సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్‌ కాల్స్‌ | Phone Number Used Amaran Movie Girl now | Sakshi
Sakshi News home page

సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్‌ కాల్స్‌

Published Sat, Nov 9 2024 2:39 PM | Last Updated on Sat, Nov 9 2024 4:22 PM

Phone Number Used Amaran Movie Girl now

ఇటీవల శివకార్తికేయన్‌ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి తెరకెక్కించిన చిత్రం అమరన్‌. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, అమరన్‌ చిత్రంలో ఉపయోగించ్చిన ఓ ఫోన్‌ నంబరు ప్రస్తుతం ఓ యువకుడిని ఇరకాటంలో పడేసింది. తన సెల్‌ నంబరును ఆ చిత్రంలో చూపించడంతో వస్తున్న కాల్స్‌ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

తాజాగా ఈ ఘటన చైన్నెలో వెలుగు చూసింది. వివరాలు.. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్‌ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోకు హీరోయిన్‌ ఓ పేపర్‌లో ఫోన్‌ నంబర్‌ రాసి ఇచ్చినట్టుగా కొన్ని సెకన్ల పాటు ఓ దృశ్యం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ఫోన్‌ నంబరు వాహీసన్‌ అనే చైన్నె యువకుడి పాలిట శాపంగా మారింది. తాను ఉపయోగిస్తున్న ఫోన్‌ నంబర్‌ను ఆ చిత్రంలో చూపించడంతో సంతోష పడ్డప్పటికీ ఆ తదుపరి పరిణామాలు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి. 

సాయిపల్లవి గారితో మాట్లాడాలంటూ అనేక మంది ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి విసిగిస్తుండటంతో చివరకు అతడు తన తంటాలను ఆ సినీ యూనిట్‌కు తెలిసే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement