hsbc bank
-
జీవిత బీమా ఐపీవోపై కన్ను
న్యూఢిల్లీ: జీవిత బీమా భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 14.5 శాతం వాటా విక్రయానికి పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. వాటా విక్రయం ద్వారా కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(జేవీ) పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి జేవీని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ, ఆర్థిక సేవల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. తగిన సమయంలో ఇష్యూ పరిమాణం తదితర అంశాలను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. జేవీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామిగా హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 26 శాతం, మరో ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సీఆర్ఏఎంసీలోనూ...మ్యూచువల్ ఫండ్ అనుబంధ సంస్థ కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(సీఆర్ఏఎంసీ)లోనూ 13 శాతం వాటాను కెనరా బ్యాంక్ విక్రయించాలని చూస్తోంది. తద్వారా ఎంఎఫ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికలున్నట్లు పేర్కొంది. ఈ బాటలో గత డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా సూత్రప్రాయ అనుమతిని మంజూరు చేసింది. నిధుల సమీకరణబాండ్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంక్ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో వ్యాపార వృద్ధిని సాధించేందుకు నిధులను వెచి్చంచనుంది. శుక్రవారం(31న) నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. అంతేకాకుండా మరో రూ. 4,500 కోట్లను బాసెల్–3 నిబంధనల టైర్–2 బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 118 వద్ద ముగిసింది. -
అప్పుడు వాట్సాప్.. ఇప్పుడు మెసేజ్‌లు! బ్లాక్ చేస్తున్న ప్రముఖ బ్యాంకు..
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తమ సిబ్బందిని ఆఫీస్ ఫోన్లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది. కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్లలో మెసేజ్ ఫంక్షన్‌ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్ఎస్బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది. అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్మేకర్లు ఫోన్లు, సిస్టమ్‌లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్‌లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్‌కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి. వందల కోట్ల జరిమానా వాట్సాప్‌తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్‌లలో ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్ఎస్బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్‌కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది. -
కెనరా హెచ్ఎస్బీసీ నుంచి కొత్త పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త పథకాలపై దృష్టిసారించింది. ఈ మధ్యనే చిన్న పిల్లల కోసం యులిప్ పథకం ప్రవేశపెట్టిన కంపెనీ త్వరలోనే మరో ఐదు పథకాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే నాలుగు నెలల్లో రెండు టర్మ్ పథకాలతో పాటు ఒక పెన్షన్, యాన్యుటీ, ఎండోమెంట్ పథకాలను ప్రవేశపెట్టడానికి ఐఆర్డీఏకి దాఖలు చేయనున్నట్లు కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ డెరైక్టర్ చిరాగ్ జైన్ మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. -
వాయిదాలపై విమాన టికెట్లు..
♦ స్పైస్‌జెట్ పోస్ట్-పెయిడ్ ఆఫర్ ♦ అతి తక్కువగా 12-14% వడ్డీ రేటు న్యూఢిల్లీ : చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా పోస్ట్-పెయిడ్ స్కీము కింద టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ కింద నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) విధానంలో టికెట్స్ తీసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వాటికి అత్యంత తక్కువగా 12-14 శాతం వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది. ఇతరత్రా క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐల విధానంలో తీసుకునే వాటితో పోలిస్తే వడ్డీ వ్యయం దాదాపు 70 శాతం తక్కువగా ఉంటుందని స్పైస్‌జెట్ వివరించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు ఈ స్కీమును ఉపయోగించుకోవచ్చని స్పైస్‌జెట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దేవజో మహర్షి తెలిపారు. త్వరలో ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ ఆఫర్ కింద టికెట్లు తీసుకునే వారు 3 నుంచి 12 నెలల కాలం పాటు చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని వివరించారు. అయితే, స్పైస్‌జెట్ వెబ్సైట్ ద్వారా చేసే బుకింగ్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది. -
స్విస్‌బ్యాంకులో కోట్లు దాచిన హెచ్ఎస్బీసీ చీఫ్?
స్కాముల్లో కూరుకుపోయిన హెచ్ఎస్బీసీ బ్యాంకును సంస్కరిస్తానని ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్న ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కోట్ల కొద్దీ రూపాయలు దాచుకున్నారట. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇది అక్కడి ప్రభుత్వానికి పెద్ద శరాఘాతంగానే పరిణమిస్తుందని అనుకుంటున్నారు. బాగా డబ్బులున్న ఆసాములు పన్ను ఎగవేయడానికి స్విస్ బ్యాంకుల్లో సొమ్ములు దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో గలివర్ కూడా 2007 సంవత్సరంలో రూ. 47.26 కోట్లను పనామాలో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ పేరుమీద స్విస్ బ్యాంకులో దాచుకున్నట్లు తెలిసింది. స్వతహాగా బ్రిటన్‌కు చెందిన గలివర్, తన న్యాయపరమైన, పన్ను అవసరాల కోసం హాంకాంగ్‌లో ఉంటున్నారు. అయితే ఈ స్విస్ బ్యాంకు ఖాతా వ్యవహారంపై హెచ్ఎస్బీసీ వర్గాలు ప్రస్తుతానికి ఏమీ స్పందించలేదు. -
మళ్లీ నల్లడబ్బు గబ్బు!
మళ్లీ మరోసారి నల్లడబ్బు పతాక శీర్షికలకెక్కింది. మన పాలకుల చిత్తశుద్ధిని సందే హాస్పదం చేసింది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తీసుకొస్తామన్న హామీలు హామీలుగానే మిగిలిపోతుండగా తాజాగా స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకు శాఖలోనూ, ఇతరచోట్లా నల్ల ఖాతాలున్న భారతీయుల వివరాలు వెల్లడ య్యాయి. ఫ్రాన్స్ మన దేశానికి 2011లో అందించిన జాబితాలో 628మంది భారతీ యులుండగా...ఇప్పుడు వెల్లడైన జాబితాలో ఆ సంఖ్య 1,195కు చేరుకుంది. ఇందు లో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, మాజీ అధికారులున్నారు. పన్ను ఎగ్గొట్టినట్టు తగిన ఆధారాలున్న పక్షంలో అలాంటి వారి వివరాలను మాత్రమే వెల్లడిస్తామని ఫ్రాన్స్ విధించిన షరతువల్ల గతంలో 628మంది వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు నియమిం చిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అందజేసింది. నిబంధనల మేరకు పన్నులు చెల్లించకుండా కోట్లాది రూపాయలు దేశం దాటిస్తున్నవారి వివరాలను బహిరంగ పరచడంలో మన ప్రభుత్వానికి ఒడంబడికలు, నిబంధనలు అడ్డొస్తుండగా... మీడియా గతంలో వలే మరోసారి ఖాతాల వివరాలను బట్టబయలు చేసింది. పాత ఖాతాల్లో మొత్తం రూ. 4,500 కోట్లుండగా...తాజాగా వెల్లడించిన ఖాతాల్లో ఆ మొత్తం దాదాపు రూ. 25,420 కోట్లు. ఈ వివరాలన్నీ 2007 నాటివి గనుక ఇందులో ఎంత డబ్బు స్విస్ ఎల్లలు దాటి ఉంటుందో, ఎన్ని ఖాతాలు మూతపడి ఉంటాయో అంచనా వేయడం సాధ్యంకాదు. ఇప్పుడు మీడియా వెల్లడించిన వివరాలు కూడా గతంలో వలే హెచ్ఎస్బీసీ మాజీ ఉద్యోగి అందించినవే. వివిధ దేశాల్లోని మీడియా సంస్థలు సమష్టిగా దర్యాప్తు చేసి వెలికితీస్తున్న ఇలాంటి వివరాలు ఇంత యంత్రాంగమున్న ప్రభుత్వానికి ఎందు కు దొరకడంలేదో అర్ధంకాని విషయం. ఆ మాజీ ఉద్యోగిని తాము కూడా సంప్రదిస్తు న్నామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం ఆశాజనకమైన పరిణామం. ఆయనంటున్నట్టు విదేశాల్లో ఖాతాలున్న ప్రతి ఒక్కరూ దోషులు కానవసరం లేదు. వ్యాపార లావాదేవీల రీత్యా ప్రపంచంలో ఏమూలైనా ఖాతాను తెరిచే స్వేచ్ఛ ఎవరి కైనా ఉంటుంది. ఏటా సమర్పించే ఆదాయ పన్ను వివరాల్లో వాటిని కూడా వెల్లడిం చి ఉంటే ఆ ఖాతాలు సవ్యమైనవే అవుతాయి. ఇప్పుడు వెల్లడైన జాబితాలో అంబానీ సోదరులు, యశోవర్ధన్ బిర్లా, లక్ష్మణదాస్ రహేజా, రాజన్ నందా, ఆనంద్ చాంద్ బర్మన్వంటి వ్యాపార దిగ్గజాలతోపాటు నారాయణ్ రాణే, స్మితా ఠాక్రే వంటి రాజకీయవేత్తల పేర్లు కూడా ఉన్నాయి. అంబానీ సోదరులతోపాటు మరికొందరు విదేశాల్లో తమకు అక్రమ ఖాతాలేవీ లేవని చెబుతున్నారు. గతం లోనూ, ఇప్పుడూ వెల్లడైన ఖాతాదారుల జాబితాలు దొంగిలించిన సమాచారం ఆధారంగా చేసుకున్నవేనని ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పడాన్నిబట్టి చూస్తే వాటిని కొట్టి పారేయడానికి లేదని సులభంగానే అర్ధమవుతుంది. మరోపక్క చాలామంది తమ పేర్లు ఎందుకున్నాయో తెలియదంటున్నారు. కనుక నిజం అనేది ఈ రెండింటి మధ్యా ఎక్కడో ఉంటుంది. 2011 నాటి జాబితాలోని నిజానిజాలను వెలికితీసే పని ఎంత వరకూ వచ్చిందో తెలియని పరిస్థితుల్లో తాజా జాబితా విషయంలో ఎప్పుడు దర్యాప్తు ప్రారంభమవుతుందో, ఎన్నాళ్లకు వాస్తవాలు వెల్లడవుతాయో అంచనా కందదు. దేశంనుంచి ఏటా లెక్కలు చూపని దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల డబ్బు దేశం దాటిపోతున్నదని గతంలో సీవీసీగా పనిచేసి ప్రత్యూష్ సిన్హా చెప్పారు. పన్ను ఎగవేతలు, ఇతర అవినీతి కార్యకలాపాలవల్ల నల్ల డబ్బు తరలిపోతున్న దేశా ల జాబితాలో భారత్ తొలి పది స్థానాల్లో ఉన్నదని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ సంస్థ చాన్నాళ్లక్రితం వెల్లడించింది. నల్లడబ్బు ఆనుపానులు రాబట్టడానికి 81 దేశాలతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదర్చుకున్నామని, మరికొన్నిటితో పన్ను సమాచార బదిలీ ఒప్పందాలు కుదుర్చుకున్నామని యూపీఏ సర్కారు లోగడ చెప్పింది. అందుకనుగుణంగా చాలా సమాచారం సేకరించామని, అయితే ఒడంబడి కల్లో ఉన్న నిబంధనలవల్ల వివరాలు వెల్లడించలేకపోతున్నామని చెప్పింది. యూపీ ఏ సర్కారు చట్టాలను కట్టుదిట్టం చేసి ఉంటే విదేశీ బ్యాంకులు ఇలా మన ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకునే స్థితి ఉండేది కాదు. బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందని జీ-20 శిఖరాగ్ర సదస్సు 2009లోనే ప్రకటించింది. అటు తర్వాత చాలా దేశాలు తమ తమ దేశాల్లో చట్టాలను కఠినం చేశాయి. విదేశీ పన్ను అనువర్తన చట్టాన్ని తీసుకొచ్చిన అమెరికా...తమ జాతీయులు డబ్బు దాచుకున్న సందర్భాల్లో ఆ వివరా లను వెల్లడించాల్సిన బాధ్యతను విదేశీ బ్యాంకింగ్ సంస్థలపైనే ఉంచింది. అలా వెల్లడించని పక్షంలో తమ దేశంలో ఆ సంస్థల పెట్టుబడులపై 30 శాతం జరిమానా విధిస్తామని ఆ చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. బ్రిటన్ అయితే నల్లడబ్బు పోగేసినవారికి పదేళ్ల జైలు, ఆస్తుల జప్తు, భారీగా జరిమానా విధింపు వంటి అంశాల తో చట్టం తీసుకొచ్చింది. ఫ్రాన్స్, ఐర్లాండ్, ఈయూ వంటివి కూడా ఈ తోవనే వెళ్లాయి. ఆ దేశాలన్నీ స్విట్జర్లాండ్ బ్యాంకులను, ఇతర బ్యాంకులను దారికి తెచ్చుకో గలిగాయి. ఆ దేశాలు పెట్టిన నిబంధనలకు తలొగ్గి నల్ల ధనం దాచుకున్నవారి సమస్త వివరాలను అందజేస్తున్న బ్యాంకులు మన దగ్గరకొచ్చేసరికి మాత్రం ఎందుకు బెట్టుచేస్తున్నాయో...మన ప్రభుత్వం ఎందుకని చురుగ్గా వ్యవహరించలేకపోతు న్నదో అర్ధంకాని విషయం. అక్రమాస్తులు ఉన్నాయని తేలిన పక్షంలో అలాంటివారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణ చేయాలని గతంలో సిట్ సూచించింది. ఇదే సమయంలో పన్నుల చట్టాలను సరళీకరించి, పారద ర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది. దేశ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న నల్లధనం విషయంలో కఠినంగా వ్యవహరించాలని అంతర్జాతీయంగా అవగాహన ఏర్పడిన నేపథ్యంలో మన దేశం కనీసం ఇప్పుడైనా కదలాలి. పటిష్టమైన చర్యలకు నడుం బిగించాలి. -
హెచ్ఎస్బీసీలో 1,195మంది నల్ల కుబేరులు
న్యూఢిల్లీ : నల్లధనం వ్యవహారంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో స్విస్ బ్యాంక్ ఇప్పటికే 628 మంది సమాచారాన్ని సిట్‌కు సమర్పించింది. తాజాగా లండన్‌లోని హెచ్ఎస్బీసీలో 1195 మంది భారతీయులకు అకౌంట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం భారతీయుల అకౌంట్స్ మొత్తం విలువ రూ.25,420 కోట్లు ఉంటుందని అంచనా. ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు (ఐసీఐజే) ల దర్యాప్తులో ఈ నల్లధనం వెలుగులోకి వచ్చింది. నల్లధనాన్ని బయటికి తేవాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రిమినల్స్, బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచి ఉంటారని తనిఖీలు నిర్వహించినట్టు ఐసీఐజే జర్నలిస్టు ఒకరు తెలిపారు. -
సగం ఖాతాల్లో డబ్బే లేదు..!
* హెచ్ఎస్బీసీ ‘నల్ల’ ఖాతాలపై సిట్ నివేదికలో వెల్లడి * వంద మందికిపైగా పేర్లు రెండుసార్లు ప్రస్తావన * 300 మందిపై చర్యలకు సమాయత్తమవుతున్న ఐటీ శాఖ న్యూఢిల్లీ: నల్లధనానికి సంబంధించి 600కు పైగా హెచ్ఎస్బీసీ బ్యాంకు అకౌంట్లలోని సగం ఖాతాల్లో అసలు డబ్బే లేదని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. అలాగే ఈ జాబితాలోని ఖాతాల్లో వంద మందికిపైగా పేర్లు పునరావృతమైనట్టుగా తేల్చింది. మిగిలిన 300 మందికిపైగా ఖాతాదారులపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకునేందుకు ఆదాయపుపన్ను శాఖ యోచిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లధనానికి సంబంధించి హెచ్ఎస్బీసీ జెనీవా బ్రాంచ్‌కు చెందిన 628 పేర్లతో జాబితాను కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పరిశీలించిన సిట్ సుమారు 289 ఖాతాల్లో అసలు డబ్బే లేదని, అలాగే 122 మంది పేర్ల ప్రస్తావన రెండుసార్లు వచ్చినట్టు గుర్తించింది. ఈ ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాల వివరాలు లేకపోవడంతో ఈ జాబితాలో ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు పెద్ద అవరోధమని పేర్కొంది. తమకు ఇచ్చిన జాబితాలో ఈ ఖాతాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి.. వాటి కార్యకలాపాల చరిత్ర ఏమిటి అనే వివరాలు లేవని తెలిపింది. ఇటువంటి ఖాతాల వివరాల జాబితాను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనం జాబితాలోని 150 ఖాతాలపై ఐటీ శాఖ పరిశీలన జరిపిందని, అయితే ప్రాసిక్యూషన్‌కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఐటీ శాఖ 300 ఖాతాలపై ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. విదేశాల్లో నల్లధనానికి సంబంధించి వివిధ దేశాలతో మరోసారి సంప్రదింపుల ప్రక్రియను పునఃప్రారంభించాలని సిట్ సూచించింది. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రానికి సమర్పించిన నివేదికలోనూ సిట్ ఇదే తరహా సూచన చేసింది. అయితే విదేశాలతో సంప్రదింపుల ప్రక్రియను ఇప్పటికే పునఃప్రారంభించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సిట్‌కు తెలిపింది. మరోవైపు స్విస్ బ్యాంకులకు సంబంధించిన ఖాతాల వివరాలను స్వ యంగా వెల్లడించినట్లయితే వారికి తక్కువ శిక్ష పడేలా చేస్తామన్న సీబీడీటీ సూచనను సిట్ సమర్థించింది. నల్లధనంపై ప్రజలు తెలిసిన సమాచారాన్ని తెలియజేయాలని ఇటీవల కోరిన సిట్.. దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి త్వరలోనే ప్రజలకు తెలియజేయనుంది. -
అవన్నీ ఒక్క బ్యాంకులో ఖాతాలే!
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు 627 మంది పేర్లతో కూడిన నల్ల కుబేరుల జాబితాను సమర్పించింది. అయితే.. అవన్నీ కూడా ఫ్రాన్స్ లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉన్న ఖాతాల వివరాలు మాత్రమేనట. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, ఖాతా నెంబర్లు సహా.. ఏ ఖాతాలో ఎంతెంత మొత్తం ఉందన్న విషయాలు కూడా వివరంగా ఉన్నట్లు తెలిసింది. అంటే.. ఇంకా స్విస్ బ్యాంకుల ఖాతాల్లో సొమ్ము వివరాలు, ఆయా ఖాతాలు కలిగి ఉన్నవాళ్ల పేర్లు ఇంతవరకు సుప్రీంకోర్టుకు కూడా చేరలేదు. ఇంకా చెప్పాలంటే, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఆయా పేర్లను సంపాదించిందో లేదో స్పష్టత లేదు. దుబాయ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లోని పలు ఖాతాల్లో కూడా భారీ మొత్తంలో డబ్బు దాచుకున్నారన్న కథనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి వివరాలు కూడా ఇంకా బయటకు వస్తే.. జాబితా మరింత పెద్దది కావడం ఖాయం. -
నెలాఖరుకల్లా ఐవోసీ డిజిన్వెస్ట్‌మెంట్!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా ఆయిల్ దిగ్గజం ఐవోసీలో 10% వాటాను ఈ నెలాఖరుకల్లా విక్రయించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ ఏడాదిలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ. 40,000 కోట్లను సమీకరించాలని ఆర్థిక శాఖ బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఐవోసీలో వాటాను విక్రయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరుకల్లా ఐవోసీలో 10% వాటాను విక్రయించడం ద్వారా ఇంజినీర్స్ ఇండియా తదితర సంస్థల డిజిన్వెస్ట్మెంట్కు ఊపుతేవాలని యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, కంపెనీ షేరు ధర కనిష్ట స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో ఇటు కంపెనీ, అటు పెట్రోలియం శాఖ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గత శుక్రవారం బీఎస్ఈలో ఐవోసీ షేరు రూ. 213 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద ప్రభుత్వానికి 10% వాటాకుగాను రూ. 4,000 కోట్లకుపైగా లభించే అవకాశముంది. కంపెనీలో ప్రభుత్వానికి 78.92% వాటా ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ప్రభుత్వం సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీసహా ఐదుగురు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది కూడా. -
బ్రాంచిలొద్దు! బ్యాంకులు పెట్టండి!!
ముంబై: విదేశీ బ్యాంకులకు కళ్లెం వేస్తూనే... నిబంధనలు పాటిస్తే గనక దేశమంతా స్వారీ చేయొచ్చునంటూ రిజర్వు బ్యాంకు బుధవారం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. పారదర్శకత లేకుండా గజిబిజి నిర్మాణంతో ఉండే విదేశీ బ్యాంకులు దేశంలో పూర్తిస్థాయి అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, వాటి ద్వారానే కార్యకలాపాలు జరపాలని స్పష్టం చేసింది. అయితే అలా ఏర్పాటు చేసే అనుబంధ సంస్థల ద్వారా మన ప్రైవేటు బ్యాంకుల్ని ఎడాపెడా కొనుగోలు చేయడానికి కూడా ఆర్బీఐ పచ్చజెండా ఊపేసింది. అలా కొనుగోలు చేయటంతో పాటు... సదరు అనుబంధ సంస్థ మన దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావచ్చు. అయితే అది కొనుగోలు చేసే ప్రైవేటు బ్యాంకుల్లో దాని వాటా 74 శాతానికి మించకూడదు. ఇలా తయారైన ‘వి’దేశీ బ్యాంకులు... ఇతర జాతీయ బ్యాంకుల్లా దేశ వ్యాప్తంగా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే... విదేశీ బ్యాంకులు ఇప్పటిదాకా ఇక్కడ బ్రాంచిల ద్వారా వ్యాపారం చేసేవి. ఇకపై నేరుగా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తాయి. మన చిన్నాచితకా ప్రైవేటు బ్యాంకుల్ని వాటి ఖాతాల్లో కలిపేసుకుంటాయి. ఇలా దేశంలో ఏర్పాటు చేసే అనుబంధ సంస్థల కనీస ఈక్విటీ మూలధనం లేదా నెట్‌వర్త్ కనీసం రూ.500 కోట్లుండాలనేది ప్రధాన నిబంధన. దేశంలో పూర్తిస్థాయి అనుబంధ సంస్థల ద్వారా మాత్రమే కార్యకలాపాలు చేయాల్సిన బ్యాంకుల గురించి ఆర్బీఐ తెలియజేసింది. అవి... క్లిష్టమైన గజిబిజి వ్యవస్థాగత నిర్మాణం ఉన్న బ్యాంకులు.. మాతృ దేశంలో పారదర్శకంగా పూర్తిస్థాయి వివరాలు వెల్లడించనివి విదేశీ బ్యాంకులు అతి తక్కువ మంది వాటాదారులు లేదా భాగస్వామ్య సంస్థలు ఉన్నవి.. మూసేసేటపుడు మాతృదేశ డిపాజిటర్లకు ప్రిఫరెన్షియల్ క్లెయిమ్‌కు అవకాశమివ్వాలని అక్కడి దేశ చట్టాల్లో పేర్కొన్న బ్యాంకులు. అయితే 2010 ఆగస్టుకన్నా ముందు నుంచీ మన దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ బ్యాంకులకు మాత్రం... ఇప్పట్లాగే కొనసాగాలా లేక పూర్తిస్థాయి అనుబంధ సంస్థల ద్వారా కార్యకలాపాలు సాగించాలా అనేది నిర్ణయించుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 43 విదేశీ బ్యాంకులు, 333 బ్రాంచిల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ మార్గదర్శకాలు ఎందుకంటే.. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సంక్షోభం ద్వారా ఆర్థిక సంస్థల మధ్యనున్న అనుబంధం బయటపడిందని, ఈ అనుబంధం కొన్ని పెద్ద బ్యాంకుల వైఫల్యాల విషయంలో స్థానిక అధికార యంత్రాంగం రాజీ పడేలా చేసిందని ఆర్బీఐ చెబుతోంది. ఇది నేర్పిన పాఠాలతోనే దేశీయ బ్యాంకుల ఏర్పాటు అవసరం కనిపించిందని తెలిపింది. ‘‘దీనివల్ల సొంత మూలధనం, డెరైక్టర్ల బోర్డు ఉండే ప్రత్యేక చట్టబద్ధ సంస్థలు ఏర్పడతాయి. నియంత్రణ సంస్థల పని సులభమవుతుంది. ఆస్తి అప్పుల విషయంలో విదేశీ బ్యాంకులకు, ఇక్కడి వాటి అనుబంధ సంస్థలకు మధ్య స్పష్టమైన విభజన ఉంటుంది’’ అని ఆర్బీఐ వివరించింది. పెపైచ్చు బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడటానికి కీలక చర్యల్ని కూడా ఆర్బీఐ ప్రకటించింది. దానిప్రకారం... మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోని మూలధన, రిజర్వుల్లో విదేశీ బ్యాంకుల మూలధన, రిజర్వులు గనక 20 శాతం దాటితే వెంటనే ఆర్బీఐ రంగంలోకి దిగి తదుపరి విదేశీ బ్యాంకుల ప్రవేశాన్ని లేక వాటి పెట్టుబడుల్ని నిలిపివేస్తుంది. కొన్ని వాస్తవాలు... దేశంలో ఏడీఆర్‌లను లిస్ట్ చేసిన స్టాన్ చార్ట్ బ్యాంకు కూడా బ్రాంచిల ద్వారానే కార్యకలాపాలు సాగిస్తోంది తప్ప అనుబంధ సంస్థను ఏర్పాటు చేయలేదు. స్టాన్‌చార్ట్, సిటీ, హెచ్‌ఎస్‌బీసీలకు మాత్రమే దేశంలో 30కన్నా ఎక్కువ బ్రాంచీలున్నాయి. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు 31 బ్రాంచీలున్నా... ఇక్కడి రిటైల్ కార్యకలాపాలను మూసేస్తోంది. -
మళ్లీ ‘టీజర్’ రుణాలు!
విశ్లేషకులు ఏమంటున్నారంటే.. వడ్డీరేట్లు రానున్న కాలంలో దిగివచ్చే అవకాశం ఉందని.. అందువల్ల స్థిర వడ్డీరేట్ల స్కీమ్‌లలో చిక్కుకోవడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. పాక్షిక స్థిర వడ్డీ(కొన్నాళ్ల తర్వాత ఫ్లోటింగ్లోకి మారేది) రుణాల్లో ముందస్తు చెల్లింపులపై జరిమానాలు చాలా ఎక్కువని చెబుతున్నారు. ముందుగానే చెల్లించదలచుకున్న రుణ మొత్తంపై 2% జరిమానా, సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుందని రిటైల్ లెండింగ్ డాట్‌కామ్ డెరైక్టర్ సుకన్య కుమార్ అంటున్నారు. అయితే, ఇప్పుడు ఆఫర్ చేస్తున్న స్థిర వడ్డీరేటు ప్రస్తుత ఫ్లోటింగ్ రేటు కంటే తక్కువని, మూడేళ్ల క్రితం టీజర్ రుణాల్లో స్థిర వడ్డీరేటు ఫ్లోటింగ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు కుమార్ పేర్కొన్నారు. ముంబై: ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘టీజర్’ గృహ రుణాలు మళ్లీ సందడి చేస్తున్నాయి. అయితే, గతంలో దేశీ బ్యాంకులు వీటిపై దృష్టిపెట్టగా... ఈసారి విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలను ఆకట్టుకునే పనిలోపడ్డాయి. పండుగ సీజన్ సందర్భంగా సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లు ఈ టీజర్ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రారంభంలో ఒకటిరెండు సంవత్సరాలపాటు నిర్ధిష్టకాలానికి స్థిరంగా కొంత రాయితీ వడ్డీరేటును వసూలు చేసి తదనంతరం అప్పటి రేటు ప్రకారం వడ్డీరేట్లను కొనసాగించేవిధంగా రూపకల్పన చేసినవాటినే టీజర్ రుణాలుగా పిలుస్తున్నారు. ఇలాంటి టీజర్ రుణాలు కస్టమర్లను తప్పుదోవపట్టిస్తున్నాయంటూ ఆర్బీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దేశీ బ్యాంకులు క్రమంగా వీటికి స్వస్తిపలికాయి. అయితే, ఆర్బీఐ కన్నెర్రకు గురికాకుండా ఈ లోన్ స్కీమ్‌లు పూర్తిగా పారదర్శకంగా ఉండేవిధంగా విదేశీ బ్యాంకులు ఇప్పుడు జాగ్రత్తపడుతుండటం గమనార్హం. తక్కువ రేటుతో గాలం... హెచ్ఎస్బీసీ బ్యాంక్, సిటీ బ్యాంక్‌లు తమ టీజర్ గృహ రుణ ఆఫర్లను నవంబర్ 30లోపు బుకింగ్ చేసుకునే రుణ దరఖాస్తులకు వర్తింపజేస్తున్నాయి. సిటీ బ్యాంక్ ఈ ఆఫర్‌ను గత నెలలోనే ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2015 సెప్టెంబర్ వరకూ 10.25% స్ధిర వడ్డీరేటును (హోమ్ క్రెడిట్ ఫెసిలిటీ కాకుండా) వసూలు చేస్తుంది. ఆ తర్వాత నుంచి బేస్ రేటు ఆధారిత వడ్డీరేటును అమలు చేస్తుంది. అంటే బేస్ రేటుకు ఒక శాతం వడ్డీరేటు కలిపి వసూలు చేస్తుంది. హోమ్ క్రెడిట్ అంటే.. ఎవరైనా కస్టమర్ రూ. 10 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నారనుకుందాం. ఆ కస్టమర్‌కు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.3 లక్షలు గనుక ఉంటే అందులో రూ.2 లక్షలను బ్యాంక్ బ్లాక్ చేసేందుకు అనుమతిస్తే.. మొత్తం రుణంపై కాకుండా కేవలం రూ.8 లక్షలపై మాత్రమే వడ్డీరేటును విధిస్తారు. ఈ హోమ్ క్రెడిట్‌తో టీజర్ గృహ రుణాలపై సిటీ బ్యాంక్ 2015 సెప్టెంబర్ వరకూ 10.5% వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది ఆతర్వాత బేస్ రేటుపై 1.25% చొప్పున వడ్డీరేటు ఉంటుంది. కాగా, ప్రస్తుతం సిటీ బ్యాంక్ చర(ఫ్లోటింగ్) వడ్డీరేటు 10.75 శాతంగా ఉంది. హెచ్ఎస్బీసీ విషయానికొస్తే... తొలి ఏడాది టీజర్ గృహ రుణాలపై 10.25 శాతం వడ్డీరేటు వసూలు చేస్తోంది. తర్వాత నుంచి బేస్‌రేటు, అప్పటి ఫ్లోటింగ్ రేటు మార్జిన్‌ను వర్తింపజేస్తుంది. గృహ రుణ కన్సల్టెంట్ల అభిప్రాయం ప్రకారం.. ఏడాది తర్వాత హెచ్ఎస్బీసీ స్కీమ్‌లో బేస్ రేటుపై 0.5 శాతం వరకూ అధిక వడ్డీరేటు ఉండొచ్చని అంచనా. స్టాన్ చార్ట్ మూడేళ్ల ఆఫర్... టీజర్ గృహ రుణ ఆఫర్ కింద మూడేళ్లపాటు(2016 వరకూ) 10.26% స్థిర వడ్డీరేటును స్టాన్‌చార్ట్ ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ బేస్ రేటు 10.25%. కాగా, మూడేళ్ల తర్వాత ఎలాంటి వడ్డీరేటును అమలు చేస్తుందో వివరాలు అందుబాటులో లేవు. అప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చనేది బ్యాంకింగ్ వర్గాల అభిప్రాయం.