
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. తనదైన స్టైల్‌తో క్లాసిక్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల రీసెంట్‌గా లవ్‌స్టోరీతో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్‌లో తీసిన బెస్ట్ మూవీస్‌లో లీడర్ ఒకటి. రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: కూతురి కోసం చిరంజీవి ఊహించని బహుమతి
శేఖర్ కమ్ముల కోసం ఈ సినిమా సీక్వెల్ తప్పకుండా ఉంటుందని గతంలోనే వెల్లడించారు. తాజాగా ఈ సీనిమా సీక్వెల్‌పై ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తమిళ స్టార్ హీరో సూర్య లీడర్-2లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కెనున్న ఈ చిత్రానికి సూర్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment