హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో ఫిర్యాదు వెళ్లింది. అవుటర్ రింగ్‌రోడ్‌లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ.. బీసీ పొలిటికల్ జేఏసీ బుధవారం ఫిర్యాదు చేసింది.
ఓఆర్‌ఆర్(ORR)లో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ అక్రమాలపై దర్యాప్తు జరపాలని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు వెళ్లింది. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాల పై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఇవాళ ఏసీబీకి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. ఆదయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి ముపై ఏళ్ళ పాటు లీజ్‌కు ఇచ్చారు. అయితే..
ఆ కంపెనీ రూ. 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్ కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లో భూకెటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో(quid pro quo) ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. హెచ్ఎండీఏ నిధుల పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు జరపాలి’’ అని బీసీ పోలిటికల్ జేఏసీ నేత యుగంధర్ గౌడ్ చెప్తున్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?: కేటీఆర్
ఏసీబీ నోటీసుల్లో ఏముందంటే..
ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో ఏసీబీ కీలకాంశాలకు ప్రస్తావించింది..‘‘విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చినప్పుడు మీ లాయర్‌ను అనుమతించాలని మీరు కోరారు. కానీ, చట్ట ప్రకారం అది సాధ్యం కాదని మీకు తెలియజేశాం. కాబట్టి, 9వ తేదీన మీ విచారణకు కూడా లాయర్‌ను అనుమతించడం కుదరదు. మీరు విచారణకు హాజరుకండి. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఏం డాక్యుమెంట్లు కావాలో అడుగుతాం’’ అని ఏసీబీ పేర్కొంది. మరోవైపు విచారణకు తన లాయర్‌ను అనుమతించేలా కోర్టు నుంచి అనుమతి కోసం కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment