Joint venture company
-
జీవిత బీమా ఐపీవోపై కన్ను
న్యూఢిల్లీ: జీవిత బీమా భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 14.5 శాతం వాటా విక్రయానికి పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. వాటా విక్రయం ద్వారా కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(జేవీ) పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి జేవీని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ, ఆర్థిక సేవల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. తగిన సమయంలో ఇష్యూ పరిమాణం తదితర అంశాలను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. జేవీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామిగా హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 26 శాతం, మరో ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సీఆర్ఏఎంసీలోనూ...మ్యూచువల్ ఫండ్ అనుబంధ సంస్థ కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(సీఆర్ఏఎంసీ)లోనూ 13 శాతం వాటాను కెనరా బ్యాంక్ విక్రయించాలని చూస్తోంది. తద్వారా ఎంఎఫ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికలున్నట్లు పేర్కొంది. ఈ బాటలో గత డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా సూత్రప్రాయ అనుమతిని మంజూరు చేసింది. నిధుల సమీకరణబాండ్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంక్ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో వ్యాపార వృద్ధిని సాధించేందుకు నిధులను వెచి్చంచనుంది. శుక్రవారం(31న) నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. అంతేకాకుండా మరో రూ. 4,500 కోట్లను బాసెల్–3 నిబంధనల టైర్–2 బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 118 వద్ద ముగిసింది. -
రూ.450 కోట్ల ఆదాయంతో ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాజెక్ట్!
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ ను జాయింట్ వెంచర్ విధానంలో ఎపీఎండీసీ చేపట్టనుంది. ఇందుకు గానూ జాయింట్ వెంచర్ సంస్థ ఎంపిక కోసం నిర్వహించే టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎపీఎండీసీ మంగళవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, డెవలప్ మెంట్, ఆపరేషన్ కమ్ మైయింటెనెన్స్ కోసం జేవీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎపీఎండీసీ ప్రకాశం జిల్లా కొణిజేడు మర్లపాడు ప్రాంతం పరిధిలో మొత్తం 1307.26 ఎకరాల్లో లో-గ్రేడ్ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను పొందింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ద్వారా లోగ్రేడ్ ఖనిజాన్ని మైనింగ్ చేయడం, బెనిఫికేషన్ ద్వారా నాణ్యతను పెంచడం ద్వారా ఏడాదికి సుమారు రూ.450 కోట్ల మేర సంస్థకు రెవెన్యూ లభిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాలని చట్టం చేసింది. దానిలో భాగంగా ఐరన్ ఓర్ టెండర్ డాక్యుమెంట్ లను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ కు సమర్పించడం జరిగిందని ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఈ టెండర్ డాక్యుమెంట్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కమిషన్ ఈ-మెయిల్ judge-jpp@ap.gov.in ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని కోరారు. -
అనిల్ అగర్వాల్‌కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్‌కాన్ చర్చలు?
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూపునకు భారీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ దేశీయంగా మరో టాప్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్‌తో సంభావ్య టై-అప్ కోసం ఫాక్స్‌కాన్ అన్వేషిస్తోందని సీఎన్‌బీసీ ఆవాజ్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందనీ, దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్‌కాన్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్‌ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది. (వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్ ) తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్ వెంచర్‌గా గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్) -
రిలయన్స్, బీపీ కీలక ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బ్రిటిష్ భాగస్వామి బీపీ పీఎల్సీతో కలిసి కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోల్ పంప్ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆర్ఐఎల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను భారత్‌లోని విమానయాన సంస్థలకు విక్రయించాలని ప్రణాళికలు రచించాయి. ఈ మేరకు ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డాడ్లీ ఒప్పంద పత్రాలపై మంగళవారం ముంబైలో సంతకాలు చేశారు. తుది ఒప్పందం 2019, రెగ్యులేటరీ, ఇతన అనుమతులకు నిబంధనలకు లోబడి, లావాదేవీ 2020 మొదటి అర్ధభాగంలో పూర్తవుతుందని భావిస్తున్నామిన ఆర్ఐఎల్ వెల్లడించింది. రీటైల్ వ్యాపారాన్ని ఇప్పటికే ఉన్న రిలయన్స్ బంకుల ఆధారంగా నిర్మించనున్నారు. సరికొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నామనీ, రీటైల్ సర్వీస్ స్టేషన్ నెట్‌వర్క్‌ద్వారా , వైమానిక ఇంధన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. కొత్త జాయింట్ వెంచర్ కంపెనీలో ఆర్ఐఎల్ 51శాతం వాటాను, బిపి 49శాతం వాటాను వాటాను కలిగి ఉంటాయి. ఈ ఉమ్మడి సంస్థ ఆధర్యంలో 5,500 ఇంధన రిటైల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ ఏవియేషన్ ఇంధనాల వ్యాపారం కూడా ఉంటుంది, ఈ జాయింట్ వెంచర్ ద్వారా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. దేశంలో గ్యాస్ వనరులను అభివృద్ధి చేయడంలో తమ బలమైన భాగస్వామ్యం ఇప్పుడు ఇంధన రిటైలింగ్, విమాన ఇంధనాలకు కూడా విస్తరిస్తామని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. వినియోగదారులకు దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి సేవలను మరింత పెంచడంలో తమ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందన్నారు. 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా అవతరించనుందని బాబ్ డాడ్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పెద్ద పెట్టుబడిదారుగా ఉన్న తాము ఈ వృద్ధికి తోడ్పడేందుకు మరింత ఆకర్షణీయమైన, వ్యూహాత్మక అవకాశాలవైపు చూస్తున్నామన్నారు. కాగా ఆర్ఐఎల్ ఇప్పటికే దేశంలో 1300 ఇంధన రిటైల్ పంపులను స్వతంత్రంగా నడుపుతుండగా, బీపీకి అక్టోబర్ 2016 లో భారతదేశంలో 3,500 ఇంధన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ లభించింది. భారతదేశంలో 5 వేల పెట్రోల్ పంపులను తెరవడానికి ఆర్ఐఎల్కు లైసెన్సులు ఉన్నాయి. -
రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలతో జట్టు
జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం... ♦ వనరుల సమీకరణ, ప్రాజెక్టులను ♦ వేగంగా పూర్తిచేయడమే లక్ష్యం న్యూఢిల్లీ: రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ఇకపై రాష్ట్రాలకు మరింతగా భాగస్వామ్యం కల్పించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రేల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్(జేవీ) కంపెనీ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసింది. బుధవారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర పడింది. రైల్వే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చడం, వేగంగా అమలు చేయడం వంటివి ఈ చర్యల ప్రధానోద్దేశం. వివిధ రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు డిమాండ్లు అంతకంతకూ పెరుగున్న నేపథ్యంలో వీటి నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు చేసే జేవీ కంపెనీలు ఇలాంటి ప్రాజెక్టులను గుర్తించడం, భూసేకరణ, తగిన నిధుల సమీకరణ వంటివాటితోపాటు పర్యవేక్షణను కూడా చేపడతాయి. ఈ విధమైన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేరకు నిధులు లభిస్తాయని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈక్విటీ వాటా కేటాయింపు ప్రాతిపదికన జేవీ కంపెనీలు ఏర్పాటవుతాయి. ప్రతి జేవీకి ప్రాజెక్టుల సామ ర్థ్యాన్ని అనుసరించి కనీస పెయిడ్-అప్ మూలధనం రూ. 100 కోట్లుగా ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతి రాష్ట్రంతో ఏర్పాటయ్యే జేవీలోనూ రైల్వేల కనీస పెయిడ్-అప్ మూలధనం రూ.50 కోట్లకు పరిమితమవుతుంది. అయితే, భవిష్యత్తులో ఆయా ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు/ఈక్విటీ పెంచాలంటే... సంబంధిత యంత్రాంగం నుంచి ప్రాజెక్టులు, నిధుల సమీకరణకు తగిన ఆమోదం లభించాకే వీలవుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. మరోపక్క ఈ జేవీ కంపెనీలు నిర్దేశిత ప్రాజెక్టుల కోసం విడివిడిగా ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో బ్యాంకులు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ కంపెనీలకు సైతం ఈక్విటీ వాటాలను ఇచ్చేందుకు అనుమతిస్తారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, చట్టపరమైన అనుమతులు వేగంగా రావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఈ జేవీ విధానం దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది. ఇటీవలే రైల్వే శాఖ కేరళ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలతో జేవీ కంపెనీల ఏర్పాటుకు అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు కూడా చేసింది. ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైల్వే ప్రాజెక్టులకు ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సిమెంట్, స్టీల్ రంగాలకు వేలం ద్వారా బొగ్గు.. ప్రభుత్వ నియంత్రణలోలేని సిమెంటు, స్టీల్ తదితర రంగాలకు బొగ్గు సరఫరాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు వేలం పద్ధతిలోనే బొగ్గును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విభాగంలో స్పాంజ్ ఐరన్, అల్యూమినియం, ఎరువుల కంపెనీ(యూరియా)లు మినహా ఇతర పరిశ్రమలు ఉన్నాయి. బొగ్గు సరఫరా ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, వినియోగదారులందరికీ సమాన అవకాశాలను కల్పించం కోసమే వేలం విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఏప్రిల్ చివరికల్లా వేలానికి సిద్ధం చేస్తామన్నారు. కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ తమ ఉత్పత్తిలో పావు శాతాన్ని విద్యుత్‌యేతర కంపెనీల కోసం వేలంలో అందుబాటులో ఉంచుతాయని ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. అయితే, కోల్ ఇండియాతో దీర్ఘకాలిక ఒప్పందాలున్న కంపెనీలకు మాత్రం వాటి గడువు పూర్తయ్యేవరకూ సరఫరాలు కొనసాగుతాయని గోయల్ స్పష్టం చేశారు. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్(ఆర్ఈఐఎల్)ను దాని మాతృ సంస్థ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ నుంచి విడదీసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
మెట్రో-3 పనులకు మోక్షం
సాక్షి, ముంబై : మెట్రో-3 ప్రాజెక్ట్‌కు చాలా రోజుల తర్వాత మోక్షం లభించింది. కొలాబా నుంచి బాంద్రా మీదుగా సీప్జ్ వరకు నిర్మించతలపెట్టిన భూగర్భ మెట్రో నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటైన జాయింట్ వెంచర్ కంపెనీ (జేవీసీ), కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెండర్లను ఆహ్వానించేందుకు మంగళవారం ఆమోదం తెలిపాయి. దాదాపు 33.5 కిలోమీటర్ల దూరంలో నిర్మించనున్న భూగర్భ మార్గానికి రూ.23,156 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ఈ ఏడాది చివరి వరకు ఈ భూగర్భమార్గం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన జేవీసీ అనివార్య కారణాల వల్ల ఏడాది నుంచి పనిచేయలేదు. దీని సూచనలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పట్టింది. ఇక నుంచి జేవీసీని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ)గా గుర్తించనున్నారు. నగరంలో ప్రస్తుతం కొనసాగుతున్న, ఇక ముందు కొనసాగనున్న మెట్రో ప్రాజెక్టులకు ఎంఎంఆర్‌సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అడిషినల్ కమిషనర్ సంజయ్ సేథీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియకు జేవీసీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో సగం మొత్తాన్ని జపాన్ బ్యాంకు రుణంగా ఇవ్వనుందని వెల్లడించారు. దీంతో బిడ్డర్లను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. ఇదిలా వుండగా, జపాన్ ఇంటర్ నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ (జేఐసీఏ) మొత్తం ప్రాజెక్టులో 57 శాతం రుణంగా ఇస్తుండగా, దీనికి ఏడాది వడ్డీ 1.4 శాతం చెల్లిం చాలి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 32 శాతం వ్యయాన్ని భరిస్తాయి. మిగితా నిధులను ఇతర మార్గాల్లో సేకరిస్తారు.