
సార్వత్రిక సమ్మెకు ఏపీఎండీసీ మద్దతు
మంగంపేట(ఓబులవారిపల్లె):
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీన జరిగే సార్వత్రికసమ్మెకు ఏపీఎండీసీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరి కొరముట్ల శ్రీనివాసులు సిపివో కేథార్‌నా«ద్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీసవేతనం రూ.18వేలు ఇవ్వాలని, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని వారు డిమాండ్‌చేశారు. సమ్మెకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మురళి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.