న్యూఢిల్లీ : నల్లధనం వ్యవహారంలో భారత్తో కుదుర్చుకున్న ఒప్పందంతో స్విస్ బ్యాంక్ ఇప్పటికే 628 మంది సమాచారాన్ని సిట్కు సమర్పించింది. తాజాగా లండన్లోని హెచ్ఎస్బీసీలో 1195 మంది భారతీయులకు అకౌంట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం భారతీయుల అకౌంట్స్ మొత్తం విలువ రూ.25,420 కోట్లు ఉంటుందని అంచనా.
ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు (ఐసీఐజే) ల దర్యాప్తులో ఈ నల్లధనం వెలుగులోకి వచ్చింది. నల్లధనాన్ని బయటికి తేవాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రిమినల్స్, బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచి ఉంటారని తనిఖీలు నిర్వహించినట్టు ఐసీఐజే జర్నలిస్టు ఒకరు తెలిపారు.
హెచ్ఎస్బీసీలో 1,195మంది నల్ల కుబేరులు
Published Mon, Feb 9 2015 12:55 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement