నేనే తోపు అని ఎవరికి వారు డప్పు కొట్టుకుంటే పర్వాలేదు కానీ ఎదుటివారు తమకంటే తక్కువ అని చిన్నచూపు చూడటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. బిగ్‌బాస్ హౌస్‌లో పృథ్వీ ఇదే చేశాడు. తను టాస్కులు బాగా ఆడతాడు. కానీ తనకు ఎదురొచ్చిన వ్యక్తులను మాత్రం కించపరుస్తాడు, అగౌరవపరుస్తాడు, నోటికొచ్చిన మాటలనేస్తాడు. అంతేకాదు, నువ్వేం చేయగలవన్నట్లు బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఇదే అతడికి పెద్ద మైనస్.
కనీసం కంటెండర్ కాలేకపోయాడు
రోహిణి, తేజ, అవినాష్.. ఈ ముగ్గురిలో ఎవరికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హతే లేదన్నాడు. కానీ ఏం జరిగింది? టాస్కుల వీరుడు నిఖిల్‌తో పోటీపడి మరి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచేశాడు. కనీసం పృథ్వీ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడే కంటెండర్ కూడా కాలేకపోయాడు. ఆ మధ్య నువ్వేం పరిగెత్తగలవంటూ రోహిణిపై దిగజారుడు కామెంట్లు చేశాడు. తీరా ఏమైంది? మెగా చీఫ్ టాస్క్‌లో బలహీనురాలు అనుకున్న రోహిణి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.
డబుల్ ఎలిమినేషన్
ఇప్పుడేకంగా రోహిణి కంటే ముందే ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగ్ తాజా ప్రోమోలో ప్రకటించాడు. ఈ రోజు తేజను ఎలిమినేట్ చేయగా.. రేపు పృథ్వీని పంపించేసినట్లు తెలుస్తోంది. వైల్డ్‌కార్డ్స్‌ను తక్కువ అంచనా వేసిన పృథ్వీ.. రోహిణి, అవినాష్, గౌతమ్ కంటే ముందే వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment