మానాడు రీమేక్‌లో రానా సోదరుడు అభిరామ్‌ | Abhiram Daggubati In Maanadu Movie Remake | Sakshi
Sakshi News home page

Rana Daggubati-Abhiram Daggubati: మానాడు రీమేక్‌లో రానా సోదరుడు అభిరామ్‌

Published Sat, Jan 15 2022 10:40 AM | Last Updated on Sat, Jan 15 2022 10:50 AM

Abhiram Daggubati In Maanadu Movie Remake - Sakshi

శింబు హీరోగా ఇటీవల వచ్చిన మానాడు చిత్రం​ సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శింబుకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్‌ నటించింది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఇదే ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు రీమేకర్‌లో రానా నటిస్తున్నట్లు రీసెంట్‌గా వార్తలు వినిపించాయి.

చదవండి: బాలయ్య మూవీ ఆఫర్‌ వదులకున్న నటి రాశి, ఆ సీన్‌పై అభ్యంతరంతోనేనట..

తాజాగా మానాడు రీమేక్‌ అతడి సోదరుడు అభిరామ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ మూవీ రీమేక్‌ హక్కులను సురేష్‌ ప్రొడక్షన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొదట ఈ రీమేక్‌లో రానా నటించనున్నాడని టాక్‌ వినిపించగా.. తాజాగా అభిరామ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట.  ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే 'మానాడు' రీమేక్ మొదలవుతుందని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement