సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) టోల్ టెండర్ ప్రక్రియలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, వాస్తవాలను బహిర్గతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. టెండర్ అప్పగింత విషయంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తోందని, ఏటా 5% పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం చేకూ రేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆదాయానికి గండికొట్టి మరీ టెండర్ ఇవ్వడం ఏమిటని, ఈ విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ టెండర్ దక్కించుకు న్న ఐఆర్బీ సంస్థే మహారాష్ట్రలోనూ టోల్ మెయింటెనెన్స్ చూస్తోందని, తక్కువ దూరం, తక్కువ కాలానికి అక్కడి ప్రభుత్వం టెండర్ అప్పగించినప్పుడు, ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.
ఓఆర్‌ఆర్‌పై వార్తలు రాసినా, పార్టీలు ప్రశ్నించినా లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. సీఎం మౌనం వల్ల ఓఆర్‌ఆర్ టెండర్‌లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. దీనిపై ప్రజ లకు సమాధానం చెప్పాల్సిన అవసరం, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సీఎంగా కేసీఆర్‌పై ఉందన్నారు.
మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమం: బండి
కరీంనగర్ టౌన్: విచ్చలవిడి మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని విమర్శించారు.
ఉచిత పథకాలతో మభ్యపెట్టడానికి వస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఐకేపీ వీఓఏల న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment