తమిళ సినిమా: వరుస సక్సెస్‌లు అందుకుంటున్న అగ్ర నటి నయనతార. మాయ చిత్రంతో ఈమె హర్రర్ కథా చిత్రాల ప్రస్థానం మొదలైంది. తాజాగా కనెక్ట్ చిత్రం ద్వారా ముందుకొస్తోంది. నయన్ ప్రధాన పాత్ర పోషించగా ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించడం విశేషం. వినయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాయ చిత్రం ఫేమ్ అశ్విన్ శరవణన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ.. ఇది లాక్‌డౌన్ కాలంలో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే హర్రర్ సన్నివేశంతో కూడిన చిత్రం కలెక్ట్ అని చెప్పారు. నయనతార ఇంట్లోకి దెయ్యం ఎలా వస్తుంది? దాంతో ఎవరు బాధింపునకు గురవుతారు? చివరికి దాన్ని ఎలా తరిమేస్తారు అన్న ఆసక్తికత విషయాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు.
కథ విన్న తరువాత నయనతారకు నచ్చడంతో చిత్రాన్ని తామే నిర్మిస్తామని చెప్పి విఘ్నేష్ శివన్‌ను కలవమని చెప్పారన్నారు. ఆయనకీ కథ నచ్చడంతో కనెక్ట్ సెట్‌పైకి వెళ్లిందని తెలిపారు. హాలీవుడ్ చిత్రంలా కనెక్ట్ చిత్రం నిడివి 90 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. దీన్ని థీయోటర్లలో రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించే సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఈ విషయమై థియేటర్ల యాజమాన్యాలతో సంప్రదిస్తున్నట్లు అశ్విన్ శరవణన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment