
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరి చేరుకున్నారు. అక్కడ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు అఖిలరెడ్డి, గౌతమ్‌రెడ్డిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్‌తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు.