APMDC
-
గనుల శాఖలో మరో వింత!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గనుల శాఖలో రకరకాల వింతలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీఎండీసీలో ఇద్దరు దళిత ఉన్నతాధికారులను సెలవుపై పంపారు. గనుల శాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ కార్యాలయాలను 45 రోజులపాటు అనధికారికంగా మూసివేశారు. రాష్ట్రంలో లీజు పొందిన గనులన్నింటినీ అనధికారికంగా నిలిపివేశారు. పరిశ్రమను పూర్తిగా స్తంభింపజేశారు. గనుల యజమానులతో మామూళ్లకు ఒప్పందం కుదిరాకే కొన్నింటిని తెరవడానికి అంగీకరించారు. కొన్ని గనులు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. కొందరు అధికారులను కూడా గాల్లో పెట్టారు. ఆ తర్వాత బదిలీల్లో డబ్బులు గుంజి చాలామందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు బదిలీల్లో పోస్టింగులు ఇచ్చిన 12 మంది అధికారులను సెలవుపై వెళ్లాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలివ్వడం గనుల శాఖలో కలకలం రేపింది. కొత్త పోస్టింగుల్లో చేరి నెల తిరక్కుండానే వారిని సెలవుపై వెళ్లిపోవాలని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెప్పినట్టల్లా చేశారనే ఆరోపణలు సృష్టించి మరీ వీరిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఇలా బలవంతంగా సెలవుపై పంపుతున్న వారిలో ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు, ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, నలుగురు ఇతర స్థాయి ఉద్యోగులున్నారు. సెలవుపై పంపే ఉద్దేశం ఉన్నప్పుడు బదిలీల్లో ఎందుకు పోస్టింగ్ ఇచ్చారో అర్థం కావడంలేదని ఉద్యోగులు అంటున్నారు. గనుల శాఖలో బదిలీలే అత్యంత రహస్యంగా చేపట్టారు. ముఖ్య నేత కుమారుడికి ప్రధాన అనుచరుడు, గనుల శాఖ మంత్రి ద్వారా ఈ బదిలీల్లో పెద్ద తంతే జరిగింది. కీలకమైన డీడీ, ఏడీ పోస్టులను వేలం వేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. భారీగా డబ్బులిచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీల జీవోలను అన్ని శాఖలు ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టినా గనుల శాఖ మాత్రం పెట్టకపోవడమే ఇందులో మతలబులకు అద్దం పడుతోంది.ఆ తర్వాత కూడా బదిలీల జీవోను వెంటనే బయటపెట్టలేదు. ఇంత చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన వారిలో కొందరిపై ఇప్పుడు వైఎస్సార్సీపీ ముద్ర వేసి సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించడం గమనార్హం. బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి మరింతగా డబ్బులు దండుకోవడానికే ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
రూ.450 కోట్ల ఆదాయంతో ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాజెక్ట్!
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ ను జాయింట్ వెంచర్ విధానంలో ఎపీఎండీసీ చేపట్టనుంది. ఇందుకు గానూ జాయింట్ వెంచర్ సంస్థ ఎంపిక కోసం నిర్వహించే టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎపీఎండీసీ మంగళవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, డెవలప్ మెంట్, ఆపరేషన్ కమ్ మైయింటెనెన్స్ కోసం జేవీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎపీఎండీసీ ప్రకాశం జిల్లా కొణిజేడు మర్లపాడు ప్రాంతం పరిధిలో మొత్తం 1307.26 ఎకరాల్లో లో-గ్రేడ్ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను పొందింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ద్వారా లోగ్రేడ్ ఖనిజాన్ని మైనింగ్ చేయడం, బెనిఫికేషన్ ద్వారా నాణ్యతను పెంచడం ద్వారా ఏడాదికి సుమారు రూ.450 కోట్ల మేర సంస్థకు రెవెన్యూ లభిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాలని చట్టం చేసింది. దానిలో భాగంగా ఐరన్ ఓర్ టెండర్ డాక్యుమెంట్ లను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ కు సమర్పించడం జరిగిందని ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఈ టెండర్ డాక్యుమెంట్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కమిషన్ ఈ-మెయిల్ judge-jpp@ap.gov.in ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని కోరారు. -
బెరైటీస్ ఎగుమతుల జోష్
సాక్షి, అమరావతి: బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) హవా కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ సంస్థ చేయని విధంగా అమెరికాకు బెరైటీస్ ఎగుమతి చేస్తున్న ఏపీఎండీసీ... ప్రతి సంవత్సరం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. అమెరికా(యూఎస్ఏ) బెరైటీస్ మార్కెట్లో రెండేళ్ల కిందట ఏపీఎండీసీ వాటా 30 శాతం కాగా, గత ఏడాది 44 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏకంగా 54 శాతానికి చేరింది. తాజాగా ఈ విషయాన్ని అంతర్జాతీయ బెరైటీస్ అసోసియేషన్ ప్రకటించింది. అమెరికా మార్కెట్లో ఒక దేశంగానీ, సంస్థగానీ ఇంత శాతం మార్కెట్‌ను చేజిక్కించుకోవడం ఇదే ప్రథమం అని తెలిపింది. గతంలో అమెరికాకు 60శాతానికి పైగా బెరైటీస్‌ను చైనా ఎగుమతి చేసేది. అయితే 2015 నుంచి చైనా ఎగుమతులు క్రమంగా తగ్గుతూ ఉండగా, మన దేశం నుంచి పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మన బెరైటీస్ పైనే అమెరికా మార్కెట్ ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. మన దేశం నుంచి ఎగుమతయ్యే బెరైటీస్‌లో 90శాతానికి పైగా వైఎస్సార్ జిల్లా మంగంపేట గనుల నుంచే ఉత్పత్తి అవుతోంది. ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం కృషి బెరైటీస్‌కు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను కొత్తగా నిర్దేశించుకుంది. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకువచ్చేందుకు అమెరికాలోని పలు చమురు ఉత్పత్తి సంస్థలతో ఏపీఎండీసీ ద్వారా ఒప్పందాలు చేసుకుంది. గతంలో కొన్ని ప్రైవేటు ఏజెన్సీల ద్వారా బెరైటీస్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు విక్రయించేది. బెరైటీస్ అవసరం ఉన్న చమురు సంస్థలకే నేరుగా ఖనిజాన్ని విక్రయించేందుకు ఏపీఎండీసీ ద్వారా ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న ఎగుమతుల ఒప్పందాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించింది. ఒకసారి ఒప్పందం చేసుకుంటే మూడేళ్లు స్థిరంగా ఎగుమతులు చేసే అవకాశాన్ని సృష్టిం చింది. గత ఏప్రిల్‌లో 25శాతం ధర పెంచినా ఎగుమతులపై ఎటువంటి ప్రభావం చూపలేదు. దీంతో చైనా, మెక్సికో, మొరాకో వంటి బలమైన పోటీదారులను కూడా దాటి అత్యధిక శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 మిలియన్ టన్నుల బెరైటీస్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుని సాధించింది. గత సంవత్సరం బెరైటీస్‌పై ఏపీఎండీసీకి రూ.900 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ.1,300 కోట్లకు పెరిగింది. తాజా వ్యూహాలతో డిమాండ్ లేని సీ, డీ గ్రేడ్ బెరైటీస్ ఖనిజానికి సైతం డిమాండ్ ఏర్పడింది. సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో మంచి ఫలితాలు బెరైటీస్ ఎగుమతులకు సంబంధించి గతంలో అమలు చేసిన వ్యూహాన్ని మార్చుకుని కొత్తగా ముందుకెళ్లడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గనులు, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైంది. అంతర్జాతీయ బెరైటీస్ మార్కెట్లో ఏపీఎండీసీ అగ్రస్థానంలో నిలవడం ఎంతో ముఖ్య పరిణామం. – వీజీ వెంకటరెడ్డి, వీసీ అండ్ ఎండీ, ఏపీఎండీసీ అత్యంత నాణ్యత అన్నమయ్య జిల్లా మంగంపేటలో బెరైటీస్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ లభిస్తున్న గ్రే బెరైటీస్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. మన దేశంలో ఉన్న బెరైటీస్ నిక్షేపాల్లో 98శాతం మంగంపేటలోనే ఉండటం విశేషం. మంగంపేటలో గనుల్లో సుమారు 74 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 30దేశాలకు బెరైటీస్ ఎగుమతి అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, సహజవాయువు ఉత్పాదక కంపెనీలకు మంగంపేట నుంచి వెళ్లే బెరైటీస్ వాటా 25 శాతంగా ఉంది. చమురు, సహజవాయువుల రంగానికి బెరైటీస్ అత్యంత కీలకం కావడం, అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఇది దొరకడంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. -
బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీఎండీసీ రికార్డ్.. అమెరికా మార్కెట్లో 44 శాతం వాటా
బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా బెరైటీస్ మార్కెట్లో 44 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ బెరైటీస్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది. అమెరికా మార్కెట్లో ఒక దేశం గానీ, సంస్థ గానీ ఇంత శాతం వాటాను చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరం 30 శాతం వాటాను దక్కించుకున్న ఏపీఎండీసీ.. ఈ సంవత్సరం దాన్ని మరో 14 శాతం పెంచుకుని ప్రపంచ మార్కెట్లో సుస్థిర స్థానం సాధించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 3 మిలియన్ టన్నుల బెరైటీస్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్న ఏపీఎండీసీ దాన్ని సాధించింది. గత సంవత్సరం బెరైటీస్‌పై ఏపీఎండీసీకి రూ.900 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అది రూ.1,300 కోట్లకు పెరిగింది. మంగంపేటలో విస్తారంగా బెరైటీస్.. బెరైటీస్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలో విస్తారంగా ఉన్నాయి. చమురు, సహజవాయువుల రంగానికి బెరైటీస్ అత్యంత కీలకం కావడం, అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఇది దొరకడంతో అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. భారత్‌లో ఉన్న బెరైటీస్ నిక్షేపాల్లో 98 శాతం మంగంపేటలోనే ఉన్నాయి. ఇక్కడ 74 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి సుమారు 30 దేశాలకు బెరైటీస్ ఎగుమతి అవుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 40 మిలియన్ టన్నుల బెరైటీస్ ఖనిజాన్ని వెలికితీశారు. బెరైటీస్‌ను ఎందుకు వాడతారంటే.. బెరైటీస్ ఖనిజాన్ని అనేక ఉత్పత్తులో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెయింట్, ప్లాస్టిక్‌లలో పూరకం, ఇంజన్ కంపార్ట్మెంట్లలో సౌండ్ తగ్గించడానికి, ఆటోమొబైల్ ఉత్పత్తులో నునుపు, తుప్పు నిరోధకత కోసం వినియోగిస్తారు. అలాగే ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఘర్షణ కలిగించే ఉత్పత్తులు, రేడియేషన్ షీల్డింగ్ కాంక్రీటు, గ్లాస్ సిరామిక్, వైద్య ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. -
‘సుల్యారీ’లో 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
సాక్షి, అమరావతి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలోని సుల్యారీ బొగ్గు గని నుంచి తొలి ఏడాదిలోనే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఇంత బొగ్గు తవ్వడం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండీసీ జాతీయ స్థాయి మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా మారుతోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఏపీఎండీసీ ముందంజలో ఉందని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గనిలో 2021, ఏప్రిల్ నెలలో బొగ్గు తవ్వకాలను ఏపీఎండీసీ లాంఛనంగా ప్రారంభించింది. స్థానికంగా నెలకొన్న ఇబ్బందులు, కోర్టు కేసులన్నింటినీ పరిష్కరించుకుని 2022, మార్చి నుంచి పూర్తిస్థాయిలో తవ్వకాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది మార్చి నాటికి 1.9 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దీనిద్వారా రూ.483.5 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే 8 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,624 కోట్ల రెవెన్యూ సాధించాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తోంది. సుల్యారీ బొగ్గు గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును దాదాపు 22 సంవత్సరాలపాటు వెలికితీసేందుకు అవకాశం ఉంది. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఏపీఎండీసీ ముందుకెళుతోంది. అలాగే ఝార్ఖండ్‌లోని బ్రహ్మదియా గనిలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్‌ను ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం ముందుచూపు నిర్ణయాలే కారణం రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలైన మొదటి ఏడాదే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఆయన దూరదృష్టం కారణం. ఈ బొగ్గు గని ద్వారా మున్ముందు మంచి ఫలితాలు రానున్నాయి. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాం. సుల్యారీ బొగ్గు గనుల తవ్వకాల ద్వారా ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పరిధిని విస్తరించుకోవడంతోపాటు సత్తా చాటుకుంది. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
ఏపీఎండీసీ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) సహకారంతో ఈ సంస్థను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకోసం అస్కీతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. సోమవారం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డి, సలహాదారు డీఎల్ఆర్ ప్రసాద్ హైదరాబాద్‌లోని అస్కీ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం పునర్వ్యవస్థీకరణ ఒప్పందంపై ఏపీఎండీసీ తరఫున వీజీ వెంకటరెడ్డి, అస్కీ నుంచి రిజిస్ట్రార్ ఓపీ సింగ్, ప్రొఫెసర్ హర్ష శర్మ సంతకాలు చేశారు. ఏపీఎండీసీ నిర్వహణ సామర్థ్యం, ఉద్యోగుల నైపుణ్యాలను మరింత పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల ప్రకారం ఈ ఒప్పందం జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఒప్పందంలో భాగంగా అస్కీ ఏపీఎండీసీ పనితీరును అధ్యయనం చేసి 3 నెలల్లో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. కార్పొరేట్ సంస్థలకు దీటుగా వార్షిక లక్ష్యాల సాధన, అధికారులు, ఉద్యోగుల పనితీరు, కెరీర్ ప్రోగ్రెషన్ ప్రణాళికను అమలు చేయడంపై విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సీఎం జగన్ నిర్ణయాలతో ఇప్పటికే బలమైన సంస్థగా ఏపీఎండీసీ సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో ఏపీఎండీసీ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బలమైన సంస్థగా ఎదిగింది. పారదర్శక విధానాలు అవలంబిస్తూ, జాతీయ స్థాయిలో కోల్ ఇండియా, సింగరేణి వంటి సంస్థలతో పోటీ పడి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థగా అరుదైన గుర్తింపును అందుకుంది. బెరైటీస్ ఉత్పత్తి, విక్రయాల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. గ్రానైట్, బాల్ క్లే, కాల్సైట్, సిలికాశాండ్ వంటి ఖనిజాల ఉత్పత్తిలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో బొగ్గు గనులను నిర్వహిస్తోంది. త్వరలో జార్ఖండ్‌లోని బ్రహ్మదియాలో కోకింగ్ కోల్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ పురోగతిని శాస్త్రీయంగా మదింపు చేసి, అధికారులు, ఉద్యోగుల వృత్తి నైపుణ్యాలు, మార్కెటింగ్ వ్యూహాలు, జాతీయ – అంతర్జాతీయ దృక్పథం, మార్కెటింగ్ ఎత్తుగడలను సరైన విధానంలో అనుసరించేందుకు అస్కీ సహకారం తీసుకోనుంది. ఏపీఎండీసీ పునర్వ్యవస్థీకరణతో సంస్థ రూపురేఖలు మారతాయని, సంస్థాగత సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని వీసీ, ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. -
కడప స్టీల్‌కు ఇనుప గనుల కేటాయింపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సరఫరా చేయనుంది. ఇందుకోసం అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని సిద్ధాపురం తండా, అంతరాగంగమ్మ కొండ ప్రాంతాల్లోని 25 హెక్టార్లను ఏపీఎండీసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ గని నుంచి తవ్విన ముడి ఇనుమును కడప స్టీల్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ గనులకు సంబంధించిన సరిహద్దులను సూచిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేందుకు మరో రెండు గనులను కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జమ్మలమడుగు మండలంలో ఏటా 3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే యూనిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019, డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత కరోనా రావడంతో పనులు అనుకున్నంత వేగంగా జరగలేదని, ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. -
సీఎం సహాయనిధికి విరాళం అందించిన APDMC
-
వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు -
బ్రహ్మదియా బొగ్గును తెచ్చేద్దాం
సాక్షి, అమరావతి: మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ).. ఇప్పుడు జార్ఖండ్‌లోని బ్రహ్మదియా బొగ్గు గనిపై దృష్టి సారించింది. ఈ గనిలోనూ సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్రం 2021లో నిర్వహించిన బిడ్డింగ్‌లో పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి మరీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాక్‌ను దక్కించుకుంది. ఇందులో ఉన్న అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్‌ను ఉక్కు కర్మాగారాల్లో వినియోగిస్తారు. దీన్ని ఉత్పత్తి చేస్తే.. బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలో వీలైనంత త్వరగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏపీఎండీసీ చర్యలు చేపట్టింది. అనుమతుల కోసం ప్రయత్నాలు.. బ్రహ్మదియాలో తవ్వకాలు జరిపేందుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. దీనిపై జార్ఖండ్ పర్యావరణ అథారిటీ స్పందించాల్సి ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీఎండీసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. నాలుగైదు నెలల్లో అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈలోపు మైనింగ్ లీజు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు సాధించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలో అవి కూడా వస్తాయని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈలోగా అవసరమైన భూ సేకరణపై దృష్టి కేంద్రీకరించారు. ఏడాదికి 5 లక్షల టన్నులు తవ్వేలా.. బ్రహ్మదియా గని నుంచి ఏడాదికి లక్షన్నర టన్నుల బొగ్గును 14 సంవత్సరాలపాటు ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్సు ఇచ్చింది. కానీ స్థానికంగా అక్రమ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలోని బొగ్గు నిల్వలను తక్కువ సమయంలోనే మైనింగ్ చేయాలని ఏపీఎండీసీ భావిస్తోంది. ఏడాదికి లక్షన్నర టన్నులకు బదులు ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నాలుగైదేళ్లలోనే ఈ గనిలో బొగ్గు తవ్వకాలు పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో మైనింగ్ ప్రారంభిస్తాం.. సుల్యారీలో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియా సరసన నిలిచాం. పర్యావరణ అనుమతులు సాధించి త్వరలో బ్రహ్మదియాలోనూ ఉత్పత్తి ప్రారంభిస్తాం. దీని వల్ల మన రాష్ట్ర అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సిన అవసరముండదు. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ -
మంగంపేట బెరైటీస్ బంగారం.. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ ఖనిజం కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా నిర్వహించిన ఈ–ఆక్షన్‌లో రికార్డు స్థాయి రేట్లు నమోదయ్యాయి. ఏకంగా 50 శాతం అధిక రేట్లను బిడ్డర్లు కోట్ చేశారు. ఈ ఖనిజం విక్రయాల ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.925 కోట్లు ఆదాయం వస్తుంది. తాజా రేట్లతో అదనంగా రూ.260 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎండీసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తోంది. అత్యంత పారదర్శక విధానాలు అవలంబిస్తోంది. అధునాతన పద్ధతుల్లో నాణ్యమైన ఖనిజాన్ని వెలికితీస్తోంది. దీంతో అంతర్జాతీయంగా బిడ్డర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఎ, బి, సి, డి గ్రేడ్ల ఖనిజం విక్రయం కోసం ఏపీఎండీసీ ఈ–ఆక్షన్ నిర్వహించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ’ఎ’ గ్రేడ్ ఖనిజం, 3 లక్షల మెట్రిక్ టన్నుల ’బి’ గ్రేడ్, 20 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజానికి ఆక్షన్ నిర్వహించింది. ’ఎ’ గ్రేడ్ ఖనిజాన్ని మెట్రిక్ టన్నుకు అత్యధికంగా రూ.6,691కి బిడ్డర్లు కోట్ చేశారు. గతంలో దీని ధర రూ.4,625 కాగా ఇప్పుడు రూ.2,066 ఎక్కువ రేటు వచ్చింది. అలాగే టన్ను ’బి’ గ్రేడ్ రూ.5,225 పలికింది. గతంలో ఇదే ’బి’ గ్రేడ్ మెట్రిక్ టన్ను రూ.3,350 కాగా ఇప్పుడు రూ.1,875 ఎక్కువ లభించింది. సి, డి గ్రేడ్ ఖనిజం ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదయింది. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడానికి, రికార్డు స్థాయిలో రేటు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. మైనింగ్ రంగంలో పారదర్శకత, ఏపీఎండీసీని ప్రోత్సహించడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీఎండీసీపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి, తగిన సూచనలిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దారు. బెరైటీస్‌తో పాటు బొగ్గు, గ్రానైట్, బీచ్ శాండ్, కాల్సైట్, గ్రాఫైట్, లెడ్, జింక్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను కూడా వెలికితీయడం ద్వారా ఏపీఎండీసీ మైనింగ్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. లాభాల బాటలో పయనిస్తోంది. మున్ముందు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్నిస్తుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి నాణ్యత ప్రమాణాలతో సంస్థకు గుర్తింపు ప్రపంచంలోనే అత్యధికంగా బెరైటీస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏపీఎండీసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత ప్రమాణాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, సమర్థవంతమైన మైనింగ్ ఆపరేషన్స్ దాని సొంతం. గతేడాది రాయలసీమలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ, రికార్డు స్థాయిలో పెద్దమొత్తంలో బెరైటీస్‌ను వెలికితీసింది. ప్రతికూల వాతావరణంలోనూ ఖనిజాన్ని అందించడం వల్ల అంతర్జాతీయంగా పేరొచ్చింది. ప్రాజెక్ట్‌లో ఉన్న 74 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజాన్ని కూడా విక్రయించేందుకు కొనుగోలుదారులతో మాట్లాడుతున్నాం.. – ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి -
రాష్ట్రంలో 4 సర్వేరాళ్ల ఫ్యాక్టరీలు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే అవసరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సర్వేరాళ్ల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తోంది. రీసర్వే తర్వాత నిర్ణయించిన కొత్త సరిహద్దుల ప్రకారం పాతేందుకు అవసరమైన రాళ్ల కోసం వీటిని సిద్ధం చేస్తోంది. రెండు, మూడురోజుల్లో ఒక దాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీసర్వే నేపథ్యంలో రాష్ట్రంలో 1.25 కోట్ల సర్వేరాళ్లు అవసరమవుతాయని సర్వే, సెటిల్మెంట్శాఖ అంచనా వేసింది. అన్ని రాళ్లను సమకూర్చే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు రాష్ట్రంలోను, సమీప రాష్ట్రాల్లోను లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా సర్వేరాళ్ల కర్మాగారాలు ఏర్పాటు చేసి రాళ్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఆ సంస్థ రాష్ట్రంలోని ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఫ్యాక్టరీల నిర్మాణ పనులు చేపట్టింది. ఒక్కో ఫ్యాక్టరీకి రూ.12.25 కోట్ల చొప్పున రూ.49 కోట్లతో వీటి నిర్మాణం మొదలుపెట్టింది. రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 4,500 రాళ్లు ఒక్కో ఫ్యాక్టరీని రోజుకు 4,500 రాళ్లను తయారుచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురువలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. అతి త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. మే నెలాఖరుకల్లా మిగిలిన యూనిట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకు సంబంధించి స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు ఏపీఎండీసీ ఎండీ, గనులశాఖ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి తెలిపారు. -
బొగ్గు ఉత్పత్తిలో ఏపీఎండీసీ కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీ ఎండీసీ) మరో మైలురాయిని అధిగమించింది. జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియాల సరసన ఇతర రాష్ట్రాల్లో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మూడో ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపును సాధించింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్న ఏపీఎండీసీ మార్చి 10వ తేదీ నుంచి ఈ గనిలో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 2007లోనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గుగని ఏపీఎండీసీకి కేటాయించినా, వివిధ కారణాల వల్ల మైనింగ్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సుల్యారీ కోల్ మైన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న ఆటంకాలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వపరంగా ఏపీ ఎండీసీకి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంతో గత ఏడాది ఆగస్టు నెలలో సుల్యారీలో బొగ్గు వెలికితీత పనులకు శ్రీకారం చుట్టారు. ఓవర్ బర్డెన్ పనులు పూర్తి చేసుకుని తాజాగా వాణిజ్య సరళి బొగ్గు ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఏపీఎండీసీ తన విస్తరణలో కీలక ముందుడుగుగా వేసింది. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే ఈ విజయం: మంత్రి పెద్దిరెడ్డి సీఎం వైఎస్ జగన్ విజన్ వల్లే ఏపీఎండీసీ ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా తన మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యాన్ని సాధించిందని రాష్ట్ర భూగర్భ గనులు, పీఆర్అండ్ఆర్డీ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2007లోనే ఏపీ ఎండీసీ మధ్యప్రదేశ్ లో సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్నప్పటికీ 2019 వరకు ఒక్క అడుగు కూడా బొగ్గు ఉత్పత్తి విషయంలో ముందుకు పడలేదని అన్నారు. సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్‌ను ఒక సవాల్‌గా తీసుకుని అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. నేడు సుల్యారీలో వాణిజ్యసరళిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడానికి సీఎం చేసిన కృషి కారణమని, ఈ సందర్బంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మైనింగ్ కార్యక్రమాలకు పరిమితమైన ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పెద్దపెద్ద సంస్థలతో పోటీగా బొగ్గు ఉత్పత్తి రంగంలో నిలబడటం, నిర్ధేశిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ విసి అండ్ ఎండీ విజి వెంకటరెడ్డి, ఇతర అధికారులు, కార్మికులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు, ప్రభుత్వ రంగ సంస్థల నైపూణ్యాలను పెంచుకుంటూ జాతీయ స్థాయిలో తమ కార్యక్రమాలను విస్తరింప చేసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహాన్ని పూర్తిస్థాయిలో అందిస్తోందన్నారు. జార్ఘండ్ లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌ను సైతం 2021లో ఏపీఎండీసీ పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి బిడ్డింగ్ లో దక్కించుకుందన్నారు. అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్ ను ఈ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేసేందుకు ఎపిఎండిసి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఉక్కు కర్మాగారాల్లో వినియోగించే ఈ కోకింగ్ కోల్ ను ఏపీఎండీసీ ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల మన రాష్ట్ర అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి కోకింగ్ కోల్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గుగనులతో పాటు ఇరత మేజర్ మినరల్స్ విషయంలోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా మైనింగ్ కార్యక్రమాలను నిర్వహింపచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా ఏటా రూ.1200 కోట్లు ఆదాయం.. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గని నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తుందని సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తెలిపారు. రూ.2వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీఎండీసీ ఈ బొగ్గుగనిలో ఉత్పత్తి ప్రారంభించిందని, సాలీనా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం ఈ బొగ్గు గని ద్వారా లభిస్తుందన్నారు. మొత్తం 110 మిలియన్ టన్నులు బొగ్గు నిల్వలు ఈ గని పరిధిలో ఉన్నాయని, కనీసం 22 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పతి జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్ణయించిన 5 మిలియన్ టన్నులను మించి అదనంగా మరో రెండు మిలియన టన్నుల బొగ్గును కూడా ప్రతిఏటా వెలికితీసే అవకాశం ఉందని, ఈ మేరకు సంస్థ సామర్థ్యంను కూడా పెంచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 10 తేదీ నుంచి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామని, ఈ బొగ్గులో 25 శాతం సూక్ష్మా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లకు కేటాయిస్తామని, మిగిలింది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విక్రయిస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ లకు బొగ్గు విక్రయాలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన ఎం-జంక్షన్ ద్వారా ఈ-ఆక్షన్ కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి సాధనలో పనిచేసిన సంస్థ ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. -
రూ. 256.53 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీలో పూడికతీత
సాక్షి, అమరావతి: ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేసిన రెండు కోట్ల క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక మేటల తొలగింపునకు రూ. 256.53 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21న ఆర్థిక బిడ్, అదే రోజున రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టెండర్లను జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఇసుక మేటల తొలగింపు ద్వారా బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా గోదావరి డెల్టా రైతులకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయడంతో పాటు పూడిక తీసిన ఇసుక ద్వారా నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలన్నది సర్కార్ ఉద్దేశ్యం అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గోదావరి డెల్టాలో ఉన్న 10.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తారు. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు వేయడం వల్ల ఆ నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. ఖరీఫ్‌లో పంటలకు నీళ్ల ఇబ్బంది లేకపోయినా.. రబీలో నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో బ్యారేజీకి 3 కి.మీ. నుంచి 12.5 కి.మీ. వరకూ ఎడమ వైపున ఇసుక మేటల తొలగింపునకు రూ. 135.85 కోట్లు.. కుడి వైపున ఇసుక దిబ్బల తొలగింపునకు రూ. 120.68 కోట్లతో అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్లను ఖరారు చేశాక ఇసుక తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఏపీఎండీసీకి బాధ్యత అప్పగింత.. ధవళేశ్వరం బ్యారేజీలో ఇసుక మేటలను తొలగించేందుకు అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) భరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇసుకను తొలగించడం, దాన్ని విక్రయించడం వరకు అన్ని బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించింది. పూడిక తీసిన ఇసుకను విక్రయించగా రూ. 256.53 కోట్ల కంటే అధికంగా ఆదాయం వస్తే.. ఆ లాభంలో వాటాలు ఏపీఎండీసీకి, సర్కార్ ఖజానాకు చేరుతాయి. పూడికతీతతో వచ్చే ఇసుకతో నిర్మాణరంగానికి మేలు జరుగుతుందని, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. -
అత్యంత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరలో ఇసుక విక్రయానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, దాని ప్రకారమే విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవగాహన లేకుండా కొన్ని మీడియాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయంపై అసత్య కథనాలను ప్రచురిస్తున్నారని అన్నారు. జేపీ సంస్థదే బాధ్యత: ద్వివేది ‘ఇసుక ఆపరేషన్స్‌ను పారదర్శకంగా నిర్వహించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. ఎంఎస్టీసీ నిర్వహించిన టెండర్ల లో జేపీ పవర్ వెంచర్స్ సంస్థను ఎంపిక చేశాం. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం నిర్ణయిం చిన రేటుకు ఇసుక విక్రయాలు జరుపుతున్నాం. రెండేళ్ల కాలానికి ఇసుక ఆపరేషన్స్ కాంట్రాక్ట్‌ను జేపీ సంస్థకు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల్లో ఏపీఎండీసీ గనులను నిర్వహిస్తోంది. అక్కడ ఆపరేషన్స్ కోసం సబ్ కాంట్రాక్ట్‌లకు కొన్ని పనులు అప్పగించాం. ఇసుక టెండర్ల నిబంధనల్లో కూడా లీజు అనుమ తులు పొందిన సంస్థ సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని పనులు ఇతరులకు ఇవ్వవచ్చు. అయితే మొత్తం ఇసుక ఆపరేషన్స్‌కు జేపీ సంస్థ మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగితే జేపీ సంస్థపైనే చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను జేపీ సంస్థ నిర్వహిస్తు న్నందున వారు సబ్ కాంట్రాక్ట్ కింద ఇతరుల సేవలను తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి నిబం ధనల ఉల్లంఘనా లేదు. కొత్తగా ఏర్పాటైన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇసుకను తీసుకువచ్చే బాటకు కొందరు స్థానికులు డబ్బు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోప ణల నేపథ్యంలో దానిపై ఎవరైనా సరే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటివి అటు జేపీ సంస్థ దృష్టికి వచ్చినా, లేదా మా దృష్టికి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరతాం. వినియోగదారులకు సరైన రేటుకు, నిర్దిష్టమైన నాణ్యతతో కూడిన ఇసుక అందుతుందా లేదా అనేదానిపైనే మేం దృష్టి సారిస్తున్నాం. జేపీ సంస్థ ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ బుకింగ్‌లు చేస్తోంది. ఆన్లైన్ ద్వారా కూడా చేయాలని çసూచించాం. ప్ర జలకు ఇబ్బంది లేకుండా మంచి సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేయడానికి ఆ సంస్థ రూపొం దించిన ఫోన్ యాప్‌ను కూడా పరిశీలిస్తున్నాం. గతంలో ఆన్లైన్ విధానంలోని లోపాలవల్ల విని యోగదారులు ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా సాఫ్ట్వేర్ ఉండేలా చూస్తాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని, అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. గతంలో పట్టా భూము ల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నాణ్యత లేదనే ఫిర్యాదులు చాలా వచ్చాయి. వాటికి అనుమతులు రద్దు చేశాం. ప్రస్తుతం వందకు పైగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదల వల్ల కొన్ని రీచ్‌ల ప్రారంభంలో జాప్యం జరిగింది. త్వరలోనే దాదాపు 150 రీచ్‌లు ప్రారంభమవుతాయి’ అని ద్వివేది చెప్పారు. అవాస్తవాలు ప్రచురించారు: వెంకటరెడ్డి ‘ఇసుక విక్రయాలపై అవగాహన లేకుండా ఒక మీడియా సంస్థ అవాస్తవాలను ప్రచురించింది. గతంలో ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్న సమయంలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక లభించలేదు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లింది. దీనిని నియంత్రించడానికే ఈ ప్రభుత్వం సుస్థిర ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ చేశాం. కొత్త ఇసుక విధానంలోని లోటుపాట్లను పరిష్కరించేందుకు మెరుగైన విధానం కోసం సీఎం జగన్ మంత్రుల కమిటీని వేసి ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చారు. జేపీ సంస్థ ఎక్కడా సబ్ లీజులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారమే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దానినే జేపీ సంస్థ అనుసరిస్తోంది. కొత్తగా పుట్టిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని అంటూ ఒక మీడియాలో వచ్చిన కథనంలో వాస్తవం లేదు. జేపీ సంస్థ నగదుతో పాటు యూపీఐ. బ్యాంకు ఖాతాల ద్వారా సొమ్ము జమ చేసిన వినియోగదారులకు కూడా ఇసుకను విక్రయిస్తోంది. అందుకోసం 26 బ్యాంకు ఖాతాలను జేపీ సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఆ బ్యాంకు ఖాతాల్లో వినియోగదారులు సొమ్ము డిపాజిట్ చేసి ఇసుకను తీసుకోవచ్చు. బాట చార్జీల పేరుతో స్థానిక నేతలు ఎక్కడ డబ్బు వసూలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా కథనాలు రాస్తున్నారు. దానిపై పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతివారం నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లపై ప్రకటనలు జారీ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ రేటును ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ పాయింట్లలో ఇసుక సిద్ధంగా ఉంది. ప్రతి రీచ్‌లోనూ మైనింగ్ ప్లాన్ తయారు చేస్తాం. దానికి పర్యావరణ అనుమతులు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే సరిహద్దులు గుర్తించి జియో కోఆర్డినేట్స్ ప్రకారం లీజుదారులకు మైనింగ్ ప్రాంతాన్ని అప్పగిస్తాం. ఈ ప్రాంతం మినహా మరెక్కడైనా ఇసుక ఆపరేషన్స్ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏడాదికి రెండు కోట్ల టన్నుల వరకు ఇసుక తవ్వాలని జేపీ సంస్థకు నిర్దేశించాం. ప్రతి నెలా ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల వివరాలను తీసుకుంటున్నాం. దీనిని గనులశాఖ ఏడీ, డీడీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జేపీ సంస్థ మాన్యువల్‌గానే బిల్లులు ఇస్తోంది. ఆన్లైన్ కావాలని వినియోగదారులు కొందరు కోరుతున్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నాం. అధికారుల నుంచి నిర్దిష్టమైన అంశాలపై వివరణ కోరకుండానే మీడియాలో కథనాలను ప్రచు రించడం తగదు’ అని వెంకటరెడ్డి చెప్పారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి చేరుకున్నారు. అక్కడ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు అఖిలరెడ్డి, గౌతమ్‌రెడ్డిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్‌తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. -
బొగ్గు మైనింగ్‌లో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: సొంతంగా బొగ్గు తవ్వకాలు చేయడం ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కీలకమైన ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిలోని 1,298 హెక్టార్ల భూమిలో మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ నిర్వహించింది. ఈ వారంలోనే అక్కడ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవనుంది. మొదటగా దాదాపు రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ప్రతి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సుల్యారీ గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును లీజు సమయం ఉన్న 22 ఏళ్ల పాటు వెలికితీసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు తవ్వకం వల్ల ఆ ప్రాంతంలో నిర్వాసితులవుతున్న 1,250 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఈ గనుల ద్వారా వెలికితీసే మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రిజర్వు చేయాలని నిర్ణయించారు. మైనింగ్ చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు రాష్ట్ర పురోభివృద్ధి దిశగా సీఎం నిర్ణయాలు.. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్ పరితపిస్తున్నారు. రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలు కావడానికి సీఎం దూరదృష్టే కారణం. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రాజెక్టులను సత్వరం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుల్యారీ ప్రాజెక్టును త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చిన ఏపీఎండీసీ అధికారులను అభినందిస్తున్నా. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మైనింగ్ అవకాశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొగ్గు తవ్వకాలతో సంస్థ పరిధిని విస్తరిస్తాం బెరైటీస్ మైనింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించుకున్న ఏపీఎండీసీ.. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. సుల్యారీలో బొగ్గు తవ్వకాల ద్వారా సంస్థ పరిధిని మరింతగా విస్తరిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్ సౌత్ బ్లాక్, జార్ఖండ్‌లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌లను ఏపీఎండీసీ దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే అక్కడ కూడా ఉత్పత్తిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైట్, సిలికాశాండ్ ఖనిజాల వెలికితీత, మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
3 విభాగాల్లో ఏపీఎండీసీకి ఐఎస్వో సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) అంతర్జాతీయంగా మూడు విభాగాల్లో ప్రతిష్టాత్మక ఐఎస్వో సర్టిఫికెట్లు సాధించింది. క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్, హెల్త్ అండ్ సేఫ్టీ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో సర్టిఫికేషన్ పొందింది. సంస్థ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాక అంతర్జాతీయ సంస్థ ఐఎస్వో ఈ సర్టిఫికెట్లను ప్రకటించింది. ఐఎస్వో ఏజెన్సింగ్ సంస్థ చీఫ్ ఆడిటర్ మురళీ బుధవారం విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంలో సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డికి ఈ సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో వెలికితీస్తున్న అత్యంత నాణ్యత గల బైరటీస్, గ్రానైట్ ఖనిజాలు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. తనిఖీ ల్యాబ్‌లతో పాటు థర్డ్ పార్టీ ల్యాబ్‌లలో కూడా ఖనిజ నాణ్యతను పరీక్షించాకే విక్రయిస్తున్నామని, అందువల్లే ఏపీఎండీసీ ఖనిజ ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో డిమాండ్ మరింత పెరిగిందన్నారు. కేవలం మైనింగ్ వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ఏపీఎండీసీ కృషి చేస్తోందని వెంకటరెడ్డి వివరించారు. -
రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అయినా విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఓ పత్రిక తప్పుడు కథనం రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలాగే లేటరైట్ మైనింగ్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను, గనుల శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా తప్పుడు కథనాలను ప్రచురించారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లేలా కథనాలు ప్రచురించిన ఆ పత్రికపై కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం తవ్వకాల విలువే అంత లేదు గత ప్రభుత్వంలో విశాఖ జిల్లాలో లేటరైట్ మైనింగ్ కోసం ఆరు లీజులిచ్చారని ద్వివేది తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతోనే ఒక మైనింగ్ మాత్రమే లీజుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఆ లీజుదారు ఇప్పటి వరకు కేవలం 5 వేల టన్నుల లేటరైట్ తవ్వారని తెలిపారు. 5 వేల టన్నుల తవ్వకాల్లో రూ.15 వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మొత్తం తవ్వకాల విలువే అంత లేనప్పుడు, అన్ని వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో అటవీ వనరులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి మైనింగ్ లీజుల విషయంలో ప్రభుత్వం పర్యావరణానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అనుతివ్వలేదు విశాఖ జిల్లాలో ప్రభుత్వ అనుమతితో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను బాక్సైట్ తవ్వకాలుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వి.జి.వెంకటరెడ్డి తెలిపారు. లేటరైట్, బాక్సైట్ ఖనిజాలు వేరువేరుగా ఉంటాయని, రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ ఖనిజాల మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న ప్రదేశంలో లభించే ఖనిజం లేటరైట్ అని 2010లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో 1981–82లో జరిగిన పరిశోధనల్లో ఇక్కడ లభించే ఖనిజం లేటరైట్‌గా నిర్ధారించారని తెలిపారు. కేవలం ఒక లీజు ద్వారా జరుగుతున్న లేటరైట్ మైనింగ్‌లో ఇప్పటి వరకు 5 వేల టన్నుల లేటరైట్‌ను వెలికితీశారన్నారు. అయ్యన్న అక్రమాలకు ఆధారాలు గత ప్రభుత్వంలో లేటరైట్ మైనింగ్‌లో అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన అనుయాయులు అనేక అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఆ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మైనింగ్ అధికారులు విచారణ జరిపారని, అప్పటి అక్రమ మైనింగ్‌లపై భారీ జరిమానాలు కూడా విధించామని చెప్పారు. ఇసుక కొరత లేదు జగనన్న కాలనీలకు ఇసుక కొరత లేదని గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి తెలిపారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుపుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా 200 రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రోజుకు దాదాపు 2 లక్షల టన్నుల వరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. వర్షాకాలం కోసం ఇప్పటికే 50 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇరిగేషన్ శాఖ క్లియరెన్స్‌తో పూడికగా ఉన్న ఇసుక నిల్వలను ట్రెడ్జింగ్ చేసి సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్నారు. జగనన్న కాలనీల్లో ఇసుక కోసం రీచ్‌లకు 40 కిలోమీటర్ల లోపు ఉన్న వారు ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు కూపన్లను ఇస్తున్నామన్నారు. అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న వారికి ప్రభుత్వమే కాలనీల వద్దకు ఇసుక రవాణా చేస్తోందని తెలిపారు. బోట్స్ మెన్ సొసైటీలకు గతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండేదని, ప్రస్తుతం కూడా అలా అనుమతులు కావాలని వారు కోరుతున్న మాట వాస్తవమేనన్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. -
కరోనా కట్టడికి ఏపీఎండీసీ రూ.100 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) భారీ సాయం అందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.100 కోట్లు విరాళం అందించింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.90 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10 కోట్లు అందజేసింది. గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జేపీ పవర్‌కు ఇసుక తవ్వకం పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకం టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీ పవర్) సొంతం చేసుకుంది. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్దదైన హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి కేందాన్ని నిర్వహిస్తోంది. మూడు ప్యాకేజీలకు జేపీ పవర్ ఎక్కువ ధర కోట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) దానికే టెండర్లు ఖరారు చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం లభిస్తుంది. గతేడాది కంటే ఇది 20 శాతం అధికం. పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకాలు జరిపేందుకు అర్హత గల సంస్థను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర గనుల శాఖ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకు అప్పగించింది. ఎంఎస్టీసీ ఈ–టెండర్లు ఆహ్వానించగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, జయప్రకాష్ పవర్ వెంచర్స్, ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మూడు సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలను పరిశీలించి ఎక్కువ ధర కోట్ చేసిన జయప్రకాష్ పవర్ వెంచర్స్‌కు టెండర్‌ను కట్టబెట్టారు. ఈ సంస్థ ఒకటో ప్యాకేజీకి రూ.477.50 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.745.50 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.305.60 కోట్లను కోట్ చేయగా మిగిలిన రెండు సంస్థలు అంతకంటే తక్కువ ధర కోట్ చేశాయి. రెండేళ్లపాటు జేపీ పవర్ ఇసుక తవ్వకాలను నిర్వహించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానంలో ప్రభుత్వానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.161.30 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు రూ.380.00 కోట్ల నికర ఆదాయం లభించింది. కాగా టెండర్‌ను దక్కించుకున్న జేపీ గ్రూప్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ ప్రైవేటు సంస్థగా ఉంది. విద్యుత్ రంగంలోనే కాకుండా సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణం, సిమెంట్, రోడ్ల నిర్మాణం, ఆతిథ్యం, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, క్రీడా, విద్యా రంగాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు అవసరం లేదు.. ► రీచ్‌ల వద్దే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నేరుగా ర్యాంపుల దగ్గర ఇసుక నాణ్యతను పరిశీలించి నచ్చిన రీచ్‌లో డబ్బు కట్టి రసీదు తీసుకోవచ్చు. అక్కడ కావాల్సినంత ఇసుకను తెచ్చుకున్న వాహనంలో తీసుకెళ్లవచ్చు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రీచ్ వద్ద ఒకే ధర ఉంటుంది. దూరం ఆధారంగా, ప్రాంతాల వారీగా అప్పర్ సీలింగ్‌తో ఒక ధర నిర్ణయిస్తారు. ► ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఫిర్యాదులపై కఠిన చర్యలుంటాయి. ► ఇసుక అమ్మకాల్లో సిఫార్సులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ► ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ► ఇసుక సరఫరాలో రవాణా కాంట్రాక్టర్, దళారీల ప్రమేయం ఉండదు. ► ఇకపై పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు అనుమతించరు. ► ఓపెన్ రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలను అనుమతించడం వల్ల నాణ్యమైన ఇసుక దొరుకుతుంది. -
‘సచివాలయ’ ఉద్యోగాలు భర్తీ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లపై మంగళవారం సచివాలయంలో వేర్వేరుగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటినీ ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఇటీవల సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలన్నారు బాబూ.. నువ్వెప్పుడైనా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లావా? విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నందునే రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారని పెద్దిరెడ్డి చెప్పారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అఖిలపక్ష బృందంలో చంద్రబాబును, టీడీపీకి చెందిన కార్మీకసంఘాల ప్రతినిధులను తీసుకుపోతామని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలపై ఏరోజైనా అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. ఉక్కు కర్మాగారం కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందా? అని అన్నారు. -
అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం
సాక్షి, అమరావతి: జార్ఖండ్ రాష్ట్రంలోని అరుదైన కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ)ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కైవసం చేసుకుంది. బిడ్డింగ్‌లో ఏపీఎండీసీ ఎల్1గా నిలవడంతో ఆ బొగ్గు క్షేత్రాన్ని ఏపీఎండీసీకి అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ – ఏపీఎండీసీ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర బొగ్గు గనుల శాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు, ఏపీఎండీసీ తరఫున రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిల సమక్షంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను గోపాలకృష్ణ ద్వివేదికి అందజేశారు. ఇది అత్యంత నాణ్యమైన, అరుదైన బొగ్గు జార్ఖండ్‌లోని గిరిడీ కోల్ ఫీల్డ్స్‌లో అత్యంత నాణ్యమైన, అరుదైన ఎస్1 రకం కుకింగ్ కోల్ ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. దేశంలో వినియోగమయ్యే ఈ రకం బొగ్గులో 1.5 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 98.5 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. అందువల్ల దీనికి మంచి డిమాండ్ ఉంది. ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నేస్ (ఉక్కును కరిగించడం) కోసం దీనిని వినియోగిస్తారు. ఏపీఎండీసీకి లభించిన గనిలో 25 లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా. ’బ్రహ్మదిహ’ క్షేత్రంలో తవ్వే బొగ్గు అమ్మకం ధరలో 41.75 శాతం జార్ఖండ్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 48.25 శాతం ఏపీఎండీసీదన్నమాట. ఈ బొగ్గు గనిని పొందడంవల్ల ఏపీఎండీసీకి రూ.250 నుంచి రూ.350 కోట్ల వరకు నికర రాబడి వస్తుందని అధికారుల అంచనా. -
‘ఏపీ హైగ్రేడ్ స్టీల్స్’కు రూ.20 కోట్ల రుణం
సాక్షి, విజయవాడ: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు రూ.20 కోట్ల రూపాయల మేర రుణాన్ని ఏపీఎండీసీ నుంచి తీసుకునేందుకు అనుమతి లభించింది. రెండూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే అయినందున బ్యాంకు గ్యారెంటీ లేకుండా రుణాన్ని తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనుమతి పొందింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌గా కడప ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. (చదవండి: ‘కడప స్టీల్ ప్లాంట్’కు భారీ స్పందన) ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది డిసెంబర్ 23న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సివిల్ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే జనవరి నుంచి ప్రధాన ప్లాంటు పనులు ప్రారంభమయ్యే విధంగాఏపీహెచ్‌ఎస్‌ఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. (చదవండి: కడప ఉక్కుపై దిగ్గజ కంపెనీల ఆసక్తి) -
ఇసుక బుకింగ్ మరింత సరళతరం
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్‌ను మరింత సరళతరం చేసి ఆన్లైన్ మోసాలకు చెక్ పెడతామని భూగర్భ గనులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించే విషయం ఆలోచిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో సోమవారం ఆయన ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇసుక పాలసీపై సమీక్షించారు. ‘సచివాలయాల ద్వారా ఏపీఎండీసీ నుంచి వినియోగదారులు ఇసుక కొనుగోలు చేసే అవకాశం కల్పించవచ్చు. దీనివల్ల గ్రామస్థాయిలో వినియోగదారుడికి ఇసుక లభ్యత మరింత సులభమవుతుంది. ఈ నూతన విధానంపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి ఆయన సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’.. అని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు ► బల్క్ బుకింగ్‌లకు కూడా కొత్త నిబంధనలు అమలుచేస్తాం. అక్రమాల కట్టడి కోసం ప్రతి బల్క్ బుకింగ్‌ను జిల్లా స్థాయిలో పునఃపరిశీలన చేసే ఏర్పాట్లుచేస్తాం. ► ప్రతి రీచ్‌కు పది కిలోమీటర్ల పరిధిలోనే స్టాక్‌యార్డ్ ఏర్పాటుచేయాలి. తద్వారా ఇసుక రవాణాభారం వినియోగదారులపై తగ్గించాలి. ► రాజమండ్రి నుంచి విశాఖకు ఇసుక రవాణా చెల్లింపులను కిలోమీటరుకు టన్నుకు రూ.4.90 నుంచి రూ.3.30కి తగ్గించాం. ► వర్షాకాలంలో అవసరాల కోసం 70 లక్షల టన్నుల ఇసుక నిల్వలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించగా ఇప్పటివరకు 40 లక్షల టన్నులు సిద్ధంచేశాం. వచ్చే 20 రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తిచేయాలి. ► ఇసుక రవాణాదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ► జీపీఆర్ఎస్ పరికరాలు లేని వాహనాలను ఇసుక రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు. ► రాత్రి పూట ఇసుక ఆపరేషన్లు తగ్గించాలి. ► పర్యావరణ నిబంధనల ప్రకారం తవ్వకాలు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మైనింగ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్, జేసీ మాధవీలత, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఇసుక విక్రయాలు పునఃప్రారంభం
రాష్ట్రంలో ఇసుక విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై సడలింపులివ్వడంతో ఏపీఎండీసీ ఇసుక ఆన్లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి డోర్ డెలివరీ చేస్తుంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక విక్రయాలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పునఃప్రారంభించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 23వతేదీ నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై సడలింపులిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీఎండీసీ వెబ్సైట్ ద్వారా ఇసుక బుకింగ్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి డోర్ డెలివరీ చేస్తుంది. నిల్వ పెంచేందుకు చకచకా ఏర్పాట్లు.. ► వచ్చే వర్షాకాల సీజన్లో అవసరాల కోసం 70 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించగా ఏపీఎండీసీ ఇప్పటివరకు 35 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసింది. ► కరోనా, లాక్‌డౌన్‌వల్ల స్టాక్ యార్డులకు ఇసుక తరలింపులో కొంత సమస్య ఏర్పడింది. ► తాజాగా సడలింపుల నేపథ్యంలో ఇసుక నిల్వలను పెంచేందుకు ఏపీఎండీసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 1.06 కోట్ల టన్నులు సరఫరా... ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం, ప్రజలకు సరసమైన ధరలకు పారదర్శకంగా సరఫరా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 5న కొత్త పాలసీని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి మార్చి 31వతేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ 1,06,79,907 టన్నుల ఇసుక సరఫరా చేసింది. -
సంక్షేమాభివృద్ధి పథకాలకు మట్టి డబ్బులు
సాక్షి, అమరావతి: పోలవరం కుడి, ఎడమ కాలువల పనుల్లో లభ్యమైన మట్టిని పారదర్శకంగా ఆన్లైన్ టెండర్ల ద్వారా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మట్టి మాఫియాకు చెక్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా విక్రయించడం ద్వారా లభించే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. తొలిదశ విక్రయాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ తొలి దశలో తూర్పు గోదావరి జిల్లాలోని గండేపల్లి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తొండంగి, శంఖవరం మండలాలతోపాటు విశాఖ పట్నం జిల్లా కసింకోట మండల పరిధిలోని పోలవరం ఎడమ కాలువ పది రీచ్‌ల్లో 32,79,432 క్యూబిక్ మీటర్ల మట్టిని విక్రయిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, నల్లజర్ల, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలాలు, కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, విజయవాడ మండలాల పరిధిలోని ఎనిమిది రీచ్‌ల్లో 25,72,294 క్యూబిక్ మీటర్ల మట్టి విక్రయానికి ఏపీఎండీసీ ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 19న టెండర్లు ఖరారు క్యూబిక్ మీటర్ మట్టి ధర రూ.86 కాగా, గ్రావెల్ రేటు రూ.113 చొప్పున నిర్ణయించారు. టెండర్లో పేర్కొన్న ధర కంటే ఎవరు అధికంగా కోట్ చేస్తే వారికి మట్టిని విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తుంది. తొలి దశ మట్టి విక్రయ టెండర్లను ఈనెల 19న ఖరారు చేయనున్నారు. మట్టిని మింగిన టీడీపీ నేతలు పోలవరం కాలువ గట్లపై నిల్వ చేసిన మట్టిని టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో పోలవరం మట్టిని దోచేశారు. కొన్ని చోట్ల కాల్వ గట్లపై కొండలను తలపించే రీతిలో నిల్వ చేసిన మట్టి సైతం మాయమైంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మట్టి దోపిడీలో చెలరేగిపోయారు. మిగిలింది 12 కోట్ల క్యూబిక్ మీటర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్టి మాఫియాకు చెక్ పెట్టింది. పోలవరం మట్టిని ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. జలవనరులు, గనుల శాఖల అధికారులతో పోలవరం కుడి, ఎడమ కాలువ గట్లపై సర్వే చేయించింది. టీడీపీ నేతలు దోచేయగా కాలువ గట్లపై 12 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి నిల్వ ఉన్నట్లు తేలింది. - ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం పోలవరం మట్టి విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో జలవనరుల శాఖకు రూ.700 కోట్లు, గనుల శాఖకు సీనరేజీ కింద రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని లెక్క కడుతున్నారు. - మట్టి విక్రయం ద్వారా పోలవరం కుడి, ఎడమ కాలువల గట్లు ఖాళీ కావడంతో సుమారు ఐదు వేల ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. దీన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
ఇసుక.. ఇంటికే వచ్చేస్తుందిక
సాక్షి, అమరావతి: అడిగిన వారి ఇంటికే నేరుగా ఇసుక సరఫరా (డోర్ డెలివరీ) విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే ఆరు జిల్లాల్లో ఇసుకను డోర్ డెలివరీ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) విజయవంతంగా అమలు చేస్తోంది. త్వరలో ఈ విధానాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. రవాణా చార్జీల ఖరారు, ఇసుక వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లాస్థాయి ఇసుక కమిటీల (డీఎల్ఎస్సీ)తో ఏపీఎండీసీ అధికారులు నిత్యం సమీక్షిస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, రవాణా అధికారులతో కూడిన డీఎల్ఎస్సీ ప్రతినిధులు ఇసుక రవాణా చార్జీల ఖరారుకు సంబంధించి లారీ, ట్రాక్టర్ యజమానుల సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. 6 జిల్లాల్లో విజయవంతంగా అమలు ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డోర్ డెలివరీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలనే పట్టుదలతో ఏపీఎండీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, 14వ తేదీనుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నూతన విధానం అమలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.80 లక్షల టన్నుల ఇసుక డోర్ డెలివరీ ఆరు జిల్లాల్లో ఇప్పటికే 1.80 లక్షల టన్నుల ఇసుకను డోర్ డెలివరీ చేశాం. కేవలం నెల రోజుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 1.06 లక్షల టన్నుల ఇసుక డోర్ డెలివరీ చేశాం. కొత్త విధానం విజయవంతం అయ్యిందనడానికి ఇది నిదర్శనం. ఈనెల 14వ తేదీకల్లా రాష్ట్రమంతా దీనిని అమల్లోకి తెస్తాం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారి ఇంటికి ఇసుక చేరవేసిన వాహన యజమానులకు ప్రస్తుతం 48 గంటల్లో రవాణా చార్జీలు చెల్లిస్తున్నాం. ఇకపై 24 గంటల్లోనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూధన్‌రెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
ఆ జిల్లాలో ఇనుప ఖనిజం.. అపారం!
సాక్షి, ఒంగోలు : జిల్లాలో లోగ్రేడ్ ఇనుప ఖనిజం నిక్షేపాలు ఒంగోలు మండలంలోని యరజర్ల, టంగుటూరు మండలంలోని కొణిజేడు, మద్దిపాడు మండలంలోని బూరేపల్లి, అన్నంగి తదితర ఏడు గ్రామాల పరిధిలోని కొండల్లో అపారంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఆవిర్భవించక ముందే ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు మండలాల్లో లోగ్రేడ్ ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అయితే ఈ ఇనుప ఖనిజం నిక్షేపాలను వెలికితీయడానికి అప్పట్లో సాంకేతికత అందుబాటులో లేదు. అదీగాక ఐరన్ గ్రేడ్ 28 శాతం మాత్రమే ఉన్నట్లు పూర్వపు సర్వే నివేదికల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి సర్వే చేపట్టిన దాఖలాలు లేవు. కర్నాటకలో ఐరన్ ఓర్ మైనింగ్ బాగా విస్తరించడంతో జిల్లాలో ముడి ఖనిజం వెలికితీత మరుగున పడింది. అయితే కర్నాటక రాష్ట్రంలోని కుద్రేముఖ్ ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ లోగ్రేడ్ ఐరన్ ఓర్ అయినా మైనింగ్ చేస్తామని ముందుకు వచ్చింది. దీంతో 1998లో ఆ కంపెనీకి అప్పటి ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. కుద్రేముఖ్‌కు చెందిన కంపెనీ ఒంగోలు సమీపంలోని యరజర్ల వద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి, ఐరన్ ఓర్ నుంచి తీసిన పిల్లెట్లను కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం నుంచి రవాణా చేసేందుకు ప్రాథమికంగా డీపీఆర్ తయారు చేసుకుంది. ఈ క్రమంలోనే యరజర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధంకాగా గ్రామస్తులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడినా ఐరన్ ఓర్ తీయడం వల్ల ఇబ్బందులు ఎదురావుతాయని అభిప్రాయాలు వెల్లడించడంతో మైనింగ్ అంశం అటకెక్కింది. ముడి ఖనిజం ఉన్న భూములను ఏపీఎండీసీకి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐరన్ ఓర్‌ను వెలికితీసి ఎగుమతి చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఏపీఎండీసీ వద్ద వనరులు అందుబాటులో లేకపోవడంతో జింపెక్స్ అనే ప్రైవేట్ సంస్థతో కలిసి ఖనిజాన్ని వెలికితీయడానికి సిద్ధమైంది. కానీ మైనింగ్‌లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 1300 ఎకరాలు ఏపీఎండీసీ పరిధిలోనే.. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు మండలాల్లో మొత్తం 1300 ఎకరాలను సర్వే చేసి ఏపీఎండీసీకి అప్పగించారు. ఐరన్ ఓర్ మైనింగ్‌కు రిజర్వ్ చేసిన భూములు కావడంతో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో గ్రావెల్ కొరత తీవ్రమైంది. గత ప్రభుత్వం ఈ కొండలను డీ రిజర్వ్ చేసి గ్రావెల్ తవ్వకానికి, ఇతర అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున డీ రిజర్వ్ చేయలేకపోయారు. యర్రజర్ల వద్ద గృహ నిర్మాణానికి, ఇతర కట్టడాలకు ప్రభుత్వం అడ్వాన్స్ పొజిషన్ తీసుకోవడానికి అనుమతులు ఇచ్చినా గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ఇబ్బందులు, పాలనాపరంగా, న్యాయపరంగా చిక్కులు వచ్చాయి. 6 కోట్ల టన్నుల నిక్షేపాలు జిల్లాలోని యర్రజర్ల, కొణిజేడు, మర్లపాడు, బూరేపల్లి, అన్నంగి తదితర గ్రామాల్లో ఉన్న కొండల్లో సుమారు రూ.6 కోట్ల టన్నుల మేర ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లుగా అంచనా. జాతీయ రహదారుల అభివృద్ధి కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ అన్నంగి, బూరేపల్లి ప్రాంతాల నుంచి వేలాది టన్నుల గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వేసి వినియోగించుకున్నా గత ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించింది. ఒంగోలు మండలం యరజర్ల కొండల పరిసరాల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వి విక్రయించి రూ.లక్షలు గడించినా పట్టించుకున్న నాథుడే లేడు. జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్‌కు 2015లో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అయితే కాలుష్య నియంత్రణ మండలితోపాటు మరికొన్ని అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హొస్పేట్‌కు చెందిన సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ప్రాంతంలో లీజు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకున్నామని తమకే లీజు ఇవ్వాలని కోరింది. అయితే ఏపీఎండీసీ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దానికే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సుప్రీం కోర్టులోనూ ఏపీఎండీసీకి అనుకూలంగా తీర్పు రావడంతో జింపెక్స్తో కూడా సంబంధం లేకుండా సొంతగానే ఇనుప ఖనిజం తవ్వాలని యోచిస్తోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. -
ఇసుక సగటు వినియోగం 65 వేల టన్నులు
సాక్షి, అమరావతి: ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో ఇసుక రోజుకు సగటు వినియోగం 65 వేల టన్నులు పైగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆన్లైన్ బుకింగ్ గణాంకాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. ఏడాది మొత్తమ్మీద చూస్తే రోజుకు సగటు వినియోగం 80 – 85 వేల టన్నులు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల నిర్మాణరంగంలో పనులు తగ్గాయి. వేసవితో పోల్చితే వర్షాకాలంలో నిర్మాణ పనులు మరింత తక్కువగా ఉంటాయి. ఈ ప్రభావం ఇసుక వినియోగంపైనా ఉంటుంది. ఇవి రిటైల్ ఇసుక వినియోగానికి సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇసుక బల్క్ బుకింగ్ గణాంకాలను ఇందులో లెక్కలోకి తీసుకోలేదు. భారీగా పెరిగిన ఇసుక సరఫరా రీచ్‌ల నుంచి స్టాక్ యార్డుల్లోకి ఇసుక తరలింపు భారీగా పెరిగింది. ప్రస్తుతం స్టాక్ యార్డుల్లో 2.95 లక్షల టన్నుల ఇసుక బుకింగ్‌లకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 62,125 టన్నుల ఇసుక బుకింగ్స్ జరిగాయి. -
వరద తగ్గింది.. ‘ఇసుక’ పెరిగింది
సాక్షి, అమరావతి: ఇసుక రీచ్‌ల వద్ద వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ఇసుక సరఫరాను క్రమేణా పెంచుతోంది. రీచ్‌లలో నీరు పూర్తిగా ఇంకిపోతే ప్రజలు కోరినంత ఇసుకను స్టాక్ యార్డుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 1వ తేదీన 31,576 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు చేరింది. శుక్రవారం ఇది 96,600 టన్నులకు పెరిగింది. గడచిన ఐదు రోజుల్లో మూడు రెట్లు అధికంగా ఇసుక లభించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సుమారు 4 లక్షల టన్నుల ఇసుకను ఏపీ ఎండీసీ స్టాక్ యార్డులకు చేరవేసింది. తూర్పు గోదావరి జిల్లాల్లో తవ్విన ఇసుకను కలిపితే 4.30 లక్షల టన్నుల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో తవ్వకాలను రెట్టింపు చేయడం ద్వారా కోరినంత ఇసుకను ప్రజలకు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. రోజుకు 2 లక్షల టన్నుల సరఫరా ఇదే పరిస్థితి కొనసాగి మరిన్ని రీచ్‌లలో వరద నీరు ఇంకిపోతే రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వర్షాలు ఆగిపోతే వారం రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అధిగమించి ప్రజలకు కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాల్లోని వంకలు, వాగులు, ఏర్లలో ఇసుక తవ్వకాలకు అనువైన 300 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. -
ఇసుకతో పార్టీల విషరాజకీయం
-
ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్ మాటున కొందరు సాగిస్తున్న ఆన్లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోసపూరిత మార్గాలను అనుసరించిన వ్యక్తుల నుంచి ఇసుకను, వాహనాలను స్వాదీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు బనాయించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా పూర్తి పారదర్శకంగా ఇసుకను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం విదితమే. అయితే, కొందరు దళారులు అక్రమార్జనే లక్ష్యంగా వేర్వేరు వ్యక్తులు, చిరునామాలతో ఐడీలు సృష్టించి పెద్ద పరిమాణంలో ఇసుక బుక్ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుక లోడుతో వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఇసుక బుకింగ్‌లో అక్రమాలు సాగుతున్న వైనం బట్టబయలైంది. తప్పుడు ఐడీల స్కాన్ కాపీ - గుంటూరుకు చెందిన బి.కిషోర్ అనే వ్యక్తి వేర్వేరు పేర్లతో గుంటూరులోని వేర్వేరు చిరునామాలతో, వేర్వేరు ఐడీ నంబర్లతో ఆన్లైన్ ద్వారా రూ.1.27 లక్షల విలువైన ఇసుక బల్క్ బుకింగ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను సీజ్ చేసి అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. - కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. బినామీ పేర్లతో రూ.3.80 లక్షల విలువైన ఇసుకను అతడు ఆన్లైన్లో బుక్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. మీ–సేవ కేంద్రం ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించి క్రిమినల్ కేసు నమోదు చేశారు. దొరికిందిలా.. సబ్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీను సిబ్బందితో కలిసి గన్నవరంలోని కొనాయి చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీని రోడ్డు పక్కన నిలిపేసి డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. గన్నవరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బొజ్జగాని వీరాస్వామి, దావాజీగూడెంలోని మసీదు ఎదురుగా ఉన్న ‘మీసేవ’ సెంటర్ ఆపరేటర్ సింగలపల్లి దుర్గారావు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఐపీ నంబర్లు సృష్టించి ఇసుక బుక్ చేసుకుని లారీలు, ట్రాక్టర్లలో తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని డ్రైవర్, క్లీనర్ అంగీకరించారు. ‘మీసేవ’ ఆపరేటర్ దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఇసుకను మోసపూరితంగా బుకింగ్ చేసినందుకు బ్రోకర్లు, లారీ యజమానుల నుంచి దుర్గారావు రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకు వసూలు చేసినట్లుగా తేలింది. -
గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నచిన్న వాగులు, వంకలు, ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు కొరత తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏరులు, వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు, రవాణాను క్రమబద్ధీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్ట్రీమ్స్‌గా పరిగణించే వంకలు, వాగులు, ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సూచన మేరకు మార్గదర్శకాలు.. ఇప్పటివరకు ప్రజలు ఎక్కువగా పెద్ద పెద్ద నదుల ఇసుకపైనే ఆధారపడుతూ వస్తున్నారు. వరదల నేపథ్యంలో దీనివల్ల సమస్య ఏర్పడింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో బుధవారం చర్చించిన అనంతరం ఆయన సూచనల మేరకు భూగర్భగనుల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్ట్రీమ్స్‌లో ఇసుక తవ్వకాలు, వినియోగానికి సంబంధించి తాజాగా రూపొందించిన మార్గదర్శకాలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని, తర్వాత సమీక్షించి అవసరమైన మార్పు చేర్పులు చేస్తామని అందులో స్పష్టం చేసింది. రీచ్‌ల గుర్తింపు బాధ్యత కలెక్టర్లకు భారీగా ఇసుక లభించే గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా లాంటి పెద్ద నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు వీలు లేనందున ఏర్పడిన కొరతను వంకలు, ఏరులు, వాగుల ద్వారా అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్ టు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్‌గా పేర్కొనే వీటిలోని ఇసుకను ఏపీ వాల్టా చట్టం నిబంధనల మేరకు తవ్వి స్థానిక అవసరాలు తీర్చాలని గనుల శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలవారీగా జిల్లాల్లో ఈ తరహా ఇసుక రీచ్‌లు ఎన్ని ఉన్నాయో గుర్తించే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. ఇందులోని ఇసుకను స్థానిక అవసరాలకు (వ్యాపారానికి కాదు) మాత్రమే వినియోగించుకునేలా గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షిస్తారు. సరఫరా ఇలా... ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్ (ట్రాన్సిట్ పాస్) తీసుకోవాలి. సచివాలయ అధికారి ఒరిజినల్ పర్మిట్‌ను ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు. ఇసుక రీచ్‌ల పర్యవేక్షణను గ్రామ సచివాలయ ఇన్చార్జి సంబంధిత వలంటీర్‌కు అప్పగిస్తారు. సచివాలయంలో డబ్బులు చెల్లించిన వారు రేవు వద్దకు వెళ్లి పర్మిట్‌ను వలంటీర్‌కు ఇచ్చి ట్రాక్టరు, ఎద్దుల బండిలో ఇసుక నింపుకొని తీసుకెళ్లవచ్చు. ఈ పర్మిట్ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్ చెల్లుబాటు కాదు. ట్రాక్టర్లలో ఇసుకను రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి తీసుకెళ్లరాదు. ఎవరూ అవసరానికి మించి ఇసుక నిల్వ చేయరాదు. ఇలా చూడాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ అధికారులదే. పర్మిట్ తప్పనిసరి.. ఇసుక రవాణా పర్మిట్ పాస్‌ల జారీ కోసం ముద్రించిన ఫారం–ఎస్ 3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేస్తుంది. ఇసుకను తరలించేందుకు పర్మిట్ తప్పనిసరి. పాస్ లేకుండా తరలిస్తే జరిమానా విధిస్తారు. ప్రతి పాస్‌కు ఒరిజనల్, డూప్లికేట్ అనే రెండు పేపర్లు ఉంటాయి. దీంతో ఏయే గ్రామ సచివాలయం పరిధిలో ఎంత ఇసుక విక్రయించారనే గణాంకాలు పక్కాగా ఉంటాయి. వరదల వల్ల తాత్కాలికంగా ఏర్పడిన ఇసుక సమస్యను పరిష్కరించడం కోసమే భూగర్భ గనుల ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. భారీ వరదలు, వర్షాలతో... మాఫియాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇసుక తవ్వకం, సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు నాలుగో తేదీన కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రజల అవసరాల మేరకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఈ సీజన్లో నిరంతరాయంగా గోదావరిలో ధవళేశ్వరం వద్ద 55 రోజుల నుంచి, కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజి వద్ద 71 రోజులుగా వరద కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో 400 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై తుంగభద్రలో భారీగా వరదనీరు పొంగుతోంది. వంశధార, పెన్నాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వాయుగుండం/ తుపాను ప్రభావం వల్ల వర్షాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రీచ్‌లన్నీ నీటితో నిండిపోయి ఇసుక తవ్వకాలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులుగా ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున ఇసుక సమస్య ఉత్పన్నమైంది. ఐదేళ్లకు సరిపడా నిల్వలు రాష్ట్రంలో గత పుష్కర కాలంలో ఎన్నడూ లేనన్ని రోజులు గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వంశధార ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి నీటితోపాటు ఇసుక భారీగా కొట్టుకువచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నదుల్లో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలున్నాయి. వరదనీరు తగ్గుముఖం పట్టగానే రీచ్‌లలో తవ్వకాలు ఆరంభించి ప్రజలు కోరినంత ఇసుక సరఫరా చేస్తామని భూగర్భ గనులశాఖ అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఏపీఎండీసీ రోజుకు ఐదు వేల టన్నుల ఇసుకను మాత్రమే ప్రజలకు సరఫరా చేసేది. ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ 45 వేల టన్నుల వరకు సరఫరా చేస్తోంది. వరద తగ్గితే రోజుకు లక్ష టన్నులు సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఏపీఎండీసీ అధికారులు తెలిపారు. ఏపీఎండీసీ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈనెల 22 వరకు 6,07,311 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసింది. ఇదే కాలంలో అధికారులు గుంటూరు జిల్లాలో 2 లక్షల టన్నులు, గోదావరి జిల్లాలో 55 వేల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. కొత్త మార్గదర్శకాలతో సమస్య పరిష్కారం ‘రాష్ట్రంలో రోజుకు సగటున 80 నుంచి 85 వేల టన్నుల ఇసుక అవసరం. నిర్మాణ రంగం భారీగా వేగం పుంజుకుంటే రోజుకు సగటున ఇసుక అవసరం లక్ష టన్నులకు చేరవచ్చు. ప్రస్తుతం ఏపీఎండీసీ స్టాక్ యార్డుల ద్వారా రోజుకు 45 వేల టన్నుల వరకూ ఇసుక సరఫరా చేస్తోంది. దీన్ని 85 వేల టన్నులకు పెంచితే ఎలాంటి సమస్య ఉండదు. నదుల్లో నీరు తగ్గిపోగానే రేవులన్నీ అందుబాటులోకి వస్తాయి. రోజుకు లక్ష టన్నులు కూడా ఇసుక సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉంది. వరదలు, భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఇసుక సమస్య తాత్కాలికమే. దీన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏరులు, వాగులు, వంకలలో, ఇసుక తవ్వకాలు, సరఫరాకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశాం. దీంతో ఇసుక సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది’ – సాల్మన్ ఆరోఖ్యరాజ్ (ముఖ్యమంత్రి కార్యదర్శి) -
ఇక స్టాక్‌యార్డుల్లో నిండుగా ఇసుక
సాక్షి, అమరావతి: వర్షాలు తగ్గడంతో రీచ్‌లలో నీరు ఇంకిపోగానే స్టాక్ యార్డుల నిండుగా ఇసుక నింపి, కోరిన వారికి కోరినంత సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చిన సమయంలోనే ఎగువ ప్రాంతాల్లో, వర్షాలు కురవడం, నదుల్లో వరదనీరు పోటెత్తడం వల్ల ఇసుక సరఫరాలో సమస్య ఏర్పడింది. కొత్త రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, స్థలాలు సమకూర్చి స్టాక్ యార్డులను సిద్ధం చేయడం లాంటి పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం–ఏపీఎండీసీ పూర్తి చేశాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తికాక ముందే స్వల్ప కాలంలోనే 1.25 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేయడం గమనార్హం. కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి గత నెలాఖరు వరకూ ఇసుక కావాలంటూ 10,358 మంది ఏపీఎండీసీకి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న రోజు లేదా మరుసటి రోజు ఉదయమే ఇసుక సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో ఓపెన్ రీచ్‌లు ►మొత్తం గుర్తించినవి: 138 ►పర్యావరణ అనుమతులు ఉన్నవి: 115 ►పర్యావరణ అనుమతులు ►పెండింగ్‌లో ఉన్నవి: 23 ►నీట మునిగి ఉన్నవి: 80 ►ఇసుక తవ్వకాలు సాగుతున్నవి: 25 ►డిసిల్టేషన్ కేంద్రాలుమొత్తం: 32 ►ప్రస్తుతం పనిచేస్తున్నవి: 9 రైతుల పట్టా భూములు ►గుర్తించిన రీచ్‌లు: 82 ►తవ్వకాలు జరుగుతున్నవి: 5 -
ఆన్లైన్ యాప్ ద్వారా ఇంటికే ఇసుక
సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): కొత్త ఇసుక విధానంపై స్పష్టత వచ్చేసింది. ఆన్లైన్ యాప్ ద్వారానే ఇంటికి ఇసుక వచ్చే అధునాతన విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ పారదర్శక విధానాన్ని రానున్న సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారమే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో వినియోగ ప్రజలతోపాటు అధికారులకు కూడా గత ఇసుక బాధలు తీరినట్లేనని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇసుక మాఫియా దౌర్జన్యాలు లేకుండా పూర్తి సరళీకృత విధానంలో ఇసుకను నేరుగా ఇంటి వద్దకే అందించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇసుకతోపాటు రవాణా వాహనాలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేలా సాంకేతికతను అమలు చేయనున్నారు. ఈ వాహనాలకు ప్రత్యేకంగా జీపీఎస్‌ను అమర్చనున్నారు. అలాగే ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఒక్క క్లిక్‌తో అటు ఇసుక మాఫియాకు.. ఇటు అక్రమాలకు చెక్ పెట్టేలా అడుగు పడనుంది. ఇదిలావుంటే రానున్న సెప్టెంబర్ 5 నుంచి కొత్త పాలసీ అమలు కానున్న నేపథ్యంలో అంతవరకు జిల్లాలో ఇసుక వినియోగం, విక్రయాలపై పూర్తి బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద నదుల్లో ఇసుక బాధ్యతలు ఏపీఎండీసీకే.. జిల్లాలో పెద్ద నదుల వద్ద ఇసుక వినియోగంపై స్పష్టమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా పాలసీలో పేర్కొంది. ఈమేరకు 4వ ఆర్డర్ స్ట్రీమ్‌లో ఉన్న వంశధార, నాగావళి నదుల తీరంలోని ఇసుక తవ్వకాలు జరిపి, ప్రజలకు సరసమైన ధరకు విక్రయించే బాధ్యతలన్నీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృధ్ది సంస్థ (ఏపీఎండీసీ)కు అప్పగిస్తూ జగన్ సర్కార్ నూతన ఇసుక విధానాన్ని ప్రకటించింది. వంశధార, నాగావళి నదుల్లో తవ్విన ఇసుకను ఆయా రీచ్‌లకు సమీపంలో స్టాక్ యార్డుల్లో నిల్వ చేయనున్నారు. అలాగే జిల్లాలో చిన్న నదులైన మహేంద్ర తనయ, బాహుదా నదులు, చిన్న వాగులు, వంకలు నుంచి ఇసుక వినియోగం ఉచితం కానుంది. థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద జిల్లాలో ఉన్న మహేంద్రతనయ, బాహుదా తదితర చిన్న నదులతోపాటు సువర్ణముఖి తదితర గెడ్డలు, వాగులు, వంకల వద్ద ఉన్న ఇసుకను మాత్రం ‘స్థానికులకు’ ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా నదీతీరాల్లో ఎటువంటి యంత్రాలను వినియోగించకుండా, ఆయా మండలాల పరిధి దాటి రవాణాకు అవకాశాలు ఇవ్వకుండా.. ఇసుకను స్థానికులు, ముఖ్యంగా పేద, సామాన్య వర్గాలకు మాత్రమే తమ సొంత గృహ నిర్మాణ అవసరాలకు తోడ్కొనేలా కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. అలాగే జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇసుక తరలింపు కోసం పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ (పీసా) చట్టం కచ్చితంగా అమలు కానుంది. ఇక్కడి ఇసుకపై పూర్తి హక్కులను స్థానిక గిరిజనులకు చెందిన సొసైటీలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చౌకగా..సరళంగా అందేలా...! గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘ఉచిత ఇసుక విధానం’తో.. కేవలం టీడీపీ నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసి, అక్రమంగా కోట్లు కూడబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా గత ప్రభుత్వ విధానాలతో నిత్యం అవస్థలు పడ్డ ప్రజలకు.. ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో మాత్రం అలాంటి కష్టాలు లేకుండానే సరసమైన ధరకే ఇసుక చెంతకు వచ్చేలా కొత్త పాలసీని రంగంలోకి దించారు. ఇసుకను బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్, పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఇసుక ఎంత అవసరమో..ఎక్కడికి..ఏ వాహనంలో చేర్చాలో..అన్న వివరాలతో ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేసి, నిర్ణీత ధరను ఆన్లైన్లో చెల్లించగానే ఎంచక్కా మీ ఇంటికే నేరుగా చేరేలా అవకాశమొచ్చింది. ఈ ఇసుక నిల్వల కోసం ప్రత్యేకంగా రీచ్‌ల వద్ద స్టాక్ యార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు త్వరలోనే ధరలను త్వరలోనే ప్రకటించనున్నారు. -
సెప్టెంబర్ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియాకు వరంగా మారిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్త విధానం ఎలా ఉండాలనే అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణాతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇసుక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మన పాలసీ ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. ప్రతి వాహనానికీ జీపీఎస్ ‘ఇసుకను తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాలి. దీనివల్ల వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు ఇసుకను తరలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ప్రభుత్వం సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఏర్పాట్లకు రెండు నెలల సమయం ఎన్ని రోజుల్లో ఇసుక కొత్తవిధానం అమల్లోకి తేగలరని సీఎం అడిగిన ప్రశ్నకు క్వారీల వద్ద సీసీ కెమెరాలు, స్టాక్ యార్డులు, వేయింగ్ బ్రిడ్జిలు, వాహనాల గుర్తింపు, రిజిస్ట్రేషన్, జీపీఎస్.. తదితరాల ఏర్పాటుకు రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి సెప్టెంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని, ఆ లోగా అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు ఇంటి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగా ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇసుకను అందుబాటులో ఉంచి బుక్ చేసుకున్న వారికి సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇసుక సరఫరాకు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చే వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఇసుకను అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లు యథాతథంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇసుక డిమాండు – ఉత్పత్తి మధ్య అంతరం తగ్గించేందుకు రోబో శాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సిలికా అక్రమ తవ్వకాలకు చెక్ నెల్లూరు జిల్లాలో సిలికా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగానే సీఎం సీరియస్‌గా స్పందించారు. ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులంతా సమావేశమై అక్రమ తవ్వకాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాల మాట ఇక తనకు వినిపించరాదని ఆదేశించారు. గత అయిదేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక కుంభకోణం సాగిందని సీఎం గుర్తు చేశారు. ఇసుక కొనుగోలు ప్రజలకు భారంగా మారగా, మాఫియా కాసుల మూటలు కొల్లగొట్టిందని, సర్కారుకు మాత్రం ఆదాయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యవహరాలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా మార్చడం కోసమే కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనరేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీఎండీసీకే సరఫరా బాధ్యతలు ఇసుక కొత్త విధానం మేరకు సరఫరా బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిద్దామని అధికారులు చేసిన సూచనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ప్రకారం ఏపీఎండీసీనే ప్రజలకు ఇసుకను విక్రయించనుంది. కొత్త విధానం అంతిమంగా ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా, పర్యావరణానికి నష్టం కలుగని రీతిలో, పూర్తి పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక కొత్త విధానం ఇలా అమలు కానుంది. ► జిల్లాల్లో ఇసుక రేవులను గనుల శాఖ గుర్తిస్తుంది. వీటికి సమీపంలో ఏపీఎండీసీ నిల్వ కేంద్రాలు (స్టాక్ పాయింట్లు) ఏర్పాటు చేసుకుంటుంది. ► క్వారీల నుంచి ఇసుకను తవ్వించి వాహనాల్లో స్టాక్ పాయింట్లకు ఏపీఎండీసీనే చేరవేస్తుంది. ► క్వారీ వద్దకు రాగానే ఖాళీ వాహనం బరువును వేయింగ్ మిషన్ ద్వారా లెక్కిస్తారు. దాంట్లో ఇసుక నింపిన తర్వాత మళ్లీ బరువు చూస్తారు. దీంతో వాహనంలో ఎన్ని టన్నుల ఇసుక ఉందో తేలిపోతుంది. వాహనంలో ఎంత ఇసుక ఉందో డ్రైవరుకు చీటీ ఇచ్చి పంపుతారు. స్టాక్ యార్డులోని సిబ్బంది ఆ చీటీ తీసుకుని మళ్లీ తూకం వేసి అంతే పరిమాణంలో ఇసుక ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అన్ లోడ్ చేయిస్తారు. ► వినియోగదారులకు ఇసుక పంపేప్పుడు కూడా వాహనాలను తూకం వేసి కచ్చితంగా వారు కోరిన పరిమాణంలో పంపించే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు? స్టాక్ యార్డులకు ఎంత చేరింది? ఎంత విక్రయించారు? అనే లెక్క కచ్చితంగా ఉంటుంది. ఎక్కడా ఇసుక పక్కదారి పట్టడానికి అవకాశం ఉండదు. ► ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తారు. ► ఇసుక కావాల్సిన వారు వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకుని డబ్బు చెల్లిస్తే ఏపీఎండీసీనే ఇంటికి వాహనాల ద్వారా ఇసుకను చేరవేస్తుంది. ఏపీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న వాహనాలను సంస్థ స్టాక్ యార్డుల వద్దకు అనుమతిస్తారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి ముందుగా పద్ధతిలో ఇసుకను పంపిస్తారు. ఇసుక వ్యాపార వస్తువు కాకూడదు : మంత్రి పెద్దిరెడ్డి సహజ సిద్ధమైన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చరాదనేది ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక ద్వారా ఆదాయం మాఫియాకు వెళ్లరాదని, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నారు. గురువారం సాయంత్రం ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
ఏపీలో ఇంటి నుంచే ఇసుక బుకింగ్
ఇసుక కావాల్సిన వారు బుకింగ్ కోసం ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌ను క్లిక్ చేస్తే చాలు సమగ్ర వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ఏయే స్టాక్ యార్డుల్లో ఎంతెంత ఇసుక నిల్వ ఉందో కూడా అందులో కనిపిస్తుంది. సమీప ప్రాంతంలోని స్టాక్ యార్డు నుంచి ఇసుక సరఫరా కోసం బుక్ చేసుకోవచ్చు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక కోసం ఇక మాఫియా గ్యాంగులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంత ధర ఉంది? ఇక్కడ ఎంత రేటు ఉంది? అని వాకబు చేయాల్సిన అవసరమూ లేదు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఇకపై ఇసుకను సరసమైన ధరలకు అందించనుంది. రాష్ట్రంలో ఎక్కడకు ఇసుక కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు నేరుగా కోరిన ప్రాంతానికే సరఫరా చేసే ఏర్పాట్లను ఈ సంస్థ చేస్తుంది. ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌లోకి వెళ్లి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఇసుక సరఫరాకు కొత్త విధాన ముసాయిదా (పాలసీ) రూపొందించింది. గత అయిదేళ్లుగా టీడీపీ నాయకులు సాగిస్తున్న ఇసుక మాఫియాకు చెక్ పెట్టడం, ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రభుత్వ రాబడి పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు పాత పాలసీని రద్దుచేసి కొత్త పాలసీ రూపొందించింది. ప్రజలకు పారదర్శక సుపరిపాలనే అజెండాగా పెట్టుకున్న కొత్త ప్రభుత్వం ఇసుక రేవులను ప్రయివేటు వ్యక్తుల కబంధ హస్తాల నుంచి తప్పించి ప్రభుత్వ అధీనంలో ఉంచాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానం (ముసాయిదా)– 2019ను రూపొందించింది. దీనిని ముఖ్యమంత్రి పరిశీలనకు పంపించి ఆమోదం పొందనున్నారు. అనంతరం కేబినెట్ ఆమోదంతో జీఓ జారీ చేయడం ద్వారా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. చిన్న చిన్న నదుల్లో ఉచితమే చిన్న చిన్న నదులు, వాగుల్లో ఇసుకను ప్రజలు సొంత అవసరాల కోసం ఉచితంగా తీసుకెళ్లవచ్చు. చిన్న చిన్న నదులు (వన్ టు థర్డ్ ఆర్డర్ రివర్ స్ట్రీమ్స్) జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణలోనే ఉంటాయి. వీటి నుంచి స్థానిక ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పనులకు కూడా వీటి నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు. పేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. చిన్న తరహా ప్రభుత్వ పనులకు సీనరేజి ఫీజు చెల్లించి వీటి నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చు. వీటిలో ఇసుక తవ్వకం, లోడింగ్‌కు యంత్రాలను వినియోగించరాదు. మండల పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు మాత్రమే వీటి నుంచి ఇసుకను తీసుకెళ్లవచ్చు. మండలం దాటి ఇసుకను ఈ చిన్న నదుల నుంచి తీసుకెళ్లకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. పెద్ద నదులన్నీ ఏపీఎండీసీకే కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, వంశధార లాంటి పెద్ద నదుల్లో (4, 5, అంతకంటే ఎక్కువ స్థాయి రివర్ స్ట్రీమ్స్‌లో) ఇసుక తవ్వకాలు జరిపి ప్రజలకు సరసమైన ధరకు విక్రయించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఎండీసీకి అప్పగిస్తుంది. ఇసుక తవ్వకాలు జరపడానికి చట్టబద్ధమైన, పర్యావరణ, ఇతర అనుమతులన్నీ జిల్లా కలెక్టర్లే తీసుకుంటారు. ఏపీఎండీసీ నోడల్ ఏజెన్సీగా ఉంటూ ప్రజలకు అవసరమైన ఇసుకను అందించే ఏర్పాట్లు చేస్తుంది. రేవుల నుంచి ఇసుకను తవ్వి ప్రజలకు (వినియోగదారులకు) అందించడానికి వీలుగా ఏపీఎండీసీతో ఆయా జిల్లా కలెక్టర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నదుల్లో తవ్విన ఇసుకను సమీపంలో స్టాక్ యార్డుల్లో ఏపీఎండీసీ నిల్వ చేస్తుంది. రాష్ట్రంలో 395పైగా పెద్ద పెద్ద ఇసుక రేవులు ఉన్నాయి. అయితే వీటిలో ప్రస్తుతానికి వందలోపు రీచ్‌లకు మాత్రమే పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి కూడా ఆయా జిల్లా కలెక్టర్లు పర్యావరణ, మైనింగ్ ప్లాన్, రీచ్ ఏర్పాటు, నిర్వహణ తదితర అనుమతులు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులు ఉన్న క్వారీల సమీపంలో ఏపీఎండీసీ ఇసుక స్టాక్ యార్డులు (నిల్వ కేంద్రాలు) ఏర్పాటు చేస్తుంది. క్వారీల్లో ఇసుక తవ్వకాలు సాగించి స్టాక్ యార్డులకు వాహనాల్లో తరలించేందుకు కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ఏపీఎండీసీ టెండర్లు పిలుస్తుంది. ఎలాంటి అక్రమాలకు, ఆశ్రిత పక్షపాతానికి వీలు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా రివర్స్ టెండరింగ్ విధానం అవలంబిస్తుంది. స్టాక్ యార్డుల నుంచి ప్రజలకు ఇసుకను అందించనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇలాంటి విధానమే అమల్లో ఉంది. అక్కడ ప్రస్తుతం టన్ను ఇసుక రూ.400 చొప్పున అమ్ముతున్నారు. ఇసుక తవ్వకం, లోడింగ్ తదితరాలకు అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కూడా ఇదే ధరను పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. (ప్రభుత్వ తుది నిర్ణయం ప్రకారం ధర మారవచ్చు.) వెబ్సైట్ క్లిక్ చేస్తే... ఇసుక కావాల్సిన వారు బుకింగ్ కోసం ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌ను క్లిక్ చేస్తే చాలు సమగ్ర వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ఏయే స్టాక్ యార్డుల్లో ఎంతెంత ఇసుక నిల్వ ఉందో కూడా అందులో కనిపిస్తుంది. సమీప ప్రాంతంలోని స్టాక్ యార్డు నుంచి ఇసుక సరఫరా కోసం బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా నందిగామ వాసులు ఇసుక కావాలంటే నందిగామ స్టాక్ యార్డు నుంచి బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల రవాణా వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. డీజిల్ ధర, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కిలోమీటరుకు ఇంతని ఏపీఎండీసీ అధికారులే ఇసుక రవాణాకు రేటు నిర్ణయిస్తారు. ఈ ధరతో ఇసుక రవాణా చేసే వాహనాల వారందరికీ ఏపీఎండీసీ ఇసుక సరఫరా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఏ రీచ్ నుంచి ఇసుక కావాలో క్లిక్ చేయగానే ధర వస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఇతర విధానాల ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు చెల్లించగానే వారికి ఇసుక బుకింగ్ అయినట్లు రిసీప్ట్ వస్తుంది. ఏపీఎండీసీలో శాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అని క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ వాహనాలు ఉన్నాయో (యాప్ ద్వారా ఓలా కార్లు /ఆటోలు బుక్ చేసుకుంటే కనిపించినట్లుగా) కనిపిస్తాయి. సమీపంలోని వాహనాన్ని బుక్ చేసుకుంటే చాలు కోరిన ప్రాంతానికి ఇసుకను తీసుకొస్తుంది. ఇసుక కోసం ఆన్లైన్లో చెల్లించిన మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. క్వారీ నుంచి ఇసుకను స్టాక్ యార్డుకు చేర్చడం లాంటి పనులకు అయిన మొత్తంతోపాటు కొంత సొమ్మును నిర్వహణ ఖర్చుల కింద యూజర్ ఏజెన్సీ అయిన ఏపీఎండీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల పనులకు డీసిల్టేషన్ ఇసుక నీటి పారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీల్లో వరద నీటితోపాటు ఇసుక వచ్చి పేరుకుంటుంది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. అందువల్ల వీటిలో డీసిల్టేషన్ ద్వారా ఇసుక వెలికి తీయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచాల్సి ఉంటుంది. జల వనరుల శాఖ ఇలా వెలికి తీసిన ఇసుకను సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగించుకోవాలి. జల వనరుల శాఖ డీసిల్టేషన్ ద్వారా ఇసుకను తవ్వడానికి అవసరమైన అనుమతులతో పాటు ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇసుక తోడినందుకు సీనరేజి చార్జీలతోపాటు ఇతరత్రా పన్నులను గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక తరలింపునకు కూడా ట్రాన్సిట్ పాసులను భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకుల నుంచి పొందాలి. ఒకవేళ రిజర్వాయర్లలో పేరుకున్న ఇసుకను తోడే బాధ్యతను జల వనరుల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తే వారు తవ్వించిన ఇసుకను ఏపీఎండీసీకి అప్పగించాలి. డీసిల్టేషన్‌కు అయిన మొత్తాన్ని ఏపీఎండీసీ చెల్లిస్తుంది. ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. పట్టా భూముల్లో ఇలా.. నదీ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన పట్టా భూముల్లో ఒక్కోసారి ఇసుక మేటలు వేస్తుంది. వరదల సమయంలో ఇలా పట్టా భూములు ఇసుక రేవుల్లా మారతాయి. ఇలాంటి భూముల్లో ఇసుకను తవ్వి విక్రయించడానికి రైతులతో ఏపీఎండీసీ ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇలా తవ్విన ఇసుక అమ్మగా వచ్చిన మొత్తంలో 10 శాతాన్ని భూ యజమానులైన రైతులకు ఇస్తారు. ఒకవేళ రైతులే నేరుగా తమ భూముల్లో ఇసుక తవ్వుకుంటామని కోరితే అనుమతిస్తారు. ఏపీఎండీసీ నిర్ణయించిన కనీస ధరతోపాటు వారు విక్రయించే అదనపు ధరలో 5 శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సొసైటీలకే అధికారం గిరిజన ప్రాంతాల్లోని ఇసుక తరలింపు కోసం పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ (పీసా) చట్టం కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇసుకపై గిరిజనులకే హక్కు ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇసుక తరలింపు బాధ్యతను గిరిజన సొసైటీలకే అప్పగిస్తారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని సొసైటీలకు ఇసుక తవ్వకాలు, తరలింపునకు అవసరమైన సాంకేతిక సçహకారాన్ని మాత్రం ఏపీఎండీసీ అందిస్తుంది. ఇందుకు సంబంధించి సమయానుకూలంగా నియమ నిబంధనలను జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారు. కృత్రిమ ఇసుక తయారీకి ప్రోత్సాహం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నదుల ఇసుక ఉత్పత్తి పెరగడం లేదు. అందువల్ల భవిష్యత్తులో సహజ సిద్ధమైన ఇసుక కొరత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. అందువల్ల నదీ ఇసుకకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ (రోబో) శాండ్ తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృత్రిమ ఇసుకను మాన్యుప్యాక్చర్డ్ (ఎం) శాండ్ అంటారు. ఎం.శాండ్‌ను తయారు చేసే సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ సంస్థలు కనీసం 50 శాతం కృత్రిమ ఇసుకను కచ్చితంగా వినియోగించాలనే నిబంధన కూడా పెట్టనున్నారు. కృత్రిమ ఇసుక తయారీకి ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహకాలను ఇంకా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు ఆదాయం పెంపే లక్ష్యం గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పేరుతో రవాణా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు శాండ్ మాఫియాకు తెరలేపారు. ముడుపులివ్వందే ఎవరినీ ఇసుక రేవుల్లోకి రానీయలేదు. వారు చెప్పిన మొత్తం ఇస్తేనే ఇసుక సరఫరా చేస్తూ వచ్చారు. ఇలా వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఇసుకను సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ రాబడిని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కారు కొత్త విధాన ముసాయిదా రూపొందించింది. -
నచ్చిన వారికి మెచ్చినంత!
సాక్షి, అమరావతి: పేరుకు అదో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. కానీ పారదర్శకతకు, ప్రభుత్వ నిబంధనలకు అక్కడ చోటే లేదు. మేనేజింగ్ డైరెక్టర్ మాటే వేదం. ఆయన ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా తనకు కావాల్సిన వారికి ముఖ్యమైన కాంట్రాక్టు పోస్టులిచ్చేస్తుంటాడు. అందులో తనకు నచ్చిన వారికి మెచ్చినంత వేతనం కూడా.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)లో సాగుతున్న తంతు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ముసుగులో ఒకే సామాజికవర్గం వారికి భారీగా పోస్టులు కట్టబెట్టారు. అత్యధిక పారితోషికమిచ్చే కాంట్రాక్టు పోస్టుల్లో దాదాపు ఒకే సామాజిక వర్గం వారే ఉన్నారని.. తమపై పెత్తనం చెలాయిస్తున్నారని మరోవైపు రెగ్యులర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు పాతర.. ముఖ్యమైన పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బందిని పెట్టకూడదంటూ ప్రభుత్వ నిబంధనలున్నాయి. దీన్ని కాలరాస్తూ ఏపీఎండీసీలో పలు కీలక(కోర్) పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బందిని పెట్టారు. రెగ్యులర్ సిబ్బందిపై ఈ కాంట్రాక్టు సిబ్బంది పెత్తనం చెలాయిస్తున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ అండదండలుండటంతో రెగ్యులర్ సిబ్బంది ఏమీ మాట్లాడలేక మౌనంగా భరిస్తున్నారు. ఏ సంస్థలో అయినా మానవ వనరుల అభివృద్ధి విభాగం చాలా ముఖ్యమైనది. ఉద్యోగుల పనితీరుపై రికార్డులు రూపొందించడం, నిర్వహించడం ఈ విభాగం బాధ్యతల్లో ముఖ్యమైనవి. ఉద్యోగుల పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, బదిలీల సమయంలో కూడా ఈ విభాగం నివేదికలకు ప్రాధాన్యముంటుంది. ఇంతటి కీలక విభాగం జనరల్ మేనేజరు(జీఎం, హెచ్ఆర్డీ) బాధ్యతలను రెండేళ్లుగా ఎ.వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నియమించిన ఈ ఉద్యోగికి నెలకు రూ.లక్ష పారితోషికం చెల్లిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏ సంస్థలో లేనివిధంగా.. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఇంత అడ్డగోలుగా అధిక పారితోషికంతో కాంట్రాక్టు సిబ్బందిని నియమించిన దాఖలాల్లేవు. ఏ సంస్థలోనైనా పెద్ద పోస్టుల్లో పనిచేసే సిబ్బంది కొరత ఉంటే.. ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై తెచ్చుకోవాలి. ఖాళీల గురించి ప్రభుత్వానికి సిఫారసు చేసి భర్తీ చేయించుకోవాలి. ఏపీఎండీసీలో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నా.. వీటిని భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా డిప్యుటేషన్‌పై కూడా తెచ్చుకోవడం లేదు. నిబంధనలను గాలికొదిలేసి అత్యధిక పారితోషికంతో నచ్చిన వారిని నియమించుకున్నారు. సంస్థ ఉన్నతాధికారి సామాజిక వర్గం వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. పైగా కీలక పోస్టుల్లో వీరిని పెట్టారు. కోల్(బొగ్గు)కు సంబంధించిన జనరల్ మేనేజర్ (జీఎం) పోస్టు అత్యంత కీలకమైనది. రూ.వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే జీఎం పోస్టులో కాంట్రాక్టు ఉద్యోగి అనంతనేని లక్ష్మణరావును నియమించారు. నెలకు రూ.లక్ష పారితోషికంతో రెండేళ్లుగా ఆయన ఈ స్థానంలో ఉన్నారు. ఎన్.వెంకటేశ్వరరావు అనే మరో కాంట్రాక్టు ఉద్యోగిని బొగ్గు విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా రెండేళ్లుగా కొనసాగిస్తునే ఉన్నారు. ఇలాంటి కీలక పోస్టులన్నీ ఇష్టారీతిన అప్పగించేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఖాళీల భర్తీకి చర్యలేవీ? ఏపీఎండీసీలో 481 మంది ఉద్యోగులుండాలి. కానీ ప్రస్తుతం 128 మందే ఉన్నారు. మరో 353 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘బాబు వస్తేనే జాబు’ అంటూ 2014 ఎన్నికల ముందు భారీగా ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన కార్యాలయంలో పనిచేసే వెంకయ్య చౌదరినే ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంపించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ ఒక్క పోస్టును కూడా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయలేదు. ఈ సంస్థలో ఏకంగా 643 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయిస్తుండటం గమనార్హం. మరోవైపు పారదర్శకంగా వ్యవహారాలు సాగుతున్నాయని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు చెబుతుండగా.. వాస్తవం పూర్తి భిన్నంగా ఉంది. అధిక పారితోషికమిచ్చే పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోవడమే పారదర్శకతకు పాతరేశారనేందుకు నిదర్శనమని పలువురు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అదానీలకు ప్రేమతో...
ఎన్నికల ముంగిట సీఎం చంద్రబాబు అవినీతి తవ్వకాలు తారస్థాయికి చేరిపోయాయి.అధికారం ఆఖరి క్షణాల్లో రూ.24 వేల కోట్లకుపైగా విలువైన బొగ్గు గనుల్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేస్తున్నారు. అది కూడా వేరెవరికో కాదు! తానిప్పుడు పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్న ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులైన అదానీ, ఎస్సెల్ గ్రూపులకి!. చిత్రమేంటంటే మోదీకి అత్యంత సన్నిహితుడిగా అందరికీ తెలిసిన ఇదే అదానీకి భావనపాడు పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు అప్పగించారు. విశాఖలో సోలార్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామంటే 500 ఎకరాలు ధారాదత్తం చేసి పది రోజుల కిందటే ఎంవోయూ కూడా చేసుకున్నారు. అదానీతో బొగ్గు బ్లాకుల చీకటి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుని... దాని ప్రకారం స్క్రీన్‌ప్లే నడిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఏపీఎండీసీకి ఉన్న విలువైన గనుల్ని అదానీ, ఎస్సెల్ గ్రూపులకు దక్కేలా అనుకూలమైన నిబంధనల్ని విధించడమే కాకుండా... వారికి పోటీ లేకుండా చేసి మరీ రివర్స్ వేలంలో అధిక ధరకు అప్పగిస్తున్నారు. అంటే ఆ బ్లాకుల్ని అప్పగించటమే కాకుండా అవి తవ్వి తీసే ప్రతి టన్నుకూ ఏపీఎండీసీ అత్యధిక ధర చెల్లించి కొంటుందన్న మాట. పనిగట్టుకుని పక్క రాష్ట్రాలు తిరిగి మరీ మోదీని విమర్శిస్తున్న చంద్రబాబు... ఆయన సన్నిహితులకు ఇంత భారీ ప్రాజెక్టులు అప్పగించటం వెనక అర్థమేంటి? రాష్ట్రాన్ని గుజరాత్‌లా మార్చటమంటే నిబంధనల్ని కాలరాసి మరీ ప్రాజెక్టులన్నీ అదానీకి అప్పగించటమా? మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీతో చంద్రబాబుకు తెరచాటు బంధం లేదంటే నమ్మగలమా? ఎస్సెల్‌కు.. రూ. 12,609.60 కోట్లు టన్ను బొగ్గు తవ్వకానికి ఎస్సెల్ రూ. 888 చొప్పున ధర కోట్ చేసింది.దీంతో మదన్‌పూర్ గని ఎండీవోగా ‘ఎస్సెల్’ను ఖరారు చేయనున్నారు. ఈ గనిలో సుమారు 187 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇందులో 142 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వవచ్చని అంచనా. టన్నుకు రూ. 888 ప్రకారం 142 మిలియన్ టన్నులు తవ్వినందుకు ఏపీఎండీసీ ఈ సంస్థకు రూ. 12,609.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా ఖనిజం తవ్వితే ఆ మేరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదానీకి.. రూ. 11,542 కోట్లు సులియారీలోని గనిలో 147 మిలియన్ టన్నుల ఖనిజం ఉండగా 116 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వవచ్చని అంచనా. టెండర్లలో దీనిని దక్కించుకున్న అదానీ గ్రూపునకు టన్నుకు రూ. 995 చొప్పున 116 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వినందుకు ఏపీఎండీసీ రూ. 11,542 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సాక్షి, అమరావతి: ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డబ్బులు వెదజల్లే అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. కమీషన్ల కోసం, అందుకు సహకరించే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని వారితో రాయబారాలు నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన బొగ్గు గనుల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ దీనికి ఉదాహరణ. ఎప్పుడో ఏడాది క్రితం మొదలైన ఈ ప్రక్రియ ఎన్నికల సమయంలో క్లైమాక్స్‌కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ‘టెయిలర్ మేడ్’ నిబంధనలు రూపొందించి తమకు కమీషన్లు చెల్లించేవారివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ బొగ్గు గనుల నిర్వహణ టెండర్ల వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలిసింది. అనంతరం రెండు సంస్థలతో మాట్లాడుకుని రివర్స్ టెండర్ల ద్వారా గనులు అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇటీవల అమరావతిలో పర్యటించిన అనంతరం ఆ గ్రూప్‌నకు సులియారి బొగ్గు గని అభివృద్ధి నిర్వహణ (ఎండీవో) కట్టబెట్టేలా రంగం సిద్ధం కావడం గమనార్హం. నిజానికి ఈ టెండర్లు ఏడాది క్రితమే పిలిచారు. ఐదు సంస్థలు ఇందులో ఎంపిక కాగా తమకు నచ్చినవారికి అప్పగించేందుకే ఇంతకాలం సాగదీసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక నేడే రేపో ఈ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికల వ్యయం కోసం డబ్బులు ముందుగానే ముట్టజెప్పే సంస్థలతో ఒప్పందాలు చేసుకుని తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినట్లు మైనింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమరావతి పర్యటన వెనుక మతలబు? ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని సులియారి, సౌత్ మదనపూర్‌లో బొగ్గు బ్లాకులున్నాయి. బంగారు బాతుల్లాంటి వీటిని తనకు అనుకూలమైన సంస్థలకు కట్టబెట్టి వాటాలు పొందాలని ఎత్తుగడ వేసిన ముఖ్యనేత ఏపీఎండీసీని పావుగా మార్చుకుని తనకు అనుకూలమైన పెద్ద సంస్థలు మాత్రమే బిడ్డింగులో పొల్గొనేలా నిబంధనలు రూపొందించారు. టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన సంస్థలను కలసిన ఓ కీలక అధికారి ముఖ్యనేత ఆంతర్యాన్ని వివరించారు. అనంతరం బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణ (ఎండీవో) ఎంపిక కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచారు. మౌఖిక సంప్రదింపుల ద్వారా మరికొన్ని సంస్థలను టెండర్ల నుంచి తప్పించడంలో ఆ కీలక అధికారి పాత్ర పోషించారు. సాంకేతిక టెండర్లలో అర్హత సాధించిన రెండు సంస్థల యాజమాన్యాలతో ఇటీవల సమావేశమైన ‘ముఖ్య’నేత వాటాలపై సంప్రదింపులు జరిపారు. పది రోజుల క్రితం అమరావతిలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ పర్యటన అనంతరం సులియారి ఎండీఓ కాంట్రాక్టు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు కట్టబెట్టేలా రివర్స్ వేలంలో మంత్రాంగం నడిచినట్లు పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ సమీపంలో సోలార్ డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో ఇదే గ్రూపు కోసం 500 ఎకరాలను ప్రభుత్వం అప్పగించడం గమనార్హం. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా... దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇదే తరహా పనుల కోసం నిర్వహించిన టెండర్లలో అనుసరించిన నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ వ్యవహరించడం విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఎక్కువ సంస్థలు పోటీపడే అవకాశం కల్పించాలంటూ చేసిన విజ్ఞప్తులను ఏపీఎండీసీ పెడచెవిన పెట్టింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ చేసిన కేటాయింపుల్లో మదన్‌పూర్ దక్షిణ, సులియారి బొగ్గు గనులు ఏపీఎండీసీకి లభించాయి. వీటి అభివృద్ధి, నిర్వహణ సంస్థను ఎంపిక చేసేందుకు మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) ద్వారా ఏపీఎండీసీ ఇ– టెండర్లు (ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు) ఆహ్వానించింది. ఈమేరకు గత ఏడాది మార్చి 19వ తేదీన టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలను ‘సాక్షి’ ముందుగానే బహిర్గతం చేసింది. ఈమేరకు 2018 మే 2వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘బొగ్గు గనుల్లో మేత’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అది నిజమేనని ఈరోజు తేలింది. రివర్స్ వేలం ఇదీ.. మొదటి దశ టెండర్లలో అర్హమైనవిగా నిర్ణయించిన సంస్థలకు మాత్రమే తాజాగా రివర్స్ వేలం నిర్వహించారు. ఒక రేటు నిర్ణయించి దాని నుంచి ఏ సంస్థ తక్కువకు కోట్ చేస్తే దానికి టెండరు అప్పగించే విధానాన్ని రివర్స్ వేలం అంటారు. రివర్స్ వేలంలో రెండు గనులను దక్కించుకున్న సంస్థలకు బొగ్గు తవ్వినందుకుగానూ ఏపీఎండీసీ కనీసం రూ. 24,151.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 24 వేల కోట్లకు పైగా విలువైన ఈ కాంట్రాక్టు పనులను ఎన్నికల ముందు హడావుడిగా రెండు సంస్థలకు కట్టబెట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకింత రహస్యం? సాధారణంగా టెండరు నోటిఫికేషన్‌ను ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని అర్హతలు, నిబంధనలు, పనుల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఏపీఎండీసీ బొగ్గు గనుల ఎండీవో ఎంపిక టెండర్ల విషయంలో ఈ నిబంధనలను గాలికొదిలేసింది. సంస్థ వెబ్సైట్ టెండరు ప్రకటనలో కేవలం ఎండీఓ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. ఆసక్తి కలిగినవారు ఎంఎస్టీసీలో పేర్లు నమోదు చేసుకుని రూ. 50 వేల దరఖాస్తు రుసుము చెల్లించి నిబంధనలు తెలుసుకోవచ్చని పేర్కొంది. నిబంధనలు, పనుల వివరాలు తెలుసుకోవడానికి అంత డబ్బు కట్టాలని షరతు విధించడాన్ని బట్టే ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏపీఎండీసీ గతంలో బెరైటీస్ ఖనిజ తవ్వకాలకు ఎంఎస్టీసీ ద్వారానే ఇ– టెండర్లు పిలిచింది. అయితే అప్పుడు నిబంధనలన్నీ టెండరు నోటిఫికేషన్లోనే పేర్కొంది. ఇతర సంస్థలకు భిన్నంగా.... నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తలైపల్లి, మదన్‌పూర్ సౌత్ బొగ్గు గనులు, పశ్చిమ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీపీడీసీఎల్) పచ్వారా కోల్‌బ్లాకు, తెలంగాణ స్టేట్ జెన్కో తాడిచెర్ల –1 కోల్బ్లాకుకు ఎండీఓల ఎంపిక కోసం ఇ– టెండర్లు పిలిచాయి. అయితే ఈ సంస్థలు పేర్కొన్న సాంకేతిక అర్హతలకు భిన్నంగా ఏపీఎండీసీ షరతులు విధించింది. అధిక పరిమాణంలో బొగ్గు తవ్విన అనుభవం ఉన్న సంస్థలే టెండర్లలో పాల్గొనేలా షరతులు పెట్టింది. స్పందించని ఏపీఎండీసీ అధికారులు రివర్స్ వేలంలో అదానీ, ఎస్సెల్ తక్కువ మొత్తం కోట్ చేసి ఎల్–1గా నిలిచాయని, వీటికే ఆయా గనుల ఎండీవో కాంట్రాక్టును అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే ఏపీఎండీసీకి ఈ కాంట్రాక్టును ఖరారు చేసే అధికారంతోపాటు రద్దు చేసే అధికారం కూడా ఉంది. వివరాలు లీక్ అయ్యాయని భావిస్తే కాంట్రాక్టును రద్దు చేసే అధికారం కూడా ఉందని సమాచారం. ఈ విషయంపై ఏపీఎండీసీ అధికారులను వివరణ కోరడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా స్పందించలేదు. ఎండీవో అంటే....? ఎండీవో అంటే మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ అని అర్థం. ఓ బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ అధికారం మొత్తం ఎండీవోకే ఉంటుంది. నిర్దేశిత ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను పూర్తిగా వెలికితీసే వరకూ ఆ ప్రాంతంపై పూర్తి హక్కులు ఎండీఓకే ఉంటాయి. అంటే ఇది జీవితకాల కాంట్రాక్టు. ఉదాహరణకు ఏపీఎండీకి చెందిన మదన్‌పూర్ గనిలో సుమారు 187 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇందులో 142 మిలియన్ టన్నుల దాకా బొగ్గు తవ్వవచ్చని అంచనా. (భద్రతా ప్రమాణాల దృష్ట్యా కొంత ఖనిజాన్ని తవ్వరు). ఇక సులియారీలోని గనిలో 147 మిలియన్ టన్నుల ఖనిజం ఉండగా 115 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వవచ్చని అంచనా. నిబంధనల ప్రకారం గని నిర్వహణతోపాటు తవ్వకాలు జరిపి ఓవర్ బర్డన్ (వృథా మట్టి)ని తొలగించి విక్రయానికి పనికొచ్చే బొగ్గును ఏపీఎండీసీకి అప్పగించాల్సిన బాధ్యత ఎండీవోదే. ఈ రెండు గనుల ఎండీవోల ఎంపిక కోసం ఏపీఎండీసీ వేర్వేరుగా ఇ –టెండర్లు నిర్వహించినా దాదాపుగా అవే సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, సైనిక్ మైనింగ్, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీజీఆర్ – ఎస్ఐసీఏఎల్ కన్సార్టియం బిడ్‌లో అర్హత పొందాయి. -
ఏపీఎండీసీ ఎండీనా.. టీడీపీ నాయకుడా..?
వైఎస్ఆర్ జిల్లా, మంగంపేట(ఓబులవారిపల్లె): కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగంపేట నిర్వాసితులు సోమవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఏపీఎండీసీ అధికారులు పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. దీక్షలకు మద్దతు ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వత్తలూరు సాయికిశోర్రెడ్డితో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబులను సైతం మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు వందల మంది పోలీసు బలగాలను మోహరించి మంగంపేట పరిపాలన భవనం దారులన్నీ దిగ్బంధం చేసి అటువైపు ఎవరినీ అనుమతించలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీఎండీసీ ఎండీ వెంకయ్య చౌదరి ఓ ప్రభుత్వ అధికారిలా వ్యవహరించడం లేదని టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీఎండీసీ ఎండీ మాటలు విని పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేందుకు సిద్ధపడ్డారా అని ప్రశ్నించారు. రిలే నిరాహారదీక్షల ద్వారా గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని కోరడం తప్పా అని నిలదీశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి అందుకు విరుద్ధంగా తెలుగుదేశంపార్టీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అతని మాటలు విని ప్రజా ప్రతినిధి అయిన తనను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ మంగంపేట నిర్వాసితుల రిలేనిరాహారదీక్షలను అడ్డుకునేందుకు ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి ఇంతమంది పోలీసులను మోహరించి భగ్నం చేయడం అప్రజాస్వామ్యం అన్నారు. మంగంపేట ఏపీఎండీసీ ప్రారంభం అయిన నాటినుంచి వచ్చిన ఎండీలు ప్రజల సమస్యలు విని వాటినిపరిష్కరించే వారని, అయితే ప్రస్తుతం ఉన్న ఎండీ ప్రజల సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం చేయకుండా, న్యాయం చేయమని అడిగిన ప్రజలను అణగదొక్కేందుకు పోలీసుల సహకారం తీసుకోవడం తగదన్నారు. నిర్వాసితుల సంఘం ప్రతినిధి గల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ తాము న్యాయపరంగానే ముందుకు వెళతామని మంగంపేట గనుల్లో ఏ విధంగా మైనింగ్ చేస్తారో చూస్తామన్నారు. కౌలూరు మధురెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు పోరాటం సాగిస్తామని తెలిపారు. మంగంపేట కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ గ్రామాల ప్రజలను ఏపీఎండీసీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, పులపత్తూరు రామసుబ్బారెడ్డి తదితర నాయకులు గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ ఎండీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంగంపేట, కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ, అగ్రహారం గ్రామస్తులకు 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని, భూసేకరణలో జరిగిన తప్పులను సవరించాలని, నిర్వాసితులకు ఒప్పందం ప్రకారం డీజెడ్లు, ఇంటిపట్టాలు, ఉద్యోగభద్రత, కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీఎండీసీ కార్యాలయం వైపు దూసుకెళుతున్న మహిళలు, గ్రామస్తులు, నాయకులను రాజంపేట ఇన్చార్జి డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గల్లా శ్రీనివాసులు, గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, పులపత్తూరు రామసుబ్బారెడ్డి, వడ్డి సుబ్బారెడ్డి, కౌలూరు మధుసూదన్‌రెడ్డి, పోతుల లక్ష్మీనారాయణ, మధురెడ్డి, కౌలూరు బ్రహ్మానందరెడ్డి మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పుల్లంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకులను అదుపులోకి తీసుకున్న వెంటనే కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ గ్రామాల ప్రజలు, మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి వారితో మాట్లాడి శాంతపరిచారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రిలేనిరాహారదీక్షలు కొనసాగిస్తామని నిర్వాసితుల సంక్షేమసాధన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. మంగంపేట లారీ, టిప్పర్ అసోసియేషన్ స్వచ్ఛందంగా రిలే నిరాహారదీక్షలకు మద్దతుగా లారీలను నిలిపివేసింది. అంతేకాకుండా త్రివేణీ ఎర్త్మూవర్స్లో పనిచేస్తున్న స్థానికులు కూడా రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా తమ విధులను బహిష్కరించారు. ప్రభుత్వ వైఖరితోనే మంగంపేట వాసులకు అన్యాయం రైల్వేకోడూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే మంగంపేట ముగ్గురాయి గనులలో పనిచేసే కార్మికులు, మిల్లుల యజమానులు, భూములిచ్చిన స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు విమర్శించారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత విస్మరించి పరిపాలిస్తోందన్నారు. మిల్లులకు ప్రభుత్వ ముగ్గురాయి గతంలో లాగా సక్రమంగా సరఫరా చేసి ఉంటే మిల్లులు మూత పడే పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి గనులశాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి, గ్రామ పరిరక్షణ కమిటీ, కార్మిక నాయకులు సమావేశమై చర్చలు జరిపి న్యాయం చేయాలన్నారు. -
ఖనిజం మాటున చేదు నిజం
సాక్షి, ఓబులవారిపల్లె/అమరావతి: మన దగ్గర ఒక వస్తువుంటే ఏం చేస్తాం... ఎంతో కొంత లాభానికి విక్రయిస్తాం. అమ్మకందారుడు ఎవరైనా సరే కొనుగోలుదారుల మధ్య పోటీని పెంచడం ద్వారా అధిక ఆదాయం పొందాలను కుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అందుకు మినహాయింపు. తన దగ్గరున్న విలువైన బెరైటీస్ ఖనిజం ధరను వీలైనంత తగ్గించేం దుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ ధరకు కొనుగోలుదారుకు అమ్మేందుకు తాపత్రయ పడుతోంది. బెరైటీస్ ధరలను తగ్గించడం, పోటీ లేకుండా సంస్థల మధ్య రాజీ కుదర్చడం ద్వారా కనీస ధరలకే ఖనిజాన్ని కట్టబెట్టేస్తోంది. తద్వారా కొనుగోలుదారుకు అధిక లాభాలు చేకూరేలా చేసి, అందులో భారీగా ముడుపులు అందుకునేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పన్నాగానికి తగ్గట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లకోసం రాష్ట్ర ఖజానాకు రూ.400 కోట్లు నష్టం కలిగించడానికి సైతం వెనుకాడని ఏపీఎండీసీ వ్యవహారమిది. మూడుసార్లు తగ్గింపు... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్ జిల్లా మంగంపేట ప్రాజెక్టులోని బెరైటీస్ ధరలు తగ్గించేందుకు ఏపీఎండీసీ కష్టపడుతోంది.ఇలా గత ఏడాది బెరైటీస్ ధరలు తగ్గించడం ద్వారా రూ. 150 కోట్లు సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. అలాగే బెరైటీస్ ఖనిజ తవ్వకం టెండర్లలో కాంట్రాక్టర్లను రింగుగా మార్చి అధిక ధరకు ‘చెన్నైకి చెందిన ‘త్రివేణి’కి కాంట్రాక్టు కట్టబెట్టారు. తద్వారా రూ. 531 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూర్చినందుకు ప్రభుత్వ ముఖ్యనేత అందులో సింహభాగం వాటా పొందారని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా అదే విధంగా వాటా పొందేందుకు ముందస్తు రంగం సిద్ధం చేయించారు. ఆ మేరకు 22 లక్షల టన్నుల బెరైటీస్ అమ్మకానికి టెండర్లు ఆహ్వానిస్తూ ఏపీఎండీసీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో బెరైటీస్ ధరలకు అనుగుణంగా శాస్త్రీయ విధానంలో ధరలు ఖరారు చేయాలని, ఇందుకు అడ్డుగా ఉన్న (తెలుగుదేశం ప్రభుత్వం 2015 జనవరి 27వ తేదీన జారీ చేసిన) జీవో 22ను రద్దుచేయాలంటూ ఏపీఎండీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఏడాది జూలై నాలుగో తేదీన ప్రభుత్వానికి లేఖ రాశారు. థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసి దాని సూచనలను పరిశీలించి ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ నిర్ణయా« ధికారాన్ని ఏపీఎండీసీ పాలకమండలికే అప్పగిస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జీవో నంబరు–262 జారీ చేసింది. దీంతో ఏపీఎండీసీ ఒక ప్రైవేటు సంస్థ నుంచి నివేదిక తెప్పించుకుని బెరైటీస్ ధరలను భారీగా తగ్గించి టెండర్లు పిలిచింది. దీనివల్ల ఏపీఎండీసీ ఖజానాకు జరిగే నష్టం రూ.400 కోట్ల పైమాటేనని అంచనా. ఇది చాలదన్నట్లుగా... టెండరును దక్కించుకున్న వారు కొనుగోలు చేసుకునేందుకు చేసుకున్న ఒప్పందంలోని ఖనిజం పరిమాణంలో 40 శాతం కొనుగోలు చేస్తే తాయిలంగా ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీన్ని అధికార వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు బెరైటీస్ కొనుగోలు చేసే, ఎగుమతి చేసే పెద్ద సంస్థల వారితో ఏపీఎండీసీ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ఇలా ధరలు తగ్గించాయని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక మర్మం ఏమిటని కొందరు పల్వరైజింగ్ మిల్లుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు టెండర్ కాలపరిమితి ముగియగా... మరోవైపు టెండర్ నిర్వహించేలోపు ఒక ప్రైవేటు సంస్థకు 70 వేల టన్నుల ఖనిజం డెలివరీ ఆర్డర్ ఇవ్వడాన్ని బట్టే గూడుపుఠాణి నడుస్తున్నట్లు స్పష్టమవుతోందని అధికారులు అంటున్నారు. టెండర్లలో పాల్గొనేందుకు స్థానికంగా ఉన్న మిల్లుల యజమానులకు, వ్యాపారులకు ఆర్థిక పరమైన స్థోమత (అర్హత) లేకపోవడంతో కొంతమంది ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కైవసం చేసుకునేందుకే కనీస ధరను తగ్గించేలా చేశారని బహిరంగంగానే కిందిస్థాయి అధికారులు అంటున్నారు. ఒకవైపు ఖనిజ విక్రయ ధరలను తగ్గిస్తూ మరో వైపు బెరైటీస్ తవ్వకం రేటు పెంచుతూ పోవడం సంస్థ మనుగడకే ప్రమాదమని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల సంస్థ లాభాల నుంచి నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు భయపడుతున్నారు. రూ.400 కోట్లకు పైగా నష్టం ఇలా.. - టన్ను ‘ఎ’ గ్రేడ్ ఖనిజం కనీస ధర గతంలో రూ.6,750 ఉండగా దీనిని తాజా టెండరు నోటిఫికేషన్లో రూ.4,000కు తగ్గించింది. టన్నుకు తగ్గించిన మొత్తం రూ.2,750. ఈ లెక్కన 8.5 లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్ ఖనిజ విక్రయంవల్ల సంస్థకు కలిగేనష్టం. రూ.233 కోట్లు - టన్ను ‘బి’ గ్రేడ్ ఖనిజం కనీస ధర గతంలో రూ.5,360 ఉండగా రూ.3,000కు తగ్గించింది. టన్నుకు తగ్గిన ధర రూ.2,360 ప్రకారం 2.5 లక్షల టన్నుల అమ్మకంవల్ల సంస్థకు కలిగే నష్టం రూ.59 కోట్లు - టన్ను ‘సి’ ప్లస్ ‘డి’ ప్లస్ డబ్ల్యూ ఖనిజం గతంలో రూ.2,500 ఉండగా ప్రస్తుతం కనీస ధరను రూ.1,500కు తగ్గించింది. టన్నుకు తగ్గించిన మొత్తం రూ.1000. మొత్తం 11 లక్షల టన్నులు విక్రయానికి టెండర్లు పిలిచింది. దీనివల్ల ఏపీఎండీసీకి కలిగే నష్టం. రూ.110 కోట్లు మొత్తం ఏ, బీ, సీ... గ్రేడ్లకు సంబంధించి 22 లక్షల టన్నుల ఖనిజానికి కనీస ధర తగ్గింపు వల్ల ఏడాదికి కలిగే నష్టం రూ.402 కోట్లు ఉంటుందని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
పర్యావరణానికి తూట్లు
⇒ ఏపీఎండీసీ గనుల్లో తవ్వకాలు ⇒ కాలుష్యం కోరల్లో మంగంపేట ఓబులవారిపల్లె: పర్యావరణ నిబంధనలతోపాటు చట్టాలు సైతం కాంట్రాక్టర్ చుట్టాలు అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నామనే ధ్యాస మరచి ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు జరుపుతున్నారు. రాయలసీమ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ రాజ్యసభసభ్యుడు బినామీగా చెప్పుకొనే కాంట్రాక్టర్ మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో జరుగుతున్న తవ్వకాల గురించి ప్రశ్నించే అధికారి లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అధికారులు సూచించిన ప్రాంతంలో కాకుండా తనకు ఇష్టంవచ్చిన చోట కాంట్రాక్టర్ తవ్వకాలు జరుపుతున్నాడు. దీనివల్ల గనుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏపీఎండీసీ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగామట్టి నిల్వలు: గనుల నుంచి తోడే వృథా మట్టిని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ ప్రాంతీయ గనుల భధ్రత సంచాలకులు కాంట్రాక్టర్‌తో పాటు ఏపీఎండీసీ అధికారులను హెచ్చరించారు. డంపింగ్ చేసే ప్రాంతం 120 మీట్లర్ల ఎత్తు ఉండాలనే నిబంధలు ఉన్నా అంతకు మించి ఎత్తు పెరిగింది. దీంతో వాహనాలు మొరాయిస్తున్నారు. రెండునెలల కిందట ఏపీఎండీసీ గనుల్లో ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్ మసిపూసి మారేడుకాయ చేసి జరిగిన సంఘటనలను బయటకు పొక్కనీయలేదు. ఇందుకు ఏపీఎండీసీ మేనేజ్మెంట్ సైతం వంతపాడింది. అగచాట్లు పడుతున్న గ్రామస్థులు గ్రామాలకు కేవలం 200మీటర్లలోపు ఏపీఎండీసీ అధికారులు వృథామట్టి నిల్వలను చేపడుతున్నారు. వృథామట్టి వల్ల ధూళి కాలుష్యం మూడు గ్రామాలను కప్పేస్తోంది. ఈ విషయాన్ని బాధిత గ్రామాలప్రజలు అధికారులు దృష్టికి తీసుకెళితే అడవిలో కేక వేసినట్టుంది తప్ప స్పందనలేదు.గనుల్లో నిర్వహించే డ్రిల్లింగ్, పేలుళ్లతో ఇప్పటికే మంగంపేట, కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతీవాడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. ఇటీవల ఏపీఎండీసీవారు రెవెన్యూశాఖ ద్వారా గనుల విస్తరణకు మంగంపేట పరిసర ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టారు. కేవలం ఏపీఎండీసీవారి అవసరాలకోసం భూసేకరణ చేశారే గానీ బెరైటీస్ గనుల సమీపంలోని గ్రామాల గురించి ఆలోచించలేదు. దీంతో ఆ గ్రామాలనుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంగంటపే గనుల్లో జరిపే చర్యలవల్ల వందలాది మంది శ్వాసకోస వ్యాధులకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదపు టంచులలో ఉన్న గ్రామాల గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గనుల్లో జరిగే పేలుళ్లవల్ల పక్కాగృహాలు బీటలు వారుతున్నాయి. ప్రస్తుత బెరైటీస్ గనుల విస్తీర్ణాన్నిబట్టి సుమారు 35 హెక్టార్ల వరకు పచ్చదనాన్ని పెంచి కాలుష్యాన్ని నివారించాలని చట్టాలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రికార్డుల్లో మాత్రం మొక్కల పెంపకం భద్రంగా ఉన్న లక్షలాదిరూపాయలు దుర్వినియోగంమైన ట్లు విమర్శలు ఉన్నాయి. అధికారపార్టీ అండదండలతో ఏపీఎండీసీ గనుల తవ్వకాలను చేపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. -
సార్వత్రిక సమ్మెకు ఏపీఎండీసీ మద్దతు
మంగంపేట(ఓబులవారిపల్లె): దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీన జరిగే సార్వత్రికసమ్మెకు ఏపీఎండీసీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరి కొరముట్ల శ్రీనివాసులు సిపివో కేథార్‌నా«ద్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీసవేతనం రూ.18వేలు ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని వారు డిమాండ్‌చేశారు. సమ్మెకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మురళి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజధానికి ఓర్వకల్లు ఇసుక!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రాయలసీమలోని ఇసుకను వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లుపై ప్రధానంగా దృష్టి సారించింది. ఓర్వకల్లు ప్రాంతంలో భూగర్భంలో భారీ పరిమాణంలో ఇసుక ఉందని ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. దీంతో అక్కడ ఎంత ఇసుక లభిస్తుందో అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఎండీసీ అధికారులు ఆ ప్రాంతంలోని భూగర్భంలో ఇసుక లభ్యత అంచనా వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏపీఎండీసీ డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. భూగర్భంలో ఇసుక... ఓర్వకల్లు ప్రాంతంలో తెల్లని కనికరాళ్లను పోలిన క్వార్ట్జ్‌గుట్టలు ఉన్నాయి. ఈ ఖనిజం కింద భూగర్భంలో 15-20 మీటర్ల లోతులో పెద్ద పరిమాణంలో ఇసుక ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. ఓర్వకల్లు ప్రాంతంలో మొత్తం ఎంత పరిమాణంలో ఇసుక ఉంది? అది నిర్మాణాలకు పనికి వస్తుందా? ఇది సహజ సిద్ధమైన ఇసుకా? సిలికా శాండా..? అనే అంశాలను నిర్ధారించడంతో పాటు దానిని నిర్మాణాలకు వాడవచ్చా? లేదా తెలియజేయాలని ప్రభుత్వం ఏపీఎండీసీకి సూచించింది. దీంతో ఆ సంస్థ అధికారులు అక్కడ డ్రిల్లింగ్ పనులకోసం రిగ్గులను ఏర్పాటు చేశారు. అయితే డ్రిల్లింగ్ చేస్తుంటే డ్రిల్లింగ్ బిట్లు (రాతిని కత్తిరించే రాడ్లు) విరిగిపోతుండటం సమస్యగా మారింది. క్వార్ట్జ్‌రాయి గట్టితనంవల్ల డ్రిల్లింగ్ బిట్లు విపరీతంగా దెబ్బతింటున్నాయని క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెలిసింది. గాజు పరిశ్రమలకు ఉపయోగం.. 'ప్రస్తుతం ఓర్వకల్లు ప్రాంతంలోని క్వార్ట్జ్, సిలికా ఇసుక గాజు పరిశ్రమలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ ఖనిజం కింద సాధారణ ఇసుక ఉందని గతంలో ఎవరికీ తెలియదు. సాధారణంగా ఇక్కడ సిలికా మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భవన నిర్మాణాలకు వినియోగించే ఇసుక ఉందని ప్రభుత్వానికి ఎలా తెలిసిందో మాకు తెలియదు. మరికొన్ని రోజులు డ్రిల్లింగ్ చేస్తేగానీ ఈ ప్రాంతంలోని భూగర్భంలో నిజంగా ఇసుక ఉందా? ఇది నిర్మాణాలకు ఉపయోగపడేంత నాణ్యమైనదా? కాదా? అనేది తేలదు. ఇది నిర్మాణాలకు ఉపయోగపడితే మాత్రం రాజధాని నిర్మాణ పనులకు వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది' అని ప్రభుత్వ వర్గాలు 'సాక్షి'కి ధ్రువీకరించాయి. -
ఏపీఎండీసీకి మొండిచేయి
* చీమకుర్తిలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ప్రైవేటు సంస్థలకే * ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రతిపాదనను తిరస్కరించిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఒంగోలు-నంద్యాల రహదారిలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలను తమకు రిజర్వు చేయాలంటూ ఏపీఎండీసీ చాలా ఏళ్ల కిందటే దరఖాస్తు చేసింది. ఈ అత్యంత విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకే కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వివరాల్లోకెళ్తే.. ఒంగోలు-నంద్యాల రహదారిలో చీమకుర్తి వద్ద (24-28 కిలోమీటర్ల మధ్య) భారీ పరిమాణంలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని తేలింది. దీంతో ఈ నిక్షేపాలను తమకు కేటాయించాలని గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. అయితే గనుల తవ్వకాలు చేపడితే వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన అప్పటి ప్రభుత్వం తవ్వకాల విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించి, మైనింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. కాగా ఆరునెలల క్రితం బైపాస్ రహదారి నిర్మాణం ప్రార ంభమైంది. దీంతో గ్రానైట్ మైనింగ్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. దీంతో ఏపీఎండీసీకే ఈ గ్రానైట్ నిక్షేపాలను రిజర్వు చేయాలని భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదననను తిరస్కరించి టెండర్ల ద్వారానే గ్రానైట్ లీజు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా ఉండే టెండర్ల విధానాన్ని అనుసరించాలనే ఫైలుపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం మేజర్ మినరల్స్‌కు అమల్లోకి తెచ్చిన కొత్త విధానం ప్రకారం టెండర్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తేలని విస్తీర్ణం ఒంగోలు - నంద్యాల రోడ్డులో 24-28 కిలోమీటర్ల మధ్య ఎన్ని మీటర్ల వెడల్పు, లోతు వరకూ ఖనిజాన్ని తవ్వాలనే అంశంపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టత లేదు. వాస్తవంగా 60 మీటర్ల వెడల్పు రోడ్డు (భూమి) మాత్రమే ప్రభుత్వానికి చెందినది. అందువల్ల ఈ 60 మీటర్ల వెడల్పు వరకూ గ్రానైట్ తవ్వకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రభుత్వం మాత్రం 130 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల లోతు వరకూ గ్రానైట్ తవ్వాలని ఒక ప్రతిపాదన రూపొందించింది. దీనిద్వారా రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి 216 కోట్లు వస్తుందని అంచనా. 130 మీటర్ల వెడల్పు 80 మీటర్ల లోతు వరకూ తవ్వకాలు జరపాలనేది మరో ప్రతిపాదన. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 339 కోట్ల రాయల్టీ వస్తుందనేది మరో ప్రతిపాదన. ప్రస్తుత సీనరేజి ప్రకారమే ఈ రాబడి వస్తుందని, పూర్తిస్థాయిలో ఖనిజ నిక్షేపాల అంచనా అనంతరం టెండర్లలో సంస్థలు పోటీ పడేదానిపై రాబడి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పట్టాభూములు ఎలా.. 130 మీటర్ల వెడల్పు వరకూ గ్రానైట్ తవ్వకాలు జరపాలంటే పట్టా భూములను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు సమయం పడుతుందని, కొత్త భూసేకరణ పాలసీ ప్రకారం భూముల సేకరణ వ్యయం భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఎంత విస్తీర్ణంలో తవ్వకాలకు టెండర్లు పిలవాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ రోడ్డు కింద తవ్వకాలు చేపడితే బైపాస్ రోడ్డులో వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. -
ప్రైవేటు బాటలో బెరైటీస్?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కి 95 శాతం రాబడి సమకూర్చుతున్న అత్యంత కీలకమైన మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టును ప్రైవేటుపరం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వైఎస్సార్ జిల్లా మంగంపేటలో 225 హెక్టార్లలో విస్తరించి ఉన్న బెరైటీస్ ప్రాజెక్టును దేశంలో దిగ్గజ ప్రైవేటు సంస్థల్లో ఒకదానికి కట్టబెట్టేందుకు మంత్రాంగం నడుస్తోంది. బెరైటీస్ ప్రాజెక్టు ప్రైవేటుకు వెళితే ఏపీఎండీసీ మూతపడుతుందని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. బెరైటీస్ ప్రాజెక్టును ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారనే సమాచారం అందడంతో మంగంపేటలోని 172 మిల్లుల యజమానులు, వాటిలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా కలవరానికి గురై అధికారులను వాకబు చేస్తున్నారు. ఏమి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో అధికారులు అవుననీ, కాదనీ చెప్పకుండా తమకేమీ తెలియదని దాటవేస్తున్నారు. కానీ ప్రభుత్వం గత కొంతకాలంగా అనుసరిస్తున్న విధానాలు ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తి గా బలపరిచేలా ఉండటం గమనార్హం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చైనా, మొరాకో దేశాల్లో బెరైటీస్ నిల్వలు, గల్ఫ్ దేశాల్లో ఈ ఖనిజానికి ఉన్న డిమాండు, మంగంపేటలో ఉన్న ఈ ఖనిజ నిల్వల పరిమాణంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన దేశస్థాయిలో పేరున్న ఒక ప్రైవేటు సంస్థ బెరైటీస్ ప్రాజెక్టును కైవసం చేసుకునేందుకు చకచకా పావులు కదుపుతోంది. మొదటినుంచి ఈ సంస్థతో ఉన్న లావాదేవీలు, వ్యక్తిగతంగా కలుగనున్న భారీ ఆర్థిక లబ్ధిని దృష్టిలో పెట్టుకుని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టును ఈ సంస్థకు కట్టబెట్టేందుకు కీలక నేత ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. అధికార పక్ష కోటరీలో ముఖ్యుడిగా ఉన్న ఎంపీ ఒకరు ఈ అనధికారిక డీల్ ఖరారులో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. నామమాత్రంగా కమిటీ వేసి తూతూమంత్రంగా నివేదిక తెప్పించుకుని ప్రాజెక్టును ఈ సంస్థకు కట్టబెట్టేందుకు వీలుగా విధి విధానాలు ఖరారు చేయాలని కీలక నేతలు మొదట యోచిం చారు. అయితే దీనివల్ల ఎదురుకానున్న ప్రజావ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని, మొదట మెగా టెండరు నిర్వహించి మొత్తం ఖనిజం కొనుగోలు హక్కులు ఈ సంస్థకే వచ్చేలా మేనేజ్ చేసి తర్వాత దశలవారీగా ప్రాజెక్టును కట్టబెడితే సమస్య ఉండదని భావిస్తున్నారు. నల్లబంగారం విలువ రూ.40 వేల కోట్లు అత్యంత విలువైన, అరుదైన ఖనిజం కావడంవల్లే బెరైటీస్‌ను నల్లబంగారంగా అభివర్ణిస్తుంటారు. మంగంపేటలో కేవలం 225 హెక్టార్లలో 74 మిలి యన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఇందులో 24 మిలియన్ టన్నులను ఇప్పటికే తవ్వేశారు. ఇక 50 మిలియన్ టన్నుల ఖనిజం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో టన్ను ధర 135 నుంచి 145 డాలర్లు పలుకుతోంది. కనిష్ట ధర 135 డాలర్ల ప్రకారం చూసినా (డాలరు రూ. 60 ధర ప్రకారం) టన్ను రూ. 8,100 ఉంది. ఈ లెక్కన ఇక్కడ ఉన్న 50 మిలియన్ టన్నుల ఖనిజం విలువ రూ. 40,500 కోట్లు పైమాటే. ఒకే చోట ఇంత అధిక పరిమాణంలో నాణ్యమైన బెరైటీస్ ఖనిజం దేశంలో మరెక్కడా లేదు. కాగా మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులోని ఖనిజ నిల్వల కొనుగోలు కాంట్రాక్టు గడువు ఆగస్టు 8తో ముగిసింది. అయినా ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ చేపట్టక పోవడం అనుమానాలకు తావిస్తోంది. 60:40 నిబంధన తొలగింపు! ఎగుమతులకు 60 శాతం, స్థానిక అవసరాలకు 40 శాతం దామాషాలో బెరైటీస్ ఖనిజాన్ని కేటాయించాలనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) భావిస్తోంది. అవసరాల ఆధారంగా ఎగుమతులకు, స్థానిక పరిశ్రమలకు ఏ దామాషాలో ఖనిజాన్ని సరఫరా చేయాలనే అంశంపై నిర్ణయాధికారాన్ని సంస్థకే ఇవ్వాలని కోరుతోంది. ఇందులో భాగంగానే 60 : 40 దామాషాకు సంబంధించి ఉన్న జీవో 296ను తొలగించాలంటూ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఆమోదం తర్వాత దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి.