‘‘యూనివర్సిటీ’ విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆర్. నారాయణమూర్తి లీడ్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ‘యూనివర్సిటీ’ ప్రివ్యూ వేశారు.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ– ‘‘దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఉండదు’ అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా గట్టిగా చెప్పారు నారాయణమూర్తి’’ అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య దేశాన్ని ఎంత పట్టి పీడిస్తోందో ఈ చిత్రంలో బాగా చెప్పారు’’ అన్నారు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ‘‘పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి.
Comments
Please login to add a commentAdd a comment