జేవీపై కెనరా బ్యాంక్ సన్నాహాలు
14.5 శాతం వాటా విక్రయానికి రెడీ
ఐపీవోకు ఎంఎఫ్ అనుబంధ సంస్థ
న్యూఢిల్లీ: జీవిత బీమా భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 14.5 శాతం వాటా విక్రయానికి పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. వాటా విక్రయం ద్వారా కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(జేవీ) పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి జేవీని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఆర్‌బీఐ, ఆర్థిక సేవల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. తగిన సమయంలో ఇష్యూ పరిమాణం తదితర అంశాలను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. జేవీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామిగా హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 26 శాతం, మరో ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి.
సీఆర్‌ఏఎంసీలోనూ...
మ్యూచువల్ ఫండ్ అనుబంధ సంస్థ కెనరా రొబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(సీఆర్‌ఏఎంసీ)లోనూ 13 శాతం వాటాను కెనరా బ్యాంక్ విక్రయించాలని చూస్తోంది. తద్వారా ఎంఎఫ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికలున్నట్లు పేర్కొంది. ఈ బాటలో గత డిసెంబర్‌లోనే లిస్టింగ్‌కు వీలుగా సూత్రప్రాయ అనుమతిని మంజూరు చేసింది.
నిధుల సమీకరణ
బాండ్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంక్ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో వ్యాపార వృద్ధిని సాధించేందుకు నిధులను వెచి్చంచనుంది. శుక్రవారం(31న) నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. అంతేకాకుండా మరో రూ. 4,500 కోట్లను బాసెల్–3 నిబంధనల టైర్–2 బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 118 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment