♦ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
♦ రెండు పడక గదుల ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించినట్లు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని త న ఛాంబర్‌లో గృహనిర్మాణశాఖ పురోగతిని సమీక్షించారు. జాయింట్ కలెక్టర్లు రజత్‌కుమార్‌సైనీ, కాట ఆమ్రపాలి పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద ప్రతి నియోజకవ ర్గంలో 400 గృహాలను నిర్మించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.
ఇందులోభాగంగా మొదటి విడతలో 33 గ్రామీణ మండలాల్లో 102 లేఅవుట్లలో 4,450 ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పనులు చేపట్టే బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే చేవెళ్ల, తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాం తాల్లో పంచాయతీరాజ్ శాఖకు కట్టబెట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కల్పిస్తామని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హులకు నాణ్యమైన గృహా లను కేటాయించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పా రు. సమావేశంలో గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డెరైక్టర్ బల రామ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.