అత్యంత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్‌ | Gopalakrishna Dwivedi says Highly transparent sand operations in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అత్యంత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్‌

Published Wed, Dec 22 2021 4:49 AM | Last Updated on Wed, Dec 22 2021 4:49 AM

Gopalakrishna Dwivedi says Highly transparent sand operations in Andhra Pradesh - Sakshi

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గోపాలకృష్ణ ద్వివేది, వీజీ వెంకటరెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరలో ఇసుక విక్రయానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, దాని ప్రకారమే విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవగాహన లేకుండా కొన్ని మీడియాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయంపై అసత్య కథనాలను ప్రచురిస్తున్నారని అన్నారు. 

జేపీ సంస్థదే బాధ్యత: ద్వివేది 
‘ఇసుక ఆపరేషన్స్‌ను పారదర్శకంగా నిర్వహించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. ఎంఎస్‌టీసీ నిర్వహించిన టెండర్ల లో జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థను ఎంపిక చేశాం. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం నిర్ణయిం చిన రేటుకు ఇసుక విక్రయాలు జరుపుతున్నాం. రెండేళ్ల కాలానికి ఇసుక ఆపరేషన్స్‌ కాంట్రాక్ట్‌ను జేపీ సంస్థకు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల్లో ఏపీఎండీసీ గనులను నిర్వహిస్తోంది. అక్కడ ఆపరేషన్స్‌ కోసం సబ్‌ కాంట్రాక్ట్‌లకు కొన్ని పనులు అప్పగించాం. ఇసుక టెండర్ల నిబంధనల్లో కూడా లీజు అనుమ తులు పొందిన సంస్థ సబ్‌ కాంట్రాక్ట్‌ కింద కొన్ని పనులు ఇతరులకు ఇవ్వవచ్చు. అయితే మొత్తం ఇసుక ఆపరేషన్స్‌కు జేపీ సంస్థ మాత్రమే బాధ్యత వహిస్తుంది.

ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగితే జేపీ సంస్థపైనే చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను జేపీ సంస్థ నిర్వహిస్తు న్నందున వారు సబ్‌ కాంట్రాక్ట్‌ కింద ఇతరుల సేవలను తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి నిబం ధనల ఉల్లంఘనా లేదు. కొత్తగా ఏర్పాటైన సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇసుకను తీసుకువచ్చే బాటకు కొందరు స్థానికులు డబ్బు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోప ణల నేపథ్యంలో దానిపై ఎవరైనా సరే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటివి అటు జేపీ సంస్థ దృష్టికి వచ్చినా, లేదా మా దృష్టికి వచ్చినా  పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరతాం. వినియోగదారులకు సరైన రేటుకు, నిర్దిష్టమైన నాణ్యతతో కూడిన ఇసుక అందుతుందా లేదా అనేదానిపైనే మేం దృష్టి సారిస్తున్నాం.

జేపీ సంస్థ ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లు చేస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా చేయాలని çసూచించాం. ప్ర జలకు ఇబ్బంది లేకుండా మంచి సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేయడానికి ఆ సంస్థ రూపొం దించిన ఫోన్‌ యాప్‌ను కూడా పరిశీలిస్తున్నాం. గతంలో ఆన్‌లైన్‌ విధానంలోని లోపాలవల్ల విని యోగదారులు ఇబ్బందులు పడ్డారు.  అటువంటి పరిస్థితి తలెత్తకుండా సాఫ్ట్‌వేర్‌ ఉండేలా చూస్తాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని, అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. గతంలో పట్టా భూము ల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నాణ్యత లేదనే ఫిర్యాదులు చాలా వచ్చాయి. వాటికి అనుమతులు రద్దు చేశాం. ప్రస్తుతం వందకు పైగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదల వల్ల కొన్ని రీచ్‌ల ప్రారంభంలో జాప్యం జరిగింది. త్వరలోనే దాదాపు 150 రీచ్‌లు ప్రారంభమవుతాయి’ అని ద్వివేది చెప్పారు. 

అవాస్తవాలు ప్రచురించారు: వెంకటరెడ్డి 
‘ఇసుక విక్రయాలపై అవగాహన లేకుండా ఒక మీడియా సంస్థ అవాస్తవాలను ప్రచురించింది. గతంలో ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్న సమయంలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక లభించలేదు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లింది. దీనిని నియంత్రించడానికే ఈ ప్రభుత్వం సుస్థిర ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్‌ చేశాం. కొత్త ఇసుక విధానంలోని లోటుపాట్లను పరిష్కరించేందుకు మెరుగైన విధానం కోసం సీఎం జగన్‌ మంత్రుల కమిటీని వేసి ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చారు. జేపీ సంస్థ ఎక్కడా సబ్‌ లీజులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారమే సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. దానినే జేపీ సంస్థ అనుసరిస్తోంది.

కొత్తగా పుట్టిన సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని అంటూ ఒక మీడియాలో వచ్చిన కథనంలో వాస్తవం లేదు. జేపీ సంస్థ నగదుతో పాటు యూపీఐ. బ్యాంకు ఖాతాల ద్వారా సొమ్ము జమ చేసిన వినియోగదారులకు కూడా ఇసుకను విక్రయిస్తోంది. అందుకోసం 26 బ్యాంకు ఖాతాలను జేపీ సంస్థ ఆపరేట్‌ చేస్తోంది. ఆ బ్యాంకు ఖాతాల్లో వినియోగదారులు సొమ్ము డిపాజిట్‌ చేసి ఇసుకను తీసుకోవచ్చు.  బాట చార్జీల పేరుతో స్థానిక నేతలు ఎక్కడ డబ్బు వసూలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా కథనాలు రాస్తున్నారు. దానిపై పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతివారం నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లపై ప్రకటనలు జారీ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ రేటును ఎవరైనా డిమాండ్‌ చేస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్‌ పాయింట్‌లలో ఇసుక సిద్ధంగా ఉంది. ప్రతి రీచ్‌లోనూ మైనింగ్‌ ప్లాన్‌ తయారు చేస్తాం. దానికి పర్యావరణ అనుమతులు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే సరిహద్దులు గుర్తించి జియో కోఆర్డినేట్స్‌ ప్రకారం లీజుదారులకు మైనింగ్‌ ప్రాంతాన్ని అప్పగిస్తాం. ఈ ప్రాంతం మినహా మరెక్కడైనా ఇసుక ఆపరేషన్స్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం.  ఏడాదికి రెండు కోట్ల టన్నుల వరకు ఇసుక తవ్వాలని జేపీ సంస్థకు నిర్దేశించాం. ప్రతి నెలా ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల వివరాలను తీసుకుంటున్నాం. దీనిని గనులశాఖ ఏడీ, డీడీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  ప్రస్తుతం జేపీ సంస్థ మాన్యువల్‌గానే బిల్లులు ఇస్తోంది. ఆన్‌లైన్‌ కావాలని వినియోగదారులు కొందరు కోరుతున్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నాం. అధికారుల నుంచి నిర్దిష్టమైన అంశాలపై వివరణ కోరకుండానే మీడియాలో కథనాలను ప్రచు రించడం తగదు’ అని వెంకటరెడ్డి చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement