Preview
-
ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ ప్రివ్యూ
-
రూ.450 కోట్ల ఆదాయంతో ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాజెక్ట్!
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ ను జాయింట్ వెంచర్ విధానంలో ఎపీఎండీసీ చేపట్టనుంది. ఇందుకు గానూ జాయింట్ వెంచర్ సంస్థ ఎంపిక కోసం నిర్వహించే టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎపీఎండీసీ మంగళవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, డెవలప్ మెంట్, ఆపరేషన్ కమ్ మైయింటెనెన్స్ కోసం జేవీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎపీఎండీసీ ప్రకాశం జిల్లా కొణిజేడు మర్లపాడు ప్రాంతం పరిధిలో మొత్తం 1307.26 ఎకరాల్లో లో-గ్రేడ్ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను పొందింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ద్వారా లోగ్రేడ్ ఖనిజాన్ని మైనింగ్ చేయడం, బెనిఫికేషన్ ద్వారా నాణ్యతను పెంచడం ద్వారా ఏడాదికి సుమారు రూ.450 కోట్ల మేర సంస్థకు రెవెన్యూ లభిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాలని చట్టం చేసింది. దానిలో భాగంగా ఐరన్ ఓర్ టెండర్ డాక్యుమెంట్ లను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ కు సమర్పించడం జరిగిందని ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఈ టెండర్ డాక్యుమెంట్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కమిషన్ ఈ-మెయిల్ judge-jpp@ap.gov.in ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని కోరారు. -
రేపే నారాయణమూర్తి యూనివర్సిటీ
‘‘యూనివర్సిటీ’ విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆర్. నారాయణమూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ‘యూనివర్సిటీ’ ప్రివ్యూ వేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ– ‘‘దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఉండదు’ అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా గట్టిగా చెప్పారు నారాయణమూర్తి’’ అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య దేశాన్ని ఎంత పట్టి పీడిస్తోందో ఈ చిత్రంలో బాగా చెప్పారు’’ అన్నారు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ‘‘పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. -
ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావు
సాక్షి, అమరావతి: ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇసుక టెండర్లపై న్యాయ సమీక్ష ఏదంటూ ఈనాడు పత్రికలో రాసిన కథనం పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ వక్రీకరణ వార్తను ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చే శారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు సంబంధించిన నిబంధనలు అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్లో ఉన్నాయని, కనీసం వాటిని పరి శీలించకుండా ఈనాడు కథనాలు రాయడం బాధ్యాతా రాహిత్యమని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. రూ.100 కోట్లు దాటితేనే.. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లకుపైగా వ్యయం చేస్తే.. అలాంటి ప్రాజెక్టులకు నిర్వహించే టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఆమోదం తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. తాజాగా గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఆ టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు కోరలేదంటూ ఈనాడు అవగాహనా రాహిత్యంతో వార్త రాసిందన్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేయడం కోసమే ఈ కథనం రాశారని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం కాంట్రాక్టింగ్ ఏజెన్సీని టెండర్ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చేసే వ్య యం చాలా స్వల్పమని తెలిపారు. ఈ టెండర్లలో ఎంపికైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. ఆ సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తానికి ఇసుకను వినియోగదారులకు విక్రయించి, టెండర్లలో ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తానని కోట్ చేసిందో ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఎక్కడ వ్యయం చేస్తోందని ప్రశ్నించారు. అలాంటప్పుడు న్యాయసమీక్షకు పంపలేదని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. బీచ్ శాండ్‌లో ఏపీఎండీసీ చెల్లింపులు జరుపుతుంది కాబట్టే ప్రివ్యూకి బీచ్ శాండ్ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఇసుక టెండర్లను పంపలేదంటూ బోడిగుండుకు, మోకాలికి ముడి వేసేలా కథనంలో వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. బీచ్ శాండ్ ఆపరేషన్స్ చేసే కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఏపీఎండీసీ రూ.100 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండటం వల్లే ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపామని తెలిపారు. కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని వెల్లడించారు. దీనిని అర్థం చేసుకోకుండా సందేహాలు అంటూ ఈనాడు పత్రిక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. -
కౌంట్ డౌన్ షురూ.. షారూక్ ఖాన్ ‘జవాన్’ క్రేజీ అప్డేట్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘జవాన్’. ఈ చిత్రం కోసం ప్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జవాన్ ప్రివ్యూను జూలై 10న ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు షారూక్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) అయితే ఈ సినిమాను ఎలా ఉండబోతుంది? అసలు షారూక్ ఖాన్ స్టార్ డమ్‌ను అట్లీ ఎలా చూపించబోతున్నారు? అని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాతో పాటు కౌంట్ డౌన్లో అందరూ భాగస్వామ్యం కావాలని మేకర్స్ ప్రకటించారు. కాగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మాతగా.. జవాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: నా నడుము 22.. ఆ రోజులు కనుమరుగై పోయాయి: స్టార్ హీరోయిన్) मैं पुण्य हूँ या पाप हूँ?... मैं भी आप हूँ... Main punya hoon ya paap hoon?... Main bhi aap hoon…#JawanPrevueOn10July#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/GI3RqgVGqr — Shah Rukh Khan (@iamsrk) July 8, 2023 -
చాలా గ్యాప్ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్, హాలీవుడ్ నటిలా లేడీ సూపర్ స్టార్
తల్లయిన తర్వాత లేడీ సూపర్ స్టార్ తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా నయన్ పెద్దగా బయటకు రావడం లేదనే విషయం తెలిసిందే. తన మూవీ ప్రమోషన్స్‌లో సైతం హాజరకావడం లేదు. సినిమాకు సంతకం చేసినప్పుడే చిత్రం దర్శక-నిర్మాతలకు నయన్ ముందుగానే ఈ కండిషన్ పెట్టేదట. అందుకే ఆమె ఏ మూవీ ఈవెంట్స్ అయినా చివరికి తన చిత్రం ప్రమోషన్స్‌కి దూరంగా ఉండేది. కానీ, తాజాగా నయన్ తన తీరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె చాలాకాలం తర్వాత మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. నయన్ తాజా చిత్రం కనెక్ట్ మూవీ ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. చదవండి: ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాకు ప్రదర్శించిన కనెక్ట్ మూవీ ప్రివ్యూ షోకు నయన్ తన భర్త విఘ్నేశ్ శివన్‌లో కలిసి హాజరైంది. అక్కడ హాలీవుడ్ నటిలా స్టైలిష్‌గా కనిపించిన ఆమెను చూసి అభిమానులంతా స్టన్ అయ్యారు. పెళ్లయ్యాక నయన్ మరింత అందంగా, స్టైలిష్‌గా మెకోవర్ అయ్యిందంటూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ షో హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని నయన్‌ను పిలిచి ఐ లవ్ యూ మామ్ అని అన్నాడు. మరికొందరు కనెక్ట్ చిత్రం బాగుందంటూ ప్రసంశలు కురిపించారు. దీంతో ఆమె చాలా థ్యాంక్స్ అంటూ చిరునవ్వులు చిందించింది. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! నయనతార ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ చిత్రాన్ని ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. గతంలో నయనతార నటించిన మాయ, తాప్సీ నటించిన గేమ్ ఓవర్ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దీన్ని తెరకెక్కించారు. హార్రర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాల తరహాలో 99 నిమిషాల నిడివితో రూపొందడం విశేషం. ఇది లాక్డౌన్ నేపథ్యంలో హర్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందింది. ఈ చిత్రంలో నయనతారతో పాటు సత్యరాజ్, వినయ్‌రాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా కనెక్ట్ చిత్రాన్ని ఈ నెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు విఘ్నేష్ శివన్ ఈ సందర్భంగా తెలిపాడు. -
విడుదలకు సిద్ధంగా 'మాటరాని మౌనమిది'..
Matarani Mounamidi Movie Preview Release: రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మాటరాని మౌనమిది". ఈ మూవీ అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే చిత్రంలో పని చేసిన నటీనటులు టెక్నిషన్స్ అందరు కలిసి "మాటరాని మౌనమిది" ఫస్ట్ కాపీని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో వీక్షించారు. చిత్రం చుసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీలో ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని కొనియాడారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ "ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనంతో చిత్రాన్ని నిర్మించాం. ఫస్ట్ కాపీ రెడీ అయింది. మా టీం అందరం కలసి ఈ సినిమాను వీక్షించాము. మూవీ చాలా బాగా వచ్చింది. మా టీం అందరం చాలా నమ్మకంగా ఉన్నాం, సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల.. -
హాలీవుడ్ స్ట్రాటజీతో 'మేజర్'.. సాధారణ రేట్లకే సినిమా
Adivi Sesh Plans Major Movie Nationwide Preview Before Release: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లలో రిలీజ్ కానుంది. ఈ ప్రివ్యూలను హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తారు. ఇందుకోసం బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రివ్యూస్ చూడాలనుకునేవారు బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా ప్రివ్యూలను హాలీవుడ్లో విడుదల చేస్తారు. సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రధాన నగరాల్లో పది లేదా నెల రోజుల గ్యాప్‌తో ప్రదర్శిస్తారు. తమ సినిమాలకు మరింత పాపులారిటీ తెచ్చుకునేందుకే ఈ తరహా స్ట్రాటజీని వాడతారు. ఇప్పుడు ఇదే టెక్నిక్‌ను తన సినిమా కోసం అడవి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకే ఈ ప్రివ్యూస్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా రిలీజ్‌కు ముందే ప్రివ్యూస్ వేయడం దేశంలోనే ఇదే తొలిసారి. చదవండి: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే: మహేశ్ బాబు అలాగే ఈ సినిమా టికెట్ రేట్లపై అడవి శేష్ ఇటీవల స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా 'ఆస్క్ శేష్' సెషన్లో ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది. 'టికెట్ రేట్లను తగ్గించండి. రిపీటెడ్‌గా సినిమా చూసేందుకు వీలుంటుంది. ఫలింతగా ఇండస్ట్రీని కాపాడొచ్చు.' అని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు శేష్ బదులిచ్చాడు. తమ సినిమా టికెట్లు సాధారణ రేట్లతో అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. 'ఇది సాధారణ ప్రేక్షకులు చూడాల్సిన అసాధారణ సినిమా' అని పేర్కొన్నాడు. దీంతో 'ఎఫ్ 3' మూవీ తర్వాత సాధారణ రేట్లకే టికెట్ రేట్లను కేటాయించిన సినిమాగా 'మేజర్' నిలిచింది. చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
సిరీస్ విజయానికి అడుగు దూరంలో ఇంగ్లాండ్
-
భవిష్యత్ డిజిటల్ రంగానిదే
‘‘ఏడాది క్రితం ఓ మీడియం మన సినిమాలను తినేస్తుందేమో అనే భయంతో ‘ఆహా ఓటీటీ’ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. ఆహా గురించి మా అబ్బాయిలకు (అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శీరిష్)లకు చెప్పగానే..‘నాన్నా.. నువ్వు రేపటిని చూస్తున్నావ్’ అన్నారు. తెలుగు వారికి తెలుగు కంటెంట్‌ను చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ‘ఆహా ఓటీటీ’కి శ్రీకారం చుట్టాం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘ఆహా ఓటీటీ’ ప్రివ్యూ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఎవరైనా డిజిటల్ మీడియంలోకి రావాలంటే సందేహించొద్దు. భవిష్యత్తు డిజిటల్ రంగానిదే. ఇది మాకు కొత్త. అందుకే అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. మై హోమ్ రామేశ్వర్‌రావుగారు, రామ్‌లతో పాటు మరికొందరు ‘ఆహా ఓటీటీ’లో భాగస్వామ్యులుగా ఉన్నారు. అజయ్ ఠాకూర్ హ్యాండిల్ చేస్తున్నారు. టెక్నాలజీ బిజినెస్ గురించి కోల్‌కతాలోని మా స్నేహితులు, ఓ అమెరికన్ కంపెనీ సపోర్ట్ తీసుకుంటున్నాం. ఈ ఏడాది పాతిక షోలను ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు క్రిష్ ఓ షో చేస్తున్నారు. ఇందులో కంటెంట్ బోల్డ్‌గా ఉంటుంది. కాబట్టి పేరెంట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు. ‘మేం గృహనిర్మాణం నుంచి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాం. అరవింద్‌గారి ఆలోచనల నుంచి పుట్టిందే ‘ఆహా ఓటీటీ’. ఇందులో వందశాతం తెలుగు కంటెంట్ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడాది ప్రీమియాన్ని 365 రూపాయలుగా నిర్ణయించాం’’ అన్నారు జూపల్లి రామూరావు. ‘‘ఆహా ఓటీటీ’ ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ గేమ్‌చేంజర్‌గా చెప్పవచ్చు. టీవీని ఓటీటీ రీప్లేస్ చేస్తుందనిపిస్తోంది. సినిమాల నుంచి వెబ్‌కు యాక్టర్స్ క్రాస్ ఓవర్ అవుతున్నారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘నా రైటింగ్‌లోని మరో కోణమే ‘మస్తీస్’. అజయ్‌భూయాన్ బాగా డైరెక్ట్ చేశారు. అవకాశం ఇచ్చిన అల్లుఅరవింద్, రామ్, అజిత్‌ఠాగూర్‌కి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు క్రిష్. యాక్టర్ నవదీప్ మాట్లాడారు. -
ప్రజాస్వామ్యం ధనస్వామ్యమైంది
‘‘ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. పవిత్రమైన ఓటు విలువ ఏంటి? భ్రష్టు పట్టిపోతున్న నేటి సమకాలీన రాజకీయాలు, అస్తవ్యస్తమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని ఎలా మనం పరిరక్షించుకోవాలి?’’ అనే నేపథ్యంలో మా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా రూపొందింది అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన లీడ్రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జూలై 12న రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రదర్శించారు. అనంతరం ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఎన్నికల కోసం రాజకీయ నాయకులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో ప్రజాస్వామ్యం ధనస్వామ్యమైంది. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే మా సినిమా అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది’’ అన్నారు. రాజకీయ నాయకులు వి.హనుమంతరావు, మధుసూదనాచారి, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, గాజుల శ్రీనివాస గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య, విమలక్క, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ తదితరులు సినిమాని చూసి, అభినందించారు. -
దక్షిణనియ్యి! వద్దొద్దు! నాకెందుకు నీ దక్షిణ!?
ఎక్కడైనా సరే కన్నతల్లిని చూస్తే తన బిడ్డ కళ్లలోకి అలా చూసి క్షణం ఆగి గట్టిగా హత్తుకుని పెద్ద ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇద్దరిలోనూ కన్పించే తేడా ఏమిటి? తేడా ఏమిటో కన్పించనితనమే!కన్నతల్లి తన బిడ్డ కళ్లలోకి చూస్తూ ఎంత ఎదురుచూసేలా చేశావురా? బొజ్జలో ఉండి ఎన్ని తన్నులు తన్నావురా? ఎన్ని తినరాని(మట్టి సుద్ద మరీపులుపు..) వాటిని ఇష్టంగా తినిపించావురా? ఒకసారి నేను కూడా దక్కని పరిస్థితిని కల్పించి ఎంత గాభరా పుట్టించావురా? అనుకుంటూ ఆ పసివాడి కళ్లలోకి ఈ భావాన్నంతటినీ వ్యక్తీకరిస్తూ ఆ ఆనందాతిశయాన్ని భౌతికంగా వ్యక్తీకరిస్తూ ‘గాట్టి పెద్ద ముద్దు’ని పెడుతుంది.అదే మరి పక్కనున్న మరొక ఆమె అయితే.. బోసినవ్వు ఎంత బాగుంది? గిరజాలెంత చక్కగా ఉన్నాయి? బుగ్గలెంత బూరెల్లా కనిపిస్తున్నాయి..! అంటూ ముద్దెట్టుకుంటుంది. ఇద్దరూ చేస్తున్నదీ చేసిందీ ఒకే పని అయినా ఎంత వ్యత్యాసముంది?ఇదే తీరుగా ఏదో బాబాని దర్శించేయడం కాకుండా ‘బాబా! నన్నెంత తలకిందులైన పరిస్థితి నుండి ఊహాతీతంగా బయటపడేశావ్? పూర్తిగా ఎండిన చెట్టులా ఉన్న నన్ను చిగిర్చి పుష్పించేలా చేశావు?’ అనుకుంటూ చూసేవారికి బాబా మరింత ఆనంద అనుగ్రహదర్శనాన్నిస్తాడు. ఏదో పదిమందితో వెళ్లాం కదా! అని చూస్తే కనిపిస్తాడు తప్ప దర్శనాన్ని ఇవ్వడు. ఇది అనుభవం ద్వారా మాత్రమే తెలిసే విషయం.ఇక్కడ ఈ మాటలెందుకనుకోవచ్చు! బాబాని దర్శించడానికి వెళ్లే ముందు బాబా గురించిన ఎంతో సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నట్టుగా తెలుసుకుని గాని దర్శించుకున్నట్లయితే ఆ చూసే చూపులో లోతుదనమే వేరు. అలా కాక కేవలం దర్శించి నమస్కరించేస్తే పై ఉదాహరణలో కన్నతల్లి కాని ఆమె పొందినది ఆనందమే అయినా అది కన్నతల్లి ఆనందంలాంటిదెలా కాదో.. కాలేదో.. అలాగే ఉంటుంది. 15 రూపాయలివ్వు! సాయి దర్శనం కోసం గోవా నుంచి ఇద్దరు పెద్ద వయసువాళ్లొచ్చారు. సాయి దర్శనాన్ని చూస్తూనే చెప్పలేని ఆనందంతో పాదాభివందనాన్ని వినమ్రులై చేశారు. ఇద్దరూ కలిసే వచ్చారు. ఇద్దరూ కలిసే పాదాభివందనాన్ని చేశారు. అయితే సాయి మాత్రం మొదటివాణ్ని చూస్తూ ‘నాకో 15 రూపాయల దక్షిణనివ్వు!’ అని అడిగాడు. సాయి దర్శనం లభించడమే అదృష్టకరమైన అంశమనుకుంటూ ఉంటే ఆయనే దక్షిణ అడిగి మరీ తీసుకోవడం అనేది మరింత అదృష్టకరమైన అంశమనుకుంటూ వెంటనే 15 రూపాయలనీ ఇచ్చేశాడు మొదటి వ్యక్తి.‘అయ్యో! ఆయన అడక్కుండానే దక్షిణనిచ్చి ఉంటే ఎంత బాగుండేది?’ అనుకుంటూ రెండవ వ్యక్తి 35రూపాయల దక్షిణని సాయికివ్వబోతే వద్దు అంటూ చేతి సంజ్ఞని చేస్తూ సాయి తిరస్కరించాడు.ఇతని దగ్గర అడిగి తీసుకోవడమేమిటి? అతను తనంత తానుగా ఇంతకంటే ఎక్కువనియ్యబోతే తిరస్కరించడమేమిటి? అని అక్కడున్న భక్తులందరికీ, వచ్చిన గోవాభక్తులిద్దరికీ సంశయం కలిగింది. బాబాని అడగాలంటే భయం, సంకోచం కాబట్టి ఎవ్వరూ అడగలేకపోయారు. గానీ ‘శ్యామా’మాత్రం బాగా చనువున్నవాడు కాబట్టి సాయికి నమస్కరించి ‘ఈ సంశయాన్ని ఆయన ముందు పెట్టి అనుమానాన్ని తీర్చవూ?’ అని అడిగాడు సాయిని.బాబా శ్యామా ముఖంలోనికి చూస్తూ.. ‘శ్యామా! నాకు కుటుంబం ఉందా?’ అని అడిగాడు. ‘లేదు లేదు’ అన్నాడు శ్యామా.‘భార్య, పుత్రులు, దత్తులు ఉన్నారా?’‘లేరు లేరు..!!’‘తీర్చుకోవలసిన బాధ్యతలూ చేసిన అప్పులూ ఏమైనా ఉన్నాయా?’‘లేనే లేవు..!’‘మరి నాకు డబ్బెందుకు?’ అన్నాడు సాయి.వెంటనే శ్యామా ‘బాబా! మరి నువ్వేకదా దక్షిణ అడిగావు! ఒకరి వద్ద తీసుకున్నావు. మరొకరియ్యబోతుంటే వద్దన్నావు! అదీ కాక నీకు సొమ్ము అవసరమే లేకపోతే మరి కొందరి దగ్గర కూడా దక్షిణ అడిగి తీసుకు రమ్మంటుంటావు. తెచ్చాక తీసుకుంటావు కదా!’ అని చుట్టూ ఉన్న అందరి భక్తుల అనుమానాలన్నింటినీ కలిపి అడుగుతున్నా అన్నట్లు ధైర్యంగా అడిగాడు. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! చేసిన అప్పు, శత్రుత్వం, చంపితీరాలనే పగా అనేవి జన్మలెన్ని ఎత్తినా తీర్చుకోనంత కాలం అవి వెంట వస్తూనే ఉంటాయి. నీకు ఏ రుణమూ లేదు. అందుకే నాకింత సన్నిహితుడివిగా ఉంటున్నావు. ఒక్కమాటలో చెప్పాలంటే... రుణవిముక్తి కోసమే నా దగ్గరి కొస్తారు. రుణ విముక్తిని చేసుకుంటారు. ఇక నాకు అతుక్కుని అలా వస్తూ పోతూనే ఉంటారు’ అన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులంతా అర్థమైనట్టూ బాబా చెప్పినమాటలు కానట్టూ ఉండగానే బాబా చెప్పడం మొదలెట్టాడు వివరంగా.‘ఇదుగో! ఈ భక్తుడున్నాడే! ఒకప్పుడితనికి ఉద్యోగం లేదు. తీవ్రమైన సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. నిరుపేద. ఒకరోజున మొక్కుకున్నాడు. ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తానని. మొక్కుకున్నట్లే ఉద్యోగం వచ్చింది. మొక్కుబడి విషయాన్ని మరచిపోయాడు. 15.. 30.. 50... అలా పెరిగిన జీతం ఈ రోజున 700 అయ్యింది. అదుగో ఆ వచ్చిన ఈ వ్యక్తి నాకు రుణగ్రస్తుడు కాదూ! అందుకే అతను ఇస్తానని ఆనాడు ఒప్పుకున్న ఆ 15 రూపాయలని మాత్రమే అడిగి తీసుకున్నాను. ఇప్పుడు 700 కావచ్చు. అది నా కొద్దు. అది అతని మొదటి జీతం కాదు గదా! కాబట్టి ఇతన్ని అడిగి తీసుకున్న 15 రూపాయలు నాకు చెల్లించవలసిన బాకీపడిన పైకం మాత్రమే’ అన్నాడు. అంతా ఆశ్చర్యచకితులయిపోయారు.30,000 రూపాయల చౌర్యం‘శ్యామా! నేనొకప్పుడు సముద్రపు ఒడ్డున తిరుగుతున్నాను. అలా నడుస్తూ ఉంటే ఓ సుందరమైన భవనం కనిపించింది. అదొక సద్బ్రాహ్మణునిది అని ఆ భవనానికున్న నామఫలకం చెప్తోంది. మంచి జాతి కదా అని గ్రహించి ఆ భవనానికున్న వరండాలో కూర్చున్నాను. ఆ యజమాని నన్నేమీ అనలేదు సరికదా నన్ను లోనికి పిలిచి చక్కని భోజనాన్ని పెట్టి మంచి వసతిగా ఉన్న శుభ్రమైన పడకగదిలో పడుకోబెట్టాడు కూడా! నేనెంత గాఢంగా నిద్రపోయానో నాకే తెలియదు. అయితే తెల్లవారిన తర్వాత చూసుకుంటే నా జేబులో ఉన్న 30 వేల రూపాయల కరెన్సీ కాగితాలు చౌర్యానికి గురయ్యాయని అర్థమయింది. ఆయన సద్బ్రాహ్మణుడే కాక సకాలంలో ఆదుకున్నవాడు. ఆయన్ని అనుమానించడం మహాపాపం. ఆయన ఈ విషయాన్ని విని చాలాసేపు నన్ను ఓదార్చాడు. పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉన్నాను. ఒకరోజు రెండ్రోజులు కాదు. అదే బ్రాహ్మణుని ఇంటి వరండాలో 15 రోజుల పాటు రోజూ చేసేపని ఏడవడమే. ఆ మరుసటి రోజున కూడా ఇలాగే తలుచుకు తలుచుకు ఏడుస్తూ ఉంటే ఎక్కడి నుండో ఓ ఫకీరొచ్చాడు. ఉర్దూలో రెండురెండు పాదాలు మాత్రమే ఉండే ద్విపదల్లాంటివి పాడుతూ నా దగ్గరికే వచ్చాడు.‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. జరిగిందంతా చెప్పాను. ‘ఇంతేగా! నీకో ఫకీరు పేరు చెబుతాను. ఆయన ఉండే చోటు కూడా చెప్తాను. ఆయనకి మొక్కుకో! ‘నీ డబ్బు మొత్తం నీకు తిరిగొచ్చి నీకు చేరే వరకూ ప్రతిరోజూ నువ్వుతింటున్న వరి అన్నాన్ని తిననే తిననని ఆ ఫకీరుకి పూర్తి శరణాగతుడివి అయి ఆయన నామాన్నే జపించుకుంటూ ఉండు’ అని.మరేమీ తోచలేదు. ఆ ఫకీరు చెప్పినట్లే పూర్తి నిష్ఠతో నామాన్ని జపిస్తూ ఉండిపోయాను. సరిగ్గా కొన్నిరోజులు జపించానో లేదో ఆ దొంగిలింపబడ్డ సొమ్ము నా వద్దకొచ్చింది. ఆనందంతో ఆ బ్రాహ్మణుని ఇంటిని విడుస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పి సముద్రం దగ్గర కొచ్చాను. స్టీమర్ (నౌక) వచ్చింది. దాన్నిండా జనం. ఎవరో ఒక సిపాయి నాకు అడ్డుపడి లోనికి తీసుకుపోయి నాకు చోటునిచ్చి మరీ కూర్చోమన్నాడు. నౌక సముద్రం ఆ ఒడ్డుకి చేరింది. అక్కడి నుంచి రైలెక్కాను. ఇదిగో ద్వారకామాయి’ కొచ్చానన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులందరికీ ఈ 2వ కథ అగమ్యగోచరంగా ఉండేసరికి ఆశ్చర్యంగా వింతగా చూడసాగారు బాబా వైపు. వెంటనే శ్యామాని చూస్తూ బాబా ‘శ్యామా! ఈ అతిథుల్ని నీ ఇంటికి తీసుకెళ్లు. మంచి భోజనాన్ని పెట్టి విశ్రాంతినిప్పించు’ అన్నాడు.శ్యామా ఆ ఇద్దరినీ తనింటికి తీసుకెళ్లాడు. చక్కగా భోజనాన్ని పెట్టాడు. వాళ్లు తినడం ముగించాక! బాబా చెప్పిన కథ మీకేమైనా అర్థమయిందా? బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఉన్నాడు. ఆయనేమిటి? సముద్రపు ఒడ్డేమిటి? బ్రాహ్మణగృహంలో ఉండటమేమిటి? ఆయన దగ్గర 30 వేల రూపాయలుండటం, అవి ఓ దొంగ చేతికి చిక్కడం, ఆయన దుఃఖిస్తూ ఉండిపోవడం, తిరిగి సొమ్ము ఆయనకి రావడం... ద్వారకామాయికి రావడం... ఇదంతా అగమ్యగోచరంగా ఉంది నాకు. మీ ఇద్దరూ వచ్చాక బాబా ఈ కథని చెప్పాడంటే ఈ కథకి తుదీ మొదలూ మీకే తెలిసుండాలి’ అన్నాడు. దాంతో ఆ ఇద్దరి కంఠాలు గద్గదమైపోతూ ఉంటే మొదటి ఆయన చెప్పాడు. ఆ కథ నాదే. చిచిఘాట్ నా జన్మస్థానం. నిరుపేదనైన నేను సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉద్యోగం కోసం ప్రయత్నించసాగాను. దత్తాత్రేయుణ్ని కొలుస్తూ ఉద్యోగం రాగానే మొదటి జీతాన్ని సమర్పించుకుంటానన్నాను. చిత్రమేమంటే నా మొదటి జీతం 15. నేటి జీతం 700. అన్నాను గానీ మొదటి జీతాన్ని మొక్కుగా చెల్లించుకోవాలనే మాటను మరచాను. సరిగ్గా బాబా నేటి జీతాన్ని 700 అని చెప్తూ నాటి జీతమే (15 మాత్రమే) కావాలని నేను చెప్పకుండా ఈయకుండా ఉంటే ‘అడిగి మరీ తీసుకున్నాడు’. ఆయన ఓ దైవం. సర్వజ్ఞుడు.దోషాన్ని మనకి మనమే గుర్తించేలా చేసి క్షమించే దైవం అని ముగించాడు.కాబట్టి కంచికామకోటి పరమాచార్యులవారు ఓ మాటని చెప్తూ ఉండేవారు. ఎవరైనా దైవానికి మొక్కుకుని ఉంటే ప్రతిరోజూ డైరీలోనూ మొదటివాక్యంగా ఈ మొక్కు వివరాలను రాసుకుంటూ ఉండాలని. అది ఎంత గొప్పమాట. సత్యనారాయణస్వామి వ్రతంలో మొక్కుని మరిచిపోవడం, షావుకారుకి భార్య గుర్తు చేసినా వాయిదా వేయడం, చివరికి తప్పుని అంగీకరించి ఒడ్డునపడటం.. అనే ఆ కథ ఎంతటి కనువిప్పునిస్తుంది మనకి! గమనించుకోవాలి! అనుకోకుండా వచ్చిన క్రమక్రమ ఆపదలలో మొక్కేసుకోవడం ఇన్ని సంఖ్యలో ఉన్న మొక్కుల్లో దేన్నో మర్చిపోవడం లేదా మొక్కుకున్న వివరం గుర్తులేకపోవడం వంటివి జరుగుతూ ఉండటం సర్వసాధారణం. సాయి దయార్ద్రహృదయుడు కాబట్టి మనం చేసిన దోషాన్ని గుర్తుచేసి మరీ మనచేత తీర్పించుకుంటాడన్న మాట. అలాగని ఆయనే గుర్తు చేస్తాడు కదా! అహంకార నిర్లక్ష్యభావాన్ని చూపిస్తే మనకి ఫలితం బాగా అర్థమయ్యేలా చేస్తాడు కూడా! కాబట్టి సకాలంలో మొక్కుని సరిగా తీర్చుకోవాలి తప్పదు! రెండవది నా కథే! రెండవ ఆయన కన్నీళ్లు తన్నుకుంటూ వస్తూంటే తన కథని చెప్పసాగాడు. ‘నేనొక వర్తకుడ్ని. వ్యాపారపు పనుల కారణంగా కుదరదనుకుని ఒక బ్రాహ్మణజాతి వంటవాడ్ని ఏర్పాటు చేసుకున్నాను. 35 ఏండ్ల నుండే మా ఇంట్లో తలలో నాలుకగా అయిపోయాడాయన.ఎవరో ఒక నీచుని సహవాసం వచ్చింది. దాంతో నేను పడుకునే గదిలో డబ్బు దాచుకునే బీరువా ఏ గోడలో బిగింపబడి ఉంటుందో తెలిసిన అతను ఓ నాటి రాత్రి ఆ గోడకి అమర్చబడిన బీరువాకి అటు ఇటూ ఉండే ఇటుకల్ని తొలగించి బీరువాకి రంధ్రాన్ని చేసి 30,000 రూపాయల సొమ్ముని కాజేశాడు. వ్యాపారపు పెట్టుబడి సొమ్మంతా దొంగతనానికి గురైందని తెలిసి ఇవ్వవలసినవారికి ఎలా ఇయ్యాలో.. సరుకుని ఎలా కొనుగోలు చేయాలో?... ఏం దిక్కుతోచక బావురుమంటూ ఏడుస్తూ 15 రోజుల పాటు కంటికీ మింటికీ ధారగా ఏడుస్తూనే గడిపాను రాత్రింబవళ్లని.15 రోజుల పాటూ మరో పనిలేదు. ఏడుపే ఏడుపే. 15 రోజులు నిండాక ఓ ఫకీరు నా దగ్గర కొచ్చాడు. ఏడుస్తున్న నన్ను దగ్గరికి తీసుకుంటూ కారణాన్ని అడిగాడు. చెప్పాను. వెంటనే తరుణోపాయాన్ని (కష్టాన్ని దాటగల ఉపాయాన్ని) చెప్పాడు. ‘కీపర్గాంవ్ అనే తాలూకాలో షిరిడీ అనే కుగ్రామం ఉంది. అక్కడ ‘సాయి’ అనే ఓ జాలియా (నియమ బద్ధమైన జీవితాన్ని గడిపే జ్ఞాని అయిన ఫకీరు) ఉన్నాడు. ఆయనకి మొక్కుకో! ‘నీ సొమ్ము నీకు వచ్చేలా చేయవలసిందనీ సొమ్మొచ్చే వరకూ వరి అన్నాన్ని (నిత్య ఆహారం) ముట్టనే ముట్టననీ సొమ్ము లభించాక దర్శనానికొస్తాననీ, ఈలోగా నామజపాన్ని చేస్తూనే ఉంటాను’ అని మొక్కుకో అన్నాడు. ఆ ఫకీరు చెప్పిన మాటల్నే మంత్రంగా భావించి అలాగే చేయసాగాను. ఆశ్చర్యకరంగా ఆ బ్రాహ్మణజాతి వంటవాడు వచ్చి 30 వేల రూపాయలనీ ఇచ్చేసి.. మతిభ్రమించి ఏం చేశానో ఆ సమయంలో తెలియలేదు. తిరిగి ఈ సొమ్మునిచ్చే వరకూ మనశ్శాంతి లేక ఇలా వచ్చాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు వెదికినా నాకు ఈ కోపర్‌గాంవ్ జిల్లాలోని షిరిడీ కుగ్రామంలోని సాయి వద్దకి వెళ్లవలసిందనీ ఆహార నిషేధాన్ని పాటించవలసిందనీ నామజపాన్ని కానిస్తూండవలసిందనీ చెప్పిన ఆనాటి ఫకీరు కనపడనే లేదు. అలాంటి వ్యక్తి ఎవరికీ కనపడలేదని కూడా అందరూ చెప్పారు.ఈ రోజున ఇక్కడికి వచ్చాను. ఆ ఫకీరు చెప్పిన సాయి ఈయనయే. నా చరిత్ర మొత్తం అలా కళ్లకి కట్టినట్టు చెప్పడం.. 30 వేలు మాత్రమే అని చెప్పగలగడం. నా 15 రోజుల శోకం.. ఇదంతా అక్షరాక్షర సత్యం అని ఆనందాశ్రువుల్ని రాల్చాడు.సొమ్ము 30 వేలూ నాకు లభించాక కూడా నేను మరింత వ్యాపారాభివృద్ధికి ‘కొలాబా’ అనే ప్రదేశానికి వెళ్లాను. సాయి నాకు స్వప్నంలో కనిపించాడు. అంతే! బుర్ర పాడయిపోయింది. ఇంత సొమ్ములభింపజేసిన సాయి దర్శనం కంటే వ్యాపారం ముఖ్యమా? అనుకుంటూ సముద్రపు నౌక దగ్గరికి రాగానే అడ్డుకున్నాడు సరంగు(కెప్టెన్). ఒక సిపాయి–తనకి నేను బాగా తెలుసునని చెప్తూ లోనికి ఎక్కనిచ్చాడు. ఇలా రాగలిగాను బుద్ధివంకరని పోగొట్టుకుని. ఆయనకి నేను 35 రూపాయలని ఇయ్యబూనడమా? ఎంత అవివేకిని? అంటూ బిగ్గరగా ఏడ్చాడు. గమనించుకోవాలి! మనం మొక్కుని ఎప్పుడు తీర్చుకోకుండా ఉంటామో అప్పుడు మన అపరాధాన్ని తెలియజేసే కరుణార్ద్రహృదయుడాయన. అహంకరిస్తే అథఃపాతాళానికి తొక్కే సాహసపరాక్రమవంతుడూ ఆయనే. – సశేషం -
తిరుప్రసాదం
అదివో అల్లదివో... అని హరివాసానికి చేరుకుంటాం.గోవిందా గోవిందా... అని స్వామి ఎదుట కన్నీటితో కైమోడ్పులు అర్పిస్తాం.కోర్కెలు కోరుతాం... మొక్కులు చెల్లిస్తాం.అప్పటికి చేసే పని? ప్రసాదాన్ని కళ్లకద్దుకోవడమే!ఇది బ్రహ్మోత్సవాల సమయం.కొండకు వెళ్లలేనప్పుడు ఇంట్లోనే స్వామి దర్శనం.వంటిల్లే శ్రీవారి పోటు! ఆవు నెయ్యి, మిరియాల పొడి, నువ్వుల పొడి, పచ్చకర్పూరం... వీటిని అందుకోండి. ప్రసాదాలు చేయండి. కొండదర్శనం లభించింది అన్నంత పవిత్రంగా ఆరగించండి. తిరుపతి లడ్డూ కావలసినవి: సెనగ పిండి – 100 గ్రా.; పంచదార – 200 గ్రా.; జీడి పప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 4; మిశ్రీ (పటిక బెల్లం చిప్స్) – 50 గ్రా.; పచ్చ కర్పూరం – 2 బిళ్లలు తయారీ: ∙ఒక పాత్రలో సెనగ పిండి వేసి, తగినన్ని నీళ్లు పోసి బూందీ తయారుచేయడానికి అనువుగా ఉండేలా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగపిండిని బూందీ చట్రంలో వేసి దూయాలి ∙బాగా వేగిన తరవాత ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆ నేతిలోనే జీడిపప్పులు, కిస్మిస్ వేసి బాగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙ఒక పాన్‌లో పంచదార, ఒక కప్పు నీళ్లు వేసి కరిగించి, ఉడకగానే ఆ పాకాన్ని బూందీ మీద వేయాలి (తీగ పాకం కూడా రాకూడదు) ∙ఈ లోగా ఏలకులు, పచ్చ కర్పూరాన్ని చిన్న రోట్లో వేసి నలపాలి (మొత్తం పొడి కాకుండా చూడాలి). ∙దీనిని బూందీలో వేసి బాగా కలిపాక, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు జత చేసి బాగా కలపాలి ∙చేతితో లడ్డూలు తయారుచేసి, దేవునికి నైవేద్యం పెట్టాలి ∙ఈ లడ్డూ రుచి ఇంచుమించు తిరుపతి లడ్డూ రుచిని పోలి ఉంటుంది. తిరుపతి వడ కావలసినవి: మినుములు (పొట్టుతో) – ఒకటిన్నర కప్పులు; జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి – పావు కప్పు తయారీ: ∙ముందుగా మినప్పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లలో సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాక, నీటిని శుభ్రంగా ఒంపేసి, మిగిలిన నీరు కూడా పోయేలా రంధ్రాలున్న పాత్రలో పోసి పావు గంటసేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి ∙మినప్పప్పును జత చేసి (రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే జత చేయాలి) ∙మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙రుబ్బుకున్న మిశ్రమం గట్టిగా, జిగురుగా ఉండాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాచాలి ∙అరటి ఆకుకి కొద్దిగా నెయ్యి పూయాలి ∙చేతిని నీటిలో ముంచి, కొద్దిగా పిండి తీసుకుని అరటి ఆకు మీద చేతితో బాగా పల్చగా ఒత్తి, నేతిలో వేసి వేయించాలి ∙మందంగా ఒత్తితే నేతిలో వేగడానికి చాలా సమయం పడుతుంది ∙మంటను మధ్యస్థంగా ఉంచాలి ∙వడలు బంగారు రంగులోకి మారేవరకు వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ∙(నెయ్యి ఎక్కువగా పీల్చుకున్నట్టు అనిపిస్తే, వడలను రెండు గరిటెల మధ్య ఉంచి గట్టిగా నొక్కి నూనె తీసేయాలి) ∙దేవుడికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా తీసుకోవాలి. దేవాలయం తరహా మిరియాల పులిహోర కావలసినవి: బియ్యం – అర కేజీ (తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, అన్నం పక్కన ఉంచాలి); పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; చింత పండు – పెద్ద నిమ్మకాయంత; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; మెంతులు – అర టీ స్పూను; నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; నల్ల మిరియాలు – 20; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 5; నువ్వుల నూనె – 3 టేబుల్ స్పూన్లు; పోపు దినుసులు – ఒక టీ స్పూను (ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; చాయ మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; వేయించిన పల్లీలు – 5 టేబుల్ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ∙స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాక, చింతపండు వేసి దింపేయాలి ∙బాగా చల్లారాక రసం తీసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక మెంతులు వేసి వేయించాక, ధనియాలు జత చేసి (నూనె వేయకూడదు) మరోమారు వేయించాలి ∙మిరియాలు కూడా వేసి బాగా వేయించాలి ∙నువ్వులు జత చేసి దోరగా వేయించి దింపేసి చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పోపు దినుసులు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి సెనగపప్పు వేసి కొద్దిసేపు వేయించాక, మినప్పప్పు వేసి కలపాలి. వేయించిన పల్లీలు వేసి గరిటెతో బాగా కలిపాక, ఎండు మిర్చి వేసి మరోమారు కలిపి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కరివేపాకు వేయాలి ∙పసుపు జత చేసి మరోమారు కలిపాక, చింతపండు రసం వేసి కొద్దిసేపు ఉడికిన తరవాత, రాళ్ల ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాల పాటు చింత పండు రసాన్ని ఉడికించాలి ∙చింత పండు రసం బాగా చిక్కబడ్డాక బెల్లం పొడి వేసి కలిపి దింపేయాలి ∙ఒక పెద్ద పళ్లెంలో అన్నం, పసుపు, చింతపండు పులుసు + పోపు మిశ్రమం వేసి పులిహోర కలియబెట్టాలి ∙మెత్తగా పొడి చేసి ఉంచుకున్న మిరియాలు + ధనియాల పొడిని చివరగా జత చేసి కలియబెట్టి అరగంటసేపు మూత పెట్టి ఉంచాలి ∙దేవునికి నివేదన చేసి అందరికీ ప్రసాదం అందించాలి. సీరా (రవ్వకేసరి) కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; పంచదార – 2 కప్పులు; నీళ్లు – మూడున్నర కప్పులు; బాదం పప్పులు – 10 (నీళ్లలో నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా, ముద్ద చేయాలి); జీడి పప్పు పలుకులు – 20; కిస్ మిస్ – కొద్దిగా; ఏలకుల పొడి – అర టీ స్పూను; ఆవు నెయ్యి – ఒక కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఆ బాణలిలోనే మూడున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి ∙ఆ తరవాత వేయించి ఉంచుకున్న బొంబాయి రవ్వ వేయాలి ∙రవ్వ వేస్తున్నంత సేపు ఆపకుండా కలపాలి, లేదంటే ఉండలు ఉండలుగా అవుతుంది ∙బొంబాయి రవ్వ బాగా ఉడికిన తరవాత, బాదం పప్పు ముద్ద, ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙కరిగించిన నెయ్యి, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి బాగా కలియబెట్టాలి ∙చివరగా కుంకుమ పువ్వు వేసి కలిపి దింపేయాలి ∙స్వామి వారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. అమృత కలశం కావలసినవి: పొట్టు పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙పొట్టు పెసర పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, పెసర పప్పును మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి ∙ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో బెల్లం వేసి కరిగించి, వడగట్టాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, వడబోసిన బెల్లం నీళ్లు పోసి పచ్చి వాసన పోయేవరకు మరిగించాలి ∙బెల్లం పాకంలో ఏలకుల పొడి, పెసర పప్పు ముద్ద వేసి ఉండ కట్టకుండా బాగా కలపాలి ∙నెయ్యి జత చేసి మిశ్రమం దగ్గరపడే వరకు బాగా కలిపి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక కలశం ఆకారంలో ఉండలు తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ రేకులలో అమర్చి, కుకర్‌లో (విజిల్ పెట్టకూడదు) ఉంచి, స్టౌ మీద పెట్టి, పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙అమృతకలశం ప్రసాదాన్ని దేవునికి నివేదన చేసి స్వీకరించాలి. -
మళ్లీ దొరుకుతాయో లేదో!
అనగనగా ఒక రాజు. న్యాయంగా, ధర్మంగా రాజ్యపాలన చేసేవాడు. నిత్యం దేవుణ్ణి పూజించేవాడు. అతని భక్తి శ్రద్ధలకు ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చాడు.‘‘రాజా, నీ భక్తికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకో’’ అన్నాడు. దేవుడి మాటలకు రాజు ఇట్లా అన్నాడు– ‘‘స్వామీ నీ కృపవల్ల నాకు ఏ లోటూ లేనప్పటికీ మీరే అనుగ్రíß స్తానన్నారు కాబట్టి కోరుతున్నాను – మీరు నాకు కనిపించినట్టే, నా ప్రజలందరికీ కూడా మీ దర్శనమిచ్చి వారిని ధన్యులను చెయ్యండి’’ అన్నాడు. ‘‘అది కుదిరే పని కాదు, నా పట్ల నిజమైన ఆర్తి, ప్రేమ ఉన్నవారికి మాత్రమే నేను కనపడతాను’’ అన్నాడు దేవుడు. రాజు విడిచిపెట్టకుండా పదే పదే అడిగేసరికి ‘సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.’’ అన్నాడు దేవుడు. రాజు సంతోషంతో దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు ‘‘రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు రండి. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు’’ అని నగరంలో దండోరా వేయించాడు.దేవుణ్ణి చూడాలన్న ఆశతో ప్రజలందరూ పోగయ్యారు. రాజు అందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. వారలా నడుస్తుండగా దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. వద్దు వద్దని రాజు చెబుతున్నా వినకుండా కొంతమంది అక్కడే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్లిపోయారు. రాజు ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన వారిలో కొందరు ‘వెండి నాణేలు మళ్లీ దొరుకుతాయో తెలియదు.. భగవంతుడు అయితే మరెప్పుడైనా కనిపిస్తాడు అనుకుని అటువైపు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. చివరికి రాజు, రాణి మిగిలారు. కొంతదూరం వెళ్లాక వారికి వజ్రాల పర్వతం కనిపించింది. రాణి అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. రాజుకు ఇచ్చిన మాట మేరకు దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే ‘‘ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.’’ అని అన్నాడు. రాజు బాధతో తల దించుకున్నాడు. -
రాజన్న సన్నిధిలో రద్దీ
వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు ఉదయం నుంచే గర్భగుడి దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు. భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించకుని కుంకుమపూజలు నిర్వహించారు. భక్తుల ద్వారా రూ.19 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఆకట్టుకునే ‘పెళ్లిచూపులు’
విజయవాడ (లబ్బీపేట) : ఈనెల 29న విడుదల కానున్న పెళ్లిచూపులు సినిమా యూనిట్ సోమవారం ట్రెండ్‌సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమాస్‌లో సందడి చేసింది. క్యాపిటల్ సినిమాస్‌లో ఆ సినిమా ప్రివ్యూ షోను సోమవారం రాత్రి యూనిట్ సభ్యులు వీక్షించారు. కథానాయిక రీతూవర్మతో పాటు దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాతలు రాజ్ కందుకూరి, యాష్ రంగినేనితో పాటు పలువురు నటులు పాల్గొన్నారు. హీరో విజయ్ దేవరకొండ వేరొక సినిమా షూటింగ్లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమన్నారు. ఇప్పుడు కథానాయుకగా నటించడం సంతోషంగా ఉందని, మహేష్, అల్లు అర్జున్‌తో కలిసి సినిమాలో నటించాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ‘పెళ్లిచూపులు’ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుందని, కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా పేర్కొన్నారు. యువతను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మంచి వినోదాన్ని పంచుతుందని చెప్పారు. మంచి కథతో పాటు, హాస్యం, వినోదం అన్నీ మిళతమైన సినిమాగా పేర్కొన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6గంటల వరకు 35,879 మంది స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో ఉన్న సర్వదర్శన భక్తులకు 6గంట లు, 2 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులు రెండు గంటల సమయం పట్టింది. గదులు సులభంగానే లభించాయి. హుండీ కానుకల నుంచి రూ.1.82 కోట్లు లభించాయి.ట -
‘కొండ’పై పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. హోలీ సెలవు దినం స్వామివారి దర్శనం కోసం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో కొండపై రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లతోపాటు వసతి గదులు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. 50 ,150 రూపాయల క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. గదులుదొరకని యాత్రీకులు దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్ల కింద సేదదీరారు. స్వామి వారి దర్శించుకోవడానికి సుమారు 6గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.