తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.
ధనుష్‌ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్‌గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్‌నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)
గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.
అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్‌ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్‌కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు.
(ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!)
Comments
Please login to add a commentAdd a comment