
తల్లయిన తర్వాత లేడీ సూపర్ స్టార్ తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా నయన్ పెద్దగా బయటకు రావడం లేదనే విషయం తెలిసిందే. తన మూవీ ప్రమోషన్స్‌లో సైతం హాజరకావడం లేదు. సినిమాకు సంతకం చేసినప్పుడే చిత్రం దర్శక-నిర్మాతలకు నయన్ ముందుగానే ఈ కండిషన్ పెట్టేదట. అందుకే ఆమె ఏ మూవీ ఈవెంట్స్ అయినా చివరికి తన చిత్రం ప్రమోషన్స్‌కి దూరంగా ఉండేది. కానీ, తాజాగా నయన్ తన తీరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె చాలాకాలం తర్వాత మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. నయన్ తాజా చిత్రం కనెక్ట్ మూవీ ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది.
చదవండి: ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాకు ప్రదర్శించిన కనెక్ట్ మూవీ ప్రివ్యూ షోకు నయన్ తన భర్త విఘ్నేశ్ శివన్‌లో కలిసి హాజరైంది. అక్కడ హాలీవుడ్ నటిలా స్టైలిష్‌గా కనిపించిన ఆమెను చూసి అభిమానులంతా స్టన్ అయ్యారు. పెళ్లయ్యాక నయన్ మరింత అందంగా, స్టైలిష్‌గా మెకోవర్ అయ్యిందంటూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ షో హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని నయన్‌ను పిలిచి ఐ లవ్ యూ మామ్ అని అన్నాడు. మరికొందరు కనెక్ట్ చిత్రం బాగుందంటూ ప్రసంశలు కురిపించారు. దీంతో ఆమె చాలా థ్యాంక్స్ అంటూ చిరునవ్వులు చిందించింది.
చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు!
నయనతార ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ చిత్రాన్ని ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. గతంలో నయనతార నటించిన మాయ, తాప్సీ నటించిన గేమ్ ఓవర్ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దీన్ని తెరకెక్కించారు. హార్రర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాల తరహాలో 99 నిమిషాల నిడివితో రూపొందడం విశేషం. ఇది లాక్‌డౌన్ నేపథ్యంలో హర్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందింది. ఈ చిత్రంలో నయనతారతో పాటు సత్యరాజ్, వినయ్‌రాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా కనెక్ట్ చిత్రాన్ని ఈ నెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు విఘ్నేష్ శివన్ ఈ సందర్భంగా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment