బిగ్‌బాస్ 8 తెలుగు చివరకొచ్చేసింది. ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. తన కోరికని ఈ సీజన్‌లో నెరవేర్చుకున్న తేజ.. రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించాడట. ఇంతకీ ఎన్ని లక్షలు అందుకున్నాడంటే?
(ఇదీ చదవండి: నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ)
అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్‌టైన్ చేశాడు. తర్వాత తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయాయి. బాగా నస పెట్టేశాడు. దీంతో ఎలిమినేట్ కావడం అయితే పక్కా అనుకున్నారు. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు.
హౌసులో 8 వారాలు పాటు ఉన్న తేజ.. ఒక్కో వారానికిగానూ లక్షన్నర అందుకున్నాడట. అంటే 8 వారాలకు గానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఓ రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు. ఇదలా ఉంచితే ఆదివారం ఎపిసోడ్‌లో కన్నడ బ్యాచ్‌లో ఒకడైన పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకు రాబోతున్నాడు. బహుశా వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నాయండోయ్!
(ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!)
Comments
Please login to add a commentAdd a comment