అమరావతి: ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ ను జాయింట్ వెంచర్ విధానంలో ఎపీఎండీసీ చేపట్టనుంది. ఇందుకు గానూ జాయింట్ వెంచర్ సంస్థ ఎంపిక కోసం నిర్వహించే టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎపీఎండీసీ మంగళవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, డెవలప్ మెంట్, ఆపరేషన్ కమ్ మైయింటెనెన్స్ కోసం జేవీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయనున్నారు.
ఇప్పటికే ఎపీఎండీసీ ప్రకాశం జిల్లా కొణిజేడు మర్లపాడు ప్రాంతం పరిధిలో మొత్తం 1307.26 ఎకరాల్లో లో-గ్రేడ్ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను పొందింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ద్వారా లోగ్రేడ్ ఖనిజాన్ని మైనింగ్ చేయడం, బెనిఫికేషన్ ద్వారా నాణ్యతను పెంచడం ద్వారా ఏడాదికి సుమారు రూ.450 కోట్ల మేర సంస్థకు రెవెన్యూ లభిస్తుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాలని చట్టం చేసింది. దానిలో భాగంగా ఐరన్ ఓర్ టెండర్ డాక్యుమెంట్ లను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ కు సమర్పించడం జరిగిందని ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఈ టెండర్ డాక్యుమెంట్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కమిషన్ ఈ-మెయిల్ judge-jpp@ap.gov.in ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment