
Adivi Sesh Plans Major Movie Nationwide Preview Before Release: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్‌లలో రిలీజ్ కానుంది.
ఈ ప్రివ్యూలను హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తారు. ఇందుకోసం బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రివ్యూస్ చూడాలనుకునేవారు బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా ప్రివ్యూలను హాలీవుడ్‌లో విడుదల చేస్తారు. సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రధాన నగరాల్లో పది లేదా నెల రోజుల గ్యాప్‌తో ప్రదర్శిస్తారు. తమ సినిమాలకు మరింత పాపులారిటీ తెచ్చుకునేందుకే ఈ తరహా స్ట్రాటజీని వాడతారు. ఇప్పుడు ఇదే టెక్నిక్‌ను తన సినిమా కోసం అడవి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకే ఈ ప్రివ్యూస్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా రిలీజ్‌కు ముందే ప్రివ్యూస్ వేయడం దేశంలోనే ఇదే తొలిసారి.
చదవండి: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే: మహేశ్ బాబు
అలాగే ఈ సినిమా టికెట్ రేట్లపై అడవి శేష్ ఇటీవల స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా 'ఆస్క్ శేష్' సెషన్‌లో ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది. 'టికెట్ రేట్లను తగ్గించండి. రిపీటెడ్‌గా సినిమా చూసేందుకు వీలుంటుంది. ఫలింతగా ఇండస్ట్రీని కాపాడొచ్చు.' అని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు శేష్ బదులిచ్చాడు. తమ సినిమా టికెట్లు సాధారణ రేట్లతో అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. 'ఇది సాధారణ ప్రేక్షకులు చూడాల్సిన అసాధారణ సినిమా' అని పేర్కొన్నాడు. దీంతో 'ఎఫ్ 3' మూవీ తర్వాత సాధారణ రేట్లకే టికెట్ రేట్లను కేటాయించిన సినిమాగా 'మేజర్' నిలిచింది.
చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment