Do You Know What Leader Heroine Priya Anand Is Doing Now? - Sakshi
Sakshi News home page

Priya Anand: లీడర్‌తో టాలీవుడ్ ఎంట్రీ.. ప్రియా ఆనంద్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

Published Mon, Feb 27 2023 7:07 PM | Last Updated on Mon, Feb 27 2023 8:02 PM

Rana Movie Leader Heroine Priya Anand latest News - Sakshi

హైదరాబాద్‌లో పుట్టి.. అమెరికాలో పెరిగి.. చెన్నైలో మోడలింగ్ చేసి హీరోయిన్‌గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. రానా మూవీ లీడర్ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించింది. ఆ చిత్రంలో జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాకముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేసింది. వామనన్ అనే తమిళ చిత్రంలో సినీరంగంలోకి ప్రవేశించింది. 

తమిళ బ్యూటీ ప్రియా ఆనంద్  లీడర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. సినిమా హిట్ అయినప్పటికీ ఆమె పెద్దగా అవకాశాలు రాలేదు. పలు కారణాలతో ఆమె ఛాన్సులు రాకుండా పోయాయి. కొన్ని సినిమాల్లో సెకండ్ ఛాయిస్‌గా ప్రియాను తీసుకున్నారు. వాటిలో రామ్ పోతినేని, సిద్దార్థ్, రానా, శర్వానంద్‌తో నటించింది. 

అయితే ప్రస్తుతం ఆమె చేస్తుందన్న దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ కనుమరుగై పోయినా.. కోలీవుడ్‌లో మాత్రం బీజీ అయిపోయింది. ఇటీవల తమిళ డబ్బింగ్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అవకాశాలు రావడంతో అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే ఓ తమిళ మూవీలో హీరోయిన్‌గా చేస్తుండగా.. మరో కన్నడ మూవీకి ఓకే చెప్పిందంట ప్రియా ఆనంద్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement