ప్రేమకథ మొదలైంది! | ' Na love story Modalaindi ' soon in theaters | Sakshi
Sakshi News home page

ప్రేమకథ మొదలైంది!

Published Tue, Feb 11 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

ప్రేమకథ  మొదలైంది!

ప్రేమకథ మొదలైంది!

‘లీడర్’ ఫేం ప్రియా ఆనంద్ తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్నారు. విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారామె. తమిళంలో ప్రియా నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘ఎదిర్ నీచల్’ ఒకటి. ఆర్.యస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ హీరో. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు విడుదల చేస్తున్నారు. ‘వై దిస్ కొలవెరి..’ పాట ఫేం అనిరుథ్ స్వరపరచిన పాటలను ఇటీవలే విడుదల చేశారు.
 
 ఈ  నెలాఖరున సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘తన మనసుని గెల్చుకోవాలంటే ఏదైనా ప్రయోజనాత్మక పని చేయాలని ప్రియురాలు విధించిన నిబంధనను నిజం చేయడానికి ఓ కుర్రాడు ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ. హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా నటనకు అవకాశం ఉంది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ధనుష్, నయనతార చేసిన ప్రత్యేక పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement