Great Warangal Municipal Corporation
-
మడిగలు పడావు
అక్కరకు రానిహాకర్స్ జోన్లు రూ.7 కోట్ల ఖర్చుతో నిర్మాణం కట్టి వదిలేసిన గ్రేటర్ అధికారులు లబ్ధిదారుల ఎదురుచూపులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు వరంగల్ : వరంగల్ మహానగర వాసుల అవసరాలను తీర్చే చిరువ్యాపారులకు భరోసా కల్పించే లక్ష్యంతో నిర్మించిన హాకర్స్ జోన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. హాకర్స్ జోన్లు నిర్మించి ఏడాది గడుస్తున్నా అర్హులకు కేటారుుంచేందుకు గ్రేటర్ వరంగల్ అధికారులకు మనసు రావడం లేదు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన హాకర్స్ జోన్లు పడావుగా ఉండిపోతున్నారుు. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) పరిధిలో రోడ్లపై వ్యాపారం చేసి జీవనం గడిపే వారి కోసం హాకర్స్ జోన్ కార్యక్రమం వచ్చింది. తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో నగరంలోని 14 ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. 1100 మంది చిరు వ్యాపారులకు సరిపడేలా పబ్లిక్‌గార్డెన్, చింతల్ బుక్‌స్టాల్, కాళోజీ సెంటర్, సుబేదారి, ఫారెస్టు ఆఫీసు, కాజీపేట, రైల్వే గేటు వంటి చోట్లలో నిర్మాణం పూర్తరుుంది. 2016 జనవరిలో వీటిని చిరువ్యాపారులకు కేటారుుంచేందుకు గ్రేటర వరంగల్ అధికారులు కసరత్తు చేశారు.లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణరుుంచారు. అరుుతే, చిరువ్యాపారులను గుర్తించే అంశంలో పొరపాట్లు జరిగారుు. చిరువ్యాపారులు కానివారి పేర్లు జాబితాలో ఉండడంతో కేటారుుంపు ప్రక్రియ మొదట్లోనే ఆగిపోరుుంది. ఒక్క కాళోజీ జంక్షన్లో మాత్రమే కేటారుుంపులు పూర్తయ్యారుు. నగరంలోని మిగిలిన ప్రదేశాల్లో హాకర్స్ జోన్లు పడావుగా ఉంటున్నారుు. చిరువ్యాపారులు ఎప్పటిలాగే రోడ్లపై వ్యాపారం నిర్వహించుకుంటున్నారు. ఫలితంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు, చిరు వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తప్పడంలేదు. నగరంలోని ప్రధాన రహదారులపై చిరు వ్యాపారులు అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాలకు, పాదాచారులకు ఇబ్బందులు కలుగుతున్నారుు. ఈ పరిస్థితిని నివారించేందుకు, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా నగరంలో హాకర్స్ జోన్ ఏర్పాటు ప్రణాళికను అధికారులు రూపొందించారు. ఎక్కువగా జనం పోగయ్యే ప్రాంతాల్లో హాకర్స్ జోన్లు నిర్మించాలని నిర్ణరుుంచారు. హాకర్స్ జోన్లకు ఆనుకుని తాగునీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చారు. మూత్రశాలలను, మరుగుదొడ్లను నిర్మించారు. నిర్మాణాలు పూర్తి చేసిన అధికారులు వాటిని వినియోగంలోకి తెచ్చే విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ఇద్దరు వేస్తేనే.. టెండరు!
ఎక్కువ మంది వేస్తే టెండర్ రద్దు తక్కువ కోడ్ చేసిన వారికి బెదిరింపులు పనులు మొదలు పెడితే హెచ్చరికలు బడా కాంట్రాక్టర్ల పెత్తనం ఇంజనీరింగ్ అధికారుల వత్తాసు వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లో కొందరు బడా కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారారు. అభివృద్ధి పనుల టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పనుల విషయంలో చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొత్తగా ఎవరైనా కాంట్రాక్టర్‌గా చేరాలంటే ఎంట్రీ ఫీజులు కట్టాల్సిందేనని షరతులు పెడుతున్నారు. మాట వినని వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. బడా కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా ఎవరైనా తక్కువ మొత్తంతో పనులు చేసేలా టెండరు దాఖలు చేస్తే పనులు ఎలా సాగుతాయో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్లు పొందిన పనులను అగ్రిమెంట్ల లేఖల రూపంలో వారి నుంచి తీసుకుంటున్నారు. మొత్తంగా గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనుల్లో బడా కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. ఇంజనీరింగ్ అధికారులు ఈ బడా కాంట్రాక్టర్లకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్లను హెచ్చరించే విషయంలోనే అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు. అధికారుల చర్యలతో పనుల టెండర్లలో కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉండడం లేదు. దీంతో కార్పొరేషన్ నిధులు వృథాగా ఖర్చయ్యే పరిస్థితి ఉంటోంది. జీడబ్ల్యూఎంసీలో ఏటా రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నారుు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా వరంగల్ నగరం అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటారుుంచింది. సాధారణ, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మరో రూ.100 కోట్ల వరకు ఉంటోంది. రోడ్లు, డ్రెరుునేజీ, కల్వర్టులు, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు, జంక్షన్లు వంటి పనుల కోసం ఈ నిధులు కేటారుుస్తున్నారు. లక్ష రూపాయలకు మించి ఖర్చు చేసే పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ టెండరు విధానం అమలు చేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు ముందుగా నిర్ణరుుంచినట్లుగా... ఒక్కో పనికి ఇద్దరు మాత్రమే టెండరు దాఖలు చేస్తున్నారు. వీరిలో ఒకరికి పనులు దక్కుతున్నారుు. ఇలా కాకుండా ఎవరైనా పోటీపడి టెండరు దాఖలు చేస్తే కొందరు బడా కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండరు పూర్తిగా రద్దయ్యేలా చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కలసిమెలిసి పనులు పంచుకుంటుండడంతో ఈ-ప్రొక్యూర్మెంట్ స్ఫూర్తి దెబ్బతింటోంది. -
నగర పీఠంపై నరేంద్రుడు
మేయర్‌గా ఏకగ్రీవ ఎన్నిక {పతిపాదించిన కోరబోయిన సాంబయ్య బలపరిచిన కేడల పద్మ డిప్యూటీ మేయర్‌గా సిరాజొద్దిన్ సీపీఎం, బీజేపీ కార్పొరేటర్ల వాకౌట్ వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడి(మేయర్)గా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్‌గా ఖాజా సిరాజొద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లోని మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) కార్యాలయ ఆవరణలో మంగళవారం ఎన్నిక ప్రక్రియ జరిగింది. గ్రేటర్ వరంగల్ పాలకవర్గ ఎన్నిక కోసం ఇన్చార్జి కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకా రం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ల కోసం జీడబ్ల్యూఎంసీ కమిషన్ సర్ఫరాజ్ అ హ్మద్ మంగళవారం ప్రత్యేకం గా సమావేశం ఏర్పాటుచేశారు. మొద ట 58మంది కార్పొరేటర్లు తెలుగు అక్షరాల వరుస ప్రకారం ప్రమాణ స్వీకా రం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ మొ దలైంది. ఈ ప్రక్రియ మొదలుకాగా నే బీజేపీ కార్పొరేటర్ చాడ స్వాతి(45వ డివిజన్), సీపీఎం కార్పొరేటర్ సోమిశెట్టి శ్రీలత(9వ డివిజన్)లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ అధిష్టానం 19వ డివిజన్ కార్పొరేటర్ నన్నపునేని నరేందర్‌ను పార్టీ తరఫున మే యర్ అభ్యర్థిగా ఖరారు చేసింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాం బయ్య మాట్లాడుతూ... నన్నపునేని నరేందర్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఏడో డివిజన్ కార్పొరేటర్ కేడల పద్మ.. నరేందర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు చెప్పా రు. ఇతరులు ఎవరూ మేయర్ పదవికి పోటీ చేయకపోవడంతో నన్నపునేని నరేందర్ మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు. మేయర్ ఎన్నికకు సం బంధించిన ధ్రువీకరణ పత్రాన్ని నరేం దర్‌కు అందజేశారు. వెంటనే నన్నపునేని అనుచరులు కార్పొరేషన్ కార్యాలయం బయట భారీగా బాణా సంచా కాల్పి సంబరాలు చేశారు. డిప్యూటీ మేయర్‌గా సిరాజొద్దీన్ మేయర్ ఎన్నిక తరహాలోనే డిప్యూటీ మేయర్ ఎన్నిక మొదలైంది. టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసిన 41 డివిజన్ కార్పొరేటర్ ఖాజాసిరాజొద్దీన్ను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు 26వ డివిజన్ కార్పొరేటర్ ప్రకాశ్‌రావు చెప్పారు. 32వ డివిజన్ కార్పొరేటర్ అరుణ.. ఖాజా సిరాజొద్దీ న్ అభ్యర్థిత్వా న్ని బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా వేరొక అ భ్యర్థి ఎవరూ పోటీలో లేకపోవడంతో ఖాజా సిరాజొద్దీ న్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రశాంత్‌జీవన్ పా టి ల్ ప్రకటించారు. ఈ రెండు ఎన్నికలు పూర్తి కాగానే సమావేశం ముగిసినట్లుగా అధికారులు ప్రకటించారు. ఎన్నికల పరిశీలకుడిగా విజయ్‌కుమార్ వ్యవహరించారు. అభినందనలు... జీడబ్ల్యూఎంసీ మేయర్‌గా నన్నపునేని, డిప్యూటీ మే యర్‌గా ఖాజా సిరాజొద్దీన్ లు ఎన్నిక కాగానే ఉప ముఖ్యమంత్రి క డియం శ్రీహరి, ఎంపీలు పసునూరి ద యాకర్, గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, కొండా సురేఖ, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్యలతో పాటు కార్పొరేటర్లు వీరిద్ద రిని అభినందించారు. అనంతరం మే యర్, డిప్యూటీ మేయర్ అనుచరులు విజయోత్సాహంతో ర్యాలీగా వెళ్లారు. కేసీఆర్‌కు ధన్యవాదాలు సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర మేయర్ అయ్యేలా చేశారు. మేయర్ పదవితో గొప్ప అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. నా జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో వరంగల్ నగర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తా. నీతి, నిజాయితీతో పాలన అందిస్తా. కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుని నగర సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తా. నేను మేయర్‌గా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు కె.టి.రామారావు, టి.హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు. - నన్నపునేని నరేందర్, మేయర్ -
పోరు షురు..
పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘గ్రేటర్’ ఎన్నికలు టీఆర్ఎస్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఒక్కో డివిజన్ నుంచి సగటున పది మంది.. అసంతృప్తులను బుజ్జగించడమే పెద్ద పని కాంగ్రెస్‌లోనూ ఆశావహుల ప్రయత్నాలు బీజేపీ, టీడీపీ పరిస్థితి దయనీయం వరంగల్ : మరో ఎన్నికల పోరుకు తెరలేచింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) పాలక మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. గతానికి భిన్నంగా రెండు వారాల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుండడంతో రాజకీయ పార్టీల్లో వేడి పెరిగింది. డివిజన్ల వారీగా ఆశావహుల బలాబలాలపై రాజకీ య పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. కార్పొరేటర్ల టికెట్ల కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ నెల కొంది. ఒక్కో డివిజన్ నుంచి సగటున పది మంది ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటూనే... పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని ముఖ్య నేతలతోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం డివిజన్ల వారీగా అశావహుల బలాబలాలను తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో సమాచారం సేకరిస్తోంది. ప్రైవేటు సంస్థల సర్వేలు, ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. ప్రతి డివిజన్లో గెలిచే అభ్యర్థినే నిలబెట్టాలనే వ్యూహంలో అధికార టీఆర్ఎస్ ఉంది. టికెట్లు కేటాయించేందుకు ముందే డివిజన్ల వారీగా ఆశావహులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆదివారం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఇది మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లోనూ డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. టీఆర్ఎస్లోకి కొత్తగా వస్తున్న నేతలతో టికెట్ల ఎంపిక విషయం పార్టీకి ఇబ్బందులను పెంచుతోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నగర నేతలు, మాజీ కార్పొరేటర్లు వరుసగా పార్టీని వీడుతున్నారు. వీరి స్థానంలో ఆయా డివిజన్లకు వెంటనే కొత్త నేతలను ఎంపిక చేసుకోవడం అధిష్టానానికి ఇబ్బందికరంగా మారుతోంది. గ్రేటర్ వరంగల్‌లో తమకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందనే ధీమాతో ఆ పార్టీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లలో పోటీ చేసేందుకు ఇప్పటి వరకు 302 దరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని డివిజన్లలో పోటీ చేయడం... వీలైనంత వరకు ఎక్కువ స్థానాల్లో గెలుపు సాధించడం లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతల ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ సోమవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇక బీజేపీ, టీడీపీల పొత్తుకు తెరపడుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నా.. బరిలో దిగేవారు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు త్వరలోనే అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ మేయర్ పదవిని జనరల్ కేటగిరికి రిజర్వ్ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లలో 13 స్థానాలు అన్ రిజర్వ్డ్ కేటగిరిలో ఉన్నాయి. ఈ డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన మహిళలు, పరుషులు పోటీ చేసే అవకాశం ఉంటుంది. జనరల్ మహిళలకు 15 డివిజన్లు రిజర్వ్ చేశారు. ఈ డివిజన్లలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, జనరల్ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీసీలకు 19 డివిజన్లు రిజర్వు చేశారు. ఇందులో బీసీ జనరల్‌కు 10 డివిజన్లు, బీసీ మహిళలకు 9 డివిజన్లు కేటారుుంచారు. ఎస్సీలకు 9 డివిజన్లు రిజర్వ్ చేయగా, ఎస్సీ జనరల్ కేటగిరిలో ఐదు, ఎస్సీ మహిళల కేటగిరిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. ఎస్టీలకు రెండు డివిజన్లు కేటాయించగా ఒకటి ఎస్టీ జనరల్, మరొకటి ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. -
గ్రేటర్ పోరుకు రెడీ
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం వ్యూహ రచనల్లో రాజకీయ పార్టీలు కార్యక్రమాలు మొదలుపెట్టిన టీఆర్ఎస్ వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. డివిజన్ల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల జీడబ్ల్యూఎంసీ అధికారులు మున్సిపల్ శాఖ కమిషనర్‌కు పంపించారు. ప్రభుత్వం వీటిని ఆమోదించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అరుుతే, మేడారం జాతర ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా సన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధమవుతుండగా... రాజకీయ పార్టీల్లోనూ గ్రేటర్ వరంగల్ ఎన్నికల వేడి మొదలైంది. నెల రోజుల్లోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో టీఆర్ఎస్ నాయకులు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు... రెండు రోజులుగా నగరంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. గతంలో మొదలై పూర్తి కావచ్చిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆలస్యమవుతున్న పనులను త్వరగా పూర్తి చేయించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సైతం గ్రేటర్ వరంగల్‌లోని విలీన గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కాగా, మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ నేతల్లో పోటీ పెరుగుతోంది. టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్‌కు పార్టీ అధిష్టానం మేయర్ పదవిపై గతంలో హామీ ఇచ్చిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. కొత్తగా పలువురు నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రిజర్వేషన్ల ప్రకారం వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే అప్పటి రిజర్వేషనే ఇప్పుడు అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘోర పరాజంతో కుదేలైన కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో బలం చూపించాలని ప్రయత్నిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో మరింత బలహీనమైన ఈ రెండు పార్టీలకు గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. సంప్రదాయ ఓటు బ్యాంకు ఆధారంగా టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి నుంచి బయటపడాలని బీజేపీ-టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇలా.. గ్రేటర్ వరంగల్‌లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని బలం చూపెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లు ఉన్నాయి. ప్రతిపాదనల ప్రకారం 13 డివిజన్లు అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి. జనరల్‌కు కేటాయించిన డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు సంబంధించిన మహిళలు, పరుషులు పోటీచేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మహిళలకు 15 డివిజన్లు రిజర్వు చేశారు. ఈ డివిజన్లలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీసీలకు 19 డివిజన్లు రిజర్వు చేశారు. ఇందులో బీసీ జనరల్‌కు 10, బీసీ మహిళకు 9 డివిజన్లు రిజర్వు చేశారు. ఎస్సీలకు 9 డివిజన్లు కేటాయించారు. వీటిలో ఎస్సీ జనరల్ కేటగిరీలో ఐదు, ఎస్సీ మహిళ కేటగిరీలో ఐదు డివిజన్లు ఉన్నాయి. ఎస్టీలకు రెండు డివిజన్లు కేటాయించారు. ఇందులో ఒకటి ఎస్టీ జనరల్, మరొకటి ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు.