
Matarani Mounamidi Movie Preview Release: రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్‌గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మాటరాని మౌనమిది". ఈ మూవీ అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే చిత్రంలో పని చేసిన నటీనటులు టెక్నిషన్స్ అందరు కలిసి "మాటరాని మౌనమిది" ఫస్ట్ కాపీని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో వీక్షించారు.
చిత్రం చుసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీలో ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని కొనియాడారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ "ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనంతో చిత్రాన్ని నిర్మించాం. ఫస్ట్ కాపీ రెడీ అయింది. మా టీం అందరం కలసి ఈ సినిమాను వీక్షించాము. మూవీ చాలా బాగా వచ్చింది. మా టీం అందరం చాలా నమ్మకంగా ఉన్నాం, సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.
చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు
విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల..
Comments
Please login to add a commentAdd a comment