేం అనిరుథ్ స్వరపరచిన పాటలను ఇటీవలే విడుదల చేశారు. ఈ నెలాఖరున సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘తన మనసుని గెల్చుకోవాలంటే ఏదైనా ప్రయోజనాత్మక పని చేయాలని ప్రియురాలు విధించిన నిబంధనను నిజం చేయడానికి ఓ కుర్రాడు ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ. హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా నటనకు అవకాశం ఉంది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ధనుష్, నయనతార చేసిన ప్రత్యేక పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. -
నైట్ పార్టీలకు వెళ్లను
నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదు. ప్రేమకు పచ్చజెండా ఊపను వంటి ప్రకటనలు గుప్పిస్తోంది నటి ప్రియా ఆనంద్. తొలి రోజుల్లో వామనన్, నూట్రెంబదు చిత్రాల్లో నటించి ఐరన్ లెగ్ ముద్రకు గురైన ఈ బ్యూటీ ఆ తరువాత నటించిన ఇంగ్లిష్ వింగ్ల్లిష్, ఎదిర్ నీచ్చల్, వణక్కం చెన్నై వంటి చిత్రాల విజయాలతో ప్రైమ్ టైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరిమానంబి, వై రాజా వై, ఇరుంబు కదిరై, ఒరు ఊరుల రెండు రాజా తదితర ఐదు చిత్రాలు ఉన్నాయి. ప్రియా ఆనంద్ మాట్లాడుతూ నటి శ్రీదేవితో కలసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం తన కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యువ నటుడు గౌతమ్ కార్తీక్ తనకు నచ్చిన నటుడని బదులిచ్చింది. అలాగే తాను జత కడుతున్న హీరోల్లో అధికశాతం పెళ్లి అయిన వారేనని అంది. తాను నైట్ పార్టీలకు వెళ్లింది లేదని ఎవరినీ ప్రేమించింది లేదని చెప్పింది. తనకు వరుడిని తెచ్చిపెట్టే బాధ్యతను తన తల్లిదండ్రులకు అప్పగించానని ప్రియా ఆనంద్ చెప్పడం విశేషం. -
పశ్చాత్తాపంతో ప్రియా ఆనంద్
విజయం ప్రభావం మనిషిపై చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అరుుతే అంతా ఇంతా కాదు. మొదట్లో ఒక్క చాన్స్ అంటూ చేయని ప్రయత్నం ఉండదు. అదృష్టం బాగుండి అవకాశం వస్తే ఒక్క హిట్ కోసం తహతహలాడుతారు. టైమ్ బాగుండి సక్సెస్ వస్తే అప్పటి వరకు ఉన్న వారి మైండ్‌సెట్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందానా వారి ప్రవర్తన ఉంటుంది. పారితోషికం పెంచుకుంటూ పోతారు. నటి ప్రియా ఆనంద్ ఇందుకు వ్యతిరేకం కాదు. ఈ బ్యూటీకి ఎదుర్‌నీచ్చల్ చిత్రానికి ముందు ఒక్క విజయం లేదు. కోలీవుడ్లోకి 180 చిత్రంతో రంగప్రవేశం చేసిన ప్రియాఆనంద్కు ఆ తరువాత సరైన అవకాశాలే లేవు. బాలీవుడ్లో శ్రీదేవితో కలిసి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం చేసినా ఆ చిత్రం ఈమె కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ కాలేదు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది. అక్కడ కెరీర్ ఆశాజనకంగా లేదు. అయితే తమిళంలో ఎదుర్‌నీచ్చల్ ప్రియా ఆనంద్‌కు విజయం రుచి చూపించింది. ఒక సక్సెస్ చాలు అన్నట్లుగా ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. అప్పటి వరకు నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టని ప్రియాఆనంద్ ఆ తరువాత షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం షూటింగ్‌లకు డుమ్మాకొట్టడం మొదలెట్టింది. చిత్రానికి ఐదు లక్షల చొప్పున పారితోషికం పెంచుకుంటూ పోరుుంది. ప్రస్తుతం 40 లక్షల పారితోషికం తీసుకుంటున్న ఈ భామ దాన్ని 50 లక్షలకు పెంచాలని ఆశపడుతోంది. వణక్కం చెన్నై చిత్రం తరువాత ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు డిమాండ్ చేస్తోందట. దీంతో పెన్సిల్ చిత్ర నిర్మాత వేరే వారిని ఎంపిక చేసుకున్నారు. ఇలా పలు నిర్మాతలు వెనుకంజ వేయడంతో ఇప్పుడు సినిమాల్లేక ప్రియా ఆనంద్ పశ్చాత్తాపం పడుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. -
అధర్వ నుంచి లక్ష్మీరాయ్ అవుట్
సాధారణంగా హీరోయిన్లు దర్శక నిర్మాతలకు ఝలక్ ఇస్తుంటారు. అందుకు విరుద్ధంగా ఇరుంబు కుదిరై చిత్ర దర్శక నిర్మాతలు నటి లక్ష్మీరాయ్‌కు షాక్ ఇచ్చారు. పరదేశి చిత్రం తర్వాత యువ నటుడు అధ్వర్య నటిస్తున్న చిత్రం ఇరుంబు కుదిరై. ప్రియాఆనంద్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి యువరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బైక్ రేస్ క్రీడాకారిణిగా ముఖ్యపాత్రలో నటి లక్ష్మీరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ చిత్రం కోసం ఆమె మోటార్ బైక్ డ్రైవింగ్‌లో శిక్షణ కూడా పొందారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తయింది. అధర్వ, ప్రియా ఆనంద్ మధ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అయినా లక్ష్మీరాయ్‌కి చిత్ర యూనిట్ నుం చి షూటింగ్ కోసం పిలుపు రాలేదు. ఈ విషయమై యూనిట్ వర్గాలను విచారించగా ఆమె చిత్రంలో నటించడం లేదని తెలిపారు. ఈ సమాచారంతో లక్ష్మీరాయ్ షాక్‌కు గురయ్యారు. ఇరుంబు కుదిరై చిత్రం నుంచి తొలగించిన విషయం గురించి ఆమెకు ఎలాంటి సమాచారం లేదట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతోందట లక్ష్మీరాయ్. -
రుజువు చేస్తే 50 లక్షలిస్తా!
అందాల భామ ప్రియా ఆనంద్ కోలీవుడ్ మీడియాపై గుర్రు మీదున్నారు. స్వలాభం కోసం తనలాంటి వారిని పావులుగా చేసి ఆడటం సమంజసం కాదని ఘాటుగానే స్పందించారు. ఇంతకీ ప్రియా ఆనంద్‌కు కోపం తెప్పించిన విషయం ఏంటా అనుకుంటున్నారా? అయితే విషయంలోకెళ్దాం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకునిగా తమిళంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముందు కథానాయికగా అనుకున్నది ప్రియానే నట. అయితే... ఆ సినిమా విషయంలో సదరు నిర్మాతలను ఈ ముద్దుగుమ్మ 50 లక్షలు డిమాండ్ చేశారని, దాంతో షాక్ తిన్న నిర్మాతలు అక్కడ్నుంచీ పలాయనం చిత్తగించి, తెలుగమ్మాయి శ్రీదివ్యను కథానాయికగా తీసుకున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో మనస్తాపానికి గురైన ప్రియాఆనంద్ పై రీతిలో స్పందించారు. ఇంకా చెబుతూ -‘‘డబ్బే ముఖ్యం అనుకుంటే... ఈ పాటికి తీరిక లేకుండా సినిమాలు చేస్తుండేదాన్ని. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తూ... సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను కాబట్టే కెరీర్ మొదలై నాలుగేళ్లు కావస్తున్నా... తక్కువ సినిమాలే చేశాను. తమిళంలో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. దానికి లేనిపోనివి సృష్టించి రాసేశారు. నేను యాభై లక్షలు అడిగానని రుజువు చేస్తే... వారికి యాభై లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ అన్నారు ప్రియా ఆనంద్. -
అంతా అబద్దం
విజయం ఎంతటి వారిలోనైనా మార్పు తెస్తుంది. అదే విధంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు. నటి ప్రియా ఆనంద్ ఇందుకు అతీతం కాదంటోంది కోలీవుడ్. ఎదుర్ నీచ్చిల్ చిత్రం ముందు వరకు అవకాశాల కోసం ఈ భామ ఎదురు చూసింది. అయితే ఎదుర్ నీచ్చిల్ విజయంతో అవకాశాలు ప్రియా ఆనంద్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మూడు చిత్రాలు చేతిలో ఉండడంతో ఈ జాణ తన పారితోషికాన్ని ఏకంగా రూ.50 లక్షలకు పెంచేసిందట. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట. అవాక్కైన నిర్మాత ఆమెకు బదులు శ్రీదివ్యను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారని టాక్. ఈ విషయాన్ని ప్రియా ఆనంద్ ఖండించింది. తాను పారితోషికం భారీగా పెంచేశానంటూ అబద్దపు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇటీవల కథలే వినలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికే ఏడాదికిపైగా పడుతుందని వివరించింది. ఈ చిత్రాలు పూర్తి చేసిన తర్వాతే నూతన అవకాశాలను అంగీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అలాంటిది తానేదో పారితోషికాన్ని భారీగా పెంచాననే ప్రచారం అబద్దమని పేర్కొంది.