tender
-
మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి
సాక్షి, అమరావతి: బోడి గుండుకు... మోకాలికి ముడిపెట్టినట్టు.. మనుషుల వైద్య సేవల కాంట్రాక్ట్‌లో పశువుల వైద్య సేవల్లో అనుభవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముడిపెట్టింది. 104 మొబైల్ మెడికల్ యూనిట్లు (ఎంఎంయూ), 108 అంబులెన్స్‌ల నిర్వహణ టెండర్లలో సంచార పశువైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు అర్హత కల్పిస్తూ వైద్యశాఖ నిబంధనలు పొందుపరిచింది. సాధారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల వైద్య శాఖలు ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలు గతంలో ఆయా విభాగాల్లో అనుభవం, సామర్థ్యం కలిగి ఉండాలని నిబంధనలు పెడుతుంటాయి. ఏపీలో గతంలో నిర్వహించిన టెండర్లలో సైతం అవే నిబంధనలున్నాయి. కానీ, తొలిసారిగా గతానికి భిన్నంగా పశు వైద్య సేవల కల్పనలో అనుభవాన్ని ప్రస్తుత టెండర్ నిబంధనల్లో చేర్చారు. ‘భవ్య’మైన స్కెచ్‌లో ఇదీ భాగమేనని తెలుస్తోంది. రూ. రెండు వేల కోట్ల అంచనాలతో కూడిన ఎంఎంయూ, 108 అంబులెన్స్‌లు, కాల్ సెంటర్ నిర్వహణ కోసం ఐదేళ్ల కాలపరిమితికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. ఐదేళ్లకు రూ. రెండు వేల కోట్ల మేర అంచనాలున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీకి స్కెచ్ అయితే... 104, 108 అంబులెన్స్‌ల నిర్వహణలో అస్మదీయ సంస్థకు పెద్దగా అనుభవం లేదు. ఆ సంస్థ ఉత్తరాదితోపాటు, మధ్య భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పశు సంచార వైద్య సేవల కాంట్రాక్టులు నిర్వహించిన అనుభవం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కేవలం 104, 108 నిర్వహణ అనుభవం ప్రాతిపదికన నిబంధనలు ఉన్నట్లయితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుంది. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సంబంధం లేని పశు వైద్య సేవల వాహనాల నిర్వహణ అంశాన్ని టెండర్ నిబంధనల్లో చేర్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున దోచుకోవడం కోసం ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యాన్ని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదని టెండర్ నిబంధనలు చూసిన వైద్య రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక్కడ మాత్రమే వింత నిబంధనలు దేశవ్యాప్తంగా అనుభవం, అవగాహన ఉన్న సంస్థలకే 108, 104 కాంట్రాక్ట్‌లు ఇచ్చేలా అనేక రాష్ట్రాలు అడుగులు వేస్తుంటే... చంద్రబాబు పాలనలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం వింత నిబంధనలు విధిస్తోంది. గడిచిన ఐదేళ్లలో అంబులెన్స్‌లు/ఎంఎంయూలతో పాటు మొబైల్ వెటర్నరీ యూనిట్స్/వెటర్నరీ క్లినిక్స్ వంటి పశు వైద్య సేవల నిర్వహించిన అనుభవాన్ని నిబంధనల్లో చేర్చారు. 108, 104 కలిపి 1700 వాహనాలను నిర్వహించాల్సి ఉండగా బిడ్ వేసే నాటికి వంద వాహనాలు నిర్వహించిన అనుభవం ఉన్నా చాలనే షరతు పెట్టారు. అంతేకాకుండా అంబులెన్స్, ఎంఎంయూ వాహనాల నిర్వహణ అనుభవానికి మార్కులు కేటాయించే విధానాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని అత్యవసర వైద్య సేవల కల్పన పేరుతో కనీస అనుభవం లేని సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెడితే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలేనని వైద్య శాఖలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇలా..» గడిచిన రెండు, మూడేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 108, 104 వాహనాల నిర్వహణ కోసం పిలిచిన టెండర్ల నిబంధనలను ఓసారి పరిశీలిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ దోపిడీ స్కెచ్ అందరికీ అర్థం అవుతుంది. » అసోంలో గతేడాది అంబులెన్స్‌ల నిర్వహణ కోసం వైద్య శాఖ టెండర్లు నిర్వహించింది. టెండర్ పిలిచిన నాటికి ముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లో అంబులెన్స్ సేవలు నిర్వహించి ఉండటంతో పాటు, బిడ్లు వేసిన సంస్థలకు 600లకు పైగా అంబులెన్స్‌లు నిర్వహించిన అనుభవం, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే షరతు ఉంది. » జమ్ము కశ్మీర్లో గతేడాది అక్టోబర్‌లో టెండర్లు పిలిచారు. బిడ్లు వేసే సంస్థలకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 650 బేసికల్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్), 150 మేజర్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్)అంబులెన్స్‌లతో పాటు, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించిన అనుభవం ఉండాలనేది నిబంధన. » కేరళలో ప్రస్తుతం అంబులెన్స్ నిర్వహణకు టెండర్లు నడుస్తున్నాయి. బిడ్లు వేసే సంస్థలు కనీసం 150 అంబులెన్స్‌లు నడిపిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. అదే విధంగా అంబులెన్స్ నిర్వహణ అనుభవానికి కూడా మార్కులు ఇచ్చి, అత్యంత అనుభవం కలిగిన సంస్థను ఎంపిక చేస్తున్నారు. » ఇక... తెలంగాణలో 2022లో 108 టెండర్లు నిర్వహించారు. మూడేళ్ల పాటు కనీసం 200 అంబులెన్స్‌లను, 40 సీటింగ్ సామర్థ్యంతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే నిబంధన పెట్టారు. » ఛత్తీస్‌గఢ్‌లో ఎంఎంయూ వాహనాల నిర్వహణ కోసం గత నెలలో టెండర్లు పిలిచారు. బిడ్లు వేసే సంస్థలు మొబైల్ మెడికల్ వ్యాన్స్ (ఎంఎంవీ), ఎంఎంయూ, మొబైల్ హెల్త్ యూనిట్స్ నిర్వహించి ఉండాలని నిబంధన పెట్టారు. ఇక్కడ కూడా అనుభవానికి మార్కులు కేటాయించి, ఎంపిక చేస్తున్నారు. -
చింత చిగురు.. నోరూరు
కైకలూరు: పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే చింత చిగురును తింటే ఆరోగ్యంపై చింత అవసరం లేదంటారు పెద్దలు. నోటికి పుల్లడి రు చి ఇస్తూనే.. తినేకొ ద్దీ తినాలపిస్తుంది. చింత చిగురుకు కొ ల్లేరు రొయ్యలు, చేపలకు దట్టిస్తే.. ఇక భోజన ప్రియులకు పండగే. పులుపులో చింత చిగురుకు మరీ డిమాండ్. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాల్లో చిగురుతో వండిన చేప, రొయ్య, కోడి, వేట వంటి మాంసాహార కూరలను అందరూ లొట్టలేసుకోవాల్సిందే. ఈ సీజన్లో లేలేత చింత చిగురు అందుబాటులోకి వచ్చింది. పల్లెటూర్ల నుంచి మహిళలు చింత చిగురును తీసుకువచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చింత చిగురులో పలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. ఇదే సీజన్లో.. చైత్రమాసం దాటిన వెంటనే చింత చెట్లకు చిగురు అందుబాటులోకి వస్తోంది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో బుట్టయగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం, కైకలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చింత చిగురు అందుబాటులో ఉంది. కైకలూరు నియోజకవర్గంలో గోపాలపురం, వెంకటాపురం, పరసావానిపాలెం, చిగురుకోట, వడాలి గ్రామాల నుంచి చింత చిగురును తీసుకొచ్చి కైకలూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర విషయానికి వస్తే 100 గ్రాములు రూ.100కి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఆర్డర్లను బట్టి సరఫరా చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడంతో గతంలో కంటే చిగురు ఎక్కువగా లభించడం లేదని గోపాలపురం గ్రామానికి చెందిన విక్రయ మహిళ వాకాని శకుంతల ‘సాక్షి’కి తెలిపారు. ఆహా ఏమి రుచి.. శాకాహార, మాంసాహార కూరలకు చింత చిగురును దట్టిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చింత చిగురుతో చేసిన వంటకాలు ప్రత్యేక డిష్‌గా గుర్తింపు పొందుతున్నాయి. శాకాహార, మాంసాహారాల్లో పలురకాలుగా చింత చిగురుతో వంటకాలు చేస్తారు. పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీíÙయం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. ఉపయోగాలివీ.. 👉 చింత చిగురులో ఉన్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి. 👉 శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 👉యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. 👉 చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 👉మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 👉పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. 👉 వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. 👉గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 👉నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. 👉జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. 👉ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. 👉షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 👉కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 👉 తల్లిపాలను మెరుగుపరుస్తుంది.100 గ్రాములు రూ.100 చింత చెట్లు పూర్వం రహదారుల వెంబడి కనిపించేవి. ఏటా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా చింత చిగురును విక్రయించేవాళ్లం. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంతో చాలా చెట్లను తొలగించారు. కొన్నిచోట్ల మాత్రమే చింత చెట్లు కనిపిస్తున్నాయి. పలువురు వైద్యం కోసం అని చెప్పి మా వద్ద చింత చిగురు కొంటున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల చిగురును రూ.100 ధరకు విక్రయిస్తున్నాం. –వి.మంగమ్మ, ఆకుకూరల విక్రయదారు, గోపాలపురంచింత చెట్లను పెంచాలి చింత చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మరో చెట్టును నాటాలి. పట్టణీకరణతో చాలా చెట్లు తొలగిస్తున్నారు. ఆకుకూరలకు కలిదిండి మండలం గోపాలపురం గ్రామం పేరు. మా కుటుంబం చింత చిగురును విక్రయిస్తోంది. చిగురును సేకరించడం అంతు సులువైన పనికాదు. చింత చెట్లను పెంచే విధంగా అందరికి అవగాహన కలిగించాలి. చింత చిగురుతో లాభాలెన్నో ఉన్నాయి. – వాకాని నాగ సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్, గోపాలపురం -
రూ.450 కోట్ల ఆదాయంతో ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాజెక్ట్!
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ ను జాయింట్ వెంచర్ విధానంలో ఎపీఎండీసీ చేపట్టనుంది. ఇందుకు గానూ జాయింట్ వెంచర్ సంస్థ ఎంపిక కోసం నిర్వహించే టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎపీఎండీసీ మంగళవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, డెవలప్ మెంట్, ఆపరేషన్ కమ్ మైయింటెనెన్స్ కోసం జేవీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎపీఎండీసీ ప్రకాశం జిల్లా కొణిజేడు మర్లపాడు ప్రాంతం పరిధిలో మొత్తం 1307.26 ఎకరాల్లో లో-గ్రేడ్ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను పొందింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ద్వారా లోగ్రేడ్ ఖనిజాన్ని మైనింగ్ చేయడం, బెనిఫికేషన్ ద్వారా నాణ్యతను పెంచడం ద్వారా ఏడాదికి సుమారు రూ.450 కోట్ల మేర సంస్థకు రెవెన్యూ లభిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాలని చట్టం చేసింది. దానిలో భాగంగా ఐరన్ ఓర్ టెండర్ డాక్యుమెంట్ లను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ కు సమర్పించడం జరిగిందని ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఈ టెండర్ డాక్యుమెంట్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కమిషన్ ఈ-మెయిల్ judge-jpp@ap.gov.in ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని కోరారు. -
ఓఆర్ఆర్ లీజుపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్‌ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్ కంపెనీకి అప్పగింత, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు చెందిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం.. తుది ఉత్తర్వుల మేరకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంపిల్ దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ (ఇనీషియల్ ఎస్టిమేటెడ్ కన్సెషన్ వాల్యూ) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్ఎండీఏ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల బదిలీ చట్టవిరుద్ధమన్న పిటిషనర్ న్యాయవాది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవా ది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రాథమిక అంచనా విలువను ప్రకటించకుండానే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌కు ఓఆర్ఆర్ను 30 ఏళ్లు అప్పగించారని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను హెచ్ఎండీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా ఏప్రిల్ 27న జీవో తీసుకొచ్చిందని.. ఈ జీవో హెచ్ఎండీఏ చట్టంలోని సెక్షన్ 40(1)(సీ)కి విరుద్ధమని వాదించారు. హెచ్ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులకు మాత్రమే ఆఆదాయాన్ని వెచ్చించాల్సి ఉందని వెల్ల డించారు. ఇప్పటికే రూ.7 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసిందని, వాటిని ఖర్చు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్ వద్ద డబ్బు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. -
మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
-
మద్యం టెండర్ కోసం...డబ్బులు అడుగుతున్న రాజేష్
-
ఎయిర్‌పోర్టు మెట్రోకు యమ క్రేజ్.. పోటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. బిడ్డింగ్ గడువు సమీపిస్తుండడంతో పలు నిర్మాణసంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, మరో ఐదు రోజులే మిగిలి ఉన్నందువల్ల మరిన్ని సంస్థలు బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ముఖచిత్రం మారింది. వ్యాపార, వాణిజ్య రంగాలు, రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టాయి. దీంతో నగరంలో మెట్రో రైలును నిర్మాణ సంస్థలు లాభదాయకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ, రియల్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్‌ను దక్కించుకొనేందుకు గ్లోబల్‌స్థాయిలో పోటీ పెరిగింది. నిర్మాణ సంస్థలు ఈ కారిడార్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో ఇప్పటికే ఎల్అండ్టీ, ఆల్స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఐఆర్సీఓఎన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పీఏఎన్డీఆర్ఓఎల్ రహీ టెక్నాలజీస్ తదితర జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు పోటీలో ఉండగా, గడువు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండేళ్లలో పూర్తి... మరోవైపు ఈ మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 నాటికి పూర్తి చేసేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. తాము విధించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయాలని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోకి రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటి వరకు సర్వే, పెగ్‌మార్కింగ్, అలైన్మెంట్ తదితర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కాగా, 1.7 కిలోమీటర్ల వరకు భూగర్భమార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్ సమీపంలో ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 9 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో హెచ్ఎండీఏ, జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు 10 శాతం చొప్పున భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మొదట 11 రైళ్లతో ప్రారంభం.. రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మార్గంలో మొదట 11 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి మెట్రోకు 3 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 33 కోచ్‌లతో సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌మెట్రో 6 కోచ్‌లు, చైన్నె ఎయిర్పోర్ట్ మెట్రో 4 కోచ్‌లతో నడుస్తోంది. మొదట్లో రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుపుతారు. ఆ తరువాత రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిసింది. నగరం పడమటి వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ మెట్రో సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, సర్వీసుల సంఖ్య భారీగా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా 9 స్టేషన్లను ఖరారు చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో మరిన్ని స్టేషన్లకు కూడా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. -
ఓఆర్ఆర్ టెండర్‌పై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ టెండర్ ప్రక్రియలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, వాస్తవాలను బహిర్గతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. టెండర్ అప్పగింత విషయంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తోందని, ఏటా 5% పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం చేకూ రేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయానికి గండికొట్టి మరీ టెండర్ ఇవ్వడం ఏమిటని, ఈ విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకు న్న ఐఆర్బీ సంస్థే మహారాష్ట్రలోనూ టోల్ మెయింటెనెన్స్ చూస్తోందని, తక్కువ దూరం, తక్కువ కాలానికి అక్కడి ప్రభుత్వం టెండర్ అప్పగించినప్పుడు, ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఓఆర్ఆర్పై వార్తలు రాసినా, పార్టీలు ప్రశ్నించినా లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. సీఎం మౌనం వల్ల ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. దీనిపై ప్రజ లకు సమాధానం చెప్పాల్సిన అవసరం, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సీఎంగా కేసీఆర్‌పై ఉందన్నారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమం: బండి కరీంనగర్ టౌన్: విచ్చలవిడి మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని విమర్శించారు. ఉచిత పథకాలతో మభ్యపెట్టడానికి వస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఐకేపీ వీఓఏల న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. -
ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, నిబంధనల ప్రకారమే ఐఆర్బీకి టోల్గేట్ టెండర్లు దక్కాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద అన్నారు. లీజుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వారు గురువారం బీఆర్‌ఎస్‌ఎలీ్పలో విలేకరులతో మాట్లాడుతూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 111 జీవోపై కాంగ్రెస్, బీజేపీ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని, ఆ గ్రామాలకు వెళ్లి జీవో కొనసాగాలని కోరే ధైర్యం ఉందా? అని నిలదీశారు. రాజకీయాల గురించి గవర్నర్ మాట్లాడడం సరికాదని, ఆమెకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. -
ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డును సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్ను తక్కువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరో దోపిడికి తెరతీసిందన్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన నెలరోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని.. రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని.. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. చదవండి: TS: బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్.. రంగంలోకి హైకమాండ్ సర్వేల ఆధారంగా టికెట్లు సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ నుంచి అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన టికెట్‌తో సహా ప్రతీ టికెట్ సర్వేనే ప్రామాణికమని తెలిపారు. కర్ణాటకలో సిద్దారామయ్యకు కూడా అడిగిన టికెట్ కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్ ఇచ్చారని తెలిపారు. పార్టీలో చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుందన్నారు.. ఇంఛార్జి ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారని తనకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీలో చేరిక ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చిస్తామని, ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తామని పేర్కొన్నారు. -
దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్ పిలవాలని యోచిస్తోంది. 54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్ పిలవగా 8 మంది పాల్గొన్నారు. అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కోట్ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... టెండర్లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు. అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్’(గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్) నేషనల్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది. మరో ఆరు బస్సులను రెండు మూడు రోజుల్లో నడపనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న సర్వీసులతో పాటు సొంతంగా కొన్న బస్సులను ప్రారంభిస్తోంది. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానాన్ని కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభిస్తోంది. తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
టెండర్లకే టెండర్ పెట్టారు
ఎక్కడైనా ఏవైనా పనులు చేపట్టాలంటే ముందుగా ఎంత ఖర్చవుతుందని అంచనా (ఎస్టిమేషన్) వేసుకోవాలి... ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. ♦ అటు తర్వాత అంచనాకు అనుగుణంగా టెండర్లను ఆహ్వానించాలి. ♦ ఈ మేరకు నిర్దేశిత తేదీతో టెండర్ నోటిఫికేషన్ వేయాలి. ♦ దాఖలైన టెండర్లను పరిశీలించి కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయాలి. ♦ అనంతరం వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. అప్పుడు పనులు మొదలెట్టాలి ♦ ఆ తర్వాత దశల వారీగా బిల్లులు చెల్లించుకుంటూ పోవాలి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా.... అయితే ఒక్కసారి ఈ ఫొటో చూడండి.. ఇది వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మర్రికుంట చెరువు. పైన చెప్పిన నిబంధనలేవీ పాటించకుండానే,టెండర్లు పిలవకుండానే దీన్ని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయడంతోపాటు సుందరీకరణ పనులు కొనసాగించేస్తున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఎక్కడైనా.. ఏ ఊళ్లో అయినా ఇదే లెక్క.. అయితే వనపర్తి జిల్లాలోని మంత్రి ఇలాకాలో మాత్రం లెక్క వేరేగా ఉంటుంది. ♦ ముందుగానే పనులు చేపడతారు. ♦ పనులు పూర్తయ్యే దశలో అంచనాలు రూపొందిస్తారు. ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులుపొందుతారు. పోటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండాటెండర్ ప్రక్రియ ముగిస్తారు. ♦ బిల్లులు చేయించి.. డబ్బులు తీసేసుకుంటారు. ‘బినామీ’ కాంట్రాక్టర్లు..? నిబంధనల ప్రకారం ఒక్కోవర్క్ రూ.5 లక్షల వరకు అయితే నామినేషన్ పద్ధతిన కేటాయింపులు చేయాలి. అంతకంటే మించి అయితే టెండర్ పద్ధతిన కాంట్రాక్ట్‌లు అప్పగించాలి. కానీ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన నాలుగు చెరువుల సుందరీకరణకు సంబంధించి ఒక్కో దానికి సుమారు రూ.30 లక్షలకు పైబడి వ్యయమవుతుందని అంచనా. ఈ మేరకు టెండర్ తప్పనిసరి కాగా.. పిలిస్తే పోటీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చినట్లు తెలుస్తోంది. లోలోపల టెండర్ దక్కించుకున్న ప్రముఖ కాంట్రాక్టర్లు అధికార పారీ్టకి చెందిన నాయకులేనని తెలుస్తోంది. వీరంతా ఓ ముఖ్య నేతకు ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నోరు మెదపని అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం.. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ, మున్సిపల్ అధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత ఆదేశాల నేపథ్యంలో వారు నిబంధనలకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పనులు పూర్తయి న క్రమంలో వ్యయానికి మించి అంచనాలు రూపొందించి.. ఎక్కువ మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది లక్షి్మకుంట. 20వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కూడిన ఈ చెరువు సుందరీకరణ పనులు 2021లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల అనంతరం రూ.31.75 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2022 సెప్టెంబర్‌లో పరిపాలనా అనుమతులు రాగా.. గత నెల 14న రూ.29.59 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పనులు కొనసాగగా.. అటవీ శాఖ కు సంబంధించి కంపా నిధులు వెచ్చించారు. ఇది రాజనగరం చెరువు. ట్యాంక్ బండ్ నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు గత ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. సుమారు రూ.49 లక్షల వ్యయంతో అదే ఏడాది ఫిబ్రవరిలో ఎస్టిమేషన్ (అంచనా) వేయగా.. అదే నెలలో పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. మార్చిలో కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా.. జూన్‌లో కొంత మేర బిల్లులు మంజూరయ్యాయి. 2021 ఆగస్టులో తాళ్లచెరువు సుందరీకరణ పనులు ప్రారంభం కాగా..గత ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు.అనుమతులు రాగా.. మార్చిలో టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత జూన్‌లో బిల్లులు మంజూరయ్యాయి. -
రూ.5,000 కోట్లు విలువ చేసే ఈ–బస్‌లకు టెండర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎస్ఎల్) తాజాగా 4,675 ఎలక్ట్రిక్ బస్‌లకు టెండర్లను పిలిచింది. వీటి విలువ రూ.5,000 కోట్లు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (ఎన్‌ఈబీపీ) కింద టెండర్లను ఆహ్వానించడం ఇది రెండవసారి అని సీఈఎస్ఎల్ గురువారం తెలిపింది. డ్రై లీజ్ ప్రాతిపదికన ఈ బస్‌లను తెలంగాణ, ఢిల్లీ, కేరళలో ప్రవేశపెడతారు. డ్రై లీజ్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లు లేకుండా ఈ బస్‌లను ఆపరేటర్లు రాష్ట్ర రోడ్డు రవాణా (ఎస్టీసీ) సంస్థలకు సరఫరా చేస్తారు. ఎస్టీసీలు తమ సిబ్బందితో వీటిని నడిపిస్తాయి. యాజమాన్య హక్కులతోపాటు నిర్వహణ బాధ్యతలను 10, 12 ఏళ్లపాటు సర్వీస్ ప్రొవైడర్లు (ఆపరేటర్లు) చేపడతారు. ఒక్కో బస్‌కు నిర్దేశిత రుసుమును ఆపరేటర్లకు ఎస్టీసీలు చెల్లిస్తాయి. బిడ్డర్లు, ఎస్టీసీలు తప్పనిసరిగా మహిళలను నియమించుకోవడంతోపాటు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. 4,675 ఎలక్ట్రిక్ బస్‌లు వస్తే ఏటా 15 లక్షల కిలోలీటర్ల ఇంధనం ఆదా అవుతుందని సీఈఎస్ఎల్ తెలిపింది. -
ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎన్‌ఈబీపీ టెండర్లు
న్యూఢిల్లీ: జాతీయ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (ఎన్‌ఈబీపీ) కింద తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,465 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రభుత్వ రంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎస్ఎల్) ఏకీకృత టెండర్లు ఆహ్వానించింది. ఇందులో డీజిల్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయం 29 శాతం తక్కువగా ఉండే విధంగా టెండర్లు దాఖలైనట్లు సీఈఎస్ఎల్ తెలిపింది. 12 మీటర్ల బస్సు (ఇంట్రా–సిటీ)ల నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ. 54.3గాను, 12 మీటర్ల ఇంటర్సిటీ బస్సుకి కిలోమీటరుకు రూ. 39.8/కి.మీ.గాను బిడ్లు వచ్చాయి. అలా గే, 9 మీటర్ల బస్సుకు రూ. 54.46, 7 మీటర్ల బస్సుకు రూ. 61.92 వ్యయం ఉండేలా బిడ్లు వచ్చినట్లు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య తెలిపారు. ఎలక్ట్రిక్ విధానంలో ప్రజా రవాణా బస్సులను ప్రభుత్వ రవాణా సంస్థలు (ఎస్టీయూ) ఒక సర్వీసుగా ఉపయోగించుకుని, నిర్దిష్ట ఫీజులను చెల్లించే విధంగా ఎన్‌ఈబీపీని రూపొందించారు. దీని ప్రకారం ప్రైవేట్ ఆపరేటరు బస్సులను 10–12 ఏళ్ల పాటు నడిపిస్తారు. బస్సు సర్వీసు పొందినందుకు గాను ఎస్టీయూలు ఫీజులను చెల్లిస్తాయి. -
సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించే ప్రాజెక్టు పట్టాలకెక్కింది. ఇదిగో అదిగో అంటూ ఇంతకాలం ఊరించిన రైల్వే.. ప్రస్తుత భవనాలను కూల్చి వాటి స్థానంలో విమానాశ్రయం తరహా వసతులతో పునర్నిర్మించే ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థను ఖరారు చేసింది. రూ.699 కోట్లకు కోట్ చేసిన ఢిల్లీ సంస్థ గిరిధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్‌ను దక్కించుకుంది. 36 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో రైల్వే ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యం కోసం.. దేశవ్యాప్తంగా 123 స్టేషన్లను రూ.50 వేల కోట్లతో ఆధునీకరించాలని రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా నాన్ సబర్బన్ గ్రేడ్–1 పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ స్టేషన్‌ను అప్‌గ్రెడేషన్ ప్రాజెక్టు కోసం గతంలోనే రైల్వే బోర్డు ఎంపిక చేసింది. రూ.500 కోట్ల వార్షికాదాయం లేదా సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులు ఉపయోగించే స్టేషన్‌ను ఈ గ్రేడ్ కింద గుర్తిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రోజుకు సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటారు. నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసిన రైల్వేబోర్డు.. ఈ స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టెండర్లు ఖరారు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం చాలా అవసరమని, అందుకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారీ భవనాలు, పార్కింగ్ సదుపాయాలతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండు వైపులా మూడంతస్తులతో రెండు భారీ భవన సముదాయాలు ఉంటాయి. రెండు భవనాలను అనుసంధానిస్తూ ట్రావెలేటర్స్ (ఆటోవాకింగ్ వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇక దక్షిణ భాగం వైపు 2వేల వాహనాలను నిలిపేలా మల్టీలెవల్ అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది.. ఉత్తరభాగం వైపు మూడు వేల వాహనాలను నిలిపేలా ఐదు అంతస్తుల పార్కింగ్ టవర్ నిర్మిస్తారు. ప్లాట్ఫామ్లన్నింటినీ ఆధునీకరిస్తారు. అన్నింటినీ కవర్ చేస్తూ పైకప్పు ఉంటుంది. రైల్వేస్టేషన్‌ను మెట్రోరైల్స్టేషన్లకు అనుసంధానిస్తూ స్కైవేలను నిర్మిస్తారు. -
అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ పోర్టు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సారి్టయం దక్కించుకుంది. దీనితో పోర్ట్ ఆఫ్ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్ కంపెనీలో 100 శాతం వాటాల కొనుగోలు హక్కులు కన్సార్షియంకు లభిస్తాయి. ఏపీసెజ్ ప్రకటన ప్రకారం ఇందులో అదానీ పోర్ట్స్‌కు 70 శాతం, గాడోట్ గ్రూప్‌నకు 30 శాతం వాటాలు ఉంటాయి. డీల్ విలువ 1.18 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,422 కోట్లు). ఏపీసెజ్‌ను అంతర్జాతీయంగా లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ కార్యకలాపాలతో పాటు రవాణా దిగ్గజంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమైన అడుగని కంపెనీ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లోనూ, అలాగే యూరప్‌లోని పోర్టుల రంగంలోనూ తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీసెజ్‌తో భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడగలదని గాడోట్ సీఈవో ఓఫర్ లించెవ్‌స్కీ పేర్కొన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో తమకు, పోర్టు కార్యకలాపాల నిర్వహణలో అదానీ గ్రూప్‌నకు అపార అనుభవాలు ఉండటం .. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయో గపడుతుందన్నారు. ఇజ్రాయెల్‌లో మూడో అతి పెద్ద నగరమైన హైఫాకి దగ్గర్లో పోర్ట్ ఆఫ్ హైఫా ఉంది. 2021లో ఇక్కడ 1.46 మిలియన్ల టీఈయూ (ట్వెంటీ ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) కంటైనర్లను, 2.56 మిలియన్ టన్నుల కార్గోనూ హ్యాండిల్ చేశారు. మరోవైపు, అదానీ గ్రూప్‌లో రవాణా వ్యాపార విభాగంగా ఏపీసెజ్ కొనసాగుతోంది. -
జగనన్న విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవే..
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక పథకం కింద స్కూల్ బ్యాగుల పంపిణీ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ నిబంధనలన్నీ సరైనవేనని హైకోర్టు ప్రకటించింది. టెండర్ నిబంధనల రూపకల్పన, కాంట్రాక్టు అప్పగింత పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు దురుద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగంతో కూడుకున్నప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది. కాంట్రాక్టు వ్యవహారాల్లో ప్రభుత్వ చర్యలు నిష్పాక్షికంగా, సహేతుకంగా ఉన్నప్పుడు అందులో న్యాయస్థానాల జోక్యం చాలా పరిమితమని తేల్చి చెప్పింది. కాంట్రాక్టులో నిర్దేశించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సమర్థత, వనరుల కల్పన నిమిత్తమే ప్రీ–కండీషన్లు, అర్హతల నిర్ణయం జరుగుతుందని తెలిపింది. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! కాంట్రాక్టు అప్పగింత వ్యవహారంలో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు సహేతుకంగా, నిష్పాక్షికంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహించేందుకు తమకు ప్రాథమిక హక్కు ఉందని చెప్పలేరని స్పష్టం చేసింది. ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన అది టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. టెండర్ దాఖలు చేయని వ్యక్తి ఆ టెండర్ నోటిఫికేషన్ చట్టబద్ధత, చెల్లుబాటును ప్రశ్నించలేరని పేర్కొంది. జగనన్న విద్యా కానుక కాంట్రాక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ నిబంధనలను చట్ట విరుద్ధమైనవిగా, ఏకపక్షమైనవిగా, అహేతుకమైనవిగా చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ పథకం టెండర్ నిబంధనలను సవాల్ చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఇదీ నేపథ్యం... జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీకి టెండర్లను ఆహ్వానిస్తూ 2021 జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రూ.39 కోట్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్‌తోపాటు కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగా ఉండాలని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి అసాధ్యమైన నిబంధనలు లేకుండా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం టెండర్ దక్కించుకున్న కంపెనీ వాదన వినకుండానే సింగిల్ జడ్జి తీర్పునిచ్చారంటూ ఆ తీర్పును రద్దు చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అటల్ ప్లాస్టిక్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ దుర్గాప్రసాద్ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఆ నిబంధనను ఇప్పుడు ప్రశ్నించలేరు.. పిటిషనర్ అటల్ ప్లాస్టిక్స్ టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదని, కేవలం ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో మాత్రమే పాల్గొందని, ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో పాల్గొనడం టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదన్న అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధనను మొదటి టెండర్ నోటిఫికేషన్లోనే పొందుపరిచారని, పిటిషనర్ అప్పుడు ప్రశ్నించకుండా అన్యాయమంటూ కోర్టును ఆశ్రయించడం సరికాదన్న అదనపు ఏజీ వాదనలో వాస్తవముందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. తయారీదారు 90 రోజుల్లో 45 లక్షల బ్యాగులు సరఫరా చేయడం అంత చిన్న విషయం కాదని, అందుకే ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన సాల్వెన్సీ సర్టిఫికెట్ నిబంధనను పొందుపరిచారని, ఇది ఎంత మాత్రం తప్పు కాదన్నారు. గత మూడేళ్ల వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగా ఉండాలన్న నిబంధన బిడ్డర్ ఆర్థిక పరిస్థితి, సమర్థతను తెలుసుకునేందుకు తెచ్చారని, ఈ నిబంధనను ఏ రకంగానూ తప్పుపట్టడానికి వీల్లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా టెండర్ నిబంధనలను సవాలు చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
ఫైబర్ గ్రిడ్ టెండర్లలో భారీ ఫ్రాడ్
సాక్షి, అమరావతి: ఫైబర్‌నెట్ కార్పొరేషన్ల టెండర్లలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతం బట్టబయలైంది. నాటి సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, బినామీ వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (టెరాసాఫ్ట్) సంస్థకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం ఆధారసహితంగా నిర్ధారణ అయింది. నిబంధనలు ఏమార్చి.. కంపెనీని బ్లాక్‌లిస్టు నుంచి హడావుడిగా తొలగించి.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి.. టెక్నికల్ కమిటీలో అస్మదీయుడిని నియమించి.. నిపుణుల అభ్యంతరాలను బేఖాతర్ చేసి రూ.330 కోట్ల విలువైన ఫైబర్‌నెట్ టెండర్లను కట్టబెట్టేశారనే నిజం సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలింది. నాసిరకం పరికరాలు సరఫరా చేసినా సరే అడ్డగోలుగా రూ.119.98 కోట్ల మేర బిల్లులు చెల్లించారని స్పష్టమైంది. మిగిలిన దశల టెండర్లతో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర సాగిన ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన సీఐడీ ఫైబర్ నెట్ టెండర్లలో అవినీతిని ఆధారసహితంగా బట్టబయలు చేసింది. మొదటి దశ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో వేమూరి హరికృష్ణప్రసాద్ (టీడీపీ ప్రభుత్వంలో ఇ–గవర్నెన్స్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు), కె.సాంబశివరావు (నాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ– ఎండీ) సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ను గురువారం న్యాయస్థానానికి సమర్పించింది. ఆ అవినీతి బాగోతం ఇదిగో ఇలా సాగింది... టెరాసాఫ్ట్ కోసం టెండర్ గడువు పొడిగింపు.. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో రూ.330 కోట్లకు ఫైబర్‌నెట్ కార్పొరేషన్ 2015లో ఇన్‌క్యాప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ) ద్వారా ఈ –టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు 2015 జూలై 31 వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఒక్క రోజు ముందు అంటే జూలై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణం. ఫోర్జరీ పత్రాలతో అర్హత ఫైబర్ నెట్ టెండర్లలో పాల్గొనేందుకు ఫోర్జరీ అర్హత పత్రాలను సృష్టించి టెరాసాఫ్ట్ కంపెనీ కనికట్టు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్ దాఖలు చేసే కంపెనీ మరో రెండు సంస్థలతో కలసి కన్సార్టియంగా ఏర్పడాలి. కన్సార్టియం లీడ్ కంపెనీకి మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ ఉండాలి. మిగిలిన రెండు కంపెనీలకు ఏడాదికి కనీసం రూ.50 కోట్ల చొప్పున టర్నోవర్ ఉండాలి. అయితే కన్సార్టియంలో మూడో కంపెనీ హారిజన్ బ్రాడ్కాస్ట్ ఏర్పాటై అప్పటికి 8 నెలలే అయింది. మరోవైపు ఫైబర్ నెట్ రంగంలో పనులు చేసినట్లు టెరాసాఫ్ట్ ఫోర్జరీ పత్రాలు సమర్పించింది. సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు సరఫరా చేసినట్టు ఫోర్జరీ పత్రాలు సృష్టించింది. వాస్తవానికి మోడర్న్ కమ్యూనికేషన్ – బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్స్ అనే సంస్థ ఆ పరికరాలను సరఫరా చేసింది. టెరాసాఫ్ట్ మోసాలపై కొన్ని సంస్థలు ఫైబర్ నెట్ టెక్నికల్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో నిర్ధారించుకునేందుకు సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ మెయిల్ పంపారు. అయితే టెరాసాఫ్ట్, అప్పటి ప్రభుత్వ పెద్దల హెచ్చరికలతో గత్యంతరం లేక ఆ పత్రాలు సరైనవేనని సిగ్నం సంస్థ పేర్కొంది. సీఐడీ విచారణలో సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యం ఆ విషయాన్ని నిర్ధారించింది. టెండర్ల కమిటీలోనూ వేమూరి టీడీపీ పెద్దలు తమ బినామీ వేమూరి హరికృష్ణప్రసాద్‌ను ప్రభుత్వ ఇ–గవర్నింగ్ అథారిటీ ఆధ్వర్యంలోని గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు. అనంతరం ఆయన్ను ఫైబర్‌నెట్ టెండర్ల ప్రక్రియను పరిశీలించే సాంకేతిక కమిటీలో సభ్యుడిని కూడా చేశారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియలో పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్నవారు సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ వేమూరి అప్పటికే టెరా సాఫ్ట్ అనుబంధ కంపెనీ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. అదే కంపెనీలో టెరా సాఫ్ట్ యజమాని తుమ్మల గోపీచంద్ భార్య పావనీదేవి కూడా డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. ఇక టెండర్ల కమిటీ సమావేశంలో ఏపీటీఎస్ చైర్మన్ సుందరం టెరా సాఫ్ట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ వేమూరి హరికృష్ణ ప్రసాద్ నిర్ణయంతో టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టారు. నాసిరకం పరికరాలతో రూ.119.98 కోట్ల నష్టం ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌కు టెరాసాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. టెండర్ నిబంధనలను పాటించకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేశారు. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం, నాసిరకం, నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా బిల్లుల చెల్లింపు, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల వల్ల ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ విచారణలో నిగ్గు తేల్చింది. బ్లాక్ లిస్టు నుంచి టెరాసాఫ్ట్ తొలగింపు... పౌరసరఫరాల శాఖకు అంతకుముందు టెరా సాఫ్ట్ సరఫరా చేసిన ఇ–పీవోఎస్(ఇ–పోస్) పరికరాలు నాసిరకంగా ఉండటంతో ఆ కంపెనీని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) బ్లాక్ లిస్టులో చేర్చింది. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా ఏడాదిపాటు నిషేధిస్తూ 2015 మే 11న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ నిషేధాన్ని ఏపీటీఎస్ కేవలం నాలుగు నెలల్లోనే ఆగస్టు 6న తొలగించడం గమనార్హం. అందుకోసం ఏపీటీఎస్ టెక్నికల్ కమిటీ ఆగమేఘాల మీద అదే రోజు సమావేశమైంది. ఏపీటీఎస్ ఎండీ బి.సుందర్ ఆ సమావేశం మినిట్స్‌లో సంతకం చేయకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెరాసాఫ్ట్‌పై నిషేధం తొలగింపును ఆయన వ్యతిరేకించారు. కానీ కమిటీలో సభ్యులైన ఐటీ శాఖ కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, ఆర్థిక శాఖలోని ఐటీ విభాగం డైరెక్టర్లు టెరా సాఫ్ట్‌పై నిషేధాన్ని తొలగించాలని నిర్ణయించడంతో టీడీపీ ప్రభుత్వ పెద్దల పన్నాగం సాఫీగా సాగిపోయింది. ఫైబర్ నెట్ టెండర్ల బిడ్ దాఖలుకు 2015 ఆగస్టు 7 చివరి తేదీ కాగా టెరా సాఫ్ట్ కంపెనీని ఒక రోజు ముందు అంటే ఆగస్టు 6న బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించడం గమనార్హం. -
ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
జ్యుడిషియల్ ప్రివ్యూకు భూ రీసర్వే టెండర్
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం’ కింద చేపట్టిన భూ రీసర్వే పనులకు సంబంధించిన టెండర్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూకు సమర్పించినట్లు సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. డ్రోన్లు, ఏరియల్ ఫొటోగ్రఫీ ద్వారా సర్వే చేసేందుకు అవసరమైన పరికరాల కోసం ఈ టెండర్లను పిలుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అన్ని రకాల భూములను, వాటి విస్తీర్ణ ప్రాంతాలను హైబ్రిడ్ మెథడాలజీ విధానంలో డ్రోన్లు, కార్స్ నెట్వర్క్, జీఎన్ఎస్ఎస్ రిసీవర్లతో రీసర్వే చేస్తామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు, ఆసక్తి కలిగిన బిడ్డర్లు, సాధారణ ప్రజలకు వీటికి సంబంధించి సూచనలు, సలహాలు, రిమార్కులు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ప్రివ్యూకు సెప్టెంబర్ 7వ తేదీలోపు సమర్పించాలని కోరారు. -
ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి యత్నం
ఉక్కు నగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉక్కు పరిరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. మంగళవారం ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి కార్మికులు యత్నించారు. భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉద్దేశించిన సలహాదారుల నియామకానికి టెండర్లు వేయడానికి ఎవరైనా విశాఖ వస్తే తరుముతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజా సంపదను తన తాబేదార్లకు కట్టబెట్టడంలో భాగంగా విశాఖ ఉక్కును నూరు శాతం అమ్మాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇక్కడి ప్రజా పోరాటాన్ని చూసి గుత్తేదారులు ఎవరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కాలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ ప్రక్రియను కొనసాగించాలని చూస్తే సహించేది లేదన్నారు. వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మెజార్టీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ప్రధానికి లేఖ రాసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. అయినప్పటికి తమ ఉద్యమం ఆగబోదన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు సీహెచ్.నర్సింగరావు, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కేఎస్ఎన్ రావు, వై.మస్తానప్ప, జి.గణపతిరెడ్డి, బొడ్డు పైడిరాజు, విళ్లా రామ్మోహన్కుమార్, డి.సురేష్‌బాబు, వరసాల శ్రీనివాస్, డేవిడ్, ఎన్.రామారావు, నీరుకొండ రామచంద్రరావు, మాటూరి శ్రీనివాసరావు, నిర్వాసిత నాయకులు పులి రమణారెడ్డి, ముత్యాలు, ఎం.శంకరనారాయణ, పల్లా పెంటారావు తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీలో పనులు.. మాకొద్దు బాబోయ్!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జీహెచ్ఎంసీలో పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు అత్యుత్సాహంతో ముందుకు వచ్చేవారు. టెండర్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. బల్దియా పనులంటేనే కాంట్రాక్టర్లు జంకుతున్నారు. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా స్పందించడం లేదు. దీనికి కారణం సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగకపోవడమేనని తెలుస్తోంది. నగరంలో వానొస్తే రోడ్లు చెరువులయ్యే పరిస్థితి తప్పించేందుకు..ముంపు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక ప్రాజెక్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. వర్షాకాలం రాకముందే పలు పనులు చేయాలని భావించినప్పటికీ, వర్షాకాలం వచ్చేంతదాకా ఎలాంటి పనులు చేపట్టలేదు. జూన్‌లో కురిసిన వర్షాలతో పనులకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కొన్ని పనులకు టెండర్లు పిలిచారు. ఒక్కసారి కాదు..రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు రాకపోవడంతో పలు పనులకు మూడో పర్యాయం కూడా టెండర్లు పిలవాల్సి వస్తోంది. కళాసిగూడ నాలాపై మూడు ప్రాంతాల్లో నాలాల్ని విస్తరించి పైకప్పులు( బ్రిడ్జిలు) వేసే పనుల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. కళాసిగూడ నాలాపై రాణిగంజ్ బస్‌డిపో పక్కన డబుల్బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద, బుద్ధభవన్ నుంచి శ్మశానవాటిక రోడ్ మార్గంలో, మారియట్ హోటల్ వద్ద ట్యాంక్‌బండ్ రోడ్ నుంచి కవాడిగూడ వరకు మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.12.75 కోట్లు. రెండు పర్యాయాలు పిలిచినా టెండర్లు దాఖలు కాకపోవడంతో మూడో పర్యాయం కూడా పిలిచారు. వాటికి టెండర్లు దాఖలు చేయడానికి ఈనెల 23వ తేదీ వరకు గడువుంది. ఆలోగానైనా టెండర్లు దాఖలై పనులు జరుగుతాయో లేదో తెలియదు. ఆయా మార్గాల్లో పనులు చేయాలంటే ట్రాఫిక్ మళ్లింపు, యుటిలిటీస్ తరలింపు వంటి సమస్యల వల్ల కాంట్రాక్టర్లు వెనకడుగు వేసున్నారని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో గతంలో మాదిరిగా పనులకు వెంటనే బిల్లుల చెల్లింపులు జరగడం లేదని, సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే నెలనెలా ఎదురవుతున్న ఇబ్బందులు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని పనులు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని జీహెచ్ఎంసీలో ఎంతోకాలంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఎస్సార్డీపీకి అలా.. ఎస్ఎన్డీపీకి ఇలా.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ) పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం బాండ్లు, లోన్ల ద్వారా నిధులు తీసుకునేందుకు జీహెచ్ఎంసీకి అనుమతినిచి్చంది. ఎస్ఎన్డీపీ పనులకు మాత్రం నివాస కేటగిరీలో ఉండి ఇటీవల వాణిజ్య కారిడార్లుగా మారిన 118 మార్గాల్లో టౌన్‌ప్లానింగ్ విభాగానికి వచ్చే ఇంపాక్ట్ ఫీజు నిధుల్ని ఎస్ఎన్డీపీకి వినియోగించేలా ఉత్తర్వు జారీ చేసింది. ఇంజనీరింగ్ నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ. 600 కోట్ల మేర పెండింగ్‌లో ఉండటంతో గత కొంతకాలంగా సంబంధిత కాంట్రాక్టర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో పనులు కూడా చేయడం లేదు. -
కరోనా వ్యాక్సిన్: కోటి డోసులు కావాలి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థల నుంచి కరోనా వ్యాక్సిన్ డోసులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. కోటి డోసుల కోసం స్వల్ప కాలిక టెండర్‌ను పిలిచింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) జారీ చేసిన ఈ టెండర్లో రాబోయే 6 నెలల కాలంలో ఈ డోసులు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ప్రతినెలా కనీసం 15 లక్షల డోసులు సరఫరా చేసే సామర్థ్యం టెండర్ వేసే సంస్థకు ఉండాలని పేర్కొంది. ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు టెండర్‌ను తమ సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని తెలిపింది. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి టెండర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. వచ్చేనెల 4వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించింది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు టెండర్లు దాఖలు చేయొచ్చని, అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు సాంకేతిక బిడ్స్ తెరవనున్నట్లు పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రీబిడ్ మీటింగ్‌ను ఈనెల 26వ తేదీన జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించనున్నట్లు టెండర్ షెడ్యూల్లో పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 18–44 మధ్య వయసు వారందరికీ టీకాలు ఇవ్వాలంటే.. కనీసం మూడున్నర కోట్ల డోసులు అవసరం ఉంటుంది. అయితే కేంద్రం 45 సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే టీకా డోసులు ఇస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 56 లక్షల వరకు వ్యాక్సిన్ డోసులు వేయగా.. అందులో మొదటి డోసు తీసుకున్న వారు 42 లక్షల మంది.. రెండో డోసు తీసుకున్న వారు 12 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులు లేకపోవడంతో గత శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపేసింది. రాష్ట్రంలో 1.86 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో, కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలోనూ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. -
ఇబ్బంది లేకుండా 'ఇసుక'
సాక్షి, అమరావతి: ఇసుక కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా కోరినంత సరఫరా చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలాఖరు నుంచి ఎక్కడా ఇసుక లేదనే మాట లేకుండా అడిగినంత అందించాలని నిర్ణయించింది. రాజకీయ జోక్యానికి ఏమాత్రం తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక అందించనుంది. అనుభవం, అర్హత కలిగిన పెద్ద సంస్థలకు ఇసుక నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా సంస్థలను పారదర్శకంగా ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ)కి అప్పగించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు విభాగాలుగా విభజించి వేర్వేరుగా బిడ్లు స్వీకరించి ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేసేందుకు సాంకేతిక కసరత్తు పూర్తి చేసిన ఎంఎస్టీసీ టెండర్ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి చూపిన సంస్థలతో సోమవారం రాత్రి ప్రీ బిడ్ సమావేశం నిర్వహించింది. ప్రీ బిడ్ సమావేశంలో వ్యక్తం చేసిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా త్వరలో రాతపూర్వకంగా సమాచారం ఇస్తామని ఎంఎస్టీసీ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. 4న టెక్నికల్ బిడ్ల స్వీకరణ ఫిబ్రవరి 4వతేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా టెక్నికల్ బిడ్లు సమర్పించాలని ఎంఎస్టీసీ పేర్కొంది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ మేరకు ఇసుక సరఫరా సంస్థల ఎంపిక కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి వేర్వేరుగా బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలను ఒక రీచ్‌గానూ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను మరో రీచ్‌గానూ, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలను మూడో రీచ్‌గానూ టెండర్లు స్వీకరించనుంది. అర్హతలు, టర్నోవర్, అనుభవం వివరాలను టెండర్ దరఖాస్తులో పొందుపరిచారు. రూ.25 లక్షలు (జీఎస్టీ కాకుండా) చెల్లించి దరఖాస్తు ఫారాలను ఎవరైనా పొందవచ్చు. ఇందులో విధి విధానాలు, నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. టెక్నికల్ బిడ్లను ఎంఎస్టీసీ పరిశీలించిన అనంతరం నిర్దేశిత ప్రమాణాలు కలిగిన సంస్థలను అర్హమైనవిగా ప్రకటిస్తుంది. అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్లకు సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థలను ఫైనాన్షియల్ బిడ్లకు ఆహా్వనిస్తారు. మూడు జోన్లకు అధిక మొత్తానికి కోట్ చేసి (హెచ్ – 1)గా నిలిచిన సంస్థలను సక్సెస్ బిల్ బిడ్డర్లుగా నిర్ణయించి రాష్ట్ర భూగర్భ గనులశాఖ సంచాలకులకు తెలియచేస్తారు. ఆయా సంస్థలతో సంచాలకులు ఒప్పందం చేసుకోనున్నారు. నిర్ణయించిన డిపాజిట్ చెల్లించడంతోపాటు నిబంధనలన్నీ పాటించిన సంస్థలకు ఇసుక సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు. ఆయా ప్రాంతాల పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు కోరినంత ఇసుకను ఆయా సంస్థలు రీచ్‌లు/ స్టాక్ పాయింట్లలో అందించాలి. ఈ మేరకు ఇసుకను అందుబాటులో ఉంచే బాధ్యత ఈ సంస్థలపై ఉంటుంది. నచ్చిన రీచ్‌లో తీసుకోవచ్చు.. ప్రజలు తమకు నచ్చిన రీచ్/నిల్వ కేంద్రం వద్దకు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే డబ్బు చెల్లించి రసీదు తీసుకుని అద్దె/ సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లవచ్చు. పరిమాణంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఆన్లైన్ బుకింగ్ స్థానంలో ఆఫ్‌లైన్ విధానం ఉంటుంది. సర్వర్ మొరాయించడం, ఆన్లైన్ ఇబ్బందులు, సిఫార్సులకు తావుండదు. ఎడ్ల బండ్లలో ఉచితమే నదీ పరిసర ప్రాంతాల ప్రజలు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నిర్మించే సహాయ పునరావాస కాలనీల ఇళ్లకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ఇప్పటికే 500 రీచ్‌లను గుర్తించింది. వీటికి వేగంగా అన్ని రకాల అనుమతులు తెచ్చే పనిలో అధికారులున్నారు. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో జలవనరులు, భూగర్భ గనుల శాఖలు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. బ్యాతమెట్రిక్ సర్వే ద్వారా ఇక్కడ భారీగా ఇసుక నిల్వలున్నట్లు గుర్తించారు. -
ఎన్డీబీ రీ టెండర్లలో 12 బిడ్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి గత నెలలో పిలిచిన రీ టెండర్లలో 10 కాంట్రాక్టు సంస్థలు 12 బిడ్లు దాఖలు చేశాయి. తొలిదశలో నాలుగు జిల్లాల్లో పిలిచిన రీ టెండర్ల టెక్నికల్ బిడ్లను ఆర్అండ్బీ అధికారులు సోమవారం తెరిచారు. ఒక్కో జిల్లాలో మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గతంలో మాదిరిగా 13 జిల్లాలకు ఒకేసారి టెండర్లు పిలవకుండా నాలుగు జిల్లాలకు మాత్రమే రీ టెండర్లు పిలిచారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు మొదట ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. దీనిపై ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోటీతత్వం పెంచేందుకు ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో అవి రద్దయిన సంగతి తెలిసిందే. రీ టెండర్లకు తొలివిడతగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలను ఎంపికచేసిన అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీచేశారు. రెండు నిబంధనల్ని సవరించి, నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి ఈ టెండర్లను పిలిచారు. సోమవారం ఈ టెక్నికల్ బిడ్లు తెరిచిన అధికారులు వాటిని పరిశీలించి అర్హత సాధించిన సంస్థల వివరాలు ప్రకటిస్తారు. అనంతరం రివర్స్ టెండర్లు నిర్వహించనున్నారు. -
‘పోతిరెడ్డిపాడు–గోరకల్లు’ టెండర్ ఆమోదం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ కాలువ లైనింగ్.. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే అభివృద్ధి పనుల టెండర్‌ను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదించింది. మంగళవారం విజయవాడలో ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో ఎస్‌ఎల్‌టీసీ సమావేశమై టెండర్ ప్రక్రియను పరిశీలించింది. రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు విలువ రూ.1,017.22 కోట్లు ఉండగా.. 1.622% తక్కువ ధర(రూ.1,000.716)కు కోట్ చేసి పీఎన్సీ ఇన్ఫ్రా సంస్థ ఎల్–1గా నిలిచింది. దీని వల్ల ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. ఈ ప్రక్రియ సజావుగా జరిగినట్లు గుర్తించిన ఎస్‌ఎల్‌టీసీ టెండర్‌ను ఆమోదించింది. పీఎన్సీ ఇన్ఫ్రాకు పనులు అప్పగించడానికి అనుమతిచ్చింది. దీంతో ఆ సంస్థకు పనులు అప్పగిస్తూ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. -
‘గాలేరు–నగరి’ బరిలో నాలుగు సంస్థలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు అభివృద్ధి చేయడం, అవుకు వద్ద అదనంగా పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో టన్నెల్ తవ్వే పనులకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్లో నాలుగు సంస్థలు పోటీపడుతూ బిడ్లు దాఖలు చేశాయి. ఈ పనులకు రూ.1269.49 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో నిర్వహించిన టెండర్లో టెక్నికల్ బిడ్‌ను బుధవారం కర్నూలు ప్రాజెక్ట్ సీఈ మురళీనాథ్‌రెడ్డి తెరిచారు. ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ), వైఆర్కే (ఎర్రం రామకృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్స్), డీఎస్సార్(జాయింట్ వెంచర్), ఎమ్మార్కేఆర్(మేడా రామకృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ)లు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ► ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఈ బిడ్‌లో తక్కువ ధర(ఎల్–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని ఎస్‌ఎల్‌టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు. ► ఈనెల 29న ఎస్‌ఎల్‌టీసీ సమావేశమవుతుంది. టెండర్ ప్రక్రియను పరిశీలించి.. ఆమోదిస్తుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్డర్ జారీ చేస్తారు. -
ఆర్ అండ్ బీ టెండర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రహదారులు, భవనాల శాఖ టెండర్లను సాంకేతిక మదింపు కమిటీ అనుమతించి, ఫైనాన్స్ బిడ్లు తెరిచాక ఏ ఫిర్యాదులొచ్చినా, అనుమానాలున్నా చర్యలు తీసుకుంటామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ డాక్యుమెంట్లను జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించాక ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రభుత్వంపై అపోహలు కలిగేలా వార్తలు రాస్తున్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ► ఆర్అండ్బీ టెండర్లను డివిజన్ల వారీగా చేపట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్‌కు, రుణం అందిస్తున్న ఎన్డీబీకి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, ఎన్డీబీ అంగీకరించలేదు. జిల్లాల వారీగా ప్యాకేజీలుగా అనుమతిస్తే సులభంగా ఉంటుందని భావించాయి. ► ఏపీ, తెలంగాణ రవాణా ముఖ్య కార్యదర్శులు మంగళవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యి అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చిస్తారు. ఒప్పందం ఆలస్యమవుతున్నందున 72 వేల కి.మీ బస్సులు తిప్పేందుకు ప్రతిపాదించాం. -
బల్క్ డ్రగ్ పార్క్ భాగస్వామి ఎంపికకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ మౌలికవసతుల కల్పనాభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్లను పిలిచింది. ఈ పార్కును కనీసం 2,000 ఎకరాల్లో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్(డీబీఎఫ్‌వో) విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భాగస్వామ్య సంస్థలు, వ్యక్తిగత డెవలపర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ టెండర్లను ఆహ్వానించింది. ఔషధాల తయారీలో స్వయం సంవృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించింది. ఈ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన దరఖాస్తును సాధ్యమైనంత త్వరగా దాఖలు చేసేందుకు గానూ భాగస్వామి కోసం టెండర్లు పిలిచినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18 తేదీ సాయంత్రం 5లోగా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. రూ.59,000 రుసుము చెల్లించడం ద్వారా తమ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చని ఏపీఐఐసీ పేర్కొంది. చదవండి: ప్రాజెక్టుల పునరుద్ధరణకు రూ.778 కోట్లు -
మాస్కుల కోసం 33 లక్షల మీటర్ల క్లాత్ కొనుగోలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంకా మాస్కులు అందని ప్రతి ఒక్కరికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 33 లక్షల మీటర్ల క్లాత్ కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర జనాభా 4,87,54,176 మంది కాగా ఇప్పటికే 3,70,13,300 మందికి మూడేసి చొప్పున 11.10 కోట్ల మాస్కులను ప్రభుత్వం పంపిణీ చేసింది. మాస్కుల తయారీకి అవసరమైన క్లాత్‌ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో నుంచి అధికారులు కొనుగోలు చేశారు. అయితే.. 1.30 కోట్ల మీటర్ల క్లాత్‌ను సరఫరా చేశాక నిల్వలు తరిగిపోవడంతో ఆ సంస్థ సరఫరా నిలిపివేసింది. దీంతో మాస్కుల పంపిణీ పలుచోట్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి రాగానే ప్రైవేట్ వ్యాపారుల వద్ద నుంచి అయినా క్లాత్ కొనుగోలు చేసి.. మిగిలిపోయిన వారికి కూడా మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు క్లాత్ కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ► ఇంకా మాస్కులు అందని 1,17,40,876 మందికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు 33 లక్షల మీటర్ల క్లాత్ అవసరమని అధికారులు నిర్ధారించారు. ► టెండర్ ప్రక్రియలో ఆప్కోకు చెల్లించిన ధర కంటే దాదాపు 30–35 శాతం తక్కువ ధరకే క్లాత్ సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారని అధికారులు చెబుతున్నారు. ► విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో అందరికీ మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ పూర్తయిందని.. మిగిలిన జిల్లాల్లో మూడొంతులు పూర్తయిందని చెప్పారు. ► మాస్కులు కుట్టే పనిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఒక్కొక్క మాస్కు సింగిల్ లేయర్‌తో కుడితే రూ. 3 చొప్పున.. డబుల్ లేయర్‌తో కుడితే రూ.3.50 చొప్పున మహిళలకు చెల్లిస్తున్నారు. ► పొదుపు సంఘాల మహిళలు మాస్కులు తయారుచేశాక వాటిని సెర్ప్, మెప్మా సిబ్బంది సేకరించి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తారు. -
‘సీమ’ ఎత్తిపోతల టెండర్‌కు జ్యుడిషియల్ ప్రివ్యూ ఓకే
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు శనివారం ఆమోదించారు. ఇదే ప్రతిపాదనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్‌పీ)పై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టులో పంటలను రక్షించడానికి.. తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు మే 5న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ పనులకు రూ.3,278.18 కోట్లను అంతర్గత అంచనా విలువగా నిర్ణయించి.. ఈపీసీ విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో టెండర్ నిర్వహించడానికి ఈనెల 16న జ్యుడిషియల్ ప్రివ్యూకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిని వారం రోజులు వెబ్సైట్లో ఉంచిన జ్యుడిషియల్ ప్రివ్యూ వివిధ వర్గాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రతిపాదనల్లో మార్పులు చేసి ఆమోదించింది. ఇదే ప్రతిపాదనల ఆధారంగా టెండర్ నోటిఫికేషన్ జారీకి అధికారులు సిద్ధమయ్యారు. -
ఇంకా మూడ్రోజులే..!
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల నిర్వహణకు గాను టెండర్ దాఖలు చేసేందుకు మరో మూడ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16తో ముగియనున్న నేపథ్యంలో చివరి మూడ్రోజులు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొదటి 4 రోజుల్లో రాష్ట్రంలోని 2,216 షాపులకు గాను 4,326 దరఖాస్తులు వచ్చాయి. స్పందన బాగుందని, కొత్త ఔత్సాహికులు దరఖాస్తులు తీసుకుంటున్నారని, చివరి మూడ్రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. గతంలో వచ్చిన 40 వేల దరఖాస్తులను మించి దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. మద్యం వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు మద్యం వ్యాపారంలో ఈసారి కొత్త వ్యక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ మద్యం వ్యాపారం పరిధి పెరిగిపోతుండటం, దేశంలోనే ఎక్కువ మార్జిన్‌ను రిటైలర్లకు ప్రభుత్వం ఇస్తుండటంతో లాభాలు గడించవచ్చనే ఆలోచనతో ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో 23%మంది మద్యం తీసుకుంటున్నా రని అంచనా. ఈ వ్యాపారంలోకి కొత్తవారు రాకుం డా ఇప్పటికే లైసెన్సులున్న రిటైలర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం వ్యాపా రంలో ఉన్న కష్టాలను చెప్పుకుంటూ ఈ వ్యాపా రం అంత లాభసాటి కాదనే ప్రచారం కూడా క్షేత్రస్థాయిలో జరుగుతోంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం దేశంలోనే ఇంత సులభమైన ఎక్సైజ్ పాలసీ మరొకటి లేదంటున్నారు. హైదరాబాద్‌పై ‘ఆశలు’ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో కూడా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ డివిజన్లో మొత్తం 173 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటివరకు 91 దరఖాస్తులు వచ్చాయి. తొలి నాలుగు రోజుల్లో గతంలో ఇన్ని దరఖాస్తులు ఎప్పుడూ రాలేదని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఎప్పుడూ చివరి రెండ్రోజులు, ముఖ్యంగా చివరిరోజు దరఖాస్తులు వెల్లువలా వస్తాయని చెబుతున్నారు. దాఖలైన దరఖాస్తులకు పదింతలు ఎక్కువ దరఖాస్తులు ఇప్పటికే తీసుకున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో మంచి స్పందన ఉంటుందని ఎక్సైజ్ అధికారులు ఆశలు పెట్టుకోవడం గమనార్హం. -
డైవర్షన్!
సాక్షి, ముత్తుకూరు(నెల్లూరు): ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మించిన కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి ఉప్పునీటి బూడిద విడుదల జరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 కోట్లకుపైగా వ్యయం చేసి 100 ఎకరాల విస్తీర్ణంలో డైవర్షన్ యాష్‌పాండ్ నిర్మించారు. కాలుష్య నియంత్రణ మండలి అభ్యంతరాల నుంచి బయటపడి, 100 ఎకరాల యాష్‌పాండ్‌ను 30 ఎకరాలకు కుదించారు. అయితే మంచినీరు కలిసిన బూడిదను ఈ యాష్‌పాండ్‌లోకి విడుదల చేయాల్సి ఉండగా, పాత యాష్‌పాండ్ మాదిరిగానే సముద్రపు(ఉప్పు)నీరు కలిసిన బూడిదను విడుదల చేస్తున్నారు. సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ‘వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్’ నిర్మాణం పూర్తికాకపోవడమే దీనికి కారణం. మూడో యూనిట్ కింద నిర్మించే 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి మంచినీటితో నిర్వహించేందుకు, ఉద్యోగుల కాలనీలకు తాగునీరు అందించేందుకు 33 ఎంఎల్డీ, 21 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) వాటర్ ట్రీట్ ప్లాంట్ల నిర్మాణం తలపెట్టారు. మొదటి దశ ప్లాంటు పనులు గత ఏడాది జూన్‌కే పూర్తికావాల్సి ఉంది. ఏడాది గడిచినా కూడా పనులు పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. పాత దాని వలే కొత్త యాష్‌పాండ్‌తో కూడా కాలుష్యం వ్యాపిస్తుందని ఇటు రైతులు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని అటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాష్‌పాండ్ ఎత్తు పెంచే టెండర్ రద్దు? బూడిదతో పొంగిపొర్లుతున్న పాత యాష్‌పాండ్‌లోకి బూడిద విడుదల నిలిపివేశారు. దీన్ని ఐదు మీటర్ల ఎత్తు పెంచేందుకు రూ.17 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులకు టెండర్లు కూడా పిలిచారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ టెండర్ రద్దు అయ్యిందని ఇంజినీర్లు చెబుతున్నారు. అందువల్లనే ఈ పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ కాలేదని వెల్లడించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల్లో జాప్యం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడంలో జాప్యం జరిగినట్టు ఏపీజెన్కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు పేర్కొన్నారు. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఉప్పునీటి బూడిద విడుదల చేయాల్సి వస్తోందని తెలిపారు. సముద్రం నుంచి నీరు తరలించేందుకు పైపులైన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నా. వాటర్ పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీసుకోవడమే మిగిలిందని తెలిపారు. త్వరలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. అలాగే డైవర్షన్ యాష్‌పాండ్‌లోకి ఉప్పునీరు కలిసిన బూడిదను ఆరు నెలల పాటు విడుదల చేయవచ్చని ఎంఓయూలో గడువు ఇచ్చి ఉన్నారని ఇంజినీర్లు తెలిపారు. మంచినీటి బూడిద విడుదల చేస్తామన్నారు కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి మంచినీటి బూడిద విడుదల చేస్తామని గతంతో ఏపీజెన్కో ఇంజినీర్లు ప్రకటించారు. ఇప్పుడేమో ఉప్పునీటి బూడిద విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నేలటూరు, పైనాపురం ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఉప్పు మయంగా మారాయి. పంటలు పండే పరిస్థితి లేకుండాపోయింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది. కాలుష్యానికి గురయ్యే దేవరదిబ్బ గిరిజనకాలనీని ఎందుకు తరలించలేకపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమైంది. కొత్త ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. – నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు -
సున్నపురాయి నాణ్యతపై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) రాష్ట్రంలో కొత్తగా అన్వేషించిన సున్నపురాయి నిల్వల నాణ్యతను తేల్చనుంది. ఈ మేరకు పల్నాడు, భీమా బేసిన్లో ఖనిజ అన్వేషణ సమయంలో సేకరించిన సున్నపురాయి, డోలోమైట్ శాంపిళ్ల విశ్లేషణ కోసం అనుభవం కలిగిన ప్రయోగశాలల మద్దతు తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ లేబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు ఈ బాధ్యత అప్పగించేందుకు సన్నద్ధమవుతోంది. సున్నపురాయి, డోలోమైట్ శాంపిళ్ల విశ్లేషణలో అనుభవం కలిగిన పరిశోధన సంస్థలకు టెండర్ విధానంలో విశ్లేషణ బాధ్యత అప్పగించనుంది. టెండరు దాఖలుకు ఆసక్తి చూపుతున్న సంస్థలతో ఈ నెల 22న టీఎస్ఎండీసీ కేంద్ర కార్యాలయంలో ప్రిబిడ్ సమావేశం ఏర్పాటు చేసే యోచనలో టీఎస్ఎండీసీ అధికారులు ఉన్నారు. సున్నపురాయి అన్వేషణలో భాగంగా పల్నాడు బేసిన్‌లోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు, భీమా బేసిన్‌లోని వికారాబాద్ జిల్లాలో సున్నపురాయి, డోలోమైట్ నిల్వలను టీఎస్ఎండీసీ గుర్తించింది. సేకరించిన నమూనాల్లో ఇసుక, ఇతర ఖనిజాల శాతాన్ని తేల్చడంతోపాటు సున్నపురాయి నాణ్యతను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం టీఎస్ఎండీసీ వద్ద లేకపోవడంతో ప్రైవేటు ప్రయోగశాలలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రయోగశాలల నుంచి నాణ్యత నివేదికలు అందిన తర్వాత ఆయా బేసిన్ల పరిధిలో సర్వే జరిపి నిర్ధారణకు వస్తారు. నాణ్యత, పరిమాణంపై స్పష్టత వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ (ఎన్ఎండీఏ) నిబంధనల మేరకు వేలం విధానంలో సున్నపురాయి బ్లాక్‌లు కేటాయించే యోచనలో టీఎస్ఎండీసీ ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ సున్నపురాయి అన్వేషణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇసుక తవ్వకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు టీఎస్ఎండీసీ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇసుక విక్రయాల ద్వారా రూ.2,415 కోట్లు ఖజానాకు సమకూరాయి. 2017–18లో రూ.678 కోట్లు, 2018–19లో రూ.886 కోట్లు ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. కేవలం ఇసుక తవ్వకాలకే పరిమితం కాకుండా, ఇతర ఆదాయ మార్గాలపైనా టీఎస్ఎండీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని క్వారీయింగ్‌కు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు రాష్ట్రం బయట 17 బ్లాక్‌లలో సున్నపురాయి అన్వేషణపై దృష్టి పెట్టగా, ఇప్పటికే జార్ఖండ్, ఒడిశాలోని మూడు బ్లాక్‌ల్లో సున్నపురాయి అన్వేషణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాల్సిందిగా కేంద్రం.. టీఎస్ఎండీసీని కోరింది. -
కమీషన్ల కోసమే టెండర్లు..
-
బ్రీఫ్స్
సీఎంఐకి ఇండియన్ రైల్వేస్ భారీ కాంట్రాక్ట్ కేబుల్ తయారీ సంస్థ సీఎంఐ లిమిటెడ్ ఇండియన్ రైల్వేస్ నుంచి రూ.107 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. కాడ్మియం క్యాటనరీ వైర్ సరఫరాకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్‌ను అత్యంత తక్కువ బిడ్డింగ్ ద్వారా దక్కించుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రివర్స్ ఆక్షన్ విధానంలో ఈ టెండర్ నిర్ణయమైనట్లు బీఎస్ఈకి తెలియజేసింది. కంపెనీ షేర్ మంగళవారం నిఫ్టీలో 1.75 శాతం (రూ.3.10) పెరిగి 180.35 వద్ద ముగిసింది. రాఘవ్ కమోడిటీస్‌పై రూ.25 లక్షల జరిమానా రాఘవ్ కమోడిటీస్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ.25 లక్షల జరిమానా విధించింది. మోసపూరిత ట్రేడ్‌కు సంబంధించి ఆరోపణలపై ఈ జరిమానా విధించినట్లు ఒక నోట్లో పేర్కొంది. బీఎస్ఈలో ఇల్విక్విడ్ స్టాక్ ఆప్షన్స్ సెగ్మెంట్లో కృత్రిమ వ్యాల్యూమ్స్ సృష్టించినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. శిల్పా మెడికేర్ క్యాన్సర్ చికిత్స ఇన్‌జెక్షన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలకు వినియోగించే ఐరినోటికాన్ హెచ్‌సీఎల్ ఇంజెక్షన్‌కు అమెరికా హెల్త్ రెగ్యులేటర్– అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి ఆమోదం లభించింది. 40 ఎంజీ (2ఎంఎల్), 100 ఎంజీ (5 ఎంఎల్), 20ఎంజీ (ఎంల్) సింగిల్ డోస్ ఇన్‌జెన్షన్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించినట్లు శిల్పా మెడికేర్ సంస్థ బీఎస్ఈకి తెలియ జేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ నిఫ్టీలో 2 శాతం పెరిగి రూ.392.60 వద్ద ముగిసింది. సెంట్రల్ కోల్ ఫీల్డ్ చరిత్రాత్మక ఉత్పత్తి ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం– కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్... డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించింది. ఈ నెల్లో ఉత్పత్తిలో 17.7 శాతం వృద్ధి నమోదయ్యింది. 5.7 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సంస్థ నమోదుచేసినట్లు సీఎండీ గోపాల్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018–19 మూడు త్రైమాసికాల్లో సంస్థ 41.65 మిలి యన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, ఇది 12 శాతం (37.2 శాతం) అధికం. కాగా కోల్ ఇండియా ఉత్పత్తి ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 7.4 శాతం వృద్ధితో 412.45 మిలియన్ టన్నులకు చేరింది. షావోమీ టీవీ మోడళ్లపై తగ్గిన ధరలు చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం– షావోమీకి చెందిన కొన్ని టీవీ మోడళ్లపై ధరలు రూ.2,000 వరకు తగ్గాయి. ఇది ఇటీవలి జీఎస్టీ రేటు తగ్గింపు ప్రభావమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 32 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏపై ధర రూ.1,500 తగ్గింది. ఇక 32 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సీప్రోపై ధర రూ.2,000 వరకూ తగ్గింది. తక్షణం తగ్గిన చార్జీలు అమల్లోకి వస్తాయి. టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. -
భోగాపురం టెండర్ల రద్దు వెనుక అవినీతి
సాక్షి, అమరావతి: భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దు వెనుక భారీ అవినీతి భారీ అవినీతి దాగి ఉందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణకుమార్‌రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు మాలతిరాణిలతో కూడిన బృందం గురువారం విజయవాడలోని ఓ హోటల్లో బసచేసిన గవర్నర్‌ను కలసి ఈ మేరకు మూడు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రప్రభుత్వానికి ఎక్కువ భాగస్వామ్య వాటాతోపాటు ప్రభుత్వం కేటాయించే భూమికి ఏటా ఐదున్నర కోట్ల రూపాయలను లీజుగా కూడా చెల్లిస్తామని ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టెండర్లు దాఖలు చేసిందని, అయితే అంతకన్నా తక్కువ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చి, భూమికి ఎటువంటి లీజు ఇవ్వడానికి ఆసక్తి చూపని జీఎంఆర్ సంస్థకు ప్రయోజనం కలిగించడానికి సీఎం చంద్రబాబుకున్న ఉద్దేశాలు ఈ టెండర్ల రద్దులో స్పష్టంగా తెలిసిపోతున్నాయని ఇందులో పేర్కొన్నారు. కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనకూడదని నిబంధన విధించడాన్ని వారు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. పీడీ ఖాతాల కుంభకోణం, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకం, అమరావతి బాండ్ల వ్యవహారంలో అవకతవకలు, అవినీతి గురించి కూడా వారీ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయ టెండర్ల విషయంలో అధికార టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 125 ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తూ, విమానయాన రంగంలో అపార అనుభవముండి.. తక్కువ ధర ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎ.ఎ.ఐ) టెండర్లను రద్దు చేసి జీఎంఆర్ సంస్థకు అవకాశమిచ్చారని వారు తెలిపారు. సరైన కారణాలు చెప్పకుండా టెండర్లను రద్దు చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాదని కేవలం స్వప్రయోజనాల కోసం స్వయంగా సీఎం చంద్రబాబే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు వివరించారు. అంతేగాక కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనరాదని నిబంధన విధించారని, దీన్నిబట్టి ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుకున్నట్టు విదితమవుతోందని పేర్కొన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాల గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్లను రద్దుచేసి ప్రభుత్వం కొత్త స్కాంకు తెరతీసిందని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కట్టడానికి ప్రభుత్వరంగ సంస్థ ఏఏఐ ముందుకొస్తే ఎందుకు టెండర్లు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనరాదని ఆంక్షలు పెట్టడంలో చంద్రబాబు ఉద్దేశమేంటన్నారు. టెండర్ల రద్దుపై కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఎక్కువ అప్పులు చేసి.. ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారు జీవీఎల్ నరసింహారావు విలేకరులతో మాట్లాడుతూ పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరగా.. దీనిపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని నరసింహన్ తమతో చెప్పారని తెలిపారు. ఇంకా అదనంగా సమాచారముంటే ఇవ్వాలని కోరారన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పీడీ ఖాతాలను తెరిచి జవాబుదారీతనం లేకుండా వాటిద్వారా డబ్బులు ఖర్చు చేసి రూ.53 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని జీవీఎల్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమరావతి బాండ్ల పేరుతో అప్పులు తేవడం రాజధాని అభివృద్ధికోసం కాదని, అవినీతికోసమే అప్పులు తెచ్చారని ఆయన ఆరోపించారు. ఎక్కువ అప్పులు తెచ్చి ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
రూ. 13 వేల కోట్ల టెండర్ల ఉపసంహరణ
న్యూఢిల్లీ: దేశీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పలు టెండర్లను ఉపసంహరించింది. ఇందుకు సంబంధించి మార్చిన నిబంధనల కారణంగా దాదాపు రూ. 13,000 కోట్ల విలువ చేసే టెండర్లను ఉపసంహరించడమో, రద్దు చేయడమో లేదా కొత్తగా మరోసారి జారీ చేయడమో జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో రూ. 8,000 కోట్ల యూరియా ప్లాంటు ప్రాజెక్టు, రూ. 5,000 కోట్ల రైలు కోచ్‌ల ప్రాజెక్టు ఉన్నాయని పేర్కొన్నాయి. ముందుగా జారీ చేసిన టెండర్లలో విదేశీ కంపెనీలకు ప్రాధాన్యమిచ్చేలా నిబంధనలు ఉన్నట్లు తెలిపాయి. అయితే, ప్రభుత్వ ప్రాజెక్టులకు కొనుగోళ్ల విషయంలో మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వడంపై దృష్టి పెట్టిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) రంగంలోకి దిగిన అనంతరం ఆయా టెండర్లను సవరించాల్సి వచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. -
ఆ రెండు లక్షలు ఏమయ్యాయి..?
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2017–18కుగాను జరిగిన జాతర వేలం పాటకు సంబంధించి రూ.రెండులక్షలు తేడాలొచ్చాయి. ఆ సమయంలో టెండర్ పాడిన అనుగం శివకుమార్ రూ.14, 85,232కు టెండర్ దక్కించుకున్నాడు. వాయిదాల పద్ధతిలో రూ.12లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.రెండు లక్షలను గత సంవత్సరం మే 7, 18న అప్పటి ఈవో సులోచనకు ఇచ్చానని, ఆ సమయంలో ల్లకాగితంపై రాసి ఇచ్చారని శివకుమార్ అంటున్నాడు. బయటపడిందిలా.. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో టెండర్లు పిలిచారు. ఇందులో శివకుమార్ కూడా పాల్గొన్నాడు. పాత డబ్బులు చెల్లించలేదని, అవి చెల్లించాకే టెండర్లో పాల్గొనాలని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో శివకుమార్ అవాక్కయ్యాడు. తాను ఎప్పుడో డబ్బులు ముట్టజెప్పానంటూ అప్పటి ఈవో సులోచన రాసి ఇచ్చిన కాగితాన్ని చూపించాడు. అయినా వారు ససేమిరా అనడంతో ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సులోచనను వివరణ కోరగా.. తాను డబ్బులు తీసుకుని రశీదు ఇచ్చానని పేర్కొన్నారు. -
కానుక ఏదీ?
కస్తూర్బా విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు జనవరి 1నుంచి ప్రభుత్వం కొత్త మెనూ ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటివరకు ఏం వడ్డించాలనేదానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాలలో కొత్త మెనూ అమలు కావడంలేదు. దన్వాడ (నారాయణ్ పేట్) : కస్తూర్బా పాఠశాలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. గురుకుల విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో వారంలో నాలుగు రోజులు మాంసాహారం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటి మూటలుగానే మిగిలింది. అధికారులు గుడ్డుతోనే సరిపుచ్చుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి కొత్త మెనూ అమలు చేస్తామని ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. ఎలా అమలు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు, పాఠశాల ప్రత్యేక అధికారులు జాప్యం చేస్తున్నారు. పౌష్టికంగా ఉండేందుకే.. ప్రభుత్వ వసతిగృహంలో ఎక్కువశాతం, పేద మధ్యతరగతి వారే అధికంగా ఉంటారు. వీరికి సరైన ఆహారం అందించడంతోపాటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రతి ఆదివారం కోడి కూర, వారంలో ఐదు రోజులు కోడి గుడ్లు వండి వడ్డిస్తున్నారు. అదనంగా రోజూ నెయ్యి, నెలలో రెండు రోజులు మాంసాహారం పెట్టేందుకు నిర్ణయించారు. పాలు, చపాతి, పల్లిపట్టి, ఇడ్లీ, పూరి వంటి అల్పాహారం అందిస్తున్నారు. కొత్త మెనూతో బాలికల్లో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చదువుపై దృష్టి సారిస్తారని తల్లితండ్రులు విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చుపిస్తారని ప్రభుత్వం కొత్త మెనుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 2నుంచే అమలు చేయాల్సి ఉన్నా.. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ఈనెల 2 నుంచి కొత్త ఆహార పట్టిక అమలు చేయాల్సి ఉంది. కాని అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లేక అమలులో లోపంతో మెనూ ప్రకటనకే సరిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త మెనూను ప్రవేశ పెట్టలని కోరుతున్నారు. కొత్తమెనూపై స్పష్టతలేదు కొత్త మెనూకు సంబంధించిన బోర్డును పాఠశాలలో ఏర్పాటు చేశారు. కాని ఇప్పటికీ ఎంత వడ్డించాలి, కొత్త టెండర్ వేయాలా వద్దా అనే స్పష్టతలేదు. పాత టెండర్దారులకే అప్పగిస్తారా అనే అంశం కూడా తెలియడంలేదు. రెండురోజుల్లో పూర్తి సమాచారం రాగానే ప్రారంభిస్తాం. – సంగీత, మండల విద్యాశాఖ అధికారి -
థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుకు ఎన్టీపీసీ టెండర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్టీపీసీ..భారత్‌లో థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను కొనుగోలు చేయనున్నది. ఏప్రిల్ 1, 2014 తర్వాత కార్యకలాపాలు ప్రారంభించిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేయనున్నామని ఎన్టీపీసీ తెలిపింది. ఈ మేరకు టెండర్లను పిలిచినట్లు పేర్కొంది. ఏప్రిల్ 1, 2014 తర్వాత కార్యకలాపాలు ప్రారంభించిన 12 గిగావాట్ల, రూ.56,000 కోట్ల విలువైన విద్యుత్ ప్లాంట్లకు మాత్రమే అర్హత ఉంటుందని వివరించింది. ఒక్కో ప్లాంట్‌కు కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉండాలని, సబ్‌క్రిటికల్, సూపర్‌క్రిటికల్ పవర్ ప్లాంట్లను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపింది. వంద శాతం దేశీయ బొగ్గుతోనే పనిచేసేట్లుగా ఈ ప్లాంట్ల డిజైన్ ఉండాలని సూచించింది. 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) సాధించడానికి సరిపడే బొగ్గు నిల్వలు ఉండి తీరాలని పేర్కొంది. దరఖాస్తు చేసిన అన్ని ప్లాంట్లను పరిశీలించి తాము కొనుగోలు చేయడానికి తగిన ప్లాంట్లను షార్ట్‌లిస్ట్ చేస్తామని వివరించింది. ఎవరైనా ప్రమోటర్/రుణ దాత/ఆర్థిక సంస్థలు/డెవలపర్లు/ఇండిపెండెంట్ విద్యుదుత్పత్తి సంస్థలు తమ తమ విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఆఫర్ చేయవచ్చని ఎన్టీపీసీ పేర్కొంది. ఎన్టీపీసీ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 51,708 మెగావాట్లుగా ఉంది. మొత్తం 28 థర్మల్ ప్లాంట్లు, 8 గ్యాస్/లిక్విడ్ ఇంధన విద్యుదుత్పత్తి ప్లాంట్లు, 13 నవీకరణ (జల, పవన, సౌర)విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్టీపీసీ మరిన్ని థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. -
రూ.104కోట్లు ,104రోజులు
♦ సమీపిస్తున్న మేడారం మహాజాతర ♦ ఇంతవరకూ టెండర్లు దాటని పనులు ♦ ఎప్పటిలాగే జాతర ముందే ప్రారంభం ♦ నాణ్యత లేకుండా కొనసాగుతున్న వర్క్స్ ♦ కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా వచ్చినా మారని అధికారుల తీరు మహాజాతర గడువు సమీపిస్తోంది. జాతరకు మరో 104 రోజులు మిగిలి ఉండగా.. ఖర్చు చేయాల్సిన డబ్బులు రూ.104 కోట్లు ఖజానాలో మూలుగుతున్నాయి. ఎప్పటి పనులు అప్పుడే చేసి నిధులు వృథా చేసే అలవాటున్న అధికారులు ఈసారి కూడా అలాగే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. జాతర సమయంలోనే కాకుండా మిగతా రోజు ల్లోనూ భక్తులు వస్తున్నప్పటికీ శాశ్వత సౌకర్యాలు కల్పిం చడంపై మంత్రులు, అధికారులు దృష్టి సారించడం లేదు. తాత్కాలిక పనులతోనే ఎక్కువగా ‘మిగులు’ ఉంటుందని భావించిన అధికారులు ఇప్పుడు కూడా అలాగే చేపడుతున్నా రనే విమర్శలు వినిపిస్తున్నాయి. –సాక్షి ప్రతినిధి, వరంగల్ సాక్షి ప్రతినిధి, వరంగల్ : తమిళ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హిట్ సినిమాలో ‘అరుణాచలం’ ఒకటిగా పేరు సంపాదించింది. అందులో 30 రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు చేయాలనే చాలెంజ్‌ను రజనీ స్వీకరిస్తాడు. రోజుకు రూ. కోటి ఎలా ఖర్చు చేయాలో తెలియక ప్రతి వస్తువునూ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తుంటాడు. బాగానే ఉన్న ఇల్లు కూలగొట్టి మళ్లీ కట్టిస్తాడు. హోటల్ మొత్తాన్ని అద్దెకు తీసుకుంటాడు. నటన తెలియని మామను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. మొత్తంగా 30 రోజుల్లో రూ.30 కోట్ల డబ్బు వృథాగా ఖర్చు చేస్తాడు. ప్రస్తుతం మేడారం జాతరకు కేటాయించే నిధులు, చేపట్టే పనులు సైతం అచ్చం అరుణాచలం సినిమానే తలపిస్తున్నాయి. ఏడాది ముందుగానే జాతర జపం మొదలు.. అభివృద్ధి పనులకు రూ. వందల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు.. రెండు నెలలకోసారి సమీక్షలు.. ఇంత చేసి ముందుగానే పనులు ప్రారంభిస్తారని అనుకుంటే అది మన పొరపాటేనని గ్రహించాలి. జాతర సమయం దగ్గర పడిన తర్వాతనే అధికారులు పనులు మొదలుపెడుతున్నారు. గడువు సమీపిస్తోందని చివరకు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. జాతర పూర్తికాగానే రూ. వంద కోట్లతో చేపట్టిన పనులు, అందుకు సంబంధించిన ఫలితాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా ఏర్పడినా అధికారులు తమ పనితీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు దాటని పనులు ఈసారి 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జాతర నిర్వహిస్తామంటూ సమ్మక్క–సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్‌లో ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 35 రోజుల ముందుగా అంటే 2017 డిసెంబర్ 31 వరకు జాతర పనులు పూర్తి కావాలి. ఇప్పటినుంచి లెక్కించినా ప్రభుత్వం కేటాయించిన రూ.104 కోట్ల వ్యయంతో చేపట్టే పనులు సుమారు 104 రోజుల్లో పూర్తి చేయాలి. జాతర తేదీలు ప్రకటించి ఐదున్నర నెలలు దాటినా.. ఇంతవరకు ఒక్క పని ప్రతిపాదనల దశ దాటుకుని ముందుకు సాగలేదు. జాతర పనుల్లో జంప్నవాగుపై చెక్‌డ్యామ్‌లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, పదివేల మరుగుదొడ్లు, మేడారానికి వచ్చే మార్గంలో వంతెనలు, కల్వర్టులు, రోడ్డు మరమ్మతులు వంటి పనులు ఉన్నాయి. ఈ పనుల అంచనాలు ఖరారు చేసి, టెండర్లు నిర్వహించి, అగ్రిమెంటు పూర్తి చేసి, మెటీరియల్ తెప్పించి పనులు మొదలుపెట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. పనులు మొదలు కాగానే.. డిసెంబర్ మొదటివారం నుంచే భక్తుల రాక మొదలవుతుంది. ఈ లోపు సంక్రాంతి సెలవులు వస్తాయి. దీంతో భక్తుల రాక పెరుగుతుంది. రోజుకు వేల సంఖ్యలో వచ్చిపోతుంటారు. ఈ జాతర జపంలో ఎప్పటిలాగే నాణ్యతను పక్కకు తప్పించి హడావుడిగా పనులు చేపట్టి వందల కోట్ల రూపాయలు మమ అనిపిస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగానే గత జాతరలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, డార్మిటరీ, టాయిలెట్లు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. నాలుగు చెక్‌డ్యాంలు నిర్మించాల్సి ఉండగా.. ఒక్కదానికే శంకుస్థాపన జరిగింది. ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. చిన్న జిల్లాలోనూ మారని తీరు పరిపాలనలో వేగం పెరిగి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో రాష్ట్రంలోని పది జిల్లాలను విభజించి 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరి«ధిలోకి వెళ్లింది. చిన్న జిల్లాలుగా మారినప్పటికీ.. జాతర ఏర్పాట్లలో అలసత్వం కొనసాగుతోంది. గత జాతర ఏర్పాట్ల తరహాలోనే ఈ సారి నిరంతర జాప్యం చోటుచేసుకుంటోంది. స్టడీ టూర్‌కు వెళ్లొచ్చినా.. తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క–సారలమ్మ జాతర జరుగుతుంది. మాఘశుద్ధపౌర్ణమి (దాదాపు ఫిబ్రవరి) సమయంలో ఈ జాతర నిర్వహిస్తారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరుణంలో జాతర పనులు ఏడాది ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించారు. 2016 డిసెంబరులో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లలో అధునాతన పద్ధతులు తెలుసుకునేందుకు స్టడీ టూర్లో భాగంగా జిల్లా అధికారులు 2017 జనవరిలో శబరిమలైకు వెళ్లారు. ఆఖరికి 2017 ఫిబ్రవరిలో రూ.147 కోట్లతో జాతర ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 104 కోట్ల ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. ఆ తర్వాత 2017 జూన్ 8న సచివాలయం, హైదరాబాద్‌లో రాష్ట్ర గిరిజన శాఖమంత్రి ఆజ్మీరా చందూలాల్ సమీక్షించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జాతరకు సంబం«ధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
‘తుమ్మిళ్ల’కు 1.89శాతం లెస్తో టెండర్లు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులకు 1.89శాతం లెస్తో స్యూ(ఎస్ఈడబ్ల్యూ) సంస్థ టెండర్ దక్కించుకుంది. రూ.161కోట్ల విలువైన ఈ పనులకు మూడు సంస్థలు పోటీపడగా, తక్కువ ధరకు కోట్ చేసిన స్యూకు టెండర్ దక్కింది. ప్రస్తుతం స్యూకు గల సాంకేతిక అర్హతలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం ఒప్పందాలు జరగనున్నాయి. -
కరెన్సీకి ‘మేకిన్ ఇండియా’ భద్రతా ఫీచర్లు
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి మరింతగా ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ సోమవారం కరెన్సీ భద్రత ఫీచర్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేస్తూ.. మేకిన్ ఇండియా ప్రమాణాలను తప్పనిసరి చేసే నిబంధనను జోడించి కొత్తగా మరో టెండర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సరఫరాదారు రెండేళ్ల వ్యవధిలో దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలి. అలాగే క్రమంగా స్థానిక కంటెంట్‌ను కూడా పెంచాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దేశస్తు లు లేదా ఆ దేశ మూలాలు ఉన్న వారి సర్వీసులను ఈ ప్రాజెక్టులో ఉపయోగించబోమని బిడ్డరు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ థ్రెడ్స్, ఇంకు, సెక్యూరిటీ ఫైబర్, అడ్వాన్స్డ్ వాటర్‌మార్క్ మొదలైనవి సరఫరా చేసేందుకు ఆర్బీఐ ఈ టెండర్‌ను ఉద్దేశించింది. -
సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటులోనూ కుంభకోణం
-
నిబంధనలు గాలికి.. నిధులు అక్రమార్కులకు!
- జిల్లా ఆసుపత్రుల పారిశుధ్య పనుల్లో అక్రమాల ఆరోపణలు - రిజిస్ట్రరైన సంస్థలకే టెండర్లివ్వడంపై సందేహాలు సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లో పారిశుధ్య పనుల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయా..? ప్రభుత్వ సంకల్పాన్ని అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారా.. జిల్లా ఆస్పత్రుల్లో పారిశుధ్య టెండర్ల ప్రక్రియ చూస్తుంటే ఈ అనుమానాలు రాకమానవు. జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్యం, సెక్యూరిటీ, కీటకాల నివారణ, పేషెంట్ కేర్ వంటి టెండర్ పనులను కనీస గుర్తింపు లేని సంస్థలు దక్కించుకుంటున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. గత మార్చిలో టెండర్ నోటిఫికేషన్ వెలువడ్డాక రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంస్థలు కూడా టెండర్లు దక్కించుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆస్పత్రుల్లో ఆయా పనులకు మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కలెక్టర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు టెండర్లు నిర్వహించి ఏజెన్సీలకు పనులు అప్పజెప్పాలి. కానీ టెండర్ల నిర్వహణ పూర్తిగా పక్కదారి పట్టిందన్న విమర్శలున్నాయి. ఈ పనులకు ఏమాత్రం సంబంధం లేని సంస్థలు తెరమీదకొచ్చాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిబంధనలకు పాతర: ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన నిబంధనలను గాలికొదిలేశారు. టెండర్లలో పొందుపరిచిన కనీస నిబంధనలను చూడకుండా సంస్థలకు పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పనుల నిర్వహణకు సంబంధించి అనుభవం లేకపోయినా కొన్ని సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు. కొన్ని సంస్థలైతే కీటకాల నిర్వహణ లైసెన్సులు నకిలీవి సృష్టించి టెండర్లు వేశాయి. సంగారెడ్డి జిల్లాలో టెండరు దక్కించుకున్న ఒక కాంట్రాక్టరుకు అర్హతలేమీ లేకుండానే ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. అయితే స్థానిక నేతల అండతో కొందరు కాంట్రాక్టర్లు ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. టెండరు ప్రమాణాలు లేకుండానే.. ► టెండరు దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలించాలి. కానీ అధికారులు వాటిని పరిశీలించనే లేదు. ► జీవో నంబర్ 9 ప్రకారం పేషెంట్ కేర్‌కు సంబంధించి అనుభవం ఉండాలి. అవేమీ లేకుండానే సంస్థలకు అనుమతులిస్తున్నారు. ► టెండర్లలో పాల్గొన్న పలు సంస్థలు నకిలీ అనుభవ ధ్రువపత్రాలు సమర్పించాయి. దీంతో చిన్న మండల కేంద్రాల్లో ఉన్న లోకల్ ఏజెన్సీలు కూడా తెరమీదకొచ్చాయి. ► చాలామంది కాంట్రాక్టర్లు కీటకాల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులను టెండర్ నోటిఫికేషన్ విడుదలయ్యాక తెచ్చుకున్నవిగా తేలింది. అంటే వీళ్లకు ఏమాత్రం ముందస్తు అనుభవం లేదు. -
బెల్ పనుల్లో ‘కృష్ణ’ మాయ
విజయవాడ : మచిలీపట్నంలోని ‘బెల్’ కంపెనీ విస్తరణ ప్రాజెక్టును పామర్రు మండలం నిమ్మలూరులో 53 ఎకరాల్లో చేపట్టారు. నిర్మాణ పనులకు సంబంధించి తొలుత భూమిని మెరక (ఎత్తు పెంపు) చేయాల్సి ఉంది. రూ.ఏడు కోట్ల విలువైన ఈ మెరక పనుల కోసం ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని ఈ ఏడాది జనవరి మూడో వారంలో బెల్ టెండర్లు ఆహ్వానించగా పలు కంపెనీలు దాఖలు చేసుకున్నాయి. వాటిలో ఏడు కంపెనీలు అర్హత సాధించాయి. ఇక్కడే గూడుపుఠాణీకి తెరతీశారు. టెండర్ దాఖలు చేసిన కంపెనీలను తప్పించారు.. మెరకతోలడం కేవలం రూ.1.5 కోట్ల పని అని ఆ కంపెనీలకు ఈ–మెయిల్ పంపారు. దాంతో తక్కువ విలువ పనిగా భావించి ఐదు కంపెనీలు పక్కకు తప్పుకున్నాయి. అయితే టెండర్లు ఖరారు కావడానికి ముందురోజు మళ్లీ బెల్ కంపెనీ వారికి మెయిల్ పంపి మొదట అనుకున్నట్లు రూ.7 కోట్ల పనేనని సమాచారం ఇచ్చింది. దీంతో వారు బెల్ అధికారులను సంప్రదించడంతో ఈ మట్టిని పోలవరం కాలువ నుంచి తవ్వి తీసుకురావాలని, అది మంత్రి దేవినేని ఉమ మనిషైతేనే సాధ్యమని వారికి తెలిపారు. వేరే వారికి కాంట్రాక్టు దక్కినా పని చేయలేరని స్పష్టం చేశారు. మంత్రి అండదండలతోపాటు సీఎం సతీమణి, కుమారుడు లోకేష్, సినీనటుడు బాలకృష్ణకు స్థానిక ప్రజాప్రతినిధి బాగా కావాల్సిన వారని, ఆయన చెప్పిన సూర్య కన్స్ట్రక్షన్స్, పవర్‌మెక్ కంపెనీలకు చెందిన వారైతేనే ఈ పని చేయగలరని చెప్పారని తెలుస్తోంది. చివరి నిమిషంలో బెల్ రూటు మార్చడం, మంత్రి, సీఎం కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించడంతో ఆ కంపెనీలు మిన్నకుండిపోయాయి. చివరకు రేసులో సూర్య, పవర్‌మెక్ కంపెనీలు ఉండగా, సూర్య సంస్థకు కాంట్రాక్టు దక్కింది. ఆ తర్వాత స్థానిక టీడీపీ మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త సూర్య కంపెనీ నుంచి సబ్‌కాంట్రాక్టు తీసుకుని ఆ పని చేపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. బెల్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులతో కుమ్మక్కయి ఈ తతంగం నడిపి ఏడు కోట్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే తాను సీఎం భార్య భువనేశ్వరికి ఎంత చెబితే అంతని, ఆమె దత్తత తీసుకున్న కొమరవోలులో పనులన్నీ తానే చేయిస్తున్నానని, లోకేష్, బాలకృష్ణ వచ్చినప్పుడల్లా తనకు బోలెడు ఖర్చవుతోందని, అందుకే ఈ కాంట్రాక్టు తనకు ఇప్పించారని దబాయిస్తున్నట్లు సమాచారం. -
టెండరింగ్
వాడపల్లి ఆలయంలో చక్రం తిప్పుతున్న నేతలు ఆదాయానికి గండికొడుతున్న వైనం వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నలుగురు గ్రామ పెద్దలు తిష్టవేశారని పలువురు వెంకన్న భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పాలక వర్గం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్కా నేతలు ఆలయంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఆలయ అభివృద్ధి పనులకు జరిగిన టెండర్లలో నలుగురు నాయకులు చక్రం తిప్పి పనులు టెండరింగ్ అయ్యేలా ప్రయత్నాలు చేయడంతో పాటు తమ అనుచరులకే పనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఆలయ సిబ్బంది కూడా వారికి తమ వంతు సాయం అందించి స్వామి భక్తిని చాటుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రూ.32.20 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు టెండర్లలో రింగ్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది పరోక్ష సహకారంతోనే ఆలయంలో తిష్టవేసిన కొందరు కాంట్రాక్టర్లకు అధికారుల సమక్షంలోనే ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున గుడ్‌విల్ రూపంలో అందించి దేవుడికి శఠగోపం పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పోటీకీ వచ్చిన టెండరుదార్లను ప్రలోభాలకు గురిచేయడంతో రూ 32.20 లక్షల విలువైన పనులు 0.01 తక్కువ మొత్తానికి (రూ.32 తగ్గించి) టెండర్లు ఖరారైనట్టు ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ప్రకటించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వెంకన్న ఆలయంలో అన్నదాన సత్రానికి ప్రహరీ, ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వనైజ్డ్ మెస్‌కు దేవాదాయ శాఖ రూ.32.20లక్ష లు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు ఈ నెల 9న టెండర్లు పిలిచారు. ఆ పనులకు సంబంధించి టెండరుదార్లను ఆహ్వానించేందుకు మొక్కుబడిగా ప్రకటనలు చేసి ఆలయ పరిపాలన సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది గోప్యం పాటించారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక పత్రికల్లో టెండర్ నోటీస్ ప్రకటనలు రాకపోవడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతుంది. దీంతో రూ.32.20 లక్షలు పనులకు నాలుగు టెండర్లు మాత్రమే రాగా అందులో రెండు బినామీ అని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయంలో సుమారు రూ.కోటితో పనులు చేపట్టిన కొందరు టెండర్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికత పేరుతో బెదిరించి పను లు దక్కించుకున్నారని భక్తులు వాపోతున్నారు. టెండర్ల గురించి మరింత ప్రచారం చేసి ఉంటే 5 శాతం తక్కువకు ఖరారై దేవాదాయ శాఖకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వాడపల్లి ఆలయ పనుల్లో జరిగిన టెండరు అవకతవకలపై దృష్టిసారించి తిరిగి టెండర్లు నిర్వహించాలని వెంకన్న భక్తులు కోరుతున్నారు. -
తమ్ముళ్ల స్వాహాకు ఎదురుదెబ్బ
రూ 90 కోట్ల పనుల టెండర్లు రద్దు రూ.10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి ‘సాక్షి’ అడ్డుకట్ట ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన రీ టెండర్‌కు కమిటీ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వంలో అన్న కీలక నేత ... తమ్ముడు ఓడిపోయిన ఓ నేత...అయినా తుని నియోజకవర్గంలో పెత్తనం వారిదే. ఆ ప్రాంతంలో ఏది నెలకొల్పాలన్నా ... ఏ పనులు చేయాలన్నా భారీ ఎత్తున ముడుపులు చెల్లించాల్సిందే. ఇందులో భాగంగా మంజూరైన రోడ్లకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైతే రూ.9 కోట్ల కమీషన్ల కోసం నానా గందరగోళం సృష్టించారు. లోగుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో బయటపెట్టడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఏకంగా టెండర్ ప్రక్రియనే రద్దు చేశారు. సాక్షి ప్రతినిధి కాకినాడ : తెలుగు తమ్ముళ్ల పాచిక పారలేదు సరికదా వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులతో జేబులు నింపుకుందామనుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టింది. జిల్లాలో తుని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో సుమారు రూ.90 కోట్ల పనులకు టెండరింగ్ కోసం అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. తుని–కేఈ చిన్నయ్యపాలెం 24 కిలోమీటర్లు రూ.32 కోట్లు, తుని– కోటనందూరు 18 కిలోమీటర్లు రూ.18 కోట్లు, ఎ.కొత్తపల్లి–కోదాడ ఆరు కిలోమీటర్లు రూ.8 కోట్లు, సర్పవరం–ఎఫ్.కె.పాలెం, ఎఫ్.కె. పాలెం– దివిలి రోడ్లు, వంతెనల ఆధునికీకరణ పనులు ఇందులో ఉన్నాయి. ఈ పను ల్లో రాష్ట్ర అర్థిక మంత్రి యనమల రా మకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో అత్యధికంగా రూ.60 కోట్ల విలువైన పనులున్నాయి. రెండు నెలల కిందటే టెండర్లకు పిలుపు... ఈ పనులకు సంబంధించి గత నవం బర్ నెలలో తొలుత ఆఫ్‌లైన్‌లో అనం తరం ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. ఆన్లైన్ టెండర్ల పక్రియ మొదలైన సందర్భంలో తుని నియోజకవర్గానికి సంబంధించిన మూడు ప్యాకేజీలను రాజమండ్రిలో కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి జిల్లాకు చెందిన ఒక మంత్రి సోదరుడు రూ.9 కోట్లు ఇచ్చిన వారికే పనులు కట్టబెడతామని అదిరించి, బెదింరించి దారిలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతా ఓకే అనుకున్న సమయంలో ఆన్లైన్ టెండర్లు మరోసారి పిలవటంతో వీరి వ్యూహం బెడిసికొట్టింది. అప్పుడు ఉన్నత స్థాయిలో మంత్రి, పై స్థాయి అధికారులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ప్రస్తుతం పనులు మొదలెట్టే సమయానికి తమ్ముళ్లతో కుమ్మక్కైన ఒక ఉన్నతాధికారి పోస్టులో లేకపోవటంతో కథ మొదటికి వచ్చింది. ‘సాక్షి’ కథనాలతో కదలిక... వారి వ్యూహం ప్రకారం రూ.90 కోట్ల పనులకు 15 శాతం అదనంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమై ఉండేది. ఈ పనుల్లో జరుగుతున్న తెలుగు తమ్ముళ్ల భాగోతాన్ని ‘మంత్రుల ఇలాకాలో టెండరింగ్’’, రూ.9 కోట్లు ఇస్తేనే’’ అనే శీర్షికలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఉన్నతాధికారులు తెలుగు తమ్ముళ్లకు కొమ్ముకాయగా కొత్తగా వచ్చిన రవాణా, రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా ‘సాక్షి’ కథనాలపై స్పందించి టెండర్లను రద్దు చేశారు. దీంతో రూ.10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ‘సాక్షి’ పత్రిక కట్టడి చేయగలిగింది. తీవ్రంగా పరిగణించిన టెండర్ కమిటీ... ఈ పనులకు 15 శాతం అదనంగా కోట్ చేయటాన్ని తీవ్రంగా పరిణించిన రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ వీటిని రద్దు చేసి రీ టెండర్లు పిలిచేందుకు నిర్ణయించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, విపత్తు నివారణా కమిషనర్ శేషగిరిబాబు, ఆర్‌ఆండ్‌బీ. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి సమావేశమై అదనంగా 15 శాతం కోట్ చేసిన అయిదు ప్యాకేజీ పనులను రద్దు చేశారు. ఊహించని ఈ పరిణామంతో తెలుగు తమ్ముళ్లు ఖంగుతిన్నారు. అదనంగా ఐదు శాతానికి మించి అనుమతించరాదని, సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు రీటెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. ఈ పనుల ద్వారా అడ్డంగా రూ.9 కోట్లు దోచేద్దామనుకున్న తెలుగు తమ్ముళ్లు అధికారుల నిర్ణయంతో బొక్కబోర్లా పడ్డారు. -
16 నుంచి వాము క్రయ, విక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్):కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 16 నుంచి వాము క్రయ, విక్రయాలు జరుగునున్నాయి. మార్కెట్‌కు వచ్చే వామును టెండర్ పద్ధతిలో కొనుగోలు చేస్తారని మార్కెట్ కమిటీ సెక్రటరీ నారాయణమూర్తి తెలిపారు. వాము పండించిన రైతులు పంటను మార్కెట్‌కు తీసుకవచ్చి గిట్టుబాటు ధరకు అమ్మకోవాలని ఆయన కోరారు. -
విలేజ్ మాల్స్ నిర్వహణకు టెండర్లు
కర్నూలు(అగ్రికల్చర్): విలేజ్ మాల్స్‌కు సరుకుల సరఫరాకు శనివారం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కాంట్రాక్టర్లతో నెగోషియస్ నిర్వహించారు. కంది పప్పు, ఎండు మిర్చి పౌడర్, అయోడైజ్డ్ ఉప్పు తదితర నిత్యావసర వస్తువుల సరఫరా చేసేందుకు ఇటీవల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాఖలు చేసిన టెండర్లనే జేసీ తెరిచారు. 8 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఇందులో ముగ్గురుకి మాత్రమే అర్హత లభించింది. వీరితో జేసీ ధరలను ఖరారు చేసేందుకు నెగోషియస్ నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇది కొలిక్కి రాలేదు. చౌకదుకాణాల ద్వారా మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకు సరకులు పంపిణీ చేసేందుకు జేసీ చర్యలు తీసుకున్నారు. డిసెంబరు నెలలో మొత్తం కార్డులలో 20 శాతం కార్డులకు అదనపు సరుకులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు. -
ఇద్దరు వేస్తేనే.. టెండరు!
ఎక్కువ మంది వేస్తే టెండర్ రద్దు తక్కువ కోడ్ చేసిన వారికి బెదిరింపులు పనులు మొదలు పెడితే హెచ్చరికలు బడా కాంట్రాక్టర్ల పెత్తనం ఇంజనీరింగ్ అధికారుల వత్తాసు వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లో కొందరు బడా కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారారు. అభివృద్ధి పనుల టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పనుల విషయంలో చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొత్తగా ఎవరైనా కాంట్రాక్టర్‌గా చేరాలంటే ఎంట్రీ ఫీజులు కట్టాల్సిందేనని షరతులు పెడుతున్నారు. మాట వినని వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. బడా కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా ఎవరైనా తక్కువ మొత్తంతో పనులు చేసేలా టెండరు దాఖలు చేస్తే పనులు ఎలా సాగుతాయో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్లు పొందిన పనులను అగ్రిమెంట్ల లేఖల రూపంలో వారి నుంచి తీసుకుంటున్నారు. మొత్తంగా గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనుల్లో బడా కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. ఇంజనీరింగ్ అధికారులు ఈ బడా కాంట్రాక్టర్లకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్లను హెచ్చరించే విషయంలోనే అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు. అధికారుల చర్యలతో పనుల టెండర్లలో కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉండడం లేదు. దీంతో కార్పొరేషన్ నిధులు వృథాగా ఖర్చయ్యే పరిస్థితి ఉంటోంది. జీడబ్ల్యూఎంసీలో ఏటా రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నారుు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా వరంగల్ నగరం అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటారుుంచింది. సాధారణ, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మరో రూ.100 కోట్ల వరకు ఉంటోంది. రోడ్లు, డ్రెరుునేజీ, కల్వర్టులు, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు, జంక్షన్లు వంటి పనుల కోసం ఈ నిధులు కేటారుుస్తున్నారు. లక్ష రూపాయలకు మించి ఖర్చు చేసే పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ టెండరు విధానం అమలు చేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు ముందుగా నిర్ణరుుంచినట్లుగా... ఒక్కో పనికి ఇద్దరు మాత్రమే టెండరు దాఖలు చేస్తున్నారు. వీరిలో ఒకరికి పనులు దక్కుతున్నారుు. ఇలా కాకుండా ఎవరైనా పోటీపడి టెండరు దాఖలు చేస్తే కొందరు బడా కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండరు పూర్తిగా రద్దయ్యేలా చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కలసిమెలిసి పనులు పంచుకుంటుండడంతో ఈ-ప్రొక్యూర్మెంట్ స్ఫూర్తి దెబ్బతింటోంది. -
సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు
-
సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు
స్విస్ చాలెంజ్ టెండర్ వివాదమే కారణం సాక్షి, న్యూఢిల్లీ: సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను రద్దు చేసుకున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు స్విస్ ఛాలెంజ్ టెండర్ విధానం అత్యంత వివాదాస్పదమైన నేపథ్యంలోనే అమరావతి పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్.. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించాలని సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 3న ఢిల్లీకి చేరుకున్నారు. ఈనెల 3, 4న ఢిల్లీలో పర్యటించిన ఆయన బుధవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చేరుకున్నారు. గురువారం కూడా ఆయన జైపూర్‌లోనే గడపనున్నారు. షెడ్యూలు ప్రకారం ఈనెల 7న అంటే శుక్రవారం అమరావతికి చేరుకోవాలి. కానీ, ఢిల్లీ పర్యటన పూర్తయ్యాక అమరావతి పర్యటనను ఆయన రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సింగపూర్‌తో తనకున్న సత్సంబంధాల వల్ల ఆ దేశ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు ముందుకొచ్చిందని అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతూ వస్తున్నారు. అయితే స్విస్ చాలెంజ్ విధానం అత్యంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అమరావతిలో పర్యటిస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన సింగపూర్ ప్రధాని ఏపీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. సింగపూర్ ప్రధాని లీసెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంతో సీఎం చంద్రబాబునాయుడు తర్జనభర్జన పడుతున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు టెండర్ విధానంపై హైకోర్టు వ్యాఖ్యలతో ఇప్పటికే ఇరుకున పడిన ప్రభుత్వానికి సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు చేసుకోవడంతో మరింత ఇరకాటంలో పడేసిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
టెండర్ ఇప్పిస్తానని టోకరా..
రూ.20వేలు, బంగారంతో ఉడాయించిన ఘనుడు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు సుబేదారి సీఎస్‌లో కేసు నమోదు హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్.. నిత్యం ఉద్యోగులు, అధికారులతో రద్దీగా ఉంటుంది. అనువణువునా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో అధికారుల పేరుచెప్పి టెండర్లు ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టరు నుంచి రూ.20వేలు, బంగారం తీసుకుని ఉడాయించాడు ఓ ఘనుడు. విషయం తెలసుకుని లబోదిబోమన్న బాధితుడు చివరకు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. అసలేంజరిగింది... ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జిల్లాలకు అవసరమైన బీరువాలు, కుర్చీలు, బల్లలు కొనుగోలు కోసం కలెక్టరేట్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ కలెక్టరేట్లో శుక్రవారం జరిగింగి. ఈ సమయంలో కాజీపేట ప్రాంతానికి చెందని ఒక వ్యాపారి టెండర్ ధాఖలు చేయడానికి వచ్చాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు. తనకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన ఓ ఆగంతకుడు వ్యాపారిని బయటకు తీసుకు వెళ్లాడు. కలెక్టరేట్లో టెండర్లు నిర్వహిస్తున్న అధికారి తనకు బాగా తెలుసని నమ్మబలికాడు. రూ.20వేలు ఇచ్చినట్లయితే టెండర్ నీకే వచ్చేట్లు చేస్తానని అన్నాడు. దీంతో ఆ మాటలు నమ్మిన వ్యాపారి అక్కడిక్కడే రూ.20వేలు తీసి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత సదరు వ్యక్తి కలెక్టరేట్లోని డైనింగ్‌హాల్, ఇతర గదుల్లో తిరిగాడు. తరువాత కొద్ది సేపటికి వ్యాపారి వద్దకు వెళ్లి నీకు టెండర్ ఇవ్వడానికి సార్.. ఓకే అన్నాడు. కానీ... నీ చే తికి ఉన్న బంగారు ఉంగరం సార్‌కు బాగానచ్చిందట. ఒకసారి ఇస్తే ఫొటో తీసుకుని ఇస్తాడట అని నమ్మబలికాడు. దీంతో ఆ వ్యాపారి తన చేతికి ఉన్న సుమారు రూ.20వేల విలువైన బంగారు ఉంగరం తీసి ఇచ్చేశాడు. ఉంగరం చేతిలో పడగానే కలెక్టరేట్ వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించిన అగంతకుడు ముందు వైపు నుంచి బయటకు వెళ్లి పోయాడు. గంటలు గడిచినా టెండర్ ఇప్పిస్తానన్న వ్యక్తి రాకపోవడంతో అధికారుల వద్దకు వెళ్లి వ్యాపారి ఆరా తీశాడు. దీంతో తాను మోసపోయానఽని ఆ వ్యాపారికి అప్పడు అర్ధం అయింది. లబోదిబో మంటూ అధికారులకు జరిగిన విషయం చెప్పాడు. ఆ వ్యక్తితో కలెక్టరేట్లో అధికారులకు, ఉద్యోగులకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. విషయంపై పోలీసుకుల ఫిర్యాదు చేయాలని సూచించారు. సుబేదారి పీస్‌లో కేసు నమోదు విషయంలో తమకేం సబంధం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితుడు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కలెక్టరేట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు. దీంట్లో డబ్బులు, ఉంగరం తీసుకున్న విషయం, కలెక్టరేట్లో అటు..ఇటు కలియ దిరిగిన విషయం సీసీ టీవీల్లో స్పష్టంగా నమోదైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో మేడారం పాస్‌ల విషయంలో... ప్రసుత్తం టెండర్ల పేరుతో డబ్బులు, బంగారం తీసుకుని ఉడాయింన తతంగం జరిగిన గదిలోనే మేడారం జాతర సమయంలో జాతర పాస్‌లు చోరీకి గురయ్యాయి. విషయం గుర్తించి అధికారులు సీసీ టీవీపుటేజీలు పరిశీలించారు. వాటి ఆధారంగా పాస్‌లు తస్కరించిన వ్యక్తిని గుర్తించి డీఆర్వో కేసు నమోదు చేయించారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఘటన అదే గదిలో జరగడం గమనార్హం. ========================================================================================================ఎండ్ -
టెండర్ ఇప్పిస్తానని టోకరా..
రూ.20వేలు, బంగారంతో ఉడాయించిన ఘనుడు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు సుబేదారి సీఎస్‌లో కేసు నమోదు హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్.. నిత్యం ఉద్యోగులు, అధికారులతో రద్దీగా ఉంటుంది. అనువణువునా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో అధికారుల పేరుచెప్పి టెండర్లు ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టరు నుంచి రూ.20వేలు, బంగారం తీసుకుని ఉడాయించాడు ఓ ఘనుడు. విషయం తెలసుకుని లబోదిబోమన్న బాధితుడు చివరకు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. అసలేంజరిగింది... ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జిల్లాలకు అవసరమైన బీరువాలు, కుర్చీలు, బల్లలు కొనుగోలు కోసం కలెక్టరేట్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ కలెక్టరేట్లో శుక్రవారం జరిగింగి. ఈ సమయంలో కాజీపేట ప్రాంతానికి చెందని ఒక వ్యాపారి టెండర్ ధాఖలు చేయడానికి వచ్చాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు. తనకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన ఓ ఆగంతకుడు వ్యాపారిని బయటకు తీసుకు వెళ్లాడు. కలెక్టరేట్లో టెండర్లు నిర్వహిస్తున్న అధికారి తనకు బాగా తెలుసని నమ్మబలికాడు. రూ.20వేలు ఇచ్చినట్లయితే టెండర్ నీకే వచ్చేట్లు చేస్తానని అన్నాడు. దీంతో ఆ మాటలు నమ్మిన వ్యాపారి అక్కడిక్కడే రూ.20వేలు తీసి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత సదరు వ్యక్తి కలెక్టరేట్లోని డైనింగ్‌హాల్, ఇతర గదుల్లో తిరిగాడు. తరువాత కొద్ది సేపటికి వ్యాపారి వద్దకు వెళ్లి నీకు టెండర్ ఇవ్వడానికి సార్.. ఓకే అన్నాడు. కానీ... నీ చే తికి ఉన్న బంగారు ఉంగరం సార్‌కు బాగానచ్చిందట. ఒకసారి ఇస్తే ఫొటో తీసుకుని ఇస్తాడట అని నమ్మబలికాడు. దీంతో ఆ వ్యాపారి తన చేతికి ఉన్న సుమారు రూ.20వేల విలువైన బంగారు ఉంగరం తీసి ఇచ్చేశాడు. ఉంగరం చేతిలో పడగానే కలెక్టరేట్ వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించిన అగంతకుడు ముందు వైపు నుంచి బయటకు వెళ్లి పోయాడు. గంటలు గడిచినా టెండర్ ఇప్పిస్తానన్న వ్యక్తి రాకపోవడంతో అధికారుల వద్దకు వెళ్లి వ్యాపారి ఆరా తీశాడు. దీంతో తాను మోసపోయానఽని ఆ వ్యాపారికి అప్పడు అర్ధం అయింది. లబోదిబో మంటూ అధికారులకు జరిగిన విషయం చెప్పాడు. ఆ వ్యక్తితో కలెక్టరేట్లో అధికారులకు, ఉద్యోగులకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. విషయంపై పోలీసుకుల ఫిర్యాదు చేయాలని సూచించారు. సుబేదారి పీస్‌లో కేసు నమోదు విషయంలో తమకేం సబంధం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితుడు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కలెక్టరేట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు. దీంట్లో డబ్బులు, ఉంగరం తీసుకున్న విషయం, కలెక్టరేట్లో అటు..ఇటు కలియ దిరిగిన విషయం సీసీ టీవీల్లో స్పష్టంగా నమోదైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో మేడారం పాస్‌ల విషయంలో... ప్రసుత్తం టెండర్ల పేరుతో డబ్బులు, బంగారం తీసుకుని ఉడాయింన తతంగం జరిగిన గదిలోనే మేడారం జాతర సమయంలో జాతర పాస్‌లు చోరీకి గురయ్యాయి. విషయం గుర్తించి అధికారులు సీసీ టీవీపుటేజీలు పరిశీలించారు. వాటి ఆధారంగా పాస్‌లు తస్కరించిన వ్యక్తిని గుర్తించి డీఆర్వో కేసు నమోదు చేయించారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఘటన అదే గదిలో జరగడం గమనార్హం. -
అభివృద్ధి పనుల టెండర్లలో రింగ్?
రూ.4.26 కోట్ల పనుల్లో కాంట్రాక్టర్ల ప్రయత్నం కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ఇటీవల పిలిచిన రూ.4.26 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు రింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు ఎస్సీ, జనరల్ ఫండ్ నిధులు రూ.4.26 కోట్లతో 52 అభివృద్ధి పనుల కోసం ఆన్లైన్లో ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈనెల 2న టెండర్లకు షెడ్యూల్ దాఖలు చేయడానికి చివరి గడువు విధించగా, ఆ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కాంట్రాక్టర్లు వాయిదా వేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. దీంతో అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. సమయం పొడిగించడంతో కాంట్రాక్టర్ల మధ్య రాజీయత్నాలు జరుపుకోవడానికి మార్గం సులువైంది. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్లు మార్కండేయకాలనీలోని ఓ రహస్య ప్రాంతంలో మంతనాలు జరిపారని తెలిసింది. కాంట్రాక్టర్లు అందరూ సయోధ్యతతో ఉంటేనే అనుకున్న వారికి పనులు వస్తాయని వారు చర్చించుకున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఏ రేట్లకు షెడ్యూల్ దాఖలు చేశారన్న విషయం బుధవారం సాయంత్రం తెలియనుంది. -
టెంకాయల వేలం వాయిదా
గద్వాల న్యూటౌన: పుష్కరాల్లో నదీఅగ్రహరం పుష్కరఘాట్ వద్ద టెంకాలు విక్రయించేందుకు సోమవారం నిర్వహించిన వేలం పాట వాయిదా పడింది. దాదాపు రూ.5లక్షల వరకు వేలం ఖరారు చేయగా కేవలం కేవలం 1.2లక్షల వరకు మాత్రమే వేలందారులు పాడడంతో అధికారులు వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి 6న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీఅగ్రహారం వద్ద శ్రీరామావధూత మఠం పరిధిలో వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకావం ఉందని అధికారులు భావిస్తూ ఈనెల 8 నుంచి 25వ తేదీ వరకు టెంకాయలు విక్రయించుకునేందుకు రూ. 50 వేల డిపాజిట్‌తో వేలానికి పిలిచారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శకుంతల, ఈఓ పురందర్ కుమార్‌లు వేలం పాట నిర్వహించగా కేవలం 1.2లక్షల వరకు మాత్రమే పాడారు. తక్కువ ఆదాయం రావడంతో అసిస్టెంట్ కమిషనర్ సూచన మేరకు వాయిదా వేశారు. ఇదిలావుండగా లడ్డు, పులిహోరను విక్రయించుకునేందుకు రూ.40వేల డిపాజిట్‌తో వేలం పాట నిర్వహించగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రభాకర్ 3.35లక్షలకు పాడి దక్కించుకున్నారు. అలాగే కొబ్బరి చిప్పల సేకరణకు రూ.40వేకు నర్సింహ అనే వ్యక్తి రూ.41,500కు దక్కించుకున్నాడు. -
జీసీసీలో టెండర్ల ద్వారా కొనుగోళ్లు
అరకులోయ: డీఆర్ డిపోల్లో నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు విక్రయించేందుకు ఇకపై టెండర్లు పిలిచి సరుకులు కొనుగోలు చేయనున్నట్టు పాడేరు జీసీసీ డీఎం శర్మ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు జీసీసీ బ్రాంచ్ కార్యాలయంలో సేల్స్‌మన్లతో సమావేశం నిర్వహించారు. ప్రతీ డీఆర్ డిపోలో బియ్యం, కిరోసిన్, పంచదార, కాకుండ ఇతర నిత్యవసర వస్తువులను రూ. 50వేలకు తగ్గకుండా విక్రయించాలని ఆదేశించగా సేల్స్మన్లు అడ్డుతగిలారు. గిరిజన ప్రాంతంలో నెలకు రూ. 50 మించి ఇతర సరుకులు కొనుగోలు చేయనప్పుడు ఏ విధంగా రూ. 50 వేల సరుకుల విక్రయిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన వస్తువులను తక్కువకు లభిస్తుంటే జీసీసీలో నాణ్యత లేని వస్తువులు అధిక ధరకు ఎలా కొనుగోలు చేస్తామని గిరిజనులు ప్రశ్నిస్తున్నారనిడీఎం దష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇకపై టెండర్ల ద్వారా సరకులు కొనుగోలుచేసి తక్కువధరకు విక్రయిస్తామన్నారు. ఈ ఏడాది నుంచి కాఫీ రైతులకు రుణాలు అందజేస్తామన్నారు. అరకులోయలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మీ ఇంటికి మీ సరుకు కార్యక్రమం నిలిపివేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జీసీసీ సూపరింటెండెంట్ వల్లేసి గాసి, సిబ్బంది పాల్గొన్నారు. -
'వారంలో డిండి రిజర్వాయర్లకు టెండర్లు'
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకం పనులను వారంరోజుల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తికాని పనులను మినహాయించి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే నిర్ణయించి రిజర్వాయర్లకు టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఐదు రిజర్వాయర్ల తుది అంచనాలు 4 రోజుల్లో పూర్తి చేసి 20 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో డిండి ప్రాజెక్టు పురోగతిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించే అంశమై వ్యాప్కోస్ చేస్తున్న సర్వేపై ఆరా తీశారు. ఆ సర్వే పనులకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున అప్పట్లోగా నల్లగొండ జిల్లా రిజర్వాయర్లకు టెండర్లు పిలవాలని సూచించారు. ఇప్పటికే సిద్ధమైన అంచనాల మేరకు సింగరాజుపల్లి(0.8టీఎంసీ)కి రూ.100 కోట్లు, గొట్టిముక్కల(1.8టీఎంసీ)కి రూ.125 కోట్లు, చింతపల్లి(1.1టీఎంసీ)కి రూ.150 కోట్లు, కిష్టరాంపల్లి(10టీఎంసీ)కి రూ.1500 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. మరో రిజర్వాయర్ శివన్నగూడెం(12 టీఎంసీ) అంచనాలు ఖరారు కావాలని, దీనికి రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
టెండర్లు ఖరారు కాగానే ‘డబుల్’ పనులు
♦ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ రెండు పడక గదుల ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించినట్లు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని త న ఛాంబర్లో గృహనిర్మాణశాఖ పురోగతిని సమీక్షించారు. జాయింట్ కలెక్టర్లు రజత్‌కుమార్‌సైనీ, కాట ఆమ్రపాలి పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ పథకం కింద ప్రతి నియోజకవ ర్గంలో 400 గృహాలను నిర్మించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇందులోభాగంగా మొదటి విడతలో 33 గ్రామీణ మండలాల్లో 102 లేఅవుట్లలో 4,450 ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పనులు చేపట్టే బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే చేవెళ్ల, తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాం తాల్లో పంచాయతీరాజ్ శాఖకు కట్టబెట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కల్పిస్తామని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హులకు నాణ్యమైన గృహా లను కేటాయించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పా రు. సమావేశంలో గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డెరైక్టర్ బల రామ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
లాభాలంటే చేదా?
⇒ నిమ్స్ మెడికల్ షాపుల కేటాయింపులో గోల్మాల్ ⇒ గతంలో తొలగించిన సంస్థకే మళ్లీ కేటాయింపు? ⇒ తెరవెనుక పావులు కదుపుతున్న ఓ ఉన్నతాధికారి ⇒ ఏడాదిలో రూ.1.14 కోట్లలాభాలొచ్చినా ప్రైవేట్ వైపే మొగ్గు ఆస్పత్రికి కాసులు కురిపించే నిమ్స్ మెడికల్ షాపులకు అంతా కలిసి ‘టెండర్’ వేశారు. కొంతమంది అధికారులు, గుత్తేదారులతో కుమ్మక్కై గతంలో తొలగించిన వారికే మళ్లీ షాపులు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారు. కేవలం ఏడాది కాలంలో ఆస్పత్రికి రూ.1.14 కోట్లు లాభాలు ఆర్జించి పెట్టిన దుకాణాలను కనీసం టెండర్ పిలువకుండా ఓ బినామీ సంస్థకు కట్టేబెట్టేందుకు నిమ్స్ అధికారులు యత్నిస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరో -
టెండర్ల కోసం తమ్ముళ్ల పోటాపోటీ
జేసీ, ఉన్నం అనుచరులకు దక్కని టెండర్లు కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇసుక రీచ్ టెండర్ల వ్యవహారం టీడీపీలో కలకలాన్ని రేపింది. అజ్జయదొడ్డి ఇసుక రీచ్ దక్కించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ అనుచరున్ని ఎంపీ జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారని దుమారం చెలరేగింది. అజ్జయదొడ్డి ఇసుక రీచ్‌కు జేసీ అనుచరుడు తక్కువ ధరకు టెండర్ వేసి భంగపడడంతో కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఎలాగైనా సరే ఇసుక రీచ్ టెండర్లను దక్కించుకోవాలని భావించిన ఎమ్మెల్యే ఉన్నం అనుచరుల వ్యూహం కూడా ఫలించలేదు. వివరాల్లోకెళితే... నియోజకవర్గంలో ఉన్న అజ్జయదొడ్డి, కన్నేపల్లి, చెన్నంపల్లి ఇసుక రీచుల కోసం ప్రభుత్వం టెండర్‌కు పిలిచింది. ఎమ్మెల్సీ కేశవ్ అనుచరులు కన్నేపల్లి ఇసుక రీచ్‌ను క్యూబిక్ మీటర్ రూ.110 కే టెండర్ దక్కించుకున్నారు. అజ్జయదొడ్డి ఇసుక రీచ్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు అనుచరుడు దక్కించుకున్నాడు. ఈ రీచ్‌కు జేసీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి క్యూబిక్ మీటర్ కు రూ.110 టెండర్ దాఖలు చేశాడు. కాలవ అనుచరుడు రూ.315 ప్ర కారం వేసి దక్కించుకున్నాడు. చెన్నం పల్లి ఇసుక రీచ్ టెండర్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులకు మొండిచేయి దక్కింది. రీచ్‌కు ఐదుగురు టెండర్లు దాఖలు చేయాల్సిన నిబంధనతో ఎమ్మెల్యే వర్గీయుల ఆశలు ఆవిరయ్యాయి. ఇదిలా ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇసుక రీచ్ టెండర్లలో ఎంపీ జేసీ, ఎమ్మెల్సీ కేశవ్ అనుచరులు తలదూర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ వర్గీయులు అదే పార్టీకి చెందిన చీఫ్‌విప్ అనుచరుడి కిడ్నాప్ చేశారన్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఏదిఏమైనా అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు ఇసుక టెండర్ల ద్వారా మరోసారి బయటపడ్డాయనే చెప్పవచ్చు. -
టెండర్ కాదు... వండర్
బెరైటీస్ తవ్వకంలో రూ.531 కోట్లు హాంఫట్! ఏపీఎండీసీ ఖజానాకు భారీ గండి సాక్షి, హైదరాబాద్: ‘రింగ్’ రాజా ‘రింగ్’లా సాగిన బెరైటీస్ తవ్వకం టెండర్‌ను ప్రభుత్వం ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఖజానాకు రూ.531 కోట్లు గండి పడనుంది. ఏటా పెట్రో ఉత్పత్తుల ధరలు పడిపోతున్న నేపథ్యంలో బెరైటీస్ ఖనిజ తవ్వకం వ్యయం తగ్గాలి. ఆ ప్రభావం బెరైటీస్ ఖనిజ తవ్వకం టెండర్లలోనూ కనిపించాలి. వాస్తవ పరిస్థితుల ప్రకారం గతం కంటే తక్కువ మొత్తానికే టెండర్లు దాఖలు కావాలి. అయితే, ఇందుకు పూర్తి భిన్నంగా గతం కంటే అధిక మొత్తానికి వైఎస్సార్ జిల్లా మంగంపేటలో బెరైటీస్ తవ్వకం కాంట్రాక్టును చెన్నైకి చెందిన త్రివేణి ఎర్త్ మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీఎండీసీ కట్టబెట్టింది. కీలక నేత ఆదేశం మేరకు ‘త్రివేణి’కి టెండర్ కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్న ఏపీఎండీసీ దీనికి అనుకూలంగా టెయిలర్ మేడ్ నిబంధనలు రూపొందించడం, తద్వారా టెక్నికల్ బిడ్డింగులో మూడు సంస్థలే అర్హత పొందిన విషయం విదితమే. ఈ మూడు సంస్థలు రింగై అధిక మొత్తానికి బిడ్లు వేయడంతో ఏపీఎండీసీ ఖనిజానాకు భారీగా గండిపడుతుంది. మళ్లీ టెండర్లు ఆహ్వానించాల్సి ఉండగా.. అధికారులు ఇందుకు భిన్నంగా టెండర్‌ను ఆమోదించిన తీరుపై ‘త్రివేణికి ఏపీఎండీసీ సలాం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. ‘త్రివేణి’కే దీర్ఘకాలిక టెండర్ 2014తో పోల్చితే ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. రోజురోజుకూ పెట్రో ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. యంత్ర పరికరాల రేట్లు కూడా తగ్గాయి. ఖనిజ తవ్వకాలకు వినియోగించేది యంత్రాలే. వీటికి కావాల్సిన ఇంధనం డీజిల్ . యంత్రాలు, డీజిల్ ధరలు తగ్గినందున 2014తో పోల్చితే ఇప్పుడు బెరైటీస్ ఖనిజ తవ్వకం, వ్యర్థాల తొలగింపు వ్యయం తగ్గుతుంది. అందువల్ల గతంలో కంటే తక్కువ వ్యయంతో ఖనిజ తవ్వకం కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు సంస్థలు పోటీ పడా లి. అయితే ఏపీఎండీసీ టెండర్లలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతంతో పోల్చితే మూడేళ్లలో అయితే రూ.318 కోట్లు, అయిదేళ్లకు గణిస్తే రూ.531 కోట్లకు పైగా టెండర్ వ్యయం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014 వరకూ ఈ కాంట్రాక్ట్ వీఎల్సీ అండ్ ఎస్సీ జాయింట్ వెంచర్ కంపెనీకి ఉండేది. అప్పట్లో ఈ సంస్థ టన్ను ఖనిజం తవ్వకానికి రూ.98, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.190 మాత్రమే కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. అయినా ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అవరోధాలు కల్పించి తవ్వకాల్లో విఫలమైందనే సాకు చూపించి ఈ సంస్థ కాంట్రాక్టును మధ్యలోనే రద్దు చేయించింది. తదుపరి స్వల్పకాలిక టెండర్లు పిలిచి టన్ను ఖనిజం తవ్వకానికి రూ.113.50, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.260 చెల్లించేలా త్రివేణి సంస్థకు కాంట్రాక్టును కట్టబెట్టింది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థకు దీర్ఘకాలిక టెండర్ కట్టబెట్టడం గమనార్హం. టన్ను ఖనిజం తవ్వకానికి అప్పుడు రూ.98.. ఇప్పుడు రూ.149 గతంలో కంటే ఎక్కువ మొత్తానికి కాంట్రాక్టును అడ్డగోలుగా త్రివేణికి ఖరారు చేయడం వల్ల ఏపీఎండీసీ వచ్చే అయిదేళ్లలో రూ.531 కోట్లకుపైగా అదనపు భారాన్ని భరించాల్సి వస్తుంది. మూడేళ్లకే చూసినా గతానికి, ప్రస్తుత టెండర్ ధరల మధ్య తేడా రూ.318 కోట్లకు పైగానే ఉంది. గతంలో వీఎల్సీ అండ్ ఎస్సీ సంస్థ టన్ను ఖనిజం తవ్వకానికి రూ.98, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.190 చొప్పున టెండర్ వేసి కాంట్రాక్టు పొందింది. టన్నుకు రూ.98 ప్రకారం 90 లక్షల టన్నుల ఖనిజం తవ్వకానికి రూ.88.20 కోట్లు అవుతుంది. క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.190 ప్రకారం 270 లక్షల క్యూబిక్ మీటర్లకు రూ.534.60 కోట్లు అవుతుంది. రెండింటికీ కలిపి మొత్తం రూ.622.80 కోట్లు మాత్రమే అవుతుంది. టన్ను ఖనిజం తవ్వకానికి రూ.149, క్యూబిక్ మీటర్ వ్యర్థాల తొలగింపునకు రూ.299 చొప్పున తాజాగా త్రివేణికి ఏపీఎండీసీ టెండర్ ఖరారు చేసింది. ఈ లెక్కన మూడేళ్లలో 270 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాల తొలగింపునకు రూ.807. 30 కోట్లు అవుతుంది. 90 లక్షల టన్నుల ఖనిజ తవ్వకానికి రూ.134.10 కోట్లు కలిపి మొత్తం రూ.941.40 కోట్లు అవుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కాంట్రాక్టు పనుల కోసం గతంలో కంటే (941.40 మైనస్ 622.80) రూ.318.60 కోట్లు అధికంగా చెల్లించేందుకు ఏపీఎండీసీ అంగీకరించినట్లు తేటతెల్లమవుతోంది. మూడేళ్ల ఈ కాంట్రాక్టును ఏటా 5 శాతం పెంపుతో మరో రెండేళ్లు పొడిగించే వెసులుబాటు ఏపీఎండీసీకి ఉంది. త్రివేణి సంస్థకు మరో రెండేళ్లు కాంట్రాక్ట్‌ను అప్పగిస్తే 5 శాతం పెంపుదలతో నిమిత్తం లేకుండానే మరో రూ.212.40 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇదే పని కోసం గతంలో వీఎల్సీ అండ్ ఎస్సీకి చెల్లించిన మొత్తం కంటే ‘త్రివేణి’కి అయిదేళ్లలో రూ.531 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నది స్పష్టమవుతోంది. కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును ఏటా 5 శాతం పెంచితే అదనపు భారం మరింత పెరుగనుంది. డీజిల్ ధరలు తగ్గుతుండడంతో తవ్వకం వ్యయం తగ్గాల్సి ఉన్నా అందుకు భిన్నంగా రూ.531 కోట్లు అదనంగా చెల్లించేలా ‘త్రివేణి’కి కాంట్రాక్టు అప్పగించాలని ఏపీఎండీసీ నిర్ణయించడం, దీనిని సర్కారు తప్పుపట్టకపోవడం వెనుక సాగిన తెరచాటు వ్యవహారం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదంతా సంస్థ పుట్టిముంచే వ్యవహారమేనని ఏపీఎండీసీ అధికారులు మండిపడుతున్నారు. ‘రింగ్’ అయ్యారిలా? ముందే కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం రూ.1,600 కోట్ల బెరైటీస్ తవ్వకం టెండర్‌ను త్రివేణి సంస్థకు అప్పగించేందుకు ఏపీఎండీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. హై ఎండ్ యంత్ర పరికరాలు కలిగి ఉండాలన్న నిబంధన వెనుక అసలు రహస్యం ఇదే. గతేడాది డిసెంబర్ 16వ తేదీ వరకూ బెరైటీస్ తవ్వకం పనులను ‘త్రివేణి’ నిర్వహించింది. మళ్లీ ఆ సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టాలనే ఎత్తుగడతోనే హై ఎండ్ యంత్రాలు (త్రివేణి వినియోగించిన స్థాయివి) కలిగి ఉండాలన్న నిబంధనను ఏపీఎండీసీ పెట్టింది. దీనివల్ల ఈ-టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఒకే సంస్థ టెండర్ వేస్తే దానికి కాంట్రాక్టు ఇవ్వడానికి వీలు కాదు. అందువల్ల కీలక నేత ఆదేశం మేరకు ఒక అధికారి మరో రెండు సంస్థలు నామమాత్రంగా టెండర్లలో పాల్గొనేలా పావులు కదిపి, ‘త్రివేణి’కి సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అధికార పార్టీ అడ్డగోలు వడ్డన
బాసంగి పునరావాస గ్రామంలో రూ. 3.80కోట్లతో పనులు నిర్వాసిత సంఘాలకివ్వకుండా వేరేవారికి పనులు అప్పగింత టెండర్లతో ప్రమేయం లేకుండా అధికారుల వడ్డన పనుల్ని అడ్డుకున్న నిర్వాసితులకు పోలీసులతో హెచ్చరికలు పనులు ఎవరిపేరున జరుగుతున్నాయో తేల్చని అధికారులు జియ్యమ్మవలస : మండలంలోని బాసంగి నిర్వాసితులకు సీమనాయుడువలసలో పునరావాసం కల్పించేందుకు రూ. 3.80 కోట్లు కేటాయించారు. వీటితో సిమెంటురోడ్లు, విద్యుత్, కాలువలు, తాగునీరు, అంగన్వాడీ, పాఠశాలల నిర్మాణం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. వీటిని నిబంధనల ప్రకారం నిర్వాసిత గ్రామంలోని సంఘాలకే అప్పగించాలి. వారిచేతనే పనులు చేయించాలి. కానీ అధికార పార్టీకి చెందిన ఓ మండలస్థాయినాయకుడి కుటుంబ సభ్యుల పేరుతో పనులు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఆ పనులు శాఖాపరంగానే చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకూ అక్కడి పనులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. డీఈని ప్రశ్నిస్తే దాటవేస్తుంటే... ఐటీడీఏ ఈఈని ప్రశ్నిస్తే డీఈని అడగాలని చెబుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ రూ. 3.80కోట్ల విలువగల పనులు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం టెండర్ పిలవాల్సి ఉన్నా రూ. పదేసి లక్షల విలువగలవిగా ముక్కలు చేసి, నామినేషన్ పద్ధతిలో పనులు చేపడుతున్నారు. అదీ నిర్వాసితుల్లోని మహిళా సంఘాలకు, గ్రామ గిరిజన అభివృద్ధి సంఘానికి(వీటీడీఏ) అప్పగించాల్సి ఉన్నా ఇవ్వకుండా... అధికార పార్టీకి చెందిన మండల నాయకుడి తల్లిని పునరావాస గ్రామంతో సంబంధం లేని ఓ సంఘంలో సభ్యురాలిగా చేర్పించి పనులు కట్టబెట్టారు. పనుల్ని నిర్వాసిత గ్రామ ప్రజలు అడ్డుకుంటున్నా పోలీసులను తెచ్చి పనులు జరిపిస్తున్నారే తప్ప తమ గోడు వినడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం
విజయవాడ: విజయవాడలో బుధవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇసుక విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇసుక రీచ్‌లను వేలం ద్వారా కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. -
ఐపీఎల్ జట్ల 'టెండర్ల' ప్రక్రియ పూర్తి
ముంబై: రాబోవు రెండు సీజన్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పాల్గొనే రెండు కొత్త జట్లను ఆహ్వానించేందుకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 2016, 2017 ఐపీఎల్ సీజన్ లో రెండు కొత్త జట్ల ఎంపికలో భాగంగా ఈనెల 16వ తేదీన భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) టెండర్ నోటీసును విడుదల చేసింది. ఇందుకు 15 రోజులు గడువు ఇచ్చిన బీసీసీఐ ఆ ప్రక్రియ ఈరోజుతో పూర్తయినట్లు స్పష్టం చేసింది. కాగా, ఐపీఎల్ జట్ల వేలాన్ని డిసెంబర్ 8వ తేదీన నిర్వహించనున్నట్లు లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. కొత్త టీమ్ ను కొనుగోలు చేయడానికి కనీస ధరను రూ.40 కోట్లుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీల స్థానంలో కొత్తగా ఎంపికైన రెండు జట్లు ఆడనున్నాయి. దీంతో తదుపరి ఐపీఎల్ కూడా ఎనిమిది జట్లతోనే జరుగనుంది. జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని భావించిన బీసీసీఐ గత నెల్లో చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ పై రెండేళ్ల పాటు వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 2016, 2017 సీజన్లకు చెన్నై, రాజస్తాన్ జట్లు దూరంగా ఉండనున్నాయి. 2018 సీజన్ లో అంటే రెండేళ్ల అనంతరం నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ లు తిరిగి బరిలో ఉంటాయి. -
విజయ డెయిరీలో గ‘లీజు’ దందా!
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీని వీధిలో నిలబెట్టేశారు. సంస్థను అడ్డుపెట్టుకొని ఎవరికివారు అందినకాడికి దోచుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకం సొమ్ము పక్కదారి పట్టిన వైనం బయటపడి వారం గడవకముందే... విజయ డెయిరీలో మరో అక్రమం బయటపడింది. రాష్ట్రంలోని విజయ డెయిరీ పార్లర్లలో ఎక్కువ భాగం ఒకే వ్యక్తికి కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు అధికారులు అతనికే టెండర్లు దక్కేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా డెయిరీ పార్లర్ల దుకాణాలకు టెండర్లు దాఖలుకాగా.. ఆ వ్యక్తికే వచ్చేలా ఏర్పాట్లు జరిగాయని ప్రచారం జరుగుతోంది. సబ్‌లీజులతో.. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పాల ఉత్పత్తులను రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్లలోని దుకాణాల్లో కొన్నింటిని తక్కువ లీజు ధరకే పాలు, పాల పదార్థాల విక్రయాల కోసం కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఏడు రైల్వే స్టేషన్లలో విజయ డెయిరీకి తక్కువ లీజుతో దుకాణాలు దక్కాయి. వీటితోపాటు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో విజయ డెయిరీ పార్లర్లను టెండర్ల ద్వారా వ్యాపారులకు కేటాయిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 విజయ డెయిరీ పార్లర్లు వెలిశాయి. అయితే మొత్తం డెయిరీ పార్లర్లలో దాదాపు 90 శాతం ఐదారేళ్లుగా ఒకే వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. కొన్ని నేరుగా, మరికొన్ని బినామీ పేరు మీద తీసుకొని వాటిని సబ్ లీజులకు ఇచ్చి నడిపిస్తున్నాడు. దీనిపై విమర్శలు రావడంతో చిన్నాచితక పార్లర్లను పక్కనపెట్టి ప్రస్తుతం 20 పెద్ద దుకాణాలను తన చేతుల్లో ఉంచుకున్నాడు. రైల్వే స్టేషన్లలోని ఏడు దుకాణాలూ అతని చేతుల్లోనే ఉన్నాయి. దోపిడీ ఇలా.. సదరు వ్యక్తి డెయిరీ పార్లర్ల దుకాణాలను సబ్ లీజుకు ఇచ్చి లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటున్నాడు. ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెల వారీ అద్దె రూ. 22,500. కానీ సదరు వ్యక్తి సబ్ లీజుదారు నుంచి నెలకు రూ. 3.30 లక్షలు వసూలు చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి అందిన ఫిర్యాదులో తేలింది. అంటే రోజుకు రూ. 11 వేలు వసూలు చేస్తున్నారు. ఫ్లాట్‌ఫాం నంబర్ 10లో ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెలవారీ అద్దె రూ. 18,500 కాగా.. రూ. 1.35 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక వరంగల్ రైల్వేస్టేషన్‌లోని పార్లర్‌కు రైల్వే శాఖ అద్దె నెలకు రూ. 7,600 కాగా.. సబ్‌లీజుదారుల నుంచి రూ. 34,980, నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని పార్లర్ అద్దె నెలకు రూ. 8,500 కాగా.. రూ. 75 వేలు వసూలు చేస్తున్నాడు. ఇలా సబ్‌లీజుల ద్వారా రూ. కోట్లు కాజేస్తున్నాడు. ఇక పార్లర్ల ద్వారా వచ్చే ఆదాయం సరేసరి. అయితే లీజు సొమ్ములో కొంత భాగం విజయ డెయిరీకి ఇవ్వాలన్న నిబంధనను కూడా తుంగలో తొక్కారు. అధికారులు కూడా అతనికి మినహాయింపు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అక్రమాలతో విజయ డెయిరీ రూ. 4 కోట్ల వరకు కోల్పోయినట్లు అంచనా. టెండర్ల నిలిపివేత ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో రైల్వేస్టేషన్లలోని డెయిరీ పార్లర్లకు దాఖలైన టెండర్లను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తాత్కాలికంగా నిలిపేశారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సురేష్ చందా, ఎండీగా బాధ్యతలు తీసుకున్న నిర్మల విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
మా ఉసురు తగులుతుంది
బాధిత ఉద్యోగుల శాపనార్థాలు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన కళాశాల వద్ద ధర్నా, ప్రిన్సిపాల్ చాంబర్లో బైఠాయింపు శ్రీకాళహస్తి: ‘పదేళ్లుగా కళాశాలలో పనిచేస్తున్నాం. రూ. 2వేల జీతం నుంచి 6 వేల జీతానికి మాత్రమే చేరుకున్నాం. మా 49 మంది జీతాలు కలిపితే ఒక్క అధ్యాపకుడి జీతంతో సమానం. అదికూడా లేకుండా చేసి మా కడుపు కొట్టడం భావ్యం కాదు. ఉన్న ఫలంగా తొలగిస్తే మా కుటుంబాలు ఏం కావాలి. మీలాగే మాకూ కుటుంబాలు, భార్య, బిడ్డలున్నారు.. వారిని పోషించలేక చంపుకోమంటారా? లేక మేమే ఆత్మహత్య చేసుకోవాలంటారా?’ చెప్పండి అంటూ బాధిత ఉద్యోగులు ప్రిన్సిపల్ జయుచంద్రయ్యను నిలదీశారు. మంగళవారం ఓ పత్రికలో స్కిట్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను టెండర్ ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించనున్నట్లు ఓ ప్రకటన ప్రచురించారు. దాంతో స్కిట్ కాంట్రాక్ట్ ఉద్యోగు లు కళాశాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఇందుకు స్పందించిన ప్రిన్సిపాల్ జయచంద్రయ్య.. కళాశాల కరెస్పాండెంట్, ఆలయ ఈఓ సూచనల మేరకే పత్రికలో ప్రకటన వెలువడిందన్నారు. ఎవరినీ తొలగించడం లేదని, ఓ ఏజెన్సీ ద్వారా తీసుకుంటారని వివరించారు. కరెస్పాండెంట్, ఈవో భ్రమరాంబతో మళ్లీ చర్చించి న్యాయుం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఆయన సూచన మేరకు ఆలయ చైర్మన్ గురవయ్యనాయుుడు, ఈవోను కలిసి బాధిత ఉద్యోగులు ఆవేదనను తెలియజేశారు. -
టెండర్ల కోలాహలం
మద్యం దుకాణాలకోసం టెండర్ వేసేందుకు జనం పోటెత్తారు. శనివారం చివరిరోజు కావడంతో జిల్లావ్యాప్తంగా ఎంతోమంది దరఖాస్తుదారులు రావడంతో జిల్లాపరిషత్ సమావేశమందిరం కిటకిటలాడింది. రాత్రి వరకూ దరఖాస్తులు స్వీకరించడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లా పరిషత్ కొత్త సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ టెండర్ల స్వీకరణకు జిల్లావ్యాప్తంగా దరఖాస్తు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావడం విశేషం. ఈ సారి టెండర్లు రెండేళ్ల కాలపరిమితికి మంజూరు చేయనుండటంతో గిరాకీ ఎక్కువైంది. గతంలో టెండరు వేసేందుకు దరఖాస్తు రూ. 25వేలు ఉండగా ఈ ఏడాది రూ. 40వేలకు పెంచారు. అయినా పోటీ తగ్గలేదు. కిక్కిరిసిన జడ్పీ సమావేశమందిరం టెండర్ల దాఖలుకు శనివారం చివరిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో జడ్పీ సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. అందులోనూ పచ్చచొక్కల హడావుడి అధికంగా కనిపించింది. కొందరికిదరఖాస్తు నింపే విధానం తెలియక ఇబ్బందులు పడ్డారు. ఎక్సైజ్ డీసీ పి.నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల స్వీకరణలో పలాస, శ్రీకాకుళం సూపరింటెండెంట్లు ఎస్.సుఖేష్, ఏసుదాసు, సీఐలు పి. శ్రీనివాసరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకూ లెక్కింపు జిల్లాలో రెండు ఎక్సైజ్ సూపరెంటె ండెంట్ కార్యాలయాల పరిధిలో 14 సర్కిళ్లు ఉన్నాయి. సర్కిల్‌కి ఒక బాక్సు వంతున దరఖాస్తులు వేసేందుకు ఏర్పాటు చేశారు. జిల్లాలో 232 మద్యం షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అందులో ప్రభుత్వం నేరుగా 23 షాపులు నిర్వహించాలని నిర్ణయించగా, మగిలిన 209 షాపులకు దరఖాస్తులను కోరారు. ఒక్కో దరఖాస్తు ఖరీదు రూ. 40వేలుగా నిర్ణయించారు. మూడు రోజుల్లో 209 షాపులకు సుమారు 2500 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 9గంటలకు లెక్కించినవి 2100కాగా ఇంకా అర్ధరాత్రి వరకు లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల ద్వారాసుమారు రూ. 8.4 కోట్లు ఆదాయం వచ్చింది. ఇంకా లెక్కించాల్సిన దరఖాస్తులు మరో 500 వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ లెక్కిస్తే మరింత ఆదాయం సమకూరవచ్చు. ఈ నెల 30న లాటరీ విధానంలో షాపులు ఖరారు చేయనున్నారు. -
ఖజానాకు టెండర్
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా కాంట్రాక్టర్లు, ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు కుమ్మక్కయ్యారు. అందిన కాడికి దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతకుముందు 20 శాతం తక్కువకు కోట్ చేసిన పనులకు ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ అంచనా వ్యయం భారీగా పెంచారు. ఆ మొత్తంపై 5 శాతం సొమ్మును ఎక్కువ చెల్లించేలా టెండర్లు వేయించారు. నగరపాలక సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పోటీ లేకుండా ఎక్కడికక్కడ కుమ్మక్కై సింగిల్ టెండర్లతో కోట్లాది రూపాయల పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎక్కడైనా పనులు చేపట్టాలంటే ముందుగా టెండర్లు ఆహ్వానిస్తారు. ఆన్లైన్లోనే బిడ్ వేస్తారు. ఎవరు తక్కువ ధర కోట్‌చేస్తే వారిని ఎంపిక చేసి పనుల కాంట్రాక్టుల్ని అప్పగిస్తారు. కానీ.. ఘనత వహించిన ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కాంట్రాకర్లు పోటీపడకుండా ముందస్తుగానే పంచాయితీ చేశారు. ఎవరి స్థాయిలో వారికి పనులు పంచేశారు. కార్పొరేటర్లు సహా అందరికీ సొమ్ములు మిగిలేలా మాట్లాడుకున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతోపాటు నగరపాలక సంస్థ నిధులతో చేపట్టనున్న రూ.10 కోట్ల విలువైన పనులను ఇష్టారాజ్యంగా పంచేశారు. పంపకాల్లో కొన్ని ఇలా.. నగరంలో నివాసముంటున్న చింతల పూడికి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు రూ.80 లక్షల విలువైన పనులను కట్టబెట్టారు. ఏలూరుకు చెందిన మరో సీని యర్ కాంట్రాక్టర్‌కు రూ.కోటి విలువైన పనులను, టీడీపీ కో-ఆప్టెడ్ సభ్యుడి బినామీకి రూ.40 లక్షల విలువైన పనులను అప్పగించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేసిన 4 పనులు మినహా దాదాపు 50 పనులను సింగిల్ టెండర్లు వేయించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఐదు శాతం ఎక్సెస్ ఎందుకు వాస్తవానికి ఇప్పుడు నిర్ధేశించిన పను లు చేసేందుకు మూడేళ్ల కిందటే టెండర్లను ఆహ్వానించారు. అప్పట్లో అంచ నా వ్యయంపై 20నుంచి 25శాతం తక్కువకే కోట్ చేసి కాంట్రాక్టర్లు ఆయా పనులను దక్కించుకున్నారు. కానీ.. అప్పట్లో 13వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదలకాక కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టలేదు. 2011 నుం చి 2014 వరకు పాలకవర్గం లేకపోవడం.. సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆటంకాలు.. ఆ తర్వాత వరుస ఎన్నికల నేపథ్యంతో పనులు అటకెక్కాయి. ఇటీవల ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా, నగరపాలక సంస్థ సాధారణ నిధులను కలిపి మొత్తం రూ.10 కోట్ల పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఎప్పుడు పనులు మొదలవుతాయా.. ఎప్పుడు కాసులొ స్తాయా అని చూస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్లు తమ అనుచరగణానికి పనులు కట్టబెట్టి కాసులు దండుకునేం దుకు తెరలేపారు. గతంలో ఖరారైన టెండర్లను పక్కనపెట్టి అస్మదీయులకు పనులు కట్టబెట్టేలా చర్యలు తీసుకున్నారు. రెండు, మూడేళ్ల కిందట కాం ట్రాక్టర్లు 20శాతం కంటే తక్కువకు కోట్ చేయగా.. ఇప్పుడు అవే పనులకు ముడి సరుకుల ధరలు పెరిగాయంటూ అంచనా వ్యయాలను పెంచారు. దీంతోపాటు ఐదు శాతం ఎక్కువ చెల్లించేలా టెండర్లు రూపొం దించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 18, 19వ తేదీల్లో దాఖలైన టెండర్లకు రేపోమాపో ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. దోపిడీకి ఉదాహరణలివిగో =ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎన్ఆర్ పేట మీదుగా జీఎన్టీ రోడ్ వరకు అవుట్‌ఫాల్ డ్రెయిన్ నిర్మాణానికి గతంలో రూ.20.10 లక్షల ధర నిర్ణయించగా, ఓ కాంట్రాక్టర్ 20శాతం తక్కువకే టెండర్ వేశారు. సుమారు రూ.16.67లక్షలకే ఆ కాంట్రాక్టు పూర్తి చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు అదే పనిని మరో కాంట్రాక్టర్‌కు రూ.31 లక్షలకు ఇచ్చేలా టెండర్ ఖరారు చేశారు. అంటే దాదాపు రెట్టిం పు ధరకు అన్నమాట. =టీటీటీ కల్యాణ మంటపం రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్ల నిర్మాణ పనులను మూడేళ్ల కిందట రూ.34.40 లక్షలకు చేపట్టేందుకు ఓ కాంట్రాక్టర్ టెండర్ వేశారు. ఈయన కూడా 20 శాతం తక్కువకే కోట్ చేస్తూ రూ.29.44 లక్షలకే నిర్మాణం పూర్తి చేసేందుకు ముం దుకొచ్చారు. ఇప్పుడు అదే పనిని మరో కాంట్రాక్టర్‌కు రూ.40 లక్షలకు టెండర్ ఖరారు చేశారు. =19వ డివిజన్లోని క్రీస్తు విగ్రహం నుంచి వంగాయగూడెం ఎస్సీ కాలనీ వరకు సీసీ డ్రెయిన్ల నిర్మాణాన్ని గతంలో రూ.23.11 లక్షలతో చేపట్టేలా ఒప్పందం కుదిరింది. అదే పనిని ఇప్పుడు రూ.30 లక్షలకు టెండర్ ఖరారు చేశారు. =అశోక్ నగర్ మెయిన్ రోడ్‌లోని అశోకా పిల్లర్ జంక్షన్ నుంచి అమీనాపేట ఎస్ఆర్ జంక్షన్ వరకు డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు గతంలో రూ.32 లక్షలకు టెండర్ ఖరారు కాగా, ఇప్పుడు ఇదే పనిని రూ.46 లక్షలకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు అప్పగించారు. -
‘చిత్రావతి’ టెండర్లో విచిత్ర అర్హతలు..!
ఎంపీ సీఎం రమేష్ కంపెనీ కోసమే.. ‘షీట్‌పైల్స్’ నిబంధనతో పోటీ నివారించిన ప్రభుత్వం రూ.17 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చిత్రావతి ఆనకట్ట నిర్మాణ పనులు కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ. 86 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు టీడీపీ నేతకే కట్టబెట్టడానికి చిత్రమైన అర్హతలు నిర్ణయించింది. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం గొడ్డుమర్రి వద్ద చిత్రావతిపై రూ. 86 కోట్ల వ్యయంతో ఆనకట్ట నిర్మాణానికి ప్రభుత్వం ఏప్రిల్ 18న టెండర్లు పిలిచింది. మే 1 వరకు బిడ్స్ సమర్పించడానికి గడువు ఇచ్చింది. 2వ తేదీన టెండర్లు తెరవనుంది. మొత్తం రూ. 86 కోట్ల విలువైన పనుల్లో రూ. 6 కోట్ల విలువైన ‘షీట్ పైల్స్’ (నీటి ప్రవాహ ధాటికి భారీగా కోతకు గురయ్యే ప్రాంతాల్లో కోతను నివారించడానికి వీలుగా ఏర్పాటు చేసే ‘జడ్’ ఆకారంలో ఉన్న రేకులు) ఏర్పాటు చేయాల్సి ఉంది. 1,586 చదరపు మీటర్ల ‘షీట్ పైల్స్’ ఏర్పాటు చేయాలని టెండర్లలో పేర్కొన్నారు. అందులో సగం.. అంటే 793 మీటర్ల మేర షీట్ పైల్స్ ఏర్పాటు చేసిన అనుభవం ఉన్న కంపెనీలే టెండర్లు దాఖలు చేయాలని అర్హతగా నిర్ణయించారు. మిగతా రూ. 80 కోట్ల విలువైన పనికి నిబంధనలు సాధారణంగా ఉన్నాయి. ‘షీట్ పైల్స్’ నిబంధన వల్ల రాష్ట్రంలో పేరున్న పెద్ద కంపెనీలు టెండర్లో పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగిందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన కంపెనీ ‘రిత్విక్ ప్రాజెక్ట్స్’ను హంద్రీనీవాలో నాసిరకంగా పనులు చేసినందుకు ప్రభుత్వం గతంలో బ్లాక్ లిస్టులో పెట్టిన విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు గుర్తుచేశారు. దాంతో బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు, అదీ టీడీపీ ఎంపీకి చెందిన కంపెనీకి కాంట్రాక్టు కట్టబెడితే వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి సీఎం రమేష్ కంపెనీ తెర వెనక ఉండి, తెర మీదకు మరో కంపెనీని తీసుకొచ్చి కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. మొదట ‘షీట్ పైల్స్’ ప్రస్తావనే లేదు.. చిత్రావతి ఆనకట్ట నిర్మాణానికి గతంలో రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. అప్పట్లో ఈ ‘షీట్ పైల్స్’ ప్రస్తావనే లేదు. అంచనా వ్యయాన్ని రూ. 86 కోట్లకు పెంచినప్పుడు టెండర్లలో పోటీని నివారించడానికి కొత్త నిబంధన వచ్చి చేరిందని అధికారులు చెబుతున్నారు.చిత్రావతిలో షీట్‌పైల్స్ వాడాల్సిన అవసరం లేదని, ఒక వేళ వాడాలని నిర్ణయించినా, దాన్ని అర్హత నిబంధనల్లో చేర్చాల్సిన అవసరం లేదంటున్నారు. టెండర్లో పోటీ నివారిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా నష్టమని, కనీసం 20 శాతం ‘లెస్’కు టెండర్ మంజూరు చేసినా.. రూ.17 కోట్లకుపైగా భారం తగ్గుతుందని చెబుతున్నారు. -
కాకతీయలో ఆపరేషన్!
- టెండర్లలో కనిపించని పారదర్శకత - పోతుగల్లు చెరువుకు రెండోసారి టెండర్ - పెద్దాయన ఆదేశాలకు అధికారుల సలాం - ప్రభుత్వానికి రూ.10 లక్షల నష్టం - కోర్టుకు వెళ్లనున్న కాంట్రాక్టర్లు! సాక్షి ప్రతినిధి, వరంగల్ : మిషన్ కాకతీయలో రాజకీయ నేతలు, అధికారుల వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బహిర్గతమవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణలో భాగంగా మొదటి విడతలో మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలోని పెద్ద చెరువును ఎంపిక చేశారు. ఈ చెరువును రూ.75.75 లక్షలతో అభివృద్ధి చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో పూడిక తీతల కోసమే సుమారు రూ.23 లక్షలకు పైగా నిధులు కేటాయించారు. దీంతో అధికార పార్టీకి చెందిన మండల నాయకుడి కన్ను ఈ చెరువుపై పడింది. మిషన్ కాకతీయలో చెరువుల టెండర్లు ఈ-ప్రొక్యూర్మెంటులో నిర్వహిస్తున్నందున తక్కువ మొత్తానికి కోట్ చేసిన వారికే పనులు దక్కుతాయి. ఎలాగైన తనకు ఈ చెరువు పనులు దక్కేలా చూడాలని నియోజకవర్గ పెద్ద నాయకున్ని ఆశ్రయించారు. మండల నేతకు దక్కేలా చూడాలని ఇరిగేషన్ ముఖ్య అధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. పూడిక తీతలతో నీటి సామర్ధ్యం పెంచుకునేందుకు ఆయకట్టులోని రైతులు కొందరు మరో కాంట్రాక్టర్ పేరుతో టెండర్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ చెరువు కోసం మార్చి 16న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పనులు దక్కించుకునేందుకు అధికార పార్టీ మండల నేత హర్షా కన్స్ట్రక్షన్స్తో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఏజెన్సీ పేరుపై టెండర్ వేశారు. మొత్తం ఈ టెండర్లో ఐదుగురు బిడ్లు దాఖలు చేశారు. అధికార నేతకు మద్దతుగా హర్షా కన్స్ట్రక్షన్ అంచనాలకు 4 శాతం ఎక్కువగా టెండర్ వేసింది. గట్టు జీవన్ అనే కాంట్రాక్టర్ 12.50 శాతం లెస్(తక్కువ), జీవీ రెడ్డి 12 శాతం లెస్, కె.వెంకటేశ్వర్‌రెడ్డి 6 శాతం లెస్, సుధాకర్‌రావు 7 శాతం లెస్‌లకు టెండర్లు దాఖలు చేశారు. టెక్నికల్ బిడ్‌లో హర్ష మాత్రమే ఎక్కువకు.. మిగిలిన టెండర్లన్నీ లెస్‌లో ఉండడంతో అధికారులకు ఏమి చేయాలో పాలు పోలేదు. ఫైనాన్సియల్ బిడ్ తెరిస్తే లెస్ ఎవరు ఉంటే వారికి అప్పగించాల్సి ఉంటుంది. అధికార నేత ఆదేశాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు మిగిలిన కాంట్రాక్టర్లకు సమాచారం అందించారు. అధికార పార్టీ నాయకులతో ఎందుకు తంటా అని కాంట్రాక్టర్లు సద్దుమణిగారు. రెండోసారి టెండర్.. మిషన్ కాకతీయలో ఒక పనికి మళ్లీ టెండర్ వేయడం ఈ చెరువుతోనే మొదలయ్యింది. టెండర్ రద్దు చేసిన అధికారులు మళ్లీ ఈ చెరువుకు ఈనెల 8న ఆన్లైన్లో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి స్థానిక రైతుల తరఫున టెండర్ వేసేందుకు సహరించవద్దని ఇరిగేషన్ అధికారుల నుంచి కాంట్రాక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. దీంతో రైతులకు టెండర్ షెడ్యూల్ ఇచ్చేందుకు ఏ కాంట్రాక్టరు ముందుకు రాలేదు. చెరువు పునరుద్ధరణ ఎలాగైనా చెపట్టాలన్న ధ్యేయంతో స్థానిక రైతులు వారి దగ్గరి కుటుంబీకుల్లోని కాంట్ట్రార్లను సంప్రదించారు. నల్గొండ జిల్లాకు చెందిన వారితో టెండర్ వేయించారు. ఈ సారి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. నల్లగొండకు చెందిన హిమసాయి కన్స్ట్రక్షన్ రైతుల పక్షాన 9.99 శాతం లెస్, కరీంనగర్‌కు చెందిన కె.అనందరావు 2 శాతం లెస్‌కు వేశారు. గుజ్జ సుమన్‌రావు 3 శాతం ఎక్కువగా వేశారు. అధికార పార్టీ మండల నాయకుడి తరఫున టెండరు వేసిన హర్షా కన్స్ట్రక్షన్స్ గతంలో కంటే ఒక శాతం తగ్గించి 2.71 శాతం ఎక్కువకు టెండర్ దాఖలు చేశారు. ఇతర జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లలో పాల్గొనడంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. తక్కువ వేసిన ఇద్దరు కాంట్రాక్టర్లలో ఒకరికి సాల్వేన్స్(బ్యాంకు గ్యారంటీ) లేదని, మరోకరికి ఇంత పెద్ద పనిచేసిన అనుభవం లేదని పేర్కొంటూ అనర్హులుగా ప్రకటించారు. అధికార పార్టీ మండల నేతకు చెందిన హర్షా కన్స్ట్రక్షన్స్కు టెండర్ ఖరారు చేస్తునుట్లుగా సమాచారం బయటికి పొక్కింది. దీంతో లెస్‌కు వేసిన కాంట్రాక్టర్లు తమకు ఎందుకు అనర్హత లేదని నిర్ణయించారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని గురువారం సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయానికి వచ్చి సాంకేతిక విభాగం డిప్యూటీ ఇంజనీర్ రఘపతిని కోరారు. హిమసాయి, ఆనందరావు ఏజెన్సీలకు చెందిన ప్రతినిధులు ఈ విషయాన్ని ‘సాక్షి’కి తెలిపారు. మిషన్ కాకతీయలో పారదర్శక అనే విషయాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కోర్టుకు వెళ్తాం.. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అర్హత ఉన్నప్పటికి టెండర్ మరొకరి దక్కేలా చేస్తున్న అధికారులపై కోర్టుకు వెళ్తామని హిమసాయి, ఆనందరావు కాంట్రాక్టర్ సంస్థలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. ఫైనాన్సియల్ బిడ్ తెరిచినట్లు అధికారులు చెబుతున్నా.. ఆన్లైన్లో ‘కీ’ పెడితే పనులు ఎవరికి కేటాయించారో వివరాలు రావడం లేదని వారు తెలిపారు. లెస్‌కు వేసిన టెండర్‌కు పనులు ఇస్తే ప్రభుత్వానికి సుమారు రూ.10 లక్షల వరకు ఆదా అవుతున్నా.. అధికారులు అధికార పార్టీ నాయకుడి కోసం కట్టపెట్టేందుకే ఈ డ్రామా అడుతున్నారని ఆరోపించారు. మిషన్ కాకతీయ అంతా పారదర్శకత అంటూ ఊదరగొడుతున్న అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి అంశాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. -
ఎత్తిపోతల ‘ప్రక్రియ’ అంతా అవినీతిమయం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది. గడువులోగా పూర్తి చేస్తే కాంట్రాక్టర్‌కు అదనంగా 16.9 శాతం చెల్లించడానికి అనుకూలంగా టెండర్ పిలిచిన తర్వాత.. నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకోవడంలో భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణులున్నాయి. ఈపీసీ విధానంలో టెండర్ విలువలో 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేయడానికి అవకాశం లేదు. తొలుత సాధారణ నిబంధనలతో టెండర్ పిలిచినా, సర్కారు పెద్దలు ఆశించిన విధంగా కాంట్రాక్టర్ నుంచి కాసులు కురిసే అవకాశం లేకపోవడంతో, 5 శాతం నిబంధనను తుంగలో తొక్కేశారు. ఆ నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకొని.. మళ్లీ టెండర్ పిలిచారు. అదనంగా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడానికి వీలుగా నిబంధనలను మార్చడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని పోలవరం ప్రాజెక్టు పేరిట ఉన్న రెండో చాప్టర్లో 7(ఇ) క్లాజ్‌లో.. ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకు వాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే అంశంతో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రకు ఉంటుంది’ అని ఉంది. 7(ఎఫ్)లో.. ‘80 టీఎంసీల కంటే ఎక్కువ కుడికాల్వకు మళ్లిస్తే.. ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి’ అని కూడా ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తామని చెబుతున్న 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలు వాటా అడిగితే.. కృష్ణా జలాల్లో వాటా ఇవ్వకతప్పదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేకపోవడంతో, లిఫ్ట్ ద్వారా కృష్ణాకు మళ్లించే నీటి విషయంలో ఎలాంటి గ్యారంటీ లేదంటున్నారు. ఇలా గ్యారంటీ లేకుండా, కృష్ణా నికర జలాల్లో మన వాటాలో కోత పడితే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని నీటిపారుదలరంగ నిపుణులు చేసిన హెచ్చరికలనూ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయంగా దక్కాల్సిన నీటిని లిఫ్ట్ ద్వారా తీసుకెళితే గోదావరి డెల్టాకు తీరని నష్టం జరగుతుందని ఆ ప్రాంత రైతులు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం లక్ష్యపెట్టకుండా మొండిగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. -
తుక్కు ఇనుముకూ కక్కుర్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇసుక దందా.. అక్రమంగా మట్టి తవ్వకాలు.. ఉద్యోగుల బదిలీలు.. ఇలా ఎక్కడ కాసులు రాల్తాయో అక్కడ వాలిపోతున్న టీడీపీ నేతలు చివరకు తుక్కు ఇనుము వేలంలోనూ అక్రమాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. పాత రోడ్డు రోలర్ల వేలంలో టెండర్లను ఏకపక్షంగా దక్కిం చుకునేందుకు అధికారులను టీడీపీ నేతలు కొందరు తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసినట్టు సమాచారం. విషయంలోకి వెళితే.. కాలం చెల్లిన రోడ్డు రోలర్లను వేలం వేయాలని పంచాయతీరాజ్ అధికారులు నిర్ణయించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమడోలు సబ్ డివిజన్ల పరిధిలో నాలుగు రోడ్డు రోల ర్లను అమ్మకానికి పెడుతూ టెండర్లను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి ఈనెల 6వ తేదీన టెండర్ కం ఆక్షన్ నోటీసు జారీ చేశారు. ఒక్కొక్క రోడ్డు రోలర్ విలువ (రిలీజ్ వేల్యూ)ను రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనేవారు అందులో 25 శాతం మార్జిన్ మనీగా రూ.37,500 చెల్లించాలని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా టెండర్ దాఖలు చేసేం దుకు వెళ్లిన వారికి మాత్రం అధికారులు చుక్కలు చూపించారు. టెండర్ దాఖలు గడువు ఈనెల 24వ తేదీ కావడంతో మంగళవారం సాయంత్రం మార్జిన్ మనీ డీడీలు కట్టి ఆఫీసుకు వెళ్లిన వారిని అధికారులు లోనికి రానివ్వలేదు. ఏ ఒక్కరి టెండరు స్వీకరించలేదు. ఎవరూ టెండర్లు వేయవద్దని కరాఖండీగా తేల్చేశారు. ‘డీడీలు తీసుకొచ్చాం.. ఇదేంటి’ అని ప్రశ్నించిన ఓ ఇనుము వ్యాపారితో స్వయంగా సదరు శాఖ అధికారులు ‘ఏం చెప్పమంటారు. మా సమస్యలు మాకున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి’ అని మొరపెట్టుకున్నారని సమాచారం. అధికారులు ఇలా టెండర్ షెడ్యూళ్లు నిరాకరించడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. ఆయకొకటి.. ఈయనకు మూడు 8 టన్నుల బరువుండే ఒక్కో రోడ్డు రోలర్‌ను తుక్కు ఇనుము కింద అమ్మినా బాగానే గిట్టుబాటవుతుందని వ్యాపారుల వాదన. తక్కువలో తక్కువగా కిలో ఇనుము రూ.30 చొప్పున లెక్క గట్టినా ఒక్కొక్క రోడ్డు రోలర్ విలువ రూ.2 లక్షల 40 వేలు ఉంటుంది. అయితే, పంచాయతీరాజ్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఒక్కొక్క రోలర్‌ను కేవలం రూ.లక్షా 50 వేలకే కట్టబెట్టేశారు. ఏలూరు సమీపంలోని ఓ ఎమ్మెల్యే బినామీగా అందరూ చెప్పుకునే వ్యక్తికి ఒక రోడ్డు రోలర్‌ను, ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి అనుచరుడికి ఏకంగా మూడు రోడ్డు రోలర్లను అప్పనంగా ఇచ్చేశారని అంటున్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇరువురి టీడీపీ నేతలకు పంచాయతీరాజ్ అధికారులు రోడ్డు రోలర్ల పంపకాలు చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరినీ టెండర్లు వేయించకుండా ఏకపక్షంగా వాటిని కట్టబెట్టాలనుకున్న ప్పుడు పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం ఎందుకు, ఓపెన్ ఆక్షన్ అని హడావుడి చేయడం ఎందుకు అన్నదే వ్యాపారుల వాదన. -
ఎస్ఎల్బీసీపై ముందుకెళ్లేదెలా?
♦ నేడు అన్ని పక్షాల నేతలతో సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం ♦ 1983లో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రస్థానం ♦ 2005 ఆగస్టులో రూ.2,813 కోట్లకు పరిపాలనా అనుమతులతో తొలి అడుగు ♦ ప్రస్తుతం 43.89 కిలోమీటర్ల సొరంగం పనుల్లో పూర్తయింది 24 కిలోమీటర్లు ♦ ఇప్పటి వరకు రూ.1,925 కోట్ల పనుల్లో రూ.1,185 కోట్ల పనులు పూర్తి ♦ మిగిలి ఉన్న మరో రూ.700 కోట్ల పనులు పెండింగ్ ♦ ఎస్కలేషన్ ఖర్చుల కింద రూ.783కోట్లు అడుగుతున్న కాంట్రాక్టు సంస్థ ♦ అడ్వాన్సు కింద రూ.150 కోట్లు తక్షణం ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ జలాలను వినియోగించుకొని తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న శ్రీశైలం ఎడమ కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగం పనులపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచీ ఓ ప్రహసనంలా మారిపోయిన సొరంగ పనుల్లో వేగంపెంచే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పనులు ప్రారంభించి పదే ళ్లు గడుస్తున్నా సగం పనులు సైతం పూర్తికాకపోవడం, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా దీనిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై అన్ని పక్షాలతో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చ సం దర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం1983లో.. పనుల ఆరంభం 2005లో.. శ్రీశైలం నుంచి నీటిని తరలించాలంటే గ్రావిటీ ద్వారా సాధ్యం కాదని ఎప్పుడో నిపుణలు తేల్చారు. సొరంగం ద్వారా నీటిని తరలించడమే మార్గమని తేల్చిచెప్పారు. దీంతో తొలిసారిగా 1983లో ఎస్ఎల్బీసీకి పునాది పడింది. సొరంగం తవ్వకానికి రూ.480కోట్ల మేర అంచనాలు వేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సొరంగం పనులను పక్కనపెట్టి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ నుంచి అంతే స్థాయి నీటిని ఎత్తిపోతల ద్వారా ఇచ్చేందుకు నిర్ణయించడం, ఎత్తిపోతల పనులను సైతం వేగిరం చేసి దాన్ని పూర్తి చేయడంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తిగా మరుగునపడ్డాయి. మధ్యలో 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పనులకు అంచనా వేయించగా అది రూ.967కోట్లుగా, 1997లో టీడీపీ ప్రభుత్వం మరోమారు అంచనా వేస్తే అది రూ.1,250 కోట్లకు పెరుగుతూ వచ్చింది. అంచనాలు వేసినా పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. తిరిగి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొరంగం పనులకు అంకురార్పణ చేసింది. అయితే అప్పటికే సొరంగం పనుల అంచనా ఏకంగా రూ.2,813 కోట్లమేర పెరిగింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం 2005 ఆగస్టులో టెండర్లు పిలవగా రూ.1,925కోట్ల పనులను కోట్ చేసిన జయప్రకాశ్ అసోసియేట్ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించింది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. పూర్తయింది రూ.1185 కోట్ల పనులే! ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల్లో రెండు సొరంగాలు తవ్వాల్సి ఉండగా మొదటిదాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సి ఉంది. మొత్తం 43.89 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు కేవలం 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8 కిలోమీటర్ల మేర ఇంకా సొరంగం తవ్వాల్సి ఉంది. ఇక రెండో సొరంగం నల్లగొండ జిల్లాలో 7.25 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇది పూర్తయినా, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికోసం ఇప్పటికే రూ.1185.38 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో రూ.700ల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా సదరు కాంట్రాక్టు సంస్థ గతంలో ఇచ్చిన జీవో 13 మేరకు ఎస్కలేషన్ చార్జీలను భరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అలా రూ.783 కోట్ల వరకు చెల్లిస్తేనే పనులు వేగిరం అవుతాయని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వెంటనే రూ. 150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం చేయలేదు. ఇక వీటితో పాటే ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్ కింద 2.20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు పరిధిలోని లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(7.6 టీఎంసీలు), మరో లక్ష ఎకరాలకు నీరందించే ఉదయసముద్రం(6.7టీఎంసీలు) ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. వీటి పరిధిలో ముంపునకు గురయ్యే సుమారు 3వేల ఎకరాల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది. గతంలో ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉన్న దృష్ట్యా దానిని పునఃపరిశీలన జరపాలన్న డిమాండ్ అక్కడి నిర్వాసితుల నుంచి వస్తోంది. ఈ అంశాలను పరిష్కరిస్తేనే ఎస్ఎల్బీసీ పనులు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న టెండర్‌ను కొనసాగించడమా, లేక రద్దు చేయడమా, రద్దు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? లేదా కాంట్రాక్టు సంస్థ కోరుతున్నట్లుగా రూ.150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలా అనే అంశాలపై గురువారం వివిధ పార్టీల నేతలు, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో చర్చించనున్నారు. -
ఐఏఎస్‌కు టెండర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంట్రాక్టు కార్మికుల నియామక టెండర్ల గోల్మాల్ వ్యవహారాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో బల్దియా అధికారుల్లో వణుకు మొదలైంది. నిబంధనలను అడ్డంగా తోసిరాజని శ్రీరాజరాజేశ్వర సంస్థకు టెండర్‌ను కట్టబెట్టిన అధికారుల మెడకు ఉచ్చు బిగిసుకుంది. సాక్షాత్తు కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారి శ్రీకేష్ లట్కర్ ప్రమేయం ఉండటంతో ఈ ఉచ్చు నుంచి బయటపడేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఒకవైపు నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో రాజీ యత్నాలు కొనసాగిస్తూనే.. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కిందిస్థాయి అధికారులను నమ్మి ఫైలుపై సంతకం చేశానని, ఎలాగైనా ఈ ఉచ్చు నుంచి బయటపడేయాలని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. అర్హతల్లేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ అడ్డంగా దొరికిపోవడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతోందననే భయం పట్టుకుంది. పూర్తి ఆధారాలతో దొరికిపోయినందున ఈ వ్యవహారం నుంచి బయటపడటం అంత సులువు కాదని హైదరాబాద్‌లోని సీనియర్ ఐఏఎస్‌లు, ఇంజనీరింగ్ ఇన్ ఛీప్ స్థాయి అధికారులు చెబుతుండటంతో సదరు ఐఏఎస్‌కు సైతం వణుకు మొదలైంది. ‘సాక్షి’లో కథనం రావడంతో శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలా? అనే అంశంపై సదరు ఐఏఎస్ అధికారి అటు ఉన్నతస్థాయి అధికారులు, ఇటు తన సన్నిహితులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి శనివారం ఉదయం బల్దియా కమిషనర్‌కు ఫోన్ చేసి ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అర్హత లేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ రూపొందించిన ఫైళ్లపై సంతకం చేసినందున దీనినుంచి తప్పించుకోవడం అంత సులువు కాదని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని శ్రీకేష్ లట్కర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఐఏఎస్‌ల కేటాయింపుల్లో లట్కర్‌ను ఏపీకి కేటాయించినప్పటికీ దీనిపై ఇంకా అధికారిక ఆదేశాలు వెలువడకపోవడంతో తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఉచ్చు నుంచి బయటపడి తిరిగి ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటివరకు సెలవు పెట్టాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 22 నుంచి 27 వరకు సెలవు పెట్టినట్లు తెలిసింది. ఎస్ఈ, ఈఈ గుండెల్లో వణుకు ఈ అక్రమాలకు మూల సూత్రధారులుగా భావిస్తున్న ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ లక్ష్మయ్య ఏకంగా కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వ్యవహారం రాష్ర్ట స్థాయికి వెళ్లడం, తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం ఖాయమని, అదే సమయంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయని, కేసు తీవ్రతను విశ్లేషిస్తున్న సహచర ఇంజనీర్లు చెబుతుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉన్నతాధికారులతో, మరోవైపు నగర మేయర్‌కు తప్పు జరిగి పోయిందని ఒప్పుకుంటూనే ఎలాగైనా ఈ వ్యవహారం నుంచి బయటపడేయాలని ప్రాధేయపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఉన్నతాధికారులను కలిసేందుకు ఎస్ఈ ఏకంగా హైదరాబాద్ వెళ్లారు. మరోవైపు నగర పాలక సంస్థ డిప్యూటీ ఈఈ సంపత్‌రావు ఈ బాగో తం తనకు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో రెండ్రోజుల క్రితమే ఓ మంత్రి ద్వారా మెట్‌పల్లికి బదిలీ చేయించుకున్నారు. ఆ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు! రద్దు దిశగా టెండర్ అక్రమార్కులంతా టెండర్ల బాగోతం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ వ్యవహారం ఇంతటితో ఆగే అవకాశాలు కన్పించడం లేదు. మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని నగర పాలక మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. మరోవైపు టెండర్ల గోల్మాల్ వ్యవహారం బట్టబయలు కావడంతో వాటిని రద్దు చేసేందుకు నగర మేయర్ సిద్ధమైనట్లు తెలిసింది. తద్వారా టెండర్ బాగోతంతో నగర పాలక సంస్థపై పడిన అవినీతి మకిలీని కడిగేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. నేడో, రేపో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. లోకాయుక్తకు ఫిర్యాదు నగరపాలక సంస్థలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని న్యాయవాది, 32వ డివిజన్ కార్పొరేటర్ ఏవీ రమణ శనివారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఉన్నతాధికారులే అత్యుత్సాహం చూపించి ఇలాంటి తప్పిదాలు చేయడం దురదృష్టకరమని, అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై తక్షణమై స్పందించి అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంకు ఎమ్మెల్యే ఫిర్యాదు టెండర్లలో జరిగిన అవకతవకలపై స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంతోపాటు బల్దియా కమిషనర్, అధికారుల వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సమర్పిస్తూ లిఖిత పూర్వక లేఖను పంపినట్లు తెలిసింది. మరోవైపు నగర పాలక సంస్థకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా?
అధికారులు కుమ్మక్కయ్యారు. వారు చేసే పనికి ఐఏ‘ఎస్’ అండగా నిలబడ్డారు. బల్దియాలో ఇక అడ్డేముంది? నిబంధనలతో పనేముంది? అర్హతలు లేకున్నా నచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అదేదో లక్ష, రెండు లక్షల విలువ చేసే పనులకున్నారా? అట్లా భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఏకంగా 10 కోట్ల విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టర్‌కు అప్పగించే దస్త్రంపై సంతకం చేశారు. అందుకు ప్రతిఫలంగా అధికారులకు ఎంత ముట్టిందనేది మాత్రం రహస్యమే. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆనోటా ఈనోటా పడి తీరా టెండర్ అక్రమాల గుట్టు రట్టవడంతో కంగుతిన్న అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. రాజీమార్గం కోసం అమాత్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఈ టెండర్ అక్రమాల కహానీ, అర్హతలేని కాంట్రాక్టర్‌తో అధికారుల కుమ్మక్కు, వారికి అండగా బల్దియా కమిషనర్ సాగించిన బాగోతమేమిటో పరిశీలిద్దాం. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో సుమారు వెయ్యిమంది కాంట్రాక్టు కార్మికుల నియామకానికి ప్రతి పాదనలను సిద్ధం చేసిన అధికారులు జూలై 30న టెండర్లను ఆహ్వానించారు. రూ.9.8 కోట్ల అంచనా తో కూడిన ఈ టెండర్లో పాల్గొనేందుకు సంస్థలు 19 రకాల ధువ్రీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా, అందులో 14 పత్రాలను తప్పనిసరి (మాండేటరీ)గా సమర్పించాలనే నిబంధనలను పొందుపరిచారు. వీటిలో క్లాస్-4 రిజిస్ట్రేషన్, ఈఎండీ, ఏపీటీఎస్ ట్రాన్సాక్షన్ ఫీజు, రూ.లక్ష అదనపు సెక్యూరిటీ డిపాజిట్, వ్యాట్ డాక్యుమెంట్, ఈపీఎఫ్, ఈఎస్ఐ తోపాటు జూన్ నెల వరకు పీఎఫ్, ఈఎస్ఐ క్లియరెన్స్ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి నిబంధనల్లో ఉన్నా యి. ఆగస్టు 18న టెక్నికల్ బిడ్ తెరిచి ఒక్కో పనికి 8నుంచి 10షెడ్యూళ్లు దాఖలైనట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటినే ప్రెజ్ బిడ్‌లో తెరవాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి టెండర్లను నెలరోజుల పాటు డౌన్లోడ్ చేసేందుకే సమయం తీసుకున్నారు. తప్పనిసరి అర్హతలివి.. మొత్తం 8కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. తక్కువ మొత్తానికి కోట్ చేసిన శ్రీరాజరాజేశ్వరి వీఎల్సీసీఎస్ లిమిటెడ్ అనే సంస్థను సక్సెస్ఫుల్ బిడ్డర్‌గా ఎంపిక చేశారు. ఇంతవరకు బాగా నే ఉన్నా.. సదరు సంస్థకు టెండర్లో పాల్గొనే అర్హత పత్రాలే లేకపోవడం గమనార్హం. తప్పనిసరిగా పేర్కొన్న 14 పత్రాల్లో కీలకమైన ఈపీఎఫ్, ఈఎస్ఐ, టర్నోవర్ వంటి పత్రాలనూ ఆ కాంట్రా క్టు సంస్థ సమర్పించలేదు. అర్హతలేకున్నా.. అప్పగింత అర్హత లేని ఈ సంస్థకు ఏకంగా రూ.10 కోట్ల కాంట్రాక్టును అప్పనంగా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘అసలే అర్హతల్లేవు... అందులోనూ మ్యాన్‌పవర్ సరఫరాలోనూ పెద్దగా అనుభవం లేకున్నా కార్మికుల నియామకపు పనులు అప్పగించేందుకు అధికారులు ఉత్సాహం చూపడంలో మతలబు ఏమిటి?’ అని మిగిలిన కాంట్రాక్టర్లంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పత్రాలను తరువాత ఎప్పుడైనా సమర్పించే అవకాశం సదరు సంస్థకు ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘కరీంనగర్లో మొత్తం 125 కాంట్రాక్టు సంస్థలున్నా అర్హతల్లేవనే కారణంతో అందులో సింహభాగం టెండర్లలో పాల్గొనలేదు. ఆ సంస్థకు ఇచ్చినట్లు వెసులుబాటు ఇస్తే కనీసం వంద కాంట్రాక్టు సంస్థలు కూడా అందులో పాల్గొనేవి కదా?’ అని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉన్నా అంతకం టే తక్కువకు టెండరు వేసిన సంస్థకు పనులు ఎట్లా అప్పగిస్తారని, అలాంట ప్పుడు తమ పరిస్థితేమిటని కార్మికులు వాపోతున్నారు. ‘నిబంధనలు రూపొం దించి టెండర్లు అప్లోడ్ అయ్యాక అనుకూలమైన వారి కోసం మార్చడం ఎంతవరకు సమంజసం? తప్పనిసరి అర్హతలను మార్చే అధికారం బల్దియా కమిషనర్‌కు సైతం లేదు. అయినా తుంగలో తొక్కారంటే దీనివెనుక పెద్ద మతలబే ఉంది’ అని సంస్థలోని ఉద్యోగులూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా? మొదట శ్రీరాజరాజేశ్వర సంస్థకు టెండర్లలో పాల్గొనే అర్హత లేని ఫైలుపై సంతకాలు చేసిన అధికారులు... ఆ తరువాత అదే సంస్థకు రూ.10 కోట్ల పనుల అప్పగించేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. అందుకోసం మాండేటరీ నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు ఫైలు సిద్ధం చేస్తే దానిపై బల్దియా కమిషనర్ అయిన ఐఏఎస్ శ్రీకేశ్ లట్కర్ సం తకం చేయడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఐఏఎస్ అయితే నిబంధన లు వర్తించవన్నట్లుగా గుడ్డిగా సంతకం చేయడమేంటని, తప్పులు సరిదిద్దాల్సి న కమిషనరే తప్పు చేస్తే బల్దియా అక్రమాలను అడ్డుకునేదెవరని ప్రశ్నిస్తున్నా రు. ఈ బాగోతంలో బల్దియా ఎస్ఈ, ఈఈ అసలు సూత్రధారులనే ఆరోపణలూ విన్పిస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర సంస్థకు కనీస అర్హతల్లేనందున సదరు దస్త్రంపై తాను మాత్రం సంతకం చేయబోనని డెప్యూటీ ఈఈ సంపత్‌రావు తెగేసి చెప్పినప్పటికీ, పక్కనపెట్టి సదరు సంస్థకు పనులు అప్పగించడం విశేషం. రాజీకి అధికారుల పాట్లు టెండర్ అక్రమాల బాగోతం బట్టబయలవడంతో బల్దియా కమిషనర్ సహా సదరు అధికారులంతా రాజీ యత్నాలు ప్రారంభించారు. నగర మేయర్, కార్పొరేటర్ల వద్దకు వెళ్లి పొరపాటైందని, దీనిని ఇంతటితో వదిలేయాలని ప్రాధేయపడుతున్నారు. బల్దియా కమిషనర్ శ్రీకేష్ లట్కర్ సైతం ‘ఇందులో నా తప్పేమీ లేదు. కిందిస్థాయి అధికారులు రూపొం దించిన ఫైలుపై చూసుకోకుండా సంత కం చేశాను’ అని రాజీ బేరానికి వస్తున్నట్లు తెలిసింది. మరోవైపు టెండర్ బాగోతంపై నగర మేయర్ రవీందర్‌సింగ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు కమలాకర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. అదే సమయంలో మేయర్ సైతం కమిషన ర్ సహా బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. -
వ్యవసాయ పరికరాలు ఏవీ?
సాక్షి ప్రతినిధి గుంటూరు: ఖరీఫ్ సీజన్ సగం దాటినా వ్యవసాయ పరికరాల సరఫరా జరగలేదు. రైతులకు ఉపయోగపడే పవర్ స్ప్రేయర్లు, టిల్లర్లు, టార్పాలిన్లు, వరికోత మెషీన్లను సీజన్‌కు ముందే రైతులకు సరఫరా చేసే విధానం అమలులో ఉంటే ఇంత వరకు టెండర్లే ఖరారు కాలేదు. వీటి సరఫరాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలల క్రితమే రూ. 316 కోట్లను విడుదల చేస్తే సరఫరాదారులతో సంప్రదింపులు, బేరసారాలు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ముందుగా వరినాట్లు వేసినవారు, గుంటూరులో పత్తి సాగుచేసిన రైతులు పవర్ స్ప్రేయర్ల కోసం అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నా ఫలితం కనపడటం లేదు. వ్యవసాయ పరికరాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం రూ. 226 కోట్లు, రాష్ట్ర ఫ్రభుత్వం రూ.ణూూ90 కోట్లను ఈ ఏడాది కేటాయించింది. నాగళ్లు, పవర్ స్ప్రేయర్లు, రొటోవేటర్లు, ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, టార్పాలిన్లు తదితర పరికరాలను సరఫరా చేసేందుకు మే నెలలో టెండర్లు ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సంస్థలు వీటిని సరఫరా చేసేందుకు ముందుకు వచ్చి, సరఫరా చేయదలిచిన రేటును ఆ టెండరులో పేర్కొన్నాయి. నాలుగు నెలల నుంచి ఈ టెండర్ల పరిశీలన, సరఫరాదారులతో సంప్రదింపులంటూ వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో వరినాట్లు పడి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అక్కడి వరి, గుంటూరులోని పత్తి తెగుళ్ల నివారణకు పవర్ స్ప్రేయర్లు అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం వీటిని ఇంతవరకు సరఫరా చేయకపోవడంతో రైతులు మార్కెట్లో లభిస్తున్న స్ప్రేయర్లను పూర్తి రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అధికారులు వీటిని సరఫరా చేసి ఉంటే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని చెల్లించేవారమంటున్నారు. ఇప్పటికైనా వీటి వినియోగానికి అనువుగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరికోత, నూర్పిళ్ల యంత్రాలు, పట్టాల సరఫరాలో కొంత ఆలస్యం జరిగినా నష్టం ఉండదని రైతులు చెబుతున్నారు. వరి కోతకు మరో రెండు నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలోపే వరికోత మెషీన్లు, నూర్పిడి యంత్రాలు, పట్టాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వీటి సరఫరాకు టెండర్లు ఖరారు అయితే సరఫరాకు రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది కాబట్టి రైతులు ఈ సీజనులో వాటిని వినియోగించే అవకాశం ఏర్పడుతుందని అదికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వీటిని పరిశీలనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.