
ఇద్దరు వేస్తేనే.. టెండరు!
ఎక్కువ మంది వేస్తే టెండర్ రద్దు
తక్కువ కోడ్ చేసిన వారికి బెదిరింపులు
పనులు మొదలు పెడితే హెచ్చరికలు
బడా కాంట్రాక్టర్ల పెత్తనం
ఇంజనీరింగ్ అధికారుల వత్తాసు
వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లో కొందరు బడా కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారారు. అభివృద్ధి పనుల టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పనుల విషయంలో చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొత్తగా ఎవరైనా కాంట్రాక్టర్‌గా చేరాలంటే ఎంట్రీ ఫీజులు కట్టాల్సిందేనని షరతులు పెడుతున్నారు. మాట వినని వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. బడా కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా ఎవరైనా తక్కువ మొత్తంతో పనులు చేసేలా టెండరు దాఖలు చేస్తే పనులు ఎలా సాగుతాయో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్లు పొందిన పనులను అగ్రిమెంట్ల లేఖల రూపంలో వారి నుంచి తీసుకుంటున్నారు. మొత్తంగా గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనుల్లో బడా కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. ఇంజనీరింగ్ అధికారులు ఈ బడా కాంట్రాక్టర్లకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్లను హెచ్చరించే విషయంలోనే అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు. అధికారుల చర్యలతో పనుల టెండర్లలో కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉండడం లేదు. దీంతో కార్పొరేషన్ నిధులు వృథాగా ఖర్చయ్యే పరిస్థితి ఉంటోంది. జీడబ్ల్యూఎంసీలో ఏటా రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నారుు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా వరంగల్ నగరం అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటారుుంచింది.
సాధారణ, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మరో రూ.100 కోట్ల వరకు ఉంటోంది. రోడ్లు, డ్రెరుునేజీ, కల్వర్టులు, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు, జంక్షన్లు వంటి పనుల కోసం ఈ నిధులు కేటారుుస్తున్నారు. లక్ష రూపాయలకు మించి ఖర్చు చేసే పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు విధానం అమలు చేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు ముందుగా నిర్ణరుుంచినట్లుగా... ఒక్కో పనికి ఇద్దరు మాత్రమే టెండరు దాఖలు చేస్తున్నారు. వీరిలో ఒకరికి పనులు దక్కుతున్నారుు. ఇలా కాకుండా ఎవరైనా పోటీపడి టెండరు దాఖలు చేస్తే కొందరు బడా కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండరు పూర్తిగా రద్దయ్యేలా చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కలసిమెలిసి పనులు పంచుకుంటుండడంతో ఈ-ప్రొక్యూర్‌మెంట్ స్ఫూర్తి దెబ్బతింటోంది.