ORR
-
40 కి.మీ.. 40 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్స్ యూనివర్సిటీ వరకు నిర్మించనున్న 40 కిలోమీటర్ల మెట్రో కారిడార్ అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన నగరాల్లోని మెట్రో ప్రయాణ అనుభవాలు స్ఫురించే విధంగా ఈ కారిడార్‌లో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. 40 కి.మీ ఫోర్త్ సిటీ మెట్రోలో చాలావరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో కొంతభాగంలో మాత్రం ఎట్‌గ్రేడ్ మెట్రో (భూతలంపైన) నిర్మాణం చేపట్టనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భవిష్యత్ దార్శనిక దృష్టి మేరకు.. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.ఓఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులో నిర్మించే మెట్రో అవసరాలకు అనుగుణంగా ఆయన ఓఆర్ఆర్లో 20 మీటర్లు మెట్రో కోసం కేటాయించిన విషయం గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. సర్వే పనుల పరిశీలన మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపకల్పనలో భాగంగా ఎన్విఎస్ రెడ్డి.. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ అధికారులతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారు చేసేందుకు జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. కొంగర కలాన్ దాటిన తర్వాత రోడ్డు లేకపోవడంతో కాలినడకనే కొండలు, గుట్టలు దాటుతూ పర్యటన కొనసాగించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా ఆవిష్కృతం కానున్న ఫోర్త్‌సిటీ మెట్రో సేవలు కూడా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సుమారు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న భవిష్య నగరిని కాలుష్య రహిత నగరంగా రూపొందించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కారిడార్ ఇలా... » శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ టెరి్మనల్ నుంచి మొదలై కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గం నిర్మించనున్నారు. » మన్సాన్పల్లి రోడ్డు మార్గంలో 5 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్‌కు చేరుతుంది. బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా నిర్మించనున్నారు. » పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ మెట్రో కారిడార్‌గా నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుపై ‘ఎట్ గ్రేడ్ మెట్రో’ » రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగర కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనుంది.ఈ రోడ్డు మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రోరైల్‌కు కేటాయించారు. ఇక్కడ భూ తలంపై (ఎట్ గ్రేడ్) మెట్రో అభివృద్ధి చేయనున్నారు. » ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే ఎత్తులో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీ స్ రోడ్లు ఉంటాయని ఎనీ్వఎస్ రెడ్డి వివరించారు. వైఎస్ భవిష్యత్ దృష్టి ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలో మెట్రో రైల్‌కు కొంతభూమిని కేటాయించాలన్న తన ప్రతిపాదన మేరకు అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓఆర్ఆర్లో అంతర్భాగంగా 20 మీటర్లు మెట్రోకు కేటాయించారని ఎన్వి ఎస్ రెడ్డి చెప్పారు. అయితే ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, ఆచరణ సాధ్యం కాదంటూ అపహా స్యం చేశారని, కానీ ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌తోపాటు, మెట్రో కూడా కార్యరూపం దాల్చిందన్నారు. సుమారు రూ.22 వేల కోట్లతో మొట్టమొదటి పీపీపీ ప్రాజెక్టుగా 69 కిలోమీటర్ల మెట్రో మొదటి దశను విజయవంతంగా నిర్మించామని, అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికత మేరకు హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా రెండో దశ నిర్మాణం చేపడతాయని చెప్పారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లతో పాటు, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్‌ను మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. -
ఆరు రైల్వే లైన్లతో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్ నగరానికి 75 కి.మీ దూరంలో తొలి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా చేపట్టబోయే రీజినల్ రింగు రోడ్డుకు అవతల దీన్ని చేపట్టనున్నారు. ఆరు ప్రాంతాల్లోని రైల్వే లైన్లను ఇది క్రాస్ చేస్తుంది. అంటే ఆరు రైలు మార్గాలు దీనితో అనుసంధానమవుతాయన్న మాట. ఈ ప్రాజెక్టును గతంలోనే ప్రతిపాదించినా సాధ్యాసాధ్యాలను తేల్చటంలో జాప్యం జరిగింది.\దీంతో ఈ ప్రతిపాదన నిలిచిపోయిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసిన రైల్వే శాఖ, దాని అలైన్‌మెంటు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కసరత్తు ప్రారంభించింది. జూన్ నాటికి డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు సమర్పించనుంది. ఫైనల్ లొకేషన్ సర్వేలో భాగంగా ఇప్పటికే లైడార్ (కాంతి కిరణాల) ఆధారిత సర్వే పూర్తి చేసి ప్రాథమిక అలైన్‌మెంటును సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.13,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. గూడ్స్ రైళ్లన్నీ ‘ఔటర్’ నుంచే.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా, వెలుపలి నుంచే వెళ్లిపోయేలా ట్రిపుల్ ఆర్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే. అదే తరహాలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల రైళ్లలో కొన్ని నగరంలోని ప్రధాన స్టేషన్లలోకి వచ్చేలా, సరుకు రవాణా లాంటి రైళ్లు వెలుపలి నుంచే వెళ్లిపోయేలా ఔటర్ రింగు రైలు ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం అయ్యింది. ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్కు అవతలి వైపు 2 కి.మీ నుంచి 4 కి.మీ దూరంలో దీన్ని నిర్మించేలా.. తాజాగా హెలీకాప్టర్ ద్వారా లైడార్‌తో ఓ ప్రాథమిక అలైన్‌మెంటును రైల్వే శాఖ రూపొందించింది.రింగు రోడ్డుకు అవతలి వైపు రింగ్ రైలు మార్గం నిర్మించాల్సి ఉన్నందున, ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంటు కూడా తేలాక దీని అలైన్‌మెంటు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం లైడార్ ఆధారంగా పూర్తి మ్యాప్ సిద్ధం చేశారు. ఆ మ్యాపు ఆధారంగా తదుపరి కచ్చితమైన అలైన్‌మెంటును రూపొందించనున్నారు. ఫైనల్ లొకేషన్ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12.64 కోట్లను గత బడ్జెట్లో మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 394– 420 కి.మీ నిడివితో సింగిల్ లైన్ ⇒ ఔటర్ రింగ్ రైలు నిడివి 394 కి.మీ నుంచి 420 కి.మీ వరకు ఉండనుంది. ఇందుకు 70 నుంచి 80 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. భూసేకరణ ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. భూసేకరణకు దాదాపు రూ.7 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ⇒ ప్రస్తుతానికి సింగిల్ లైన్ మాత్రమే నిర్మించాలని నిర్ణయిస్తున్నందున, దాని నిర్మాణ వ్యయం రూ.6,500 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 23 నుంచి 25 వరకు రైల్వేస్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇంకా స్టేషన్లను గుర్తించలేదు. ⇒ కీలక ప్రాంతాల్లో గూడ్సు రైళ్ల కోసం సరుకు రవాణా యార్డులు నిర్మిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఒక మెయిన్ లైన్, రెండు లూప్ లైన్లు, సరుకు రవాణా పరిమాణం అధారంగా ఒకటి నుంచి రెండు గూడ్సు లైన్లు ఏర్పాటు చేస్తారు. ⇒ రైలు మార్గంతో పాటే విద్యుదీకరణను కూడా పూర్తి చేస్తారు. ⇒ ఆరు ఇంటర్‌ఛేంజ్ ఆర్ఓఆర్ వంతెనలతో పాటు నదులపై ఐదు వంతెనలు, రోడ్లను, కాలువలను దాటేందుకు 400 చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ⇒ రేట్ ఆఫ్ రిటర్న్స్ 10 శాతానికి పైగా ఉండాలని నిర్ధారించారు. అంటే ప్రాజెక్టుకు పెట్టే పెట్టుబడిపై ఖర్చులు పోను కనీసం 10 శాతానికి పైగా అదనపు ఆదాయం ఉండాలన్నమాట. ⇒ గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వేలో సానుకూల ఫలితమే వచ్చింది. త్వరలో డీటెయిల్డ్ ట్రాపిక్ సర్వే నిర్వహించి దీనిపై కచ్చితమైన అంచనాను తేల్చనున్నారు. అనుసంధానంఇక్కడే..⇒ వలిగొండ వద్ద సికింద్రాబాద్–గుంటూరు రైల్వేలైన్‌ను, ⇒ వంగపల్లి వద్ద సికింద్రాబాద్–వరంగల్ లైన్‌ను, ⇒ గుల్లగూడ వద్ద సికింద్రాబాద్–తాండూరు లైన్‌ను, ⇒ మాసాయిపేట వద్ద సికింద్రాబాద్–నిజామాబాద్ లైన్‌ను, ⇒ బాలానగర్ వద్ద కాచిగూడ–మహబూబ్‌నగర్ లైన్‌ను ⇒ గజ్వేల్ వద్ద సికింద్రాబాద్–సిద్దిపేట లైన్‌ను రింగ్ రైలు మార్గం క్రాస్ చేస్తుంది. ⇒ ఈ ఆరు ప్రాంతాల్లోని రైల్వే లైన్లను ఔటర్ రింగ్ రైలు క్రాస్ చేసే చోట రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జీలను నిర్మిస్తారు. భూసేకరణ పెద్ద సవాల్ట్రిపుల్ ఆర్కు భూములిచ్చేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ససేమిరా అంటున్నారు. కొన్నిచోట్ల ప్రజలను అతి కష్టంమీద ఒప్పించారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రైల్‌కు కొత్తగా భూసేకరణ అంటే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రకరకాల ప్రాజెక్టులతో పలు దఫాలుగా భూములు కోల్పోయామని, ఇక కొత్తగా ఏ ప్రాజెక్టుకూ భూములిచ్చేది లేదని చాలా గ్రామాల్లో ప్రజలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రింగ్ రైలుకు భూములు సేకరించటం కత్తిమీద సామే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో ఫిర్యాదు వెళ్లింది. అవుటర్ రింగ్‌రోడ్‌లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ.. బీసీ పొలిటికల్ జేఏసీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్(ORR)లో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ అక్రమాలపై దర్యాప్తు జరపాలని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు వెళ్లింది. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాల పై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఇవాళ ఏసీబీకి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. ఆదయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి ముపై ఏళ్ళ పాటు లీజ్‌కు ఇచ్చారు. అయితే.. ఆ కంపెనీ రూ. 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్ కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లో భూకెటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో(quid pro quo) ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. హెచ్ఎండీఏ నిధుల పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు జరపాలి’’ అని బీసీ పోలిటికల్ జేఏసీ నేత యుగంధర్ గౌడ్ చెప్తున్నారు.ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?: కేటీఆర్ఏసీబీ నోటీసుల్లో ఏముందంటే.. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో ఏసీబీ కీలకాంశాలకు ప్రస్తావించింది..‘‘విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చినప్పుడు మీ లాయర్‌ను అనుమతించాలని మీరు కోరారు. కానీ, చట్ట ప్రకారం అది సాధ్యం కాదని మీకు తెలియజేశాం. కాబట్టి, 9వ తేదీన మీ విచారణకు కూడా లాయర్‌ను అనుమతించడం కుదరదు. మీరు విచారణకు హాజరుకండి. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఏం డాక్యుమెంట్లు కావాలో అడుగుతాం’’ అని ఏసీబీ పేర్కొంది. మరోవైపు విచారణకు తన లాయర్‌ను అనుమతించేలా కోర్టు నుంచి అనుమతి కోసం కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. -
మితిమీరిన వేగంతోనే ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘స్పీడ్ థ్రిల్స్..బట్ కిల్స్..’(వేగం ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ చంపేస్తుంది) అని పోలీసులు చెబుతున్నా, రహదారులపై అక్కడక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. కొందరు వాహనదారులు చెవికెక్కించుకోవడం లేదు. విశా లమైన రోడ్లపై యమస్పీడ్‌గా దూసుకెళుతున్నారు. అంతే వేగంగా ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలకు కారణాలు విశ్లేíÙస్తే.. మితిమీరిన వేగంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడవుతోంది. రోడ్డు ప్ర మాదాలు నియంత్రించేందుకు, ప్రమాదాలకు మూలకారణాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం అధికారులు 2023లో రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాలు విశ్లేíÙంచారు. రహదారులు, ఓఆర్ఆర్పై మొత్తం 9,749 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఇందులో 5,817 రోడ్డు ప్రమాదాలు వాహనదారుల మితిమీరిన వేగం కారణంగానే సంభవించినట్టు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో 120 రోడ్డు ప్రమాదా లు జరిగాయి. అత్యంత నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో 3,532 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలకు అసలు కారణాలు గుర్తించడం ద్వారా వాటిని నివారించేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. 3,532 నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో యాక్సిడెంట్లు⇒ 2023లో జరిగిన ప్రమాదాలను విశ్లేషించిన పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం ⇒ ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టే యోచన -
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.కాగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్ ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ కందాడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్ లేవంటూ కొట్టివేసింది. -
ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం
హైదరాబాద్, సాక్షి: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణణం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి రావాలని పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు విలీనం అయ్యాయి. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్, తారామతిపేట పంచాయతీలుదమ్మాయిగూడ మున్సిపాలిటీల్లోకి కీసర, యాద్గిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి ఎదుతాబాద్, ఘనపూర్, మణిప్యాల్, అంకుశపూర్, ఔశాపూర్మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూరు, రాయలపూర్ గ్రామాలుపోచారం మున్సిపాలిటీలోకి కొర్రెముల, కాచనవానిసింగారం, చౌదరిగూడ, బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం తుంకుంట మున్సిపాలిటీలోకి బోంరాస్‌పేట, శామీర్‌పేట, బాబాగూడ -
సెలబ్రిటీనే ఇలా చేస్తే ఎలా?.. మీకు రూల్స్ వర్తించవా?
సోషల్ మీడియా వచ్చాక రీల్స్ చేయడం ఓ పిచ్చి అలవాటుగా మారిపోయింది. ఎక్కడపడితే రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మెట్రో, బస్సులు, రైళ్లు, రోడ్లను కూడా వదలడం లేదు. కొందరైతే రీల్స్ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రీల్స్ చేస్తున్నారు.అలాంటి లిస్ట్‌లో మన సెలబ్రిటీ, యాంకర్ సావిత్రి కూడా చేరిపోయింది. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్పై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తప్ప మనుషులకు నడవడానికి అవకాశం లేదు. ఓఆర్ఆర్పై దాదాపు 120 స్పీడుతో వాహనాలు వెళ్తుంటాయి. అప్పడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.మరి నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆమెను చూసి.. మరికొందరు రీల్స్ చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వారిని ఓఆర్ఆర్పై రీల్స్ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదంటే రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్ను రీల్స్‌కు అడ్డాగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆమెపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
సిటీ చుట్టూ 11 మినీ టౌన్‌షిప్‌లు
గ్రేటర్ హైదరాబాద్‌పై వలసల ఒత్తిడిని, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో ఔటర్, ట్రిపుల్ ఆర్ మధ్య లే–అవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వస్తాయని.. వాటికి రహదారులను అనుసంధానం చేస్తే అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మేడ్చల్, సంగారెడ్డి, షాద్‌నగర్, ఘట్కేసర్ తదితర మార్గాల్లోని 11 ప్రాంతాల్లో మినీ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ‘హైదరాబాద్ నగరాభివృద్ది సంస్థ (హెచ్ఎండీఏ)’ ప్రతిపాదించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద తుర్కపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను మినీ నగరాలుగా నిర్మిస్తే బాగుంటుందని సూచించింది. ఈ ప్రాంతాల్లో మినీ నగరాలను నిర్మించేందుకు విధివిధానాలను కూడా రూపొందించినట్టు సమాచారం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. భూసేకరణ పనులను హెచ్ఎండీఏ చేయాలని.. మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిని ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి ట్రిపుల్ ఆర్‌ను రవాణాపరమైన రోడ్డుగానే కాకుండా ఒక గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి. ఇరువైపులా పరిశ్రమల ఏర్పాటుతో ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ట్రిపుల్ ఆర్ ప్రవేశించే జిల్లాల్లో మూడు నుంచి పదెకరాల విస్తీర్ణాలలో నైపుణ్య కేంద్రాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి. దీంతో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మినీ నగరాలలో ఏమేం ఉంటాయంటే..! ఒక్కో శాటిలైట్ టౌన్‌షిప్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సుమారు 10 లక్షల జనాభా నివాసం ఉండేందుకు వీలుగా నిర్మించనున్నారు. 100 అడుగుల అప్రోచ్ రహదారి, 30 నుంచి 60 అడుగుల అంతర్గత రహదారులు ఉంటాయి. ఈ టౌన్‌షిప్‌లలో బహుళ అవసరాల కోసం భూమిని అందుబాటులో ఉంచుతారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు గృహాలు, బ్యాంకులు, మార్కెట్లు, హోటళ్ల, ఇతర వాణిజ్య సదుపాయాలతోపాటు విద్యా, వైద్య అవసరాలు, పౌర సేవలు, ప్రజారవాణా, క్రీడా సదుపాయాలు, పార్కులు, ఆట స్థలాలు ఉంటాయి. కాలుష్యాన్ని విడుదల చేయని, అంతగా ప్రమాదకరంకాని పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. -
మెడికో రచనా కేసులో ఏం జరిగింది?
సంగారెడ్డి, సాక్షి: మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆమె పెళ్లి నిశ్చయం కాగా.. ఆ వ్యవహారంలో ఏర్పడిన మనస్పర్థల వల్ల ఆమె డిప్రెషన్‌కు వెళ్లినట్టు.. దాని వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు భావిస్తున్నారు. అమీన్ పూర్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. "రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. ఆమె కారులో కొన్ని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ మార్చిలో వివాహానికి పెద్దలు నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ జరిగిన యువకుడితో ఆమెకు మనస్పర్థలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం ఎఫ్ఎస్ఎల్(FSL)లోనే తేలుతుంది" అని చెప్పారు. మరోవైపు ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా చెల్లి గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉంది. చాలాసార్లు నచ్చజెప్పాం. మా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని" తెలిపారు. జరిగింది ఇది.. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25).. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ BHELలోని HIGలో ఉంటున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR రింగ్ రోడ్డుపై కారులో రచనా అపస్మారక స్థితిలో ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.... ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి తుది శ్వాస విడిచింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆమె సూసైడ్‌కు పాల్పడిందని అక్కడ లభించిన ఆధారాలను బట్టి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
మేడ్చల్‌రూరల్: మేడ్చల్ పరిధిలోని ఓఆర్ఆర్పై అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురు లైన్లో వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ ఎస్ఐ నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురంనకు చెందిన రెడ్డప్ప రెడ్డి (50) ఉద్యోగ నిమిత్తం సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటినుంచి తన ఇన్నోవా కారులో బయలుదేరి బాచుపల్లిలో విధులు ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలోని మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్–6 సమీపంలోకి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఎదురు లైన్లో వేగంగా వస్తున్న ఎక్స్‌యూవీ కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురులైన్‌లోకి దూసుకోచ్చి రెడ్డప్ప రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న మేడ్చల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ నవీన్‌రెడ్డి ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను కార్లలోంచి బయటికి తీశారు. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న రెడ్డప్ప రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎక్స్‌యూవీ కారులో ఉన్న జగద్గిరిగుట్టకు చెందిన ముగ్గురిలో బీటెక్ విద్యార్థి రెడ్డి గణేశ్ (18) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరు విద్యార్థులు మోక్షిత్‌రెడ్డి, మంగలపు గణేశ్‌లు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR)
గజ్వేల్: ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు)కు సంబంధించి ఉత్తర భాగంలో చేపట్టాల్సిన భూసేకరణ, సామగ్రి తరలింపు అంశాలపై సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో సహజంగానే ట్రిపుల్ ఆర్ వ్యవహారంలోనూ కొంత స్తబ్దత ఏర్పడింది. ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలన్నీ వేగవంతమవుతున్న నేపథ్యంలో ట్రిపుల్ఆర్ విషయంలో ముందడుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశం కీలక దశకు చేరుకుంది. భూసేకరణ, రోడ్డు నిర్మాణం కోసం గుర్తించిన స్థలంలో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి పక్కకు తరలించే పనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఉత్తర భాగంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి) పనులు జరగనున్నాయి. భూసేకరణను చేపట్టడానికి రెవెన్యూడివిజన్ల వారీగా కాలా (కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వజైషన్)లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే చౌటుప్పల్, యాదాద్రి, అందోల్–జోగిపేటతోపాటు గజ్వేల్, తూప్రాన్, భువనగిరి కాలాల పరిధిలోనూ త్రీడీ నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఎనిమిది కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో 4700 ఎకరాల వరకు భూసేకరణ జరగనుండగా.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలను సేకరించనున్నారు. ఉత్తర భాగం రీజినల్ రింగు రోడ్డు నిడివి 158 కిలోమీటర్లు కాగా ఇందులో 100 కిలోమీటర్ల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తరించనున్నది. సామగ్రి తరలింపునకు చర్యలు ఉత్తర భాగంలో నిర్మించనున్న ట్రిపుల్ఆర్ రోడ్డు గుర్తించిన భూముల్లో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి తరలింపునకు చర్యలు తీసుకోనున్నాం. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయి. భూసేకరణ అంశంలోనూ ముందడుగు పడనుంది. – రాహుల్, ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్ ఇవి చదవండి: కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'.. -
ఓఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ మధ్యలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇప్పటి వరకు కేటాయించిన భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేటాయించిన భూముల్లో వినియోగంలో లేని వాటి వివరాలతోపాటు ఏర్పాటైన పరిశ్రమల స్థితిగతులపైనా నివేదిక సమర్పించాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి సోమవారం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు వీలుగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)కు వెలుపల.. కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు లోపల ఉండేలా భూములు గుర్తించాలన్నారు. విమానాశ్రయాలు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు 500 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ భూములు ఉండాలని రేవంత్ సూచించారు. సాగుకు యోగ్యం కాని భూముల్లో... సాగుకు యోగ్యం కాని భూములనే పరిశ్రమల ఏర్పాటుకు సేకరించడం ద్వారా రైతులకు నష్టం జరగదని రేవంత్ పేర్కొన్నారు. తద్వారా కాలుష్య సమస్య తగ్గడంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే ప్రభుత్వ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తద్వారా తక్కువ ధరలో భూములుఅందుబాటులోకి రావడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల తరలింపునకు ప్రత్యామ్నాయం సూచించాలని చెప్పారు. బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు సంబంధించి మధ్యప్రాచ్య, యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ బదులు సోలార్ పవర్ పారిశ్రామిక అవసరాల కోసం థర్మల్ విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, బాలానగర్ ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
HYD: సీఎం జగన్‌కే మా మద్దతు.. ఐటీ ఉద్యోగుల భారీ ర్యాలీ
సాక్షి, మేడ్చల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్టే అంటూ ఐటీ ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తూ కార్ల ర్యాలీ తీశారు. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో కీసర ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కార్లలో ర్యాలీ చేపట్టారు. తమ కార్ల ర్యాలీ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు సాగుతుందని ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎవరెన్ని మాట్లాడినా మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం జగన్ ప్రభుత్వమే. చంద్రబాబు అవినీతి చేయకపోతే అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. నిన్న ఓఆర్ఆర్పై పెయిడ్ ఆర్టిస్టులు చంద్రబాబుకు మద్దుతుగా ర్యాలీ చేశారు. అచ్చెన్నాయుడు.. ప్లీజ్.. ప్లీజ్ అని బ్రతిమాలుకుంటే, దండ పెడతాను అంటే వారు ర్యాలీ చేపట్టారు. ఓఆర్ఆర్ కట్టింది.. తెచ్చిందే వైఎస్సార్. ఇక్కడ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. రానున్న కాలంలో చంద్రబాబు జైల్లోనే ఉంటారు. హైటెక్ సిటీ కమాన్ ఒక్కటే చంద్రబాబు కట్టారు. పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి వచ్చింది వైఎస్సార్, కేసీఆర్ హయాంలోనే. వైఎస్సార్ ఉన్న సమయంలోనే ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు వచ్చాయి. చంద్రబాబు చేసిందేమీలేదు. స్కామ్ ప్రూవ్ అయ్యింది కాబట్టే.. కోర్టు రిమాండ్ ఇచ్చింది కాబట్టే.. చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఎంత మంది వచ్చినా.. ఎన్ని మాటలు మాట్లాడినా.. సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు ఇది ఫిక్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఫేక్ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్’ -
ఎల్బీ స్టేడియం లేదా ఓఆర్ఆర్ సమీపంలో
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణకు ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో అనుమతి లభించదనే అంచనాలతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయా లను పరిశీలిస్తోంది. పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు అనుమతివ్వాలని ఈనెల 2వ తేదీనే దరఖాస్తు చేసినప్పటికీ బీజేపీ నేతలు అమిత్‌షా సభ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం లేదంటే ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పరి సరాల్లోని ఖాళీ స్థలం ఎంచుకుని అక్కడ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించాలనే వ్యూహంతో పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ, అక్కడ ఇప్పటివరకు అనుమతి లభించని కారణంగా మరో స్థలం వెతికే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. సభ ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీకి సిద్ధం మరోవైపు, ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేసింది. ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా టీపీసీసీ నిర్ణయించింది. గతంలో తిరుపతిలో నిర్వహించిన ప్లీనరీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు గాను పకడ్బందీగా ముందుకెళుతోంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇన్చార్జి ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, రాష్ట్ర నాయకులు మధుయాష్కీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించేందుకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం చేయనున్నారు. నేడు కీలక భేటీ ఇక, టికెట్ల ఖరారులో భాగంగా రాష్ట్రస్థాయిలో జరిగే కసరత్తుకు నేడు తెరపడనుంది. బుధవారం గాంధీభవన్ వేదికగా పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, మేవానీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. వీరంతా సమావేశమై పీఈసీ సమావేశంలో వచ్చిన నివేదికలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన అభ్యర్థుల తుది జాబితాను ఢిల్లీకి పంపనున్నారు. అయితే, స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి ఈనెల 7వ తేదీనే పంపనున్నట్టు తెలుస్తోంది. అనంతరం సీఈసీ సమావేశమై అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. మొత్తంమీద గత 20 రోజులుగా పార్టీ అభ్యర్థిత్వాల కోసం జరుగుతున్న కాంగ్రెస్ కసరత్తు బుధవారం నాటితో రాష్ట్ర స్థాయిలో ముగియనుంది. మరోవైపు బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం కూడా నేడు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమా వేశంలో బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన హామీలను ఖరారు చేయనున్నారు. -
ఔటర్ చుట్టూ మెట్రో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు మరో ఐదు కొత్త మెట్రో కారిడార్లు నెలకొల్పే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ‘మెట్రో’ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశముంది. మెట్రో ప్రాజెక్టు విస్తరణ రెండో దశలో భాగంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త లైన్ల నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. దీనికి పరిష్కారంగానే మెట్రో ప్రాజెక్టుల విస్తరణ, కొత్త కారిడార్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు మొత్తం 22 అంశాలతో కూడిన ఎజెండాపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కేంద్ర చట్టం అమలుకు వీలుగా.. మానవ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి చికిత్సల (ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో అందుబాటులో ఉండే వాటితో పాటు లేజర్ ట్రీట్మెంట్, కట్లు లాంటి అన్నిరకాల చికిత్సలకు) కోసమైనా ఏర్పాటు చేసే వైద్య కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ కలి్పంచే విధంగా ఇప్పటికే చట్టం అమల్లో ఉంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు గాను ఇప్పటికే అమల్లో ఉన్న తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లి‹Ùమెంట్స్ (రిజి్రస్టేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ –2002 (యాక్ట్ 13 ఆఫ్ 2002) బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేబినెట్ సోమవారం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు టిమ్స్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించే తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–2022 బిల్లును కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. కాగా నిమ్స్ ఆసుపత్రి విస్తరణ అంచనా వ్యయాన్ని రూ.1,571 కోట్ల నుంచి రూ.1,698 కోట్లకు పెంచే ప్రతిపాదనలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల కోసం పీఆర్సీ, ఇతర అంశాలు.. నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ ద్వారా వేలం వేసే ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా మల్యాలలో కొత్త ఉద్యాన కళాశాల ఏర్పాటు, వరంగల్ నగర శివారులోని మామునూరు ఎయిర్‌పోర్టులో టెరి్మనల్ భవనం, ప్రస్తుత రన్‌వే విస్తరణకు గాను అవసరమైన భూసేకరణ, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటు, అనాథల సంక్షేమం కోసం రూపొందించిన కొత్త విధానంపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అలాగే సింగరేణి కాలరీస్ సంస్థకు బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్లో వెయ్యి చదరపు గజాల ప్రభుత్వ భూమిని మార్కెట్ ధరకు విక్రయించే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఎజెండాలో చేర్చారు. ఇక్కడ సింగరేణి క్వార్టర్లు, గెస్ట్‌హౌస్, ఫెసిలిటేషన్ సెంటర్ నిర్మాణం కోసం భూమి కావాలని సింగరేణి సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఇక విద్యుత్ కొనుగోళ్ల బకాయిల చెల్లింపు, ట్రాన్స్మిషన్ చార్జీల చెల్లింపునకు గాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), బ్యాంకుల నుంచి ట్రాన్స్‌కో సేకరించనున్న రూ.5 వేల కోట్ల రుణాలకు పూచీకత్తుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ, వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహాయ..పునరుద్ధరణ చర్యలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఆసరా పింఛన్ల పెంపు తదితర అంశాలపై కూడా సోమవారం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై చర్చ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన నాలుగు బిల్లులపై పలు వివరణలను కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపారు. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను గవర్నర్ గతంలో వెనక్కు పంపారు. గవర్నర్ అడిగిన వివరణలకు సమాధానమిచ్చే విధంగా ఈ బిల్లుల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదాలపై చర్చించే ప్రతిపాదనను కేబినెట్ ఎజెండాలో చేర్చారు. మంత్రివర్గ భేటీలో చర్చించిన తర్వాత వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రవేశపెట్టి ఆమోదించి మళ్లీ గవర్నర్‌కు పంపే అవకాశముందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. -
ఒక ఎంపీ అడిగితే వివరాలివ్వకపోవడమేంటి..?: హైకోర్టు
-
ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?. ఆర్టీఐ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారంటూ హైకోర్టు ప్రశ్నించింది. 2 వారాల్లోగా రేవంత్ అడిగిన వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం అని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి కోర్టు వాయిదా వేసింది. కాగా, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ నిర్వహణ బదిలీ (టీవోటీ)కి సంబంధించిన సమాచారాన్ని, సమాచార హక్కు చట్ట ప్రకారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 14న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారుల తీరు ఆర్టీఐ చట్టంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను కూడా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. తాను మే 1న తొలిసారి దరఖాస్తు చేయగా, మే 23న అరకొర సమాచారం మాత్రమే ఇచ్చారని వివరించారు. దీంతో జూన్ 14న మరోసారి దరఖాస్తు చేశానన్నారు. ఓఆర్ఆర్ లీజు నివేదికలు, 30 ఏళ్లకు ఇవ్వడంపై మంత్రిమండలి నిర్ణయం, 2021–22, 2022–23 సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. లీజు పారదర్శకంగా జరిగిందా? లేదా? తెలుసుకోవడానికి ఈ సమాచారం కీలకం అన్నారు. చదవండి: లిక్కర్ స్కాం: కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్ఏసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారం ఇచ్చేలా ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓఆర్ఆర్ నిర్వహణ, టోలు వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్టక్చర్ డెవెలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ఓఆర్ఆర్ను ఏ ప్రాతిపదికన అప్పగించారు?
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్లపాటు ఏ ప్రాతిపదికన ప్రైవేట్ కంపెనీకి అప్పగించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) డైరెక్టర్‌తోపాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. 30 ఏళ్లపాటు ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ ఎంత అనేది వెల్లడించకుండా హెచ్ఎండీఏ, పురపాలక పరిపాలన–పట్టణాభివృద్ధి శాఖ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థతో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పిటిషన్లో పేర్కొన్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ను టోల్– ఆపరేట్– ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో నిర్వహించడానికి ప్రభుత్వం మే 28న కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే ఆదేశాలివ్వలేం.. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం రోజువారీగా టోల్ ఫీజు రూ.88 లక్షల వరకు వసూలవుతోందని, ఈ లెక్కన 30 ఏళ్ల కాలానికి లెక్కిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం కంపెనీ పాలవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని, దురుద్దేశంతోనే దాఖలు చేశారని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పిటిషనర్ తరఫు న్యాయవాదికి చెప్పింది. -
ఓఆర్ఆర్ టెండర్‌పై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ టెండర్ ప్రక్రియలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, వాస్తవాలను బహిర్గతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. టెండర్ అప్పగింత విషయంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తోందని, ఏటా 5% పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం చేకూ రేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయానికి గండికొట్టి మరీ టెండర్ ఇవ్వడం ఏమిటని, ఈ విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకు న్న ఐఆర్బీ సంస్థే మహారాష్ట్రలోనూ టోల్ మెయింటెనెన్స్ చూస్తోందని, తక్కువ దూరం, తక్కువ కాలానికి అక్కడి ప్రభుత్వం టెండర్ అప్పగించినప్పుడు, ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఓఆర్ఆర్పై వార్తలు రాసినా, పార్టీలు ప్రశ్నించినా లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. సీఎం మౌనం వల్ల ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. దీనిపై ప్రజ లకు సమాధానం చెప్పాల్సిన అవసరం, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సీఎంగా కేసీఆర్‌పై ఉందన్నారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమం: బండి కరీంనగర్ టౌన్: విచ్చలవిడి మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని విమర్శించారు. ఉచిత పథకాలతో మభ్యపెట్టడానికి వస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఐకేపీ వీఓఏల న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. -
ఔటర్ నిర్వహణకు ‘గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే’.. 30ఏళ్ల పాటు టోల్ వసూలు, ఇంకా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజు వ్యవహారంలో ముందడుగు పడింది. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటైంది. లీజు ఒప్పందంలో భాగంగా ‘ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే’ను ఎస్పీవీగా ఏర్పాటు చేశారు. ఇది ఐఆర్బీ ఇన్ఫ్రా తరఫున ప్రాతినిధ్య సంస్థగా ఉంటుంది. ఈ మేరకు ఈ నెల 28న హెచ్ఎండీఏతో కుదుర్చుకున్న లీజు ఒప్పందంపై ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే సంతకాలు చేసింది. ఇక నిర్ణీత 120 రోజుల గడువులోపు లీజు మొత్తం రూ.7,380 కోట్లను చెల్లించి ఔటర్ నిర్వహణ బాధ్యతలను చేపడతామని ఐఆర్బీ ఇన్ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్ర డి.మహిష్కర్ తెలిపారు. ఔటర్ ప్రాజెక్టును తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు చెప్పారు. నిర్వహణ అంతా ‘గోల్కొండ’దే.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఔటర్ రింగ్‌రోడ్డు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ఐఆర్బీ ఇన్ఫ్రాతో కుదిరిన లీజు ఒప్పందం మేరకు వచ్చే 30ఏళ్ల పాటు ‘ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే’ సంస్థ.. ఓఆర్ఆర్పై వాహనాల నుంచి టోల్ వసూలు చేయడం, రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, ఇతర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను చేపట్టనుంది. హెచ్‌జీసీఎల్ ఇక ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్‌ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితం కానుంది. టోల్ రుసుముపై హెచ్ఎండీఏ పర్యవేక్షణ 2006లో హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో ఔటర్‌రింగ్‌రోడ్డును నిర్మించారు. 2018 నాటికి ఇది పూర్తయింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2008లో విధించిన నిబంధనల మేరకు ఇప్పటివరకు టోల్ రుసుమును వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ టోల్ రుసుము పెంపుపై హెచ్ఎండీఏ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఏకమొత్తంగా రూ.7,380 కోట్ల చెల్లింపు! ‘టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానంలో ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సంవత్సరం నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్లు వచ్చాయి. ఇందులో చివరికి 4 సంస్థలు తుది అర్హత సాధించగా.. ఐఆర్బీ ఇన్ఫ్రాకు టెండర్ దక్కింది. ఒప్పందం మేరకు లీజు మొత్తం రూ.7,380 కోట్లను ఐఆర్బీ సంస్థ ఒకేసారి చెల్లిస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని హెచ్ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు. ఒప్పందంలోని నిబంధనలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని.. మొత్తం నిధులు చెల్లించాకే ఔటర్ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. -
పార్టీని నడిపే సత్తా సంజయ్‌కు లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీని నడిపించే సత్తా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మాట తాము చెపుతోంది కాదని, బీజేపీకి చెందిన జాతీయ నాయకుడు, పెద్దపెద్ద రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్న ఓ వ్యక్తి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ చెప్పారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌జావేద్, సంపత్‌కుమార్, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, అనిల్‌కుమార్ యాదవ్, మెట్టుసాయికుమార్లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. తాను మొదటి నుంచీ చెబుతున్నట్టుగానే బీజేపీ, బీఆర్ఎస్లు ఒకే తాను ముక్కలని, మోదీ–కేసీఆర్‌లు అవిభక్త కవలలని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో బీజేపీది మూడో స్థానమేనని ఆ పార్టీ జాతీయ నాయకులే చెబుతున్నారు. గట్టిగా 40 మంది నాయకులు లేని తాము ఎలా గెలుస్తామని వారే అంటున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్‌ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెపుతున్నారు’అని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ పోషించిన పాత్రను ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ జేడీఎస్ పోషించిన పాత్రను ఇక్కడ బీజేపీ పోషించా లని చూస్తున్నాయని, కానీ, కర్ణాటకలో, ఇక్కడా అధికార పారీ్టలను ఓడించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. కేసీఆర్‌ను ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, అయితే కొందరు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, ఆ తర్వాత వారికి అసలు సంగతి, బీజేపీ రంగు అర్థమయ్యాయని, ఇప్పటికైనా భ్రమ లు వీడి బీజేపీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు, పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం పునరాలోచన చేసుకోవాలని సూచించారు. ఎంఐఎం నేతల ప్రచారంతో మైనారీ్టలు బీఆర్ఎస్కు ఓట్లు వేసి గెలిపిస్తున్నారని, గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ఆ ఓట్లను మోదీకి తాకట్టు పెడుతోందని ధ్వజమెత్తారు. ఓఆర్ఆర్ వ్యవహారంలో కేంద్రం ఏం చేస్తోంది? రూ.లక్ష కోట్ల విలువైన ఔటర్రింగురోడ్డు టెండర్ల వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీకి పాల్పడిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇది Éìఢిల్లీ లిక్కర్ స్కాం కంటే వెయ్యి రెట్లు పెద్దదని అన్నారు. ఇంత యథేచ్ఛగా టెండర్లు కట్టబెట్టి దోచుకుంటుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. టెండర్ దక్కించుకున్న సంస్థ మొత్తం విలువలో 10 శాతాన్ని 30 రోజుల్లో, మిగిలిన మొత్తాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, అయితే అలాంటి నిబంధనలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెపుతున్నారని, నిబంధనలు మార్చి ఉంటే ఆ మార్చిన నిబంధనలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఇప్పటి వరకు ఐఆర్బీ సంస్థ డబ్బులు చెల్లించిందో లేదో తెలియదు. చెల్లించకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ సంస్థ టెండర్‌ను రద్దు చేయాలి’అని డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారాన్ని అంత సులువుగా వదిలిపెట్టబోమని, దీనిపై న్యాయం పోరాటం చేస్తామన్నారు. ఏ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించారు? ఏ హామీలు అమలు చేశారని.., ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని మంత్రి హరీశ్‌రావు తమ తొమ్మిదేళ్ల పాలనను సమర్థించుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. తాను స్వాతిముత్యం, మామ ఆణిముత్యం అని అనుకుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. అన్నీ మంచిగా చేస్తే భద్రత లేకుండా హరీశ్, కేటీఆర్‌లు ఓయూకు వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలని, వారు క్షేమంగా తిరిగివస్తే.. చెప్పింది నిజమని ఒప్పుకుంటామని వ్యాఖ్యానించారు. -
48 గంటల్లో రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)ను టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతి (టీఓటీ)లో లీజుకివ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆయనకు శుక్రవారం హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏతో పాటు అధికారులపై రేవంత్‌రెడ్డి తప్పు డు, నిరాధార, ధ్రువీకరించలేని ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే తన ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాము తీసుకోబోయే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ లీగల్ నోటీసులో పేర్కొంది. కాగా, హెచ్ఎండీఏ నోటీసులపై తాను న్యాయపరంగానే పోరాడుతానని రేవంత్ చెప్పారు. -
ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, నిబంధనల ప్రకారమే ఐఆర్బీకి టోల్గేట్ టెండర్లు దక్కాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద అన్నారు. లీజుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వారు గురువారం బీఆర్‌ఎస్‌ఎలీ్పలో విలేకరులతో మాట్లాడుతూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 111 జీవోపై కాంగ్రెస్, బీజేపీ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని, ఆ గ్రామాలకు వెళ్లి జీవో కొనసాగాలని కోరే ధైర్యం ఉందా? అని నిలదీశారు. రాజకీయాల గురించి గవర్నర్ మాట్లాడడం సరికాదని, ఆమెకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. -
ఓఆర్ఆర్ టెండర్‌పై రఘునందన్ సంచలన ఆరోపణలు, సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టెండర్ పైన సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు అప్పనంగా ఐఆర్బీ సంస్థకు టెండర్ అప్పగించారని దుయ్యబట్టారు. ఔటర్ రింగు రోడ్డు టెండర్ లో అవినీతి జరిగిందని గతంలోనే ఈడీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుషుల్నే లేకుండా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. (చదవండి: ప్రైవేటుకు ఓఆర్ఆర్!.. 30 ఏళ్లకు లీజుకిచ్చిన కేసీఆర్ సర్కార్) 'ఓఆర్ఆర్ టెండర్ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని ఇటీవల కొందరు విమర్శిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై మా పార్టీ చాలారోజులుగా ప్రశ్నిస్తోంది' అని రఘునందన్ రావు చెప్పారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ అనే సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్లో భారీ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని విమర్శిస్తున్నాయి. మరోవైపు పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. (చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) -
కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజ్..
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) 30 ఏళ్ల లీజ్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు ఆరోపించారు. కేటీఆర్, కవిత సన్నిహితులకే ఈ లీజు దక్కిందని నిందించారు. ఐఆర్ఎల్ కంపెనీ రూ.7,272 కోట్లకు టెండర్ వేస్తే రూ.7,380 కోట్లకు దక్కించుకుందని ప్రభు త్వం ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. వేసిన బిడ్ కంటే ఆ కంపెనీ ఎందుకు ఎక్కువ ఇస్తోందని ప్రశ్నించారు. ఎక్కువ టెండర్ వేసిన కంపెనీకి లీజును కట్టబెట్టిన ప్రభుత్వం 16 రోజుల పాటు బిడ్‌ను బహిర్గతం, చేయకపోవడం వెనక ఆంతర్యమేమిటని నిలదీశారు. ఈ బిడ్‌ను ఓపెన్ చేశాక బేరసారాలతో ఐఆర్‌ఎల్‌కు అప్పగించారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్‌ను వాస్తవానికి ఈ ఏప్రిల్ 11న తెరిచారని, కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ పై బేస్‌ప్రైజ్ ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం హెచ్ 1, హెచ్ 2, హెచ్ 2, హెచ్ 4 కంపెనీలను పిలిచి బేస్‌ప్రైజ్ కు తక్కువగా బిడ్కోడ్ చేసినందున టెండర్‌ను క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదన్నారు. ఫోన్ కాల్ వివరాలు బయట పెట్టాలి అరవింద్ కుమార్ ఫోన్ కాల్ వివరాలు బయట పెట్టాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. 16 రోజుల్లో ఆయనతో పాటు మంత్రి గాని ఇంకా ఎవరైనా విదేశాలకు వెళ్లారా.. అని ప్రశ్నించారు. ఆ వివరాలు బయటపెట్టకపోతే తామే ఆడియో లు వీడియోలు బయట పెడతామని హెచ్చరించారు. ఐఆర్ఎల్పై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతున్నందున ఈ టెండర్ ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తామే కోర్టుకు , వివిధ విచారణ ఏజెన్సీలకి పిర్యాదు చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్యేలకే సెక్రటేరియట్ లో ఎంట్రీ లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: తడిసినా కొంటాం -
Video: కొత్త సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఓఆర్ఆర్ టెండర్లపై ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా.. విషయం తెలుసుకున్న పోలీసులు కిలోమీటర్ దూరంలోనే సెక్రటేరియట్ సమీపంలోని టెలిఫోన్ భవన్ దగ్గర అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అంతేగాక సెక్రటేరియేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విజిటర్స్ గేటును మూసేశారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు అంశంపై ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. అనుమతిఅరవింద్ కుమార్ లేకపోవడంతో సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందుకే రేవంత్‌రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు. చివరకు ఆయన వెళ్లాల్సిన డిపార్ట్మెంట్ కొత్త భవనంలో లేదంటూ పోలీసులు ఆయన వాహనాన్ని మాసబ్ ట్యాంక్‌లోని అడ్మినిస్ట్రేషన్ భవన్‌కు తరలించారు. చదవండి: ఎమ్మెల్సీ కవితపై ఈడీ కీలక అభియోగాలు.. తెరపైకి భర్త అనిల్ పేరు.. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ఎంపీగా సచివాలయానికి వెళ్తే పోలీసులకు అభ్యంతరమేంటి? అని మండిపడ్డారు. ఎంపీని సచివాలయానికి వెళ్లకుండా రోడ్డుపైనే అడ్డుకోవడం, అప్రజాస్వామికం, దుర్మార్గమన్నారు. నడిరోడ్డుమీదే కారులోంచి డీజీపీతో ఫోన్లో మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రకారం ఫిర్యాదు అందించడానికి సచివాలయం వెళ్తున్నానని, స్పెషల్ సెఎస్ లేకుంటే సంబంధిత శాఖలో ఏ అధికారినైనా కలిసి పేపర్ అంస్తానని అందిస్తానని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చి.. 24గంటలు తిరక్కముందే మరిచారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదు. టోల్‌కు సంబంధించి టేండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు వెళ్లా. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్లపై విచారణ చేయిస్తాం. ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు.’ అని మండిపడ్డారు. -
కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రైవేటుకు ఓఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన 158 కి.మీ. నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లపాటు లీజుకు అప్పగించింది. టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) ప్రాతిపదికన ఓఆర్ఆర్ నిర్వహణ లీజు కోసం హెచ్ఎండీఏ బిడ్లను ఆహ్వానించగా 11 అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు నాలుగు సంస్థలు అర్హత సాధించగా జాతీయ రహదారుల నిర్వహణలో అతిపెద్ద సంస్థగా పేరొందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7,380 కోట్లకు ఈ లీజును పొందింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్బీ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డ్‌ను (ఎల్ఓఏ)ను అందజేసింది. దేశంలోని అతిపెద్ద టీఓటీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఈ బిడ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. ఏటేటా ఔటర్‌పై పెరుగుతున్న వాహనాల రద్దీ, టోల్ ద్వారా వస్తున్న ఆదాయం, ఓఆర్ఆర్ నిర్వహణ, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్పీవీ (నెట్ ప్రజెంట్ వాల్యూ) పద్ధతిలో లీజు మొత్తాన్ని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో టోల్ పెంపు వంటి అంశాలతోపాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఇచి్చన లీజులను కూడా ప్రామాణికంగా తీసుకున్నట్లు చెప్పారు. నిర్వహణ ఇక ప్రైవేట్ సంస్థదే.. ఇప్పటివరకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్వహణ హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఓఆర్ఆర్పై టోల్ వసూలుతోపాటు రోడ్లకు మరమ్మతులు, లైట్లు, పచ్చదనం, తదితర పనులన్నింటినీ హెచ్‌జీసీఎల్ పర్యవేక్షిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఆ బాధ్యతలన్నింటినీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. టోల్ ద్వారా వచ్చే ఆదాయం ఆ సంస్థకే లభించనుంది. ప్రస్తుతం ఔటర్‌పై నిత్యం సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్ వసూలు ద్వారా ఏటా సుమారు రూ. 452 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఏటా టోల్ రుసుమును కొంత మేరకు పెంచడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ ఇప్పటివరకు టోల్ వసూలు చేస్తుండగా ఇకపై ఐఆర్బీ సంస్థ పరిధిలోకి వెళ్లనుంది. రహదారుల నిర్వహణలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు దేశంలో టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పద్ధతి అత్యుత్తమ విధానంగా పేరొందింది. ఎన్హెచ్ఏఐ 2016 నుంచి ఈ పద్ధతిని అవలంబిస్తోంది. మొత్తం 1,600 కి.మీ.కిపైగా మార్గాన్ని ఈ పద్ధతిలో 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లీజుకు ఇచి్చంది. ఔటర్ లీజు విషయంలోనూ ఇదే పద్ధతిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడులకు ఊతం: సీఎం కేసీఆర్ ఈ లీజు ఒప్పందంపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా చక్కటి ఒప్పందమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులకు ఇది ఊతమిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వ్యాపార సంస్థలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడం వల్లే అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు. ఇదీ ఔటర్ స్వరూపం.. హైదరాబాద్ నగరం చుట్టూ 8 వరుసల్లో ఉన్న 158 కి.మీ. నిడివిగల ఔటర్ రింగురోడ్డు నిర్మాణం ఉమ్మడి ఏపీలో 2006లో మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని 2018లో పూర్తి చేసింది. ఔటర్‌కు 44 చోట్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉన్నాయి. 22 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేశారు. ఔటర్ మీదుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. నెహ్రూ ఓఆర్ఆర్ నిడివి: 158 కిమీ. వరుసలు: 8 నిత్యం రాకపోకలు సాగించే వాహనాలు: 1.3 నుంచి 1.5 లక్షలు ఏటా టోల్ వసూలు: రూ. 452 కోట్లు (సుమారుగా). ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ.. -
ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు
హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లాంగ్ లీజుకు ఇవ్వడానికి 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ' (HMDA) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేందుకు నాలుగు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని కోసం బిడ్డింగ్ సుమారు రూ. 8,000 కోట్లు వరకు ఉంటుంది. ఈ రేసులో ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు తమ బిడ్లను ఇప్పటికే హెచ్ఎండీఏకి సమర్పించాయి. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎల్‌అండ్‌టి, క్యూబ్ హైవేస్ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం, కానీ బిడ్లలో ఈ సంస్థలు పాల్గొనలేదు. బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ కోసం హెచ్ఎండీఏ టెండర్లను పిలిచింది. ఇందులో ఎక్కువ సంస్థలు పాల్గొనటానికి గడువు కూడా రెండు రోజులు పొడిగించింది. కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ప్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే టెక్నీకల్ కమిటీ మంగళవారం నుంచి టెక్నికల్ బిడ్లను మూల్యాంకనం (Evaluating) చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఫైనాన్సియల్ బిడ్ ప్రారంభమవుతుంది. దీనికోసం పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి & ఓఆర్ఆర్ టోల్ డిమాండ్‌పై ఉన్న సందేహాల వల్ల ఇప్పటికి కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనటానికి ఆసక్తి చూపాయి. అయితే ఈ బీడ్ సొంతం చేసుకునే కంపెనీ నాలుగు నెలల్లో మొత్తం డబ్బుని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. బిడ్లలో అవసరమైన మొత్తం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ-టెండర్ ప్రకటించే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి హెచ్ఎండీఏ ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ నుంచి టోల్ ఫీజు సంవత్సరానికి రూ. 415 కోట్లు వసూలు చేస్తోంది. ఓఆర్ఆర్ ని టోల్ ఆపరేట్ ట్రాన్స్పర్పై 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నట్లయితే, బిడ్డర్ నుంచి మొత్తం డబ్బుని పొందుతుంది. అయితే ORRని నిర్వహించడానికి హెచ్ఎండీఏపై ఎటువంటి భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తమ రోడ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లాంగ్ లీజుపై 'టోల్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్' (TOT)ని స్వీకరించింది. -
Hyderabad: ఓఆర్ఆర్.. రింగ్‌మెయిన్.. మెట్రో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ అభివృద్ధి ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ చక్కర్లు కొడుతోంది. పలు కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలు.. సర్కారు ప్రణాళికలు ఈ రహదారి కేంద్రంగానే సాగుతున్నాయి. మహా నగరానికి మణిహారంలా 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నగరం నలుమూలలకు కృష్ణా, గోదావరి జలాలను కొరత లేకుండా సరఫరా చేసేందుకు భారీ తాగునీటి పైపులైన్ ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గం ఏర్పాటుకు పునాది రాయి వేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఔటర్ చుట్టూ మెట్రో ప్రతిపాదన చేయడంతో ఈ అంశం సైతం సర్వత్రా చర్చనీయాంశమైంది. పైపులైన్ ఏర్పాటు ఇలా.. గ్రేటర్‌కు మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటు పనుల్లో ఇప్పటికే సుమారు 48 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. పనుల పూర్తికి రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం నగరానికి ఎల్లంపల్లి (గోదావరి), కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. ఈ జలాలను నగరం చుట్టూ మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 3,000 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేసి వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలి. దీంతో నగరం నలుమూలలకు కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయవచ్చు. గతంలో పూర్తిచేసిన 48 కి.మీటర్లకు అదనంగా మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. జలాల నిల్వకు వీలుగా రెండు భారీ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను సైతం నిర్మించాల్సి ఉంటుంది. వీటిలో కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేయాలి. ఔటర్‌కు మెట్రో హారం.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ మెట్రో మార్గం దాదాపు 20 కిలోమీటర్ల మేర ఔటర్‌కు ఆనుకొనే వెళ్లనుంది. ఇక ఓఆర్ఆర్ లోపల కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఔటర్ చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేసిన పక్షంలో ఓఆర్ఆర్ లోపలున్న 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫారా>్మ, బయోటెక్,తయారీ రంగం, లాజిస్టిక్స్, హార్డ్‌వేర్, ఏవియేషన్ తదితర రంగాల సత్వర, సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధిలో మహానగరం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండడంతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులు, రియలీ్ట, నిర్మాణ రంగ ప్రాజెక్టులు విస్తరించిన నేపథ్యంలో మెట్రో కనెక్టివిటీ ఆయా ప్రాంతాలకు అత్యావశ్యకమని విశ్లేషిస్తున్నారు. చదవండి: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం? -
డీటీసీపీ మాస్టర్ ప్లాన్.. ప్రతీ మున్సిపాలిటీకి రింగ్‌రోడ్డు!
సాక్షి, హైదరాబాద్: ప్రతి మున్సిపాలిటీకి రింగ్‌రోడ్డు.. రహదారులు, డ్రైనేజీల విస్తరణ.. ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, మిశ్రమ జోన్లు.. వచ్చే 20ఏళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు.. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీలు విస్తరించడం వల్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు కీలక చర్యలను చేపట్టనున్నారు. డీటీసీపీ యంత్రాంగం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైంది. మార్చి నాటికల్లా సిద్ధం చేసేలా.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను వినియోగించి.. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, 11 నగరాభివృద్ధి సంస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నారు. 2023 మార్చి నాటికల్లా అమలు చేసేలా బృహత్తర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకుగాను 74 మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూపొందించిన మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. మిగతా 68 చోట్ల కొత్తగా మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రజలు తమ భూవినియోగ వివరాలను సులభంగా తెలుసుకుని.. టీఎస్ బీ–పాస్ విధానంతో సింగిల్ విండో పద్ధతిలో భవన నిర్మాణ/లేఔట్ల అనుమతులు పొందడానికి మాస్టర్ప్లాన్లు ఎంతో ఉపయోగపడతాయని డీటీసీపీ అధికారులు చెప్తున్నారు. జీఐఎస్ ద్వారా క్షుణ్నంగా సర్వే చేసి వచ్చే 20ఏళ్ల వరకు ఎలాంటి భూ వినియోగమారి్పడి అవసరం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరిస్తున్నారు. వివిధ జోన్లుగా విభజించి.. జనాభా అధికంగా ఉండే ప్రాంతాలను మిశ్రమ వినియోగ ప్రాంతాలుగా.. మిగతా ప్రాంతాలను వాణిజ్య, నివాస ప్రాంతాలుగా ఒక క్రమపద్ధతిలో మాస్టర్ ప్లాన్లలో నిర్దేశించనున్నారు. ప్రజలు తాము నివసించే ప్రాంతాల నుంచి కార్యాలయాలకు, పనిచేసే ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేలా, రహదారులపై ట్రాఫిక్ భారాన్ని నిరోధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రహదారులు చిన్నగా ఉండటం.. జన సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరిగితే ఈ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీల్లో అంతర్గత, ప్రధాన రహదారులపై ఒత్తిడి లేకుండా రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక చెరువులు, వాగులు, కాల్వలతోపాటు రైలు మార్గాలు, పారిశ్రామికవాడలు మొదలైన ప్రాంతాల్లో బఫర్ జోన్లను మాస్టర్ప్లాన్లలో నిర్దేశించనున్నారు. పట్టణాల్లో కనీసం పదిశాతానికి తగ్గకుండా గ్రీన్జోన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతా పక్కాగా.. మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో భాగంగా తొలుత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) నుంచి పట్టణాల చిత్రాలు, వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత రెవెన్యూ శాఖ నుంచి సర్వే నంబర్ల వారీగా మ్యాపులను తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి.. పట్టణ ప్రణాళికలో నిపుణులైన వారితో కొత్త మాస్టర్ప్లాన్లను రూపొందిస్తున్నారు. -
కేపీహెచ్‌బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు ఐటీ కారిడార్ పరిధిలో మెట్రో నియోగా పిలిచే ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం (బీఆర్టీఎస్) ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల లేమి శాపంగా మారింది. పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.3,100 కోట్ల నిధులు వెచి్చంచేందుకు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర సర్కారు రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానిస్తోంది. మరోవైపు రూ.450కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లాభాలు రాకపోవడంతో.. ఇప్పటికే నగరంలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ మార్గంలో అందుబాటులో ఉన్న తొలిదశ మెట్రో ప్రాజెక్టును పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో లాభదాయకం కాలేదు. ఈ నేపథ్యంలో యాన్యుటీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకొస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సర్కారు అంచనాల ప్రకారం.. యాన్యుటీ విధానంలో మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థ ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. తర్వాత అయిదు నుంచి పదేళ్ల అనంతరం వడ్డీతో కలిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయాన్ని వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు చెల్లిస్తుందన్న మాట. అంతేకాదు సదరు నిర్మాణ సంస్థకు ఈ ప్రాజెక్టు చేపట్టే మార్గంలో విలువైన ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక పద్ధతిన తక్కువ మొత్తానికి లీజుకిచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈవిధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం(ఈబీఆర్టీఎస్) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. - ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. - ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్ జంజాటం లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ– హైటెక్స్–రాయదుర్గం– కోకాపేట్– ఓఆర్ఆర్ వరకు సుమారు 19 కి.మీ మేర సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. కానీ నిధులు వెచి్చంచే విషయంలో ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడం గ్రేటర్ పిటీ. -
తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, షామీర్పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు. ► నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థ్ధిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటు కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేయవద్దు. -
వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ రద్దు
సాక్షి, హైదరాబాద్ /వరంగల్ అర్బన్: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 41 కిలోమీటర్ల వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వే పనులను ప్రారంభించింది. అయితే ల్యాండ్ పూలింగ్‌కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో ఐదు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీంతో ఇటీవల ‘కుడా’ వైస్ చైర్మన్ పి.ప్రావీణ్య భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చారు. అయినప్పటికీ రైతులు ఆందోళనలు కొనసాగించారు. రహదారుల దిగ్బంధనం చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హైదరాబాద్‌లో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ల్యాండ్ పూలింగ్ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌కుమార్ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
చంద్రబాబువి వికృత రాజకీయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మంగళవారం వాడవాడలా ప్రజలంతా ఘనంగా నిర్వహించి, అభిమానాన్ని చాటుకోవడాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృత రాజకీయాలకు తెరతీశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనే లక్ష్యంతో చంద్రబాబు మంగళవారం టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వంపై నోరుపారేసుకున్నారని అన్నారు. క్రిస్టియన్ ఎయిడెడ్ విద్యా సంస్థలను దోచుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశానని బాబు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంతపాడుతున్నాయని చెప్పారు. అంబటి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏమీ చేయకున్నా.. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా చేసినట్లుగా చంద్రబాబు కలలు కంటుంటారంటూ అంబటి ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్‌కు అవుటర్ రింగ్ రోడ్డు వేయాలని బాబు కలలు కంటే.. దానికి పునాది రాయి వేసి, పూర్తి చేసి, ప్రారంభించింది వైఎస్సార్. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో పీవీ నరసింహారావు ప్లైఓవర్ నిర్మించాలని బాబు కలలు కంటే.. దానికి పునాది రాయి వేసి, పూర్తి చేసి, జాతికి అంకితం చేసింది వైఎస్సార్. హైదరాబాద్‌కు ఐటీ తెచ్చానని చంద్రబాబు కలలు కంటే.. అక్కడ ఐటీ రంగం వర్ధిల్లేలా చేసింది వైఎస్సారే’ అని చెప్పారు. ‘2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే.. సీఎం జగన్ ఈ 30 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.1.16 లక్షల కోట్లు జమ చేశారు’ అని చెప్పారు. తాము ఏది చేశామో వైఎస్సార్, సీఎం జగన్‌లు చెబితే.. చంద్రబాబు మాత్రం ఇది చేయాలనుకున్నా అని అంటుంటారని ఎద్దేవా చేశారు. నాడు దళితులను కించపరిచి.. గుంటూరులో మద్యం కోసం వ్యక్తిగతంగా గొడవ జరిగి, దళితుడిపై దాడి జరిగితే.. దాన్ని వైఎస్సార్సీపీపై నెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితులను కించపరిచిన చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాన్ని వైఎస్సార్సీపీ నుంచి దూరం చేసేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి అధిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పి మళ్లీ ఇప్పుడు హోదా కావాలని కోరడం విడ్డూరంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
‘ఉరి’ వేసిందెవరు? ఊపిరి పోస్తున్నదెవరు?
‘ఈనాడు’ రామోజీరావు డిక్షనరీయే వేరు. ఆయన దృష్టిలో విజయవాడ నగరమంటే విజయవాడకు చుట్టూ 50 కిలోమీటర్ల వరకూ నగరమే!! రాష్ట్రాభివృద్ధి అంటే.. చంద్రబాబు ఏం చేస్తే అది!! ఔటర్ రింగు రోడ్డంటే... చంద్రబాబు ఏం గీస్తే అది!! ఎందుకంటే బాబు ఏం చేసినా, ఏ పార్టీతో జతకట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని.. అందరినీ నమ్మించాలనేది రామోజీరావు ప్రగాఢ కోరిక. జనం నమ్మటం లేదని తెలిసినా కూడా... ఆ అలవాటు తేలిగ్గా పోవటం లేదు మరి. ‘ఓఆర్ఆర్కు ఉరి’ అంటూ ‘ఈనాడు’ రాసిన రాతల్లో వీసమెత్తయినా నిజం లేకపోవటమే దీనికి సజీవ సాక్ష్యం. ఈ రాతల్లోని నిజానిజాలివీ... చంద్రబాబు ధర్నా చేస్తే... అది మహా ధర్నా. అమరావతి కోసం కొందరు ఉద్యమిస్తే... అది మహోద్యమం. తాడూ బొంగరంలేని నాలుగు పార్టీలతో బాబు జట్టుకట్టినా... అది మహా కూటమి. పాపం.. ఈ మైండ్‌సెట్‌తో ఉంటుంది కనకే ‘ఈనాడు’.. బాబు చేసిన చెల్లని ప్రతిపాదనల్ని కూడా మహా ప్రతిపాదనలనుకుంటోంది. అందుకే అప్పుడెప్పుడో 2017లో చంద్రబాబు గీసిన ఓ ఊహాతీత గ్రాఫిక్‌ను ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదంటూ శివాలెత్తిపోయింది. అయ్యో!! రాష్ట్రాభివృద్ధికి విఘాతమంటూ గుండెలు బాదేసుకుంది. ఏది నిజం? అసలు చంద్రబాబు కల్లోకొచ్చిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు.. 10 లక్షల మంది జనాభా ఉన్న విజయవాడకు ఇప్పుడు అవసరమా? వాస్తవికంగా ఆలోచించబట్టే వైఎస్సార్ హయాంలో విజయవాడకు పశ్చిమాన కాజా నుంచి చిన్న అవుటుపల్లికి 6 వరసల బైపాస్ ప్రతిపాదించారు. అమరావతి గ్రామాల్లోంచి వెళ్లే దీని పొడవు 48 కిలోమీటర్లు. భూసేకరణ కూడా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై కేంద్రంతో ఒప్పందం చేసుకుని ఉంటే ఈ పాటికి హాయిగా బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ కష్టాలు ఉండేవే కావు. కానీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే విలువనిచ్చే చంద్రబాబు... దీన్ని పక్కనబెట్టి 189 కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డును ప్రతిపాదించారు. పోనీ దాన్నయినా చిత్తశుద్ధితో ప్రయత్నించారా అంటే అదీ లేదు. డ్రాయింగ్కు మాత్రం పరిమితమై... 8,213 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా ఒక్క ఎకరాన్ని కూడా సేకరించకుండా వదిలేశారు. ఆ చర్యలను ‘ఈనాడు’ ఎన్నడూ ప్రశ్నించలేదు. జగన్ రావటంతోనే కదలిక... వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారలోకి వస్తూనే విజయవాడ సిటీ ట్రాఫిక్ వెతలను తీర్చే ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. కేంద్రంతో చర్చలు జరిపి వెస్టర్న్ బైపాస్‌ను పట్టాలెక్కించారు. శరవేగంగా సాగుతున్న ఈ పనులు... రెండేళ్లలో పూర్తికాబోతున్నాయి కూడా. దీనికి సమాంతరంగా కాజా నుంచి చిన్న అవుటుపల్లికి కంకిపాడు మీదుగా కృష్ణా నది దిగువన 40 కిలోమీటర్ల ఈస్టర్న్ బైపాస్‌నూ వై.ఎస్.జగన్ ప్రతిపాదించారు. ఈ రెండూ పూర్తయితే విజయవాడ చుట్టూ 88 కిలోమీటర్ల పొడవైన పూర్తిస్థాయి రింగురోడ్డు ఏర్పడుతుంది. దీంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలన్నీ తీరుతాయని, త్వరలో పూర్తయ్యే మచిలీపట్నం పోర్టు ట్రాఫిక్ కూడా ఈ రింగురోడ్డు ద్వారా సాగుతుంది కనక నగరంపై ఒత్తిడి పడదని ఆయన ఉద్దేశం. అందుకోసమే భూ సేకరణ వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించాల్సి ఉన్నా... కేంద్రం ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఎంఓయూ కూడా జరగనుంది. ఇదీ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి. ఓఆర్‌ఆర్‌నూ వదిలేయలేదు... ముందుగా రింగ్ రోడ్డును పూర్తి చేస్తే... విజయవాడతో పాటు రింగురోడ్డు చుట్టుపక్కలి గ్రామాలకు కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి చెందుతాయని, అపుడు ఔటర్ రింగురోడ్డు అవసరం వస్తుందనేది సీఎం ఉద్దేశం. అందుకే ఆ ప్రతిపాదనను చంద్రబాబు మాదిరి పక్కనపెట్టేయకుండా సజీవంగానే ఉంచారు. హైదరాబాద్‌తో పోలికేంటి? హైదరాబాద్‌లో 70 లక్షల మంది జనాభా ఉన్నపుడు వైఎస్సార్ హయాంలో 150 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగురోడ్డును నిర్మించారు. దాని భూసేకరణ నుంచి అడుగడుగునా ‘ఈనాడు’ ఎలా అడ్డుపడిందో... ‘పెద్దలా... గద్దలా’ అంటూ ఎన్ని దుర్మార్గపు కథనాలు రాసిందో... అయినా సరే ఆయన సంకల్పాన్ని ఎలా ఆపలేకపోయిందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో ఔటర్ పూర్తయిన ఇన్నేళ్లకు... దాని చుట్టూ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం రీజనల్ రింగురోడ్ల గురించి ఆలోచన చేస్తోంది. విజయవాడకు ఏది అవసరమో తెలియదా? ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడి జనాభా 10 లక్షలు. దీనికి చంద్రబాబు ప్రతిపాదించింది ఏకంగా 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగురోడ్డు. ఎక్కడో సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో వచ్చే ఔటర్తో సిటీ ట్రాఫిక్ సమస్యలెలా గట్టెక్కుతాయి? ఈ చిన్న లాజిక్ అటు చంద్రబాబు కానీ, ఇటు ‘ఈనాడు’ కానీ ఎందుకు మిస్సయ్యారు? అంత దూరంలో ఓఆర్ఆర్ నిర్మించినా దానికి నగరంతో కనెక్ట్ చేయడానికి ఎన్ని రోడ్లని వేస్తారు? దానివల్ల ఎవరికి లాభం? అప్పట్లోనే నిర్మాణానికి రూ.17 వేల కోట్లు అవుతుందని అంచనా వేయగా... ఇపుడది 30వేల కోట్లపైనే అవుతుంది. పైపెచ్చు 8వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించాలి. ఒక రోడ్డు కోసం ఇంతటి వ్యయాన్ని భరించే శక్తి రాష్ట్రానికి ఉందా? ఇవేవీ రామోజీకి పట్టవా? ఇవన్నీ ఆలోచించే... 88 కిలోమీటర్ల రింగురోడ్డుతో విజయవాడ ట్రాఫిక్ వెతల్ని తీర్చాలని తలచారు ముఖ్యమంత్రి జగన్. ఇది మరో 30–40 ఏళ్ల పాటు నగరంలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రతిపాదన. చుట్టుపక్కల అభివృద్ధి చెందుతున్న దశలో గనక ఔటర్ రింగురోడ్డును తెస్తే అప్పుడు విజయవాడ– గుంటూరు జిల్లాలు కలిసి మహా నగరంగా రూపుదిద్దుకుంటాయనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ దార్శనికత రామోజీ–బాబు ద్వయానికి అర్థమయ్యేదెప్పుడు? అర్థమైనా సరే... అర్థం కానట్టు నటించడం మానేదెప్పుడు? ఇది.. బాబు కలల ఓఆర్ఆర్ ఇది చంద్రబాబు ప్రతిపాదించిన ఔటర్ రింగురోడ్డు. మొత్తం 189 కిలోమీటర్లు. 2017లో ప్రతిపాదించినపుడు దీని నిర్మాణ వ్యయం 17,762 కోట్లు. పెరిగిన నిర్మాణ వ్యయంతో చూస్తే ఇపుడు రూ.30వేల కోట్లపైనే. ఈ రోడ్డు కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 87 గ్రామాల్లో ఏకంగా 8,213 ఎకరాల భూమిని సేకరించాలి. కేంద్రం నిబంధనల ప్రకారం భూసేకరణ వ్యయం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. నాడు చంద్రబాబు ఏం చేశారు? ఏదైనా డిజైన్లు, గ్రాఫిక్కులకే పరిమితం చేసే చంద్రబాబుది.. ఔటర్ విషయంలోనూ అదే తీరు. విజయవాడకు సంబంధమే లేకుండా.. పశ్చిమాన ధరణికోట, కంచికచర్ల, మైలవరం... తూర్పున నందివెలుగు, గుడివాడ వంటి ప్రాంతాల మీదుగా వెళ్లేలా ఔటర్‌ను ప్రతిపాదించారు. ఇందులో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా విజయవాడ నగరానికి 40–50 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరం ఉండదు. పోనీ... ఊహాతీతమైన ఈ ప్రాజెక్టునైనా చిత్తశుద్ధితో చేశారా అంటే అదీ లేదు. జస్ట్ డీపీఆర్ తయారు చేయించి... పక్కనపెట్టేశారు. 2017–2019 మధ్య రెండేళ్లపాటు ఆ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తేవటం కానీ.. 8,213 ఎకరాల్లో ఒక్క ఎకరాన్నయినా సేకరించటం కానీ .. ఏమీ చెయ్యలేదు. విచిత్రం ఏంటంటే... ఆ రెండేళ్లలో దీన్ని ఒక్కరోజైనా ‘ఈనాడు’ ప్రశ్నిస్తే ఒట్టు. ఎందుకంటే బాబు తమవాడు మరి!!. విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడకు పశ్చిమాన కాజా నుంచి అమరావతి మీదుగా గొల్లపూడికి... గొల్లపూడి నుంచి చిన్న అవుటుపల్లికి రెండు ప్యాకేజీలుగా నిర్మిస్తున్న ఈ 6 లైన్ల రహదారి పొడవు 48 కిలోమీటర్లు. మధ్యలో కృష్ణానదిపై నిర్మించనున్న 3.2 కిలోమీటర్ల వంతెన గుంటూర్లోని తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద ప్రారంభమై కృష్ణా జిల్లా సూరాయపాలెం వద్ద ముగుస్తుంది. ఈ బైపాస్ అంచనా వ్యయం రూ. 2,700 కోట్లు. గొల్లపూడి–కాజ రహదారి... మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని చినకాకాని వద్ద మొదలై అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం, మందడం మీదుగా గొల్లపూడి చేరుతోంది. 16 నెలల్లో ఒకటి... మరో రెండేళ్లలో ఒకటి పూర్తి శరవేగంగా జరుగుతున్న ఈ రెండు ప్యాకేజీలూ ఒకటి 2023 ఏప్రిల్‌లో... మరొకటి 2024 జనవరిలో పూర్తవుతాయనేది అధికారుల అంచనా. ఇవి పూర్తయితే విజయవాడ నగరంలో ట్రాఫిక్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు విజయవాడలోకి రావాల్సిన అవసరం లేకుండా వెలుపలి నుంచే నగరాన్ని దాటేయొచ్చు. ఈ బైపాస్ వల్ల ఇంకో లాభమేంటంటే నగరంలోని ఏ ప్రాంతం నుంచయినా ఈ రోడ్డెక్కటం చాలా సలువు. ఎందుకంటే ఏ ప్రాంతమైనా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం లోపే ఉంటుంది. ముఖ్యమైన అంశమేంటంటే ఈ రోడ్డు అమరావతి మీదుగా కూడా వెళుతుంది. అంటే... అమరావతిలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ ఈ బైపాస్ అందుబాటులోకి వస్తుంది. అక్కడి నుంచి నగరం వెలుపలికి వెళ్లటం అత్యంత సులవవుతుంది. బాబు హయాంలో ఏం జరిగింది? నిజానికి ఈ బైపాస్కు నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే భూసేకరణ చేశారు. కేంద్రానికి భూమి అప్పగించి ఒప్పందం చేసుకుంటే చాలు. పనులు పూర్తయి ఈ పాటికి రోడ్డు అందుబాటులోకి వచ్చేది. కానీ చంద్రబాబు గద్దెనెక్కుతూనే ఈ ప్రతిపాదనను పక్కనపడేశారు. భూసేకరణ జరిగిందని కూడా పట్టించుకోలేదు. కొత్తగా అమరావతి రియల్ ఎస్టేట్ కోసం సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో చుట్టూ గూగుల్ మ్యాపులో గీత గీసి కొత్త ‘ఓఆర్ఆర్’ పాట మొదలెట్టారు. విజయవాడ ఈస్ట్ బైపాస్ కాజ నుంచి కంకిపాడు మీదుగా చిన్న అవుటుపల్లికి వెళ్లటానికి కృష్ణా నది దిగువ ప్రాంతంలో నిర్మించనున్న ఆరు వరసల రహదారి ఇది. పొడవు 40 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.2,100 కోట్లు. దీన్ని నిర్మిస్తే వెస్టర్న్ బైపాస్ – ఈస్టర్న్ బైపాస్ కలిసి విజయవాడ నగరానికి ఆరు వరసల రింగురోడ్డు ఏర్పడుతుంది. దీంతో నగరం నుంచి బయటకు ఎక్కడకు వెళ్లాలన్నా ప్రయాణం చాలా ఈజీ అవుతుంది. వీటన్నిటికీ తోడు కనెక్టివిటీ పెరిగి ఈ రింగురోడ్డు చుట్టుపక్కలి గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ట్రాఫిక్ వెతలు తగ్గి విజయవాడ స్వరూపమే మారిపోతుంది. విజయవాడకు, ఈ రింగురోడ్డు చుట్టుపక్కలి గ్రామాలకు రియల్ ఎస్టేట్ పరంగా మంచి బూమ్ వస్తుంది. మచిలీపట్నం పోర్టు ట్రాఫిక్ కూడా... మరో ముఖ్యాంశమేంటంటే మచిలీపట్నం పోర్టు రెండు మూడేళ్లలో పూర్తవుతుంది. అప్పుడు పోర్టు ట్రాఫిక్ మొత్తం విజయవాడ నగరం గుండానే వెళితే ఆ ట్రాఫిక్ రద్దీని తట్టుకోవటం కష్టం. దీంతో వీలైనంత వేగంగా ఈ సమస్య నుంచి గట్టెక్కాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ తూర్పు బైపాస్‌పై దృష్టిపెట్టారు. నిజానికి భూ సేకరణ వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించాలి. కానీ ముఖ్యమంత్రి పలుమార్లు కేంద్ర నేతలను కలవటంతో పాటు ఈ రోడ్డు పనులకు సంబంధించిన జీఎస్టీ, సీనరేజీ, సెస్సులను వదులుకోవటానికి సిద్ధపడ్డారు. దీంతో భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరించడానికి కేంద్రం అంగీకరించింది. ఈ విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించేలా కేంద్రంపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి ఎంఓయూ జరగనుంది. ఈ రెండు బైపాస్‌లూ అందుబాటులోకి వస్తే... వచ్చే 30 ఏళ్లలో విజయవాడ, చుట్టుపక్కలి ప్రాంతాల ట్రాఫిక్‌ను తట్టుకునే రింగురోడ్డు పూర్తయినట్లే. ఈ రింగురోడ్డు ప్రాంతంతో అమరావతికీ యాక్సెస్ ఉంటుంది. మరి చంద్రబాబు పట్టించుకోలేదేం? కారణం ఒక్కటే. విజయవాడకు రింగురోడ్డు వస్తే ఇక్కడ రియల్టీ పెరుగుతుంది. చుట్టుపక్కల భూముల రేట్లు పెరుగుతాయి. అమరావతిలో మాత్రం బాబు అనుకున్నంతగా రియల్టీ వ్యాపారం సాగదు. అదే ప్రధాన కారణం నారా వారు దీన్ని పట్టించుకోకపోవటానికి. -
‘ఔటర్’ అందాలు అదరహో! కేటీఆర్ ట్వీట్ వైరల్
సాక్షి, పటాన్చెరు(హైదరాబాద్): ఓఆర్ఆర్ను మరిపించే రీతిలో రీజినల్ రింగ్‌రోడ్డు రానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రాత్రి పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్‌రోడ్డుపై ఎల్ఈడీ దీపాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరానికి కూడా మన దగ్గర ఉన్న విధంగా 160 కిలోమీటర్ల రింగ్ రోడ్డు లేదన్నారు. ఓఆర్ఆర్పై ప్రమాదాలు జరగకుండా రెండు దశల్లో 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి.. వాటిలో 18వేల 220 ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొందర్లోనే 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ను మరిపించేలా వస్తుందన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్ మెడికల్ డివైస్ పార్క్‌లో 50 సంస్థలకు స్థలాలు ఇచ్చామని, ఇప్పటికే ఏడు సంస్థలను ప్రారంభించామని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఓఆర్ఆర్ రాకతో 80 వేల ఎకరాల స్థలంలో పరిశ్రమలను ఆహ్వానించడానికి మంచి అవకాశం వచ్చిందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు దొరికేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు రాజు, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ఔటర్’ వెలిగిపోతోంది సాక్షి, సంగారెడ్డి: ఓఆర్ఆర్ ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓఆర్ఆర్పై రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన అనంతరం ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతున్న ఔటర్ రింగ్ రోడ్డు ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. Delighted to illuminate the entire stretch of Outer Ring Road (ORR), all intersections & important sections of service roads totalling 190.5 kms with 6340 poles & 13009 LED fixtures with a cost of ₹ 100.22 Cr My compliments to @HMDA_Gov on a job well done 👍 pic.twitter.com/iQn7xQTEjA — KTR (@KTRTRS) December 16, 2021 -
ఓఆర్ఆర్పై ప్రమాదం.. కారులోని వ్యక్తి సజీవ దహనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రెండో లైనులో ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్దమైంది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రమాదానికి గురైన కారు ప్రకాశం జిల్లాకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. -
హైదరాబాద్.. ORR లో 21 కోట్ల విలువైన 3400 కిలోల గంజాయి.. పట్టుబడింది
-
వర్క్‌ఫ్రమ్ హోం: మరో ఏడాదిన్నర ఇచ్చేయండి
Work From Home Request To IT Firms: ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇక్కడ కొలువైన ఐటీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి కొత్త రకం విజ్ఞప్తి వచ్చింది. మరికొద్ది కాలం పాటు వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలంటూ ఐటీ కంపెనీలను ప్రభుత్వం విశేషం. ఎప్పటి వరకు వర్క్‌ఫ్రం హోం దేశంలో ఐటీ పరిశ్రమలకు రాజధాని బెంగళూరు, వేల సంఖ్యలో ఇక్కడ ఐటీ కంపెనీలు నెలకొల్పారు. లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఈ నగరంలో నివసిస్తున్నారు. అయితే 2020లో వచ్చిన కరోనాతో అన్ని ఐటీ కంపెనీలు ఆఫీసులకు తాళాలు వేసి వర్క్‌ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నాయి. ఇటీవల పరిస్థితులు కొంత మేరకు చక్కబడటంతో తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఐటీ ఉద్యోగులకు కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని మరో ఏడాదిన్నర పాటు వాయిదా వేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం కోరింది. 2022 డిసెంబరు వరకు వర్క్‌ఫ్రం హోం అమలు చేయాలని సూచించింది. వర్క్‌ఫ్రం హోం కారణం ఏంటీ బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్ లిమిటెడ్ ఇటీవల అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న సిల్క్ రోడ్డు నుంచి కేఆర్‌పురం వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ పనులు సాగుతాయని కంపెనీ చెబుతోంది. దీంతో అవుటర్ రింగురోడ్డులో మెట్రో పనుల కోసం రోడ్డులో కొంత భాగాన్ని ఉపయోగిస్తారు. ఫలితంగా ఈ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తుతాయని కర్నాటక ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల మెట్రో పనులు పూర్తయ్యే వరకు ఐటీ కంపెనీలు వర్క్‌హోం అమలు చేయాలంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)కి కర్నాటక ప్రభుత్వం లేఖ రాసింది. ఎందుకీ పరిస్థితి ఎదురైంది బెంగళూరులో అవుటర్ రింగురోడ్డు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ప్రతీ రోజు ఈ రోడ్డుపై ట్రాఫిక్ జాం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్య పరిష్కరించడం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. కరోనా ఎఫెక్ట్‌తో గత ఏడాదిన్నరగా ఈ రోడ్డులో ట్రాఫిక్ సమస్యల బాధ తప్పింది. ఇప్పుడు ఓ వైపు మెట్రో పనులు, మరో వైపు ఐటీ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య పెద్దదిగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా ఇండియా ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు బ్రాండ్‌కి చేటు జరుగుతుందనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రత్యామ్నాయం లేదా ? ఉద్యోగులను ఇప్పుడప్పుడే ఆఫీసులకు పిలవద్దొన్న ఐటీ కంపెనీలను కోరిన ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలు కూడా వారికి సూచించింది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటే వారిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేలా చూడాలంటూ సలహా ఇచ్చింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు పట్ల ఉద్యోగులకు అభ్యంతరాలు ఉంటే సైకిళ్లు వినియోగించేలా వారిని ప్రోత్సహించాలని కంపెనీలకు కర్నాటక సర్కార్ సూచించింది. హైదరాబాద్ పరిస్థితి ఏంటీ పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో ఆ స్థాయి ఉన్న నగరం హైదరాబాద్. ఇక్కడ సైతం ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. కరోనాకు ముందు ట్రాఫిక్ సమస్య కారణంగా షిఫ్ట్ టైమింగ్స్‌లో మార్పులు చేసుకోవాలని ఐటీ కంపెనీలను నగర పోలీసు విభాగం కోరింది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
ORR పై భారీ ట్యాంకర్ బోల్తా
-
ఘట్కేసర్ ORR వద్ద బాలిక అనుమానాస్పద మృతి
-
ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక అనుమానాస్పద మృతి
ఘట్కేసర్: ఫోన్లో మాట్లాడొద్దని తల్లి మందలించడంతో వేదనకు గురైన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ఒంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల కుమార్తె (16), కుమారుడితో కలసి అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. కొంతకాలంగా కూతురు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించారు. బాలికలో మార్పు రాకపోగా శుక్రవారం తిరిగి అపరిచితునితో మాట్లాడుతుండటంతో గట్టిగా హెచ్చరించారు. దీంతో వేదనకు గురైన బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో వారు నిద్రించాక కిరోసిన్ సీసా తీసుకొని, కుటుంబ సభ్యులు బయటకు రాకుండా గడియపెట్టి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఖాళీ ప్రదేశంలో బాలిక మృతదేహం కనిపించడంతో దుండగులు బాలికను సజీవదహనం చేసి ఉండొచ్చనే వదంతులు వచ్చాయి. దీంతో స్థానికులు భారీగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా బాలిక కిరోసిన్ సీసాతో ఒంటరిగా వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొహెడకు వెళ్లే సర్వీస్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను పడవేశారు. దీనిపై ప్రయాణికుడు తాళ్ల బాలశివుడుగౌడ్ ట్విటర్లో మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మంత్రి ఈ విషయాన్ని ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకుపోవడంతో కమిషనర్ స్పందించి వెంటనే సిబ్బందితో చెత్తను తొలగించేశారు. అరగంట వ్యవధిలోనే చెత్త క్లీన్ కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. – ఇబ్రహీంపట్నం రూరల్ ఆదిబట్ల మున్సిపాలిటీ బొంగ్లూర్ ఔటర్ సరీ్వస్ రోడ్డు పక్కన చెత్త, తొలగించిన తరువాత ఇలా -
ఓఆర్ఆర్పై ప్రమాదం: బస్సులో చెలరేగిన మంటలు
-
ఓఆర్ఆర్.. ఫుల్ జిగేల్!
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పూర్తిగా వెలుగు జిలుగులతో తళుకులీననుంది. రాత్రి సమయాల్లో వాహనదారులు సాఫీ ప్రయాణం చేసే దిశగా హెచ్ఎండీఏ వేగిరంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు దాదాపు 24 కిలో మీటర్ల పొడవునా ఎల్ఈడీ లైట్లు వెలుగులు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. మిగిలిన 136 కి.మీ మార్గంలోనూ త్వరితగతిన పనులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 13న ఎల్ఈడీ బల్బుల బిగింపు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాక్షి, హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు 158 కి.మీ మేర ఉంది. ఇప్పటికే గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు 24 కి.మీ మేర ఎల్ఈడీ బల్బుల వెలుగులు 2018 నుంచి ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ మిగిలిన ప్రాంతాల్లో ఎల్ఈడీ బల్బుల వెలుగులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు 0 నుంచి 136 కి.మీ వరకు అంటే కోకాపేట నుంచి కొల్లూరు, పటాన్చెరు, దుండిగల్ తదితర ప్రాంతాల మీదుగా శంషాబాద్ వరకు బిగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నాలుగు ప్యాకేజీల కింద దాదాపు రూ.107.50 కోట్ల వ్యయంతో ఈ పనులను వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన డిజైనింగ్ పనులకు సిద్ధమయ్యారు. దీపావళికి ముందు అధికారికంగా ప్రారంభమయ్యే పనులను దాదాపు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయనున్నారు. సుమారు 7 వేల స్తంభాలు, 14 వేల ఎల్ఈడీ బల్బులను ఇటు ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్ వే, ఇంటర్‌చేంజ్‌లు, జంక్షన్లు, సరీ్వస్ రోడ్లు, అండర్‌పాస్‌ల్లో బిగించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఓఆర్ఆర్ మొత్తంలో ఈ వెలుగుల పనులు పూర్తయితే దేశంలోనే తొలి ప్రాజెక్టు అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోమేటిక్ లైటింగ్‌లో కూడా.. ఓఆర్ఆర్పై రాత్రి వేళలో వాహనదారుల కదలికల్ని బట్టి ఈ బల్బుల వెలుగులు ఉంటాయి. వాహనాల రాకపోకలు ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో వెలుగులు ఉండేలా.. అవి లేని సమయాల్లో ఆటోమేటిక్ డీమ్ అయ్యేలా అధికారులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. రిమోట్ నుంచి పనిచేసేలా చేస్తున్న ఈ వ్యవస్థ ద్వారా కూర్చున్న చోట నుంచే అంటే తమ సెల్ఫోన్ల నుంచే లైట్లు వెలుగుతున్నాయా లేదా.. ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అనే తెలుసుకునే ‘ఆటోమేషన్’ ఉందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని ఆశిస్తున్నారు. -
సంగారెడ్డి: ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
-
ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్ చెరు మండలం పాటి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరందిరినీ జార్ఖండ్‌కు చెందిన కార్పెంటర్లుగా గుర్తించారు. మృతుల్లో రాంఘడ్‌కు చెందిన కమలేష్ లోహరే, హరి లోహరే, ప్రమోద్ భుహెర్, వినోద్ భుహెర్, పవన్ కుమార్ (ఘోరఖ్పూర్), బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. బాధితులంతా గచ్చిబౌలి నుంచి జార్ఖండ్‌కు వెళ్తుండగా రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిననట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి కి వెళ్తుండగా నార్సింగి సర్కిల్ వద్ద రెండు కార్లు అతివేగంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ కావడంతో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే గచ్చిబౌలి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారు నడుపిన ఇద్దరు వ్యక్తులే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వీరంతా సూర్యాపేటకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఔటర్‌పై ప్రమాదం : ఐపీఎస్ అధికారికి గాయాలు
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై వెళ్తున్న తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కారు బోల్తా పడింది. తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి కొండాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావుతోపాటుగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓఆర్ఆర్పై హోండాసిటీ కారు బోల్తా
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డుపై ఘట్కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారంతా దమ్మాయిగూడకు చెందిన కమలాకర్ శర్మ కుటుంబం సభ్యులుగా తెలిసింది. తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కమలాకర్ శర్మ హోండా సిటీ కారు ప్రమాదానికి గురైంది. (చదవండి: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్) -
ఔటర్‌పై ఇక రైట్..రైట్..
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఎట్టకేలకు అన్ని వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. తాజా లాక్డౌన్ ఆదేశాల (జీవో 68) ప్రకారం 158 కిలోమీటర్ల రహదారిపై అనుమతి ఉన్న అన్ని వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు, భారీ వాహనాలకు మాత్రం 24 గంటల పాటు రాకపోకలు సాగించొచ్చని హెచ్ఎండీఏ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్త ఆదేశాలిచ్చారు. అయితే మంగళవారం నుంచే ఓఆర్ఆర్పై అన్ని వాహనాల రాకపోకలకు ఎంట్రీ ఇవ్వకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, నిర్ణయం తీసుకోవడంలో ఇరు ప్రభుత్వ విభాగాలు తాత్సారం చేస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ ‘ఔటర్‌పై డౌట్’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు అన్ని వాహన రాకపోకలకు బుధవారం రాత్రి 12 గంటల నుంచి అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయాన్ని సైబరాబాద్, రాచకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహన రాకపోకలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్యసేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేదని, ఇక నుంచి అన్ని వాహనాల రాకపోకలు సాగుతాయని, అయితే కొన్ని అంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. (చదవండి: ఔటర్‌పై డౌట్!) రాత్రిళ్లు అనుమతి లేదు.. రాజధానితో పాటు శివారు ప్రాంతాల రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఓఆర్ఆర్లో వాహన రాకపోకలను అనుమతిచ్చారు. అయితే చిన్న, తేలికపాటి వాహనాలు (కారులు, చిన్న సరుకు రవాణా వాహనాలు) కర్ఫ్యూ సమయమైన రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించరు. ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలు తక్కువ వేగంతో వెళ్లే వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉండటంతో రాత్రి సమయాల్లో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలను విశ్రాంతి కోసంఓఆర్ఆర్పై నిలిపేస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొడితే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉండటంతో చిన్న, తేలికపాటి వాహన రాకపోకలను రాత్రి పూట నిషేధించారు. నిబంధనలు పాటించాల్సిందే.. ఓఆర్ఆర్పై తొలి 2 లేన్లు (సెంట్రల్ మీడియన్‌కు పక్కనే ఉండే కుడివైపు లేన్లు) గంటకు 100 కిలోమీటర్ల వేగంతో, ఎడమవైపు లేన్లలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. ప్రయాణికులను తీసుకెళ్లే గూడ్స్ వెహికల్స్‌ను ఓఆర్ఆర్లో అనుమతించరు. అలాంటి వాటి వివరాలను టోల్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి అప్పజెప్పుతారు. ‘సురక్షితమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి. వేగ పరిమితి మించొద్దు. లేన్ రూల్స్ అనుసరించాలి. గతంలోలాగే స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో వాహనాలు వేగాన్ని పసిగట్టి ఈ–చలాన్లు జారీ చేస్తాం’అని సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు విజయ్‌కుమార్, దివ్యచరణ్రావు తెలిపారు. ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకే ప్రాధాన్యం ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్ టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్ఎండీఏ నిర్దేశించింది. ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలు చెల్లించాలని హెచ్ఎండీఏ సూచించింది. -
ఔటర్‌పై డౌట్!
సాక్షి, సిటీబ్యూరో: ‘లాక్‌డౌన్‌కు ముందు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లి కార్యాలయంలో విధులకు హాజరయ్యేవాణ్ని. తిరిగి అదే మార్గం మీదుగా ఇంటికి చేరుకునేవాణ్ని. ఇప్పుడు ఓఆర్ఆర్లో రాకపోకలకు అనుమతివ్వకపోవడంతో వేరే మార్గాల ద్వారా వ్యయ ప్రయాసలకోర్చి కార్యాలయానికి, ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది’ అని మైండ్‌స్పేస్‌లోని ఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి వేణు ఆవేదన వ్యక్తంచేశారు. సాఫీ జర్నీ కోసం ఓఆర్ఆర్లో రాకపోకలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజారవాణా వ్యవస్థ మొదలుకావడంతో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోనూ అన్ని వాహనాల ప్రయాణానికి అనుమతినిచ్చే విషయంలో రెండు విభాగాల ఎదురుచూపులు వాహనదారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. లాక్డౌన్ సడలింపులో భాగంగా మంగళవారం నుంచే అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనుమతిస్తారనుకుంటే.. ఆ బాధ్యతలు చూసేది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)నేనని.. సైబరాబాద్, రాచకొండ పోలీసులు అంటున్నారు. హెచ్ఎండీఏ అధికారులు మాత్రం వాహన రాకపోకలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఇరు కమిషనరేట్ల పోలీసు అధికారులేనని చెబుతున్నారు. వాహన రాకపోకలు మొదలైతే టోల్‌ఫీజు రూపంలో సంస్థ ఖాజానాకు ఆదాయం వస్తుందని, పోలీసుల నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నామని హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగాధికారులు అంటున్నారు. అయితే.. వాహన రాకపోకలపై ఒకరు నిర్ణయం తీసుకుంటామని మరొకరు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తుండడం వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అన్ని సంస్థల కార్యకలాపాలకు లాక్డౌన్ సడలింపులో అనుమతినివ్వడంతో నగరంతో పాటు శివారు ప్రాంత రోడ్లపై ప్రయాణం చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని వాహనచోదకులు మండిపడుతున్నారు. ఓఆర్ఆర్ మీదుగా అనుమతిస్తే సమయంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. అనుమతిస్తే అందరికీ మంచిదే.. ఓఆర్ఆర్లో ప్రస్తుతం నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్య సేవల వాహన రాకపోకలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో మంగళవారం నుంచే ఓఆర్ఆర్లో అన్నిరకాల వాహనాలకు అనుమతిస్తారని అనుకున్నారు. ప్రజారవాణా వ్యవస్థకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఓఆర్‌ఆర్‌లోనూ అనుమతి ఉంటుందని వేలాది మంది వాహనదారులు వచ్చారు. కానీ పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక నగర, శివారు ప్రాంత రోడ్ల మీదుగా వారివారి కార్యాలయాలు, గమ్యస్థానాలకు నానా అవస్థలతో వెళ్లాల్సి వచ్చింది. ఓఆర్ఆర్లో వాహన రాకపోకలకు అనుమతివ్వడం ద్వారా పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ కొంతమేర తగ్గుతుందని, టోల్‌ఫీజు రూపంలో హెచ్ఎండీఏకు ఆదాయం వస్తుందని వాహనదారులు అంటున్నారు. -
‘ఫాస్టాగ్’ తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు తుక్కగూడ నుంచి బొంగళూర్ గేట్ వరకు సాధారణంగా కారుకు టోల్‌ఫీజు రూ.20 వసూలు చేస్తారు. అయితే ఫిబ్రవరి 27న తుక్కుగూడ నుంచి బొంగళూరు వరకు ఫాస్టాగ్ ద్వారా వెళ్లిన ఏపీ29 బీకే 0789 కారుకు మాత్రం రూ.70లు కార్డు నుంచి కట్ అయ్యాయి. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం రూ.20 టోల్ రుసుం కట్ అయింది. ...ఇది మచ్చుకు ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక ఉదాహరణ మాత్రమే. నిత్యం లక్షా 30వేలకు పైగా వాహనాలు వెళుతున్న 158 కిలోమీటర్ల ఈ మార్గంలో చాలామంది వాహనదారులకు ఈ సమస్యలు నిత్యకృత్యం అయ్యాయి. అయితే రూ.50లే కదా ఫిర్యాదు ఎందుకులే అని కొందరు తేలిగ్గా తీసుకుంటే... ప్రతిరోజూ ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు మాత్రం ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆయా టోల్గేట్ల వద్ద అడిగినా సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మిన్నకుండిపోతున్న సందర్భాలు చాలానే ఉంటున్నాయి. కొంతమంది సిబ్బందేమో మళ్లీ డబ్బులు క్రెడిట్ అవుతాయని సర్దిచెబుతుండటంతో ఈ సమస్య హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అనుబంధ విభాగమైన ‘హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్’ ఉన్నతాధికారుల దృష్టికి చేరడం లేదనే వాదన వినిపిస్తోంది. ఫాస్టాగ్‌తోనూ తప్పని తిప్పలు... కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్లో భాగంగా ఫాస్టాగ్ వసూలు వ్యవస్థను గతేడాది ఆగస్టు నుంచి ఓఆర్ఆర్లో అమల్లోకి తీసుకొచ్చారు. అంతకుముందు ఏడాది పాటు ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్‌ను ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో సిబ్బందికి సరైన అవగాహన లేక సాంకేతిక కారణాలతో అడపాదడపా అమలును వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు గతేడాది ఆగస్టు నుంచి అమలు చేస్తున్నా సాంకేతిక సమస్యలు మాత్రం తీరడం లేదు. ఆయా ఫాస్టాగ్ కార్డులు కొన్ని సందర్భాల్లో స్కాన్ కాకపోవడం వల్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలాసార్లు అధికారులు క్విక్‌రెస్పాన్స్‌తో సమస్యను పరిష్కరిస్తున్నారు. ఒక్కో మార్గం నుంచి మరో మార్గం వరకు నిర్దిష్ట రుసుం రూ.20, రూ.30లు ఉంటే రూ.70లు ఆయా వాహనదారుల ఫాస్టాగ్ కార్డుల నుంచి కట్ అవడం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యంగా పేమెంట్స్ యాప్‌ల ద్వారా ఆయా ఫాస్టాగ్ కార్డులు రీచార్జ్ చేస్తున్న వారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టుగా ఓఆర్ఆర్ విభాగాధికారులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. ఈ సాంకేతిక సమస్యలపై ఇప్పటికే ఆయా పేమెంట్స్ యాప్‌ల దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లినా.. ఆశించినంత స్పందన రాలేదని తెలిసింది. పరిమితికి మించి మీ ఫాస్టాగ్ కార్డుల ద్వారా నగదు కట్ అయితే ఫిర్యాదు చేయాలని, తక్షణ పరిష్కారం లభించేలా చూస్తామని అధికారులు అటున్నారు. వాహనదారులు తికమక పడవద్దు... ఆర్ఎఫ్ఐడీ ఫాస్టాగ్ ఉపయోగించే వాహనదారుల కోసం ఆయా టోల్గేట్ల వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించాం. అలా కాకుండా కొందరు ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు మాన్యువల్ లేన్‌లోకి వెళ్లి అక్కడి సిబ్బందికి కార్డు చూపించి స్లిప్ తీసుకొని వెళుతున్నారు. దీంతో ఫాస్టాగ్ కార్డును అక్కడి సాంకేతిక వ్యవస్థ రీడ్ చేయడం లేదు. ఫలితంగా వారు ఎక్కడైతే టోల్గేట్ నుంచి దిగిపోతారో వారికి ఎంట్రీ అయిన ప్రదేశాన్ని సాంకేతిక వ్యవస్థ గుర్తించక ఎగ్జిట్ అయిన ప్రాంతం వద్ద రూ.70లు కట్ అవుతున్నట్టుగా మెసేజ్‌లు వెళుతున్నాయి. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్కు రూ.140 టోల్ రుసుం కాబట్టి ఇలా సగం కట్ అవుతుంది. మీ ప్రయాణ దూరాన్ని బట్టి కాకుండా, అంతకుమించి ఎక్కువగా డబ్బులు కట్ అవుతే మాత్రం మా టోల్గేట్ వద్ద ఫిర్యాదుచేయండి. సమస్యను పరిష్కరిస్తాం.–రవీందర్ రెడ్డి, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాధికారి -
ఓఆర్ఆర్పై మితిమీరుతున్న వాహనాల వేగం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనాలు రయ్...రయ్‌మంటూ కంటికి కనిపించని వేగంతో దూసుకెళ్తూ తరుచుగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన ర్యాష్ డ్రైవింగ్ వాహనదారుల ప్రాణాలమీదకు తెస్తోంది. కార్ల దగ్గరి నుంచి అతి భారీ వాహనాల వరకు ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నాయి. లేజర్ స్పీడ్గన్లకు చిక్కి కేసులు నమోదవుతున్నా..భారీగా చలానాలు విధిస్తున్నా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రతిరోజూ లక్షా 40 వేల వాహనాలు ప్రయాణిస్తున్న ఓఆర్ఆర్లో 1388 వాహనాలకు ఓవర్ స్పీడ్ చలానాలు జారీ అవుతున్నాయి. గత పది నెలల కాలంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్లో 3 లక్షల 4 వేల 6 చలానాలు, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో లక్షా 12 వేల 487 చలాన్లు ట్రాఫిక్ పోలీసులు విధించారు. ఇలా 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో 4 లక్షల 16 వేల 493 చలానాలకు రూ.41 కోట్ల 64 లక్షల 93 వేలు జరిమానాలు విధించారు. ఓఆర్ఆర్పై వాహనాల గరిష్ట వేగాన్ని 120 నుంచి 100 కిలో మీటర్లకు తగ్గించినా వాహనదారుల్లో స్పీడ్ జోష్ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెలవారీగా గణాంకాలు తీసుకుంటే అత్యధికంగా జూన్ నెలలో 55,982 మంది ఓవర్ స్పీడ్‌తో వెళ్లినట్టుగా కనబడుతోంది. ఇలా ఈ ఏడాది పది నెలల్లో జరిగిన 86 రోడ్డు ప్రమాదాల్లో 36 మంది మృతి చెందారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్‌తో వెళ్లవద్దంటూ సూచనలు చేస్తున్నా వాహనదారులు పట్టనట్టుగా వ్యవహరిస్తూ సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు. లేదా ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. మితిమీరిన వేగం వల్లే... ఓఆర్ఆర్పై ట్రాఫిక్ తక్కువ ఉండటంతో వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. నిద్ర లేకుండా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తుండటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే మద్యం సేవించి వాహనం నడపడటంతో పాటు ఓఆర్ఆర్పై లేన్ డిసిప్లేన్ పాటించకుండా ఇతర వాహనాలను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అధిగమిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. – విజయ్‌కుమార్,సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
రీజినల్ రింగ్ రోడ్డుపై కేంద్రం మడతపేచీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు అయోమయంలో పడింది. హైదరాబాద్ చుట్టూ విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్)కు అవతల 338 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావించిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థ కంగా మారింది. ప్రస్తు తం ఇందులో సగం రోడ్డుకు మాత్రమే కేం ద్రం సూత్రప్రాయం గా అంగీకారం తెలి పింది. మిగిలిన సగం రోడ్డును దాదాపు తిర స్కరించి నట్టుగానే కనిపి స్తోంది. అది ఆర్థికంగా సాధ్యం కాదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవాలని పరోక్షంగా సూచిస్తోంది. వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా దాదాపు 500మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపి అందిస్తే చూస్తానని చెప్పడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం సగం రింగ్ మాత్రమే సాకారమయ్యేలా మారింది. రెండో భాగానికి కేంద్రం అంగీకరించాలంటే స్వయంగా ప్రధాని మోదీ సంతృప్తి చెంది ఆమోదిస్తే తప్ప అది పట్టాలెక్కే పరిస్థితి కనిపించటంలేదు. ఓఆర్ఆర్ కీలక భూమిక.. ఔటర్ రింగ్‌రోడ్డు.. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా హైదరా బాద్ నగరం చుట్టూ సాక్షా త్కరించిన భారీ ప్రాజెక్టు. 158 కిలోమీటర్ల మేర ఎనిమిది వరుసలతో దేశంలోనే తొలి ఎక్స్ ప్రెస్ వేగా ఇది నిర్మిత మైంది. ఇంత భారీ రింగురోడ్డు అవసరమా అన్న అనుమానాలు వ్యక్త మైన తరుణంలో నిర్మిత మైన ఈ రోడ్డు.. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక భూమిక పోషిం చింది. దేశంలో శరవేగంగా పురోగమించిన నగరాల జాబితాలో భాగ్యనగరం ముందు వర సలో ఉండేందుకు దోహదపడింది. నగరం చుట్టూ శివారు ప్రాంతాల ముఖచిత్రం మారడానికి సాయపడింది. అలాంటిది దీన్ని మించిన రింగు రోడ్డు నిర్మిస్తే భాగ్యనగరం మరింత పురోగమించడం ఖాయం. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ఆవల ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్.. దూరదృష్టితో ఆలోచించి రూపకల్పన చేసిన ప్రాజెక్టే ఈ రీజినల్ రింగు రోడ్డు. ఏంటీ రీజినల్ రింగ్‌రోడ్డు? హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల దాదాపు 50 కిలోమీటర్ల పరిధిని అనుసంధానిస్తూ నిర్మితమయ్యే రోడ్డు ఇది. తొలుత దీన్ని నాలుగు వరుసలతో నిర్మించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఆరు వరసలుగా నిర్మించాలని నిర్ణయించింది. ఇది 338 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ నిర్మితమవుతుంది. నగరం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 20కి పైగా పట్టణాలను అనుసంధానిస్తూ వలయంగా ఈ రోడ్డు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడేం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 2016లో రూపకల్పన చేసింది. భారీ వ్యయంతో కూడుకున్నది కావటంతో రాష్ట్ర రహదారులుగా ఉన్న మార్గాలను జాతీయ రహదారులుగా మార్చి అనుసంధానించటం ద్వారా దీన్ని సాకారం చేయొచ్చని భావించి కేంద్ర ఉపరితల రవాణాశాఖకు దరఖాస్తు చేసింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, రోడ్లు భవనాల శాఖ అధికారులు భేటీ అయి దీనిపై చర్చించారు. దీంతో ఆయన 2018లో ఆమోదించటంతో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీన్ని రెండు భాగాలుగా చేసి 152 కిలోమీటర్ల తొలి భాగాన్ని జాతీయ రహదారిగా డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది. తాత్కాలికంగా ఆ రోడ్డును ఎన్‌హెచ్ 161 బీబీగా పేర్కొంది. రెండో భాగాన్ని కూడా ఆమోదించి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరింది. ఈ లోపు ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా పెండింగులో పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కో ప్రాజెక్టును ప్రత్యేకంగా పరిశీలించి పాత నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్థికంగా వెసులుబాటు కాని ప్రాజెక్టులుగా గుర్తించిన వాటిని పక్కన పెట్టారు. ఆ జాబితాలో రీజినల్ రింగ్ రోడ్డు రెండో భాగాన్ని కూడా చేర్చారు. కేంద్రం ఏమంటోంది? దాదాపు రూ.7వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఆర్ఆర్ఆర్ రెండో భాగం నుంచి టోల్ రూపంలో తప్ప మరే ఆదాయం రాదు. టోల్ కూడా నామ మాత్రంగానే ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టుగా 500 మీటర్ల వెడల్పుతో చేపడితే బాగుంటుంది. అంతమేర భూసేకరణ జరిపి వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా చేసి కేంద్రానికి అప్పగిస్తే ఆ రోడ్డును నిర్మిస్తామని మెలిక పెట్టింది. అది జరగాలంటే వేల హెక్టార్ల ప్రైవేటు భూమిని సేకరించాలి. అంత మొత్తం భరించడం ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. రాష్ట్రం ఏం చేయాలి? జాతీయ రహదారుల విషయంలో ఇప్పటికీ తెలంగాణ బాగా వెనకబడి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల చుట్టూ ఉన్న రోడ్ నెట్వర్క్ హైదరాబాద్‌కు లేదు. దీంతో పాత ప్రతిపాదనను ఆమోదించి రీజినల్ రింగ్‌రోడ్డుకు అనుమతిస్తే హైదరాబాద్ కూడా ఇతర ప్రధాన నగరాల రోడ్ నెట్వర్క్ సరసన నిలుస్తుందని చెబుతోంది. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీని ఈ మేరకు ఒప్పించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో దీనిపై ప్రధానికి నివేదించే అవకాశం కనిపిస్తోంది. ‘‘గతంలో నితిన్ గడ్కరీ చాలా జాతీయ రహదారులను మంజూరు చేశారు. కానీ మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఆ వేగానికి బ్రేకులేశారు. ఇప్పుడు భారీ ప్రాజెక్టులకు ఉదారంగా చేపట్టేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో కాకుండా సాధారణ జాతీయ రహదారిగానైనా దీన్ని సాకారం చేసుకోవాల్సి ఉంది. అవసరమైతే భవిష్యత్తులో దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ మేరకు మోదీని ఒప్పించాల్సి ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి ఆయనతో భేటీ అయి చర్చిస్తే ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది’’ అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. -
ఔటర్‌పై ‘వన్‌వే’ కష్టాలు
రాయదుర్గం: ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డులో వన్‌వే ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్ జంక్షన్లో రెండు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. సోమవారం నుంచి ఈ వన్‌వేను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. దీంతో నానక్‌రాంగూడ ఔటర్ జంక్షన్ నుంచి రోటరీ–1 నుంచి నార్సింగి వరకు వెళ్లే వాహనాలు మైహోమ్ అవతార్ వరకు వన్‌వే, నార్సింగి నుంచి వచ్చే వాహనాలు మైహోమ్ అవతార్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని నానక్‌రాంగూడ జంక్షన్‌కు వచ్చి అండర్‌పాస్ మీదుగా ఖాజాగూడవైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు వాహనాలు బారులుతీరుతున్నాయి. దీంతో ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర వాహనదారులు కనీసం గంటపాటు ట్రాఫిక్‌లో చిక్కుకొంటున్నారు. కొత్త నిబ«ంధనలతో నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్ సర్వీసు రోడ్డులో రెండు వైపులా టూ వే ఉండడంతో ఎలాంటి సమస్యలు లేకుండా రాకపోకలు నిర్వహించేవి. కానీ రెండు రోజులలో కొత్త నిబంధనలు పెట్టి వన్‌వే ఏర్పాటు చేయడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, నార్సింగి, మెహిదీపట్నం, అప్పా జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్డులో నిత్యం పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారు. వారితోపాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు నిర్వహించేలా, ఎక్కడా వాహనాలు ఆగకుండా చూడాలని కోరుతున్నారు. -
‘సర్వీస్’ స్టాప్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లోని ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) విభాగాధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపమవుతోంది. ఓఆర్ఆర్ లైన్‌లోని రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ సర్వీసు రోడ్ల పనులను పక్కనబెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉన్నా కాలయాపన చేస్తుండడంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అదనంగా రెండు మూడు కిలోమీటర్లు తిరిగివెళ్లాల్సి వస్తోంది. 2012లో ఓఆర్ఆర్తో పాటే సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటికీ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదులనాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ ప్రాంతాల్లో ఓఆర్ఆర్ను తాకుతూ వెళ్తున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండడంతో అవస్థలు పడుతున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే సూత్రపాయంగా అనుమతిచ్చినా అధికారులు ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. దీనిపై గతంలో అప్పటి కమిషనర్ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా... ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించి బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఎక్కడెక్కడ? ఎలా? మేడ్చల్: కీసర నుంచి పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీసు రోడ్డులో ప్రయాణించి, అక్కడి నుంచి యంనంపేట్ గ్రామంలోకి చేరుకొని ఘట్కేసర్ బైపాస్ రోడ్డు కూడలి దాటి మళ్లీ సర్వీసు రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్ కారణంగా ఇక్కడ సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా దాదాపు 3 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ నుంచి కీసర వైపు వెళ్లాలంటే యంనంపేట్ మీదుగా సర్వీసు రోడ్డుకు చేరుకోవడానికి 2 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇరువైపులా సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు మార్గంలో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వాహనదారులకు దారి తెలియక అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు మార్గంలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం 2 కిలోమీటర్ల వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. ఘట్కేసర్: ఘట్కేసర్ మండలంలోని గౌడవెళ్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో సర్వీసు రోడ్డు పనులు పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు 3.5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. గౌడవెళ్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్–నాందేడ్ రైలు మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెళ్లి స్టేషన్ సమీపంలో నుంచి రింగు రోడ్డు వెళ్తోంది. సర్వీసు రోడ్డు మాత్రం నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు రోడ్డు నిర్మించారు. దీంతో సర్వీసు రోడ్డులో వచ్చే వాహనదారులు సుతారిగూడ టోల్‌ప్లాజా నుంచి గౌడవెళ్లి గ్రామం మీదుగా 3.5 కిలోమీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్దనున్న సర్వీసు రోడ్డు నుంచి వెళ్లాల్సి వస్తోంది. పటాన్చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల పరిస్థితి ఇలాగే ఉంది. ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అంసపూర్తిగా ఉంది. రోడ్డు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా మట్టితో రోడ్డు వేశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు లేకపోవడంతో నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ దూరం తిరగాల్సి వస్తోంది. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. -
ఆ పైసలేవీ?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి జైకా రుణాల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) మండిపడింది. 2017–18లో రుణాల చెల్లింపులకు గాను హెచ్ఎండీఏకు రూ.235 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... కేవలం రూ.130.28 కోట్లే విడుదల చేసిందని పేర్కొంది. మిగిలిన రూ.104.71 కోట్ల నిధులను ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం శోచనీయమంది. ఈ మేరకు కాగ్ ఆదివారం నివేదిక విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ వరకున్న వివరాల ఆధారంగానే ఈ రిపోర్టు సిద్ధం చేశామని తెలిపింది. 2014–15, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లోనూ డబ్బులిస్తామని ఏజెండాలు రూపొందించిన ప్రభుత్వం... ఆచరణలోకి మాత్రం తేలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఆర్ఆర్కు ఖర్చు ఇలా... హెచ్ఎండీఏ సొంత నిధులు రూ.500 కోట్లతో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు (24.38 కి.మీ) 2005లో పనులు ప్రారంభించి 2011లో పూర్తి చేసింది. ఆ తర్వాత బీఓటి పద్ధతిన నార్సింగ్ నుంచి పఠాన్‌చెరు, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట (62.30 కి.మీ) వరకు 2011 ఆగస్టులో పనులు పూర్తి చేసింది. అప్పటి నుంచి ప్రతిఏటా బీఓటీ అన్యూటీ పేమెంట్ కింద రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. అయితే 2022 డిసెంబర్‌తో ఈ చెల్లింపులు పూర్తికావాల్సి ఉంది. అలాగే జైకా రుణాలతో పటాన్చెరు నుంచి శామీర్‌పేట, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట వరకు (71.32 కి.మీ) రహదారి నిర్మించారు. 2005లో మొదలైన ఈ పనులకు 2016 వరకు దాదాపు రూ.2,300 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించిన జైకా... ఆ తర్వాత నుంచి రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే హెచ్ఎండీఏ కాంట్రాక్టర్లు చేసిన పనికి డబ్బులు చెల్లించి, ఆ క్లైయిమ్ బిల్లులను హెచ్‌జీసీఎల్ ద్వారా జైకాకు పంపితే అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇలా 2016 నుంచి హెచ్ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.390 కోట్లు చెల్లించింది. 2020 డిసెంబర్ వరకు పూర్తికానున్న ఈ జైకా రుణానికి మరో రూ.70 కోట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు చెల్లించాల్సి ఉంది. అలాగే బీఓటీ పద్ధతిన కాంట్రాక్టర్లకు మరో ఏడు అన్యూటీలు అంటే 2022 డిసెంబర్ వరకు రూ.1,159 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రతిఏటా ఓఆర్ఆర్ జైకా రుణాల చెల్లింపుల కోసం హెచ్ఎండీఏ రూ.కోట్లలో ప్రతిపాదనలు పంపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరులో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాగ్ మండిపడింది. + రాజ్‌నారాయణ్‌కు గ్లోబల్ పీస్ అవార్డు చార్మినార్: తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ్ ముదిరాజ్‌కు గ్లోబల్ పీస్ అవార్డు–2019 దక్కింది. సామాజిక సేవా కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆయనకు చికాగోకు చెందిన అమీర్ అలీఖాన్ గ్లోబల్ పీస్ అండ్ ట్రస్ట్ సంస్థ ఈ అవార్డు అందజేసింది. ఆదివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య, రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పాతబస్తీలో 30 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తూ రాజ్‌నారాయణ్ పేరు తెచ్చుకున్నారన్నారు. -
‘ట్రాక్’లోకి వచ్చేదెలా.!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఔటర్ రింగ్ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ కొన్నేళ్లుగా సర్వీసు రోడ్ల పనులు నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాల అవస్థలు పడుతున్నారు. ఫలితంగా రెండు, మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. 2012లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదుల నాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ సమీపంలో ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండటంతో నరకం చూస్తున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అప్పటి కమిషనర్ జనార్దన్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయినా పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం.. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం.–సిద్దూ, ఘట్కేసర్ వాసి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి మేడ్చల్ మండల పరిధిలో సుతారిగూడ నుంచి గౌడవెళ్ళి వరకు సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పాత జంక్షన్ సుతారిగూడ వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలిపెట్టారు. గౌడవెళ్ళి వద్ద రైల్వె ట్రాక్ ఉండటంతో అండర్‌పాస్ బ్రిడ్జి లేకపోవడంతో ఔటర్ ప్రయాణికులు గౌడవెళ్ళి మీదుగా మూడు కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ చౌరస్తా నుంచి దుండిగల్ వైపు వెళ్ళాల్సి వస్తోంది. సమస్యను రైల్వే అధికారులు, హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. –సురేందర్ ముదిరాజ్, గౌడవెళ్లి సర్పంచ్ నిలిచిన సర్వీస్ రోడ్డు పనులు శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు రోడ్డులో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు నిలిచి పోవడంతో వాహదారులు హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండా వెళ్లాల్సి వస్తోంది. వయా యంనంపేట్ ఘట్కేసర్: కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామం మీదుగా ఘట్కేసర్ బైపాస్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి వస్తోంది. 3.5 కి.మీ. నరకం మేడ్చల్: గౌడవెళ్లి రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో ఔటర్‌రింగు రోడ్డు సర్వీసు అసంపూర్తిగా ఉండటంతో సర్వీసు రోడ్డులో వెళుతున్న వాహనదారులు 3.5 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్ళి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వాహనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుండి గౌడవెళ్ళి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తుంది. పటాన్చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల ఇదే పరిస్థితి. పొలాలకు వెళ్లేందుకు దారి లేదు.. ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ చుట్టు తిరిగి రావాల్సి వస్తోంది. -
‘గ్రిడ్’ గడబిడ!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్ ముఖచిత్రాన్ని మార్చే గ్రిడ్ రోడ్ల పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూరా ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించినా ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. సర్వీస్ రోడ్డుతో పాటు ఇంటర్‌ఛేంజ్‌లకు అనుసంధానం చేసే ఈ రహదారుల విషయంలో పదకొండేళ్ల నుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ఇక గ్రిడ్ రోడ్ల పని కంచికి చేరినట్టేనన్న అనుమానాలు ఓఆర్ఆర్ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. 2008లో అంచనా వేసిన గ్రిడ్ రోడ్ల పనులకు ఇప్పడూ మొదలుపెడితే అయ్యే పనులు తడిసి మోపెడవడం ఖాయమన్న భావనతో ఉన్న హెచ్ఎండీఏ అధికారులు వందల కోట్లతో రహదారులు నిర్మించడంపై దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓఆర్ఆర్ కిలోమీటర్ చుట్టూ పక్కల మల్టీపర్పస్ జోన్ కింద ఆవాసాలు కట్టుకోవచ్చని ప్రకటించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో గ్రిడ్ రోడ్ల అభివృద్ధి హెచ్ఎండీఏనే చూసుకుంటుందని అప్పటి అధికారులు 718 కిలోమీటర్ల మేర రహదారులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో 2008 ఆగస్టు తొమ్మిదిన జీవో నంబర్ 470ను విడుదల చేసి గ్రిడ్ రోడ్ల నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు మోక్షం కలగలేదు. గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో ఇటు ఐటీ పెట్టుబడులు ఊపందుకోవడంతో పాటు రియల్ ఎస్టేట్ మరింత జోరందుకుంటుందనుకుంటే..ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. రెండు లేన్ల గ్రిడ్ రోడ్డు కిలోమీటర్‌కు రూ.8 కోట్లవుతాయని హెచ్ఎండీఏ అధికారులు చెబుతుండటంతో మొత్తం 5,744 కోట్లు అవసరం కానున్నాయి. అయితే ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనతో గ్రిడ్ రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మినీ పట్టణాలు ఇక లేనట్టేనా... 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూరా ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు.. ఇందుకోసం దాదాపు లక్ష ఎకరాలు అవసరముంటుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. దాదాపు పది వేల ఎకరాలు ప్లాటింగ్ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలుతున్నది 60 వేల ఎకరాలే. ఈ లెక్కన చూసుకున్న ఈ 60 వేల ఎకరాల్లో గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా ప్రగతివైపు అడుగులు పడటం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆవైపే ఎవరూ చూడటం లేదు. అయితే ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి భూమి సేకరించి అభివృద్ధి చేసి ఇచ్చిన మాదిరిగానే ల్యాండ్ పూలింగ్ చేస్తే బాగుంటుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏ పురోగతి లేదు. ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల అభివృద్ధి కూడా అటకెక్కింది. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యంతో రేడియల్ రోడ్ల పనుల్లో ఆశించినంత వేగిరం లేదనే అభిప్రాయం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. కొత్త అభివృద్ధికి అవకాశం... ఓఆర్ఆర్ చుట్టూరా ఉన్న ప్రాంతాలైన మేడ్చల్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, పటాన్ చెరులో ఆటో పార్క్‌లు, పౌల్ట్రీ, వెజిటబుల్ మార్కెట్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్కేసర్లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, కోకాపేటలో ఐటీ, స్పోర్ట్స్, ప్రభుత్వ సంస్థల పరిశ్రమలు, బొంగుళూరులో ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, పెద్ద అంబర్‌పేటలో మీడియా, ఆటోమొబైల్ అండ్ హోల్‌సేల్ ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ తీసుకొస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ల అభివృద్ధితోనే ఇది సుసాధ్యమవుతుందని, పెట్టబుడులు సులభతరంగా వస్తాయని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. గ్రోత్ కారిడార్ అభివృద్ధితో నగర శివారు ప్రాంతాల ముఖచిత్రం మారుతుందని, భూముల విలువ పెరగడంతో పాటు ఐటీ రంగం అభివృద్ధికి ఊతమిస్తోందనే వాదన వారిలో వినబడుతోంది. దాదాపు 32 మండలాలను అనుసంధానం చేయనున్న ఈ గ్రిడ్ రోడ్ల ద్వారా రీజినల్ రింగ్ రోడ్డు కూడా డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనికి రూ.5,744 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం దృష్టిసారిస్తే మంచిది... నగర శివారు ప్రాంతాలను అనుకొని ఉన్న ఓఆర్ఆర్కు వివిధ మార్గాల నుంచి సరైన కనెక్టివిటీ లేదు. ఇప్పటివరకు కేవలం సర్వీసు రోడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైవేల నుంచి ఓఆర్ఆర్కు సరైన అనుసంధానం లేదు. అందుకే అభివృద్ధి వైపు పరుగులు పడటం లేదు. ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యం. మల్టీపర్పస్ జోన్ కూడా ఉంది. మౌలికవసతులను మెరుగుపడేందుకు అస్కారం ఉంటుంది. ఇప్పటికైనా గ్రోత్ రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తే శివారుల్లో మినీ ప్రాంతాలు వందల్లో వెలిసే అవకాశముంటుంది. వివిధ రంగాల్లో పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెండుగా రానున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడం కూడా ఖాయంగా కనబడుతోందని ఓఆర్ఆర్ ప్రాంతవాసులు అంటున్నారు. గుర్తించిన గ్రిడ్ రోడ్డు మార్గాలు ఇవే... ♦ ఇబ్రహీం పట్నం–హయత్‌నగర్ ♦ మహేశ్వరం–శంషాబాద్–ఇబ్రహీంపట్నం ♦ రాజేంద్రనగర్–శంషాబాద్–మొయినాబాద్–శంకర్పల్లి ♦ రామచంద్రపురం–శంకర్పల్లి–పటాన్చెరు ♦ రాజేంద్రనగర్–శేరిలింగంపల్లి–రామచంద్రపురం–జిన్నారం ♦ మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్ ప్రాంతాలను పటాన్చెరు అనుసంధానం చేయనుంది. -
ఏమిటా స్పీడు... చలాన్ పడుద్ది
హైదరాబాద్ : డ్రైవింగ్... రద్దీ రోడ్లపై నెమ్మదిగా వెళ్లినా, ఖాళీగా కనిపిస్తే చాలు దూసుకుపోతాం. మనలో అనేక మందికి ఇది అలవాటే. ఇక ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లాంటి మార్గాల్లో వేగానికి పరిమితే ఉండదు. సాధారణ స్పీడ్ దాటినా మీటర్ రీడింగ్ కూడా చాలా మంది చూసుకోరు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదిగో ఇలాంటి వారి కోసమే పోలీసులు కొత్త యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మీ స్పీడ్‌ను పరిశీలించి హెచ్చరిస్తాయి. ‘నో యువర్ స్పీడ్’, ‘యువర్స్ స్పీడ్’యంత్రాలను ఓఆర్ఆర్పై ఏర్పాటు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్రావు ‘సాక్షి’కి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తమ పరిధిలో ఉన్న 62 కి.మీ. ఔటర్లో ఒక్కో రోజు ఒక్కో చోట వీటిని వినియోగించనున్నారు. యువర్స్ స్పీడ్ పనిచేస్తుంది ఇలా.. ఈ యంత్రాన్ని నిర్ణీత ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇది ఎదురుగా వచ్చే వాహనాలను 300–400 మీటర్ల దూరం నుంచే అధ్యయనం చేస్తుంది. రాడార్ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం వాహన వేగాన్ని అధ్యయనం చేసి అనుసంధానించి ఉండే బోర్డు మీద వేగాన్ని (యువర్ స్పీడ్ అంటూ..) అంకెల్లో సూచిస్తుంది. వాహనం సాధారణ వేగంతో ఉంటే గ్రీన్ సిగ్నల్‌ను, మితిమీరితే రెడ్ సిగ్నల్‌ను చూపిస్తూ ‘డేంజర్’అని హెచ్చరిస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళితే అక్కడ ఉండే స్పీడ్ లేజర్ గన్ కెమెరా దీన్ని గుర్తించి ఈ–చలాన్ రూపంలో వాహనదారుడికి జరిమానా విధిస్తుంది. ట్యాంక్‌బండ్‌పై ట్రయల్.. ఈ స్పీడ్ డిటెక్టింగ్ టెక్నాలజీని ఇన్స్పెక్టర్ ఎం.నర్సింగ్‌రావు నేతృత్వంలోని బృందం గత నెలలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి అధ్యయనం చేసింది. ఈ స్పీడ్ డిటెక్టర్లు జర్మనీ టెక్నాలజీతో తయారై రాడార్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. ప్రయోగాత్మక పరిశీలనలో అనేక మంది వాహనచోదకులు ‘యువర్ స్పీడ్’చూసుకొని వేగం తగ్గించారని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు వీటిని అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలు గుర్తించాక కీలక ప్రాంతాల్లో పెట్టాలని యోచిస్తున్నారు. స్పీడ్ లిమిట్ లోపల వెళ్తే ఇలా ‘గ్రీన్’ రీడింగ్ చూపిస్తుంది.., స్పీడ్ లిమిట్ దాటి వెళ్తే ఇలా ‘రెడ్’ రీడింగ్ చూపిస్తుంది.. ప్రాథమికంగా రెండు యంత్రాలు... రోడ్డు ప్రమాద నిరోధం, ప్రాణనష్టం తగ్గించడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్పై రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. – దివ్యచరణ్ రావు, ట్రాఫిక్ డీసీపీ, రాచకొండ -
అంతు చిక్కని ఆయుధ రహస్యం!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) ఆత్మహత్య చేసుకున్న యువ వ్యాపారి ఫైజన్ అహ్మద్ (35) కేసుపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కణతపై కాల్చుకునేవదుకు అతను వినియోగించిన నాటు తుపాకీ మూలాలు కనిపెట్టడంపై నార్సింగి పోలీసులు దృష్టి పెట్టారు. ఆత్మహత్యాయత్నం తర్వాత ఫైజన్ కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినా వాంగ్మూలం ఇవ్వకుండానే చనిపోయారు. దీంతో సవాల్‌గా మారిన ఈ కేసును నార్సింగి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట ప్రెస్‌రోడ్‌కు చెందిన ఫైజన్ అహ్మద్ కొన్నేళ్ల క్రితం జ్యోతిషి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను తన మకాంను లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జలవాయు విహార్ అపార్ట్మెంట్లోకి మార్చాడు. సఫిల్‌గూడకు చెందిన పీవీ సుబ్రమనియన్కు చెందిన ఫ్లాట్ నెం.206ను 2013 అక్టోబర్‌లో అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో కలిసి అక్కడే ఉంటున్న ఫైజన్ కుటుంబం చుట్టుపక్కల వారికి దూరంగా ఉండేది. విదేశాలకు వెళ్లే వారికి వీసా ప్రాసెసింగ్ చేసేందుకు పంజగుట్టలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసిన ఫైజన్‌కు అందులో తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో కొన్నాళ్లుగా ఫ్లాట్ అద్దె, అపార్ట్మెంట్ మెయింటనెన్స్ కూడా చెల్లించలేదు. గత అక్టోబర్‌లో అతను డ్రివెన్ బై యు మొబిలిటీ సంస్థ నుంచి బెంజ్ కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 4న అతను నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని మంచిరేవుల సమీపంలో ఓఆర్ఆర్ పక్కనే తన కారును ఆపి నాటు తుపాకీతో కుడి కణితపై కాల్చుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఫైజన్‌ను ఓఆర్ఆర్పై విధులు నిర్వహిస్తున్న పోలీసులు గుర్తించి గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు కారులో ఉన్న ఫైజన్ సెల్‌ఫోన్‌తో పాటు ఆత్మహత్యకు వినియోగించిన నాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫైజన్ వినియోగించింది నాటు తుపాకీ కావడంతో అది అక్రమ ఆయుధంగా నిర్థారించారు. దీంతో కేసులో ఆయుధ చట్టాన్నీ చేర్చి దర్యాప్తు చేపట్టారు. అతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైజన్ అత్తగారిది మధ్యప్రదేశ్‌లోని మాండ్లా ప్రాంతం కావడంతో తరచూ అక్కడికు వెళ్ళి వస్తుండేవాడు. మాండ్లా పరిసరాల్లో కొన్ని జిల్లాల్లో నాటు తుపాకులు తేలిగ్గా లభిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచే ఆ తుపాకీని ఖరీదు చేసుకుని వచ్చి ఉండచ్చని భావిస్తున్నారు. ఈ మిస్టరీని ఛేదించడంపై నార్సింగి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ అసలు విషయం అంతుచిక్కట్లేదు. -
ఏవీ స్పైక్ రోడ్లు?
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలో వాహనదారుల ప్రయాణం సులువుగా సాగేలా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఏడాది క్రితం రూపొందించిన సరికొత్త ప్రణాళిక ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డును కలిపేలా నిర్మిస్తున్న రేడియల్ రోడ్ల మాదిరిగానే.. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)లను అనుసంధానిస్తూ ‘స్పైక్ రోడ్ల’ను నిర్మించాలనుకున్న ప్రణాళిక పట్టాలెక్కలేదు. శివార్లలో ఏర్పాటవుతున్న లాజిస్టిక్ హబ్‌లు, ట్రక్కు పార్కులు, ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లకు సులువుగా చేరేలా, చర్లపల్లి, నాగులపల్లిలో ఏర్పాటు కానున్న రైల్వే టెర్మినల్‌కు వాహనదారులు ఈజీగా వెళ్లేలా ఈ రోడ్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. వాస్తవానికి 25 ప్రాంతాల్లో దాదాపు 460 కి.మీ మేర కొత్త రోడ్లను నిర్మించాల్సి ఉందని, వీటిలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు ప్రాంతీయ రహదారులు కూడా ఉన్నాయని, వీటిని నాలుగు నుంచి ఆరు లేన్లుగా అభివృద్ధి చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్లకు వ్యయం రూ.500 నుంచి 1,000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. నగర శివారుల్లో ట్రక్కు పార్కులు, ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లకు చేరుకునే వాహనాల రాకపోకలకు ఈ స్పైక్ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా అచరణలోకి రాలేదు. స్పైక్ రోడ్లు ఏయే ప్రాంతాల్లో.. ♦ నేషనల్ హైవే –7, బెంగళూరు హైవే మీదుగా శంషాబాద్‌లోని ఓఆర్ఆర్ నుంచి పాల్మాకుల, కొత్తూరు ప్రాంతాల నుంచి ఫరూక్నగర్ అర్బన్ నోడ్స్ ఆర్ఆర్ఆర్కు (23.27 కి.మీ) ♦ శంషాబాద్ నుంచి అమన్పల్లి నర్కొడ, కందూవాడ మీదుగా పమీనా గ్రామ ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (27.28 కి.మీ) ♦ పీరంచెరువు అప్పాజంక్షన్ నుంచి మొయినాబాద్ మీదుగా చేవేళ్ల అర్బన్ నోడ్డు (26.33 కిలోమీటర్లు) ♦ శంకర్పల్లి మంచిరేవుల నుంచి జన్వాడ, మోఖిల మీదుగా శంకర్పల్లి ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (26.27 కిలోమీటర్లు) ♦ వెలముల నుంచి భానూర్ మీదుగాసింగపూర్ ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (10.28 కిలోమీటర్లు) ♦ నేషనల్ హైవే 9 ముత్తంగి జంక్షన్ నుంచి రుద్రారం మీదుగా కౌలంపేట హమ్లెట్ సమీపంలోని రుద్రారంలోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (0.81 కిలోమీటర్లు) ♦ రెండ్లగడ, ఐనోల్ మీదుగా ఇదతనూర్లోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం(16.67 కిలోమీటర్లు) ♦ దెల్వార్గూడ, కొడకంచి, అముదూర్ మీదుగా ఇస్మాయిల్ఖాన్ పూటసమీపంలోని అరుట్ల ఆర్‌ఆర్‌ఆర్‌కుఅనుసంధానం (22.7 కిలోమీటర్లు) ♦ సుల్తాన్పూర్ నుంచి ఊట్ల, చింతల్చెరర్ మీదుగా మాచెర్ల ఆర్‌ఆర్‌ఆర్‌కుఅనుసంధానం (24.81 కిలోమీటర్లు) ♦ రాష్ట రహదారి దొమ్మర పొచంపల్లి జంక్షన్ మీదుగా గగిల్పూర్, గుమ్మడిదల మీదుగా నర్సాపూర్ ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (24.36 కిలోమీటర్లు) ♦ జాతీయ రహదారి–7 కండ్లకోయ జంక్షన్ నుంచి మేడ్చల్, కల్లకల్, మనోహరబాద్ మీదుగా తుప్రమ్ అర్బన్ నోడ్కుఅనుసంధానం (26.25 కిలోమీటర్లు) ♦ పుదుర్ నుంచి రాజ్ బొల్లారం, రవల్కొలె, బస్వాపూర్ మింజిపల్లి మీదుగాశంకారంలోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (24.92 కిలోమీటర్లు) ♦ రాష్ట్ర రహదారి కరీంనగర్ తూముకుంట జంక్షన్ నుంచి శామీర్‌పేట, అలియాబాద్, తుర్కపల్లి మీదుగా ములుగు ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (20.78 కిలోమీటర్లు) ♦ శామీర్‌పేట నుంచి సంపన్బొలె, అనంతారం, మీదుగా అలియాబాద్ఆర్ఆర్ఆర్కు అనుసంధానం(17.84 కిలోమీటర్లు) ♦ నర్సంపల్లి నుంచి అద్రాస్పల్లె లింగాపూర్ నుంచి ముదుచింతపల్లెలోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (12.33 కిలోమీటర్లు) ♦ కీసర దైర జంక్షన్ నుంచి కీసర రంగాపురం నుంచి బొమ్మలరామారంలోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (12.21 కిలోమీటర్లు) ♦ ఘట్కేసర్ జంక్షన్ నుంచి ఔషాపూర్, రంగాపూర్ మీదుగా గుడూర్ గ్రామంలోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం(18.03 కిలోమీటర్లు) ♦ బాచారం జంక్షన్ నుంచి బండ్ల రివర్యాల, జూలూరు నుంచి రవల్పల్లి గ్రామంలోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం(17.36 కిలోమీటర్లు) ♦ అంబర్‌పేట కలన్ జంక్షన్ నుంచి అబ్దుల్లాపూర్, తూరన్పేట మీదుగా మల్కాపూర్ అర్బన్ నోడ్ ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (16.18 కిలోమీటర్లు) ♦ కొహెడ నుంచి అంజిపూర్, పొల్కంపల్లి మీదుగా దండుమైలారంలోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (14.86 కిలోమీటర్లు) ♦ బొంగళూరు జంక్షన్ నుంచి చింతక్పల్లిగూడ, ఇబ్రహీంపట్నం నుంచి అఘాపల్లి ఆర్ఆర్ఆర్కు అనుసంధానం(15.22 కిలోమీటర్లు) ♦ ఆదిభట్ల నుంచి ఫెరోజ్‌గూడ, యెలిమినేడు మీదుగా గుమ్మడివెల్లి ఆర్‌ఆర్‌ఆర్‌కుఅనుసంధానం (16.77 కిలోమీటర్లు) ♦ రవిర్యాల నుంచి లెమూర్ మీదుగారాచ్లూర్ ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (11.74 కిలోమీటర్లు) ♦ మంకాల్ జంక్షన్ నుంచి మోహబత్నగర్, తుమ్మలూరు మీదుగా కొత్తూరు ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (12.86 కిలోమీటర్లు) ♦ గోల్కొండ కలన్ నుంచి నాగిరెడ్డిపలలి, పింజర్ల మీదుగా దూస్కల్ గ్రామసరిహద్దులోని ఆర్ఆర్ఆర్కు అనుసంధానం (19.83 కిలోమీటర్లు) -
ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పేలి.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మహేంద్ర మ్యాక్సీ ట్రక్ వాహనం టైర్ పేలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం ఉదయం కూలీలను మ్యాక్సీ ట్రక్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓఆర్ఆర్పై మ్యాక్సీ ట్రక్ వాహనం రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో ఆ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న కూలీలు రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఒక మహిళ ఘటన స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రామా‘కేర్’ ఏమైనట్టు?
సాక్షి,సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై జరిగే ప్రమాదాల్లో గాయపడే వాహన చోదకులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు తీసుకొస్తామన్న ‘ట్రామాకేర్’ సెంటర్ల ఏర్పాటు హామీలకే పరిమితమైంది. ప్రకటించి ఏడాది గడుస్తున్నా కనీసం ఒక్కటి కూడా ఏర్పాటు చేయకపోవడంతో హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓఆర్ఆర్పై గంటకు 120 కిలోమీటర్ల ఉన్న వేగ పరిమితిని 100కు తగ్గించినా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో గాయపడిన వారికి సత్వర వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు తెరపైకి వచ్చింది. గతేడాది మే ఒకటిన ఓఆర్ఆర్ కండ్లకోయ జంక్షన్ సేవలు ప్రారంభించిన అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణ వైద్యం కోసం ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే, ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా ఏలాంటి ప్రగతి సాధించలేదు. తొలుత పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్ ప్రాంతాల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ పూర్వ కమిషనర్ టి.చిరంజీవులు ప్రతిపాదనలు రూపొందించి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు. అయితే, తర్వాత అధికారులు వాటిని పట్టించుకోవడమే మానేశారు. ఎంతోమంది ప్రమాద బాధితులకు ప్రాణాలు పోసే ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఓఆర్ఆర్ వినియోగదారులు మండిపడుతున్నారు. వాహన ప్రయాణానికి టోల్ వసూలు చేస్తున్న అధికారులు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకరాకపోవమేంటని ప్రశ్నిస్తున్నారు. కార్యరూపం దాల్చని భద్రత కండ్లకోయ జంక్షన్ పూర్తితో గతేడాది మే ఒకటిన సంపూర్ణ 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, అతివేగంతో వెళ్లే సందర్భంలో రోడ్డు ప్రమాదాలు జరగుతుండటంతో పాటు ఓఆర్ఆర్ వినియోగించే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అదే స్థాయిలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని క్షతగాత్రులకు తక్షణ వైద్యం కోసం ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేస్తే చాలా మందిని బతికించవచ్చని మంత్రి కేటీఆర్ సూచించడంతో ఆ దిశగా హెచ్ఎండీఏ పూర్వ కమిషనర్ టి.చిరంజీవులు చర్యలు తీసుకున్నారు. గోల్డెన్ అవర్‌లో క్షతగ్రాతుడికి తక్షణ వైద్యం కోసం తొలుత పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలంటూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖను ఐదు నెలల క్రితం లేఖ రాశారు. దీంతో పాటు ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పది అంబులెన్స్‌ల సంఖ్యను 16కు పెంచాలని తీసుకున్న నిర్ణయం కూడా అమలుకాలేదు. అలాగే హెచ్‌టీఎంఎస్ వ్యవస్థతో ఓఆర్ఆర్ను అనుసంధానం చేయడం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా ఇట్టే తెలిసిపోయి అంబులెన్స్ ఘటనాస్థలికి త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఆచరణ రూపంలోకి రావడం లేదు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ దృష్టి సారించి ట్రామాకేర్ కేంద్రాల ఏర్పాటులో చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇక ‘మహా’ పచ్చదనమే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పచ్చదనంపై దృష్టి సారించింది. నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జన సముదాయాలు, కాలనీలు, నగర పంచాయతీలు, భువనగిరి, గజ్వేల్ రహదారులపై లక్షల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో పాటు చెరువుల చుట్టూ పక్కల కూడా భారీ స్థాయిలో మొక్కలు నాటి పచ్చదనాన్ని తీసుకొచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా ఔటర్ చుట్టూరా చిట్టడవిని తలపించే రీతిలో మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఐదో విడత హరితహారం కార్యక్రమంలో కోటీ 14 లక్షల మొక్కలను నాటడం, పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టాలని అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ ప్రాంతాన్ని ఒక ఉద్యానవనంను తలపించేలా మొక్కలను పెంచాలని సూచించారు. ప్రధానంగా ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజెస్, సర్వీసు రోడ్లు, జాతీయ, రాష్ట్రీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పాటు గతంలో ఓఆర్ఆర్ చుట్టూపక్కల నాటిన మొక్కల ప్రస్తుత పరిస్థితి ఏంటన్న దానిని కూడా ఆరా తీశారు. గతంలో నాటిన మొక్కల సంరక్షణను చూసుకుంటూనే మరిన్ని మొక్కలు నాటాలని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులకు కమిషనర్ అరవింద్‌కుమార్ దిశానిర్దేశనం చేసినట్టు తెలిసింది. కోటీ 14 లక్షల మొక్కలు రెడీ... నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో గ్రీనరీ పెంచేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారంలో ఈ ఏడాది కోటి 14 లక్షల మొక్కలను హెచ్ఎండీఏ అందుబాటులో ఉంచింది. వీటిలో దాదాపు 60 లక్షల మొక్కలను ఎంపీడీవోల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన హెచ్ఎండీఏ అధికారులు దాదాపు 54 లక్షల మొక్కలు మొదట నాటాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్, పార్కులు, రేడియల్ రోడ్లు, చెరువుల, ఉప్పల్ భగాయత్, మూసీ రివర్ ప్రంట్ డెవలప్మెంట్ ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఓఆర్ఆర్ వెంట వాహన ప్రయాణాన్ని చల్లదనం చేయడంతో పాటు అడవిని తలపించేలా మొక్కలు నాటేందుకు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు సిద్ధమవుతున్నారు. గతేడాది ఓఆర్ఆర్ వెంట పెట్టిన మొక్కల్లో దాదాపు 90 శాతం మేర మొక్కలను సంరక్షించగలిగామని తెలిపారు. మరో మూడేళ్లలో గ్రీనరీ ఫలితాలు కనిపిస్తాయన్నారు. గతేడాది 95 లక్షల 30 వేలు మొక్కలు హెచ్ఎండీఏ పంపిణీ చేయడంతో పాటు నాటితే ఈసారి ఆ సంఖ్య కోటీ 14 లక్షలకు పెంచామని తెలిపారు. దాదాపు 163 రకాల మొక్కలను హెచ్ఎండీఏ పరిధిలోని 18 నర్సరీలో పెంచామని తెలిపారు. బ్లాక్ ప్లాంటేషన్... హెచ్ఎండీఏ ఆధ్వరంలో ప్రత్యేకంగా 17 ప్రాంతాలలో 25 చోట్ల బ్లాక్ ప్లాంటేషన్ చేపడుతున్నారు. జన సముదాయాలకు, కాలనీలకు దగ్గరలో చేపట్టనున్న బ్లాక్ ప్లాంటేషన్లలో నడక రహదారులు, చిన్నారుల పార్కులు, సైక్లింగ్ పాత్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే 12 నగర పంచాయితీలలో కూడా పచ్చదనాన్ని పెంచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. భువనగిరి, గజ్వేల్ రహదారిపై సెంట్రల్ మీడియన్లలో(రోడ్డు మధ్యలో ఉన్న ఖాళీస్థలం) కూడా గతంలోలాగానే మొక్కలు పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే కీసర, ఘట్కేసర్, శంషాబాద్, పెద్దఅంబర్ పేట, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేప్ చేసి పచ్చదనాన్ని కళ్లముందు కనపడేలా చేయనున్నారు. అలాగే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం ప్రైవేటు లే–అవుట్ల అనుమతులు మంజూరు చేసేటప్పుడు కూడా పచ్చదనాన్ని పెంపొందించటానికి తప్పనిసరిగా మొక్కల పెంపకం చేపట్టేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆ మార్గంలో జెట్ స్పీడ్..
సాక్షి, హైదరాబాద్ :ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో రోడ్డు ప్రమాదాలు జరిగితే చాలు... అతి వేగమే కారణమంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ వేగానికి కళ్లెం వేసే చర్యలను మాత్రం తీసుకురావడం లేదు. ‘ఎక్స్‌ప్రెస్ వేపై డైరెక్షనల్ మార్కింగ్ స్పష్టంగా కనపడాలి. ఇంటర్ చేంజ్‌లు, ర్యాంప్‌లు, మీడియం లేన్, సోల్డర్ లేన్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాహనాల వేగానికి కళ్లెం వేయవచ్చ’ని న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని అమలు చేయడంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఓఆర్ఆర్ విభాగ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అత్యధికంగా ప్రమాదాలు జరిగే 29 ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని అధ్యయనం చేసి, నిర్వహణా లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చేసిన సూచనలను గాలికొదిలేశారు. ఓఆర్ఆర్ మార్గంలో రోజుకు లక్షా 40వేల వాహనాలు ప్రయాణిస్తున్నా భద్రత విషయంలో అధికారుల అలసత్వ ధోరణిపై విమర్శలు వస్తున్నాయి. వేగ నియంత్రణపై శ్రద్ధ ఏదీ?.. కార్లు, లైట్ కమర్షియల్ వెహికల్స్, హెవీ ట్రక్కులు సీఆర్ఆర్ఐ అధ్యయనం చేసిన 29 ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో వెళుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కార్లు గంటకు 108 నుంచి 127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్లుగా సీఆర్ఆర్ఐ రిపోర్టులో పేర్కొంది. 30 నుంచి 50 శాతం కార్లు, 7 శాతం లైట్ కమర్షియల్ వెహికల్స్, 1 శాతం భారీ ట్రక్కులు అతి వేగంతో వెళుతున్నట్లుగా గుర్తించారు. ఈ పరిస్థితితో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లో కర్వ్‌లు, గ్రాండెంట్ సెక్షన్లు, ట్రాన్స్వర్స్ బార్ మార్కింగ్, మీడియన్ డెలినియోటర్స్‌తో కలిపి మీడియన్ మార్క్‌లు, స్పీడ్ అరెస్టర్స్ ఏర్పాటు చేయడంతో వేగాన్ని నియం త్రించవచ్చని సీఆర్ఆర్ఐ ప్రతిపాదించింది. అయితే వీటిని ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో ఓఆర్ఆర్ విభాగ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ‘టిపికల్’ ప్రమాదాలపై నిర్లక్ష్యం... చాలా వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతూ అదుపుతప్పి స్తంభాలను ఢీకొట్టి అవతల ఉన్న సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఓఆర్ఆర్ అంతటా మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్ సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలని, ఇవన్నీ తక్కువ ఎత్తు ఉండటంతో వాహనాలు వాటిని ఢీకొని అవతలవైపు ఎగిరిపడుతున్నాయని సీఆర్ఆర్ఐ పేర్కొంది. దీని నియంత్రణకు ‘టిపికల్ డబుల్ మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్స్’ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసినా ఆ పనుల్లో పురోగతి మాత్రం కనపడటం లేదు. అలాగే ఎక్స్‌ప్రెస్ వేలో డైరెక్షనల్ మార్కింగ్‌లు వాహనదారులకు స్పష్టంగా కనబడేలా చూడాలని చెప్పగా, ఆ మేరకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు. ‘రాత్రి సమయాల్లో వాహనదారుల భద్రత కోసం ఎడ్జ్ స్టడ్స్, లేన్ డివైడర్ స్టడ్స్ అవసరముంది. ఎక్స్‌ప్రెస్ వే కుడివైపు లేన్, మీడియన్ సైడ్‌ను తెలుపు రంగుతో మార్కింగ్ చేయాలి. అలాగే కుడివైపున రోడ్డు స్టడ్స్‌ను ఎరుపు రంగులో, మీడియన్ సైడ్ లేన్ పసుపు రంగులో మార్క్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ వే హైస్పీడ్ వయోలేషన్స్ కుడివైపు, మీడియం లేన్లు రెడ్ కలర్ స్టడ్స్‌ను ఉపయోగించాలి. ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేసే ర్యాంప్‌ల్లో చెవ్రాన మార్కింగ్ చేయడంతో పాటు బొల్లార్డ్స్‌ను ఉపయోగించాలి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో ‘నో స్టాపింగ్, నో పార్కింగ్, నో ఓవర్ టేకింగ్’సూచన బోర్డులు ఏర్పాటు చేయాలి. ఎగ్జిట్, ఎంట్రీ ప్రాంతాల వద్ద 8 నుంచి 10 మిల్లీమీటర్లు మందంగా పెయింట్‌ను రోడ్డు స్టడ్స్‌కు వేయాలి. వేగాన్ని నియంత్రించేందుకు బొల్లార్డ్స్ కూడా ఏర్పాటుచేయాలి’అని సీఆర్ఆర్ఐ చెప్పింది. ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి వాహనదారుల భద్రత కోసం ప్రత్యేక అధ్యయనం చేయించి మరీ తీసుకున్న సూచనలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా కొంత మేర రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మార్గంలో జెట్ స్పీడ్.. ఒక్క శంషాబాద్ నుంచి గచ్చిబౌలి మార్గంలో కార్లు 139 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఓఆర్ఆర్పై 69 కి.మీ., 137 కి.మీ., 88 కి.మీ. వద్ద వాహనాలు అతివేగంతో వెళ్తున్నట్లుగా గుర్తించారు. శామీర్‌పేట నుంచి కీసర మార్గంలో లియోనియా రిసార్ట్ సమీప ప్రాంతంలో కార్లు వాయు వేగంతో వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఇక్కడ కార్లు 180 నుంచి 208 కిలోమీటర్ల వేగంతో, లైట్ కమర్షియల్ వెహికల్స్ 111 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లుగా గుర్తించారు. అతి వేగంతో వాహనం నడిపే డ్రైవర్లు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. ‘ఎక్స్ట్రీమ్ లెఫ్ట్‌లో ఉన్న రెండు లేన్లపై లారీలు వెళ్లడటం ఉత్తమం. ఎక్స్ట్రీమ్ రైట్ మీడియన్‌కు పక్కన ఉండే లేన్‌లో అధిక వేగంతో గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు వెళ్లాలి. మూడో లేన్లలో తక్కువ వేగంతో అంటే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు వెళ్లేలా చూడాల’ని సీఆర్ఆర్ఐ చేసిన ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ..
శామీర్‌పేట్: ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన బి.నరేందర్(46), అతని భార్య నాగరాణి(42), కుమారుడు వినయ్, దీపికతో కలిసి ఇన్నోవా కారులో చౌటుప్పల్‌లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా శామీర్‌పేట ఓర్ఆర్ఆర్పై బ్రిడ్జీపై కారు డివైడర్‌ను వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా నరేందర్, నాగమణి మృతిచెందారు. వారి కుమారుడు వినయ్, కుమార్తె దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శామీర్‌పేట పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నవీన్‌రెడ్డి తెలిపారు. -
తాగి నడిపితే ఇక అంతే..
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల గణాంకాలు తీసుకుంటే దాదాపు 700 వరకు డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒకవైపు ఎన్నికల బందోబస్తు చేస్తూనే మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి మందుబాబుల ఆట కట్టించారు. అయితే ఓఆర్ఆర్లో నెలకు ఐదు నుంచి పదిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని ఇరు కమిషనరేట్ల అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి ఓఆర్ఆర్పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా పక్కా వ్యూహన్ని అమలుచేయనున్నారు. ప్రస్తుతం రెండు కమిషనరేట్ల పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో కార్టన్‌సెర్చ్ నిర్వహిస్తూ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ నేర నియంత్రణ చేస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్ఆర్పై డ్రంకన్ డ్రై వ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 158 కిలోమీటర్ల పరధిలో ని ఓఆర్‌ఆర్‌పైనా గత మూడేళ్లలో 358 రోడ్డు ప్రమాదాలు జరిగి 110మంది మృతిచెందారు. వందలమంది క్షతగాత్రులయ్యారు. వేగం తగ్గించినా మారని తీరు గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ జోష్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. ఈ అతి వేగం ఉన్న సమయంలో సేఫ్టీ మేజర్స్ కూడా పనిచేయడం లేదు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనచోదకులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. అతివేగం వల్ల జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదరుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగానికి చెక్ పెట్టడానికి స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినా వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. ఈ అతివేగానికి కారణం కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి వాహనం నడపడమేనని పోలీసుల విచారణలో తేలింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గత మూడునెలల్లో 700 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదుచేశారు. సైబరాబాద్‌లో 642 డ్రంకన్ డ్రైవ్ కేసులు, రాచకొండలో 58 కేసుల వరకు నమోదుచేశారు. అయితే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ఎన్నికల బందోబస్తు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల బందోబస్తుతో అనుకున్న స్థాయిలో ఓఆర్ఆర్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టలేదని చెబుతున్నారు. అదే సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గిందని అంటున్నారు -
ఔటర్‌పై జెట్‌స్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: ‘2018 అక్టోబర్ 12 ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పెద్దఅంబర్‌పేట నుంచి శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో ఓ కారు వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పాయింట్ వద్ద గంటకు 229 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్టుగా స్పీడ్ లేజర్ గన్ కెమెరాలకు చిక్కింది.’‘2019 మే రెండో తేదీన మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి పెద్దఅంబర్‌పేట మార్గంలో ఓ కారు అధిక వేగంతో దూసుకెళుతూ శంషాబాద్ ట్రాఫిక్ ఠాణా పరిధిలోకి వచ్చే హర్షగూడ ప్రాంతంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్టుగా స్పీడ్ లెజర్ గన్ కెమెరాకు చిక్కింది’. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై వాహనాలు వాయు వేగంతో దూసుకెళుతున్నాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్పైకి వాహనం ఎక్కితే చాలు కంటికి కనిపించని వేగంతో దూసుకెళుతుండటంతో తోటి వాహనదారులు హడలెత్తిపోతున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నిర్ణయించినా వాహనదారులు మాత్రం అంతకు రెట్టింపు వేగంతో దూసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఈ ఏడాది నాలుగు నెలల్లో సైబరాబాద్ పరిధిలోని ఓఆర్ఆర్లో 1,26,135, రాచకొండ పరిధిలోని ఓఆర్ఆర్లో 1,39,201 ఈ–చలాన్ కేసులు నమోదవడం వాహనదారుల వాయువేగానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇతర రహదారులతో పోలిస్తే ఓఆర్‌ఆర్‌పైనా అత్యధికంగా హైస్పీడ్ ఉల్లంఘనలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉల్లంఘనల్లో కార్లదే హవా... ఇరు కమిషనరేట్ల పరిధిలోని 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో రోజుకు లక్షన్నర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో పాటు నగరానికి చెందిన వాహనాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కొన్ని సందర్భాల్లో టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇదే క్రమంలో ఓఆర్ఆర్ ఎక్కితే చాలా వరకు వాహనాలు తమ గమ్యస్థానికి తొందరగా వెళ్లేందుకు వాయు వేగంతో తాపత్రయపడుతున్నారు. అయితే హెవీ వెహికల్స్ కంటే ఎక్కువగా కార్లే ఉల్లంఘనల్లో మొదటిస్థానంలో ఉన్నాయి. ఓఆర్ఆర్పై జరుగుతున్న ప్రమాదాల్లోనూ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. అత్యధికంగా పెద్దఅంబర్‌పేట–శంషాబాద్ మార్గంతో పాటు శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో వాహనాలు ఓవర్‌స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. నాలుగు నెలలకు రూ.27 కోట్ల పైనే జరిమానా అధిక వేగంతో వెళుతున్న వాహనాలు స్పీడ్ లేజర్ గన్ కెమెరాలకు చిక్కుతున్నా వేగం మాత్రం మారడం లేదు. సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇంటికి చలాన్లు పంపుతున్నారు. ఇలా నాలుగునెలల్లో రూ.27 కోట్ల జరిమానాతో చలాన్లు జారీ చేశారు. అయినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే గతంతో పోల్చుకుంటే ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అధికారులు చెబుతున్నా మాట వాస్తవమే అయినా ఒకవేళ ప్రమాదం జరిగితే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు మితీమిరిన వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. అధిక వేగం వద్దు...ప్రాణం ముద్దు అని ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో హెచ్ఎండీఏ అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనదారుల్లో మాత్రం ఆశించినంత మార్పు కనిపించడం లేదంటున్నారు. మూడేళ్లలో రూ.122 కోట్లు ఇరు కమిషనరేట్ల పరిధిలోని ఓఆర్ఆర్లో 2017, 2018, 2019 సంవత్సరాల్లో అధిక వేగంతో దూసుకెళుతున్న వాహనాలకు 10,05,196 ఈ–చలాన్లు జారీ చేశారు. ఆయా వాహనాలకు వేసిన జరిమానా ఏకంగా రూ.122 కోట్లపైనే ఉందంటే వాహనదారుల వేగం ఏ రేంజ్లో ఉందో అర్ధమవుతోంది. అలాగే ఈ సమయంలో ఓఆర్‌ఆర్‌పైనా 358 రోడ్డు ప్రమాదాలు జరిగితే 110 మంది మృత్యువాత పడ్డారు. వందలా మంది క్షతగాత్రులయ్యారు. అందుకే ఓవర్ స్పీడ్ తగ్గిస్తే వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని పోలీసులు సూచిస్తున్నారు. -
ఎప్పుడైనా..ఎక్కడైనా..! తాగి ఎక్కితే దొరుకుడే..!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఏ సమయంలో ఎప్పుడైనా ఓఆర్ఆర్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్లో గత రెండువారాల నుంచి డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం తాగి వాహనం నడుపుతున్న 154 మంది వాహన చోదకులపై కేసులు నమోదు చేశారు. ఇదే విధానాన్ని ఓఆర్ఆర్లో ప్రతిరోజూ సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మద్యం తాగి ఓఆర్ఆర్పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా చతుర్ముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్ఆర్పై డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెడుతున్నారు. 156.9 కిలోమీటర్ల పరధిలోని ఓఆర్ఆర్లో గతేడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందగా, 66 మంది గాయపడ్డారు. వేగం తగ్గించినా మారని తీరు... గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిసూ ఏడాదిన్నర క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. అతి వేగం కారణంగా వాహనాల్లో సేఫ్టీ మేజర్స్ కూడా పనిచేయడం లేదు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రాణ నష్టానికి కారణమవుతోంది. ఆయా రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదురుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగాన్ని నియంత్రించేందుకు స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి వాహనం నడపడం కూడా వేగానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. అటు స్లో స్పీడ్ లేజర్ గన్ కెమరాలు, ఇటు డ్రంకన్ డ్రై వ్ తనిఖీలతో ఓఆర్ఆర్ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చాలనుకుంటున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. రోజువారీగా ఓఆర్ఆర్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి మందుబాబులు ఆటకట్టించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తామన్నారు. -
ఓఆర్ఆర్ అండర్ ‘కంట్రోల్’
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై మీరు వెళ్తున్న మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే హెచ్ఎండీఏ, పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలనుకుంటే ఒక్కో సమయంలో సెల్ సిగ్నల్ రాదు. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రతి కిలోమీటర్‌కు ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. ♦ మీరు ప్రయాణిస్తున్న రహదారిని మొత్తం పొగమంచు కప్పేస్తే.. ఆ సమయంలో మీ వాహన లైట్లు, ఇండికేటర్స్ వేసుకొని 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి. వాహన చోదకులను జాగృతం చేసే ఇలాంటి అంశాలు ఆ మార్గంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై ప్రొజెక్ట్ అవుతుంటాయి. ♦ సుదూర ప్రాంతం నుంచి సిటీకి వస్తున్న సమయంలో చాలామంది డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజాల వద్ద డ్రైవర్ల ముఖాలపై వాటర్ స్ప్రే చేసే పద్ధతిని పరిచయం చేయనున్నారు. ఇలాంటి మరెన్నో ఆధునిక ఆలోచనలతో ఓఆర్ఆర్పై జర్నీ సాఫీగా సాగేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ఇందుకు నానక్‌రామ్‌గూడలో నిర్మిస్తున్న ట్రాఫిక్ కమాండ్ సెంటర్ ద్వారా ఓఆర్ఆర్పై జరిగే ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలించనుంది. వాహన చోదకుల భద్రతే ముఖ్యంగా హెచ్ఎండీఏ ముందుకెళ్తోంది. హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్‌టీఎంఎస్)లో భాగంగా ఈ ఏడాది మే నుంచి ట్రాఫిక్ కమాండ్ సెంటర్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. గతేడాది జూన్‌లోనే ఆరంభం కావల్సి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. స్క్రీన్ సైన్ బోర్డులు... 156.9 కిలోమీటర్లున్న ఓఆర్ఆర్లో దాదాపు 40కి పైగా విభిన్న ఆకృతుల్లో స్క్రీన్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మెటాలాజికల్ సెన్సార్స్, పొగమంచు, వెలుతురు మందగించడం, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, భారీ వర్షం కురిసినప్పుడు... ఇలా ఆయా సందర్భాల్లో వాహన చోదకులను అప్రమత్తం చేసేందుకు స్క్రీన్ సైన్ బోర్డులపై సమాచారాన్ని డిస్ప్లే చేస్తారు. ఉదాహరణకు భారీ వర్షం కురిసినప్పుడు... ‘శంషాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం మంచిది. వాహనాల లైట్లు ఆన్ చేసుకొని ముందుకెళ్లండి’ అనే సమాచారాన్ని ముందు ప్రాంతంలోని స్క్రీన్ సైన్ బోర్డులో డిస్ప్లే చేసి వాహన చోదకులను అప్రమత్తం చేస్తారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ క్లియర్‌గా ఉండడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. అనుక్షణం అప్రమత్తం... నానక్‌రామ్‌గూడలో అందుబాటులోకి రానున్న ట్రాఫిక్ కమాండ్ సెంటర్ ద్వారా ఓఆర్ఆర్లో జరిగే ప్రతి దృశ్యాన్ని పర్యవేక్షించనున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించిన ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద దాదాపు 50కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక వాహనం రామ్ దాటి మరొక వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదాలు జరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరుగుతుండటంతో ఈ ప్రాంతాల్లో నిఘా నేత్రాలను అమరుస్తున్నారు. అలాగే టోల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో భాగంగా పనిచేస్తున్న టోల్ ప్లాజాల వద్ద కొన్ని వాహనాలకు టోల్ వసూలు చేసి, మరికొన్ని వాహనాలను డబ్బులు తీసుకొకుండానే వదిలేయడం జరుగుతోంది. కొంతమంది వాహనదారుల వద్ద గంపగుత్తగా నెల రోజుల్లో ఒక్కసారి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు టోల్ ప్లాజాల వద్ద 180 సీసీ టీవీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. నిరంతర సేవలు... నానక్‌రామ్‌గూడలో ట్రాఫిక్ కమాండ్ సెంటర్లోని సిబ్బంది 7/24 అందుబాటులో ఉంటారు. ఓఆర్ఆర్ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. కిలోమీటర్‌కు చొప్పున ఏర్పాటు చేసే ఎమర్జెన్సీ కాల్స్ బాక్స్ ద్వారా వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకొని వారికి త్వరితగతిన సహాయం అందేలా చూస్తారు. రోడ్డు ప్రమాదాలైతే వెంటనే అక్కడికి అంబులెన్స్‌ను పంపిస్తారు. ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించి క్లియర్ అయ్యేలా చూస్తారు. ఆ సమాచారాన్ని స్క్రీన్ సైన్‌బోర్డులో డిస్ప్లే చేసి మిగతా వాహన చోదకులను అప్రమత్తం చేస్తారు. వాటర్ స్ప్రే... చాలా వరకు రోడ్డు ప్రమాదాలు డ్రైవర్లు అతివేగంతో వెళ్లే సమయాల్లో, కునుకు తీసిన సందర్భాల్లో జరుగుతున్నాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తు రాకుండా ఉండేందుకు టోల్‌బూత్‌ల వద్ద సిబ్బంది డ్రైవర్ల ముఖాలపై వాటర్ స్ప్రే చేయనున్నారు. ఇలా చేయడం వల్ల డ్రైవర్ల నిద్రమత్తు వదిలి ఓఆర్ఆర్ మార్గంలో వెళ్లిన సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. అలాగే వాహనచోదకుల కోసం రెస్ట్‌రూమ్స్, టాయ్‌లెట్స్, డ్రింకింగ్ వాటర్‌ను కల్పించేందుకు పెద్ద అంబర్‌పేటలో ప్రయోగాత్మకంగా ‘వే సైడ్ ఎమినిటీస్’ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు హెచ్ఎం డీఏ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత దీన్ని పది ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఎల్ఈడీ వెలుగులు... రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమని భావిస్తున్న హెచ్ఎండీఏ అధికారులు... తొలివిడతగా 24.2 కిలోమీటర్ల మేర గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ఓఆర్ఆర్తో పాటు సర్వీసెస్, ఇంటర్ సర్వీసెస్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు. వాహన చోదకుల భద్రతలో భాగంగా మెయిన్ క్యారేజ్‌వేలో 1,858 బల్బులు, రామ్స్ వద్ద 180 బల్బులు, సర్వీసెస్ రోడ్డులో 2,312 బల్బులు, హేవై ఇంటర్ఛేంజ్ల్లో 178 బల్బులు, వెహికల్ అండర్ పాస్, పాదచారుల కోసం 228 ట్యూబ్లైట్లను హెచ్ఎండీఏ ఏర్పాటు చేసింది. భద్రతకు చర్యలు... హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్‌టీఎంఎస్)తో వాహన చోదకుల భద్రత కోసం సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఓఆర్ఆర్పై అందరూ సాఫీగా ప్రయాణం చేసేలా విదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా స్క్రీన్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నాం. కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. టోల్‌ప్లాజా, ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి నానక్‌రామ్‌గూడలోని ట్రాఫిక్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానం చేస్తాం. హెచ్‌టీఎంఎస్ సేవలు మే నుంచి అందుబాటులోకి వస్తాయి. – ఇమామ్, ఓఆర్ఆర్ సీజీఎం -
ఓఆర్ఆర్..‘సర్వీసు’బేజార్!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారుతోంది. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల పనులు చేపట్టడంలో అధికారులు గత కొన్నేళ్లుగా ఉదాసీనత చూపుతున్నారు. ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ సర్వీసు రోడ్ల పనులను పక్కనబెట్టేశారు. అక్కడ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా కావాలనే కాలయాపన చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. ఫలితంగా రెం డు, మూడు కిలోమీటర్లు అదనంగా తిరుగుతూ వెళ్లాల్సి వస్తోందని ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు గ గ్గోలు పెడుతున్నారు. రైల్వే ట్రాక్ ఉన్న ప్రాంతంలో వం తెనలు నిర్మిస్తే..టోల్ కలెక్షన్ తగ్గిపోతుందనే ఇలా నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2012 లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్ల నిర్మాణాలన్నీ పూర్తి కావల్సి ఉన్నా ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై వా హనదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈదులనాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ సమీపంలోని ఓఆర్ఆర్ను తాకుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న అసంపూర్తి సర్వీసు రోడ్లు ముప్పుతిప్పలు పెడుతున్నా యి. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ సూత్రప్రాయంగా అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రా రంభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం పూర్వ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేసినా అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. ఘట్కేసర్ గౌడవెళ్లి వద్ద... ఘట్కేసర్ మండలంలోని గౌడవెళ్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో వాహనదారులు 3.5 కిలోమీటర్ల అదనపు ప్రయాణం చేస్తున్నారు. గౌడవెళ్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్–నాందేడ్ రైల్ మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెళ్ళి స్టేషన్ సమీపంలో నుండి ఓఆర్ఆర్ రోడ్డు వెళుతుంది. సర్వీసు రోడ్డు మాత్రం నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘట్కేసర్ వైపు నుండి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుండి వచ్చే రోడ్డులో గౌడవెళ్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో సర్వీస్ రోడ్డులో వచ్చే వాహనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుండి గౌడవెళ్లి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు నుండి వెళ్లాల్సి వస్తుంది. పటాన్చెరు వైపు నుండి వాహనదారుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. సుతారిగూడ టోల్ ప్లాజానుండి అసంపూర్తి గా ఉన్న సర్వీసు రోడ్డు రింగురోడ్డుకు ఇరువైపులా కనీసం పనులు మొదలు పెట్టలేదు. ఈదులనాగులపల్లిలో... రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదూలనాగులపల్లి, వెలమల శివారుల్లో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అంసపూర్తిగా మిగిలింది. మధ్యలో సర్వీసు రోడ్డు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసు రోడ్డు లేకపోవడంతో తాత్కాలికంగా మట్టితో రాంపో రోడ్డు వేశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు లేకపోవడంతో నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ దూరం తిరిగి రావల్సి వస్తోంది. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులకు చీమకుట్టినట్టుగా కూడా లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మేడ్చల్‌లో... కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామంలోకి చేరుకొని ఘట్కేసర్ బైపాస్ రోడ్డు కూడలి దాటాలి. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా సుమారు మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించవలసి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వైపు వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ వద్ద బ్రిడ్జి నిర్మిస్తే వాహనదారులు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు. శంషాబాద్‌లో... ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు మార్గంలో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో వాహనదారులు తికమకకు గురై అసంపూర్తిగా ఉన్న సర్వీసు మార్గంలో వెళ్లి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వాహనదారులు వెళ్లాల్సి వస్తుంది. -
రద్దీ పెరిగితే.. ‘టోల్’ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: నిత్యం లక్షన్నరకుపైగా వాహనాల రాకపోకలు సాగించే ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) మార్గంలో ట్రాఫిక్ వెతలు లేని సాఫీ ప్రయాణంపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ఇప్పటికే ఫాస్ట్‌టాగ్ సేవలను అమలు చేస్తున్న అధికారులు మరో కొత్త విధానాన్ని ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఒక లేన్‌పై ఏ సమయంలోనైనా 20కి మించి వాహనాలుంటే టోల్ రుసుము తీసుకోకుండానే క్లియర్ చేయాలని శుక్రవారం నుంచి టోల్ రుసుము వసూలు బాధ్యతలు చేపట్టనున్న ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది. దీంతోపాటు నానక్‌రామ్‌గూడ, శంషాబాద్ టోల్ ప్లాజాలోని లేన్ల సంఖ్యను పెంచి వాహనదారుల ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండే చర్యలను చేపట్టింది. అలాగే టోల్‌ప్లాజాల పరిసరాల పరిశుభ్రత, భద్రతా చర్యలపై దృష్టి సారించింది. రోజుకు లక్షన్నర వాహనాల రాకపోకలు... హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలతోపాటు విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు నగరంలోకి వచ్చేందుకు ఓఆర్ఆర్ మార్గాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ అందుబాటులోకి రావడంతో వాహన చోదకుల ప్రయాణం మరింత సులభమైందని అంటున్నారు. ఎనిమిది లేన్ల ఓఆర్ఆర్లో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. రెండు లేన్లతో సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేశారు. అయితే ఓఆర్ఆర్ మార్గంలో ముఖ్యంగా నానక్‌రామ్‌గూడ, శంషాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కువగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ టోల్‌ప్లాజాలో లేన్ల సంఖ్యను పెంచాలని ఓఆర్ఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాత సంస్థ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వాహనదారులకు జారీ చేసిన నెలవారీ పాసులను సమర్పించి కొత్త ఏజెన్సీ ఈగల్ ఇన్ఫ్రా ద్వారా జారీ చేసే పాసులను తీసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఈజీ జర్నీ కోసం ఫాస్ట్‌టాగ్ సేవలు వినియోగించుకునేలా వాహనదారుల్లో అవగాహన కలిగిస్తామని ఓఆర్ఆర్ సీజీఎం ఇమామ్ తెలిపారు. -
రియల్.. డబుల్
సాక్షి, సిటీబ్యూరో: మహానగర పరిధిలోని శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా నిర్మాణాలకు ఈ ప్రాంతాలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అల్ప, మధ్య ఆదాయ వర్గాలు అధికంగా కొనుగోలు చేసే గృహ సముదాయాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నిర్మాణరంగ సంస్థలు గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో ప్రాజెక్టులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. గ్రేటర్లో మార్కెట్ ట్రెండ్స్‌పై ‘అనరాక్ ప్రాపర్టీస్’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. ముఖ్యంగా కొండాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, షేక్‌పేట్, నార్సింగి, పుప్పాలగూడ, బాచుపల్లి, కొంపల్లి, బొల్లారం, ఎల్బీనగర్, హయత్‌నగర్, యాంజాల్ తదితర ప్రాంతాల్లో నూతన నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో రూ.40–80 లక్షల సెగ్మెంట్లో నివాస గృహాలతో పాటు సువిశాలమైన, విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లు ఇటీవల భారీగా పెరిగాయని రియల్టీ రంగ వర్గాలు తెలిపాయి. ఇక విలాసవంతమైన(లగ్జరీ) ఇళ్ల విభాగంలో తెల్లాపూర్, కొల్లూర్, గోపనపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల్లో బుకింగ్స్ అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఏటికేడు పెరుగుదల... నగర శివార్లలో 2017లో దాదాపు 6వేల ప్రాజెక్టులను విభిన్న నిర్మాణ రంగ సంస్థలు ప్రారంభించాయి. ఇక 2018లో 7వేల ప్రాజెక్టులు పూర్తి కాగా... ఈ ఏడాదిలో దాదాపు 15వేల నూతన ప్రాజెక్టులు సాకారమయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫార్మా, బల్క్‌డ్రగ్ పరిశ్రమలకు నిలయంగా మారిన గ్రేటర్లో... ఇటీవలి కాలంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి భారీగా వలస వస్తున్నారు. వీరంతా నగర శివార్లలో వారి స్థోమతను బట్టి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తుండడం విశేషం. ధరలు ఇలా... శివార్లలో ఈసారి అపర్ణ, రాజపుష్ప, వాసవి, బ్రిగేడ్, సుమధుర తదితర నిర్మాణరంగ సంస్థలు నూతన ప్రాజెక్టులు చేపట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇవి పూర్తికానున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అల్ప, మధ్య ఆదాయ వర్గాలు, వేతన జీవులు ప్రధానంగా రూ.40–80 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఎగువ మధ్యతరగతి వర్గం కొనుగోలు చేసే ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల ధరలు చదరపు అడుగుకు రూ.4,000–6,500 వరకు ఉన్నాయి. ఇక సంపన్నశ్రేణి కొనుగోలు చేసే సువిశాలమైన లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు చదరపు అడుగుకు సుమారు రూ.7,500–13,000 వరకు పలుకుతున్నాయి. -
ఔటర్‌పై కారు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
పటాన్చెరు టౌన్: కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. అమీన్పూర్ సీఐ ప్రభాకర్, అసిస్టెంట్ జిల్లా ఫైర్ అధికారి సుదర్శన్‌రెడ్డి కథనం ప్రకారం..బుధవారం ఉద యం 11.10 గంటల సమయంలో మేడ్చల్ నుంచి ముత్తంగి వైపు వెళ్తున్న కారు (టీఎస్ 07 జీఎం 4666) సుల్తాన్పూర్ సమీపంలోకి రాగానే మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు కారు డోర్ తీసేం దుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. ఇంజన్ నుంచి మంటలు ఎగిసిపడి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. అప్పటికే కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. కారు మియాపూర్, జేపీనగర్ క్రాస్ రోడ్డుకు చెందిన గంట శ్రీదేవి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని హైదరాబాద్ బోరంపేట్కు చెందిన గంటా వెంకటగిరి (48)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎరుకతో ఉంటే మేలు! హైదరాబాద్ శివార్లలో తరచూ కార్లు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రాణనష్టం లేకపోయినా ఆస్తినష్టం మాత్రం భారీగా ఉంటోంది. ఇలాంటి అగ్నిప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించొచ్చని సూచిస్తున్నారు. వైర్లపై కన్నేయాలి కార్లలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు 70 శాతం వాటి లో వినియోగిస్తున్న వైర్లే కారణమవుతున్నాయి. వీటికి అతుకులు ఉండటం, నిర్వహణ మరిచిపోవడంతో నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదాలకు కారణమవుతోంది. బ్యాట రీకి ఉండే వైర్ల ద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. ఇటీవల కాలంలో కార్లలో తక్కువ మందం ఉన్న వైర్లను వినియోగించడం ప్రమాదాలకు కారణమవుతోంది. బ్యాటరీలను మరవొద్దు కార్లలోని బ్యాటరీలను యజమానులు సరిగ్గా పట్టించుకోకపోవడం కూడా అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. బ్యాటరీల్లో హైడ్రోజన్, ఎలక్ట్రోలైట్ సంబంధిత పదార్థాలు ఉంటాయి. ఇవి తరచూ బయటికొచ్చి బ్యాటరీలపై పేరుకుపోతాయి. దీంతో విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో పాటు నిప్పు రవ్వలు చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంజన్‌ను పరిశీలించాలి.. కార్లలో ఉండేది ఇన్నర్ కంప్రెషన్ ఇంజన్. అంటే దాని లోపలి ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ మండటంతో వెలువడే శక్తి ద్వారా అది పని చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉండే సీలింగ్స్, గ్యాస్ కిట్స్‌ను సరిగ్గా బిగించుకోవాలి. వీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. లేకపోతే ఇంధనం లీక్ కావడం, నిప్పు రవ్వలు చెలరేగి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. కూలెంట్ సైతం కీలకమే ఇటీవల వస్తున్న కార్లకు రేడియేటర్లు ఉండట్లేదు. ఇవి ఉంటే వాటిలో నీరు నిండుకోగానే పొగలు వచ్చి కార్లు ఆగిపోయేవి. ఇప్పుడు దీనికి బదులు కూలెంట్ ఆయిల్ వినియోగిస్తున్నారు. ఇది ఇంజన్ చుట్టూ తిరిగి దాన్ని చల్ల్లబరుస్తుంది. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే మంటలు వచ్చే ప్రమాదముంది. కూలెంట్ ఆయిల్ నాణ్యత కోల్పోయినప్పుడు మార్చకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గ్యాస్ కిట్లతోనూ కష్టమే పెట్రోల్, డీజిల్‌కు బదులు సీఎన్జీ, ఆటో ఎల్పీజీలతో నడిచే వాహనాలొచ్చాయి. తక్కువ ఖర్చనే ఉద్దేశంతో కొన్ని పాత వాహనాలనూ కన్వర్షన్ చేయడం ద్వారా గ్యాస్‌ను ఇంధనంగా వాడుతున్నారు. ఈ గ్యాస్ కిట్లతో పాటు వీటిని వాడే పైప్ కూడా నాణ్యమైన, ఐఎస్ఐ మార్క్ ఉన్నవే వాడాలి. ఏమాత్రం నాణ్యతా లోపమున్నా ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. -
దగ్దమైన కారు,ఒకరు సజీవ దహనం
-
ఇంటి దొంగకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి పుట్టి ముంచుతోన్న ఇంటి దొంగల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుండడం సంచలనం సృష్టిస్తోంది. వాటర్‌బోర్డుకు రూ. కోట్లలో నష్టం చేసిన ఓ క్షేత్రస్థాయి అధికారి..తనకున్న అధికారాలతో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 1.97 లక్షల రూపాయల నీటిబిల్లు మాఫీ చేసి వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బోర్డు ఉన్నతాధికారులు సదరు అధికారిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జలమండలిలో మాదాపూర్ సెక్షన్ పరిధిలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న కె.రవీందర్ 2015–18 మధ్యకాలంలో తనకున్న అధికారాలతో 381 నల్లా కనెక్షన్లకు సంబంధించిన నీటిబిల్లు రూ.1,96,71,398 బకాయిలను మాఫీచేసి సదరు వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకొని బోర్డుకు భారీగా నష్టం చేసినట్లు బోర్డు విజిలెన్స్ బృందం పరిశీలనలో తేలింది. దీంతో ఆయనను బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ సోమవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అతనిపై బోర్డు నిబంధనలు, సర్వీసు మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తక్షణం సదరు అధికారి తన గుర్తింపు కార్డును సంబంధిత డివిజన్ జనరల్ మేనేజర్‌కు అప్పగించాలని, తదుపరి ఆదేశాలిచ్చేవరకు నగరం విడిచి వెళ్లరాదని స్పష్టంచేశారు. జలమండలిలోఇంటిదొంగల నిర్వాకమిదీ.. జలమండలి నెట్వర్క్ ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధి వరకు విస్తరించడం..ప్రస్తుతం ఉన్న 9.65 లక్షల నల్లా కనెక్షన్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వినియోగదారులకు అవస్థలు లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, డిప్యూటీ జనరల్మేనేజర్లు, జనరల్ మేనేజర్లకు పలు అధికారాలను బోర్డు బదలాయించింది. ఇదే అదనుగా కొందరు జలగల్లా మారిన అధికారులు వినియోగదారుల వాణిజ్య నల్లాలను తమ అధికారాలను వినియోగించుకొని గృహ వినియోగ నల్లాలుగా మార్చేస్తున్నారు. బోర్డు డేటాబేస్‌లో ఇలాంటి మార్పులు చేస్తుండడంతో నెలవారీగా వేలల్లో వసూలు చేయాల్సిన బిల్లు వందల్లోపే ఉంటుంది. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన అధికారి ఏకంగా తన పాస్‌వర్డ్‌ను వినియోగించుకొని వేలాదిగా నీటిబిల్లు బకాయిపడిన 381 మంది వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకొని ఏకంగా రూ.1.97 కోట్ల రూపాయల నీటిబిల్లు బకాయిలను బోర్డు డేటాబేస్‌నుంచి తొలగించడం సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి ఉదంతాలు బోర్డు విజిలెన్స్ పోలీసులు లోతైన విచారణలో రోజుకొక్కటి చొప్పున బయటపడుతుండడం గమనార్హం. ఇటీవల చంచల్గూడా సెక్షన్ పరిధిలో మాజీ ఉద్యోగి పాస్‌వర్డ్‌ను వినియోగించుకొని పలు వాణిజ్య నల్లాలను గృహవినియోగ నల్లాలుగా మార్చిన అక్రమార్కుల ఉదంతం బయటపడడంతో విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదుచేసిన విషయం విదితమే. ప్రధానంగా అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు, బహుళ భవనాలు, హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులు, రెస్టారెంట్లకు సాధారణంగా వాణిజ్య నల్లాలుగా పరిగణిస్తారు. వీటిని గృహవినియోగ నల్లాలుగా బోర్డు డేటాబేస్‌లో మార్పులు చేస్తుండడంతో వాటి నుంచి రావాల్సిన కనెక్షన్ ఛార్జీలు, నీటిబిల్లులు రాక బోర్డుకు ప్రతీనెలా కోట్లరూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే నెలకు సుమారు రూ.25 కోట్ల ఆర్థికనష్టాలతో ఉన్న బోర్డుకు కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాకంతో మరింత కుదేలవుతోంది. మహానగరం పరిధిలో సుమారు లక్ష వరకు అక్రమ నల్లాలుంటాయని బోర్డు వర్గాల్లో బహిరంగ రహస్యమే. ఇవి ఎక్కడున్నాయన్న విషయం అధికారులు, సిబ్బందికి తెలిసినా మిన్నకుంటున్నారంటే వీటి ఏర్పాటు వెనక సూత్రధారులు వీరేనన్న విషయం సుస్పష్టమౌతోంది. జలమండలిలో జలగల ఉదంతంతో ప్రతీనెలా బోర్డు రూ.10 కోట్లమేర కనెక్షన్ ఛార్జీలు, నీటిబిల్లు బకాయిలు, నీటిచౌర్యం, అక్రమనల్లాల కారణంగా నష్టపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తుండడం గమనార్హం. కాగా జలమండలిలో క్షేత్రస్థాయి అధికారుల వ్యవహారాలను ఎండీ ఎం.దానకిశోర్ సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిపై విజిలెన్స్ బృందం ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. నీటినాణ్యత, వినియోగదారుల సమస్యల పరిష్కారం విషయంలో ఐఎస్ఓ ధ్రువీకరణ సాధించిన బోర్డుకు కొందరు అధికారుల తీరు శాపంగా పరిణమిస్తుండడంతో సదరు అక్రమార్కుల భరతం పట్టాలని నిర్ణయించడం విశేషం. -
అంబులెన్స్‌ను ఢీకొన్న కారు,ముగ్గురు మృతి
-
ఓఆర్ఆర్పై ‘స్మార్ట్’ జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను వినియోగించే వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ మార్గం ద్వారా గతేడాది డిసెంబర్ వరకు 75వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, అక్టోబర్‌లో వాటి సంఖ్య 1.30లక్షలకు చేరుకుంది. నగరానికి వచ్చే వాహనాలతో పాటు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్ఆర్ను ఎంచుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రయాణం సాఫీగా సాగేందుకు ‘స్మార్ట్ కార్డు’ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. కార్డు టచ్ చేయగానే టోల్గేట్లు వాటంతటవే తెరుచుకొని ముందుకెళ్లడం ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు ఆటోమెటిక్‌గా బదిలీ అవుతాయని, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)సేవలను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఏళ్లుగా చెబుతూ వస్తున్న అధికారులు ఈసారి వాటిని కార్యరూపం దాల్చేలా అడుగులు వేస్తున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్‌గా డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మార్ట్ కార్డు సేవలపై తరచూ ఓఆర్ఆర్ విభాగం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తొలివిడతగా నానక్‌రామ్‌గూడ, శంషాబాద్, మేడ్చల్, ఘటేకేసర్, పటాన్చెరు టోల్‌ప్లాజాల వద్ద స్మార్డ్ కార్డుల విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఓఆర్ఆర్ సీజీఎం ఇమామ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్డుల వినియోగం వల్ల ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడమేగాక, కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ట్రాన్సిట్ కార్డు సేవలిలా... ఓఆర్ఆర్పైకి ఎక్కేందుకు.. దిగేందుకు వీలుగా ఉన్న 19 ఇంటర్ ఛేంజ్ల్లో టోల్ ఛార్జీలను వసూలు చేసేందుకు 180 టోల్ లేన్లను ఏర్పాటు చేశారు. వాహనం ఔటర్‌పైకి ఎక్కే ముందు కంప్యూటర్లో వివరాలను నమోదు చేసి.. ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇవ్వాలి. ఎగ్జిట్ పాయింట్ వద్దనున్న కౌంటర్లో ఆ స్లిప్‌ను ఇస్తే సిబ్బంది ప్రయాణించిన దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతారు. దీనివల్ల ముఖ్యంగా సెలవుదినాల్లో టోల్ ఛార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ టోల్ మేనేజ్మెంట్ సిస్టం(టీఎంఎస్)ను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో వాహనదారుడు ఔటర్‌పైకి ఎక్కగానే టోల్ లేన్ దగ్గర క్షణం ఆలస్యం చేయకుండా ఓ స్మార్ట్ కార్డును సిబ్బంది అందజేస్తారు. ఆ కార్డు దిగే వద్ద అందజేస్తే స్కాన్ చేసి ఎంత చెల్లించాలో చెబుతారు. రోజువచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారి కోసం ఎక్కువగా ఈ ప్రీపెయిడ్ కార్డులు ఉపయోగపడతాయి. స్మార్ట్ కార్డుతో సాఫీ జర్నీ... ఓఆర్ఆర్పై 19 టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల సమయాన్ని ఆదా చేసేందుకు ‘టచ్ అండ్ గో’(స్మార్ట్) కార్డులను పరిచయం చేస్తున్నారు. ‘ఈ కార్డును తీసుకున్న వాహనదారుడు 157 మ్యాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్‌లో వెళ్లవచ్చు. తమ కార్డును టోల్‌ప్లాజా వద్ద ఉండే స్క్రీన్కు చూపించి ముందుకెళ్లాలి. అలా చూపడం వల్ల ఆ కార్డులో ఉండే నగదును ఆ సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌తో ఆటోమేటిక్... ఇది కూడా టచ్ అండ్ గో మాదిరిగానే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) కార్డు పనిచేస్తుంది. జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ ఈటీసీ కార్డులున్న వాహనాలను 23 లేన్లలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ లేన్‌లోకి ఎంట్రీ అయ్యే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటుచేసిన తొలి యాంటీనా కార్డు వ్యాలీడా కాదా అని స్క్రీన్ చేస్తుంది. కారు కోసమా, లారీ కోసమా, మరే ఏ ఇతర వాహనం కోసం రీచార్జ్ చేసిన కార్డునే వినియోగిస్తున్నారని పసిగడుతుంది. ఒకవేళ లారీ కోసం రీచార్జ్ చేసుకుని కారుకు వాడాలనుకుంటే ఇది సున్నితంగా తిరస్కరిస్తుంది. అయితే అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ దానంతట అదే తెరుచుకుంటుంది. ఆ తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్ఆర్ ఎక్కిందని రికార్డు చేసుకుంటుంది. అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్‌బూత్ నుంచి నిష్క్రమించగానే ఆ కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా డిడెక్ట్ చేసుకుంటుంది. దీంతో వాహనదారుల ప్రయాణ సమయం ఆదా కానుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు... నానక్‌రామ్ గూడ, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్, పటాన్చెరు టోల్ ప్లాజాల వద్ద వచ్చే వారం నుంచి ఆర్ఎఫ్ఐడీ ఫాస్ట్‌టాగ్, టచ్ అండ్ గో కార్డులను విక్రయించనున్నారు. మొదటి విడతగా 2 లక్షల వాహనాలు, కార్లు/జీపులు తదితర చిన్నతరహా వాహనాల కేటగిరీలోని వాహనాలకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే ఫాస్ట్ ట్యాగ్‌లను జారీ చేయనున్నారు. రూ.500 వరకు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్యాగ్ల్లోనూ తరుచూ ప్రయాణించే ప్రయాణీకులకు నెలసరి పాసులు అందుబాటులో ఉంటాయి. నెలలో 50 సార్లు ప్రయాణించే వారికి ఇది చెల్లుబాటు కానుంది. నెలవారీ పాసు కొనుగోలు చేసిన వారికి 24 గంటల్లో తిరుగు ప్రయాణంలో రాయితీ కూడా లభిస్తుంది. దాదాపు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 అందుబాటులోకి తీసుకురానున్న టచ్ అండ్ గో కార్డులో టోల్‌ప్లాజాలో వద్ద ఏర్పాటుచేసే పీవోసీలో రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంది. లేదా ఆన్‌లైన్‌లోనూ రీచార్జ్ చేసుకునేసౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. -
ఔ‘డర్’!
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై యాక్సిడెంట్లు నిత్యకృత్యమయ్యాయి. వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలకు కారణం అతివేగమే అంటూ చేతులు దులుపుకొంటున్న హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులు... దీనికి కళ్లెం వేసేందుకు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రమాదాలు జరిగే 29ప్రాంతాలను గుర్తించినప్పటికీ కర్వ్‌లు, గ్రాండెంట్ సెక్షన్లు, ట్రాన్స్వర్స్ బార్ మార్కింగ్‌లు ఏర్పాటు చేయడం లేదు. ఓఆర్ఆర్ భద్రతపై రెండేళ్ల క్రితం సీఆర్ఆర్ఐ చేసిన ప్రతిపాదనలనూ గాలికొదిలేశారు. సాక్షి, సిటీబ్యూరో: అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో రోడ్డు ప్రమాదాలు జరిగితే చాలు...అతివేగమే కారణమంటూ చేతులు దులుపుకునే అధికారులు ఆ వేగానికి కళ్లెం వేసే చర్యలను మాత్రం ఆచరణ రూపంలోకి తీసుకరావడం లేదు. ‘ఎక్స్‌ప్రెస్‌వేపై డైరెక్షనల్ మార్కింగ్ స్పష్టంగా కనపడాలి...ఇంటర్‌ఛేంజ్‌లు, ర్యాంప్‌లు...మీడియం లేన్...సోల్డర్ లైన్...ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాహనాల వేగానికి కళ్లెం వేయవచ్చ’ని న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) రెండేళ్ల క్రితం సమర్పించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఓఆర్ఆర్ విభాగ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యధికంగా ప్రమాదాలు జరిగే 29 ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని అధ్యయనం చేయడం ద్వారా మెయిన్టెనెన్స్ లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చేసిన సూచనలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు ఓఆర్ఆర్ మార్గంలో లక్షా 40వేల వాహనాలు ప్రయాణిస్తున్నా భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై విమర్శలు వస్తున్నాయి. వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లపై శ్రద్ధ ఏదీ..? పెద్ద కారులు, చిన్న కారులు, లైట్ కమర్షియల్ వెహికల్స్, హెవీ ట్రక్కులు సీఆర్ఆర్ఐ అధ్యయనం చేసిన 29 ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో వెళుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయని గుర్తించింది. పెద్ద కారులు గంటలకు 108 నుంచి 127 కిలోమీటర్ల వేగం, చిన్నకార్లు 102 నుంచి 124 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్టుగా రిపోర్టులో పేర్కోన్నారు. 50 శాతం పెద్ద కార్లు, 30 శాతం చిన్న కార్లు, ఏడు శాతం లైట్ కమర్షియల్ వెహికల్స్, ఒక శాతం భారీ ట్రక్కులు వేగంతో వెళుతున్నట్టుగా గుర్తించారు. ఈ పరిస్థితి వల్లనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాడు. ఈ ప్రాంతాల్లో కర్వ్‌లు, గ్రాండెంట్ సెక్షన్లు, ట్రాన్స్వర్స్ బార్ మార్కింగ్, మీడియన్ డెలినియోటర్స్‌తో కలిపి మీడియన్ మార్క్‌లు, స్పీడ్ అరెస్టర్స్ ఏర్పాటుచేయడం వల్ల వేగాన్ని నియంత్రించవచ్చని సీఆర్ఆర్ఐ ప్రతిపాదనలను ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ‘టిపికల్’ ప్రమాదాలపై నిర్లక్ష్యం... ఓఆర్ఆర్పై చాలా వాహనాలు మితిమీరిన వేగంతో అదుపుతప్పి స్తంభాలను ఢీకొట్టి అవతల ఉన్న సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఓఆర్ఆర్ అంతటా మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్ సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలని, ఇవన్నీ ఒకేతీరున ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వాహనాలు వాటిని గుద్ది అవతల ఎగిరిపడుతున్నాయని గుర్తించిన సీఆర్ఆర్ఐ ‘టిపికల్ డబుల్ మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్స్’ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని స్పష్టం చేసినా ఆ పనుల్లో పురోగతి మాత్రం ఏమీ కనపడటం లేదు. అలాగే ఎక్స్ప్రెస్హైవేలో డైరెక్షనల్ మార్కింగ్‌లు వాహనదారులకు స్పష్టంగా కనబడేలా చర్యలను ఆశించిన రీతిలో తీసుకోలేదు. ‘రాత్రి సమయాల్లో వాహనదారుల భద్రత కోసం ఎడ్జ్ స్టడ్స్, లేన్ డివైడర్ స్టడ్స్ అవసరముంది. ఎక్స్‌ప్రెస్ వే కుడివైపు లేన్, మీడియన్ సైడ్‌ను తెలుపు రంగుతో మార్కింగ్ చేయాలి. అదేవిధంగా కుడివైపున రోడ్డు స్టడ్స్‌ను ఎరుపు రంగులో, మీడియన్ సైడ్ లేన్ పసుపు రంగులో మార్క్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ వే హైస్పీడ్ వయోలేషన్స్ కుడివైపు, మీడియం లేన్లు రెడ్ కలర్ స్టడ్స్‌ను ఉపయోగించాలి. ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేసే ర్యాంప్‌ల్లో చెవ్రాన మార్కింగ్ చేయడంతో పాటు బొల్లార్డ్స్‌ను ఉపయోగించాలి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో ‘నో స్టాపింగ్, నో పార్కింగ్, నో ఓవర్‌టేకింగ్ సైన్స్’ ఏర్పాటుచేయాలి. ఎగ్టిట్, ఎంట్రీ ప్రాంతాలవద్ద ఎనిమిది నుంచి పది మిల్లీమీటర్లు థింక్ పెయింట్‌ను రోడ్డు స్టడ్స్‌కు వేయాలి. వేగాన్ని నియంత్రించేందు బొల్లార్డ్స్ కూడా ఏర్పాటుచేయాల’ని సీఆర్ఆర్ఐ చెప్పినా అధికారులు మాత్రం తమకు ఏమీ అంటనట్టుగా వ్యవహరిస్తుండటంతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నో సర్వీస్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనదారులు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంటారు. రోడ్డు నిర్మాణం.. నిర్వహణలో సరైన ప్రమాణాలు పాటించక జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. అయితే, హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్డు విభాగ అధికారులు సర్వీసు రోడ్ల విషయంలోనూ అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపి మూడేళ్లుగా సర్వీస్ రోడ్లలోబ్రిడ్జిల నిర్మాణాన్ని పక్కనపెట్టేసి ఆ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. రెండు, మూడు కిలోమీటర్లు అదనం గా చుట్టూ తిరిగి గమ్యం చేరుతున్నారు. చేపట్టిన సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఎక్కడికక్కడే నిలిపివేశారు. పైగా రైల్వే ట్రాక్ ఉన్న ప్రాం తంలో బ్రిడ్జిలు కడితే ‘టోల్ కలెక్షన్’ తగ్గిపోతుం దని చెబుతున్నారు. 2012లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ ఘట్కేసర్, మేడ్చల్, ఈదులనాగులపల్లి, శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ను తాకుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లపై వంతెనల నిర్మాణం చేపట్టలేదు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులను చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గౌడవెల్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం చేయక.. ఘట్కేసర్ మండలంలోని గౌడవెల్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో సర్వీసురోడ్డులో వాహనదారులు 3.5 కిలోమీటర్ల అదనంగా తిరగాల్సి వస్తోంది. గౌడవెల్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్–నాందేడ్ రైలు మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెల్లి స్టేషన్ నుంచి రింగు రోడ్డు వెళుతోంది. ఘట్కేసర్ నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెల్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ వరకు సర్వీసు రోడ్డు వేసి వదిలేశారు. దీంతో వా హనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుంచి గౌడవెల్లి గ్రామం మీదుగా 3.5 కి.మీ తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద సర్వీస్ రోడ్డు తేరుతున్నారు. ఈదులనాగులపల్లిలో.. ఈదూలనాగులపల్లి, వెలమల శివారుల్లో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డును అంసపూర్తిగా వదిలేశారు. తాత్కాలికంగా మట్టి పోశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. నాగులపల్లి రావాలంటే చాలా దూరం తిరిగాల్సిందే. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్.. శంషాబాద్‌లో ఇలా.. కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్ద అంబర్పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామం నుంచి ఘట్కేసర్ బైపాస్ రోడ్డు కూడలి దాటి సర్వీస్ రోడ్డుకు చేరాలి. ఇక్కడా సర్వీస్ రోడ్డు నిర్మించక అదనంగా 3 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిందే. పెద్ద అంబర్పేట్ నుంచి కీసర పోవాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాలి. ఓఆర్ఆర తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డును అర్ధాంతరంగా నిలిపేశారు. అలాగే చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ వద్దా రెండు కిలోమీటర్ల వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. దీంతో హిమాయత్‌సాగర్ వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వెళ్లాల్సి వస్తోంది. -
జర్నీ ‘స్మార్ట్’గా సాగేనా!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను వినియోగించే వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ మార్గం ద్వారా గతేడాది డిసెంబర్ వరకు నిత్యం 75 వేల వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ అక్టోబర్‌లో ఆ సంఖ్య 1.30 లక్షలకు చేరుకుంది. ఓఆర్ఆర్పై ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టి సాఫీ జర్నీకి మార్గం సుగమం చేసేందుకు ‘స్మార్ట్ కార్డు’ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఏళ్ల నుంచి చెబుతున్న అధికార యంత్రాంగం మాటలు ఆచరణలోరూపుదాల్చడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సేవలను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న ఓఆర్ఆర్ అధికారులు ఇప్పుడూ ఏం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ప్రిపెయిడ్ కార్డు సేవలు ఎప్పుడో.. ఓఆర్ఆర్పై 19 ఇంటర్చేంజ్ల్లో టోల్ చార్జీలను వసూలు చేసేందుకు 180 టోల్ లేన్లను ఏర్పాటు చేశారు. వాహనం ఔటర్‌పైకి వెళ్లేముందు కంప్యూటర్లో వివరాలను నమోదు చేసి.. ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇవ్వాలి. ఎగ్జిట్ పాయింట్ వద్దనున్న కౌంటర్లో ఆ స్లిప్‌ను అందివ్వాలి. ఆ తర్వాత సిబ్బంది ప్రయాణించిన దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతారు. దీంతో ముఖ్యంగా సెలవు దినాల్లో టోల్ చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందులను గమనించిన హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ సిబ్బంది టోల్ మేనేజ్మెంట్ సిస్టం(టీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ట్రయల్ రన్ పద్ధతిలో స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో వాహనదారుడు ఔటర్‌పైకి వాహనం ఎక్కగానే టోల్ లేన్ వద్ద క్షణం ఆలస్యం చేయకుండా ఓ స్మార్ట్ కార్డును సిబ్బంది అందజేస్తారు. ఆ కార్డు దిగే దగ్గర అందజేస్తే స్కాన్ చేసి ఎంత చెల్లించాలో సిబ్బంది చెబుతారు. రోజూ వచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారి కోసం ఎక్కువగా ఉపయోగపడే ఈ ప్రిపెయిడ్ కార్డు సేవలు ఎప్పుడూ అందుబాటులోకి తీసుకొస్తామనేది ఓఆర్ఆర్ విభాగ అధికారులకే స్పష్టత లేకుండా పోయింది. ‘టచ్ అండ్ గో’ పరిస్థితీ అంతే.. ఓఆర్ఆర్పై 19 టోల్‌ప్లాజాలు దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు పడుతున్న సమయాన్ని తగ్గించేందుకు ‘టచ్ అండ్ గో’ కార్డులను పరిచయం చేస్తున్నామని చాలా నెలల క్రితం అధికారులు ప్రకటించారు. కార్లు, లారీలు.. ఇలా ఏ వాహనదారుడికైనా ప్రత్యేక రంగు, ఆ వాహనం గుర్తుతో కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ‘ఈ కార్డును తీసుకున్న వాహనదారుడు 157 మ్యానువల్, టంచ్ అండ్ గో లేన్స్‌లో వెళ్లవచ్చు. తమ కార్డును టోల్‌ప్లాజా వద్ద ఉండే స్క్రీన్కు చూపించి ముందుకెళ్లాలి. అలా చూపడం వల్ల ఆ కార్డులో ఉండే నగదును ఆ సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఈ విధానం ఆచరణ రూపందాల్చకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఎఫ్ఐడీ సేవలకు మోక్షం కలిగేనా.. ఇది కూడా టచ్ అండ్ గో మాదిరిగానే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) కార్డు పనిచేస్తుంది. జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ ఈటీసీ కార్డులున్న వాహనాలను 23 లేన్లలో మాత్రమే అనుమతిస్తారు. ఈ విధానాన్ని వచ్చే నవంబర్‌లో పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఓఆర్ఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో మాదిరిగా ప్రయోగాత్మంగా అమలు చేసి ఆపేస్తారా.. నిరంతరాయంగా కొనసాగిస్తారా అనేది వేచిచూడాలి. నానక్‌రామ్‌గూడ,శంషాబాద్ మార్గాల్లోనే అధికం ఓఆర్ఆర్లో నానక్‌రామ్‌గూడ– శంషాబాద్ మార్గంలోనే అత్యధికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫిబ్రవరిలో నానక్‌రామ్‌గూడలో రోజుకు 13,010 వాహనాలు రాకపోకలు సాగిస్తే ప్రస్తుతం 18,353కు చేరుకుంది. శంషాబాద్‌లో 10,090– 15,822, మేడ్చల్‌లో 6,938– 9,133, పెద్దఅంబర్‌పేటలో 6,443– 7042 మేర వాహనాల రాకపోకలు పెరిగాయి. రావిర్యాలలో అత్యల్పంగా 623 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టుగా హెచ్ఎండీఏ సర్వే రిపోర్టులో తేలింది. ఎక్కువగా కారు, జీప్, వ్యాన్లే అత్యధికంగా సంచరిస్తున్నాయని తేల్చింది. చిల్లర సమస్యకు చెక్.. టోల్‌ప్లాజాల్లో వాహనదారుల వద్ద సరైన చిల్లర లేకపోవడంతో సమయం వృథా కావడంతో పాటు ట్రాఫిక్‌జాం అవుతోందని అధికారులు గుర్తించారు. 158 కి.మీ ఓఆర్ఆర్ వెంట ఆ సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా వినూత్న ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే చిల్లర వల్ల సమయం వృథాతో పాటు ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతాయంటూ వాహనదారులకు తెలిసేలా ఓఆర్ఆర్ వెంట బోర్డులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
ఓఆర్ఆర్పై ‘చేంజ్’ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ట్రాఫిక్ జామ్‌కు చెక్ పెట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా టోలు రుసుము చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడం వల్లే ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు ప్రధానంగా ‘చిల్లర’ సమస్య కూడా కారణమని తేల్చారు. టోల్గేట్ల వద్ద రుసుం చెల్లించే క్రమంలో సరిపడా చిల్లరను వాహనదారు లు ఇవ్వకపోవడంతో లావాదేవీలకు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటూ ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుందని హెచ్ఎండీఏ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై వాహనదారులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. ‘ప్రతి రోజూ సగటున లక్షా ఇరవై నాలుగు వేల వాహనాలు ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్నాయి. ఒక్కో వాహనానికి 5 సెకన్ల సమయం చిల్లర వల్ల అనవసర జాప్యం జరుగుతున్నదనుకున్నా..మొత్తం అన్ని వాహనాలు 173 గంటల సమయం వృథాగా వాహనాలు వేచి ఉంటున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు టోల్ గేట్ల వద్ద సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఓఆర్‌ఆర్‌అధికారులనుఆదేశించారు. ఓఆర్ఆర్పై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఆర్ఎఫ్ఐడీ, స్మార్ట్ కార్డుల ద్వారా టోలు వసూలు అమలు నిర్ణీత గడువుపై కూడా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ...దీపావళికి ఆర్ఎఫ్ఐడీ ద్వారా టోలు వసూలు వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ లోగానే అన్ని సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రయోగాత్మకంగా వసూలు చేసుకుని దీపావళి నాటికి ఆర్ఎఫ్ఐడీ పద్ధతిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు. క్లోజ్డ్ టోలింగ్‌పై దృష్టి... ఓఆర్ఆర్పై 2010లోనే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) పద్ధతిన వాహనదారుల నుంచి టోలుసుంకం వసూలు చేయాలని నిర్ణయించినా వివిధ కారణాల వల్ల అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తర్వాత డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ పద్ధతిన టోలు వసూలు చేయాలని నిర్ణయించినా జాతీయ రహదారులు, ఇతర రాష్ట్ర రహదారులపై అమలవుతున్న ఆర్ఎఫ్ఐడీ విధానంవైపే మొగ్గారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్లో భాగంగా స్మార్ట్ కార్డుల ద్వారా టోలు వసూలు కోసం జైకా ద్వారా రూ.70 కోట్ల నిధులు హెచ్ఎండీఏ రుణంగా తీసుకుంది. అయితే 181 లైన్లున్న ఓఆర్ఆర్పై ఎంట్రీ వైపు 82 లైన్లు, ఎగ్జిట్ 99 లైన్లు ఉన్నాయి. ఇందులో 112 లైన్లలో నగదు, స్మార్ట్ కార్డ్ ద్వారా (మాన్యువల్) టోలు వసూళ్లు చేయనున్నారు. 51 లైన్లలో నగదు, స్మార్ట్ కార్డులు మరియు ఆర్ఎఫ్ఐడీ పద్ధతుల్లో వసూలు చేస్తారు. అందులో 18 లేన్లు కేవలం ఆర్ఎఫ్ఐడీ ద్వారానే టోల్ వసూలు చేయాలని ఓఆర్ఆర్ అధికారులు నిర్ణయించారు. ఇటీవల బదిలీపై వచ్చిన కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వారంలో ఓ రోజు ఓఆర్ఆర్ ట్రాఫిక్ రద్దీ తగ్గింపుపైపే సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఓఆర్ఆర్ అధికారులు ఓపెన్ టోలింగ్ పద్దతిలో వాహనదారుల నుంచి నిర్ధారిత టోలు సుంకం వసూలు చేస్తున్నారు. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న క్లోజ్డ్ టోలింగ్ పద్ధతిలో వాహనదారులు, వారు ఉపయోగించే వాహన శ్రేణి ప్రకారం ఎగ్జిట్ పద్ద వారు ప్రయాణం చేసిన దూరానికి మాత్రమే టోలు వసూలు చేస్తారు. వాహనదారులు సహకరించాలి ప్రతి వాహనదారుడు టోలు సుంకానికి సరిపడా చిల్లరను తీసుకురావాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. టోలుగేట్ల వద్ద రద్దీ కూడా తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో టోల్ గేట్ల వద్ద 150 మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాహనదారులు అవసరమైన చిల్లరను తీసుకువస్తే టోలు చెల్లింపు, వసూలులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించవచ్చు. అలాగే త్వరలో తీసుకురానున్న ఆర్ఎఫ్ఐడీ, ఈటీసీ, క్యూఆర్ కోడ్ పద్ధతులను కూడా అందరూ వినియోగించుకోవాలి.– కమిషనర్, డా.బి.జనార్దన్‌రెడ్డి -
ఔటర్ రింగ్ రోడ్డు కాసుల పంట
సాక్షి, సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పద్ధతిన ఏక కాలంలో 30ఏళ్ల పాటు ఏదైనా సంస్థకు లీజుకు ఇస్తే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు రూ.4,500 కోట్ల ఆదాయం వస్తుంది. వీటిని ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, సిటీలో ట్రాఫిక్ నియంత్రణకుస్కైవేల నిర్మాణం చేపట్టొచ్చు. అదే విధంగా ఓఆర్ఆర్ టోల్ నిర్వహణ, రహదారుల మరమ్మతులు, ఐదేళ్లకోసారి బీటీ రోడ్ల నిర్మాణం తదితర పనులన్నీ ఈ టెండర్ దక్కించుకున్న సంస్థనే 30ఏళ్ల పాటు పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో హెచ్ఎండీఏకు నిర్వహణ భారం కూడా తొలగిపోతుంది. ఈ మేరకు టీఓటీ పద్ధతిపై దాదాపు ఏడాదిగా హెచ్ఎండీఏ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. టీఓటీపై ఆర్థిక, న్యాయ విభాగం అధికారులకు ఉన్న సందేహాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అధ్యక్షతన హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమక్షంలో సోమవారం జరిగిన భేటీలో నివృత్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇక ఈ పనుల్లో పురోగతి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వ ఆమోదం లభిస్తే టీఓటీ టెండర్లు పిలిచేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. ఆ తర్వాత పనులు పట్టాలెక్కడమే తర్వాయని అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ టోల్, రోడ్ల నిర్వహణకు 30 ఏళ్ల పాటు టీఓటీ పద్ధతిన టెండర్ పిలవడం వలన కోట్ చేసే రూ.4,500 కోట్ల కన్నా ఎక్కువకే సంస్థలు దక్కించుకునే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) టీఓటీ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు, గుజరాత్లో నాలుగు నేషనల్ హైవేలకు రూ.6వేల కోట్ల అంచనాతో టెండర్‌కు వెళ్లగా రూ.9వేల కోట్లు వచ్చాయని ఉదహరిస్తున్నారు. ఆ నిధులను ఎన్హెచ్ఏఐ జాతీయ రహదారుల నిర్మాణంపై ఖర్చు చేస్తోందన్నారు. మేలోనే నివేదిక... ఇప్పటికే ఓఆర్ఆర్ను రోజూ లక్ష మంది వాహనదారులు వినియోగించుకుంటున్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఓఆర్ఆర్పై ట్రాఫిక్, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను హెచ్ఎండీఏ అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే స్మార్ట్ కార్డులు, టచ్ అండ్ గో కార్డులు, ఆర్ఎఫ్ఐడీ కార్డుల వినియోగంతో వాహనదారుల జర్నీ సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. టెక్నాలజీ పరంగా కొత్తపుంతలు తొక్కుతూ, భవిష్యత్‌లో వాహనాల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. అయితే ఓఆర్ఆర్ను టీఓటీ పద్ధతిలో 30 ఏళ్లు లీజుకివ్వడంపై హెచ్ఎండీఏ ఫిబ్రవరిలో నియమించిన ట్రాన్జాక్షన్ అడ్వైజర్లు (లావాదేవీల సలహాదారులు) లీ అసోసియేట్స్ సౌత్ ఆసియా, క్రిసిల్ అధ్యయనం చేసి మేలో నివేదిక సమర్పించింది. భవిష్యత్‌లో ఓఆర్ఆర్ వినియోగం, ట్రాఫిక్ పెరుగుదల, టోల్ పెంపులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత విలువను అంచనా వేసి రూ.4,500 కోట్లకు టెండర్‌కు వెళ్లొచ్చని పేర్కొంది. అయితే ఈ నివేదిక జూన్‌లోనే ప్రభుత్వ స్థాయికి వెళ్లినా ఆయా శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్‌రెడ్డి... మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సందేహాలున్న ఆర్థిక, న్యాయ విభాగాల అధికారులతో సెక్రటేరియట్లో సోమవారం సమావేశం నిర్వహించి నివృత్తి చేశారు. ‘మహా’ అభివృద్ధి... టీఓటీ పద్ధతిలో ఓఆర్ఆర్ నిర్వహణకు సమకూరే నిధులతో హెచ్ఎండీఏ మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనుంది. ముఖ్యంగా ఓఆర్ఆర్కు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పరిధిలోనున్న గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఓఆర్ఆర్ రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న 35 రేడియల్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. ప్యారడైజ్ నుంచి లోతుకుంట అల్వాల్ వరకు హెచ్ఎండీఏ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న స్కైవే కోసం రూ.1,300 కోట్లు ఉపయోగించే అవకాశముంది. ఇవేకాక మరెన్నో అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టనుంది. -
ఔటర్.. రిపేర్
సాక్షి, సిటీబ్యూరో: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఆదివారం టీఆర్ఎస్ నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో ప్రత్యేక దారులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. మెయిన్ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక రహదారుల మూసివేతపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ప్రధానంగా రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో మంగళవారం నుంచి ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్‌వే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. మెయిన్ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక మట్టి రహదారులను తొలగించడంతో పాటు ఓఆర్ఆర్ పటిష్టత దెబ్బతినకుండా ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పనులుచేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు ఆదివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 12గంటల వరకు వెళ్లిన వాహనాల టోల్ ఫీజు చెల్లింపులపై తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అధికారులు సమవేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఆ రోజు వచ్చి వెళ్లిన వాహనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టోల్ ఫీజు చెల్లించాలంటూ టీఆర్ఎస్ పార్టీకి లేఖ రాయనున్నారు. టోల్ ఫీజుపై నేడు స్పష్టత... నగరాభివృద్ధిలో 158కి.మీ ఔటర్ కీలకంగా మారింది. వివిధ జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేయడంతో ఔటర్‌పై వాహనాల రద్దీ నానాటికీ పెరుగుతోంది. రోజు సగటున లక్షకు పైగా వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. టోల్ రుసుములను వసూలు చేసేందుకు గాను 19 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద 180 టోల్ లేన్లు ఉన్నాయి. ఓఆర్ఆర్లో రోజుకు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తద్వారా హెచ్ఎండీఏకు రోజు రూ.87లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా టోల్ వసూలు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ సంస్థ ప్రతి నెలా రూ.26 కోట్లు చెల్లిస్తోంది. ఇటీవల వాహనదారుల సౌలభ్యం కోసం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌కార్డుల ద్వారా టోల్ చెల్లింపుతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాయిదా వేసిన హెచ్ఎండీఏ అధికారులు... సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల టోల్ వసూలు చేస్తే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్న విషయాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఆ రోజు వచ్చే వాహనాలకు టోల్ చెల్లిస్తామంటూ హెచ్ఎండీఏకు లేఖ రాయడంతో అందుకు అనుమతించారు. దీంతో లక్షలాది వాహనాలు ఔటర్‌పైకి వచ్చినా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. ఈ టోల్ ఫీజు వసూలుపైనే హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి చార్జీలు చెల్లించాలంటూ లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. వర్షంతో ఇబ్బందులు... ప్రగతి నివేదన సభకు అనుబంధంగా వాహనాల పార్కింగ్ కోసం రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో ఔటర్ నుంచి కొత్తగా నిర్మించిన 8 మట్టి రహదారుల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి వాహనదారుల ఇబ్బందులపై దృష్టి సారిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతమంది వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుందని ఈ మార్గాల ద్వారా సర్వీసు రోడ్ల మీదకు వచ్చి వెళ్లారని టోల్ వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థ అధికారులు వాపోతున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ రహదారులను మూసివేయాలని కోరుతున్నారు. -
ట్రాఫిక్ ఔ‘డర్’!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు ట్రాఫిక్ గండం పొంచివుంది. సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరగనున్న టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు వేలాది వాహనాలు పోటెత్తనుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు కూడా తోడవుతుండటంతో హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు ట్రాఫిక్‌ను ఎలా నిలువరిస్తారో? అన్నది ఊహకందడం లేదు. నిత్యం లక్ష వాహనాలు ప్రయాణించే 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో సెప్టెంబర్ 2న టోల్ వసూలు ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు ఎలా నిర్వహిస్తారన్నది కూడా గమనించాల్సిన అంశం. ఇటీవల వాహనదారులకు జర్నీ సౌలభ్యం కోసం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌కార్డుల ద్వారా టోల్ చెల్లింపు పద్ధతి వల్లనే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాయిదావేసిన హెచ్ఎండీఏ అధికారులు...ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల టోల్ వసూలులో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. అప్రమత్తంగా ఉండకపోతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది మొత్తం నగరంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అనుమతించకుంటే నిత్యావసరాలపై ప్రభావం... తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఉభయగోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వేలాది వాహనాల్లో కూరగాయాలు నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లకు సరఫరా అవుతున్నాయి. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి రోజుకు 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం ఉండటంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ ద్వారానే వస్తుండటంతో సెప్టెంబర్ 2న పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు నగర శివారు ప్రాంతాలకు వెళ్లే డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లు కూడా ఇబ్బందికరం కానుంది. నగరంతో పాటు శివార్లలో ఊపందుకున్న నిర్మాణరంగానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక లారీలు కూడా ఓఆర్ఆర్ మార్గం ద్వారానే వివిధ జిల్లాల నుంచి రాకపోకలు ఉండటంతో ట్రాఫికర్ గండం రెట్టింపు కానుంది. అయితే ఈ వాహనాలకు ఆ రోజు ఓఆర్ఆర్పై అనుమతిస్తారా, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారా అన్నదానిపై అధికారులు ఇప్పటివరకు ఒక నిర్ణయానికి రాకపోవడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ ఆరోజు ఏ వాహనాలు అనుమతించమని అధికారులు నిర్ణయం తీసుకుంటే నిత్యావసరాలు, సిమెంట్, ఇసుక తదితరాలపై ప్రభావం పడుతుంది. కొత్త మార్గాల కోసం తవ్వేస్తున్నారు... అన్ని జిల్లాల నుంచి సభాస్థలికి వచ్చే వాహనాల జర్నీ, పార్కింగ్ సౌలభ్యం కోసం ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్ వే, సర్వీసు రోడ్డు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో గుంతలు తవ్వేస్తున్నారు. రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూరు మార్గంలో 15 ప్రాంతాలను పరిశీలించిన అధికారులు చివరకు ఎనిమిది ప్రాంతాల్లో గుంతలు తవ్వి మట్టిరోడ్డు వేస్తున్నారు. అయితే సభ జరిగిన మరుసటిరోజే ఈ మార్గాలను మూసివేసి మళ్లీ యథాతథా స్థితికి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నా అది చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల టోల్ రుసుంకు కూడా గండిపడే అవకాశముండటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే అస్కారముందని అధికారులే అంటుండడం గమనార్హం. టోల్ వసూలుపై ఏం చేస్తారో... 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో రోజుకు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అంటే గంటకు దాదాపు ఐదు వేల వాహనాలన్నమాట. వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి 19 ఇంటర్‌ఛేంజ్‌ల మీదుగా ప్రయాణించే ఈ వాహనాల వల్ల హెచ్ఎండీఏకు రోజు ఆదాయం రూ.87 లక్షల వరకు వస్తోంది. అయితే సెప్టెంబర్ 2న సభకు వచ్చే వాహనాల వల్ల ఈ ఆదాయం కాస్తా పెరుగుతుందేమో కానీ ట్రాఫిక్ ఇబ్బందులుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోజు టోల్ ప్రక్రియ నిలిపివేస్తారా...అంటే అదీ హెచ్ఎండీఏకు నష్టం కలిగించే అంశం అవుతుంది. కాగ్ ఆడిట్లో కూడా తూర్పారపట్టే అవకాశం ఉండటంతో హెచ్ఎండీఏ ఆ రోజు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల విషయంలోనూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. -
ఔటర్‌పై ‘స్మార్ట్’ రైడ్..!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణం మరింత స్మార్ట్ కానుంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, ప్రయాణం సులభతరం చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తోంది. టోల్ ప్లాజాల వద్ద డబ్బులిచ్చే పద్ధతికి స్వస్తి పలికి ఏటీఎం కార్డును పోలి ఉండే ట్రాన్సిట్, టచ్ అండ్ గో కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లోని 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రారంభించింది. టోల్ గేట్ సిబ్బందికి కార్డుల విధానంపై అవగాహన రాగానే మరో 3 రోజుల్లో అమలులోకి తీసుకురానుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేయనున్న ఈ కార్డులతో వాహనదారుల సమయం ఆదా కానుంది. కార్డుల కొనుగోలు, రీచార్జ్ కోసం ప్లాజా కార్యాలయాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను ఏర్పాటు చేశారు. నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం ఈ సేవలను పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఓఆర్ఆర్ చుట్టూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ కార్డుతో.. ప్రస్తుతం ఔటర్‌పైకి వాహనం ఎక్కే ముందు కంప్యూటర్లో వివరాలు నమోదు చేసి ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇస్తున్నారు. దిగే చోట (ఎగ్జిట్ పాయింట్) ఉన్న కౌంటర్లో ఆ స్లిప్ ఇస్తే ప్రయాణ దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతున్నారు. దీంతో చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా టోల్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)ను హెచ్ఎండీఏ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్డు విధానం ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో ఔటర్‌పైకి వాహనం ఎక్కగానే క్షణం ఆలస్యం చేయకుండా స్మార్ట్ కార్డును సిబ్బంది ఇస్తారు. దిగే దగ్గర ఆ కార్డు ఇస్తే స్కాన్ చేసి ఎంత చెల్లించాలో సిబ్బంది చెబుతారు. బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. రోజువచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారికి ఈ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుందని అంటున్నారు. టచ్ చేసి వెళ్లడమే... ఓఆర్ఆర్పై 19 టోల్‌ప్లాజాలు దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు చాలా సమయం పడుతోంది. ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువైనపుడు డబ్బులు తీసుకొని రశీదు ఇవ్వడమూ సిబ్బందికి భారమవుతోంది. కొంతమంది సిబ్బంది తమకు తెలిసిన వారి నుంచి డబ్బులు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వసూళ్లలో పారదర్శకత, సులభతర ప్రయాణం కోసం ‘టచ్ అండ్ గో’కార్డును పరిచయం చేస్తున్నారు. కారు, లారీలు.. ఇలా ఏ వాహనదారుడికైనా ప్రత్యేక రంగు, ఆ వాహనం గుర్తుతో కార్డులివ్వనున్నారు. ప్లాజాల వద్ద ఉండే స్క్రీన్కు ఆ కార్డు చూపించి వెళ్లాలి. ఆ సమయంలో కార్డులోని సొమ్మును ఆటోమేటిక్‌గా చెల్లించినట్లవుతుంది. ఓఆర్ఆర్పై 157 మాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.200లకు అందుబాటులోకి తీసుకురానున్న ఈ కార్డులో ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోసీలో రీచార్జ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మొబైల్ రీచార్జ్ సేవలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఒక వాహనం కోసం తీసుకున్న కార్డు మరో వాహనానికి పనిచేయకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ‘యాంటీనా’తోనే క్లియరెన్స్... జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) కార్డులు కూడా ఓఆర్ఆర్పై పని చేసేలా చర్యలు చేపట్టారు. ఈ కార్డులున్న వాహనాలను 23 లేన్లలోనే అనుమతించనున్నారు. ఈ లేన్‌లోకి వెళ్లే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటు చేసిన తొలి యాంటీనా.. కార్డు సరైనదా కాదా స్క్రీన్ చేస్తుంది. లారీ కోసం రీచార్జ్ చేసుకుని కారుకు వాడాలనుకుంటే తిరస్కరిస్తుంది. అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ తెరుచుకుంటుంది. తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్ఆర్ ఎక్కిందని రికార్డు చేసుకుంటుంది. ఎగ్జిట్ టోల్ బూత్ నుంచి నిష్క్రమించగానే కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఈ కార్డులను కూడా టోల్ ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోఎస్‌లో రీచార్జ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఓఆర్ఆర్.. ఇక జిగేల్!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఇక పూర్తి స్థాయిలో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటికే 24.38 కిలోమీటర్ల మేర శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో అమర్చిన ఎల్ఈడీ బల్బులు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బాగా తోడ్పడ్డాయి. దీంతో మిగిలిన 133.62 కిలోమీటర్లలోనూ పూర్తి స్థాయిలో ఎల్ఈడీ వెలుగులు తీసుకొచ్చే దిశగా హెచ్ఎండీఏ అడుగులు వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరునాటికి ఓఆర్ఆర్ పూర్తిస్థాయిలో ఎల్ఈడీ వెలుగుల్లో కనపడాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రూ.107 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. చెన్నైకి చెందిన శబరి ఎలక్ట్రికల్, హైదరాబాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్ కంపెనీలు ఇందుకు పోటీపడుతున్నాయి. మరో వారం రోజుల్లో టెండర్ ఫైనల్ చేసి పనులు ప్రారంభించేలా హెచ్ఎండీఏ అధికారులు చొరవ తీసుకుంటున్నారు. అంటే టెండర్ నియమ నిబంధనల ప్రకారం 15 నెలల్లో ఎల్ఈడీ లైట్ల బిగింపు పనులు పూర్తి చేయాలి. పదివేలకుపైగా బల్బులు... శంషాబాద్ ముగింపు ప్రదేశం నుంచి కోకాపేట ముగింపు ప్రదేశం వరకు కిలోమీటర్‌కు 40 స్తంభాల చొప్పున అంటే 133.62 కిలోమీటర్లకు 5,345 స్తంభాలను ఏర్పాటుచేయనున్నారు. అలాగే ఒక్కో స్తంభానికి రెండు లైట్ల చొప్పున 10,690 లైట్లు బిగించనున్నారు. మెయిన్ క్యారేజ్ వే, జంక్షన్ల మొదలుకొని అన్ని ప్రాంతాల్లో వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కిలోమీటర్న్నరకు ఒక్కో కంట్రోల్ బాక్స్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే గతేడాది జూన్ నెలలో 24.38 కిలోమీటర్ల ఓఆర్ఆర్ శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో ఫిలిప్స్ కంపెనీ ఎల్ఈడీ వెలుగులు అందుబాటులోకొచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన 133.62 కిలోమీటర్ల పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు దక్కించుకున్న సంస్థ పూర్తి చేసే అవకాశముంది. ఆటోమేటిక్ సిస్టం... గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మార్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న జీఎస్ఎం ఆధారంగా ఆటోమేషన్ సిస్టమ్, వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్తో ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను పనిచేసేలా అధికారులు తీర్చిదిద్దనున్నారు. ఎల్ఈడీ బల్బుల వల్ల విద్యుత్ ఖర్చు తక్కువ కావడంతో పాటు ముందు వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపిస్తాయి. సెన్సర్ల సహాయంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్ఈడీ బల్బులు దేదీప్యమానంగా వెలుగుతాయి. రద్దీ లేనప్పుడు దానంతటే అదే 50 శాతం వెలుగు తగ్గిపోతుంది. ఫలితంగా విద్యుత్ బిల్లులు తగ్గనున్నాయి. ఎల్ఈడీ దీపాల నిర్వహణ ఎలా ఉంది...సరిగ్గా ఉందా లేదా అనే తదితర అంశాలను అధికారులు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే వెసులుబాటుంది. స్తంభాలకున్న జంక్షన్ బాక్సులను ఎవరైనా తెరిచిన...తస్కరించినా...విద్యుత్ చౌర్యం చేసినా వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులు, హెచ్ఎండీఏ అధికారులకు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాత్రివేళ ప్రయాణం సేఫ్... అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై రాత్రి ప్రయాణమంటే ప్రాణంతో చెలగాటం. రహదారిపై వాహనాలు నిలిపి ఉండటంతో చీకట్లో దగ్గరకు వచ్చేవరకు ఎదుటి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం. వేగాన్ని అదుపుచేయలేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే దీనంతటికి కారణం ఓఆర్ఆర్లో రాత్రి సమయాల్లో వెలుతురు లేకపోవడమనే రెండేళ్ల క్రితం గుర్తించిన హెచ్ఎండీఏ అధికారులు గతేడాది గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఎల్ఈడీ బల్బులు అమర్చారు. దీనివల్ల ఆ మార్గంలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. సురక్షిత ప్రయాణం కోసమే... ఔటర్‌పై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. గతేడాది 76 వేల వాహనాలుంటే ఇప్పుడది లక్షకు చేరుకుంది. రద్దీ సమయాల్లో రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగి రోడ్లు నెత్తురోడుతున్నాయి. లైటింగ్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడీ లైటింగ్ సత్ఫలితాలనిచ్చింది. దీంతో ఈ వెలుగుల ప్రక్రియను మిగిలిన 133.62 కిలోమీటర్లలోనూ చేపడుతున్నాం. – టి.చిరంజీవులు,హెచ్ఎండీఏ కమిషనర్ -
డివైడర్‌పై మృతదేహాల కలకలం
-
‘మహా’భాగ్యం
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి ప్రత్యేకతను తీసుకోచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. రోజురోజుకు వాహనాలు పెరుగుతుండడంతో టోల్ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. గతేడాది నెలకు రూ.16 కోట్లు వస్తే.. అదిప్పుడు ఏకంగా రూ.26 కోట్లకు చేరింది. గతేడాది వార్షికాదాయం రూ.191 కోట్లుగా కాగా ఈ ఏడాది రూ.312 కోట్లకు చేరుకుంది. తాజాగా టోల్ వసూలు ప్రక్రియకు టెండర్లు పిలవగా ఏడాది రూ.312 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా హెచ్ఎండీఏకు వచ్చే ఆదాయం నెలకు దాదాపు పది కోట్లకు అదనంగా పెరిగినట్లయింది. టోల్ వసూలు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక పరిజ్ఞనంతో నిర్వహణ కార్యకలాపాలు జరిపేందుకు టోల్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. టీఎంఎస్ ద్వారా టోల్ వసూలు, వాహనాల రాకపోకల సంఖ్య గణాంకాల వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఏటికేడు పెరుగుతున్న ఆదాయం ఓఆర్ఆర్ టోల్ ఫీజు 2012–13లో రూ9 కోట్లు వచ్చింది. 2013–14లో రూ.17 కోట్లు, 2014–15లో రూ.42 కోట్లకు చేరింది. 2016–17లో ఏకంగా రూ.110 కోట్లకు చేరగా.. 2017–18లో ఇప్పటికి రూ.191 కోట్లకు చేరింది. ఈ ఏడాదైతే ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.313 కోట్లకు ఆదాయం పెరిగింది. రోజురోజుకు ఓఆర్ఆర్ ద్వారా వచ్చివెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో పాటు ఓఆర్ఆర్ నిర్వహణకు సరైన చర్యలు తీసుకోవడం కూడా ఈ మార్గంలో వాహనదారులు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు.. మరో రెండు మూడేళ్లలో ఎటుచూసినా అడవిని తలపించేలా ప్రశాంత వాతావరణాన్ని తీసుకొస్తామంటున్నారు. ‘ఓఆర్ఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. నగరం చుట్టూ బాహ్య వలయ రహదారి ప్రపంచంలోని ఏ నగరానికి లేదు. ఈ రహదారి వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గింది. ఓఆర్ఆర్కు ఇరువైపులా గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేశాం. గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం’ అని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. -
‘ఓఆర్ఆర్’ టెండర్ల ఖరారుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్)పై టోల్గేట్ల టెండర్లను ఖరారు చేసేందుకు హైకోర్టు ధర్మాసనం హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు అనుమతినిచ్చింది. టెండర్లను ఖరారు చేయవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.21.25 కోట్లను కనీస మొత్తంగా చెల్లించేలా టెండర్లను ఖరారు చేస్తూ హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రకు చెందిన ఇంద్రదీప్ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి టెండర్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని, అయితే టెండర్లను మాత్రం ఎవరి పేరు మీదా ఖరారు చేయవద్దని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించింది. దీనిపై ధర్మాసనం ముందు హెచ్ఎండీఏ అధికారులు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
హెలికాప్టర్ అంబులెన్స్‌తో.. హెలీ వైద్యం!
సాక్షి, సిటీబ్యూరో : వాహనదారుల అతివేగం వల్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రక్తసిక్తమవుతోంది. నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓఆర్ఆర్పై ప్రమాదాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటంలేదు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), సైబరాబాద్, రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ప్రమాదాల తీవ్రత తగ్గినా.. ఆ ఘటన జరిగిన సమయంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణిస్తున్నవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్పై హెల్త్ ఎమర్జెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని క్షతగాత్రుల ప్రాణాలకు రక్షణగా మారే ‘గోల్డెన్ అవర్’లో ప్రాథమిక ఆరో గ్య సేవలు అందించడంతో పాటు సకాలంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ‘హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు’లు ఉచితంగా అందిస్తామంటూ నగరానికి చెందిన ట్రూ ఎయిడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.ఉమేష్ తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో కమిషనర్ టి.చిరంజీవులును కలిసి వివరించారు. ఈ సేవల వల్ల క్షతగాత్రుల ప్రాణాలు కాపాడే అవకాశముంటుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అది హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. క్షతగాత్రులకు సాంత్వన చేకూరేలా.. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో 2015లో 84 ప్రమాదాల్లో 81 మంది, 2016లో 104 దుర్ఘటనల్లో 119 మంది, 2017లో 52 ప్రమాదాల్లో 51మంది మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో దాదాపు 20 మంది వరకు మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు. అతివేగం, డ్రైవర్ కునుకుపాటు, నిద్ర తదితర కారణాల వల్ల జరిగిన ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని త్వరితగతిన ఆస్పత్రులకు చేరిస్తే ప్రాణాలు నిలిచేవని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణం పోసే ‘గోల్డెన్ అవర్’లో ఆస్పత్రిలో చేర్చేలా పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఓఆర్ఆర్పై సంచరిస్తున్న ఎనిమిది అంబులెన్స్‌లకు తోడు మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చి ఒక్కో అంబులెన్స్‌ను పది నుంచి 15 కిలోమీటర్ల మధ్య నిలిపేలా ఉంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఫోన్‌కాల్ రాగానే ఆ ప్రాంతానికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్పెషలైజ్డ్ డాక్టర్‌తో హెలికాప్టర్లో సేవలు.. గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట (60 నిమిషాల) సమయం. ప్రమాద తీవ్రతను బట్టి గోల్డెన్ అవర్ సమయం మారుతూ ఉంటుంది. ప్రమాదం జరిగి తీవ్రగాయాలైన సమయంలో క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకరాకపోవడంతో అనేక మంది ప్రాణాలు వదులుతున్నారు. అందుకే గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు సకాలంలో ఆస్పత్రికి చేరేలా మేమున్నామంటూ... ‘హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు’లు అందిస్తామని ట్రూ ఎయిడ్ సంస్థ ముందుకు వచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిందని ఫోన్‌కాల్ వచ్చిన సెకన్లలోనే ఘటనాస్థలికి సమీపంలో హెలికాప్టర్ వాలిపోతుంది. ఏరోమెడికల్ ఆపరేషన్ వసతులు ఉన్న ఈ హెచ్‌ఈఎంఎస్ హెలికాప్టర్లో స్పెషలైజ్డ్ డాక్టర్‌తో పాటు ప్రాథమిక చికిత్స అందించేందుకు పారామెడిక్ టీమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఓఆర్ఆర్కు నాలుగు దిక్కులా శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్, కీసర ప్రాంతాల్లో ఈ సేవలు సత్వరం అందేలా చూడనున్నారు. ఇందుకోసం గచ్చిబౌలిలోని ఇంటర్‌ఛేంజ్ వద్ద దాదాపు ఎకరం స్థలంలో ట్రూఎయిడ్కు స్థలం కేటాయించాలని ఆ సంస్థ ఎండీ ఉమేష్ కోరారు. ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ కాగానే క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మరింత చికిత్స చేసి అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలిస్తామన్నారు. ఒక్కోసారి నేరుగా ఆయా ఆస్పత్రులకు సమీపంలోనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసి అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తామని వివరించారు. ఇప్పటికే నగరంలోని చాలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని, వారి ప్రాంగణాల్లో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా చర్యలు కూడా తీసుకుంటున్నారని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ టి.చిరంజీవులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుటామని స్పష్టంచేశారు. -
ఏ క్షణమైనా డ్రంకన్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలో ఎప్పుడైనా ఓఆర్ఆర్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్లో గురువారం రాత్రి 8.30 గంటల నుంచి మూడు గంటల పాటు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి మద్యం తాగి వాహనం నడుపుతున్న 137 మంది వాహన చోదకులపై కేసులు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని ఓఆర్ఆర్లో నెలకు ఐదు నుంచి పదిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని ఇరు కమిషనరేట్ల అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి ఓఆర్ఆర్పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా చతుర్ముఖ వ్యూహన్ని అమలుచేయనున్నారు. ప్రస్తుతం రెండు కమిషనరేట్ల పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ నేర నియంత్రణ చేస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్ఆర్పై డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 156.9 కిలోమీటర్ల పరధిలో గతేడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందారు. 66 మంది గాయపడ్డారు. వేగం తగ్గించినా మారని తీరు... గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ తొమ్మిది నెలల క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ జోష్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. అతివేగం వల్ల జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదరుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగానికి చెక్ పెట్టడానికి స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలు, ఇటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ఓఆర్ఆర్ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చాలనుకుంటున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. -
ఔటర్‌పై డ్రంకన్ డ్రైవర్ల దూకుడు
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డుపై మందు బాబులు యథేచ్ఛగా దూసుకెళ్తున్నారు. అసలే ఔటర్‌పై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటారు. ఇక ఫుల్‌గా మద్యం సేవించి వాహనం నడిపితే వేగానికి అంతే ఉండదు. ఈ జోష్ ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవర్ల ఆట కట్టించేందుకు శుక్రవారం 300 మంది పోలీసులు ఓఆర్ఆర్లోని 31 ఎంట్రీల వద్ద మెరుపులా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రాత్రి 8.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో 137 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు పోలీసులకు దొరికిపోయారు. వీరిలో అత్యధిక సంఖ్యలో 90 మంది కారు డ్రైవర్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 41 మంది భారీ వాహన చోదకులు ఉన్నారు. ముగ్గురు ఆటో ట్రాలీ డ్రైవర్లు, ముగ్గురు ద్విచక్ర వాహన చోదకులు కూడా డ్రైవ్‌లో దొరికిపోయారు. నానక్‌రామ్ గూడ ఎంట్రీ,ఎగ్జిట్ వద్దే ఎక్కువగా... మామూలుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓఆర్ఆర్ మార్గంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో కొన్ని ప్రాంతాలకే పరిమితం అవడంతో డ్రంకన్ డ్రైవర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. అది కూడా వారాంతాల్లోనే చేస్తుండటంతో మిగతా రోజుల్లో మందేసి అతి వేగంతో నడుపుతూ కొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. ఒక్కోసారి తమ తప్పిదాలతోనూ ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వాహనదారులు అతివేగంతో దూసుకెళుతున్న దృశ్యాలు స్పీడ్ లేజర్ గన్ కెమెరాలకు చిక్కడంతో అది కూడా శుక్రవారం రోజున ఇవి ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అకస్మాత్తుగా మెరుపు వేగంతో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆర్జీఐ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మియాపూర్, జీడిమెట్ల, అల్వాట్ ట్రాఫిక్ పోలీసులు 31 ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద వాహనచోదకులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. అయితే నానక్‌రామ్‌గూడ ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద అత్యధికంగా 23 మంది కారు డ్రైవర్లు మందు తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. ఓఆర్ఆర్లో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేకున్నా ముగ్గురు బైకర్లు మద్యం సేవించి నడుపుతూ దొరికిపోయారు. 21 నుంచి 300 వరకు అల్కాహల్ రీడింగ్ రావడం ట్రాఫిక్ పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. హైదరాబాద్‌లో 125 మందికి జైలుశిక్ష... హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్‌లో మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 125 మందికి రెండు నుంచి 15 రోజుల పాటు ఎర్రమంజిల్‌లోని మూడు, నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన 630 మందిపై పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో 125 మందికి జైలు శిక్ష విధించగా, 33 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలల నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిందని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్ శనివారం తెలిపారు. అలాగే సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, చలాన్లు చెల్లించని, డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 42 మందికి కూడా జైలు శిక్ష పడిందని చెప్పారు. -
శివరాత్రికి అనుమానమే
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం క్షేత్రంలో జరిగే ప్రత్యేక పర్వదినాల్లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తరాదని అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. పనులు నత్తతో పోటీ పడుతుండటంతో ఇంకా మట్టి చదును చేసే పనులు కూడా పూర్తికాలేదు. శివరాత్రి నాటికి పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది కూడా వాహనదారులకు కష్టాలు తప్పేలా లేవు. సుమారు రూ.66కోట్ల వ్యయంతో ఆరు కి.మీ. రోడ్డును మూడు నెలల క్రితం ప్రారంభించిన పనులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశాలున్నాయి. మరో వారం రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుంటే కొన్నిచోట్ల మట్టి చదును పనులు కూడా పూర్తికాలేదు. కొన్నిచోట్ల గృహాలు అడ్డంరావడంతో దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్లు ఏమి చేయలేని పరిస్థితి. మరికొన్నిచోట్ల 100 మీటర్ల వెడల్పు వేయలేక 80 మీటర్లకే చేయాల్సి వస్తోంది. రింగ్‌రోడ్డులోకి ప్రవేశించే ముందు కల్వర్టు పనులు జరుగుతూనే ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి మల్లమ్మ కన్నీరు, గోశాల, తెలుగు విశ్వవిద్యాలయం, వర్క్‌షాపు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా దేవస్థానం టోల్గేట్ వరకు నిర్మించాలి. ఇప్పటివరకు దేవస్థానం గ్యాస్ గోదాము నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వరకు మట్టితో చదును చేసి కంకరవేసే పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు అడ్డంకిగా మారాయి. అలాగే 14 కల్వర్టులకు గానూ 6 మాత్రమే చివరిదశకు చేరుకున్నాయి. శివరాత్రి నాటికి పనులు కొలిక్కి రాకపోతే వాహనాల మళ్లింపు ప్రక్రియ పోలీసులకు సవాలుగా మారే అవకాశముంది. అయితే మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాల అనంతరం బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారవర్గాలు భావిస్తున్నాయని సమాచారం. -
‘ఓఆర్ఆర్’ ప్రైవేటుకు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కాసుల వర్షం కురిపించనుంది. నిర్వహణ భారం తొలగడంతోపాటు ఇతర అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ఆదాయ వనరవబోతోంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతిన టెండర్ పిలిచి 20–30 ఏళ్ల పాటు టోల్ వసూళ్లు, నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తే ఆప్ ఫ్రంట్ ఫీజు రూపంలో రూ.2,000 కోట్లు–రూ.3,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని హెచ్ఎండీఏ భావిస్తోంది. టీవోటీ పద్ధతితో.. ప్రస్తుతం టోల్ వసూళ్లను చూసుకుంటున్న ఈగల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.. హెచ్ఎండీఏకు ప్రతి నెలా రూ.16.5 కోట్లు చెల్లిస్తోంది. ఓఆర్ఆర్ నిర్వహణను మాత్రం హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తోంది. కానీ రింగ్ రోడ్డు నిర్వహణ నగరాభివృద్ధి సంస్థకు తలనొప్పిగా మారింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మార్గం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిర్వహణను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాలతో పాటు సిబ్బందికి ప్రతి నెలా రూ.30 లక్షలు హెచ్ఎండీఏ చెల్లిస్తోంది. ఇతర అవసరాలకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అనుసరిస్తున్న టీవోటీ పద్ధతితో ఏకకాలంలో భారీగా డబ్బులు రావడంతో పాటు నిర్వహణ భారమూ తొలగుతుందని హెచ్ఎండీఏ భావిస్తోంది. దీనిపై అధ్యయనానికి ట్రాన్సాక్షన్ అడ్వైజర్ (లావాదేవీల సలహాదారులు)లుగా లీ అసోసియేట్స్ సౌత్ ఆసియా, క్రిసిల్‌ను నియమించింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సదరు సంస్థలు నివేదిక సమర్పించనున్నాయి. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతి రాగానే ముందుకెళ్లాలని భావిస్తోంది. వైఎస్సార్ దూరదృష్టి.. వైఎస్సార్ హయాంలో రూ.6,696 కోట్లు వెచ్చించి 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. ఆయన దూరదృష్టితో నిర్మించిన ఎనిమిది లేన్ల ఓఆర్ఆర్.. ఇప్పుడు హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచింది. శివారు ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిగా మారింది. నగరంపై సగం ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించింది. తాజాగా అదే ఓఆర్ఆర్ ప్రస్తుత ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చబోతోంది. ఇలా మరెన్నో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు ఆదాయ వనరవబోతోంది. -
ఆ నలుగురిపై అతడి వేలిముద్రలు!
-
ఆ నలుగురిపై అతడి వేలిముద్రలు!
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగు రోడ్డు సమీపంలో వెలుగుచూసిన ఐదు మృతదేహాల ఉదంతం వెనుక రెండోరోజు కూడా మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మీర్జాగూడ శివారు ఇంద్రారెడ్డి కంచెలో లభ్యమైన మూడు మృతదేహాలతోపాటు కారులో లభించిన బాలుడి మృతదేహంపై ప్రభాకర్ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టు క్లూస్‌టీమ్ ధ్రువీకరించినట్టు తెలిసింది. ఘటనాస్థలిలో లభించిన వాటర్ బాటిల్స్‌తోపాటు థమ్సప్ బాటిళ్లపైనా అతడి వేలిముద్రలు ఉన్నట్టు గుర్తించారు. ‘‘వాటర్ బాటిళ్లు, థమ్సప్‌లో విషం కలపడం వల్లే అది సేవించిన ప్రభాకర్ రెడ్డి భార్య మాధవి, ఆయన పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తె సింధుజ చనిపోయారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి కారును ఆపి రోడ్డుపక్కనే ఉన్న పొదల్లో వారిని పడేశాడు. ఘటనా స్థలిలో పాదముద్రలు కూడా ఒకరికి మించి ఎక్కువ లేవు. ఆ తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్ అండర్‌పాస్ బ్రిడ్జ్ కింద కారులో చనిపోయి పడి ఉన్న వశిష్ట్ రెడ్డి మృతదేహంపై కూడా ప్రభాకర్ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టుగా తేల్చారు. కారులో లభించిన వాటర్బాటిళ్లపై కూడా అతడి వేలిముద్రలు ఉన్నాయి’’ అని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నలుగురికి విషమిచ్చి, వారు చనిపోయాక ప్రభాకర్‌రెడ్డి కూడా విషం తాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు రామచంద్రాపురం మండలం అశోక్‌నగర్‌లో ప్రభాకర్ రెడ్డి అద్దెకు ఉన్న ఇంట్లో పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. ల్యాప్‌టాప్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలు లక్ష్మి తన భర్త రవీందర్‌రెడ్డికి తెలియకుండా ఇతరుల నుంచి రూ.80 లక్షలు తీసుకొని ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఇండియా ఇన్ఫోలైఫ్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన స్టాక్ మార్కెట్ లావాదేవీలపైనా ఆరా తీశారు. అతడి డీమ్యాట్ ఖాతాను సీజ్ చేయాలంటూ బ్యాంక్‌కు నోటీసులు జారీచేశారు. ప్రభాకర్‌రెడ్డి బాబాయి కొండాపురం రవీందర్‌రెడ్డి నివాసానికి కూడా నార్సింగి పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. కాగా, ప్రభాకర్ రెడ్డి వద్ద స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టామంటూ కొందరు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యను కలిశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానికంగా వివాదాలు లేవు.. రెండేళ్లుగా ఇంట్లో అద్దెకు ఉంటున్నా.. ప్రభాకర్‌రెడ్డి ఎన్నడూ ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల్లో ఉన్నట్లు కనిపించలేదని ఇంటి యజమాని పేర్కొన్నారు. అప్పుడప్పుడూ తల్లిదండ్రులు, ఒకరిద్దరు సమీప బంధువులు మాత్రమే వచ్చేవారని.. మిత్రులు కూడా పరిమితంగానే వచ్చేవారని వెల్లడించారు. రవీందర్‌రెడ్డి కుటుంబంతో మాత్రం ప్రభాకర్‌రెడ్డి సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. -
20న వరంగల్ ఓఆర్ఆర్కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 20న శంకుస్థాపన చేయనున్నారు. దీని నిర్మాణానికి రూ.669 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కేంద్రం ఓవైపు ఓఆర్ఆర్ నిర్మాణం చేపడుతుండగా, రాష్ట్రప్రభుత్వం కూడా పనులు చేపట్టనుంది. వరంగల్ ఓఆర్ఆర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పాటు శంకుస్థాపనకు అంగీకరించిన కేసీఆర్‌కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఓఆర్ఆర్ ప్రతిపాదనలు, అంచనాలు రూపొందించడంలో కడియం ప్రత్యేక చొరవ తీసుకున్నారని సీఎం కొనియాడారు. అదే స్ఫూర్తితో నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలని కడియంను కోరారు. -
ఓఆర్ఆర్లో సైకిల్ ట్రాక్ !
సాక్షి, హైదరాబాద్ : నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్ మహానగరపాలిక అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అడుగులు వేస్తోంది. నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్‌ను నిర్మించ నుంది. ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్, సర్వీస్ రోడ్డు మధ్యలో ఉన్న 25 మీటర్ల ఖాళీ స్థలంలో 6 నుంచి 8మీటర్ల వెడల్పుతో ఈ ట్రాక్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనుంది. సైకిలిస్టులు సేద తీరేలా జంక్ష న్ల వద్ద బెంచ్‌లు కూడా ఏర్పాటు చేయనుంది. హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఈ మార్గంలో పర్యటించిన తర్వాత ఈ సైకిల్ ట్రాక్ ఆలోచన పట్టాలెక్క నుంది. గతంలో నార్సింగ్ నుంచి ఎదుల నాగులపల్లి వరకు దాదాపు 50 కిలోమీటర్ల వరకు సైకిల్ ట్రాక్ నిర్మిద్దామని అనుకున్నా వ్యయం ఎక్కువ కావడంతో పనులను అటకెక్కించేశారు. ఈసారి అలా కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. నార్సింగ్ నుంచి కొల్లూరు వయా కోకాపేట మార్గంలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో వందలాది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండటంతో వేలల్లో ఉద్యోగులు కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వస్తున్నారు. దీంతో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీనికితోడు ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఆర్లో సైకిల్ ట్రాక్ అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు ఐటీ ఉద్యోగులు సైకిల్‌పై కార్యాలయాలకు వచ్చేలా ప్రోత్సహించడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళలో సైక్లింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగులు కొల్లూరులో వాహనాలు ఆపేందుకు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అంశంపై దృష్టి సారించారు. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్‌ల సహకారంతో వీలైతే సైక్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి అద్దె ప్రాతిపదికన సైకిల్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. నెదర్లాండ్‌లోని సైక్లింగ్ ట్రాక్‌ల తరహాలో ఇక్కడ కూడా సైక్లింగ్ వసతులను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని, సాధ్యమైనంత తొందరగా ఈ పనులు చేస్తామని ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్ మోహన్ తెలిపారు. -
ఔటర్‌పై మరో నిండుప్రాణం బలి
♦ భర్తను చూసేందుకు వెళ్తున్న మహిళను ఢీకొన్న కారు ♦ అక్కడికక్కడే దుర్మరణం శంషాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో నిండుప్రాణం బలైంది. తన భర్తను చూసేందుకు వెళ్తున్న ఓ మహిళను కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడకు చెందిన శివలీల తన మేనత్త కాట్రావత్ దేవి(40)తో కలసి చికిత్స కోసం శంషాబాద్ వచ్చింది. తిరుగు ప్రయాణంలో వీరు తొండుపల్లి వద్ద ఔటర్ జంక్షన్లో లారీ ఎక్కారు. ఔటర్‌పై శివలీల భర్త జగన్, దేవి భర్త భిక్య కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి వద్దకు వెళ్లడానికి శివలీల, దేవి హమీదుల్లానగర్ సమీపంలో ఔటర్‌పై లారీ దిగారు. అక్కడ రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. శంషాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇండికా కారు వేగంగా వచ్చి దేవిని ఢీకొంది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెం దింది. ఈ హఠాత్పరిణామానికి శివలీల షాక్‌కు గురై స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. -
సొంతింటికి పశ్చిమ దిక్కు!
నివాస, వాణిజ్య సముదాయాలతో వెస్ట్ జోన్లో రియల్ జోరు ఐటీ, ఆర్థిక సంస్థలతో పాటూ విద్యా, వైద్య, వినోద కేంద్రాలిక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, ఓఆర్ఆర్లు అదనపు ఆకర్షణలు నిర్మాణంలో 300–400 ప్రాజెక్ట్‌లు; ప్రతికూలంలోనూ అమ్మకాలు భాగ్యనగరి అభివృద్ధిలో, ఆదాయంలోనూ భాగస్వామి.. ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, ఆర్ధిక సంస్థలకు నిలయం.. ప్రతికూల వాతావరణంలోనూ స్థిరాస్తి అమ్మకాలకు చిరునామా.. అంతర్జాతీయ విద్యా, వైద్య, వినోద సంస్థలతో నిత్యం కిటకిటలాడే ప్రాంతం.. .. ఈ ఉపోద్ఘాతమంతా పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి గురించి! స్థిరాస్తి రంగంలోనే కాదు నగరాభివృద్ధిలోనూ వెస్ట్ జోన్ కీలకమైంది. నిజం చెప్పాలంటే వెస్ట్ జోన్లో ప్రాజెక్ట్ చేయడం డెవలపర్లకు, సొంతిల్లు కొనడం కొనుగోలుదారులకూ స్టేటస్ సింబల్! సాక్షి, హైదరాబాద్:కూకట్‌పల్లితో ప్రారంభమయ్యే పశ్చిమ జోన్ .. శేరిలింగంపల్లి, పటాన్చెరు వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, గోపనపల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్ ప్రాంతాలు కీలకమైనవి. ఎందుకంటే ఐటీæ, ఐటీఈఎస్, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ విద్య, వైద్య సంస్థలతో పాటూ లగ్జరీ షాపింగ్ మాళ్లకు నిలయం మరి! వీటికి తోడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ట్రయల్ రన్ పరుగులు అదనపు ఆకర్షణలు. 400 గజాల నుంచి నిర్మాణాలు.. వెస్ట్ జోన్లో కేవలం లగ్జరీ విల్లాలు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాలు మాత్రమే కాదు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే చిన్న చిన్న అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. పశ్చిమ జోన్లో చ.అ. ధరలు రూ.3,500–8,000 వరకుంటాయి. కానీ, 90 శాతం మార్కెట్ రూ.4,500 లోపే ఉంటుందని వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం సుబ్బయ్య చెప్పారు. ప్రస్తుతం ఈ జోన్లో 300–400 ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉంటాయని.. ఇందులో 400 గజాల నుంచి 5 ఎకరాల వరకు ప్రాజెక్ట్‌లుంటాయని పేర్కొన్నారు. ఏ తరహా ప్రాజెక్ట్‌లైనా సరే 70–80 శాతం కొనుగోళ్ల వాటా ఐటీ ఉద్యోగులది. ఆ తర్వాత ఫార్మా, ప్రభుత్వ ఉద్యోగులుంటారు. ప్రతికూలంలోనూ అమ్మకాలు.. జీహెచ్ఎంసీ ఆదాయంలో 50–60 శాతం ఆదాయం ఒక్క వెస్ట్ జోన్ నుంచే వస్తుంది. కార్యాలయాలకు, వినోద కేంద్రాలకు చేరువలో ఇళ్లు ఉండటంతో ప్రతికూల సమయంలోనూ పశ్చిమ జోన్లో అమ్మకాలు బాగుంటాయని వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం ప్రేమ్ కుమార్ చెప్పారు. ఏటా స్థలాల ధరలు, నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో చ.అ. ధరలు కూడా రూ.100–300 వరకు పెంచక తప్పని పరిస్థితి. మంచి నీళ్లు, విద్యుత్ సరఫరా, మెరుగైన రహదారులు వంటి వాటికైతే పశ్చిమ జోన్లో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. స్థానిక రాజకీయాంశం, ఆర్థిక మాంద్యం, పెద్ద నోట్ల రద్దు వంటి పలు కారణాలతో గత కొంతకాలంగా మార్కెట్లో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఇళ్ల ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. అయితే ఏమాత్రం సానుకూల వాతావరణం కనిపించినా ఒక్కసారిగా ధరలు పెరిగే అవకాశముంది. అందుకే సొంతింటి సాకారానికి ఇదే సరైన సమయమని చెప్పారు. వెస్ట్ జోన్ స్టేటస్ సింబల్.. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం సన్నద్ధమైంది. స్థానికులే కాదు వివిధ ప్రాంతాల వారూ నగరంతో పాటూ తామూ అభివృద్ధి చెందుతామనే నిర్ణయానికొచ్చారు. దీంతో నివాస సముదాయాలకు గిరాకీ పెరిగిందని వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎం రాఘవ రావు చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాజెక్ట్ వ్యయంలోని 40 శాతం పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నాం. ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములయ్యే నిర్మాణ రంగాన్ని రకరకాల ఇబ్బందులతో అష్టదిగ్బంధనం చేయకూడదని సూచించారు. స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహిస్తే మరింత నాణ్యమైన ఇళ్లను అందించడంతో పాటూ సొంతింటి కలను తీరుస్తున్నామని పేర్కొన్నారు. మెట్రో, ఓఆర్ఆర్లు అదనపు ఆకర్షణ వెస్ట్ జోన్‌కు మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డులు అదనపు ఆకర్షణలు. మెట్రో కారిడార్ 1లో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గం ఉంది. ఇందులో మియాపూర్ నుంచి భరత్ నగర్ వరకు వెస్ట్ జోన్ కిందికే వస్తుంది. ఇప్పటికే ఈ మార్గంలో నిర్మాణం పూర్తయి.. మెట్రో ట్రయల్ రన్ పరుగులు పెడుతోంది కూడా. కారిడార్ 3లో నాగోల్– రాయదుర్గం మార్గంలో.. మాదాపూర్ నుంచి రాయదుర్గం వరకు ఈ జోన్లోనే ఉంది. ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భాగ్యనగరాన్ని ఇతర జిల్లాలలో కలుపుతూ నిర్మించిన 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డులో.. 22 కి.మీ. గచ్చిబౌలి– శంషాబాద్ రోడ్డు, 23.7 కి.మీ. నార్సింగి–పటాన్చెరు రోడ్డు పశ్చిమ హైదరాబాద్ మీదుగానే వెళుతుంది. దీంతో గచ్చిబౌలిలో ఓఆర్ఆర్ నుంచి నగరం చుట్టూ సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఇవి అమలైతే.. ప్రస్తుతమున్న ఔటర్‌రింగ్ రోడ్డుతో పాటూ అదనంగా మరో రింగ్ రోడ్డును అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇది అమల్లోకి వస్తే.. పశ్చిమ హైదరాబాద్ విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశముంది. ప్రస్తుతమున్న మెట్రో రైలును శిల్పారామం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకూ, మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా అమల్లోకి వస్తే.. పశ్చిమ హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయటంలో ఎలాంటి సందేహమక్కర్లేదు. వివేకానంద నగర్లో ప్రేమ్ సరోవర్ సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధరల్లో ఆధునిక వసతులతో అదీ పశ్చిమ హైదరాబాద్‌లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేస్తోంది ప్రేమ్ కన్స్ట్రక్షన్స్. 2 దశాబ్దాలుగా 30కి పైగా ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిందీ సంస్థ. ఇప్పుడిదే ఉత్సాహంతో కూకట్‌పల్లిలోని వివేకానంద కాలనీ పక్కన గొట్టిముక్కలాస్ ప్రేమ్ సరోవర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని సంస్థ చైర్మన్ ఎం ప్రేమ్ కుమార్ తెలిపారు. హా 4,500 గజాల్లో మొత్తం 65 ఫ్లాట్లుంటాయి. సెల్లార్+స్టిల్ట్+ 5 అంతస్తులు. 2 బీహెచ్‌కే 1,170 చ.అ., 3 బీహెచ్‌కే 1,512 నుంచి 1,755 చ.అ. విస్తీర్ణాల్లో ఉంటాయి. ధర చ.అ.కు రూ.3,500. జూన్ నాటికి చందానగర్‌లో 2 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. హా తెలంగాణ ప్రభుత్వ 2 బీహెచ్‌కే పథకంలో మేమూ భాగస్వాములమయ్యాం. నల్లగండ్లలో గుల్మొహర్ పార్క్ పక్కన 216 రెండు పడక గదులను నిర్మిస్తున్నాం. ఇప్పటికే వెస్ట్ జోన్లో సాయి కిషన్ నిలయం, సిరి విస్టా, సాయి బృందావనం, రామ రెసిడెన్సీ వంటి పలు ప్రాజెక్ట్‌లు 700 ఫ్లాట్లను నిర్మించాం. కృష్ణారెడ్డిపేటలో వీఆర్సీ విల్లాస్ సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో నాణ్యత, ఆధునిక వసతులే లక్ష్యంగా గృహాలను నిర్మిస్తోంది వీఆర్సీ ఇన్ఫ్రా. ఇప్పుడిదే లక్ష్యంతో వీఆర్సీ విల్లాస్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామని సంస్థ సీఎండీ మిర్యాల రాఘవరావు చెప్పారు. పటాన్‌చెరులోని కృష్ణారెడ్డిపేటలో 5 ఎకరాల్లో వీఆర్సీ విల్లాస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 75 లగ్జరీ విల్లాలుంటాయి. ఒక్కోటి 150, 167 గజాల్లో ఉంటుంది. ధర చ.అ.కు రూ.3,000. లే అవుట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2 వారాల్లో నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీప దూరంలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉందీ వీఆర్సీ విల్లాస్. 15 రోజుల్లో నల్లగండ్లలో వీఆర్సీ హౌజింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. మొత్తం 1,500 గజాల్లో 40 ఫ్లాట్లొస్తాయి. 1,200–1,500 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.3,500. బీహెచ్ఈఎల్ ఉద్యోగుల కోసం కృష్ణారెడ్డిపేటలో మెట్రో ఎన్క్లేవ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 50 ఎకరాల్లో 650 ఇండిపెండెంట్ గృహాలుంటా యి. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 6 నెలల్లో కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఏమంటోందంటే స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)లో నిర్మాణదారున్ని మాత్రమే బాధ్యుణ్ని చేయడం దారుణం. ఎందుకంటే ఇళ్లు నిర్మించాలంటే ఒక్క డెవలపర్ ఉంటే సరిపోదు. నిర్మాణ అనుమతులిచ్చే అధికారులు, స్ట్రక్చర్, డిజైన్ల చేసే ఆర్కిటెక్చర్లు, నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు ఇలా ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అయితేనే ఇల్లు పూర్తవుతుంది. అలాంటప్పుడు నిర్మాణ లోపాలుంటే కేవలం డెవలపర్‌ను మాత్రమే బాధ్యుల్ని ఎలా చేస్తారు? ఈ విషయంపై తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదించనున్నాం. 599 గజాల్లోపు స్టిల్ట్4 అంతస్తుల నిర్మాణాలకు ప్రస్తుతం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయితే 1,000 గజాల వరకూ నిర్మాణ అనుమతులను జోనల్ కార్యాలయంలోనే ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే చిన్న బిల్డర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది. నిర్మాణ పనులను ఆపేసి తీరా వెళ్లే సరికి సమయానికి అధికారులు లేకపోవటంతో సమయం వృథా అవుతోంది. జీహెచ్ఎంసీ మ్యుటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లిస్తున్నాం. కొనుగోలుదారులకు మ్యుటేషన్ ఇబ్బంది లేకుండా చేయాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీలో డెవలపర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు. నిర్మాణంలో 10 శాతం డీవియేషన్ చేస్తే డెవలపర్ల నుంచి పెనాల్టీని వసూలు చేసి జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ)ని జారీ చేస్తుంది. అయితే డీవియేషన్ చేశారన్న కారణంతో కొనుగోలుదారుల నుంచి కూడా మున్సిపల్ హౌజింగ్ ట్యాక్స్ కింద 25 శాతాన్ని వసూలు చేస్తున్నారు. ఈ ద్వంద్వ పన్ను వసూళ్లను వెంటనే ఆపేయాలి. సమస్యలను పరిష్కరించడంలో స్థానిక నిర్మాణ సంఘాలను భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే సమస్యను లోతుగా అధ్యయనం చేసి.. శాశ్వత పరిష్కారానికి వీలుంటుంది. నిర్మాణ రంగానికి సంబంధించిన జీవోలు, నిబంధనల సవరణలో సంఘాల సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. -
హైవేలను అనుసంధానిస్తూ ఓఆర్ఆర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలకు కొత్తగా జాతీయ రహదారులు మంజూరైన నేపథ్యంలో వాటికి మరోవైపు రోడ్ల నిర్మాణం చేపట్టి ఔటర్ రింగు రోడ్లు (ఓఆర్ఆర్)గా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా ప్రధాన పట్టణాలకు రింగు రోడ్లు సమకూరుతాయన్నారు. రూ.223.35 కోట్లతో చేపడుతున్న గజ్వేల్ రింగు రోడ్డు పనులు మొదలయ్యాయని, రూ.209 కోట్లతో చేపట్టనున్న ఖమ్మం రింగు రోడ్డు డీపీఆర్ సిద్ధమైం దని, రూ.96.70 కోట్లతో చేపట్టనున్న మహబూబ్‌నగర్ రింగురోడ్డు నిర్మాణ సంస్థ ఖరారైందని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు మరోపక్క జాతీయ రహదారితో దీన్ని రింగు రోడ్డుగా మారుస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డికి సంబంధించి జాతీయ రహదారి మినహా శంకర్పల్లి–కంది మధ్య రాష్ట్ర నిధులతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. జనగామను కూడా అదే పద్ధతిలో అనుసంధానించనున్నట్లు తెలిపారు. -
కారులో అగ్నికీలలు.. నలుగురి ఆహుతి
- ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం - డివైడర్‌ను ఢీకొన్న కారు.. చెలరేగిన మంటలు - డోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమైన నలుగురు మిత్రులు - స్నేహితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపి వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం - మృతుల్లో ఒకరిది బెల్లంపల్లి, ముగ్గురిది వరంగల్ జిల్లా - శోకసంద్రంలో మునిగిన కుటుంబీకులు హైదరాబాద్/పరకాల/హన్మకొండ/బెల్లంపల్లి: ఔటర్‌పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి వస్తున్న నలుగురు మిత్రులు కారులోనే సజీవ దహనమయ్యారు. డివైడర్‌ను ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డోర్లు తెరుచుకోకపోవడంతో అందులోనే వారంతా అగ్ని కీలలకు ఆహుతయ్యారు. సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుపై ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతులంతా 30 ఏళ్లలోపు వారే. వారిలో ఇద్దరు వివాహితులు. ఒకరికి మూడు నెలల కూతురు, మరొకరికి 11 నెలల బాబు ఉన్నాడు. సాగనంపేందుకు వచ్చి మృత్యు ఒడికి.. వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన బుద్ద శివక్రిష్ణ(26), విజ్జిగిరి శ్రీకాంత్(24), పరకాల మండలం నర్సక్కపల్లెకు చెందిన సురావ్ రాజు(25), మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శశిధర్(27)లు స్నేహితులు. పరకాల మండలం రాజీపేటకు చెందిన వీరి స్నేహితుడు భాస్కర్ కోయంబత్తూరులో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి భాస్కర్ కోయంబత్తూరు వెళ్తుండడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను దింపేందుకు అంతా కలిసి శివకృష్ణకు చెందిన ఆల్టో కారులో వరంగల్ నుంచి బయల్దేరారు. రాత్రి 3 గంటల సమయంలో భాస్కర్‌ను ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టారు. తిరిగి వరంగల్‌కు వస్తుండగా సోమవారం తెల్లవారుజామున 4.30-5 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట ఔటర్ కూడలి వద్దకు రాగానే కారు అదుపు తప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బయటపడేందుకు యత్నించినా డోర్లు తెరుచుకోలేదు. మంటలు విపరీతంగా చెలరేగడంతో ఆర్తనాదాల మధ్య ప్రాణాలు విడిచారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న ఔటర్, పోలీస్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్‌ను రప్పించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కారులోని నలుగురు యువకులు కాలిబూడిదయ్యారు. సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నాలుగు మృతదేహాలకు బంధువులు, పోలీసుల సమక్షంలో సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం పూర్తిచేశారు. మృతదేహాలన్నీ కాలిపోయి ముద్దగా మారిపోవడంతో వాటి గుర్తింపు పోలీసులకు కష్టంగా మారింది. దీంతో చివరికి రక్తనమూనాలు సేకరించి మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. ఎల్బీనగర్ డీసీపీ తప్సీర్ ఇక్బాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తల్లడిల్లిన కుటుంబీకులు ప్రమాదం వార్త తెలియగానే నలుగురు యువకుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ మిత్రుడు భాస్కర్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై వస్తామని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారుు. మృతుల్లో పరకాలకు చెందిన శివకృష్ణ.. బీటెక్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ప్రస్తుతం హన్మకొండలో తన తండ్రి శంకరయ్యకు చెందిన మెడికల్ షాపు నిర్వహణలో పాలుపంచుకుంటున్నాడు. ఆయనకు భార్య, మూడు నెలల కూతురు ఉంది. శ్రీకాంత్, రాజు, శశిధర్ గ్రూపు పరీక్షలకు హన్మకొండలో గదిని అద్దెకు తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. శ్రీకాంత్ తండ్రి సమ్మయ్య భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బీటెక్ చదివిన శ్రీకాంత్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. బెల్లంపల్లికి చెందిన శశిధర్ ఏడాది కిందట బీటెక్ పూర్తి చేశాడు. ఈయన తండ్రి కూడా సింగరేణి కార్మికుడే. నర్సక్కపల్లికి చెందిన సురావు రాజుకు మూడు సంవత్సరాల కిందటే కృష్ణవేణితో పెళ్లయింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. కారు ప్రమాదం సమయంలో మంటల్లో చిక్కుకొని రక్షించాలంటూ నలుగురు మిత్రులు అరుస్తున్న దృశ్యాలు వాట్సప్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన వారి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్నారు. -
సీట్‌బెల్ట్ వాడకే మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధే అనేక మంది పాలిట శాపంగా మారుతోంది. సీట్ బెల్ట్ వినియోగించని కారణంగానే ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని భార్య , డ్రైవర్ మృతిచెందారు. పిన్నమనేని సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి మృత్యువాతపడటానికీ సీట్ బె ల్ట్ ధరించకపోవడమే కారణం. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి కారు ఔటర్‌పై ప్రమాదానికి గురైనప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు మరణించినా..సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ఆరవ్‌రెడ్డి బయటపడ్డారు. సీట్ బెల్ట్ ఎందుకంటే..:కారులో ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో వారూ ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. దీంతో ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లు తదితరాలను వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీ కొడితే.. అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఇలా పడటం వల్ల తీవ్రగాయాలపాలై మృత్యువాతపడుతుంటారు. అదే సీట్ బెల్ట్ వాడితే పెద్ద కుదుపునకు మాత్రమే గురై గాయాలతో బయటపడచ్చు. సీట్ బెల్ట్‌కు.. ఎయిర్ బ్యాగ్స్‌కు లింకు..! - పిన్నమనేని కారు ప్రమాదంలో తెరుచుకోని ఎయిర్‌బ్యాగ్స్ సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ప్రమాదానికి గురైన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం మిత్సుబిషి కంపెనీ పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్‌కు చెందింది. ఈ వాహనానికి ముందు సీట్లకు ఎదురుగా రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు తక్షణం అవి తెరుచుకుని డ్రైవర్‌తో పాటు పక్క సీటులో కూర్చున్న వారికీ ముప్పును తగ్గిస్తాయి. అయితే పిన్నమనేని ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనా ఇవి తెరుచుకోలేదని, దీనికి కారణం ఏమిటనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వీవీ చలపతి ‘సాక్షి’కి తెలిపారు. వాహనరంగ నిపుణులు మాత్రం లేటెస్ట్ మోడల్‌కు చెందిన ఈ తరహా కారుల్లో డ్రైవర్ సీటుబెల్ట్ ధరిస్తేనే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయ్యేలా తయారీదారులు రూపొందించారని చెప్తున్నారు. పిన్నమనేని డ్రైవర్ ‘బెల్ట్’ పెట్టుకోకపోవడంతో... పిన్నమనేని ప్రయాణిస్తున్న కారులో ఆయన డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. ఆయన సీట్ బెల్ట్ ధరించగా.. డ్రైవర్ స్వామిదాసుతో పాటు వెనుక కూర్చున్న భార్య సాహిత్యవాణి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్లో సీట్ బెల్ట్‌కు, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు ఉంటుందని వాహనరంగ నిపుణులు చెప్తున్నారు. డ్రైవింగ్సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుందని అంటున్నారు. స్వామిదాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే.. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణ నషం్ట తగ్గేదని వ్యాఖ్యానిస్తున్నారు. వాహనానికి సంబంధించి ఎయిర్‌బ్యాగ్స్ అంశాన్ని నిత్యం పరీక్షించుకోవడం కూడా ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. -
భర్తను విదేశానికి పంపేందుకు వెళుతూ..
హైదరాబాద్: భర్తను విదేశానికి సాగనంపేందుకు పిల్లలతో సహా ఎయిర్ పోర్టుకు బయలుదేరిన మహిళ మృత్యువాతపడింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాధురి (28) అనే మహిళ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. కీసర సమీపంలోని నాగారంలో మాధురి కుటుంబం నివసిస్తోంది. ఆమె భర్త దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేందుకు పిల్లలతోపాటు కారులో బయలుదేరారు. ఔటర్ పై తుక్కుగూడ వద్ద.. ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిని కనుగొనడంలో పొరపాటు తలెత్తడంతో రోడ్డు మధ్యనే బ్రేక్ వేశారు. దీంతో వెనుకనుంచి వస్తోన్న మరో కారు మాధురి కుటుంబం ప్రయాణిస్తోన్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
ఔటర్ వెంట సైక్లింగ్ అంట..
ఘట్కేసర్ నుంచి శామీర్‌పేట వరకు ట్రాక్ ఏర్పాటుకు నిర్ణయం అంతర్జాతీయ పోటీలకు అనువుగా నిర్మాణం 100రోజుల ప్రణాళికలో చేపట్టనున్న హెచ్ఎండీఏ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలకు వేదిక కానుంది. ఇందుకోసం ఔటర్ రింగ్‌రోడ్డు వెంట అంతర్జాతీయ ప్రమాణాలతో సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో సైక్లింగ్ ట్రాక్ ప్రాజెక్టును చేపట్టాలని మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు హెచ్ఎండీఏకు నిర్దేశించారు. ఔటర్ వెంట ఇందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు హెచ్ఎండీఏ సర్వే నిర్వహిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా మెయిన్ కారేజ్ వేకు- సర్వీసు రోడ్‌కు మధ్యలో 25 మీటర్ల వెడల్పులో రైల్వే కారిడార్ కోసం 158కి.మీ. మేర స్థలం కేటాయించారు. ఈ స్థలంలో కొంత భాగాన్ని సైక్లింగ్ ట్రాక్ కోసం వినియోగించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ప్రధానంగా ఘట్కేసర్ నుంచి శామీర్‌పేట వరకు సుమారు 25కి.మీ. దూరం అంతర్జాతీయ ప్రమాణాలతో సైక్లింగ్ ట్రాక్‌ను తీర్చిదిద్దేందుకు సన్నద్ధమైంది. ఇంటర్నేషనల్ సైక్లింగ్ పోటీలను నిర్వహించేందుకు అనుగుణంగా ట్రాక్ ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించడంతో హెచ్ఎండీఏ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్రాక్‌ను 3-5 మీటర్ల వెడల్పులో నిర్మించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్రాక్ నిర్మించాలంటే భూ ఉపరితలం (టాప్ సర్ఫేస్ ఫినిషింగ్) రబ్బర్‌తో రూపొందించాల్సి ఉంటుంది. అసలు సైక్లింగ్ ట్రాక్‌ను రబ్బర్తోనా లేక సిమెంట్/గ్రావెల్‌తో నిర్మించాలా...? అన్నదానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా కల్వర్టులు, రోడ్ అండర్ పాస్‌లున్న చోట సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం ఎలా చేపట్టాలి..? 25 కి.మీ. మేర ట్రాక్ నిర్మించేందుకు ఎంత వెచ్చించాల్సి ఉంటుందన్నదానిపై ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఈ ప్రాజెక్టును 100 రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ పట్టుదలతో ఉన్నారు. -
మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
పటాన్చెరులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన వరుణ్‌తో పాటు పెదనాన్న కుమారుడు అమిత్, స్నేహితుడు జ్ఞాన్దేవ్ కూడా మృతి పాల ట్యాంకర్‌ను అమిత వేగంతో ఢీకొట్టిన స్కోడా కారు పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను చుట్టి ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. మాజీ డీజీపీ, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ (21)తో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట ప్రాంతంలో బుధవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కోడా కారు.. ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న వరుణ్ పవార్‌తో పాటు అమిత్ పవార్ (21), జ్ఞాన్దేవ్ (21) మరణించారు. మరో యువకుడు రాహుల్ పవార్ (22) తీవ్రగాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుభకార్యానికి వెళ్లివస్తూ.. పేర్వారం రాములు కుమార్తె రేవతి కుమారుడే వరుణ్ పవార్. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య వద్దే ఉంటున్నాడు. అమిత్ పవార్, రాహుల్ పవార్ వరుణ్ పెదనాన్న కుమారులు. మంగళవారం రాత్రి పటాన్చెరులో ఓ స్నేహితుడి ఇంట్లో శుభాకార్యానికి వరుణ్ పవార్, అమిత్పవార్, రాహుల్పవార్లతో పాటు వారి స్నేహితుడు కుందన్‌బాగ్‌కు చెందిన జ్ఞాన్దేవ్ కలసి వెళ్లారు. అర్ధరాత్రి కావడంతో పటాన్‌చెరులోని ఫాంహౌస్‌లోనే ఉండి బుధవారం ఉదయం ఇంటికి బయలుదేరారు. ఉదయం 6.30 ప్రాంతంలో ఓఆర్ఆర్పై కోకాపేట్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అమిత వేగంతో ఉన్న వారి వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న పాల ట్యాంకర్ (టీఎస్ 08 యూఏ 0086)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్, అమిత్, జ్ఞాన్దేవ్ అక్కడికక్కడే మృతిచెందారు. రాహుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ కారును వరుణ్ నడుపుతుండగా.. ముందు సీట్లో జ్ఞాన్దేవ్, వెనుక సీట్లలో మిగతా ఇద్దరూ కూర్చున్నారు. నుజ్జునుజ్జయిన కారు.. ట్యాంకర్ వెనుక ఇరుక్కున్న స్కోడా వాహనాన్ని పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అమిత వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోవడంతో తీసేందుకు దాదాపు గంటసేపు పట్టింది. అనంతరం కారు ముందు భాగం నుంచి ఇద్దరి మృతదేహాలను తీసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలోని పేర్వారం నివాసానికి మృతదేహాలను తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు మృతదేహాలపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్, పలువురు ప్రముఖులు అక్కడికి వచ్చి పేర్వారం రాములును పరామర్శించారు. మృతదేహాల్ని వారి స్వస్థలం నిజామాబాద్ జిల్లాకు తరలించారు. ప్రమాదానికి పొగమంచే కారణమా? కోకాపేట్ ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్ చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు ఉన్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉంటుంది. ఆ కారణంగానే ముందు వెళుతున్న వాహనాన్ని వరుణ్ గమనించక ఢీకొట్టి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాల ట్యాంకర్ వెనుక బంపర్ ఎత్తులో ఉండటంతో పాటు కమాన్పట్టీలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇదికూడా ప్రమాద తీవ్రతను పెంచాయని చెబుతున్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ్ముళ్లు చనిపోయారు.. అన్నది బతుకుపోరాటం నిజామాబాద్‌కు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే సతీశ్‌పవార్ సోదరులు దిగంబర్ పవార్, సుభాష్ పవార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దిగంబర్ పవార్ కుమారులే రాహుల్, అమిత్. మేడ్చల్‌లోని సీఆర్పీ కాలేజీలో రాహుల్ బీటెక్ ఫైనలియర్, అమిత్ బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. రోడ్డు ప్రమాదంలో అమిత్ చనిపోగా.. రాహుల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. --------------- నీలో కూతురిని చూసుకుంటున్నా.. నిజామాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సుభాష్పవార్, పేర్వారం రాములు కుమార్తె రేవతి దంపతులు. వారికి వరుణ్ (23) ఏకైక కుమారుడు. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య పేర్వారం రాములు ఇంట్లోనే ఉంటున్నాడు. వరుణ్‌ను రాములు భార్య ఇందిర ప్రాణంగా చూసుకుంటారు.11:19 గంటలకు 11/25/2015 ప్రమాదంలో వరుణ్ మరణించడంతో ఆమె ఆవేదనలో కూరుకుపోయారు. ‘నీలో నా బిడ్డను చూసుకుంటున్నా.. ఇక ఎవరిని చూడాలి’ అని ఆమె చేసిన రోదనలు కంటతడిపెట్టించాయి. --------------- టీమ్1లో చేరతానని అన్నాడు ‘‘వరుణ్ బీఆర్క్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. చివరి ఏడాది ట్రైనింగ్ పేరిట కాలేజీ బయటే జాబ్ చేస్తుంటారు. వరుణ్‌కు గచ్చిబౌలిలోని టీమ్1 కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బుధవారం అందులో చేరుతున్నానని మంగళవారమే మాకు చెప్పాడు. కానీ అదేరోజున మరణించాడు. వరుణ్ ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం..’’ - ప్రొఫెసర్ కేజేఏబీ బాబు, వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్ -
మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
-
బస్సు బోల్తా : 10 మందికి గాయాలు
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఓఆర్ఆర్ వద్ద శనివారం బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప్పల్‌కు మెట్రో దన్ను!
మెట్రో రైల్, ఓఆర్ఆర్ ఈ రెండూ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ స్థిరాస్తి ముఖచిత్రాన్నే మార్చేసిందనటంలో సందేహం లేదు. ప్రత్యేకించి మెట్రో రైలు ట్రయల్ రన్‌తో ఉప్పల్ మార్కెట్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంద ంటున్నారు ట్రాన్కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. శ్రీధర్ రెడ్డి. అందుకే ఈ ప్రాంతంలో అందుబాటు ధరల్లో లగ్జరీ ఫ్లాట్లను అందించే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఫిర్జాదిగూడలో ఎకరంలో ‘ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రిమియం అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 68. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దంటే అందరికీ సమానమైన విస్తీర్ణంలో ఫ్లాట్లుండాలి. రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ల్యాండ్ స్కేపింగ్, క్లబ్ హౌజ్ వంటి ఆధునిక సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను ఆనుకొనే కమర్షియల్ సెంటర్‌ను కూడా నిర్మిస్తాం. భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే అరెకరంలో ‘ట్రాన్స్‌కాన్ లక్ష్మి నరసింహా రెసిడెన్సీ’ పేరుతో డీలక్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 35 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,200. -
శంషాబాద్ ఓఆర్ ఆర్ పై కారులో మంటలు
-
శివ.. ఓ క్రిమినల్ జీవిత కథ!
-
యువకుల బైక్ రేసింగ్
హైదరాబాద్: పెద్దఅంబర్‌పేట్ ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ రేసింగ్ వల్ల అనే ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా కొందరు యువకులు రేసింగ్ చేస్తూనే ఉన్నారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు బైక్ రేసింగ్‌లో పాల్గొనడాన్ని చూసిన పోలీసులు దాదాపు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 12 మందిని అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థుల నుంచి పోలీసులు 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విద్యార్థులు రామాంత్పూర్, హయత్‌నగర్‌కు చెందినవారిగా గుర్తించారు.