
మడిగలు పడావు
అక్కరకు రానిహాకర్స్ జోన్లు
రూ.7 కోట్ల ఖర్చుతో నిర్మాణం
కట్టి వదిలేసిన గ్రేటర్ అధికారులు
లబ్ధిదారుల ఎదురుచూపులు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
వరంగల్ : వరంగల్ మహానగర వాసుల అవసరాలను తీర్చే చిరువ్యాపారులకు భరోసా కల్పించే లక్ష్యంతో నిర్మించిన హాకర్స్ జోన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. హాకర్స్ జోన్లు నిర్మించి ఏడాది గడుస్తున్నా అర్హులకు కేటారుుంచేందుకు గ్రేటర్ వరంగల్ అధికారులకు మనసు రావడం లేదు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన హాకర్స్ జోన్లు పడావుగా ఉండిపోతున్నారుు. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) పరిధిలో రోడ్లపై వ్యాపారం చేసి జీవనం గడిపే వారి కోసం హాకర్స్ జోన్ కార్యక్రమం వచ్చింది. తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో నగరంలోని 14 ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. 1100 మంది చిరు వ్యాపారులకు సరిపడేలా పబ్లిక్‌గార్డెన్, చింతల్ బుక్‌స్టాల్, కాళోజీ సెంటర్, సుబేదారి, ఫారెస్టు ఆఫీసు, కాజీపేట, రైల్వే గేటు వంటి చోట్లలో నిర్మాణం పూర్తరుుంది.
2016 జనవరిలో వీటిని చిరువ్యాపారులకు కేటారుుంచేందుకు గ్రేటర వరంగల్ అధికారులు కసరత్తు చేశారు.లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణరుుంచారు. అరుుతే, చిరువ్యాపారులను గుర్తించే అంశంలో పొరపాట్లు జరిగారుు. చిరువ్యాపారులు కానివారి పేర్లు జాబితాలో ఉండడంతో కేటారుుంపు ప్రక్రియ మొదట్లోనే ఆగిపోరుుంది. ఒక్క కాళోజీ జంక్షన్‌లో మాత్రమే కేటారుుంపులు పూర్తయ్యారుు. నగరంలోని మిగిలిన ప్రదేశాల్లో హాకర్స్ జోన్లు పడావుగా ఉంటున్నారుు.
చిరువ్యాపారులు ఎప్పటిలాగే రోడ్లపై వ్యాపారం నిర్వహించుకుంటున్నారు. ఫలితంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు, చిరు వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తప్పడంలేదు. నగరంలోని ప్రధాన రహదారులపై చిరు వ్యాపారులు అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాలకు, పాదాచారులకు ఇబ్బందులు కలుగుతున్నారుు. ఈ పరిస్థితిని నివారించేందుకు, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా నగరంలో హాకర్స్ జోన్ ఏర్పాటు ప్రణాళికను అధికారులు రూపొందించారు. ఎక్కువగా జనం పోగయ్యే ప్రాంతాల్లో హాకర్స్ జోన్లు నిర్మించాలని నిర్ణరుుంచారు. హాకర్స్ జోన్లకు ఆనుకుని తాగునీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చారు. మూత్రశాలలను, మరుగుదొడ్లను నిర్మించారు. నిర్మాణాలు పూర్తి చేసిన అధికారులు వాటిని వినియోగంలోకి తెచ్చే విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.